కుటుంబంతో ఇంట్లో ఉంటున్న వృద్ధురాలిని టార్గెట్ చేసిందో గ్యాంగ్. ఇంట్లో ఆమె ఎప్పుడు ఒంటరిగా ఉంటుందో అని రెక్కీ వేసిన గ్యాంగ్.. సరైన సమయం కోసం వేచి చూశారు. ఆ సమయం రానే వచ్చింది..
చుట్టుపక్కల ఎవ్వరూ లేని సమయంలో చూసి ఆమెను హత్య చేసి ఒంటిపై ఉన్న బంగారం మొత్తం దొచుకెళ్లారు. ఈ దారుణ ఘటన కళ్యాణదుర్గంలో చోటుచేసుకుంది. కళ్యాణదుర్గం వడ్డె కాలనీకి చెందిన 74 ఏళ్ల వృద్ధురాలు లక్ష్మీదేవి తన కుమారుడు శ్రీరాములు, కోడలు లక్ష్మీదేవి దగ్గర ఉంటుంది. కొడుకు, కోడలు ఇద్దరూ కూలి పనులకు వెళ్తుంటారు. ఒక మనవరాలికి పెళ్లి కాగా, ఇంకో మనవరాలు మహాలక్ష్మి చదువకుంటూ ఉంటుంది. కొడుకు, కోడలు కూలికి వెళ్లాక.. మనవరాలు పాఠశాలకు వెళ్తుంది. వాళ్లు మళ్లీ ఇంటికి తిరగొచ్చే వరకూ వృద్ధురాలు ఒంటరిగానే ఉంటుంది. READ ALSO రొట్టెల పండగకి వెళ్లిన కుటుంబం.. ఇంటికి తిరిగొచ్చేసరికి ఊహించని షాక్, తేరుకునేలోపే గుడ్ న్యూస్ఈ కుటుంబాన్ని బాగా గమనించిన ఓ గ్యాంగ్ పక్కా ప్లాన్ వేసింది. ఇంట్లో వాళ్లంతా ఉదయం వెళ్లి సాయంత్రానికి వస్తుండగా.. పెద్ద మనవరాలు శ్రావణి రోజూ మధ్యాహ్నం దగ్గర్లో ఉండే అత్త వాళ్ల ఇంటి నుంచి వచ్చి చూసి వెళ్తుంది. రోజూలాగే మంగళవారం మధ్యాహ్నం కూడా వచ్చి వృద్ధురాలికి భోజనం పెట్టి వెళ్లింది. చిన్న మనవరాలు సాయంత్ర పాఠశాల నుంచి ఇంటికి వచ్చే సమయానికి వద్ధురాలు మెడపై తీవ్ర గాయంతో రక్తపు మడుగుల్లో పడి ఉండటంతో గట్టిగా కేకలు వేసింది. పాప కేకలు విన్న చుట్టుపక్కల వారు ఏం జరిగిందా? అని అక్కడికి వచ్చి చూడగా వృద్ధురాలు ప్రాణాలు కోల్పోయింది. దాంతో విషయాన్ని కొడుకు, కోడలికి చెప్పి.. పోలీసులకు సమాచారం అందించారు. పదునైన ఆయుధంతో ఆమెను హతమార్చి.. ఆమె ఒంటిపై ఉన్న బంగారు గొలుసు, చెవి కమ్మలు, ముక్కెర తీసుకెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. కొడుకు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. బాగా తెలిసిన వారే ఈ పని చేసుకుంటార్న కోణంలో పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు.