పాలకూర, కాలే వంటి ఆకుకూరల్లో ల్యూటిన్, జియాంక్సితిన్ వంటి యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. ఇవి రెటీనాని ఆరోగ్యంగా ఉంచుతాయి.
వీటిని తింటే కంటి చూపు మెరుగుపడుతుందని క్వీవ్లాండ్ క్లీనిక్ నివేదిక తెలిపింది.
సాల్మన్, ట్యూనా మాకెరెల్ వంటి చేపల్లో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి రెటీనా ఆరోగ్యాన్ని కాపాడతాయి. పొడి కళ్ల సమస్యను తగ్గిస్తాయి.
గుడ్లలో ల్యూటిన్, జియాంక్సిథిన్, జింక్, విటమిన్ ఎ వంటి సమ్మేళనాలు ఉంటాయి. ఇవి కంటి కణజాలాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి.
నారింజ, గ్రేప్ప్రూట్, నిమ్మకాయలో విటమిన్ సి కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఇది కళ్లలో రక్తనాళాలను ఆరోగ్యంగా ఉంచుతుంది. సిట్రస్ పండ్లు తింటే కంటి చూపు మెరుగుపడుతుంది.
క్యారెట్లలో బీటా కెరోటిన్కు ఎక్కువగా ఉంటుంది. ఇది శరీరంలో విటమిన్ ఎగా మారుతుంది. క్యారెట్లు తింటే రేచీకటి తగ్గుతుంది. కంటి చూపు మెరుగుపడుతుంది.
బాదం, వాల్నట్స్, చియా విత్తనాలు వంటి వాటిలో విటమిన్ ఇ ఉంటుంది. ఇందులో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ కూడా లభిస్తాయి. ఇవి కంటి ఆరోగ్యాన్ని కాపాడతాయి.
బెల్ పెప్పర్లో విటమిన్ సి కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఇది కంటిని ఆరోగ్యంగా ఉంచుతుంది. బెల్ పెప్పర్ తింటే కంటి చూపు మెరుగుపడుతుంది.
శనగలు, కాయధాన్యాలు, కిడ్నీ బీన్స్ వంటి వాటిలో జింక్ ఉంటుంది. ఇది రెటీనాను ఆరోగ్యంగా ఉంచుతుంది. బీన్స్ తింటే కంటి సమస్యలు తగ్గుతాయి.