మేష రాశి వారికి ఈరోజు ప్రత్యేక ప్రయోజనాలు కలిగే అవకాశం ఉంది. వ్యాపారులకు ఊహించిన దాని కంటే ఎక్కువ లాభాలు రావొచ్చు. ఈరోజు చాలా కాలంగా పెండింగులో ఉన్న పనులు పూర్తయ్యే అవకాశం ఉంది.
మీ ఆర్థిక పరిస్థితి బలోపేతం కావొచ్చు. మీరు పెట్టిన పెట్టుబడులకు మంచి రాబడి వచ్చే అవకాశం ఉంది. కొత్త విషయాలను నేర్చుకోవడానికి ఆసక్తి చూపుతారు. స్నేహితుల నుంచి అన్ని రంగాల్లో పూర్తి మద్దతు లభిస్తుంది.
వృషభ రాశి వారికి ఈరోజు అనేక రంగాల్లో సానుకూల ఫలితాలు రానున్నాయి. ఈ రాశి నుంచి మూడో స్థానంలో శుక్రుడు, గురుడి కలయిక కారణంగా ఆర్థిక పరంగా మెరుగైన ఫలితాలొచ్చే అవకాశం ఉంది. సమాజంలో మీకు గౌరవం లభిస్తుంది. మీరు మతపరమైన కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం ఉంది. మీ కుటుంబ జీవితంలో సంతోషంగా ఉంటుంది. నిరుద్యోగులకు ఉద్యోగం గురించి శుభవార్తలు వినిపిస్తాయి. మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మీరు కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు ధైర్యంగా తీసుకుంటారు.
మిథున రాశి వారికి ఈరోజు అనేక రంగాల్లో అదృష్టం కలిసొచ్చే అవకాశం ఉంది. మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఈ సమయంలో మీ ప్రవర్తన, మాటతీరులో గణనీయమైన మెరుగుదల కనిపిస్తుంది. నిరుద్యోగులకు కొత్త ఉద్యోగం గురించి శుభవార్తలు వినిపిస్తాయి. మీ ప్రేమ జీవితం సంతోషంగా ఉంటుంది. ఉద్యోగులు ఉన్నతాధికారుల మద్దతు పొందుతారు. ప్రభుత్వ సంబంధిత పనుల్లో మెరుగైన ఫలితాలు సాధించే అవకాశం ఉంది.
కర్కాటక రాశి వారికి ఈరోజు ప్రత్యేక ప్రయోజనాలు కలిగే అవకాశం ఉంది. ఈరోజు మీరు పని నిమిత్తం ప్రయాణం చేసే అవకాశాలున్నాయి. ఉద్యోగులకు కార్యాలయంలో సానుకూల ఫలితాలు రానున్నాయి. మీ కష్టానికి తగిన ఫలితం రావొచ్చు. సమాజంలో మీకు గౌరవం పెరుగుతుంది. నిరుద్యోగులు కొత్త ఉద్యోగం గురించి శుభవార్తలు వింటారు. వ్యాపారులకు మెరుగైన ఫలితాలు రానున్నాయి. సమాజంలో మీకు గౌరవం లభిస్తుంది. ఉద్యోగం మారాలనుకునే వారికి సమయం అనుకూలంగా ఉంటుంది.
సింహ రాశి వారికి ఈరోజు శుభప్రదంగా ఉంటుంది. ఈ సమయంలో మీ ఆదాయం పెరిగే అవకాశం ఉంది. మీరు పని నిమిత్తం ప్రయాణం చేయాల్సి రావొచ్చు. మీ ఆరోగ్యం మెరుగుపడుతుంది. మీ కష్టానికి తగిన ఫలితాలు రానున్నాయి. కెరీర్ పరంగా మంచి పురోగతి లభించొచ్చు. మీకు స్నేహితుల నుంచి మద్దతు లభిస్తుంది. దీంతో పాటు ఈ రాశి వారు మానసికంగా బలంగా ఉంటారు. విద్యార్థులు పోటీ పరీక్షల్లో రాణించే అవకాశం ఉంది.
కన్య రాశి వారికి ఈరోజు ఆర్థిక పరంగా మెరుగైన ఫలితాలొచ్చే అవకాశాలున్నాయి. అయితే డబ్బును పొదుపుగా వాడుకోవాలి. ఏదైనా ఆర్థిక పత్రాలపై సంతకం చేసే ముందు ప్రతి షరతును చాలా జాగ్రత్తగా తనిఖీ చేయాలి. మీ పెండింగ్ పనులు పూర్తయ్యే అవకాశాలున్నాయి. అయితే క్రమంగా ఒత్తిడి లేకుండా ముందుకు సాగాలి. మీ కష్టానికి తగిన ఫలితాలు రానున్నాయి.
తులా రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు రానున్నాయి. మీ ఇంట్లో వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. ఉద్యోగులకు ఉన్నతాధికారుల నుంచి సహకారం లభిస్తుంది. శుక్రుడు, చంద్రుడి అనుగ్రహంతో మీరు చేసే పనులన్నింట్లో మంచి ఫలితాలు రానున్నాయి. దీర్ఘకాలిక ఆందోళన లేదా సమస్యల నుంచి మీకు ఉపశమనం కలిగే అవకాశం ఉంది. మీరు అనేక సమస్యలకు పరిష్కారం పొందొచ్చు. ఆర్థిక పరంగా మెరుగైన అవకాశాలు రానున్నాయి. మీ ఆరోగ్యం మెరుగుపడుతుంది. మీకు ఇష్టమైన ఆహారాన్ని ఆస్వాదిస్తారు.
వృశ్చిక రాశి వారికి ఈరోజు అద్భుతమైన ఫలితాలొచ్చే అవకాశాలున్నాయి. మీ ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉండొచ్చు. ఆలోచించకుండా డబ్బులు తీసుకోవడం లేదా అప్పులు ఇవ్వడం మానుకోవాలి. మీ ఆర్థిక పరిస్థితిని పటిష్టం చేసుకోవడంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. ఉద్యోగులు కార్యాలయంలో సవాళ్ల గురించి ఆలోచిస్తారు. ఈ సమయంలో మీ పనితీరును ఉన్నతాధికారులు గమనిస్తారు. వ్యాపారులు ఈరోజు గత అనుభవాల నుంచి పాఠాలు నేర్చుకుని ముందుకు సాగాలి.
ధనస్సు రాశి వారు ఈరోజు మెరుగైన ఫలితాలు పొందే అవకాశాలున్నాయి. ఈ కాలంలో మీకు ఆర్థిక పరంగా మెరుగైన ఫలితాలు రానున్నాయి. మీ కుటుంబ సభ్యులు, సన్నిహితులతో సంబంధాలు బలపడతాయి. పరస్పరం నమ్మకం కూడా గణనీయంగా పెరిగే అవకాశం ఉంది. మీ తెలివితేటలు పెంచుకుంటారు. వ్యాపారులకు ఈరోజు అనేక ప్రయోజనాలు కలిగే అవకాశం ఉంది. మీ ఇంట్లో వాతావరణం అనుకూలంగా ఉంటుంది. మీ వ్యక్తిగత జీవితం మెరుగుపడుతుంది. మీ ఉత్సాహం కూడా పెరుగుతుంది.
మకర రాశి వారికి ఈరోజు చంద్రుడి అనుగ్రహంతో లాభదాయకంగా ఉంటుంది. మీకు ఈరోజు అనేక రంగాల్లో అదృష్టం కలిసొస్తుంది. మీకు కొత్త ఆదాయ వనరులు లభించే అవకాశం ఉంది. మీ ఆరోగ్యం మెరుగుపడుతుంది. స్నేహితుల సహాకరంతో మీ పనులన్నింటినీ సకాలంలో పూర్తి చేస్తారు. గురుడు, శుక్రుడు, బుధ గ్రహాల ప్రభావంతో ఆర్థిక పరంగా మెరుగైన ఫలితాలు రానున్నాయి. మీరు కొత్త ఆలోచనలతో ప్రేరణ పొందుతారు. మీ వ్యక్తిగత జీవితం మెరుగుపడుతుంది.
కుంభ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు రానున్నాయి. ఈరోజు ఆర్థిక పరంగా మెరుగ్గా ఉంటుంది. అయితే ఒత్తిడిలో ఎలాంటి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోకుండా ఉండాలి. అన్ని బ్యాంకు లేదా పెట్టుబడికి సంబంధించిన పత్రాలను జాగ్రత్తగా పరిశీలించాలి. మీరు చేసే పనిలో కొంత ఒత్తిడి ఉంటుంది. పనిలో అనవసరమైన వాదనలకు దూరంగా ఉండాలి. మీ కుటుంబ జీవితంలో వాతావరణం సాధారణంగా ఉంటుంది.
మీన రాశి వారికి ఈరోజు గురు, చంద్ర గ్రహాల అనుగ్రహంతో సానుకూల ఫలితాలు రానున్నాయి. మీ కష్టానికి తగిన ఫలితాలు రావొచ్చు. మీరు చేసే ప్రయత్నాలన్నింట్లో మంచి విజయం సాధించే అవకాశం ఉంది. దీర్ఘకాలిక పెట్టుబడులు పెట్టడం వల్ల ఎంతో లాభదాయకంగా ఉంటుంది. విద్యార్థులు పోటీ పరీక్షల్లో రాణించే అవకాశాలు ఉన్నాయి. వ్యాపారులకు తాము ఊహించిన విధంగా లాభాలు రావొచ్చు. మీ కుటుంబం, వైవాహిక జీవితంలో సంతోషంగా ఉంటుంది. గమనిక : ఇక్కడ అందించిన జ్యోతిష్య సమాచారం, పరిహారాలన్నీ జ్యోతిష్యశాస్త్రం, మత విశ్వాసాలపై ఆధారపడి ఉన్నాయి. ఇవి కేవలం ఊహాల ఆధారంగా ఇవ్వబడింది. దీనికి సంబంధించి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. ఈ సమాచారాన్ని మీరు పరిగణనలోకి తీసుకునేందుకు సంబంధిత నిపుణులను సంప్రదించి పూర్తి వివరాలను తెలుసుకోగలరు. Read Latest Astrology News and Telugu News
రచయిత గురించిఎస్.వెంకటేష్ఎస్.వెంకటేష్ సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. 2022లో Samayam Teluguలో ఆస్ట్రాలజీ, గ్రహాల తిరోగమనం, జన్మరాశుల అనుకూలత, పరిహారాలు, పంచాంగం, ఆధ్యాత్మికంతో పాటు స్పెషల్ స్టోరీలు చేస్తుంటారు. జ్యోతిష్య నిపుణుల సలహాలు, సూచనలు, పరిహారాల గురించి ఎప్పటికప్పుడు పాఠకులకు సమాచారాన్ని చేరవేస్తూ, గ్రహాల అనుకూలత, ప్రతికూలతలను బట్టి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలియజేస్తుంటారు. ఇవి వీక్షకులకు ఎంతగానో సహాయపడతాయి. జర్నలిజంలో 10 ఏళ్లకు పైగా అనుభవంలో ప్రింట్, డిజిటల్ మీడియాలో పొలిటికల్, లైఫ్‌స్టైల్, స్పోర్ట్స్, ఎంటర్టైన్మెంట్, ట్రావెల్, ఆస్ట్రాలజీ, ఆధ్యాత్మిక వార్తలను రాశారు. జ్యోతిష్యం విభాగంలో 8 వేలకు పైగా ఆర్టికల్స్, ఆరోగ్యం, బ్యూటీ, ట్రావెల్, స్పోర్ట్స్, పాలిటిక్స్, సెప్షల్ ఆర్టికల్స్ 7 వేలకుపైగా రాయడంతో పాటు, పొలిటికల్ సర్వేలు, ఫీల్డ్ సర్వే ప్రాజెక్టులను విజయవంతంగా నిర్వహించారు.జ్యోతిష్య రచయితగా వెంకటేష్ పాఠకులకు కచ్చితమైన మరియు సరైన నివారణ చర్యలు, పరిహారాల సమాచారాన్ని అందిస్తారు. జ్యోతిష్య సమాచారం పొందడం ప్రతి ఒక్కరి హక్కు అయినప్పటికీ, వృత్తి పరంగా జ్యోతిష్య సలహాలు నమ్మొద్దని గట్టిగా నొక్కి చెబుతారు. కేవలం అర్హత కలిగిన జ్యోతిష్య నిపుణులను సంప్రదించాలని, అప్పుడే మీ వ్యక్తిగత సమస్యలకు తగిన పరిష్కారం లభిస్తుందని పాఠకులకు నిరంతరం సలహా ఇస్తారు.వెంకటేష్ రాయలసీమ యూనివర్సిటీలో బ్యాచ్‌లర్ డిగ్రీ(కంప్యూటర్ సైన్స్) పూర్తి చేశారు. అలాగే పిజేఎస్ నుంచి జర్నలిజం కోర్సు పూర్తి చేశారు. ఈ అర్హతలు 5Ws మరియు 1H(ఎవరు, ఏమి, ఎక్కడ, ఎప్పుడు, ఎందుకు మరియు ఎలా) తనకు జర్నలిజం చేసేందుకు అవసరమైన నైపుణ్యాన్ని అందిస్తాయి. డిజిటల్ కంటెంట్ రైటర్‌గా వెంకటేష్ రచనా శైలి కచ్చితత్వం, విశ్వసనీయత, నైతిక బాధ్యత, ఉన్నత ప్రమాణాలను కలిగి ఉంటుంది. తన ఆర్టికల్స్ పరిశోధన, అధ్యయనం చేసినవి. ప్రముఖ జ్యోతిష్య నిపుణులు, ఇతర రంగాల నిపుణులు, అధికారిక సంస్థలు జారీ చేసిన మార్గదర్శకాలకు అనుగుణంగా ఉంటాయి. ఈ విషయాలన్నీ పాఠకులకు అర్థమయ్యేలా సులభంగా, వాడుక భాషలో అందిస్తారు.సమయం తెలుగులో చేరడానికి ముందు వన్ ఇండియాలో(05-08-2019 to 30-06-2022) సీనియర్ సబ్ ఎడిటర్‌గా హెల్త్, రిలేషన్షిప్, బ్యూటీ, ఫ్యాషన్, ఆస్ట్రాలజీ, ఆధ్యాత్మికం, హోమ్ రెమెడీస్, రెసిపీస్ ట్రావెల్ వంటి అంశాలను కవర్ చేశారు. లోకల్ యాప్‌లో కంటెంట్ మేనేజర్‌గా(01-03-2019 to 05-08-2019) ‘‘స్వయం ఉపాధి’’ ఐపిఎల్ లైవ్ ప్రాజెక్టు, పొలిటికల్ సర్వే, ఎలక్షన్ ఈవెంట్స్‌లో కూడా పని చేశారు. అక్కడ ప్రముఖ రాజకీయ విశ్లేషకులను సంప్రదించిన తర్వాతే కచ్చితమైన సమచారాన్ని అందించారు. ప్రజాశక్తిలో కాపీ ఎడిటర్‌గా(08-02-2016 నుంచి 22-02-2019) న్యూస్, పాలిటిక్స్, స్పోర్ట్స్, సినిమా, ఫీచర్ స్టోరీలను కూడా కవర్ చేశారు.... ఇంకా చదవండి