
యాదగిరిగుట్ట దేవస్థానం ట్రస్ట్ బోర్డు ఏర్పాటైంది. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ట్రస్ట్ బోర్డు చైర్మన్గా ఎంఎస్ఎన్ గ్రూప్ చైర్మన్ మన్నె సత్యనారాయణరెడ్డి (Manne Satyanarayana...
యాదగిరిగుట్ట దేవస్థానం ట్రస్ట్ బోర్డు ఏర్పాటైంది. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ట్రస్ట్ బోర్డు చైర్మన్గా ఎంఎస్ఎన్ గ్రూప్ చైర్మన్ మన్నె సత్యనారాయణరెడ్డి (Manne Satyanarayana Reddy)ని నియమించింది. సభ్యులుగా ఎమ్మెల్యే వినోద్ వెంకటస్వామి (Vinod Venkataswamy), కొణిదెల సురేఖ (Konidela Surekha), సి.విజయ రాజం, తూళ్ల విజయేందర్, పి. ఈశ్వరమ్మ యాదవ్, గుండు మల్లయ్య, స్వాతి కంఠమనేని, రాఘువేంద్రరావు, డి. లక్ష్మినారాయణ నాయక్ ఉన్నారు. ట్రస్ట్ బోర్డులో ఎక్స్ అఫీషియో సభ్యులుగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, దేవాదాయ శాఖ ముఖ్యకార్యదర్శి, దేవాదాయ శాఖ కమిషనర్, జిల్లా కలెక్టర్ (District Collector), వైటీడీఏ వైస్ చైర్మన్, ఆలయ ఈవో, ప్రధాన అర్చకుడు ఉంటారని ప్రభుత్వం పేర్కొంది.