
అమెరికాలో సుదీర్ఘ కాలంగా సాగుతున్న సాంస్కృతిక, క్రీడా వివాదానికి ఆ దేశ అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు తెరదించింది.
క్రీడా పోటీల్లో ట్రాన్స్జెండర్ అథ్లెట్లు పాల్గొనకుండా పలు రాష్ట్రాలు విధించిన నిషేధాన్ని సుప్రీంకోర్టు సమర్థించింది.
ఇంటర్నెట్ డెస్క్: అమెరికాలో సుదీర్ఘ కాలంగా సాగుతున్న సాంస్కృతిక, క్రీడా వివాదానికి ఆ దేశ అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు తెరదించింది. ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో నిర్వహించే మహిళల, బాలికల క్రీడా పోటీల్లో ట్రాన్స్జెండర్ అథ్లెట్లు పాల్గొనకుండా పలు రాష్ట్రాలు విధించిన నిషేధాన్ని సుప్రీంకోర్టు సమర్థించింది. ఈ తీర్పుతో రిపబ్లికన్ పార్టీ నేతృత్వంలోని ఐడహో, వెస్ట్ వర్జీనియాతో పాటు మరో రెండు డజన్లకు పైగా అమెరికా రాష్ట్రాలకు పెద్ద ఉపశమనం లభించింది.
సుప్రీంకోర్టు ఇచ్చిన తాజా తీర్పుతో ఇకపై ఆయా రాష్ట్రాల్లోని విద్యాసంస్థల్లో విద్యార్థులు తమ 'లింగ గుర్తింపు' (Gender Identity) ఆధారంగా కాకుండా, పుట్టినప్పుడు నమోదైన లింగ నిర్ధారణ ఆధారంగానే క్రీడా పోటీల్లో పాల్గొనాల్సి ఉంటుంది. అంటే, అబ్బాయిలుగా పుట్టి ఆ తర్వాత అమ్మాయిలుగా మారిన ట్రాన్స్జెండర్లు.. ఇకపై మహిళల క్రీడా విభాగాల్లో పోటీ పడటానికి వీలుండదు. ఈ నిబంధనను కన్జర్వేటివ్ వర్గాలు గట్టిగా సమర్థిస్తున్నాయి. పురుష శారీరక దారుఢ్యం ఉన్నవారు మహిళల విభాగంలో పోటీ పడటం వల్ల అసలైన మహిళా అథ్లెట్లకు అన్యాయం జరుగుతుందన్న వారి వాదనతో కోర్టు ఏకీభవించింది.
గత ఏడాది మైనర్లకు ఇచ్చే లింగ మార్పిడి చికిత్సలపై టెన్నెస్సీ రాష్ట్రం విధించిన నిషేధాన్ని కూడా సుప్రీంకోర్టు సమర్థించిన సంగతి తెలిసిందే. తాజాగా వచ్చిన ఈ తీర్పు అమెరికా వ్యాప్తంగా క్రీడా, రాజకీయ రంగాల్లో పెద్ద చర్చకు దారితీసింది. మానవ హక్కుల సంఘాలు ఈ తీర్పును వ్యతిరేకిస్తుండగా, క్రీడల్లో సమానత్వం సాధించడంలో ఇది ఒక పెద్ద విజయమని రిపబ్లికన్ రాష్ట్రాలు కొనియాడుతున్నాయి.
హీరో అవ్వాలని చూశాడు.. తిలక్ వర్మపై కృష్ణమాచారి సంచలన వ్యాఖ్యలు!
టీమిండియా నిష్క్రమించినా.. అగ్రస్థానంలోనే శ్రీ చరణి