గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, టాలెంటెడ్ డైరెక్టర్ బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కిన రూరల్ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా ‘పెద్ది’ థియేటర్లలో ఏ స్థాయి సంచలనం సృష్టించిందో అందరికీ తెలిసిందే.
బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తూ ఏకంగా రూ. 400 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను సాధించి ఈ చిత్రం బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. వెండితెరపై మెగా పవర్ స్టార్ ర్యాంపేజ్ చూసి మురిసిపోయిన అభిమానులు, ఇప్పుడు ఈ సినిమా డిజిటల్ ఎంట్రీ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే తాజాగా వినిపిస్తోన్న ప్రచారం మెగా అభిమానులను కాస్త నిరాశకు గురిచేస్తోంది.* ‘మురారి’ హిట్ అయ్యింది.. కానీ నా కెరీర్ ఆగిపోయింది: రఘుబాబు షాకింగ్ కామెంట్స్ ఓటీటీ స్ట్రీమింగ్ ఆలస్యంఫిల్మ్ నగర్ సమాచారం ప్రకారం.. ‘పెద్ది’ చిత్ర డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ అంతర్జాతీయ ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ భారీ ధరకు కైవసం చేసుకుంది. జూన్ 4న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా, నాలుగు వారాల థియేట్రికల్ రన్‌ను పూర్తి చేసుకుని 2026, జూలై 2 నుంచే ఓటీటీలోకి వచ్చేస్తుందని గతంలో పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. నెట్టింట దీనిపై ఎన్నో కథనాలు కూడా హల్చల్ చేశాయి. కానీ, తాజా బజ్ ప్రకారం ఈ సినిమా ఓటీటీ విడుదలను మేకర్స్ మరో రెండు వారాల పాటు ముందుకు నెట్టినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అందుతున్న లీకుల మేరకు, జూలై 2కి బదులుగా జూలై 16 నుండి ‘పెద్ది’ చిత్రాన్ని నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులోకి తీసుకురావాలని సదరు సంస్థ యోచిస్తోందట. అయితే దీనిపై నెట్‌ఫ్లిక్స్ నుంచి కానీ, నిర్మాణ సంస్థ నుంచి కానీ ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. పూర్తి క్లారిటీ రావాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.* జీవితాంతం ఆ కఠినమైన డైట్ తప్పదు.. సమంత హెల్త్ కండిషన్‌పై చేదు నిజాలు పంచుకున్న నందిని రెడ్డిమరోవైపు ఈ సినిమా హిందీ వెర్షన్ స్ట్రీమింగ్కు సంబంధించి కూడా ఒక ఆసక్తికరమైన అప్డేట్ వినిపిస్తోంది. తెలుగుతో పాటు ఇతర దక్షిణాది భాషలన్నింటినీ జూలై 16న రిలీజ్ చేసినా.. హిందీ వెర్షన్‌ను మాత్రం కాస్త ఆలస్యంగా అంటే జూలై 30 న విడుదల చేసే ఆలోచనలో ఉన్నారట. ప్రస్తుతం ఈ సినిమా ఉత్తరాదితో పాటు కొన్ని ప్రధాన కేంద్రాలలో ఇంకా విజయవంతంగా ప్రదర్శించబడుతోంది. థియేట్రికల్ వసూళ్లకు ఎలాంటి గండి పడకూడదనే ఉద్దేశంతోనే డిజిటల్ రిలీజ్ డేట్స్‌ను సవరించినట్లు టాక్ నడుస్తోంది. తెలంగాణలో తగ్గిన టికెట్ ధరలుఓటీటీ విడుదల ఆలస్యమవుతుందనే వార్తతో నిరుత్సాహపడిన అభిమానులకు చిత్ర బృందం ఒక అదిరిపోయే శుభవార్తను అందించింది. థియేటర్లలో ఇంకా సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతున్న ఈ సినిమాను సాధారణ, కుటుంబ ప్రేక్షకులకు మరింత చేరువ చేయాలనే లక్ష్యంతో మేకర్స్ ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణ వ్యాప్తంగా ఉన్న సింగిల్ స్క్రీన్ థియేటర్లలో టికెట్ రేట్లను భారీగా తగ్గిస్తూ అధికారిక ప్రకటన విడుదల చేశారు. తెలంగాణలోని సింగిల్ స్క్రీన్లలో ‘పెద్ది’ సినిమా టికెట్ ధరను కేవలం రూ. 105 గా నిర్ణయించారు. అలాగే లోయర్ క్లాస్ టికెట్ ధరను సామాన్యులకు సైతం అందుబాటులో ఉండేలా కేవలం రూ. 50కే ఫిక్స్ చేశారు. ఇప్పటికే ఒకసారి టికెట్ ధరలు తగ్గించినప్పటికీ, థియేటర్ల వద్ద మెగా హంగామా ఇలాగే కొనసాగేందుకు మేకర్స్ మరోసారి రేట్లు తగ్గించడం విశేషం.