
అమెరికా నావికాదళానికి చెందిన ఒక యుద్ధ హెలికాప్టర్ ప్రమాదవశాత్తూ అరేబియా సముద్రంలో అత్యవసరంగా ల్యాండింగ్ అయింది. నావికాదళానికి చెంది
న అత్యంత శక్తివంతమైన 'ఎంహెచ్-60ఎస్ సీహాక్' హెలికాప్టర్ బుధవారం (జులై 1) ఈ ప్రమాదానికి గురైనట్లు అమెరికా సైనిక వర్గాలు వెల్లడించాయి. యుద్ధనౌక (ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్) 'యూఎస్ఎస్ జార్జ్ హెచ్.డబ్ల్యూ బుష్'కు అనుబంధంగా ఈ హెలికాప్టర్ పనిచేస్తోంది.ప్రమాదం జరిగిన సమయంలో హెలికాప్టర్లో మొత్తం నలుగురు సిబ్బంది ఉన్నారు. అందులో ముగ్గురిని నౌకాదళ రెస్క్యూ టీమ్స్ రక్షించాయి. ప్రస్తుతం ఆ ముగ్గురి పరిస్థితి స్థిరంగా ఉందని, వారికి యూఎస్ఎస్ జార్జ్ బుష్ యుద్ధనౌకపైనే అత్యవసర వైద్య చికిత్స అందిస్తున్నామని అధికారులు తెలిపారు. అయితే, మరొకరు మాత్రం సముద్రంలో గల్లంతయ్యారు. అతడి ఆచూకీ కోసం అమెరికా నావికాదళానికి చెందిన యుద్ధనౌకలు, ప్రత్యేక విమానాలు అరేబియా సముద్రంలో పెద్ద ఎత్తున గాలింపు చర్యలు చేపట్టాయి.శత్రువుల దాడి కాదుపశ్చిమాసియాలో అమెరికా-ఇరాన్ మధ్య ఇటీవలి కాలంలో చోటుచేసుకున్న తీవ్ర ఉద్రిక్తతల నేపథ్యంలో అమెరికా తన యుద్ధనౌకలను అరేబియా సముద్ర పరీవాహక ప్రాంతంలో మోహరించింది. ప్రస్తుతం ఇరు దేశాల మధ్య తాత్కాలిక కాల్పుల విరమణ అమలులో ఉన్నప్పటికీ, ఈ ప్రాంతంలో హై అలర్ట్ కొనసాగుతోంది. ఈ తరుణంలో జరిగిన ఈ హెలికాప్టర్ ప్రమాదంపై యూఎస్ నేవల్ ఫోర్సెస్ సెంట్రల్ కమాండ్ స్పందించింది. ఈ ఘటన శత్రువుల దాడి లేదా శత్రుదేశాల కాల్పుల వల్ల జరిగింది కాదని ప్రాథమికంగా స్పష్టం చేసింది. సాంకేతిక లోపమే దీనికి కారణమై ఉంటుందని భావిస్తున్నట్లు, ప్రమాదానికి గల అసలు కారణాలపై సమగ్ర దర్యాప్తునకు