
రిజిస్ట్రేషన్ కేంద్రం వద్ద యువ యాత్రికుల సందడి జమ్మూ: హిమాలయాల్లో ఏటా కొనసాగే అమరనాథ్ గుహాలయ సందర్శనకు యాత్రికుల తొలి బృందాన్ని లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్‌సిన్హా గురువారం భగవతీ నగర్ యాత్రీ...
రిజిస్ట్రేషన్ కేంద్రం వద్ద యువ యాత్రికుల సందడి
జమ్మూ: హిమాలయాల్లో ఏటా కొనసాగే అమరనాథ్ గుహాలయ సందర్శనకు యాత్రికుల తొలి బృందాన్ని లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్‌సిన్హా గురువారం భగవతీ నగర్ యాత్రీ నివాస్ బేస్ క్యాంపు నుంచి జెండా ఊపి ప్రారంభించనున్నారు. భక్తుల ఆఫ్‌లైన్ రిజిస్ట్రేషన్లు బుధవారం ఉదయం ప్రారంభమయ్యాయి. 3,880 మీటర్ల ఎత్తున ఉన్న అమరనాథ్ గుహకు చేరుకునే యాత్ర అనంతనాగ్ జిల్లాలోని నున్వాన్ - పహల్గాం మార్గంలో శుక్రవారం అధికారికంగా ప్రారంభమవుతుంది. 57 రోజుల ఈ యాత్రకు ఆన్లైను ద్వారా ఇప్పటికే నాలుగు లక్షలమంది యాత్రికులు పేర్లు నమోదు చేసుకున్నారు. రాత్రి కురిసిన వర్షం జమ్మూలో వాతావరణాన్ని చల్లబరిచింది. యాత్రకు సంబంధించిన పాసుల కోసం రిజిస్ట్రేషను కేంద్రాల వద్ద తెల్లవారుజాము నుంచే భక్తులు బారులు తీరారు. జమ్మూలోని తావీ నదీతీరాన ఉన్న కృత్రిమ సరస్సు వద్ద, గీతా భవన్, రామ్ మందిర్, భగవతీ నగర్.. ఈ నాలుగుచోట్ల రిజిస్ట్రేషన్లకు, టోకెన్ల పంపిణీకి కౌంటర్లు తెరిచారు. ఉన్నతాధికారులు ఈ కౌంటర్లను సందర్శించి, యాత్రికులతో మాట్లాడారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.