
సర్గం రవి కుమార్. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు.
గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.
Telangana Rythu Bharosa: 'తాము బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ఈ 30 నెలల్లో రైతును ఆత్మగౌరవంతో బతికేలా.. వ్యవసాయాన్ని పండుగలా తీర్చిదిద్దడానికి సంపూర్ణంగా ప్రయత్నం చేస్తున్నట్లు తెలంగాణ ముఖ్యమంత్రి తెలిపారు. తెలంగాణ రాష్ట్రం అప్పుల ఊబిలో నిండా మునిగింది. మళ్లీ లేవడానికి వీలులేకుండా అప్పులతో మన్ను కప్పారు. అన్ని రకాల అప్పులను తొవ్వితే గుట్టల కొద్దీ బయటపడ్డాయి. అందిన కాడికి చేబదులు తీసుకువచ్చారు' అని ప్రతిపక్షాలపై విమర్శలు చేశారు.
ఈ ప్రభుత్వం మీది.. ప్రజలది '9 రోజుల్లోనే 9 వేల కోట్ల రూపాయలను రైతు భరోసా కింద చెల్లిస్తాం.. నగదు సిద్ధం చేశాం. ఈ ప్రభుత్వం మీది.. ప్రజలది. ప్రభుత్వం రైతులది, ఆడబిడ్డలది, నిరుద్యోగులది' అని తెలంగాణ సీఎం ప్రకటించారు. '5 వేల పోలీస్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ఇస్తామంటే వద్దని అంటున్నారు. మూసీ వద్దని, మెట్రో వద్దని, రీజనల్ రింగ్ రోడ్డు వద్దని అంటున్నారు. పోర్లు దండాలు పెట్టినా అన్ని పనులు చేస్తా' అని స్పష్టం చేశారు. ప్రభుత్వాన్ని కాపాడుకునే బాధ్యత రైతులదని చెప్పారు.
తెలంగాణను వికాసం వైపు '30 నెలల్లో సమాజంలో గౌరవం పెంచుకుని , విధ్వంసమైన తెలంగాణను వికాసం వైపు నడిపిస్తున్నాం. ఎప్పుడు ప్రజల్లోనే ఉంటున్నాం. తప్పించుకుని తిరగడం లేదు. 25.35 లక్షల మంది రైతులకు ఇరవై వేల కోట్ల రైతు రుణమాఫీ చేశాం. రైతు భరోసా కింద ప్రభుత్వం రాగానే రూ.7 వేల కోట్లు చెల్లించాం. సివిల్ సప్లయీస్ కార్పొరేషన్లో బకాయిలు పెట్టిపోతే 2023లో చెల్లించాం. రైతు భరోసాను రూ.12 వేలకు పెంచి ఇప్పటివరకు రూ.27 వేల కోట్లు రైతు ఖాతాల్లో వేశాం. ఈ విడుతతో కలిసి రూ.36 వేల కోట్ల రైతు భరోసా కింద చెల్లించాం' అని రేవంత్ రెడ్డి లెక్కాపద్దుల చిట్టా విప్పారు.
కాంగ్రెస్ పార్టీ పేటెంట్ 'ఉచిత కరెంటు ను కనిపెట్టిందే కాంగ్రెస్ పార్టీ. ఉచిత కరెంటు కాంగ్రెస్ పార్టీ పేటెంట్. వైఎస్ రాజశేఖర్ రెడ్డి సీఎంగా ప్రమాణ స్వీకారం చేసినప్పుడు ఉచిత కరెంటుతో పాటు విద్యుత్ బకాయిలను రద్దు చేస్తు సంతకం పెట్టారు. కాంగ్రెస్ వస్తే కరెంటు కష్టాలు అని ఇప్పుడు విమర్శిస్తున్నారు. నెలకు రూ.వెయ్యి కోట్లు ఉచిత కరెంటు కోసం ఖర్చు చేస్తున్నాం. ఇప్పటివరకు రూ30 వేల కోట్లు ఖర్చు చేశాం. సన్న వడ్ల బోనస్ కోసం రూ.4 వేల కోట్ల ఖర్చు చేశాం. మూడున్నర వేల కోట్ల రైతు బీమా కోసం ఖర్చు చేశాం. ఇప్పటివరకు లక్షా డెబ్బై ఐదు వేల కోట్లు రైతుల కోసం ఖర్చు చేశాం. నెలకు రూ.6 వేల కోట్లు ఖర్చు పెట్టాం' అని రేవంత్ రెడ్డి వివరించారు.
అబద్దాల పునాదులపై నడపను 'నేను ఉన్నది ఉన్నట్లు చెపుతా.. చేసేది చెపుతా. కిరీటాలు పెట్టుకోవాలి, వజ్ర వైడూర్యాలు సంపాదించాలని నాకు లేదు. పదవి శాశ్వతం కాదు. మాట శాశ్వతం.. మాట కోసం ఎంతకైనా నిలబడతాడు అన్న పేరు కోసం ప్రయత్నం. అబద్దాల పునాదులపైన ప్రభుత్వాన్ని నడపను' అని రేవంత్ రెడ్డి తెలిపారు. 'స్వయం సహాయక మహిళలతో 1000 మెగా వాట్ల సోలార్ ప్లాంట్లను పెట్టించాం. రిలయన్స్‌తో పోటీపడేలా మహిళా సంఘాలతో పెట్రోల్ బంకులు ఏర్పాటు చేయించాం. స్వయం సహాయక మహిళల స్టాల్స్ కోసం రూ.1000 కోట్లు విలువ చేసే స్థలాన్ని శిల్పారామంలో కేటాయించాం. యాదయ్య, యాదిరెడ్డి, ఇషాన్ రెడ్డి, వేణుగోపాల్ రెడ్డి, కానిస్టేబుల్ కిష్టయ్య లాంటి వాళ్లు తెలంగాణ కోసం ఆత్మ బలిదానాలు చేసుకున్నారు' అని తెలంగాణ సీఎం గుర్తుచేశారు. ఇప్పటివరకు 30 నెలల్లో 70 వేల ఉద్యోగాలు ఇచ్చామని డబ్బా కొట్టుకున్నారు. ప్రతి శాఖలో ఉద్యోగాలు భర్తీ చేశాం. మొదటి తారీఖునే జీతాలు ఇస్తున్నామని గొప్పలు చెప్పుకున్నారు. 'కాలానికి తగ్గట్లుగా రైతులు వ్యవసాయాన్ని మార్చుకోవాలి. ఈ సారి వర్షాలు పడవని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. వర్షాలను బట్టి పంటలు వేసుకోవాలి. 7 రకాల సన్న వడ్ల విత్తనాలను రైతు వేదికల్లో అందుబాటులో ఉంచాం.. డిమాండ్ ఉన్న సన్న వడ్లను వేయాలని రైతులకు చెబుతున్నాం' అని తెలంగాణ సీఎం రైతులకు సూచనలు ఇచ్చారు.