
వరుసగా నాలుగో రోజూ ఐటీ రంగ షేర్లు భారీ అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. బుధవారం ట్రేడింగ్‌లో కేపీఐటీ టెక్ షేరు ఏకం గా 17 శాతం క్షీణించింది. జూన్ త్రైమాసికానికి పనితీరు...
ముంబై: వరుసగా నాలుగో రోజూ ఐటీ రంగ షేర్లు భారీ అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. బుధవారం ట్రేడింగ్‌లో కేపీఐటీ టెక్ షేరు ఏకం గా 17 శాతం క్షీణించింది. జూన్ త్రైమాసికానికి పనితీరు అంచనాల కంటే తగ్గవచ్చన్న కంపెనీ వ్యాఖ్యలు ఇందుకు కారణమయ్యాయి. కాగా, సెన్సెక్స్ నమోదిత హెచ్‌సీఎల్ టెక్ 3.46 శాతం, టెక్ మహీంద్రా 3.06 శాతం, టీసీఎస్ 2.55 శాతం, ఇన్ఫోసిస్ 1.51 శాతం క్షీణించాయి. ఇన్ఫోసిస్ షేరు ధర రూ.1,000 దిగువకు పడిపోవడం 2020 సెప్టెంబరు తర్వాత మళ్లీ ఇదే మొదటిసారి. ఇన్ఫీ, టీసీఎస్, టెక్ మహీంద్రా సహా పలు టెక్ కంపెనీల షేర్లు ప్రస్తుతం ఏడాది కనిష్ఠ స్థాయిల్లో ట్రేడవుతున్నాయి. ఇక టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో, ఎల్‌టీఐమైండ్‌ట్రీ స్టాక్స్ తమ ఆల్‌టైం రికార్డు గరిష్ఠ స్థాయి నుంచి కనీసం 50 శాతం పతనమయ్యాయి. దాంతో టాప్-10 ఐటీ కంపెనీల మార్కెట్ విలువ ఆల్‌టైమ్ రికార్డు స్థాయితో పోలిస్తే రూ.19 లక్షల కోట్ల మేర తరిగిపోయింది.
ఈ ఏడాది ప్రారంభం నుంచే ఐటీ కంపెనీల షేర్లు ఒత్తిడికి లోనవుతూ వస్తున్నాయి. 2008 ఆర్థిక మాంద్యం కాలం నాటి పరిస్థితుల తర్వాత ఐటీ రంగానికిదే అత్యంత బలహీన పనితీరు. ఏఐ విధ్వంస భయాందోళనలు, నిస్తేజ ఆదాయ అంచనాలు, అమెరికా-ఇరాన్ యుద్ధం, ఫెడ్ రేట్ల పెంపు అంచనాలు, విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు ఐటీ షేర్లలో భారీగా అమ్మకాలు జరుపుతుండటం ఇందుకు కారణం. దాంతో ఈ ఏడాది నిఫ్టీ ఐటీ అన్నిటికంటే అధమ పనితీరు కనబరిచిన సూచీగా మిగిలింది. ఈ ఏడాదిలో ఇప్పటివరకు నిఫ్టీ-50 ఇండెక్స్ 8 శాతం నష్టపోగా.. 10 ప్రముఖ ఐటీ కంపెనీలతో కూడిన నిఫ్టీ ఐటీ సూచీ 32 శాతం పతనమైంది.
దేశంలోనే అత్యధిక పెన్షన్ల పంపిణీలో ఏపీ రికార్డ్: ఎంపీ కేశినేని శివనాథ్
కృష్ణా తూర్పు డెల్టా కాలువలకు 3200 క్యూసెక్కుల నీరు విడుదల
Read Latest AP News And Telangana News And National News