భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ బుధవారం ప్రారంభం కానుంది. ఇక ఈ సిరీస్‌లో భాగంగా తొలి మ్యాచ్ కోసం ఇంగ్లాండ్ జట్టు ఇప్పటికే ప్లేయింగ్ లెవెన్‌ను ప్రకటించింది.
మరోవైపు భారత్ సైతం ఈ మ్యాచ్ కోసం సిద్ధమైంది. ఇక ఈ సిరీస్‌లో యువ సంచలనం వైభవ్ సూర్యవంశీకి అరంగేట్రం చేసే అవకాశం దక్కుతుందా లేదా అన్నది అభిమానుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. చెస్టర్ లీ స్ట్రీట్‌లో రాత్రి 10 గంటలకు మొదటి టీ20 మ్యాచ్ ఆరంభం కానుంది. భారత్, ఇంగ్లాండ్ టీ20 సిరీస్ ప్రారంభం నేపథ్యంలో సిరీస్ షెడ్యూల్, జట్లు, లైవ్ స్ట్రీమింగ్, టైమ్ వివరాలు ఏంటో ఇప్పుడు చూద్దాం..ఇంగ్లాండ్ vs భారత్ టీ20 సిరీస్ షెడ్యూల్..తొలి టీ20: జులై 1,చెస్టర్ లీ స్ట్రీట్రెండో టీ20:జులై 4, మాంచెస్టర్మూడో టీ20: జులై 7, నాటింగ్ హామ్నాలుగో టీ20: జులై 9, బ్రిస్టోల్ఐదో టీ20: జులై 11, సౌథాంప్టన్మ్యాచ్ టైమింగ్స్ ఏంటి?తొలి టీ20, మూడు, నాలుగో టీ20 మ్యాచ్‌లు భారత కాలమానం ప్రకారం రాత్రి 10 గంటలకు ప్రారంభం అవుతాయి. మిగతా రెండు మ్యాచ్‌లు మాత్రం రాత్రి 7 గంటలకే ప్రారంభం అవుతాయి.లైవ్ ఎక్కడ చూడొచ్చు?భారత్-ఇంగ్లాండ్ టీ20 సిరీస్ లైవ్ స్ట్రీమింగ్ హక్కులను రెండు నెట్‌వర్క్‌లు దక్కించుకున్నాయి. ఇందులో టీవీలో సోనీ స్పోర్ట్స్‌లో లైవ్ చూడొచ్చు. ఇక మొబైల్స్, యాప్ విషయానికి వస్తే.. సోనీ లివ్, జియోహాట్‌స్టార్‌లో ఈ మ్యాచ్‌లు ప్రత్యక్ష ప్రసారం అవుతాయి.భారత్‌తో తొలి టీ20కి ఇంగ్లాండ్ తుది జట్టు..ఫిల్ సాల్ట్, జోస్ బట్లర్, హ్యారీ బ్రూక్ (కెప్టెన్), జాకబ్ బెథెల్, టామ్ బాంటన్, సామ్ కర్రన్, విల్ జాక్స్, లియామ్ డాసన్, ఆదిల్ రషీద్, ల్యూక్ వుడ్, సాకిబ్ మహమూద్ఇంగ్లాండ్తో టీ20 సిరీస్‌కు భారత జట్టు..శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), తిలక్ వర్మ (వైస్ కెప్టెన్), రవి బిష్ణోయ్, అభిషేక్ శర్మ, వైభవ్ సూర్యవంశీ, సంజూ శాంసన్ (వికెట్ కీపర్), అక్షర్ పటేల్, హర్షిత్ రాణా, ఇషాన్ కిషన్, వాషింగ్టన్ సుందర్, అర్షదీప్ సింగ్, శివమ్ దూబె, ప్రిన్స్ యాదవ్, ప్రసిద్ధ్ కృష్ణ, సుయాంశ్ షెడ్గే