
ప్రముఖ పిజ్జా దిగ్గజం డొమినోస్, అమెరికా ఫుట్‌బాల్ అభిమానులకు ఓ భారీ శుభవార్త అందించింది. ఫిఫా వరల్డ్ కప్ 2026లో అమెరికా ఆటగాడికి రెడ్ కార్డ్ చూపడంతో, ఏకంగా 1 మిలియన్ డాలర్ల (దాదాపు రూ. 9.
49 కోట్లు) విలువైన 'ఎమర్జెన్సీ పిజ్జాల'ను ఉచితంగా అందించనున్నట్లు ప్రకటించింది. నిన్న బోస్నియా అండ్ హెర్జెగోవినాతో జరిగిన రౌండ్ ఆఫ్ 32 మ్యాచ్‌లో అమెరికా స్టార్ స్ట్రైకర్ ఫోలారిన్ బలోగన్‌కు రెడ్ కార్డ్ చూపడంతో ఈ బంపరాఫర్ అమల్లోకి వచ్చింది.అయితే, ఇది డొమినోస్ అప్పటికప్పుడు తీసుకున్న నిర్ణయం కాదు. ఈ ఏడాది మే నెలలోనే, టోర్నమెంట్ ప్రారంభానికి ముందు, డొమినోస్ ఈ ప్రచార కార్యక్రమాన్ని ప్రకటించింది. వరల్డ్ కప్‌లో అమెరికా జట్టు ఆటగాళ్లలో ఎవరికైనా రెడ్ కార్డ్ ఇస్తే, అభిమానుల నిరాశను తగ్గించేందుకు 1 మిలియన్ డాలర్ల విలువైన పిజ్జాలను ఉచితంగా పంపిణీ చేస్తామని వాగ్దానం చేసింది. ఇందులో భాగంగా 60,000కు పైగా మీడియం పిజ్జాలను అందించనుంది. ఇప్పుడు బలోగన్‌కు రెడ్ కార్డ్ రావడంతో డొమినోస్ తన మాటను నిలబెట్టుకుంది.రెడ్ కార్డ్ వచ్చినా చారిత్రక విజయంఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. బలోగన్‌కు రెడ్ కార్డ్ చూపినా అమెరికా జట్టుపై ప్రతికూల ప్రభావం పడలేదు. మ్యాచ్ ద్వితీయార్ధంలో బలోగన్ మైదానం వీడిన తర్వాత 82వ నిమిషంలో మాలిక్ టిల్మాన్ ఫ్రీ-కిక్‌తో మరో గోల్ సాధించి అమెరికా విజయాన్ని ఖాయం చేశాడు. దీంతో బోస్నియాపై 2-0 తేడాతో గెలిచి, రౌండ్ ఆఫ్ 16కు అర్హత సాధించింది. గత 24 ఏళ్లలో వరల్డ్ కప్ నాకౌట్