పొదరిల్లు సీరియల్లో ఆ తాగుబోతు తండ్రి నారాయణని చూస్తే.. అబ్బా ఏం యాక్ట్ చేస్తున్నాడబ్బా.. జీవించేస్తున్నాడు. అసలు అతను యాక్ట్ చేస్తున్నట్టుగా లేదు అన్నంత సహజంగా నారాయణ పాత్రలో ఒదిగిపోయారు
కాకినాడ నాని . గత 30 ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉన్న కాకినాడ నానికి పొదరిల్లు సీరియల్‌తో గుర్తింపు లభించింది. ఈ సీరియల్లో నారాయణ పాత్ర ఎంత వైవిధ్యంగా ఉంటుందంటే.. అతనే నవ్విస్తాడు.. అతనే ఏడిపిస్తాడు.. అతనే ఓదార్చుతాడు. ఓ పక్క బాధ్యత లేని తండ్రిగా మామగా ఉన్న ఆయనే.. తన వాళ్లపై ఈగ వాలినా కూడా ఉగ్రుడౌతాడు. పొదరిల్లు సీరియల్లో ప్రాధాన్యత ఉన్న పాత్రలో మెప్పిస్తున్న కాకినాడ నాని.. తాజా ఇంటర్వ్యూలో తన పర్సనల్ విషయాలతో పాటు.. ముందు ముందు ఈ సీరియల్ ఎలా ఉండబోతుందనే విషయాన్ని కూడా చెప్పుకొచ్చారు. అన్నట్టు.. ఫాదర్ క్యారెక్టర్ చంపేస్తారంట నిజమేనా అని అంటే.. దానిపై కూడా క్లారిటీ ఇచ్చారు నారాయణ అలియాస్ కాకినాడ నాని. ఆ ఆవగింజ అంత అదృష్టమే పొదరిల్లుతెలుగు ఇండస్ట్రీలో తెలుగు వాళ్లకి అవకాశాలు ఇవ్వాలని ఇప్పుడు కాదు.. ఎప్పటి నుంచో అడుగుతున్నారు. అవకాశం ఇవ్వడమే కాదు.. అదృష్టం కూడా ఉండాలి. కోటా శ్రీనివాసరావు గారు అదే అనేవారు. గుమ్మడికాయ అంత టాలెంట్ ఉంటే సరిపోదు.. ఆవగింజ అంత అదృష్టం ఉండాలని. ఆ ఆవగింజే నాకు పొదరిల్లు. ఆవగింజ అంత అదృష్టం ఉంది కాబట్టి.. నాకు పొదరిల్లు సీరియల్లో అవకాశం వచ్చింది. సీరియల్లో ఎలా ఉంటామో.. బయటకూడా అలాగే ఇందులో నా కొడుకులు, కోడలు.. సీరియల్లో ఎలా ఉంటారో బయట కూడా అలాగే ఉంటారు. కొడుకులు అయితే అప్పా అప్పా అంటారు. కోడలు కూడా సీరియల్లో ఎలా ఉంటుందో.. బయట కూడా అలా ఉంటుంది. అది పూర్వజన్మ సకృతం. అంతా ఫ్యామిలీగా ఉంటాం. నాకి ఇది మొదటి సీరియల్ కాదు.. చాలా సీరియల్స్ చేశాను. కానీ పొదరిల్లు సీరియల్‌తో బ్రేక్ వచ్చింది. పోస్టర్‌పై నా ఫొటో పడటం చాలా ఆనందంగా ఉంటుంది.పాత్రని బట్టే.. ప్రాంతాన్ని బట్టి కాదు.. వేరే భాషల వాళ్లని తీసుకుని వస్తున్నారంటే.. కేవలం యాక్టింగ్ మాత్రమే కాకుండా వాళ్ల నుంచి ఇంకేదో ఆశిస్తున్నారని అంటుంటారు కానీ.. వాటి గురించి నాకు అంత నాలెడ్జ్ లేదు. క్యారెక్టర్‌కి ఎవరు సూట్ అవుతారనేది కూడా ముఖ్యం. ఇప్పుడు పొదరిల్లులో పెద్ది క్యారెక్టర్ ఉంది.. దానికి అజయ్ అయితే కరెక్ట్ అనేట్టుగా ఉంది. ఈ సీరియల్లో ఇంటి ఓనర్ క్యారెక్టర్ కూడా.. ఎవరైతే పర్ఫెక్ట్ సెట్ అవుతారో వాళ్లనే తీసుకుంటారు.జోజు జార్జ్లా ఉంటానంటారు.. ఇప్పుడు నన్ను వాళ్లు ఎందుకు పిలిచారంటే.. ఆ పాత్రకి సరిపోతాననే కదా? అలా నాకు అదృష్టం కలిసి వచ్చింది. ఈ సీరియల్ ఫస్ట్ ఎపిసోడ్ కూడా నాతోనే మొదలౌతుంది. నా క్యారెక్టర్ చూడగానే.. వీడు ఎవడో కొత్తగా వచ్చాడు.. మంచి క్యారెక్టర్ పట్టుకెళ్లిపోయాడు అని అంటారు కానీ.. దాని వెనుక 30 ఏళ్ల కష్టం ఉంది. చాలామంది నన్ను మలయాళ నటుడు జోజు జార్జ్లా ఉంటానని అంటారు. ఆయన గొప్ప నటుడు. ఆయనతో పోల్చడం వల్లే.. హైదరాబాద్ వచ్చినప్పుడు ఆయనతో ఫొటో దిగాను. ప్రసాద్ బెహ్రా వల్లే పేరు వచ్చింది.. నా క్యారెక్టర్ని అందుకే చంపేశారు నాకు ఇండస్ట్రీలో గుర్తింపు వచ్చిందంటే.. నా గురించి మాట్లాడుకుంటున్నారంటే.. ప్రసాద్ బెహరా వల్లే. పెళ్లి వారిమండి వెబ్ సిరీస్‌లో ప్రసాద్ బెహరాకి తండ్రిగా నటించా. ఎప్పుడైనా బయటకు వెళ్తే.. మీరు ప్రసాద్ బెహరా తండ్రి కదా అని అడుగుతారు. నిజానికి ఆ వెబ్ సిరీస్‌లో ఇంకా కంటిన్యూ అయ్యేవాడ్ని కానీ.. నాకు డేట్లు కుదరకపోవడంతో చంపేశారు. ఆ టైమ్‌లో గమ్ గమ్ గణేషా సినిమా చేస్తున్నా.. వేరే సీరియల్ కూడా చేస్తున్నా. మూడు షిఫ్ట్‌లు చేసేవాడ్ని. అంత బిజీ అయ్యాను. దేనికైనా అదృష్టం ఉండాలి. పొదరిల్లులో కూడా నారాయణ చనిపోతాడా? పొదరిల్లు సీరియల్లో ఫాదర్ క్యారెక్టర్ని చంపేస్తారా అంటే.. ముందు ముందు కథ ఎలా ఉంటుందో మనకి తెలియదు. అదంతా డైరెక్టర్, స్క్రిప్ట్‌లో ఉంటుంది. ఈవారం ఏం జరుగుతుంది ఏంటి అని చెప్తారు తప్పితే.. ముందు ముందు ఎలా ఉంటుందో చెప్పలేం. ట్విస్ట్‌లు రివీల్ చేయరు. ప్రస్తుతానికి అయితే నా క్యారెక్టర్ని జనం ఇష్టపడుతున్నారంటే.. అదంతా డైరెక్టర్ గొప్పతనం. సినిమాలతో సమానంగా రెమ్యూనరేషన్.. రెమ్యూనరేషన్ కూడా బాగానే ఇస్తున్నారు. సీరియల్ అనేది నెలనెలా పేమెంట్ ఇస్తారు. నెలలో 15 రోజులు రెమ్యూరేషన్ పడిపోతుంది. ఎన్నిరోజులు చేస్తే అన్నిరోజులకి రెమ్యునరేషన్ పడిపోతుంది. సినిమాలకి సమానంగా నా క్యారెక్టర్‌కి రెమ్యూనరేషన్ ఇస్తున్నారు. ముందే అగ్రిమెంట్ చేశారు. సినిమాలకు సీరియల్స్‌కి మధ్య డేట్ క్లాష్ వస్తుంటాయి. నేను ముందే అడ్జిస్ట్మెంట్ అడిగాను. ఏదైనా సినిమాలు వస్తే వెళ్లానని చెప్పాను. దానికి తగ్గట్టే ఏదైనా సినిమా షూటింగ్ వస్తే.. పొదరిల్లు డేట్స్ అడ్జెస్ట్ చేస్తుంటారు. చాలా హ్యాపీగా చేసుకుంటూ వెళ్తున్నాం. మాకు వాళ్లు సపోర్ట్ చేస్తుంటారు.. మేం వాళ్లు సపోర్ట్ చేస్తుంటాం. ఒక నైన్టీ వేస్తే బండి చెప్పినట్టు వింటుంది..ఈ సీరియల్లో నారాయణ పాత్ర ఎంత కనెక్ట్ అయ్యిందంటే జనాలకీ.. బయటకు వెళ్లినప్పుడు మందు ఎప్పుడు మానేస్తారు అని అడుగుతుంటారు. నిజానికి నాకు మందుకానీ బీడీ కానీ అలవాటు లేదు. మా కోడలు (సీరియల్ హీరోయిన్) మందు మానిపించేసేస్తుందిగా. ప్రస్తుతానికి పగలు మానేశాను (నవ్వుతూ). మామూలుగా అయితే పెగ్‌తోనే రోజు మొదలౌతుంది. కాఫీలు, గీపీలు పడవు మనకి. ఒక నైన్టీ వేస్తే బండి చెప్పినట్టు వింటుంది’ అంటూ నవ్వేశారు నారాయణ అలియాస్ కాకినాడ నాని. 🔹‘పొదరిల్లు’ ఫాదర్ ఇంటర్వ్యూ.. ‘తాగుబోతు తండ్రినే కానీ మందు అలవాటే లేదు.. సాక్షి,వార్తలో జర్నలిస్ట్‌గా ప్రయాణం