వ్యక్తిగత హననానికి పాల్పడి, మనిషిని హతమార్చే విధంగా మాట్లాడివారిని ఎవరూ క్షమించరన్నారు ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు.
రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న తాను రాజ్యాంగంలోని ఆర్టికల్ 341 ప్రకారం మతం మారిన వారికి ఎస్సీ రిజర్వేషన్లు వర్తించవని మాత్రమే ప్రస్తావించానన్నారు. ఇదే విషయాన్ని సుప్రీం కోర్టు కూడా చెప్పిందని.. ఇదే మాట చెప్పినందుకు తన నాలుక కోసి సమాధి చేస్తానని ఓ వ్యక్తి బరితెగించి మాట్లాడితే చర్యలు లేవన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తనపై అనుచిత, అసత్య, హింసను ప్రేరేపించేలా వ్యాఖ్యలు చేసిన వ్యక్తిపై ఇప్పటి వరకు చర్యలు తీసుకోలేదన్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌పై వ్యాఖ్యలు చేసినందుకు ప్రశ్న యూట్యూబర్ రావణ్‌పై కొందరు అభిమానులు ఫిర్యాదు చేస్తే ఆయన్ను పోలీసులు అరెస్ట్ చేసినట్లు తనకు తెలిసిందన్నారు రఘురామ. ఏలూరులో నిర్వహించిన బహిరంగ సభలో లాయర్ జడ శ్రవణ్ కుమార్ తనపై అనుచిత వ్యాఖ్యలు చేయడంతో కాళ్ల, ఏలూరు ప్రాంతాలకు చెందిన తన అభిమానులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసులు నమోదు చేశారన్నారు. ముఖ్యమంత్రిపై విమర్శలు చేస్తున్న వారికి జరిగింది.. రాజ్యాంగ పదవిలో ఉన్న తనను విమర్శించే వారిపై చర్యలు తీసుకోలేని స్దితిలో ప్రభుత్వం ఉంటుందని తాను భావించడం లేదన్నారు. రాజ్యాంగంపై దాడులు చేసే వారిని కచ్చితంగా శిక్షించాలన్నారు.'చట్టం తన పని తాను చేసుకునే ప్రక్రియలో ప్రజలందరు ఎంతో అభిమానించే పవన్ కళ్యాణ్‌కు ఓ విధంగా స్వాంతన కలిగించే దిశగా కనీసం పోలీసు యంత్రాంగం ముందుకు వచ్చినందుకు సంతోషిస్తున్నాను. డిప్యూటీ సీఎంకు జరిగిన న్యాయం.. ఈ ప్రభుత్వంలోని పోలీస్ శాఖ డిప్యూటీ స్పీకర్ విషయంలో జరుగుతుందని ఆశిస్తున్నాను. నాపై వ్యాఖ్యలు చేసిన వ్యక్తిని ఎలా అరెస్ట్ చేస్తారో నాకు తెలియదు.. కచ్చితంగా అరెస్ట్ చేయాలని కోరుతున్నాను. నా నాలుక కోసి సమాధి కడతానని బరితెగించి మాట్లాడితే అతనిపై చర్యలు తీసుకోలేని పరిస్థితిలో ప్రభుత్వం ఉంటే.. అంతకుమించిన దుస్థితి ఏ రాష్ట్రంలోనూ ఉండదు. ఇది రాజ్యాంగంపై దాడి.. రాజ్యాంగబద్ద పదవిలో ఉన్న నేను రాజ్యాంగపరమైన అంశాలను మాట్లాడినందుకు.. నా నాలుక కోసి సమాధి కడతానంటే చర్యలు తీసుకోకపోతే ఈ హోంశాఖకు అర్థం లేదు' అన్నారుఇదిలా ఉంటే.. జడ శ్రవణ్‌కుమార్‌తో పాటుగా మరికొందరిపై ఏలూరు త్రీ టౌన్, కాళ్ల పోలీసు స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. గత నెల 28న ఏలూరులో నిర్వహించిన దళిత క్రైస్తవ శంఖారావం బహిరంగ సభలో శ్రవణ్, యూట్యూబర్ ప్రశ్న రావణ్‌తోపాటు మరికొందరు చేసిన వ్యా్ఖ్యలపై పోలీసులకు ఫిర్యాదులు అందాయి. వీరు తమ ప్రసంగాల్లో డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజును, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌లను వ్యక్తిగతంగా దూషించారంటూ పోలీసులకు ఫిర్యాదులు అందాయి. పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడు, పాలకోడేరు పోలీసు స్టేషన్లలోనూ శ్రవణ్ కుమార్‌పై ఫిర్యాదు చేశారు.