బియ్యం కడిగిన నీటిలో విటమిన్ బి, అమైనో యాసిడ్స్, విటమిన్ ఇ, ఇనోసిటాల్, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఈ పోషకాలు దెబ్బతిన్న జుట్టు లోపలికి లోతుగా వెళ్తాయి.
తలస్నానం చేసిన తర్వాత కూడా వెంట్రుకల లోపలే ఉంటాయి. ఇది రాపిడిని తగ్గించి, స్థితిస్థాపకతను మెరుగుపరిచి, జుట్టు చిట్లడాన్ని తగ్గిస్తుంది. దీంతో జుట్టు పట్టులా మెరుస్తుంది. అంతేకాదు, జుట్టు కుదుళ్లను దృఢంగా ఉంచుతుందని NLM అధ్యయనం పేర్కొంది.
మెంతులలో ఐరన్, నికోటినిక్ యాసిడ్, ప్రొటీన్లు, సాపోనిన్లు, ఫ్లేవనాయిడ్లు పుష్కలంగా ఉంటాయి. ఈ పోషకాలు జుట్టు రాలడాన్ని కంట్రోల్లో ఉంచుతాయని రీసెర్చ్‌గేట్ అధ్యయనం పేర్కొంది. మెంతులలోని ప్రొటీన్ జుట్టు కుదుళ్లను బలంగా ఉంచి, హెయిర్ ఫాల్‌ను కంట్రోల్లో ఉంచుతుంది.
మెంతుల్లో ఉండే యాంటీఫంగల్ గుణాలు చుండ్రు సమస్యను తగ్గిస్తుంది. అంతేకాదు మెంతుల్లో ఉండే నికోటినిక్ యాసిడ్ తలకు రక్త ప్రసరణను పెంచి, జుట్టు పెరగడానికి సహాయపడుతుంది. మెంతుల్లో ఉండే యాంటీఆక్సిడెంట్లు జుట్టు త్వరగా నెరిసిపోకుండా కాపాడతాయి.
బియ్యం కడిగిన నీళ్లు, మెంతుల కాంబినేషన్ జుట్టు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని నిపుణులు చెబుతున్నారు. నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్ పరిశోధన ప్రకారం బియ్యం నీరు మీ జుట్టును బలపరిచి జుట్టు చిట్లిపోకుండా కాపాడుతుంది. అంతేకాదు పట్టులాంటి మెరిసే జుట్టును ఇస్తుంది.
ఇది తయారు చేసుకోవడానికి అర కప్పు బియ్యం, 2 టేబుల్ స్పూన్ల మెంతులు, 2 కప్పుల నీరు తీసుకోండి. బియ్యాన్ని కడిగి నానబెట్టండి, అదే గిన్నెలో మెంతులు కూడా వేయండి. మరుసటి రోజు ఆ నీటిని వడకట్టండి. కావాలంటే మరొకరోజు పులియబెట్టవచ్చు. దీన్ని ఫ్రిజ్‌లో స్టోర్ చేసుకుని. షాంపూ చేసుకునే ముందు జుట్టుకు అప్లయ్ చేయండి.
ఈ నీటిని రోజూ అప్లయ్ చేసుకోవద్దు. ఇది మీ జుట్టు పొడిబారేలా చేస్తుంది. ఒకవేళ దీన్ని అప్లయ్ చేసిన తర్వాత మీకు హెయిర్ ఫాల్ ఎక్కువ అయితే, డెర్మటాలటిస్ట్ను సంప్రదించండి. మెంతులు, బియ్యం కడిగిన నీరు మీ జుట్టుకు మ్యాజిక్ చేస్తాయి అనడానికి ఎలాంటి ఆధారాలులేనప్పటికీ.. మెంతులు, బియ్యం కడిగిన నీటిలోని పోషకాలు మీ జుట్టుకు అదనపు ప్రయోజనాలు మాత్రం అందిస్తాయి. ఇవి మన పురాతన కాలం నుంచి పాటిస్తున్న చిట్కాలు.
ముఖ్య గమనిక: ఈ కథనంలోని సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, కొందరు నిపుణులు పేర్కొన్న అంశాల ఆధారంగా తెలియజేశాము. వీటిని పాటించే ముందు నిపుణుల సలహా తీసుకోండి. అలాగే వీటిని ఎంత వరకు పాటించాలనేది, విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం. సమయం తెలుగు వీటిని ధృవీకరించడం లేదు.
రచయిత గురించికిషోర్ రెడ్డికిషోర్ రెడ్డి సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఆయనకు జర్నలిజంలో 10 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. 2020లో సమయం తెలుగులో చేరిన కిషోర్ రెడ్డి లైఫ్‌స్టైల్‌కి సంబంధించిన న్యూట్రిషియన్, డైట్ ప్లాన్, రోగాలు - లక్షణాలు, ఫిట్నెస్, ఇంటి చిట్కాలు, ఫ్యాషన్, హోమ్ డెకార్, రిలేషన్షిప్ వార్తలతో పాటు వివిధ ఆరోగ్య అంశాలపై ఆరోగ్య నిపుణులు, న్యూట్రిషనిస్ట్, డైటీషియన్లు, ఆయుర్వేద నిపుణులు ఇచ్చిన సలహాలు, సమాచారం ఆధారంగా విస్తృత స్థాయిలో వార్తల్ని రాశారు. అంతేకాకుండా క్లీవ్ ల్యాండ్ క్లినిక్, మాయో క్లినిక్, WHO, హార్వర్డ్ వంటి పరిశోధనలు ఆధారంగా కూడా కంటెంట్ అందించారు. ఈ సమాచారాన్ని నిజమో కాదో తెలుసుకోవడానికి నిపుణుల సలహా తీసుకోమని కూడా వివరించారు. ఈ ఆర్టికల్స్ పాఠకులకు అర్థమయ్యేలా సరళమైన భాషలో రాస్తారు.కిషోర్ రెడ్డి 2015లో సాక్షి జర్నలిజం స్కూల్లో జర్నలిజం కోర్సును పూర్తి చేశారు. అనంతరం సాక్షి న్యూస్ ఛానెల్లో (20.08.2016 నుంచి 23.03.2020 వరకు) సబ్ ఎడిటర్‌గా పనిచేశారు. ఆ సమయంలో ఆంధ్రప్రదేశ్, విద్య, ఉద్యోగం వార్తలు రాశారు. ముఖ్యంగా ఎడ్యుకేషన్ / జాబ్స్ సెక్షన్ చూసుకునేవారు. ఆ తర్వాత 02.04.2020 నుంచి సమయం తెలుగులో విద్య, ఉద్యోగ వార్తలతో పాటు టెక్నాలజీ న్యూస్, అడ్వర్టయిజ్‌మెంట్స్ కూడా రాశారు. ఖాళీ సమయంలో పుస్తకాలు చదవడం, ప్రముఖల ఇంటర్వ్యూలు చూడటం, కొత్త కొత్త అంశాల గురించి తెలుసుకోవడానికి ఆయన ఇష్టపడతారు.... ఇంకా చదవండి