
– సీఐటీయూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఉపాధ్యక్షుడు పిట్టల అర్జున్ దమ్మపేట, జులై 01 : కేంద్ర ప్రభుత్వం నేటి నుండి అమలు చేసేందుకు ఉద్దేశించిన కొత్త చట్టం ‘వీబీ జీ రామ్ జీ’ ఉపాధి హామీ కూలీల ఉపాధిని...
– సీఐటీయూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఉపాధ్యక్షుడు పిట్టల అర్జున్
దమ్మపేట, జులై 01 : కేంద్ర ప్రభుత్వం నేటి నుండి అమలు చేసేందుకు ఉద్దేశించిన కొత్త చట్టం ‘వీబీ జీ రామ్ జీ’ ఉపాధి హామీ కూలీల ఉపాధిని దెబ్బతీస్తుందని, ఈ చట్టాన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలని సీఐటీయూ భధ్రాద్రి కొత్తగూడెం జిల్లా ఉపాధ్యక్షుడు పిట్టల అర్జున్ అన్నారు. బుధవారం దమ్మపేట గ్రామ పంచాయతీ ఎదుట ఉపాధి కూలీల సమస్యలపై సీఐటీయూ ఆధ్వర్యంలో బుధవారం ధర్నా నిర్వహించి సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని సర్పంచ్ పగడాల రమాదేవికి అందజేశారు. ఈ సందర్భంగా పిట్టల అర్జున్ మాట్లాడుతూ.. ఉపాధి హామీ చట్టం వల్ల పని లేని రోజుల్లో ఈ చట్టం పేదలకు ఎంతో ఉపయోగకరంగా ఉందని, అటువంటి చట్టాన్ని మోదీ ప్రభుత్వం తొలగించి పేదల నోటి కాడ బువ్వను లాగేస్తుందన్నారు. మహాత్మా గాంధీ ఉపాధి హామీ చట్టాన్ని పునరుద్ధరించాలని, ఉపాధి హామీ కూలీలకు రూ.600 వేతనం, 200 రోజుల పని దినాలు కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ మండల కన్వీనర్ మురహరి రఘు, ఉపాధి కూలీలు మద్ది రావమ్మ, భాగ్యలక్ష్మి, నాగేశ్వరమ్మ, లక్ష్మి, మహాలక్ష్మి, ధనలక్ష్మి పాల్గొన్నారు.