
కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు.
సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు కూడా రాస్తుంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.
First AI Telugu Movie: భారతీయ చిత్ర రంగంలో అనేకంటే తెలుగులో ఒకప్పుడు సూపర్ స్టార్ కృష్ణ కొత్త తరహా ప్రయోగాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచారు. రీసెంట్ టైమ్స్‌లో తెలుగులో తొలి ఏఐ ఆధారిత పౌరాణిక సినిమా అంబs రివెంజ్’ సినిమా రాబోతుంది. మహా భారతంలో భీష్మ పితమహుడుపై పగపట్టిన అంబ జీవితంపై ఈ సినిమా ఉండనుంది. తెలుగులో ఎన్టీఆర్ హీరోగా ‘భీష్మ’ సినిమా వచ్చింది. అదే స్టోరీని ఏఐ టెక్నాలజీతో తెరకెక్కిస్తున్నారు.
కృత్రిమ మేథతో తెరకెక్కుతోన్న సినిమా.. ఈ చిత్రాన్ని నక్క తోక ఫిలిమ్స్ బ్యానర్‌పై యోగేంద్ర పొట్లూరి, రాణి మాడిసన్ ఈ నిర్మిస్తున్నారు. జయవర్ధన్ మడి డైరెక్షన్ చేస్తున్నారు. ఈ మూవీకి ఏఐ విజువల్ డిజైన్ & డెవలప్మెంట్ను 'కాలై విజువల్ స్టూడియోస్' అందిస్తోంది. పూర్తి స్థాయి కృత్రిమ మేధ (ఏఐ) సహకారంతో రూపొందుతున్న తొలి తెలుగు సినిమా తెరకెక్కుతున్న ఈ మూవీ ప్రచార కార్యక్రమాలకు రెడీ అయ్యారు.
ఏఐ ఫీచర్ ఫిల్మ్‌గా రాబోతున్న 'అంబ’s రివెంజ్' ..
భారత ఇతిహాసమైన మహాభారతంలోని శక్తివంతమైన పాత్ర అంబ స్ఫూర్తితో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. మన చరిత్ర అయిన మహాభారత గాథను ఆధునిక దృక్పథంతో, అత్యాధునిక ఏఐ సాంకేతికతను జోడించి సరికొత్తగా ప్రేక్షకుల ముందుకు ఈ చిత్రాన్ని తీసుకురావాలని చిత్ర యూనిట్ లక్ష్యంగా పెట్టుకుంది.
మేకర్స్ కాన్ఫిడెన్స్.. ఈ సందర్భంగా నిర్మాత యోగేంద్ర పుట్లూరు.. దర్శకుడు జయవర్ధన్ మడి మాట్లాడుతూ.. తెలుగు సినిమాకు ఇది ఒక కొత్త ప్రయోగాత్మక అధ్యాయానికి శ్రీకారం అన్నారు. చిత్ర నిర్మాణంలోని పలు దశల్లో ఏఐ సాంకేతికతను వినియోగిస్తున్నామన్నారు. ముఖ్యంగా విజువల్ డిజైన్, పాత్రల రూపకల్పన, కథా రూపాంతరం వంటి అంశాల్లో ఆధునిక ఏఐ ఉపయోగించడం ఈ సినిమాకు ప్లస్ పాయింట్స్ అన్నారు. ప్రేక్షకులకు ఇది నచ్చితే రాబోయే రోజుల్లో ఈ తరహా చిత్రాలకు ఆదరణ పెరుగుతుందున్నారు.
టైటిల్ పోస్టర్ విడుదలతో చిత్రాన్ని ప్రేక్షకులకు పరిచయం చేసామన్నారు. సినిమా విడుదల తేదిని త్వరలో ప్రకటిస్తామన్నారు. ఇప్పటికే సినీ అభిమానులు, పరిశ్రమ వర్గాల్లో ఈ సినిమా పై అంచనాలు ఏర్పడ్డాయి. ఏఐ ఆధారిత కథా నిర్మాణానికి నాంది పలికే ఈ చిత్రం తెలుగు ప్రేక్షకులకు ఏ మేరకు ఆదిస్తారనేది చూడాలి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.