ఫ్రిజ్‌లోని పదార్థాలు మొత్తం తీసిసి షెల్వ్ కూడా బయట పెట్టండి. ఇప్పుడు వెనిగర్, గోరువెచ్చని నీళ్లు సమపాళ్లలో తీసుకుని ఫ్రిజ్ శుభ్రం చేయండి. దీంతో ఫ్రిజ్ పూర్తిగా శుభ్రం అవుతుంది. దుర్వాసన పోతుంది.
కాఫీ గింజల్లో నైట్రోజన్ ఉంటుంది. ఇది ఫ్రిజ్ దుర్వాసన తొలగించి మంచి వాసన వచ్చేందుకు సహాయపడుతుంది. దీనికోసం పొడి కాఫీ గింజలను ప్లేట్లో ఉంచి దానిని ఫ్రిజ్‌లో ఉంచండి. దుర్వాసన పోయాక తీసేస్తే సరిపోతుంది.
బేకింగ్ సోడా ఫ్రిజ్‌లోని దుర్వాసన పీల్చుకుని మంచి వాసన వచ్చేందుకు సహాయపడుతుంది. దీనికోసం ఓపెన్ బౌల్లో బేకింగ్ సోడా వేసి ఫ్రిజ్‌లో ఉంచితే సరిపోతుంది. నెల, రెండు నెలలకు ఓసారి రిప్లేస్ చేయండి.
ఫ్రిజ్‌లోని అధిక తేమ, దుర్వాసన పీల్చుకోవడంలో ఓట్స్ సహాయపడతాయి. దీనికోసం ఓపెన్ బౌల్లో కొన్ని ఓట్స్ పోసి ఫ్రిజ్‌లో ఉంచండి. వారం తర్వాత తీసేస్తే సరిపోతుంది.
నిమ్మకాయలోని సిట్రిక్ యాసిడ్ దుర్వాసన రావడానికి కారణమయ్యే బ్యాక్టీరియాను నాశనం చేస్తాయి. అలాగే ఫ్రిజ్ మంచి వాసన వచ్చేందుకు సహాయపడతాయి. దీనికోసం నిమ్మకాయ ముక్కలు కట్ చేసి వాటిపై కొద్దిగా బేకింగ్ సోడా చల్లి ప్లేట్లో ఉంచండి. దీనిని ఫ్రిజ్‌లో వారం రోజులు ఉంచితే సరిపోతుంది.
టీ ఆకుల్లో టానిన్స్ ఉంటాయి. అలాగే వీటిలోని యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఫ్రిజ్ నుంచి వచ్చే దుర్వాసన పోగొడుతుంది. దీనికోసం వాడిన టీ బ్యాగ్‌ను ప్లేట్లో పెట్టి ఫ్రిజ్‌లో ఉంచితే సరిపోతుంది.
పెప్పరమింట్ ఆయిల్ మంచి వాసన వస్తుంది. ఇది ఫ్రిజ్ నుంచి వచ్చే దుర్వాసన తొలగిస్తుంది. దీనికోసం కాటన్ బాల్‌ను పెప్పరమింట్ ఆయిల్లో ముంచి దానిని ఫ్రిజ్ షెల్వ్‌లో పెడితే సరిపోతుంది.
చార్కోల్ కూడా ఫ్రిజ్‌లోని దుర్వాసనను పీల్చుకుంటుంది. తద్వారా దుర్వాసన రాకుండా కాపాడుతుంది. దీనికోసం చార్కోల్ (బొగ్గు)ను ఫ్రిజ్‌లో ఉంచితే సరిపోతుంది.
లెమన్ ఆయిల్ కూడా ఫ్రిజ్‌లో దుర్వాసన తొలగించడంలో సహాయపడుతుంది. దీనికోసం కాటన్ బాల్‌ను లెమన్ ఆయిల్లో ముంచి ఫ్రిజ్‌లో ఉంచితే మంచిది.