
హైదరాబాద్‌లో కాల్పులు కలకలం రేపాయి.. మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ భూష్మి శ్రీకాంత్‌ను పట్టుకునే క్రమంలో.. ఎదురు తిరగడంతో పోలీసులు ఆత్మరక్షణ కోసం కాల్పులు జరిపారు.. ఈ కాల్పుల్లో నిందితుడితోపాటు..
కానిస్టేబుళ్లకు కూడా గాయాలయ్యాయి.. గత నాలుగు రోజుల నుంచి వేట ప్రారభించిన పోలీసులు ఎట్టకేలకు కరుడుగట్టిన క్రిమినల్ ను పట్టుకున్నారు. నాలుగురోజుల నుంచి క్రిమినల్ భూష్మీ శ్రీకాంత్ పోలీసులకు చుక్కలు చూపిస్తున్నాడు.. ఈ క్రమంలోనే.. ORRదగ్గర శ్రీకాంత్ ఉన్నట్లు పోలీసులకు సమాచారం అందడంతో.. పోలీసులు అక్కడకు చేరుకున్నారు. నిందితుడు ప్రయాణిస్తున్న డీసీఎం వాహనాన్ని అడ్డగించారు. అయితే పోలీసులను చూసిన శ్రీకాంత్ తప్పించుకునేందుకు ప్రయత్నించడమే కాకుండా, వారిపై దాడికి దిగినట్లు సమాచారం. దీంతో పరిస్థితి అదుపుతప్పుతుండటంతో పోలీసులు అతడి కాళ్లపై కాల్పులు జరిపారు. ఈ ఘటనలో నిందితుడు గాయపడగా, నల్గొండ సీసీఎస్ హెడ్ కానిస్టేబుల్ విష్ణువర్ధన్ గిరికి కూడా స్వల్ప గాయాలయ్యాయి.
అయితే.. మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ పట్టించింది ఓ దొంగతనం కేసు.. గత నెల 25న గుంటూరు జిల్లా రొంపిచెర్ల మండలం మర్రిచెట్టుపాలెంలోని ఓ కిరాణా షాపులో చోరీ చేశాడు. అర్ధరాత్రి రెండు గంటల సమయంలో షాపు తాళాలు పగులకొట్టి దొంగ తనానికి పాల్పడ్డాడు. గల్లా పెట్టెలోని నగదు, సరుకులను దోచుకెళ్లాడు. ఈ సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా, కిరాణాషాపులో దొరికిన వేలిముద్రల ఆధారంగా పోలీసుల వేట ప్రారంభించారు. గత నాలుగు రోజులుగా అతడి కదలికలపై నిఘా పెట్టిన పోలీసులు అతన్ని ఎట్టకేలకు పట్టుకున్నారు.