
మహారాష్ట్రలోని పూణెలో సంచలనం సృష్టించిన ప్రముఖ రియల్టర్ కేతన్ అగర్వాల్ హత్య కేసులో రోజుకో కొత్త కోణం వెలుగుచూస్తోంది. ఈ కేసులో ప్రధాన నింది
తురాలిగా ఉన్న కేతన్ కాబోయే భార్య సియా గోయల్ (20)కు సంబంధించిన ఒక పాత వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.గత డిసెంబర్ నాటిదిగా భావిస్తున్న ఆ వీడియోలో సియా పూణెలోని ఒక ప్రముఖ నైట్‌క్లబ్ (పబ్)లో చేతిలో బీర్ సీసా పట్టుకుని మద్యం తాగుతూ కనిపించింది. అంతేకాకుండా, ఫోన్లో ఎవరితోనో తీవ్రంగా గొడవపడుతూ.. "మొదట నన్ను మోసం చేస్తాడు.. ఆపై మళ్లీ నాకే ఫోన్ చేస్తాడు" అంటూ తీవ్రమైన పదజాలంతో బూతులు తిడుతున్న దృశ్యాలు ఆ వీడియోలో స్పష్టంగా వినిపిస్తున్నాయి.లోహగఢ్ కోటపై ఘోరం జూన్ 18న పూణె సమీపంలోని చారిత్రక లోహగఢ్ కోటపై ట్రెకింగ్‌కు వెళ్లిన కేతన్ అగర్వాల్‌ను లోయలోకి నెట్టి హత్య చేశారనే ఆరోపణలపై సియా గోయల్, ఆమె ప్రియుడు చేతన్ చౌదరి (22)లను పోలీసులు ఇప్పటికే అరెస్ట్ చేశారు. వీరిద్దరి పోలీస్ కస్టడీ జులై 3తో ముగియనుంది. ఈ నేపథ్యంలో సియాకు సంబంధించిన నైట్‌క్లబ్ వీడియోలు, అలాగే చేతన్ చౌదరితో కలిసి ఆమె క్రికెట్ మ్యాచ్ వీక్షిస్తున్న ఫోటోలు బయటకు రావడం ఈ కేసుపై ఆసక్తిని మరింత పెంచింది.ప్రేమ వ్యవహారం తెలియదన్న సియా తండ్రి ఈ కేసు దర్యాప్తులో భాగంగా పూణె రూరల్ పోలీసులు సియా గోయల్ తండ్రి ప్రవీణ్ గోయల్‌ను కూడా పిలిపించి విచారించారు. చేతన్ చౌదరితో తన కుమార్తెకు ఉన్న ప్రేమ వ్యవహారం గురించి తనకు ఏమాత్రం