ఆదివారం విత్ స్టార్ మా పరివారం షోలో శ్రీముఖి చేసే సందడి, అవినాష్ హరి ద్వయం చేసే కామెడీ అందరికీ తెలిసిందే. ఇక ప్రతీ ఆదివారం స్పెషల్ థీమ్‌తో వచ్చిన గెస్టులతో ఆటలు ఆడిస్తూ ఆడియెన్స్కిి అంతులేని...
ఆదివారం విత్ స్టార్ మా పరివారం షోలో శ్రీముఖి చేసే సందడి, అవినాష్ హరి ద్వయం చేసే కామెడీ అందరికీ తెలిసిందే. ఇక ప్రతీ ఆదివారం స్పెషల్ థీమ్‌తో వచ్చిన గెస్టులతో ఆటలు ఆడిస్తూ ఆడియెన్స్కిి అంతులేని వినోదాన్ని అందిస్తుంటారు. వచ్చే ఆదివారం నాడు సిబ్లింగ్స్ స్పెషల్‌గా ఎపిసోడ్ ప్లాన్ చేశారు. ఈ క్రమంలో షోకి ప్రభాకర్ , ప్రభాకర్ అన్న సీతారాములు, కావ్య.. కావ్యతో పాటుగా ఆమె చెల్లి కేసరి.. హరితేజతో పాటుగా ఆమె సోదరి హరినిత్య, ఆషికతో పాటుగా ఆమె తమ్ముడు అమోఘ్, ప్రియాంక జైన్‌తో పాటుగా ఆమె తమ్ముడు జెనిల్, ఇమాన్యుయేల్‌తో పాటుగా అతని అన్న డేనియల్ షోకి వచ్చారు.మీ తమ్ముడ్ని అందరూ బుల్లితెర మెగాస్టార్ అంటుంటారు.. మీకు ఏమనిపిస్తుంది.. ఎలా ఫీల్ అవుతుంటారు.. అని సీతారాముల్ని శ్రీముఖి అడుగుతుంది. నాగబాబు, పవన్ కళ్యాణ్ ఎలా ఫీల్ అవుతారో.. నేను కూడా అలానే ఫీల్ అవుతాను అని సీతారాములు అంటాడు. డేనియల్.. మీరు ఎప్పటి నుంచి బ్రదర్స్.. అని శ్రీముఖి కామెడీ చేస్తుంది. ఎప్పటి నుంచి ఏంటమ్మా.. పుట్టినప్పటి నుంచి.. అని ఇమ్ము కౌంటర్ వేస్తాడు. కావ్య వచ్చినప్పుడే వావ్ అంటారు. ఇప్పుడు డబుల్ వావ్.. అనాల్సిందే అని శ్రీముఖి అంటుంది. ఇక కావ్యకి, ఆమె చెల్లికి గాల్లో ముద్దులు పెట్టేస్తాడు ప్రభాకర్ అన్న.. దీంతో ప్రభాకర్ తల పట్టుకుంటాడు. మీ పేరు ఏంటి అని కావ్య చెల్లిని అడుగుతుంది శ్రీముఖి. కేసరి అని ఆమె సమాధానం ఇస్తుంది. రవ్వ కేసరి నా? అని అవినాష్ పంచ్ వేస్తే.. లేదు.. భగవంత్ కేసరి.. అని హరి కౌంటర్ వేస్తాడు. నీకు వచ్చిన తెలుగులో మావాడితో మాట్లాడు.. అని శ్రీముఖి అంటుంది. హాయ్ అన్న.. అని కేసరి పిలవడంతో హరి షాక్ అవుతాడు. తను వచ్చిందంటే నాకు భయంగా ఉంది.. అని కావ్య అంటుంది. సీక్రెట్లు చెబుతుందనా? అని శ్రీముఖి అంటే.. అవును, కాదు అని తలూపుతుంది కావ్య.ప్రియాంక జైన్ తమ్ముడ్ని అవినాష్ ఎత్తుకుని అటూ ఇటూ తిప్పుతాడు. నీలో పెద్దరికం పోలేదు.. పిల్లలు కనిపిస్తే చాలు అలా ఎత్తుకెళ్తున్నావ్ అని ప్రభాకర్ కౌంటర్ వేస్తాుడ.. కత్తిలాంటి అమ్మాయి అన్నారు కదా.. ఈమె ఆమె.. అని ప్రియాంకని సీతారాములుకి చూపిస్తుంది శ్రీముఖి. ఎలా ఉంది అని అడిగితే.. కత్తిలా ఉందని లేచి మరీ చెబుతాడు. ఈయనేంటి లేచి నిల్చున్నాడు అని ప్రభాకర్ కౌంటర్ వేస్తాడు. మీ అందం చూసి మెస్మరైజ్ అయ్యా.. అని శ్రీముఖిని ఆషిక తమ్ముడు అమోఘ్ హగ్ చేసుకుంటాడు. ఇక అవినాష్ కూడా ఆషికను హగ్ చేసుకునేందుకు ట్రై చేస్తాడు. నా ముందే నా చెల్లిని ఫ్లర్ట్ చేస్తావా? కండల్లో పిసికి చంపేస్తా అని అంటాడు. నువ్వు అయితే శ్రీముఖిని హగ్ చేసుకున్నావ్.. నేను చేసుకోవద్దా? అని అవినాష్ కామెడీ చేస్తాడు.ఇక హరితేజ తన చెల్లి గురించి పరిచయం చేస్తుంది. మా చెల్లి.. మొన్నే చేశా పెళ్లి.. వెయిటింగ్ ఫర్.. అని హరితేజ అనడంతో ఆమె చెల్లి ఆపుతుంది. ఇదే ఫస్ట్ టైమా? చిన్నప్పుడు కూడా వచ్చారా? అని నిత్యతో శ్రీముఖి అంటే.. ఇంకా చిన్న పిల్లలానే ఉంది అని అవినాష్ కామెడీ చేస్తాడు.. ఆమెకు పెళ్లై ఒక హజ్బెండ్ ఉన్నాడు.. అని శ్రీముఖి అంటే.. ఎవరికైనా ఒక హజ్బెండే ఉంటాడు.. అని హరితేజ అంటుంది. అలా ఎపిసోడ్ ప్రోమో అంతా ఫుల్ ఫన్నీగా ఉంది.