
జై భీమ్ భారత్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, సీనియర్ న్యాయవాది జడ శ్రవణ్ కుమార్‌పై ఏలూరు పోలీసులు కేసు నమోదు చేశారు.
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజును లక్ష్యంగా చేసుకుని ఆయన తీవ్రమైన, అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణల నేపథ్యంలో పోలీసులు ఈ చర్యలు చేపట్టారు.ఏలూరులోని గొల్లాయిగూడేనికి చెందిన పెద్దాడ వెంకటరమణ అనే వ్యక్తి ఏలూరు త్రీ టౌన్ పోలీస్ స్టేషన్లో ఈ మేరకు ఫిర్యాదు చేశారు. జూన్ 28న ఏలూరులో జరిగిన దళిత క్రైస్తవుల నిరసన సభలో శ్రవణ్ కుమార్ మాట్లాడుతూ.. డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు నాలుక కోసి, దానిని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు పంపిస్తానంటూ రెచ్చగొట్టేలా హెచ్చరించారని ఫిర్యాదులో పేర్కొన్నారు.శ్రవణ్ కుమార్ చేసిన వ్యాఖ్యలు సమాజంలో విద్వేషాలు రగిలించేలా, శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా ఉన్నాయని ఫిర్యాదుదారు ఆరోపించారు. ఈ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు సంబంధిత బీఎన్ఎస్ (BNS) సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ పరిణామం ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.