
దురిశెట్టి ధర్మరాజు జీ తెలుగు న్యూస్ (zee telugu news)లో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు దాదాపు జర్నలిజంలో నాలుగు సంవత్సరాల పాటు అనుభవం ఉంది.
ఇక్కడ సోషల్, ఆస్ట్రాలజీ, టెక్నాలజీ, ఆటోమొబైల్స్, బిజినెస్, జాతీయం అంశాలకు సంబంధించిన తాజా వార్తలతో పాటు విశ్లేషణ పూరితమైన కథనాలను అందిస్తారు. అలాగే ఆయనకు వెబ్‌సైట్‌కు సంబంధించిన వీడియో కంటెంట్‌పై కూడా అవగాహన ఉంది..
Rahu Transit In Dhanishta Nakshatra 2026 Telugu: జ్యోతిష్య శాస్త్రంలో అత్యంత ప్రభావవంతమైన గ్రహంగా భావించే రాహువు తన నక్షత్ర సంచారం చేశాడు.. 2026 జూన్ 30 మంగళవారం రోజున రాహువు కుంభ రాశి నుంచి ధనిష్ఠ నక్షత్రంలోకి ప్రవేశించాడు.. ఈ నక్షత్రంలో రాహువు గ్రహం డిసెంబర్ 2026 వరకు సంచార దశలో ఉంటాడు.. రాహువు ఈ నక్షత్ర సంచారం అన్ని రాశుల వారి ఆరోగ్యం, ఉద్యోగం, ఆర్థిక స్థితితో పాటు కుటుంబ సంబంధాలపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. అయితే, ముఖ్యంగా మూడు రాశుల వారికి ఈ సమయం ఎంతో అదృష్టాన్ని, విజయాలను తెచ్చిపెట్టబోతోంది.. మంగళవారం నుంచి ఈ రాశుల వారికి హనుమంతుడి అనుగ్రహంతో పాటు రాహువు ప్రత్యేక అనుగ్రహం లభించి.. ఈ సమయం కొన్ని రాశులవారికి గోల్డెన్ పీరియడ్‌గా ఉండబోతోంది. అయితే, ఈ సమయంలో ఏయే రాశులవారికి చాలా శుభప్రదంగా ఉంటుందో? అదృష్టాన్ని పొందే రాశులేవో పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
మేష రాశి (Aries) మేష రాశి వారికి రాహువు నక్షత్ర సంచారంతో ఈ సమయం అత్యంత లాభదాయకంగా ఉంటుంది.. సుదీర్ఘకాలంగా నిలిచిపోయిన పనులు మళ్లీ వేగం ప్రారంభమవుతాయి.. ఆదాయానికి కొత్త మార్గాలు సులభండా తెరుకుకుంటాయి. మీ కష్టానికి తగిన ప్రతిఫలం లభించే అవకాశాలు కనిపిస్తున్నాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. కార్యాలయంలో ఉన్నతాధికారుల నుంచి పూర్తి సపోర్ట్ కూడా అందుతుంది.. కష్ట సమయాల్లో నమ్మకమైన స్నేహితుడు లేదా సన్నిహితుడి సహాయం మీకు కొండంత బలాన్ని అందిస్తుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు ఈ కాలం ఎంతో అనుకూలంగా ఉంటుంది. అలాగే వారు ఆశించిన మంచి ఫలితాలు కూడా పొందుతారు.
సింహ రాశి (Leo) సింహ రాశి వారికి ఈ నక్షత్ర సంచారం అదృష్టాన్ని రెట్టింపు చేయడమే కాకుండా.. ఆర్థికంగా ఎదగడానికి సరికొత్త అవకాశాలను అందిస్తుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. ఉద్యోగస్తులకు ప్రమోషన్ లేదా అదనపు బాధ్యతలు దక్కే అవకాశాలు కూడా ఉన్నాయని జ్యోతిష్యులు చెబుతున్నారు. అలాగే మీ ఆత్మవిశ్వాసాన్ని మరింత పెంచుతుంది. గతంలో చేసిన పెట్టుబడుల నుంచి మంచి లాభాలు కూడా కలుగుతాయి. కుటుంబంలో సుఖసంతోషాలు ఊహించని స్థాయిలో పెరుగుతాయి. మనస్సు ప్రశాంతంగా కూడా మారుతుంది.. దీర్ఘకాలికంగా వేధిస్తున్న కుటుంబ సమస్యలన్నింటికీ ఈ సమయంలో పరిష్కారం అవుతాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు.
తులా రాశి (Libra) తులా రాశి వారికి రాహువు ధనిష్ఠ నక్షత్ర సంచారం కారణంగా కెరీర్, వ్యాపార రంగాలలో సానుకూల మార్పులను తీసుకు వస్తుందని జ్యోతిష్యులు తెలుపుతుపున్నారు. వ్యాపారస్తులు ఈ సమయంలో చేసే సుదూర ప్రయాణాల వల్ల భారీగా లాభాలను కూడా అందిస్తాయి.. సమాజంలో కొత్త పరిచయాలు కూడా విపరీతంగా ఏర్పడతాయి. ఇవి భవిష్యత్తులో మీకు ఎంతగానో ఉపయోగపడే అవకాశాలు ఉన్నాయి. వ్యాపారాన్ని విస్తరించడానికి ఊహించని అవకాశాలు లభిస్తాయి. కొత్త ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి మెరుగైన ప్యాకేజీతో కూడిన మంచి అవకాశాలు కూడా లభించబోతున్నాయి. ఈ కాలంలో చేసే ప్రయాణాలు మీ భవిష్యత్తుకు బంగారు బాటలు వేస్తాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.