
మెగాస్టార్ చిరంజీవి సతీమణి కొణిదెల సురేఖకు అరుదైన గౌరవం దక్కింది. ఆమెను తెలంగాణ ప్రభుత్వం యాదగిరిగుట్ట దేవస్థానం పాలకమండలి సభ్యురాలిగా నియమించింది. ఎంఎస్ఎన్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్‌కు చెందిన ఎం.
Jul 1 2026 3:47 PM | Updated on Jul 1 2026 3:54 PM
మెగాస్టార్ చిరంజీవి సతీమణి కొణిదెల సురేఖకు అరుదైన గౌరవం దక్కింది. ఆమెను తెలంగాణ ప్రభుత్వం యాదగిరిగుట్ట దేవస్థానం పాలకమండలి సభ్యురాలిగా నియమించింది. ఎంఎస్ఎన్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్‌కు చెందిన ఎం. సత్యనారాయణ రెడ్డిని పాలకమండలి ఛైర్మన్‌గా నియమించిన ప్రభుత్వం.. 11 మందితో కలిపి పాలకవర్గాన్ని ప్రకటించింది. వీరంతా ఈ పదవుల్లో రెండేళ్ల పాటు కొనసాగనున్నారు.
గతంలో యాదగిరిగుట్ట దేవస్థానానికి 2009 సంవత్సరం వరకు సాధారణ పాలకవర్గం ఉంది. ఆ పాలకవర్గం పదవీకాలం ముగిసిన తర్వాత ఆలయ ఈవోలతోనే నడిపించారు. గత ప్రభుత్వ హయాంలో ఆలయ పునర్నిర్మాణం జరిగింది. అయితే పూర్తిగా అధికారుల ఆధ్వర్యంలోనే కార్యక్రమాలు కొనసాగుతూ వచ్చాయి. తాజాగా పాలకమండలి ఏర్పాటు చేశారు.
యాదగిరిగుట్ట దేవస్థానం (వైటీడీ) బోర్డు చైర్మన్‌గా ఎం.సత్యనారాయణరెడ్డి నియమితులయ్యారు. మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన ఎంఎస్ఎన్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ అధినేత డాక్టర్ మన్నె సత్యనారాయణరెడ్డి ఫార్మారంగంలో సేవలందిస్తున్నారు. ఒక సాధారణ కెమిస్ట్‌గా తన ప్రస్థానాన్ని ప్రారంభించి నేడు ఫార్మా రంగంలో తిరుగులేని శక్తిగా ఎదిగారు.
ఏపీ : శిల్ప కళా వైభవం.. చెక్కుచెదరని కట్టడం ఎక్కడో తెలుసా? (ఫొటోలు)
ప్రేమలో పడిన యంగ్ హీరోయిన్.. ప్రియుడు ఇతడే (ఫొటోలు)
సత్యదేవ్ ‘రావు బహదూర్’ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.. (ఫోటోలు)
అక్కినేని అఖిల్ ‘లెనిన్’ మూవీ HD స్టిల్స్
KVR అరెస్ట్ వెనుక అసలు నిజం ఇదేనా? భార్య షాకింగ్ వ్యాఖ్యలు
NTR బతికుంటే ఆయన్ని కూడా.. బాబు ఎలాంటి వాడో జగన్ మాటల్లో
సాయికృష్ణ కేసులో నీకెందుకంత ఆసక్తి? డీజీపీని ఎందుకు కాపాడుతున్నావ్? గుట్టు విప్పిన జగన్!
నీళ్లు అందిస్తే తప్పేంటి? వైభవ్ పై అశ్విన్ షాకింగ్ కామెంట్స్
ఎన్టీఆర్ పై తమిళ తంబీల ఆగ్రహం కారణం ఏంటంటే..?