మొత్తానికి మన వంటలక్క సీఈవో అయిపోయింది. వంటగదిలో గరిటె వదిలేసి.. సీఈవో కుర్చీ ఎక్కేసింది. తాను సీఈవో అవ్వడం కాదు.. జోత్స్నని తన అసిస్టెంట్‌గా పెట్టుకోవడం నిన్నటి ఎపిసోడ్లో హైలైట్.
ఇక ఈరోజు (జూలై 01) రాత్రి ప్రసారం కాబోయే ఎపిసోడ్లో ఏమైందంటే.. ‘నేనేంటీ దీపకి అసిస్టెంట్‌ని ఏంటీ? అని జ్యోత్స్న నోరెళ్లబెడుతుంది. ‘అవును.. అసిస్టెంట్‌వే.. అని తెగేసి చెప్తాడు శివన్నారాయణ. ‘ఏంటండీ ఇదీ? అంటూ పారిజాతం గొంతెత్తుతుంది. ‘నువ్వు మౌనంగా ఉండకపోతే నీకు కూడా ఓ లిస్ట్ ప్రిపేర్ చేస్తానని నోరు మూయిస్తాడు శివన్నారాయణ. ఇక కార్తీక్ మిగిలిన కండిషన్స్ చదువుతుంటాడు. ‘జోత్స్న.. దీపకి పర్సనల్ అసిస్టెంట్ కాబట్టి.. దీపకంటే ముందే ఆఫీస్‌కి రావాలి. దీప వెళ్లిన తరువాతే వెళ్లాలి. దీప ఎన్నిగంటలు ఆపీస్లో ఉంటే జోత్స్న కూడా అంతసేపూ ఉండాల్సిందే. సీఈవో ఏ వర్క్ చెప్తే ఆ వర్క్ చేయాలి.. కాదూ కూడదు అని అనకూడదు. ఈరోజు నుంచి జ్యోత్స్నకి ఎటువంటి సౌకర్యాలు ఉండవు. కనీసం కారు, డ్రైవర్ కూడా ఉండడు. జ్యోత్స్న అకౌంట్స్ అన్నీ బ్లాక్ చేయబడతాయి. పర్సనల్‌గా డబ్బులు వాడటానికి వీళ్లేదు. అప్పులు చేయడానికి వీళ్లేదు.. తప్పులు చేయడానికి అస్సలు వీళ్లేదు.జ్యోత్స్నకి జీతం మాత్రమే.. ఎంతనేది దీపే నిర్ణయిస్తుంది.. పాపం రేయ్ ప్రతినెలా జీతం మాత్రమే వస్తుంది. ఆ జీతంతోనే తన అవసరాలు తీర్చుకోవాలి. ప్రతిభ ఆధారంగా జీతం ఇవ్వబడుతుంది. అది ఎంత అనేది సీఈవో దీప నిర్ణయిస్తుంది. వీటిలో ఏవైనా తేడాలొస్తే చైర్మన్ కఠిన నిర్ణయాలు తీసుకుంటారు. ఈ నియమ నిబంధనలు నచ్చకపోతే జ్యోత్స్న సంస్థ నుంచి వెళ్లిపోవచ్చు. ఆఫీస్ నుంచి వెళ్లిపోవాలనుకుంటే ఇంట్లో కూడా చోటు ఉండదు. జ్యోత్స్నలో సత్ప్ర వర్తనను యాజమాన్యం గుర్తించే వరకూ .. ఈ నియమ నిబంధను అమలులోనే ఉంటాయి. ఇట్లు సంస్థ చైర్మన్ శివన్నారాయణ’ అంటూ మొత్తం చదివి వినిపిస్తాడు కార్తీక్. విన్నావ్ కదా.. వీటన్నింటికీ నీకు సమ్మతం అయితే సంతకం పెట్టు లేదంటే.. బయటకు అడుగుపెట్టు అని అంటాడు శివన్నారాయణ.సంతకం పెడతావా.. బయటకు పోతావా? నిర్ణయించుకో మనవరాలికి ఇంత పెద్ద శిక్ష వేయడం తప్పండీ అని అంటుంది పారిజాతం. దాంతో శివన్నారాయణ.. పూర్వం రాజులు వాళ్ల వారసుల్ని మంచి చెడులు తెలుసుకోవాలని.. రాజ్యానికి దూరంగా జనావాసంలో వదిలిపెట్టేవారు. కష్టాలను తట్టుకుని ఎదగాలని.. తన రాజ్యాన్ని వెతుక్కుంటూ రావాలని.. తన రాజ్యంలో అడుగుపెట్టాలని అలా చేసేవారు అని అంటాడు. దీప అలాగే ఎదిగింది తాతా.. తన రాజ్యంలో అడుగుపెట్టింది అని దీపకి ఎలివేషన్స్ ఇచ్చుకుంటాడు కార్తీక్. చూడు జ్యోత్స్నా.. నీకు ఇష్టమైతే సంతకం పెట్టు.. లేదంటే బయటకు వెళ్లు అని అంటాడు. దాంతో జో.. చచ్చినట్టు సంతకం పెడుతుంది. మనల్ని ఎవడ్రా ఆపేదీ.. ‘మిమ్మల్ని ఒకడు ఆపాలేంట్రా.. మిమ్మల్ని మీరే ఆపేసుకుంటారు’ ఈ సవాల్‌ని స్వీకరిస్తున్నా.. అని అంటుంది జ్యోత్స్న. ‘వెరీ గుడ్.. నువ్వు ఈరోజు నుంచే బాధ్యతల్ని తీసుకోవచ్చు.. నువ్వు నాతో రా కార్తీక్’ అని వెంటపెట్టుకుని వెళ్తాడు శివన్నారాయణ. ఇక జ్యోత్స్న దీప వైపు కోపంగా చూస్తుంటుంది. అనంతరం తనకి జరిగిన అవమానాన్ని తలుచుకుని క్యాంటీన్లో రగిలిపోతూ ఉంటుంది జో పాప. ఇంతలో మన సూరజ్ వెళ్లి.. ‘ఏంటీ సీఈవో గారికి డీఏ గారూ అంటూ రెచ్చగొడతాడు ఆమె రెచ్చిపోతుంటుంది. వీళ్ల మధ్య ఎప్పుడూ ఉండేదే ఈ సోది అన్నట్టుగా ఉంటుంది ఈ సీన్. నన్ను ఆపేది ఎవర్రా అని జో అంటే.. ‘నీ అహంకారం, నీ బలుపే నిన్ను ఆపుతాయి’ అని అంటాడు సూరజ్. నా పొగరే నా ఐడెండిటీ.. తగ్గేదేలే చెప్పావ్‌లే కానీ సోదీ పోరా.. ఎక్కడ నుంచో వచ్చి నా కోటల్ని బద్దలు కొట్టారు. నా గౌరవాన్ని లాగేసుకుంటానంటే చూస్తూ ఊరుకుంటానని అనుకున్నారా? గ్రానీ చేసిన చిన్న తప్పు వల్ల.. సీఈవో కావాల్సిన నన్ను అసిస్టెంట్‌ని చేసింది. నన్ను ఎంత తొక్కాలని చూస్తే.. అంత కసిగా పైకి ఎదుగుతాను’ అని అంటుంది జో. ఈ పొగరు తగ్గించుకోకపోతే.. ఇంకా నాశనం అయిపోతావ్ అని అంటాడు సూరజ్. ఐ డోన్ట్ కేర్.. నేను ఇలాగే బతుకుతా.. నాకు నచ్చినట్టే బతుకుతా.. నా పొగరే నా ఐడెండిటీ.. అని అంటుంది జో. సరే ఈరోజు నుంచి నీకు ఉంటుంది అని అంటాడు సూరజ్. ఇంతలో కార్తీక్ ఫోన్ చేసి.. మేడమ్ గారితో చాలా పని ఉంది.. తీసుకుని రా అని అంటాడు. డీఏ గారికి స్పెషల్ సీటు.. ‘రేయ్ నా రేంజ్ ఏంటీ.. నాకు ఈ కుర్చీ ఏంటీ’?? పద పదా.. పిలుస్తున్నారు డీఏ అని జోకి చిరాకు తెప్పిస్తాడు సూరజ్. ఇక జ్యోత్స్న రాగానే.. ఇదిగో నీ సీటు.. నువ్వు ఇక్కడే కూర్చోవాలి అంటూ జోత్స్నని ఘోరంగా అవమానిస్తాడు కార్తీక్. అయితే జోత్స్న అవమానాన్ని భరిస్తూనే ఆ కుర్చీలో కూర్చొంటుంది. అది చూసిన పారూ.. ‘రేయ్.. నువ్వు జోత్స్నకి అగ్రిమెంట్ ఉన్న బానిసవి.. జోత్స్న ఏమో నీ పెళ్లాలనికి అగ్రిమెంట్ లేని బానిస’ అని అంటుంది. దీన్నే అంటారు పారూ.. కర్మ రిటర్స్ అని అంటాడు కార్తీక్. ఇది కర్మ రిటర్స్లా లేదు.. దీపా రిటర్న్స్లా ఉంది అని అంటుంది పారిజాతం. ఇక కార్తీక్ ఓ వైపు.. సూరజ్ మరో వైపు తగులుకుని.. జోత్స్నతో చెడుగుడు ఆడుకుంటారు. రేయ్ పాపంరా.. ఈ ఘోరాన్ని చూడలేం ఇంతలో దీప కాలింగ్ బెల్ మోగిస్తుంది. జోత్స్నని పిలుస్తుంది. దీప బెల్ కొట్టగానే.. జ్యోత్స్న వెళ్లాలి. బెల్ మోగగానే వెళ్లాల్సిందే ఈ ఐడియా ఇచ్చింది మాత్రం నేనే అని అంటాడు సూరజ్. ఇక దీప.. బెల్ని మోగిస్తూనే ఉంటుంది. జ్యోత్స్న చచ్చినట్టు వెళ్లి.. ‘ఎందుకు పిలిచావ్ అని అడుగుతుంది. హా.. ఈ బెల్ పని చేస్తుందా? లేదా అని టెస్ట్ చేస్తున్నా అని అంటుంది దీప. అది విన్న పారూ.. ఈ ఘోరాల్ని చూడలేను.. పోతాను ఇంటికి పెతాను అని ఇంటికి వెళ్లిపోతుంది. ఈ సీన్ చూసిన జనాల పరిస్థితి కూడా ఇదే. ఇంతలో కార్తీక్ వచ్చి.. ఆ బెల్ని తీసుకుని మళ్లీ వాయిస్తాడు. ఓరి దీని బిల్డప్పో.. కోతికి కొబ్బరికాయ దొరికినట్టుగా దీప సీఈవో కాగానే ఓవరాక్షన్ జ్యోత్స్న మళ్లీ వచ్చి.. ఈసారి ఎందుకు పిలిచారు అని అడుగుతుంది. ‘ఈసారి నేను టెస్ట్ చేశాను’ అని అంటాడు కార్తీక్. అర్థమైంది నాతో బాగా ఆడుకుంటున్నారని అని ఆవేశంగా వెళ్లిపోతుంది జోత్స్న. ఇంతలో దీప మళ్లీ కాలింగ్ బెల్ మోగించి.. ఈసారి మాత్రం నేనే మోగించా.. అంతా బాగానే ఉంది కానీ.. ఒకటి తగ్గింది అని అంటుంది దీప. ఇంతలో బాయ్ వచ్చి మేడమ్ కాఫీ.. మేడమ్ మేడమ్’ అని అంటాడు. ఇప్పుడు అర్థమైందా? ఏం తగ్గిందో అని జో వైపు చూసి అంటుంది దీప. అంటే రెస్పెక్ట్ తగ్గింది.. మేడమ్ అని పిలువు అని ఇన్ డైరెక్ట్‌గా చెప్తుంది దీప. బలుపు చూపించిన దీప.. కార్తీక్ సెల్ఫీలు దాంతో జోత్స్న.. ‘అర్థమైంది మేడమ్’ అని అంటుంది. దాంతో దీప.. కాలుమీద కాలేసుకుని.. ‘వెరీ గుడ్.. వెళ్లీ.. దేవుడికి దండం పెట్టుకుని వర్క్ స్టార్ట్ చేయి అని బలుపు చూపిస్తుంది దీప. ఇక ఈ మధ్య కామెడీ పీస్‌లా మారిన కార్తీక్.. ‘ఆహా సీఈవో గారూ.. కాలు మీద కాలేసుకుంటే పోస్టర్ అద్దిరిపోయిందీ.. అంటూ సెల్పీలు తీస్తాడు. అది చూసి జ్యోత్స్న కోపంతో వెళ్లిపోతుంది. జో పాప తట్టుకోలేకపోతుంది బావా అని దీప అంటే.. ఇది ఆరంభం మాత్రమే.. ముందు ఉంది ముసళ్ల పండగ’ అని అంటాడు కార్తీక్. ఇక కార్తీక్, దీపలతో కలిసి భోజనం చేస్తుంటే దీప మెడలో తాళిని చూస్తుంది జోత్స్న. తన మెడలో పడాల్సిన తాళి దీని మెడలో పడిందని.. దీన్ని చూసుకునే కదా నీ పొగరు అని మరో కుట్రకి తెరతీసింది జోత్స్న.