
ఇంటర్నెట్‌డెస్క్: అయోధ్య విరాళాల చోరీ కేసులో పోలీసులు కీలక విషయాలు వెల్లడించారు. గతేడాది ప్రయాగ్‌రాజ్‌లో నిర్వహించిన కుంభమేళా (Kumbh Mela) సమయంలోనే రామ మందిరంలో అధిక మొత్తంలో చోరీ జరిగినట్లు తెలిపారు
. కుంభమేళాకు వచ్చిన కోట్లాది మంది భక్తులు అయోధ్య రామ మందిరాన్ని (Ayodhya Ram Temple) కూడా సందర్శించారని, ఆ సమయంలో ఆలయానికి భారీ మొత్తంలో కానుకలు, విరాళాలు వచ్చాయని పేర్కొన్నారు. ఇదే అదునుగా భావించిన నిందితులు కానుకల నుంచి కోట్ల రూపాయలు మాయం చేశారన్నారు.
ఈ కేసు (Ram Mandir Theft Case)లో ఇప్పటి వరకు మొత్తం 8 మందిని అరెస్ట్ చేశామని పోలీసులు పేర్కొన్నారు. వారిలో లవ్కుష్ మిశ్రా, అనుకల్ప్ మిశ్రా అనే బావమరుదులు అత్యధిక మొత్తంలో నగదు దొంగిలించినట్లు దర్యాప్తులో తేలిందన్నారు. నిందితుల ఆర్థిక లావాదేవీలు, ఆస్తులు పరిశీలించడానికి ఆదాయపు పన్ను శాఖ, ఈడీ సహకారం తీసుకుంటున్నట్లు తెలిపారు. ఈ కుట్రలో కొంతమంది ఎస్బీఐ (SBI) ఉద్యోగుల పాత్ర కూడా ఉన్నట్లు అనుమానం వ్యక్తం చేశారు. నిందితులు బ్యాంక్ సిబ్బందితో కుమ్మక్కై డబ్బును అక్రమంగా తరలించినట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నట్లు తెలిపారు. దీనిపై దర్యాప్తు కొనసాగుతోందన్నారు. ఇదీ చదవండి: చోరీ చేసిన సొమ్మును వాష్‌రూమ్‌లో దాచి.. అయోధ్య ఆలయంలో ఇంటిదొంగల ప్లాన్
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
ఆధునిక కాలంలో మహిళలు సైతం రైడర్లుగా రాణిస్తున్నారు.