'పెదకాపు' ఫేమ్ విరాట్ కర్ణ హీరోగా అభిషేక్ నామా దర్శకత్వంలో తెరకెక్కుతున్న అడ్వెంచర్ మూవీ 'నాగబంధం – ది సీక్రెట్ ట్రెజర్'. ఇందులో నభా నటేష్, ఐశ్వర్య మీనన్ కథానాయికలుగా నటించగా..
జగపతిబాబు, మహేష్ మంజ్రేకర్, రిషభ్ సావ్నీ ఇతర కీలక పాత్రలు పోషించారు. నిక్ స్టూడియోస్ బ్యానర్‌పై కిషోర్ అన్నపురెడ్డి, నిశిత నాగిరెడ్డి ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మించారు. జూలై 3న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో మేకర్స్ ప్రీరిలీజ్ ప్రెస్ మీట్ నిర్వహించారు. దీనికి నిర్మాత సురేష్ బాబు ముఖ్య అతిథి గా హాజరయ్యారు. ‘అఖండ’ సినిమా కోసం నందమూరి బాలకృష్ణ ఎంత నిష్ఠగా ఉన్నారో.. ఈ చిత్రంలో నాగ సాధువుగా నటిస్తున్నప్పుడు తానూ అంతే నిష్ఠగా ఉన్నానని విరాట్ కర్ణ ఈ సందర్భంగా అన్నారు. విరాట్ కర్ణ మాట్లాడుతూ.. ''నటుడిగా ప్రేక్షకుల గుండెల్లో స్థానం సంపాదించుకోవడానికి ఈ సినిమా కోసం ప్రాణం పెట్టి పనిచేశాను. సినిమా చూస్తే నేను ఎంత హార్డ్ వర్క్ చేశానో మీకు అర్థమవుతుంది. మీ గుండెల్లో చోటు సంపాదించుకోవడానికి ఏం చేయాలో 100 శాతం చేశాను. నాకు ఇంత పెద్ద ప్రాజెక్ట్ ఇచ్చిన అభిషేక్ నామాకి జీవితాంతం రుణపడి ఉంటాను. ఆయన ఈ సినిమాను అద్భుతంగా తీశారు. ఆయన కథ చెప్పినప్పుడు, కంటెంట్ చూపించినప్పుడు నేను షాక్ అయ్యాను. ఈ సినిమాలో ప్రతిదీ ఒక అద్భుతంలా కనిపిస్తుంది. మాస్ పల్స్ తెలిసిన డైరెక్టర్ సినిమా తీస్తే ఎలా ఉంటుందో ఇందులో మీరు చూస్తారు. మా నిర్మాతలు కిషోర్, నిశిత సినిమాను అద్భుతంగా నిర్మించారు''అని అన్నారు. ''నాగబంధం' సినిమాకి ఇంత పెద్ద స్థాయిలో పబ్లిసిటీ జరగడానికి ప్రధాన కారణం నిర్మాతలు. ముఖ్యంగా నిశిత లేకపోతే ఈ సినిమాకు ఇంత పబ్లిసిటీ వచ్చేదని నేను అనుకోను. ఇలాంటి నిర్మాతలకు ఆడియన్స్ సపోర్ట్ చేస్తే మరిన్ని అద్భుతమైన సినిమాలు వస్తాయి. దర్శకుడు అభిషేక్ నన్ను ఒక ఆణిముత్యంలా తీర్చిదిద్దారు. అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. ఇది కేవలం ఒక సినిమా కాదు.. ఒక ఎక్స్ పీరియన్స్. మన భారతీయ సంస్కృతిని, వారసత్వాన్ని సెలబ్రేట్ చేసుకునే సినిమా. జూలై 3న అందరం థియేటర్లలో కలుద్దాం. అడ్వాన్స్ బుకింగ్స్ చాలా బాగున్నాయి. దేశవ్యాప్తంగా టీజర్, ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. మా నిర్మాతలు పెట్టిన ప్రతి రూపాయి వారికి తిరిగి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను'' అని విరాట్ కర్ణ అన్నారు. పురాణాలు, దివ్యశక్తుల మేళవింపుగా ‘నాగబంధం’.. విజువల్ వండర్‌గా ట్రైలర్* వైభవంగా డైరెక్టర్ మెహర్ రమేష్ కుమార్తె వివాహం.. చిరంజీవి, పవన్ కళ్యాణ్, వెంకటేష్ సందడి'నాగబంధం' సినిమాలో నటిస్తున్నప్పుడు తాను ఎంతో క్రమశిక్షణతో, నిష్ఠతో, నియమాలతో ఉన్నానని.. అది నందమూరి బాలకృష్ణను చూసి నేర్చుకున్నానని విరాట్ కర్ణ తెలిపారు. ''నేను 'అఖండ' సినిమా అప్పుడు బాలయ్య గారిని దగ్గర నుంచి చూశాను. ఆ సమయంలో ఆయన నాన్ వెజ్ తినకుండా, ఎంతో నియమంగా ఉండేవారు. నా లైఫ్ లో నాగసాధువు క్యారక్టర్ లో నటించే అవకాశం వచ్చినప్పుడు, నేను కూడా ఉదయాన్నే 3 గంటలకు నిద్రలేచి శివుడికి అభిషేకం చేసేవాడిని. నేనే స్వయంగా గుడి మొత్తం శుభ్రంచేసి పూజ చేసేవాడిని. షూటింగ్ స్టార్ట్ కావడానికి మూడు నెలల ముందు నుంచే ఇలా చేయడం మొదలుపెట్టాను. శివుడికి దగ్గరవ్వాలని నాకు అనిపించింది. అందుకే 41 రోజులు నిష్ఠగా పూజలు నిర్వహించాను. ఇండియాలో అందరూ సనాతన ధర్మం గురించి మాట్లాడుతుంటే, ఏంటో అనుకున్నాను. నేను ఆ 41 రోజులు పూజలు చేసినప్పుడు నాకు తెలిసింది. దాని వల్ల నా బాడీ, మైండ్ చాలా ప్రశాంతంగా ఉండేవి. ఈ సినిమాలో గడ్డకట్టే చలిలో షూటింగ్ చేయడానికి ఆ దేవుడే నాకు శక్తి ఇచ్చాడు. సినిమాలో మీకు ఆ పవర్ చూస్తారు'' అని విరాట్ కర్ణ చెప్పుకొచ్చారు.