
ఇంటర్నెట్ డెస్క్: టీమ్ఇండియా ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్య ముంబయి నుంచి బెంగళూరుకు షిప్ట్ అయ్యాడు. బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (CoE)కి సమీపంలో ఓ ఇంటిని అద్దెకు తీసుకున్నాడు.
హార్దిక్ ఇక నుంచి తన కెరీర్ కొనసాగించినంత కాలం CoEని శాశ్వత శిక్షణా కేంద్రంగా మార్చుకోవాలనే ఉద్దేశంతో బెంగళూరుకు మకాం మార్చాడు. ముంబయిలో శిక్షణ కోసం ప్రతిరోజూ చాలా దూరం ప్రయాణించడం సమస్యగా మారడంతో ఈ నిర్ణయం తీసుకున్నాడట.
పాండ్య ఇకపై ఐపీఎల్, జాతీయ జట్టు తరఫున మ్యాచ్‌లు లేనప్పుడల్లా CoEలో శిక్షణ పొందనున్నాడు. ఈ విషయాన్ని బీసీసీఐ వర్గాలు కూడా ధ్రువీకరించాయి. CoEలో ట్రైనింగ్ సెషన్స్‌లో సహకరించడానికి హార్దిక్ సొంతంగా ఫిజియోథెరపిస్ట్, స్ట్రెంత్ అండ్ కండీషనింగ్ కోచ్‌ను ఏర్పాటు చేసుకుంటాడట. ఐపీఎల్ సమయంలో తగిలిన గాయం నుంచి హార్దిక్ పూర్తిగా కోలుకోలేదు. దీంతో జులై 1 నుంచి ఇంగ్లాండ్‌తో జరగనున్న ఐదు టీ20ల సిరీస్‌కు పాండ్య దూరమయ్యాడు. అతడికి ఫిట్నెస్ క్లియరెన్స్ వస్తే జులై నెలాఖరులో జింబాబ్వేతో మూడు టీ20ల సిరీస్‌కు ఎంపిక చేసే అవకాశముంది.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
టీజీ20 లీగ్ 2026లో భాగంగా మెదక్ ఫాల్కన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో కరీంనగర్ బ్యాటర్లు చెలరేగారు. దీంతో అశ్విన్ రామ్ 15 ఓవర్లో ఏకంగా 35 సమర్పించుకున్నాడు.