బాలీవుడ్ నటి నేహా ధూపియా ఇటీవల తన వ్లాగ్‌లో చెరకు రసం తాగడానిక ముందు, తాగిన తర్వాత తన బీపీ (Blood Pressure) టెస్ట్ చేసుకున్నట్లు పేర్కొన్నారు. ఈ వ్లాగ్‌లో ఆమె మాట్లాడుతూ..
ఇప్పుడు నేను చెరుకు రసం తాగకముందు, తాగిన తర్వాత నా బ్లడ్ ప్రెజర్ ఎలా ఉందో చెక్ చేసుకుంటాను.చెరుకు రసం తాగడానికి ముందు 110/69 ఉంది. కానీ చెరుకు రసం తాగిన తర్వాత అది పెరిగింది అని పేర్కొన్నారు. దీనిపై ఆమె తల్లి స్పందిస్తూ.. లో బీపీకి ఎలాంటి మందులు ఉండవు, అందుకే ఏదో ఒక రూపంలో చక్కెర తీసుకోవాలి అని చెప్పగా.. నేహా ధూపియా ఎంతో హ్యాపీగా మమ్మీ చాలా బాగా చెప్పావ్! అంటూ అభినందించారు.ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుండటంతో చాలా మందిలో నిజంగానే చెరుకు రసం లోబీపీ తగ్గడానికి సహాయడపడుతుందా లేదా అనే సందేహం మొదలైంది. ఈ నేపథ్యంలో అసలు చెరుకు రసం లోబీపీ తగ్గడానికి, బ్లడ్ ప్రెజర్‌ను పెంచడానికి సహాయపడుతుందా లేదా.. ఒకవేళ సహాయపడితే ఏవిధంగా సహాయపడుతుంది అనే విషయాలను తెలుసుకుందాం..నిపుణులు ఏం చెబుతున్నారంటే..చెరుకు రసంలో శరీరం సులభంగా గ్రహించగలిగే నేచురల్ షుగర్స్ ఉండటం వల్ల ఇది శరీరానికి తక్షణ శక్తి ఇస్తుందని, ఆరోగ్యానికి మేలు చేస్తుందని NLM అధ్యయనం పేర్కొంది. అలాగే శరీరంలో నీటి శాతం తగ్గడం అంటే డీహైడ్రేషన్, ఎక్కువ టైమ్ ఉపవాసం ఉండటం లేదా ఎండ తీవ్రత కారణంగా రక్తపోటు తాత్కాలికంగా తగ్గి ఎవరైనా బలహీనంగా, కళ్లు తిరిగినట్లు లేదా స్పృహతప్పినట్లు అనిపిస్తే అలాంటప్పుడు చెరుకు రసం తాగడం వల్ల వారు త్వరగా కోలుకునే అవకాశం ఉంది. అంతే కాకుండా ఇది శరీరానికి అవసరమైన ద్రవాలను అందించి డీహైడ్రేషన్ బారిన పడకుండా కాపాడుతుందని పేర్కొంటున్నారు.చెరుకు రసం బీపీని తక్షణమే పెంచుతుందా?అయితే చెరుకు రసం ప్రత్యక్షంగా బీపీని పెంచదట. బీపీ గుర్తించదగిన స్థాయిలో పెంచే ప్రత్యేకమైన పదార్థాలేవీ లేవు. సాధారణంగా చెరుకు రసం తాగినప్పుడు శరీరంలో శక్తి స్థాయిలు, నీటి శాతం పెరగడానికి తోడ్పడుతుంది. అయితే బీపీ ఉన్నపళంగా ఎందుకు తగ్గింది, అసలు కారణం ఏంటి అనే అంశాలపై తప్పకుండా దృష్టి పెట్టాలి. అవసరమైతే వైద్యుల సలహా తీసుకోవాలి.బీపీ పెరగడానికి చెరుకు రసంపై మాత్రమే ఆధారపడటం మంచిదా?బీపీ తరచూ పడిపోతున్నా, సమస్య తీవ్రంగా ఉన్నా లేదా స్పృహతప్పడం, ఛాతి నొప్పి, గందరగోళం, నిరంతర బలహీనత వంటి లక్షణాలు కనిపిస్తే చెరుకు రసం ఒక చికిత్సగా అస్సలు భావించకూడదని నిపుణులు చెబుతున్నారు.అసలు బ్లడ్ ప్రెజర్ అలా పడిపోవడానికి గల ఖచ్చితమైన కారణాన్ని తెలుసుకోవడానికి వైద్య పరీక్షలు చేయించుకోవడం ఎంతో ముఖ్యం. అలాగే చెరుకు రసంలో సహజ సిద్ధమైన చక్కెరలు ఎక్కువ మోతాదులో ఉంటాయి కాబట్టి మధుమేహం (Diabetes) ఉన్న వారు తీసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలని పేర్కొంటున్నారు. బీపీ సడెన్‌గా పడిపోయినప్పుడు ఏం చేయాలి?బ్లడ్ ప్రెజర్ సడెన్‌గా పడిపోయినప్పుడు దానిని అదుపు చేయడానికి మొదట సురక్షితమైన చోట కూర్చోవడం లేదా ప్రశాంతంగా పడుకోవడం చేయాలి. ఒకవేళ శరీరంలో నీటిలో శాతం తగ్గడం వల్ల బీపీ తగ్గిందని అనిపిస్తే నీళ్లు లేదా తక్షణం హైడ్రేషన్ ఇచ్చే డ్రింక్స్ తాగాలి. సదరు వ్యక్తి కొన్ని గంటలుగా ఏమీ తినకుండా ఉండి ఉంటే పోషకాలతో కూడిన ఏదైనా తినడం వల్ల మేలు జరుగుతుంది.చెరుకు రసం అనేది తక్షణ శక్తికి లిక్విడ్స్ ఒక మంచి వనరు అయినప్పటికీ ఇవి కేవలం ఒక సహాయక చర్యగా మాత్రమే ఉపయోగపడుతుంది తప్ప సమస్యకు శాశ్వత పరిష్కారం కాదు. తరచూ లో బీపీ సమస్య తలెత్తుతుంటే మాత్రం తప్పనిసరిగా వైద్య నిపుణులు సంప్రదించి సలహా తీసుకోవాలి.ముఖ్య గమనిక: ఈ కథనంలో తెలియజేసిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, కొందరు నిపుణులు పేర్కొన్న అంశాల ఆధారంగా తెలియజేశాము. అలాగే లోబీపీ వంటి ఆరోగ్య సమస్యల పరిష్కారం కోసం వైద్యుల సలహా తీసుకోవడం మంచిది. వీటిని ఎంత వరకు విశ్వసించాలనేది, పాటించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం. సమయం తెలుగు వీటిని ధృవీకరించడం లేదు.