
వెనిజులాలో గత మే నెలలో గుండెపోటుతో మరణించినట్లు చెబుతున్న ఒక భారతీయ నావికుడి (సీఫేరర్) 33 ఏళ్ల రాకేష్ చౌహాన్ అనుమానాస్పద మరణంలో మరిన్ని సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి.
Jul 1 2026 12:19 PM | Updated on Jul 1 2026 12:24 PM
వెనిజులాలో గత మే నెలలో గుండెపోటుతో మరణించినట్లు చెబుతున్న ఒక భారతీయ నావికుడి (సీఫేరర్) 33 ఏళ్ల రాకేష్ చౌహాన్ అనుమానాస్పద మరణంలో మరిన్ని సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. దక్షిణ అమెరికా దేశం నుండి స్వదేశానికి తీసుకువచ్చిన రాకేష్ చౌహాన్ కుటుంబ సభ్యులు అతని మృతదేహంలో మెదడు, గుండె, ఊపిరితిత్తులతో సహా పలు అంతర్గత అవయవాలు మాయమయ్యాయని ఆరోపించారు.
కుటుంబ సభ్యుల డిమాండ్ మేరకు భారతదేశంల నిర్వహించిన పునర్-పోస్ట్‌మార్టం (Re-autopsy) నివేదికలో వెల్లడైన విషయాలు అత్యంత దిగ్భ్రాంతికరంగా మారాయి. ఈ పరిణామాల నేపథ్యంలో రాకేష్ మరణానికి దారితీసిన పరిస్థితులపై సమగ్ర విచారణ జరపాలని 'ఫెడరేషన్ ఆఫ్ సీఫేరర్స్ యూనియన్స్ ఆఫ్ ఇండియా' (FSUI) డిమాండ్ చేసింది. ఎక్స్ ఖాతా ద్వారా ఈ విషయాన్ని వెల్లడిస్తూ, వెనిజులా అధికారులు ఎలాంటి పోస్ట్‌మార్టం నివేదిక లేదా వివరాలు ఇవ్వకుండానే రాకేష్ చౌహాన్ భౌతికకాయాన్ని ఉత్తరప్రదేశ్‌లోని డియోరియాలో ఉన్న అతని స్వగ్రామానికి పంపించారని FSUI పేర్కొంది.
FSUI పోస్ట్ ప్రకారం మృతదేహంలో ఒక్క అవయవం కూడా లేదు. మెదడు, గుండె, రెండు ఊపిరితిత్తులు, కాలేయం (లివర్), మూత్రపిండాలు (కిడ్నీలు), ప్లీహం (స్లీన్), క్లోమం (పాంక్రియాస్), ప్యాంక్రియాస్, కడుపు, ప్రేగులు... ఇలా అన్నీ మాయమయ్యాయి. అలాగే థైరాయిడ్, హయాడ్ ఎముక, లారింక్స్, శ్వాసనాళం కూడా లేవు. మృతదేహంపై గతంలోనే భారీగా కుట్లు వేసి ఉన్నాయి. మెడ నుండి ప్యూబిక్ సింఫిసిస్ వరకు 22 కుట్లు, ఒక చెవి నుండి మరో చెవి వరకు 21 కుట్లు ఉన్నాయి. మరణానికి ముందు జరిగిన గాయాల గుర్తులేవీ లేవు. మృతదేహాన్ని దాదాపు నెల రోజుల పాటు డీప్ ఫ్రీజర్‌లో ఉంచారు. శరీరంలో ఎలాంటి అవయవాలు లేకపోవడం వల్ల మరణానికి గల ఖచ్చితమైన కారణాన్ని నిర్ధారించలేక పోయారు.
ఇది ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదు. సముద్రయాన కార్మికులు బలిపశువులుగా మారుతున్నారు. వెనిజులా అధికారుల నుండి పూర్తి విచారణ, జవాబుదారీతనం, వెనిజులాలోని భారత రాయబార కార్యాలయం తక్షణమే జోక్యం చేసుకొని, పూర్తి శవపరీక్ష నివేదిక, మరణానికి గల కారణాలు,, కుటుంబానికి న్యాయంతో పాటు నష్టపరిహారం అందించాలని డిమాండ్ చేసింది.విదేశాల్లో భారతీయ కార్మికులను చూసే విధానం, పారదర్శకత మరియు విదేశీ అధికారుల బాధ్యతలపై ఈ ఘటన అనేక తీవ్రమైన ప్రశ్నలను లేవనెత్తుతోందని నావికుడి కుటుంబ సభ్యులు, సంఘాల ప్రతినిధులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇదీ చదవండి: అయోధ్య విరాళాల స్కామ్ : మాజీ ట్రస్టీకి బిగుస్తున్న ఉచ్చు
కాగా యూపీలోని డియోరియా, లగ్దా బజార్ టోలా నివాసి అయిన చౌహాన్, నవంబర్ 2025లో ఒక వాణిజ్య నౌకాదళ నౌక సిబ్బందిలో భాగంగా వెనిజులాకు వెళ్లారు. రాకేష్‌ను ఆ నౌకలో పంపిన సంస్థ ఎక్స్ఫినిటీ. కుటుంబ సభ్యుల సమాచారం ప్రకారం నౌకపై పడిన రాకేష్ గాయపడ్డారని చికిత్స పొందుతున్నారని తొలుత సమాచారం అందించిన కంపెనీ అధికారులు,ఆ మరుసటి రోజు ఉదయం, చౌహాన్ బతికే అవకాశాలు 95 శాతం లేవని, సాయంత్రానికి కంపెనీ ఆయన మరణాన్ని ధృవీకరించింది. మరణానికి గల కారణం గురించి కుటుంబ సభ్యులు ఆరా తీయగా, కింద పడటం వల్ల కలిగిన తీవ్ర గాయాల కారణంగానే ఆయన చనిపోయారని కంపెనీ పేర్కొంది. అలాగే వారంరోజుల్లో మృతదేహాన్ని అప్పగిస్తామన్న కంపెనీ దాదాపు ఒక నెల తర్వాత, అంటే జూన్ 4న మృతదేహం డియోరియాకు చేరింది.
ఇదీ చదవండి: కేతన్ హత్య కేసులో మరో ట్విస్ట్ : రూ. 10 కోట్ల డిఫమేషన్
ప్రేమలో పడిన యంగ్ హీరోయిన్.. ప్రియుడు ఇతడే (ఫొటోలు)
సత్యదేవ్ ‘రావు బహదూర్’ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.. (ఫోటోలు)
అక్కినేని అఖిల్ ‘లెనిన్’ మూవీ HD స్టిల్స్
‘హ్యాంగ్‌మ్యాన్’ మూవీ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ (ఫొటోలు)
ఆ 70 వేల సీసీ కెమెరాలు ఏమైపోయాయి?.I 18 నెలలుగా సీసీటీవీ ఫుటేజ్ మాయం...
సాయి కృష్ణ కేసులో సిట్ రిమాండ్ రిపోర్ట్ చూపిస్తూ బాబుకు వైఎస్ జగన్ సూటి ప్రశ్నలు
క్రిమినల్స్ అయితే ఎందుకు పిలిచి ముసలి కన్నీరు కార్చుతున్నావ్
అమ్మతోడు జరిగింది ఇదే! డెలివరీ బాయ్ దాడిపై హీరో అఖిల్ రాజు క్లారిటీ