
తనకు అవకాశాలు తగ్గిపోవడానికి ప్రధాన కారణం సినీ నేపథ్యం లేకపోవడమేనని యంగ్ హీరోయిన్ దివ్యభారతి ఆవేదన వ్యక్తం చేశారు.
జీవీ ప్రకాష్ కుమార్ హీరో నటించిన 'బ్యాచిలర్ వంటి హిట్ చిత్రం తర్వాత కూడా తనకు అవకాశాలు తగ్గిపోవడానికి ప్రధాన కారణం సినీ నేపథ్యం లేకపోవడమేనని యంగ్ హీరోయిన్ దివ్యభారతి (Divya Bharathi) ఆవేదన వ్యక్తం చేశారు.
ఆమె తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో.. 'జీవీ ప్రకాష్ నటించిన 25వ చిత్రం కింగ్స్టన్ మంచి చిత్రంగా ఉంటుందని ఊహించాం. కానీ, ఎక్కడో మా అంచనాలను తలకిందులు చేసింది. 'బ్యాచిలర్' మూవీ హిట్ తర్వాత నాకు సినిమా అవకాశాలు వస్తాయని ఎదురుచూశా కానీ, అందుకు విరుద్ధంగా జరిగింది. దీనికి కారణం సినీ నేపథ్యం లేకపోవడమే.
ఒక చిత్ర విజయం తర్వాత ఆకాశాలు వస్తాయని గట్టినా నమ్మా. ఇది ఓవర్ కాన్ఫిడెన్స్ కాదు. ఇండస్ట్రీపై ఉన్న నమ్మకం. కానీ, అవకాశాల కోసం మనమే వ్యవస్థను ఏర్పరచుకుని, వెంపర్లాడాలని ఆ తర్వాతే అర్థమైంది' అని తన మనసులోని అవేదనను వ్యక్తం చేశారు.
కాగా, తాజాగా ఆమె నటించిన 'విలంగు' వెబ్ సిరీస్ జియో హాట్ స్టార్ (Jio Hotstar) ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ఇక తెలుగులో అరంగేట్రం చేస్తూ సుడిగాలి సుధీర్‌తో చేసిన గోట్ సినిమా ఇంతవరకు రిలీజ్‌కు నోచుకోక పోవడం గమనార్హం.