
బాధ్యతల స్వీకరణ వేళ.. దిల్లీలో తన తండ్రి, విశ్రాంత లెఫ్టినెంట్ జనరల్ కృష్ణమోహన్ సేఠ్‌కు ధీరజ్ సేఠ్ సెల్యూట్ దిల్లీ: అనేక యుద్ధాల్లో రాటుదేలిన భారత సైన్యం నిరంతరం సమర సన్నద్ధంగా ఉండే బలగమని,...
బాధ్యతల స్వీకరణ వేళ.. దిల్లీలో తన తండ్రి, విశ్రాంత లెఫ్టినెంట్ జనరల్ కృష్ణమోహన్ సేఠ్‌కు ధీరజ్ సేఠ్ సెల్యూట్
దిల్లీ: అనేక యుద్ధాల్లో రాటుదేలిన భారత సైన్యం నిరంతరం సమర సన్నద్ధంగా ఉండే బలగమని, భవిష్యత్తులో అధునాతన సాంకేతికతల మద్దతుతో బహుళ రంగాల్లో పోరాడే సైన్యంగా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని భారత సైన్యం కొత్త ప్రధానాధికారి జనరల్ ధీరజ్ సేఠ్ బుధవారం ప్రకటించారు. ఈ లక్ష్యాన్ని సాధించడానికి ఆయన ‘విజయ్’ అనే సంక్షిప్త పదాన్ని రూపొందించారు. ఇందులో ‘వి’ అంటే విజిలెన్స్ (నిఘా), ‘ఐ’ అంటే ఇన్నోవేషన్ (నూతన ఆవిష్కరణ), ‘జె’ అంటే జాయింట్‌నెస్ అండ్ ఇంటిగ్రేషన్ (ఉమ్మడి కార్యాచరణ), ‘ఎ’ అంటే ఆత్మనిర్భరత, ‘వై’ అంటే యోధా ఫస్ట్ అని జనరల్ సేఠ్ వివరించారు. 40 ఏళ్లకు పైగా విశిష్ట సేవలు అందించి జూన్ 30న పదవీ విరమణ చేసిన జనరల్ ఉపేంద్ర ద్వివేది స్థానంలో సేఠ్ 31వ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్‌గా బాధ్యతలు స్వీకరించారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.