
క్షణికావేశం.. ఒక నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. జూలై 5న పెళ్లి బాజాలు మోగి, బంధుమిత్రుల సందడితో కళకళలాడాల్సిన ఆ ఇంట్లో ఊహించని గుండెకోత మిగిల్చింది.
అక్క పెళ్లి సంబరాల్లో మునిగితేలుతూ, మురిసిపోవాల్సిన కన్నకొడుకు శవమై పడి ఉండటాన్ని చూసి ఆ తల్లిదండ్రులు గుండెలు పగిలేలా ఏడుస్తున్న తీరు స్థానికులను కంటతడి పెట్టిస్తోంది. పెళ్లి ఆహ్వాన పత్రికల ముద్రణ విషయంలో తలెత్తిన చిన్న కుటుంబ వివాదం.. ఓ ఇరవై ఏళ్ల యువకుడి ప్రాణాలను బలితీసుకున్న హృదయ విదారక ఘటన నంద్యాల జిల్లాలో చోటుచేసుకుంది.నంద్యాల జిల్లా, కొత్తపల్లి మండలం పెద్ద గుమ్మడాపురం గ్రామానికి చెందిన కురుమయ్య కుమారుడు సంజపోగు కళ్యాణ్ (20). ఈ నెల 5వ తేదీన కళ్యాణ్ సొంత అక్క వివాహం నిశ్చయమైంది. ఈ క్రమంలో పెళ్లికి సంబంధించిన ఆహ్వాన పత్రికలను కుటుంబ సభ్యులు ముద్రించారు. అయితే, ఆ పత్రికలపై ఏసుక్రీస్తు సిలువ గుర్తు ముద్రించడం పట్ల కళ్యాణ్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాడు. ఆ గుర్తును వెంటనే తొలగించి, కొత్తగా పెళ్లి పత్రికలను ముద్రించాలని తండ్రి కురుమయ్యను కోరాడు. NEET రీఎగ్జామ్.. ఒత్తిడి తట్టుకోలేక హైదరాబాద్‌లో విద్యార్థిని ఆత్మహత్య !!మార్చడం సాధ్యం కాదనడంతో మనస్తాపం..అయితే ఇప్పటికే పెళ్లి పత్రికల ప్రింటింగ్ అంతా పూర్తయిందని, బంధువులకు పంచాల్సిన ఈ చివరి దశలో వాటిని మళ్లీ మార్చడం సాధ్యం కాదని తండ్రి కురుమయ్య కొడుక్కి సర్దిచెప్పే ప్రయత్నం చేశాడు. కానీ, తండ్రి మాటతో తీవ్ర మనస్తాపానికి, క్షణికావేశానికి గురైన కళ్యాణ్.. ఎవరూ లేని సమయంలో ఇంట్లోనే ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అక్క పెళ్లి ఏర్పాట్లలో అన్నీ తానై చూసుకోవాల్సిన తమ్ముడు.. ఇలా విగతజీవిగా మారడంతో కుటుంబం ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. రాయల్ వెడ్డింగ్ రాసిన మరణశాసనం! చౌదరి కోసం అగర్వాల్ ప్రాణం తీసి.. గ్రామంలో శోకఛాయలు.. పోలీసుల దర్యాప్తు!కుమారుడి మృతదేహాన్ని చూసి తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్న దృశ్యాలు గ్రామంలోని ప్రతి ఒక్కరినీ కదిలించాయి. పెళ్లి కళతో మెరిసిపోవాల్సిన ఇల్లు.. సూతకపు ఛాయలతో నిండిపోవడంతో పెద్ద గుమ్మడాపురం గ్రామం మొత్తం శోకసంద్రంలో మునిగిపోయింది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న కొత్తపల్లి పోలీసులు తక్షణమే ఘటనాస్థలికి చేరుకుని కేసు నమోదు చేశారు. కళ్యాణ్ ఆత్మహత్యకు గల పూర్తి కారణాలపై, అన్ని కోణాల్లో పోలీసులు విచారణ జరుపుతున్నారు.