
మణిపూర్ రాష్ట్రంలో హింస మళ్లీ ప్రజ్వరిల్లింది. భారత్-మయన్మార్ సరిహద్దు సమీపంలోని కామ్జోంగ్ జిల్లాలో బుధవారం నాగా, కుకీ సామాజిక వర్గాల మధ్య సాయుధ ఘర్షణలు చోటుచేసుకున్నాయి. ఇరు వర్గాలకు చెంది
న సాయుధ బృందాలు పరస్పరం దాడులు చేసుకోవడంతో పాటు గ్రామాల్లోని 20కి పైగా ఇళ్లకు నిప్పు పెట్టారు. ఉదయం వేళ ఒక కుకీ గ్రామం నుండి వచ్చిన సాయుధులు సమీపంలోని నాగా గ్రామంపై దాడి చేసి 10 ఇళ్లను తగలబెట్టడంతో ఈ హింస ప్రారంభమైంది. ఆ తర్వాత మధ్యాహ్నం దీనికి ప్రతికారంగా మరో వర్గం జరిపిన ఎదురు దాడుల్లో నాగా కమ్యూనిటీకి చెందిన ఇంకో 12 ఇళ్లు అగ్నికి ఆహుతయ్యాయి. ఉద్రిక్తతలను అదుపు చేయడానికి అదనపు భద్రతా బలగాలను రంగంలోకి దించి, ఆయా గ్రామాల్లో సోదాలు నిర్వహిస్తున్నారు.జూన్ 11న కాంగ్పోక్పి జిల్లాలో ఆరుగురు నాగా పౌరుల మృతదేహాలు లభించడం, అంతకుముందు మే 13న వారిని కొందరు అపహరించడమే ఈ తాజా హింసకు ప్రధాన కారణమని తెలుస్తోంది. ఈ హత్యల తర్వాత రెండు వర్గాల మధ్య తీవ్ర నిరసనలు, ఆర్థిక దిగ్బంధనాలు జరిగాయి. కుకీలు నివసించే ప్రాంతాలకు నిత్యావసర వస్తువుల రవాణా వాహనాల కదలికలపై వివాదాలు రేగడంతో ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. అయితే, బుధవారం జరిగిన ఘర్షణల్లో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని అధికారులు అధికారికంగా ప్రకటించారు.బలగాల ఉపసంహరణపై అనుమానాలుఈ తాజా దాడిపై ప్రముఖ కుకీ సంస్థ 'కుకీ ఇన్పి మణిపూర్' (కేఐఎం) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. నాగా ఆధిపత్యం ఉన్న కొండ ప్రాంతాల్లోని కుకీ గ్రామాలను లక్ష్యంగా