
వర్షాకాలంలో రోజువారీ ప్రయాణాలు చేసే ఉద్యోగులు, విద్యార్థులకు వాతావరణం ఎప్పుడు ఎలా మారుతుందో అస్సలు అర్థం కాదు. ఉదయం ఆఫీస్‌కు లేదా కాలేజీకి బయలుదేరేటప్పుడు ఎండగా ఉన్నా, మధ్యలో ఒక్కసారిగా భారీ వాన...
వర్షాకాలంలో రోజువారీ ప్రయాణాలు చేసే ఉద్యోగులు, విద్యార్థులకు వాతావరణం ఎప్పుడు ఎలా మారుతుందో అస్సలు అర్థం కాదు. ఉదయం ఆఫీస్‌కు లేదా కాలేజీకి బయలుదేరేటప్పుడు ఎండగా ఉన్నా, మధ్యలో ఒక్కసారిగా భారీ వాన పడొచ్చు. ఒక్క రోజు వర్షం చాలు మీ బ్యాగులో ఉన్న ఖరీదైన ల్యాప్‌టాప్, మొబైల్, ఆఫీస్ ఫైల్స్, ముఖ్యమైన డాక్యుమెంట్లు పూర్తిగా పాడైపోవడానికి. చాలామంది బ్యాగులు కొనేటప్పుడు కేవలం లుక్స్ మాత్రమే చూస్తారు కానీ ఈ వర్షాకాలంలో స్టైల్‌తో పాటు వాటర్‌ప్రూఫ్ ఫీచర్ చాలా ముఖ్యం.
ప్రస్తుతం అమెజాన్ ఇండియాలో బెస్ట్ బ్రాండెడ్ వాటర్‌ప్రూఫ్ బ్యాగులపై అదిరిపోయే ఆఫర్లు, భారీ డిస్కౌంట్లు నడుస్తున్నాయి. ఎంత పెద్ద వర్షం పడినా ఒక్క చుక్క నీరు కూడా లోపలికి వెళ్లకుండా కాపాడే ఈ బ్యాగులను చాలా తక్కువ ధరకే సొంతం చేసుకోవచ్చు. ఆఫీస్, కాలేజీ, బైక్ రైడింగ్, ట్రావెలింగ్ ఇలా మీ అవసరాలకు తగ్గట్టుగా అమెజాన్‌లో లభిస్తున్న టాప్ క్వాలిటీ వాటర్‌ప్రూఫ్ బ్యాగుల వివరాలు ఇప్పుడు చూద్దాం.
మీరు కార్పొరేట్ ఆఫీస్‌కు వెళ్తుంటే మీకు ప్రొఫెషనల్ లుక్ ఇచ్చే బ్యాగులు చాలా అవసరం. దీనికోసం అమెజాన్‌లో uppercase 14L Omega 03 Professional Laptop Messenger Bag అందుబాటులో ఉంది. ఇది 15.6 అంగుళాల ల్యాప్‌టాప్ పట్టేలా, మల్టిపుల్ ఆర్గనైజర్లతో చాలా క్లాస్‌గా ఉంటుంది. నార్మల్ బ్యాగుల కంటే ఇది 3 రెట్లు ఎక్కువ వాటర్ రెసిస్టెంట్ సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. దీని అసలు ధర ₹3,300 కాగా, ప్రస్తుతం 48% డిస్కౌంట్‌తో కేవలం ₹1,699 కే లభిస్తోంది.
మరోవైపు యువతకు బాగా నచ్చేలా యూఎస్బీ పోర్ట్‌తో వస్తోంది Impulse V2 Elite 30L Water Resistant Laptop Backpack. ఇందులో 16 ఇంచుల ల్యాప్‌టాప్ ఈజీగా పెట్టేయొచ్చు. ఆఫీస్, కాలేజీ, ట్రావెల్ అన్నింటికీ ఇది పర్ఫెక్ట్ ఛాయిస్. దీని అసలు ధర ₹2,500 కానీ అమెజాన్‌లో ఏకంగా 78% డిస్కౌంట్‌తో కేవలం ₹549 కే సొంతం చేసుకోవచ్చు.
కాలేజీ స్టూడెంట్స్ కోసం తక్కువ బడ్జెట్లో ఎక్కువ స్టోరేజ్ ఉండే బ్యాగులు అమెజాన్‌లో లైన్‌గా ఉన్నాయి. అందులో Half Moon 30L Laptop Backpack ఒకటి. అబ్బాయిలు, అమ్మాయిలు ఇద్దరూ వాడగలిగే ఈ బ్యాగ్‌లో 15 ఇంచుల ల్యాప్‌టాప్ స్లీవ్ ఉంది. దీని ప్రత్యేకత ఏంటంటే, వర్షం పడేటప్పుడు రాత్రి పూట దూరంగా ఉన్న వాహనదారులకు కూడా స్పష్టంగా కనిపించేలా ఒక రిఫ్లెక్టివ్ స్ట్రిప్ ఇచ్చారు. దీని అసలు ధర ₹2,999 కాగా, ప్రస్తుతం 80% భారీ డిస్కౌంట్‌తో కేవలం ₹599 కే వస్తోంది.
అలాగే అదిరిపోయే టీల్ కలర్ ఆప్షన్‌తో లభిస్తోంది Martucci Pro 35L Spacious Lightweight Casual Waterproof 17 Inch Laptop Backpack. ఇది చాలా లైట్‌వెయిట్‌గా ఉంటూనే, 17 ఇంచుల పెద్ద ల్యాప్‌టాప్ పట్టేలా డిజైన్ చేశారు. దీనికి కూడా రిఫ్లెక్టివ్ స్ట్రిప్ ఉంది. దీని అసలు ధర ₹1,799 కాగా, అమెజాన్‌లో 60% డిస్కౌంట్‌తో ₹709 కే లభిస్తోంది.
మీరు బైక్ రైడ్స్ లేదా లాంగ్ జర్నీలు ఎక్కువగా చేస్తుంటే పెద్ద సైజు బ్యాగ్ అవసరమవుతుంది. ఇందుకోసం Lunar's Hammer Unisex 50L Laptop Bag బెస్ట్ ఆప్షన్. ఇందులో 17.3 ఇంచుల ల్యాప్‌టాప్ కూడా పెట్టేయొచ్చు. చాలా విశాలంగా ఉండే ఈ ట్రావెలింగ్ బ్యాక్‌ప్యాక్‌తో పాటు కంపెనీ వాళ్లే ఒక ప్రత్యేకమైన రెయిన్ కవర్‌ను కూడా ఇస్తున్నారు. దీనివల్ల ఎంత పెద్ద వాన వచ్చినా మీ బట్టలు, గ్యాడ్జెట్స్ తడవవు. దీని అసలు ధర ₹2,999 కాగా, అమెజాన్ ఆఫర్ లో 66% డిస్కౌంట్‌తో కేవలం ₹999 కే దొరుకుతోంది.
వానాకాలంలో బైక్ నడిపేవారికి వర్షం పెద్ద సమస్య. నార్మల్ బ్యాగుల జిప్పుల గుండా నీరు లోపలికి వెళ్లే ఛాన్స్ ఉంది. అలాంటి వారి కోసం పుట్టిందే Delzon Waterproof Dry Bag. ఇది ఫ్లోటింగ్, లైట్‌వెయిట్ మెటీరియల్‌తో వస్తుంది. దీనితో పాటు మొబైల్ ఫోన్ పెట్టుకోవడానికి ఫ్రీగా ఒక వాటర్‌ప్రూఫ్ ఫోన్ కేస్ కూడా ఇస్తున్నారు. కయాకింగ్, ట్రెక్కింగ్, రివర్ రాఫ్టింగ్ చేసేవాళ్లతో పాటు బైకర్స్ కూడా ఈ 20 లీటర్ల మల్టీ కలర్ బ్యాగ్‌ను బాగా వాడుతుంటారు. దీని అసలు ధర ₹999 కాగా, 35% తగ్గింపుతో కేవలం ₹649 కే లభిస్తోంది.
మహిళల రోజువారీ అవసరాల కోసం, జిమ్‌కు వెళ్లడానికి, షాపింగ్ కోసం చాలా క్యూట్‌గా ఉండే SIVIBAG Foldable Waterproof Travel Tote Bag అందుబాటులో ఉంది. లార్జ్ కెపాసిటీ, హార్ట్ ప్రింట్స్, జిప్పర్ పాకెట్స్‌తో వచ్చే ఈ లైట్‌వెయిట్ స్టైలిష్ కాలేజ్, ఆఫీస్ బ్యాగ్ అసలు ధర ₹599 కాగా, 50% ఆఫర్‌తో కేవలం ₹299 కే లభిస్తోంది.
వీటితో పాటు లాంగ్ వీకెండ్స్ కోసం ఎక్స్‌పాండబుల్ ఫీచర్ ఉన్న Nylon Duffle Bag for Travelling కూడా అందుబాటులో ఉంది. వైన్ కలర్లో ఎంతో అందంగా ఉండే ఈ మల్టీపర్పస్ లార్జ్ కెపాసిటీ బ్యాగ్ వాటర్‌ప్రూఫ్ నైలాన్ మెటీరియల్‌తో వస్తుంది. దీని అసలు ధర ₹499 కాగా, 20% డిస్కౌంట్‌తో ప్రస్తుతం ₹399 కే అమెజాన్‌లో సొంతం చేసుకోవచ్చు.