
fire accident In Rajasthan| రాజస్థాన్‌లోని దౌసా జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. దిల్లీ - ముంబయి ఎక్స్‌ప్రెస్‌వేపై ధనవాడ సమీపంలో బుధవారం ఉదయం ఇందౌర్‌కు చెందిన స్లీపర్ బస్సు..
ట్రక్కును వెనుక నుంచి ఢీకొట్టింది. దీంతో బస్సులో భారీగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో 8 మంది మృతి చెందారు. మరో 29 మంది ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. వీరిలో కొందరి పరిస్థతి విషమంగా ఉన్నట్లు సమాచారం. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.
తెల్లవారుజామున 2.30 గంటల సమయంలో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. బస్సు రిషికేష్ నుంచి ఇందౌర్ వెళ్తుండగా ప్రమాదం జరిగింది. ఘటనపై దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. డ్రైవర్ నిద్రమత్తులో ఉన్నడా..? ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా? అనే కోణంలో విచారిస్తున్నామన్నారు. ఐదుగురు ప్రయాణికులు మంటల్లోనే సజీవ దహనం అయ్యారని.. మరో ఇద్దరు తీవ్రగాయాలై మృతి చెందినట్లు పోలీసులు వెల్లడించారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.