
జోతిష్యశాస్త్రంలో గ్రహాలు తరుచూ మారుతూనే ఉంటాయి. అలా కదులుతున్నప్పుడు ఒక్కోసారి వేరే గ్రహాలతో కలుస్తూ ఉంటాయి. ఆగస్టు నెలలో రెండు శత్రు గ్రహాల కలయిక ఏర్పడనుంది.
విరుద్ధ భావాలు ఉన్న బుధుడు,కుజుడు కలిసి సంచరించనున్నాయి. వీటి కలయిక కారణంగా 5 రాశులకు అపారమైన లాభాలు కలగనున్నాయి. ధన లాభంతో పాటు.. మంచి పురోగతి లభిస్తుంది. ఆ రాశులేంటో ఇప్పుడు చూద్దాం...
బుధుడు, కుజుడు కలయిక కారణంగా మేష రాశివారికి చాలా అద్భుతంగా ఉంటుంది.ఈ సమయంలో ఈ రాశివారికి శత్రువులు కూడా మిత్రువులు అవుతారు. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. పెండింగ్ లో ఉన్న పనులన్నీ పూర్తి అవుతాయి. ఖర్చులు తగ్గుతాయి. ఆదాయం పెరుగుతుంది. ఉద్యోగంలో మంచి పురోగతి సాధిస్తారు. వ్యాపారంలోనూ మంచి లాభాలు అందుకుంటారు.ఆరోగ్యం మెరుగుపడుతుంది
బుధ, కుజ గ్రహాల కలయిక వృషభ రాశివారికి కూడా చాలా అనుకూలంగా ఉంటుంది.ఈ సమయంలో ఈ రాశివారు డబ్బు చాలా ఎక్కువగా సంపాదిస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది ఆదాయం రెట్టింపు అవుతుంది. సమాజంలో గౌరవ, మర్యాదలు పెరుగుతాయి. అందరూ ఈ రాశివారిని ప్రశంసిస్తారు. గతంలో ఏవైనా అప్పులు చేసి ఉంటే.. ఆ అప్పులు ఈ సమయంలో తీర్చేస్తారు.
బుధ, కుజ గ్రహాల కలయిక కన్య రాశివారి జీవితంలో అద్భుతాలు తీసుకురానుంది. కొత్తగా వ్యాపారం ప్రారంభించాలి అనుకునేవారికి ఇది సరైన సమయం. గతంలో పెట్టిన పెట్టుబడుల నుంచి ఇప్పుడు మంచి లాభాలు అందుకుంటారు. వైవాహిక జీవితంలో సమస్యలు తీరిపోతాయి.ఆరోగ్యం మెరుగుపడుతుంది.
బుధ, కుజ గ్రహాల కలయిక కారణంగా ధనుస్సు రాశివారికి చాలా అనుకూలంగా ఉంటుంది. ఆర్థికంగా ఈ సమయంలో బాగా కలిసొస్తుంది. ఆగిపోయిన పనులు పూర్తి చేయగలుగుతారు. కొత్త పెట్టుబడులు పెట్టడానికి ఇది చాలా సమయం. ఆరోగ్యం మెరుగుపడుతుంది. కష్టానికి తగిన గుర్తింపు పొందుతారు.
శత్రు గ్రహాలైన బుధ, కుజ కలయిక కారణంగా.. మీన రాశివారికి చాలా అనుకూలంగా ఉంటుంది.కుటుంబంలో సంతోషం, ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఆకస్మికంగా ఆర్థికంగా లాభాలు పొందుతారు. ఉద్యోగంలో ప్రమోషన్ అందుకుంటారు. మంచి పురోగతి సాధిస్తారు.మీ కలలు, కోరికలు అన్నీ నెరవేరతాయి.