
VB GRAMG | దిల్లీ: మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం స్థానంలో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవికా మిషన్-గ్రామీణ్ (VB-G RAM G Act) చట్టం...
VB GRAMG | దిల్లీ: మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం స్థానంలో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవికా మిషన్-గ్రామీణ్ (VB-G RAM G Act) చట్టం నేటి నుంచి అమల్లోకి వచ్చింది. ఉపాధి హామీ పథకంలో 100 రోజులుగా ఉన్న పనిదినాలను 125 రోజులకు పెంచుతూ తీసుకొచ్చిన ఈ చట్టం కింద చెల్లించే వేతనాలను కేంద్రం తాజాగా నోటిఫై చేసింది. రోజువారీ వేతనాన్ని కనిష్ఠంగా రూ.300 నుంచి గరిష్ఠంగా రూ.409 చెల్లించేలా నిర్ణయించింది. సిక్కింలోని కొన్ని పంచాయతీల్లో మాత్రం అత్యధికంగా రూ.450 వేతనం చెల్లించనున్నట్లు కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ తెలిపింది.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.