
దేశవ్యాప్తంగా గ్రామీణ ఉపాధి రంగంలో ఒక చారిత్రాత్మక మార్పు చోటుచేసుకుంది. దాదాపు రెండు దశాబ్దాల నాటి సుదీర్ఘ చరిత్ర కలిగిన మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం (MGNREGA) స్థానంలో కేంద్ర...
దేశవ్యాప్తంగా గ్రామీణ ఉపాధి రంగంలో ఒక చారిత్రాత్మక మార్పు చోటుచేసుకుంది. దాదాపు రెండు దశాబ్దాల నాటి సుదీర్ఘ చరిత్ర కలిగిన మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం (MGNREGA) స్థానంలో కేంద్ర ప్రభుత్వం నూతనంగా తీసుకువచ్చిన వికసిత్ భారత్ గ్యారెంటీ ఫర్ రోజ్‌గార్ అండ్ ఆజీవిక మిషన్ - గ్రామీణ్’ (VB-G RAM G Act) చట్టం జూలై 1 నుంచి అధికారికంగా అమల్లోకి వచ్చింది. గ్రామీణ ప్రాంతాల్లో జీవన ప్రమాణాలను విప్లవాత్మకంగా మార్చే లక్ష్యంతో రూపొందించిన ఈ సరికొత్త చట్టం ద్వారా, ప్రతి అర్హత కలిగిన గ్రామీణ కుటుంబానికి ఏడాదికి కల్పించే కనీస పని దినాలను 100 రోజుల నుంచి 125 రోజులకు పెంచుతూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.కనిష్ఠ వేతనం రూ. 300.. సిక్కింలో అత్యధికం!నూతన చట్టం అమల్లోకి వచ్చిన నేపథ్యంలో, కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ దీనికి సంబంధించిన రోజువారీ వేతన సవరణను తాజాగా నోటిఫై చేసింది. ఈ కొత్త నిబంధనల ప్రకారం దేశవ్యాప్తంగా దినసరి కనీస వేతనాన్ని రూ.300 గా నిర్ణయించగా, గరిష్ఠంగా రూ.409 వరకు చెల్లించనున్నారు. గతంలో కొన్ని రాష్ట్రాల్లో రూ.241 గా ఉన్న వేతనాన్ని సవరించడంతో, ఇప్పుడు దేశవ్యాప్తంగా సగటు కూలి రోజుకు రూ.327.4 కు పెరిగింది. కాగా, సిక్కింలోని కొన్ని ప్రత్యేక ఎత్తైన ప్రాంతాల పంచాయతీలకు మాత్రం దేశంలోనే అత్యధికంగా రూ.450 రోజువారీ వేతనాన్ని కేంద్రం ఖరారు చేసింది.రాష్ట్రాల వారీగా కొత్త కూలి వివరాలు..కొత్త చట్టం కారణంగా అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, బిహార్, జార్ఖండ్, అస్సాం, త్రిపుర, సిక్కిం, పశ్చిమ బెంగాల్ వంటి రాష్ట్రాల్లో పాత విధానంతో పోలిస్తే వేతనాలు 15 శాతానికి పైగా పెరిగాయి. అయితే, తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక, తమిళనాడులో ఈ పెంపు కేవలం 3 శాతం కంటే తక్కువగానే ఉండటం గమనార్హం.ఆంధ్రప్రదేశ్: రూ. 312తెలంగాణ: రూ. 308మహారాష్ట్ర: రూ. 317తమిళనాడు: రూ. 345కర్ణాటక: రూ. 382 (కొన్ని చోట్ల రూ. 360 పైన) కేరళ: రూ. 401గోవా: రూ. 406 గుజరాత్, రాజస్థాన్, ఒడిశా, మధ్యప్రదేశ్, పశ్చిమ బెంగాల్, ఉత్తరప్రదేశ్ సహా మొత్తం 21 రాష్ట్రాల్లో కనీస రోజువారీ వేతనం బేస్ ప్రైస్ రూ. 300 గా అమలు కానుంది. Video: ఉపాధి హామీ కూలీల మైండ్ బ్లోయింగ్ డాన్స్. ఆనందం అంటే ఇదే! శాశ్వత ఆస్తుల సృష్టి.. సాంకేతికతకు పెద్దపీట!కేవలం కూలి డబ్బులు ఇవ్వడమే కాకుండా గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతులు, నీటి సంరక్షణ, రహదారుల వంటి శాశ్వతమైన ఆస్తుల సృష్టికి ఈ వీబీ జీరామ్‌జీ చట్టంలో అత్యంత ప్రాధాన్యత కల్పించారు. ఇందుకోసం గ్రామ పంచాయతీలు ప్రత్యేకంగా వికసిత్ గ్రామ పంచాయతీ ప్రణాళికల’ను సిద్ధం చేసి, వాటిని పీఎం గతి శక్తి’ జాతీయ మాస్టర్ ప్లాన్‌తో అనుసంధానించాల్సి ఉంటుంది.అలాగే అక్రమాలకు తావులేకుండా ఉండేందుకు జీఐఎస్ (GIS) మ్యాపింగ్, శాటిలైట్ ఇమేజరీ వంటి సరికొత్త సాంకేతికతను వాడుతున్నారు. లబ్ధిదారులకు నేరుగా ప్రభుత్వ ప్రయోజనాలు బదిలీ (DBT) కానున్నాయి. ఒకవేళ నిర్ణీత వ్యవధిలో పని కల్పించలేకపోతే, నిరుద్యోగ భృతి చెల్లించే నిబంధనను కూడా ఇందులో యథాతథంగా కొనసాగించారు.Video: ఆమె పిలుపుకు ముళ్లపంది కూడా లొంగిపోయింది..ఆంధ్రప్రదేశ్‌లో రేపే పంపిణీకి శ్రీకారం.. రూ.95 వేల కోట్ల అత్యవసర నిధులు!ఈ ప్రతిష్టాత్మక చట్టావిష్కరణ కార్యక్రమంలో భాగంగా జూలై 2 న ఆంధ్రప్రదేశ్‌లో కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈ నూతన వికసిత్ భారత్ గ్యారెంటీ మిషన్‌ను అధికారికంగా ప్రారంభించనున్నారు. తొలి గ్రామీణ ఉపాధి హామీ కార్డులను ఆయన ఇక్కడే పంపిణీ చేయనున్నారు. అప్పటివరకు పాత ఈ-కేవైసీ (e-KYC) పూర్తి చేసిన కార్డులే చెల్లుబాటు అవుతాయి. కొత్త విధానంలోకి మారే క్రమంలో పథకానికి ఎలాంటి అంతరాయం కలగకుండా ఉండేందుకు కేంద్ర ప్రభుత్వం రూ. 95,692.31 కోట్ల అత్యవసర నిధులను ఇప్పటికే విడుదల చేసింది. గతేడాది మార్చి 27 తర్వాత కేంద్రం మళ్లీ ఇప్పుడే ఈ వేతన సవరణ చేపట్టడం విశేషం.