
Biyyam Rava Undrallu: వినాయక చవితిస్పెషల్ బియ్యం రవ్వ ఉండ్రాళ్ళు.. పగుళ్లు రాకుండా ఈ చిన్నట్రిక్ మీకోసమే
వినాయక చవితి పూజలలో విఘ్నేశ్వరుడికి సమర్పించే ప్రసాదాలలో

వినాయక చవితి పూజలలో విఘ్నేశ్వరుడికి సమర్పించే ప్రసాదాలలో

యాంకర్ స్రవంతి తాజాగా శ్రీ షోడశ స్వర్ణగౌరీ పూజ, తదియ గౌరీ నోములను నిర్వహించింది. పూజ అనంతరం సంప్రదాయంగా చీరకట్టులో దిగిన పలు ఫోటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేసింది.

‘కెజియఫ్’ సిరీస్ చిత్రాలు అందించిన భారీ విజయాల తర్వాత, నాలుగేళ్ల సుదీర్ఘ విరామం అనంతరం యశ్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చిన చిత్రం ‘టాక్సిక్’. కన్నడ సినిమా పరిశ్రమను గ్లోబల్ స్థాయిలో నిలబెట్టిన రాకింగ్ స్టార్ యశ్ (Yash) కెరీర్లో ఇప్పుడు ఒక కీలక మలుపు వచ్చింది. ‘కెజియఫ్’ సిరీస్ చిత్రాలు అందించిన భారీ విజయాల తర్వాత, నాలుగేళ్ల సుదీర్ఘ విరామం అనంతరం ఆయనను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చిన చిత్రం ‘టాక్సిక్’ (Toxic). మొదట్లో ఈ సినిమాపై అండర్ వరల్డ్ బ్యాక్‌డ్రాప్, భారీ యాక్షన్ సీక్వెన్స్‌లు, రొమాన్స్‌ల కారణంగా అంచనాలు తారాస్థాయికి చేరాయి. కో ప్రొడ్యూసర్‌గా, రైటర్‌గా కూడా యశ్ ఈ ప్రాజెక్ట్ కోసం తీవ్రంగా శ్రమించారు. అయితే, థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయి ఫలితాన్ని అందుకోలేకపోయింది. సుమారు నాలుగు వందల యాభై కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రానికి, ఐదు వందల కోట్ల థియేట్రికల్ రైట్స్ వ్యాపారం జరిగింది. వరల్డ్ వైడ్‌గా మూడు వందల ఐదు కోట్లకు పైగా వసూళ్లు సాధించినప్పటికీ, పెట్టిన పెట్టుబడి దృష్ట్యా ఈ చిత్రం సేఫ్ జోన్‌కి చేరడం కష్టంగా మారింది. ముఖ్యంగా సినిమాలో మోతాదు మించిన యాక్షన్, రొమాంటిక్ సన్నివేశాలు ఫ్యామిలీ ఆడియన్స్‌ను థియేటర్లకు దూరం చేశాయి. దీనివల్ల సోషల్ మీడియాలో ఈ చిత్రంపై కొంత ట్రోలింగ్ కూడా నడిచింది. రీసెంట్గా జీ5 సంస్థ ఈ సినిమా డిజిటల్ రైట్స్‌ను దక్కించుకోగా, ఇప్పుడు అందరి దృష్టి యశ్ నటిస్తున్న నెక్స్ట్ బిగ్ ప్రాజెక్ట్ ‘రామాయణ’ (Ramayana) వైపు మళ్ళింది. ప్రస్తుతం యశ్ కెరీర్‌ను పూర్తిగా మలచగల సత్తా ఉన్న చిత్రం ‘రామాయణ’. బాలీవుడ్లో దాదాపు నాలుగు వేల కోట్ల భారీ బడ్జెట్‌తో రెండు భాగాలుగా తెరకెక్కుతోన్న ఈ పౌరాణిక చిత్రంపై దేశవ్యాప్తంగా విపరీతమైన క్రేజ్ ఉంది. ఇందులో యశ్ అత్యంత శక్తివంతమైన పాత్ర అయిన రావణాసురుడిగా నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్‌లో

ఉత్తరాంధ్ర దశాబ్దాల కల సాకారమైంది. పోలవరం ప్రాజెక్టు ఎడమ ప్రధాన కాలువ ద్వారా గోదావరి జలాలు ఉత్తరాంధ్ర నేలను తాకాయి. ఈ చారిత్రక ఘట్టానికి అనకాపల్లి జిల్లా పాయకరావుపేట వేదికైంది. ముఖ్యమంత్రి చంద్రబాబు గోదావరి జలాలకు జలహారతి ఇచ్చి, పవిత్ర జలాలను శిరస్సున చల్లుకున్నారు. అనంతరం నేలపై సాష్టాంగ ప్రమాణం ఆచరించి, ఉత్తరాంధ్ర ప్రజల చిరకాల వాంఛ నెరవేరిన క్షణాన తన కృతజ్ఞతను చాటుకున్నారు. ఓ దశలో కాలువ నుంచి నీరు ప్రవహిస్తుంటే, చంద్రబాబు మెడలోని పచ్చ కండువా తీసి గాల్లో గిరగిరా తిప్పి తన ఆనందం వ్యక్తం చేశారు. చంద్రబాబును చూసి మిగతా నేతలు, రైతులు కూడా తమ కండువాలను గాల్లో ఊపుతూ హర్షం వెలిబుచ్చారు.అంతకుముందు, నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు రెగ్యులేటర్ బటన్ నొక్కి ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పథకంలోకి గోదావరి నీటిని విడుదల చేశారు. పాయకరావుపేట వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సీఎం చంద్రబాబు శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి మంత్రులు వంగలపూడి అనిత, అచ్చెన్నాయుడు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్, ఎంపీ సీఎం రమేశ్ తదితరులు హాజరయ్యారు.పోలవరం జలాల ప్రయాణం ఒక అద్భుతమైన ఇంజనీరింగ్ విన్యాసం. తూర్పు కనుమలను తొలిచి, ఏలేరు, పంపా, తాండవ, వరాహ, శారద వంటి నదులను దాటుకుంటూ ఈ కాలువను నిర్మించారు. కొన్ని చోట్ల నదుల ప్రవాహానికి ఎగువన అక్విడెక్టులు నిర్మించగా, ఏలేరు నది గర్భం కింద నుంచి సైఫన్ ద్వారా నీటిని తరలించడం ఈ ప్రాజెక్టు ప్రత్యేకత. ఈ కాలువను ఉత్తరాంధ్ర సుజల
జగిత్యాల మున్సిపల్ మాజీ చైర్పర్సన్, బీజేపీ మహిళా నేత బోగా శ్రావణికి నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ ఓ సెకండ్ హ్యాండ్ కారు గిఫ్ట్‌గా ఇవ్వటం చర్చనీయాంశంగా మారింది. ఇటీవల అర్వింద్‌కు శ్రావణి రాఖీ కట్టగా.. సోదరి భావంతో రాఖీ కట్టినందుకు కానుకగా తన తండ్రి డి. శ్రీనివాస్ ఉపయోగించిన కార్లలో ఒకదానిని ఆమెకు బహుమతిగా ఇచ్చారు. దీంతో జగిత్యాల జిల్లా, నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో ఈ వ్యవహారం వివాదానికి దారితీసింది. నియోజకవర్గంలో పార్టీ కోసం ఎంతోకాలంగా కష్టపడుతున్న పాత నాయకులను, కార్యకర్తలను పక్కనపెట్టి ఇటీవల పార్టీలోకి వచ్చిన శ్రావణికి ఎంపీ అర్వింద్ ప్రాధాన్యం ఇవ్వడంపై ఒక వర్గం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తోంది.శ్రావణికి ప్రత్యేక ప్రాధాన్యత దక్కడాన్ని తట్టుకోలేని జగిత్యాల బీజేపీలోని ప్రత్యర్థి వర్గం ఎంపీ అర్వింద్ తీరుపై బహిరంగంగానే అసంతృప్తి వెళ్లగక్కింది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలు సాగుతున్నాయని, శ్రావణికి మాత్రమే ప్రాధాన్యం ఇస్తూ మిగతా నేతలను విస్మరిస్తున్నారంటూ నాయకులు తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ వ్యవహారంపై రాష్ట్ర నాయకత్వానికి కూడా ఫిర్యాదు చేసేందుకు సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో కారు గిఫ్ట్ వ్యవహారంపై ధర్మపురి అర్వింద్ స్పందించారు. ఓ యూట్యూబ్ జర్నలిస్ట్‌తో ఫోన్‌కాల్‌లో మాట్లాడిన ఆయన.. ఇది చాలా చిన్న విషయమని దానిపై రాజకీయాలు చేయాల్సిన అవసరం లేదని అన్నారు.'ఆ అమ్మాయి మున్సిపల్ ఛైర్మన్ పదవిని వదులుకొని బీజేపీలో జాయిన్ అయ్యింది. పద్మశాలి అమ్మాయి.. యంగ్‌స్టర్ కాబట్టి ఏడెనిమిది నెలలు బతిమిలాడుకొని బీఆర్ఎస్ నుంచి బీజేపీలో జాయిన్ చేయించుకున్నా. ఆ ప్రభావంతో జగిత్యాలలో 45 వేల ఓట్లు వచ్చినయ్. లేకుంటే చరిత్రలో 3,4 వేలకు దిక్కులేదు. కారు గిఫ్ట్ ఇవ్వటం అనేది రాజకీయం కాదు. ప్రేమతో ఆశీర్వాదం అన్నట్లుగా ఇచ్చా. నా కార్యకర్తల కోసం చాలా చేశా. కార్యకర్తలకు కోట్లలో ఖర్చు పెట్టా. అది మా డాడీకి నేను కొనిచ్చిన కారు. ఆయన కాలం చేశాక.. అది అలా మూలన పడి ఉండటం

ఆస్కార్ విజేత ఏఆర్ రెహ్మాన్ తన ఆత్మకథ ‘రెహ్మాన్: ఏ రెనైసాన్స్’పై కీలక ప్రకటన చేశారు. భారతీయ సంగీత ప్రపంచంలో తనదైన ముద్ర వేసిన సంగీత దర్శకుడు, ఆస్కార్ అవార్డు గ్రహీత ఏఆర్ రెహ్మాన్ (A. R. Rahman) అభిమానులకు శుభవార్త చెప్పారు. తన జీవితంలో కొత్త అధ్యాయం మొదలవుతోందని అన్నారు. రచయిత్రి రూపా చక్రవర్తి (Rupa Chakravarti) తో కలిసి తాను రాయబోయే ఆత్మకథ గురించి ఎక్స్ వేదికగా ఆయన వెల్లడించారు. ‘రెహ్మాన్: ఏ రెనైసాన్స్’ (Rahman A Renaissance) అనే పేరుతో రాయనున్న పుస్తకం కోసం రూపా చక్రవర్తి, తాను రచయితలుగా కలిసి పనిచేస్తున్నట్టు తెలిపారు. ఈ పుస్తకంలో ‘నా ప్రపంచాన్ని తీర్చిదిద్దిన సంగీతం, ఆలోచనలు, సవాళ్లు, ప్రభావాలు, సృజనాత్మక ప్రయాణంపై మీకు పూర్తి అవగాహన కల్పిస్తుంది’ అని పేర్కొన్నారు

సర్గం రవి కుమార్. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. AP JAC Amaravati Protest: తెలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వ ఉద్యోగులు తమ డిమాండ్ల సాధన కోసం, తమ సమస్యల పరిష్కారం కోసం ఆందోళనలను తీవ్రం చేస్తున్నారు. ఇప్పటికే తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి వ్యతిరేకంగా భారీ ఉద్యమం చేపట్టగా.. ఇటు ఆంధ్రప్రదేశ్‌లోనూ ప్రభుత్వ ఉద్యోగులు భారీ నిరసనలకు దిగారు. న్యాయమైన సమస్యలు, పెండింగ్ బకాయిల పరిష్కారం కోసం ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు మొదటి దశ ఉద్యమ కార్యాచరణకు నేటి నుంచి శ్రీకారం చుట్టారు. తమ నిరసనలో భాగంగా మంగళవారం నల్ల బ్యాడ్జీలతో ఉద్యోగుల ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. చంద్రబాబు సార్... తమ డబ్బులు తమకు ఇవ్వండి అనే నినాదంతో ఉద్యమాన్ని ప్రారంభించారు. రాష్ట్రంలోని గ్రామ సచివాలయాలు దగ్గర నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో, అన్ని తహసీల్దార్ కార్యాలయాలు, మున్సిపల్ కార్యాలయాలు, వెటర్నరీ డిపార్ట్మెంట్ ఉద్యోగులు, అన్ని ఆర్టీసీ డిపోల్లో, వివిధ కార్యాలయాల ఉద్యోగులు, డివిజన్ స్థాయిలో ఆర్డీఓ కార్యాలయాల ఉద్యోగులు, మున్సిపాలిటీ ఉద్యోగులు, కార్మిక శాఖ, పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ ఉద్యోగులు, జిల్లా స్థాయిలోని అన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయాల ఉద్యోగులు, జిల్లా స్థాయి వివిధ శాఖల కార్యాలయాల ఉద్యోగులు అందరూ నల్ల బ్యాడ్జీలు ధరించి విధులకు హాజరయ్యారు. వేలాది మంది ఉద్యోగులు తమ సెల్ఫోన్లలో "సీఎం సార్ మా డబ్బులు మాకు ఇవ్వండి" అని కామన్ డీపీగా పెట్టుకుని నిరసన తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగులు తమ ఉద్యమంలో భాగంగా సెప్టెంబర్ 1 నుంచి 5వ తేదీ వరకు ఉద్యోగులు నల్ల బ్యాడ్జీలు ధరించి విధులకు హాజరవుతూ నిరసనలు చెబుతున్నారు. ఉద్యోగులందరూ తమ వాట్సాప్ డీపీగా ,స్టేటస్‌లుగా “సీఎం సార్... మా

సినిమా ఇండస్ట్రీలో ఎన్నో రకాల ప్రేమ కథలు, పెళ్లి ముచ్చట్లు వార్తల్లో నిలుస్తుంటాయి. అయితే రీల్ లైఫ్‌లో తమ్ముడికి రోమాంక్ చేసి, రియల్ లైఫ్‌లో అన్నయ్యను వివాహం చేసుకున్న హీరోయిన్ల ముచ్చట ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. సినిమా ఇండస్ట్రీలో ఎన్నో రకాల ప్రేమ కథలు, పెళ్లి ముచ్చట్లు వార్తల్లో నిలుస్తుంటాయి. అయితే రీల్ లైఫ్‌లో తమ్ముడికి రోమాంక్ చేసి, రియల్ లైఫ్‌లో అన్నయ్యను వివాహం చేసుకున్న హీరోయిన్ల ముచ్చట ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. తాజాగా నటి కావ్య కళ్యాణ్ రామ్, సంగీత దర్శకుడు కాల భైరవ తమ ప్రేమ బంధాన్ని అధికారికంగా ప్రకటించడంతో ఈ ఆసక్తికరమైన అంశం మరోసారి ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. కావ్య కళ్యాణ్ రామ్, కాల భైరవ తమ్ముడైన యంగ్ హీరో శ్రీసింహా కోడూరి సరసన ఉస్తాద్ చిత్రంలో హీరోయిన్ గా నటించింది. ఆ సినిమా సమయంలో ఏర్పడిన పరిచయం, ఆ తర్వాత కాల భైరవతో ప్రేమగా మారి ఇప్పుడు పెళ్లి పీటల వరకు వెళ్తోంది. ఇక గతంలోనూ ఇలాంటి ఆసక్తికరమైన జంటలు టాలీవుడ్, కోలీవుడ్‌లలో వార్తల్లో నిలిచాయి. దివంగత అతిలోక సుందరి శ్రీదేవి, ప్రముఖ నటుడు అనిల్ కపూర్ సరసన మిస్టర్ ఇండియా వంటి అనేక సూపర్ హిట్ చిత్రాల్లో నటించింది. ఆ తర్వాత ఆయన అన్నయ్య, నిర్మాత బోనీ కపూర్‌ను వివాహం చేసుకున్న విషయం తెల్సిందే. ఇదే వరుసలో నటి శ్రియా రెడ్డి కూడా విశాల్ సరసన పొగరు చిత్రంలో పవర్ఫుల్ పాత్రలో నటించింది. ఈ చిత్రంలో విశాల్ - శ్రియా రెడ్డి రొమాంటిక్ సాంగ్ అప్పట్లో సంచలనం సృష్టించింది. ఇక ఆ సెట్ లో శ్రియాకు విశాల్ అన్నయ్య, నిర్మాత విక్రమ్ కృష్ణ ఏర్పడిన పరిచయం ప్రేమగా మారి పెళ్లి వరకు వెళ్ళింది. అలాగే సోనియా అగర్వాల్, ధనుష్ సరసన కాదల్ కొండేన్ చిత్రంలో నటించి

ఉమ్మడి ఏపీ విభజన తర్వాత తొలిసారిగా పోలీసు స్పోర్ట్ మీట్ జరుగుతోందని ఆంధ్రప్రదేశ్ డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా వ్యాఖ్యానించారు. పోలీసు ఉద్యోగం చేసేవారు 24 గంటలూ అలర్ట్‌గా ఉండాలని ఆదేశించారు. అమరావతి, సెప్టెంబర్ 1 (ఆంధ్రజ్యోతి): ఉమ్మడి ఏపీ విభజన తర్వాత తొలిసారిగా పోలీసు స్పోర్ట్ మీట్ జరుగుతోందని ఆంధ్రప్రదేశ్ డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా (AP DGP Harish Kumar Gupta) వ్యాఖ్యానించారు. పోలీసు ఉద్యోగం చేసేవారు 24 గంటలూ అలర్ట్‌గా ఉండాలని ఆదేశించారు. పోలీసు ఉద్యోగం నిత్యం అనేక సవాళ్లతో కూడుకున్న పని అని తెలిపారు. ఏపీ పోలీస్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్‌ను డీజీపీ ఈరోజు (మంగళవారం) ప్రారంభించి, మాట్లాడారు. పోలీసులకు క్రీడల పట్ల కూడా అంత ఆసక్తి కనబరిచే సమయం ఉండదని.. కానీ క్రీడల వల్ల మెంటల్, ఫిజికల్ ఫిట్నెస్ వస్తోందని వివరించారు. ఇప్పుడు ఇలా అందరూ కలిసి క్రీడల్లో పాల్గొనడం ఆనందంగా ఉందని డీజీపీ చెప్పారు. ఇక్కడ పోటీల్లో గెలవాలని చాలా కష్టపడతారని, ఆలోచన చేస్తారని అన్నారు. ఇదే విధంగా విధుల్లో కూడా అనేక సవాళ్లను ఎదుర్కొని ఆయా కేసులు చేధించేలా పని చేయాలని దిశానిర్దేశం చేశారు. నిత్యం క్రీడలు ఆడటం ద్వారా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని వివరించారు. పోలీసులు వృత్తి రీత్యా ఎంత బిజీగా ఉన్నా... క్రీడల్లో రాణించేలా పాల్గొనాలని సూచించారు. ఏపీ పోలీసులకు క్రీడల్లో జాతీయ స్థాయిలో గుర్తింపు ఉందని డీజీపీ కొనియాడారు. గతంలో అనేక పతకాలు వచ్చినా, భవిష్యత్తులో రాష్ట్ర పోలీసులు సాధించే విజయాలతో ఏపీకి క్రీడల్లో మరింత గుర్తింపు రావాలని సూచించారు. యువత కూడా చదువు, ఉద్యోగాలతో పాటు క్రీడల్లో రాణించాలని డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా పిలుపునిచ్చారు. జగన్ హయాంలో వెలిగొండ ప్రాజెక్ట్‌కు గ్రహణం పట్టింది: సీఎం చంద్రబాబు పవన్ కల్యాణ్ ఆదేశాలు.. ఏపీలో పర్యావరణ పరిరక్షణకు స్పెషల్ డ్రైవ్ రోశయ్య స్ఫూర్తితో యువత రాజకీయాల్లోకి రావాలి: మంత్రి లోకేశ్

ఉత్తరాంధ్ర ప్రజా సమూహాల దశాబ్దాల కల నెరవేరే సువర్ణ ఘడియలు ఆసన్నమయ్యాయి. పోలవరం ప్రాజెక్టు ఎడమ కాలువ ద్వారా గోదావరి జలాలు ఉత్తరాంధ్ర భూముల్లోకి పారేందుకు మార్గం సుగమమైంది. రేపు పాయకరావుపేట వద్ద ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రెగ్యులేటర్ ఆన్ చేసి, పుడమి తల్లిని తడిపే గోదావరి తరంగాలకు జల హారతి ఇచ్చి ఘనంగా స్వాగతం పలకనున్నారు. ఇంజనీరింగ్ అద్భుతంగా రూపొందిన ఈ కాలువ ద్వారా ఉగ్రరూప మెత్తే గోదావరి ప్రవాహం ఇకపై ఉత్తరాంధ్ర జిల్లాల సాగు, తాగునీటి దాహాన్ని తీర్చబోతోంది.తూర్పు కనుమల విసిరిన క్లిష్టమైన భౌగోళిక సవాళ్లను దాటుకుంటూ, రూ.4,192 కోట్ల భారీ వ్యయంతో 213 కిలోమీటర్ల మేర పోలవరం ఎడమ ప్రధాన కాలువ నిర్మాణం పూర్తయింది. ఏలేరు, పంపా, తాండవ, వరాహ, శారద వంటి అనేక నదులు, వాగులను దాటుకుంటూ ఈ కాలువ సాగుతుంది. ఇంజనీరింగ్ అద్భుతాలకు ప్రతీకగా కొన్ని చోట్ల నదీ ప్రవాహానికి ఎగువ నుంచి అక్విడెక్టులు, మరికొన్ని చోట్ల దిగువ నుంచి సైఫన్లు నిర్మించారు.ముఖ్యంగా పంపా నదిపై 30 మీటర్ల లోతులో 312 పైల్స్‌తో అక్విడెక్ట్, తాండవ నదిపై 10,634 క్యూసెక్కుల ప్రవాహ సామర్థ్యాన్ని తట్టుకునేలా 447 మీటర్ల పొడవున భారీ నిర్మాణాలు పూర్తి చేశారు. దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న తాళ్లపాలెం భూ వివాదాన్ని పరిష్కరించి 472 కుటుంబాలకు పునరావాసం కల్పించడం ద్వారా ప్రాజెక్టును వేగవంతం చేశారు.Veligonda Project: వెలిగొండ ప్రాజెక్టు కట్టిందెవరు ? జగన్- లోకేష్ క్రెడిట్ వార్..!2.87 లక్షల ఎకరాలకు సాగునీరు..ఈ గోదావరి జలాల విడుదలతో నాలుగు జిల్లాల పరిధిలోని 2,87,320 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందడమే కాకుండా, 5.23 లక్షల మంది ప్రజలకు శాశ్వత తాగునీటి భరోసా లభించనుంది. మొత్తం 23.44 టీఎంసీల నీటిని వినియోగించుకుంటూ పరిశ్రమలకు, తాగునీటికి, సాగుకు ఇబ్బంది లేకుండా డిజైన్ చేశారు. పాయకరావుపేట అక్విడెక్ట్ ద్వారా విడుదలయ్యే నీటితో అనకాపల్లి వద్ద ఏలేరు కాలువను, అలాగే జిల్లాలోని

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అనగానే మనకు వెంటనే గుర్తుకొచ్చేది భారీ బిల్డింగ్లు, పెద్ద రోడ్లు, వరల్డ్ క్లాస్ సిటీ ప్లాన్స్ మాత్రమే కాదు. భారతదేశ రియల్ ఎస్టేట్ చరిత్రలోనే ఇది ఒక అత్యంత ఆసక్తికరమైన ప్రయాణం. ఒకప్పుడు పచ్చని పంట పొలాలతో ఎంతో ప్రశాంతంగా ఉన్న కృష్ణా నదీ తీర ప్రాంతం, రాజధాని ప్రకటన రాగానే రాత్రికి రాత్రే కోట్ల రూపాయల బిజినెస్‌కు కేరాఫ్ అడ్రస్‌గా మారిపోయింది. గత పదేళ్ల కాలంలో అమరావతి భూముల ధరలు చూసిన ఎత్తుపల్లాలు, పొలిటికల్ ట్విస్టులు, చివరకు ఇన్వెస్టర్లకు ఇచ్చిన లాభాలు రియల్ ఎస్టేట్ వరల్డ్‌లోనే ఒక కొత్త చరిత్ర సృష్టించాయి. 2014 సంవత్సరానికి ముందు తుళ్లూరు, నేలపాడు, మందడం, నవులూరు, రాయపూడి లాంటి గ్రామాల్లో భూముల వ్యాపారం ఎకరాల లెక్కన మాత్రమే జరిగేది. అప్పట్లో ఎకరం ధర రూ.15 లక్షల నుంచి రూ.30 లక్షల వరకు ఉండేది. అంటే గజం లెక్కన చూసుకుంటే కేవలం రూ.3,000 నుంచి రూ.6,000 మాత్రమే. కానీ 2014 చివరిలో ఉమ్మడి ఏపీ విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధానిగా అమరావతిని ప్రకటించడంతో రియల్ ఎస్టేట్ స్ సీన్ ఒక్కసారిగా మారిపోయింది. రైతుల నుంచి ఏకంగా 33,000 ఎకరాలను ల్యాండ్ పూలింగ్ కింద సేకరించారు. 2016 నుంచి 2018 మధ్య వెలగపూడిలో తాత్కాలిక సచివాలయం, అసెంబ్లీ, హైకోర్టు నిర్మాణాలు ప్రారంభం కావడంతో భూముల రేట్లు ఆకాశాన్ని తాకాయి. అయితే 2019లో ప్రభుత్వం మారడం, మూడు రాజధానుల ప్రతిపాదన ముందుకు రావడంతో 2019-2023 మధ్య మార్కెట్ తీవ్రంగా పడిపోయింది. ఆ సమయంలో భూమి అమ్మకాలు తగ్గిపోయి గజం ధర రూ.12,000 వరకు పడిపోయింది. కానీ 2024లో మళ్లీ ప్రభుత్వం మారడం, వరల్డ్ బ్యాంక్, ఆసియా అభివృద్ధి బ్యాంక్ (ADB) నుంచి నిధులు రావడంతో అమరావతిలో భూముల రేట్లు మళ్లీ రికార్డు స్థాయికి చేరాయి. ఒక సాధారణ ఇన్వెస్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తే అమరావతి

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇల్లు లేని నిరుపేదలకు ఇల్లు అందించటం కోసం పీఎంఏవై అర్బన్, పీఎంఏవై రూరల్ క్రింద కేంద్రాన్ని సహకారం అందించాలని కోరింది కూటమి సర్కార్. త్వరలోనే ఆంధ్రప్రదేశ్‌లో గ్రామీణ ప్రాంతాల్లో ఇల్లు లేని పేదలకు కూటమి ప్రభుత్వం శుభవార్త చెప్పబోతుంది అని సంతోషపడిన వేళ ఏపీలో పట్టణ ప్రాంత ఇళ్ళు లేని నిరుపేదలకు కేంద్రం శుభవార్త చెప్పింది.కొత్తగా 17,912 ఇళ్ళకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ప్రధానమంత్రి ఆవాస్ యోజన పీఎంఏవై అర్బన్-2.0 పథకం కింద రాష్ట్రానికి కొత్తగా 17,912 ఇళ్ళకు కేంద్రం నుండి గ్రీన్ సిగ్నల్ లభించింది. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్‌లో పట్టణ పేదలకు ఇళ్ల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. తొలి విడతగా రాష్ట్రవ్యాప్తంగా 17,912 గృహాల నిర్మాణానికి పచ్చజెండా ఊపింది. దీనికి సంబంధించి రూ.447.80 కోట్లు విడుదల చేయడానికి పరిపాలనా అనుమతులు జారీ అయ్యాయి.ఒక్కో లబ్ధిదారుకు రూ.2.89లక్షల ఆర్థిక సాయంప్రతి ఇంటి నిర్మాణానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి రూ.2.50లక్షలు అందిస్తాయి. కేంద్రం రూ.1.50లక్షలు, రాష్ట్రం రూ.1 లక్ష వాటా వేస్తాయి. ఇందులో వీబీ జీరాంజీ కింద రూ.27 వేలు, స్వచ్ఛ భారత్ మిషన్ కింద మరుగుదొడ్డి నిర్మాణానికి రూ.12వేలు అదనంగా లభిస్తాయి. మొత్తంగా ఒక్కో లబ్ధిదారుకు రూ.2.89లక్షల ఆర్థిక సాయం అందనుంది. ఇకపై కేంద్రం మంజూరు చేసే ఇళ్లను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే లబ్ధిదారులకు కేటాయించనుంది.17,912 గృహాలకు సంబంధించి జిల్లాల వారీగా కేటాయింపులు ఈ మేరకు జిల్లాల వారీగా కేటాయింపులు జరిగాయి. మొత్తం 17,912 గృహాల్లో 15,793 ఇళ్లు పట్టణ స్థానిక సంస్థల యూఎల్బీ పరిధిలోనూ, 2,119 ఇళ్లు పట్టణాభివృద్ధి సంస్థల యూడీఏ పరిధిలోనూ ఉన్నాయి. అనంతపురం జిల్లాకు అత్యధికంగా 1,387 గృహాలు కేటాయించగా, పల్నాడు 1,229, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు 1,057, వైఎస్సార్ కడప 1,053 గృహాలు వచ్చాయి. ఏపీలో ఇల్లులేని పేదలకు కేంద్రం తీపికబురు.. కొత్తగా 4లక్షల ఇళ్ళు ఆర్థిక సాయం నేరుగా వారి

హత్యాయత్నం కేసు నమోదు చేయడంలో జాప్యం వహించిన పోలీసులపై తూర్పు గోదావరి జిల్లా ఎస్పీ ఆగ్రహం వ్యక్తం చేశారు. వారిని వీఆర్‌కు పంపుతూ ఆదేశాలు జారీ చేశారు. రాజమండ్రి, సెప్టెంబర్ 01: విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన నలుగురు పోలీసులపై తూర్పు గోదావరి జిల్లా ఎస్పీ నరసింహ కిషోర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వారిని వీఆర్‌కు పంపుతూ మంగళవారం ఆదేశాలు జారీ చేశారు. రాజమండ్రి శివారులోని కోరుకొండ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇటీవల మహిళపై హత్యాయత్నం జరిగింది. ఈ ఘటనపై నాలుగు రోజులు ఆలస్యంగా పోలీసులు కేసు నమోదు చేశారు. దీనిపై విమర్శలు వెల్లువెత్తాయి. అవి జిల్లా ఎస్పీ దృష్టికి వెళ్లాయి. దాంతో ఈ కేసు నమోదు వ్యవహారంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన నలుగురు పోలీసులపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని ఎస్పీ నరసింహ కిషోర్ నిర్ణయించారు. అందులో భాగంగా వారిని వీఆర్‌కు పంపారు. కోరుకొండ ఎస్ఐ రమేశ్, రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రి అవుట్ పోస్ట్ ఏఎస్ఐ శ్రీదేవితోపాటు హెడ్ కానిస్టేబుళ్లు లక్ష్మణ్, నాగమల్లేశ్వరరావును వీఆర్‌కు పంపుతూ తూర్పు గోదావరి జిల్లా ఎస్పీ ఆదేశాలు జారీ చేశారు. ప్రేమ పేరుతో మోసం.. బలవంతంగా పెళ్లి: కాకినాడ ఎస్పీకి మహిళ ఫిర్యాదు తిరుపతి విమానాశ్రయంలో విమాన వేళల్లో మార్పులు.. ప్రయాణికులకు బిగ్ అలర్ట్

రాజధాని అమరావతి పరిధిలోని వెంకటపాలెంలో శ్రీ వేంకటేశ్వరస్వామి దివ్యక్షేత్రం నూతన శోభను సంతరించుకుంటోంది. ఈ ఆలయ విస్తరణ పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. తిరుమల తరహాలో ఈ ఆలయం రూపుదిద్దుకుంటోంది. బ్రహ్మోత్సవాల నాటికి ఈ పనులన్నీ ముగించాలని టీటీడీ నిర్ణయించింది. ఆలయ విస్తరణ, ఆధునీకరణ కోసం టీటీడీ ఇదివరకే 260 కోట్ల రూపాయలను మంజూరు చేసింది.నిజానికి ఈ ఆలయ పనులు 2028 ఉగాది నాటికి పూర్తి చేయాలని మొదట్లో టీటీడీ భావించింది. అంతకంటే ముందే.. అంటే ఈ సెప్టెంబర్ లో తిరుమలలో నిర్వహించే శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల నాటికే ప్రధాన నిర్మాణాలన్నింటినీ పూర్తి చేయాలని ప్రతిపాదించింది. దీంతో విస్తరణ పనులు వేగం పుంజుకొన్నాయి. మూడు షిఫ్టుల్లో కొనసాగుతున్నాయి. రాత్రి వేళ కూడా పనులు చకచకా సాగుతున్నాయి. టీటీడీ జేఈఓ డాక్టర్ ఎ శరత్.. ఈ పనులను స్వయంగా పర్యవేక్షిస్తోన్నారు.అర్ధరాత్రి వేళల్లో ఆలయ నిర్మాణ స్థలాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేస్తూ, కాంట్రాక్ట్ సంస్థలను పరుగులు పెట్టిస్తున్నారు. ఆలయ పనుల్లో ఎక్కడా జాప్యం జరగకుండా చూసుకుంటోన్నారు. మూడు షిఫ్టుల్లో పనులు చేపట్టినందున అదనపు కార్మికులను నియమించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ శ్రీవారి బ్రహ్మోత్సవాల నాటికి పూర్తిస్థాయిలో ఈ ఆలయాన్ని భక్తుల కోసం అందుబాటులోకి తీసుకుని రావాలనే పట్టుదలతో ఉంది టీటీడీ.దుబాయ్, సింగపూర్, దోహా.. ఇప్పుడిక ఏపీ రాజధాని అమరావతిలో.. !!ఈ నేపథ్యంలో వేంకటపాలెం శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయ నిర్మాణ పనులను సోమవారం ఆయన మరోసారి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆలయం రెండో ప్రాకారం, నాలుగు గాలి గోపురాల నిర్మాణ పనుల పురోగతిని ఆయన పరిశీలించారు. పనులను నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. నిర్మాణ పనుల్లో ఎలాంటి అలసత్వానికి తావులేకుండా నిరంతరం పర్యవేక్షించాలని, పురోగతిపై ఎప్పటికప్పుడు నివేదికలు అందించాలని సూచించారు.హైదరాబాద్ లో నేటి నుంచి అందుబాటులోకి రానున్న భారీ హైలెవెల్ బ్రిడ్జి- ట్రాఫిక్ కు చెక్పనుల సందర్భంగా ఎదురయ్యే సమస్యలను వెంటనే తన దృష్టికి తీసుకురావాలని, వాటన్నింటిని

రాజధాని అమరావతి నిర్మాణంలో మరో కీలక అడుగు పడింది. అమరావతి ప్రభుత్వ కాంప్లెక్స్ పరిధిలో లోక్ భవన్ భవన సముదాయాల నిర్మాణానికి ప్రభుత్వం పరిపాలనా పరమైన అనుమతులు మంజూరు చేసింది. దీనికోసం 212. 22 కోట్ల రూపాయలను కేటాయిస్తూ ఆర్థిక శాఖ ఇదివరకే అనుమతులు ఇవ్వగా.. తాజాగా ప్రభుత్వం దీనికి తుది ఆమోదం తెలిపింది. రాజధాని ప్రాంతంలో శాశ్వత ప్రభుత్వ నిర్మాణాలను వేగవంతం చేయాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం. నూతనంగా నిర్మించబోయే ఈ లోక్ భవన్ సముదాయంలో అత్యున్నత స్థాయి వసతులను కల్పించనున్నారు. ప్రధానంగా గవర్నర్ మ్యాన్షన్, అసెంబ్లీ దర్బార్ హాల్, కార్యాలయం, రెండు అతిథి గృహాలు ఇందులో నిర్మితం కానున్నాయి. అలాగే.. లోక్ భవన్ అధికారులు, సహాయక సిబ్బంది కోసం క్వార్టర్లు కూడా ఈ కాంప్లెక్స్ పరిధిలోనే అందుబాటులోకి రానున్నాయి. వీటిల్లో ఆఫీసర్ క్వార్టర్స్- 6, సీనియర్ స్టాఫ్ క్వార్టర్స్- 10, జూనియర్ స్టాఫ్ క్వార్టర్స్- 12, సహాయక సిబ్బంది క్వార్టర్స్- 40 ఉంటాయి. 20 గదులతో కూడిన బ్యారక్స్ నిర్మితం కానున్నాయి. ఇందులో దాదాపు 144 మంది రక్షణ సిబ్బందికి వసతి కల్పిస్తారు. నాలుగు సెంటినల్ పోస్టులతో కూడిన కాంపౌండ్ వాల్, ఇతర అనుబంధ చెక్ పాయింట్స్ కూడా ఈ నివాస సముదాయం పరిధిలో నిర్మించనున్నారు. ఆర్సీసీ పద్ధతిలో అత్యాధునిక ప్రమాణాలతో ఈ సముదాయం రూపుదిద్దుకోనుంది. ఈ నిర్మాణానికి నిధులు మంజూరు చేసినప్పటికీ.. ఆర్థిక శాఖ కొన్ని షరతులను విధించింది. నిర్మాణ వ్యయం మొత్తం కూడా రూ. 212.22 కోట్ల పరిమితిని ఎట్టి పరిస్థితుల్లోనూ మించకూడదు. దీనిలోపే నిర్మాణం పూర్తి కావాల్సి ఉంటుంది. దీనికి మించి ఎలాంటి అదనపు ఆర్థిక భారాన్ని మోపడానికి వీల్లేదని ఆర్థిక శాఖ స్పష్టం చేసింది. దీనికి అయ్యే మొత్తం వ్యయాన్ని సీఆర్డీఏ భరించాల్సి ఉంటుంది. తన వద్ద అందుబాటులో ఉన్న నిధుల నుంచే సర్దుబాటు చేయాలని పేర్కొంది. ప్రభుత్వం నుంచి ప్రత్యేకంగా బడ్జెట్

సంగీత దర్శకుడు, గాయకుడు కాలభైరవ నటి కావ్య కళ్యాణ్‌రామ్‌తో తన ప్రేమను బహిరంగంగా చాటుకుంటూ పోస్ట్ చేశారు. కావ్యను తన ఇల్లుగా వర్ణిస్తూ ఆగస్టు 31న ఆయన సోషల్ మీడియాలో రాసిన కవితాత్మక భావాలు సినీ వర్గాల్లో ఆసక్తిని రేపాయి. నెలల తరబడి సాగుతున్న ప్రచారానికి ఈ నిర్ణయంతో అధికారిక ప్రకటన వచ్చినట్లయింది. కాలభైరవ కావ్య కళ్యాణ్‌రామ్ లవ్ వ్యవహారం ఇప్పుడు టాలీవుడ్లో ప్రధాన చర్చనీయాంశంగా మారింది. వీరి పరిచయం 2023లో శ్రీసింహ కథానాయకుడిగా తెరకెక్కిన ఉస్తాద్ సినిమా చిత్రీకరణ సమయంలో ప్రారంభమైనట్లు సమాచారం. ఆ సినిమాలో కావ్య కథానాయికగా నటించగా, కాలభైరవతో ఏర్పడిన స్నేహం క్రమంగా ప్రేమగా మారింది. మార్చి 2026లో హైదరాబాద్ వేదికగా జరిగిన ఒక పుస్తకావిష్కరణ కార్యక్రమంలో ఇద్దరూ జంటగా కనిపించడంతో ప్రచారం ఊపందుకుంది. ఇరు కుటుంబాలు ఈ సంబంధానికి అంగీకారం తెలిపినట్లు కథనాలు వచ్చినప్పటికీ ఇన్నాళ్లూ అధికారిక ధృవీకరణ లేదు. కావ్యతో గడిపే ప్రతి క్షణం పచ్చని పర్వతాల మధ్య జలపాతాన్ని చూస్తున్నంత ప్రశాంతంగా ఉంటుందని కాలభైరవ పేర్కొన్నారు. చలికాలపు ఉదయం వేడి కాఫీలా ఆమె మాటలు హాయినిస్తాయని, ఆమెను కలిసినప్పుడు ఎన్నాళ్ల నుంచో వెతుకుతున్న సొంత గూటికి చేరుకున్న భావన కలిగిందని తెలిపారు. దీంతో ఇన్నాళ్లూ వీరి వ్యవహారంపై ఉన్న సందేహాలన్నీ తొలగిపోయి స్పష్టత వచ్చింది. ఇదిలా ఉండగా ఈ ప్రేమికుల భావోద్వేగ ప్రకటనకు సినీ అభిమానుల నుంచి విశేష స్పందన లభిస్తోంది. మొదట ఈ అనుబంధాన్ని ఏమని పిలవాలో తెలియలేదని, కాలక్రమంలో ఇది కేవలం ఆకర్షణ మాత్రమే కాదని అర్థమైందని కాలభైరవ వెల్లడించారు. జీవితాంతం ఒకరికొకరు అండగా నిలవాలని నిర్ణయించుకున్నట్లు అందరితో పంచుకోవడం సంతోషంగా ఉందని ఆయన వివరించారు. ఈ నేపథ్యంలో టాలీవుడ్‌కి చెందిన పలువురు ప్రముఖులు, నెటిజన్లు ఈ జంటకు పెద్దఎత్తున శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ప్రేమని ఇంత సున్నితంగా చెప్పడం ఆయనకే సాధ్యమని నెటిజన్లు కొనియాడుతున్నారు. ఆస్కార్ విజేత ఎం.ఎం. కీరవాణి కుమారుడైన కాలభైరవ

కేజీఎఫ్’ వంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత కన్నడ రాకింగ్ స్టార్ యశ్ తదుపరి చిత్రం ప్రకటించడానికి దాదాపు రెండేళ్ల సమయం తీసుకున్నారు. ఆ తర్వాత మరో రెండేళ్ల పాటు సుదీర్ఘంగా షూటింగ్ జరుపుకుని భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘టాక్సిక్’ మూవీ బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయి ఫలితాన్ని అందుకోలేకపోయింది. మొదటి నుంచే ఈ సినిమాకు నెగిటివ్ టాక్ రావడంతో వసూళ్లు ఆశించిన స్థాయిలో రాకపోయినా నాలుగు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ. 254 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టి తన స్టామినాను నిరూపించుకుంది. అయితే ‘టాక్సిక్’ ఆశించిన విజయాన్ని సాధించకపోవడంతో ఇప్పుడు యశ్ నెక్స్ట్ సినిమా ఏంటనేది ఆసక్తికరంగా మారింది. యష్ లైనప్‌లో ప్రస్తుతం బాలీవుడ్ మల్టీస్టారర్ ‘రామాయణ్’ చిత్రం ఉంది. ఇందులో ఆయన రావణుడి పాత్రలో కనిపిస్తుండటంతో, అభిమానులు ‘టాక్సిక్’ రిజల్ట్‌తో సంబంధం లేకుండా ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇదిలా ఉంటే, యష్ తదుపరి సోలో ప్రాజెక్ట్ కోసం ‘సప్త సాగరాలు దాటి’ ఫేమ్ హేమంత్ ఎం రావు పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఈ సినిమాకు హేమంత్‌తో పాటు యశ్ కూడా సహ రచయితగా వ్యవహరిస్తున్నారని టాక్ వినిపిస్తున్నప్పటికీ ‘టాక్సిక్’ ఫలితం తర్వాత ఈ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్తుందో లేదో వేచి చూడాలి. దీనితో పాటు ‘కేజీఎఫ్ 3’ అధికారికంగా ప్రకటించినప్పటికీ అది త్వరలో ఉండే అవకాశం తక్కువ. అలాగే ‘సర్దార్’ దర్శకుడు పి.ఎస్. మిత్రన్ మరియు టాలీవుడ్ ప్రముఖ నిర్మాత దిల్ రాజుతో కూడా యశ్ ప్రాజెక్ట్‌లు చర్చల దశలో ఉన్నాయి

అమరావతి: నిరుద్యోగులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీపికబురు చెప్పింది. మొత్తంగా 10,060 పోస్టులతో జాబ్ క్యాలెండర్ 2026ను (ap job calendar 2026) విడుదల చేసింది. మొత్తం నాలుగు దశల్లో ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సెప్టెంబరు, అక్టోబరు నెలల్లో నోటిఫికేషన్లు విడుదల చేయనున్నారు. గ్రూప్- 1లో 149 పోస్టులు, గ్రూప్- 2లో 673 ఉద్యోగాలు, విద్యాశాఖలో 2,995 పోస్టుల (టీచర్ పోస్టులు సహా)తో పాటు పోలీస్, ఫైర్, జైళ్లు, అటవీ, పశు సంవర్ధక, ఎక్సైజ్, ఇంజినీరింగ్, విద్యుత్ తదితర శాఖల్లో ఖాళీలను భర్తీ చేయనున్నట్లు (ap government jobs notifications latest 2026) ఆర్థికశాఖ ఉత్తర్వుల్లో పేర్కొంది. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు. విశాఖలో బ్రిక్స్ దేశాల క్రీడామంత్రుల సదస్సు ప్రారంభమైంది. తిరుమల శ్రీవారిని మాజీ ముఖ్యమంత్రి దివంగత నందమూరి తారక రామారావు కుటుంబసభ్యులు దర్శించుకున్నారు

జి.కొండూరు: ఎన్టీఆర్ జిల్లా జి.కొండూరు మండలం కట్టుబడిపాలెం వద్ద శనివారం ఓ ప్రైవేటు పాఠశాల బస్సు ప్రమాదానికి గురైంది. పిల్లలను తీసుకెళ్తున్న పాఠశాల బస్సు అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న తారకరామా ఎత్తిపోతల కాలువలోకి దూసుకెళ్లింది. ఇబ్రహీంపట్నం నుంచి కవులూరు వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో దాదాపు 40 మంది విద్యార్థులు ఉన్నట్లు సమాచారం. వారిలో ముగ్గురు విద్యార్థులకు స్వల్ప గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న విద్యార్థుల తల్లిదండ్రులు.. స్థానికుల సాయంతో చిన్నారులను విజయవాడ ఆసుపత్రికి తరలించారు. జి.కొండూరు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఘటనపై ఆరా తీశారు. కాలువలో పడిన బస్సును బయటకు తీయించారు. దర్యాప్తు చేస్తున్నట్లు జి.కొండూరు పోలీసులు తెలిపారు. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు

నేడు మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఆయన అభిమానులకు అదిరిపోయే కానుక లభించింది. ఆయన కథానాయకుడిగా నటిస్తున్న భారీ బడ్జెట్ సోషియో ఫాంటసీ చిత్రం 'విశ్వంభర' నుంచి చిత్రబృందం స్పెషల్ పోస్టర్‌తో పాటు ఒరిజినల్ సౌండ్ ట్రాక్‌ను (OST) విడుదల చేసింది. ఈ అప్డేట్తో మెగా అభిమానులు సోషల్ మీడియాలో సంబరాలు చేసుకుంటున్నారు.విడుదల చేసిన కొత్త పోస్టర్లో చిరంజీవి అత్యంత పవర్ఫుల్, మెగా మాస్ అవతార్‌లో దర్శనమిచ్చారు. చేతిలో ఓ ప్రత్యేకమైన ఆయుధాన్ని పట్టుకుని, శత్రువులపైకి దూసుకెళుతున్నట్లుగా ఉన్న ఆయన లుక్ సినిమాపై అంచనాలను అమాంతం పెంచేసింది. "మెగా మాస్ బియాండ్ ది యూనివర్స్" అనే ఆసక్తికరమైన ట్యాగ్‌లైన్‌ను ఈ పోస్టర్‌కు జోడించారు. పోస్టర్‌తో పాటు విడుదల చేసిన ఓఎస్టీ కూడా సినిమా థీమ్‌ను ప్రతిబింబిస్తూ గూస్బంప్స్ తెప్పిస్తోంది.యూవీ క్రియేషన్స్, ఏఏ ఆర్ట్స్, వీఆర్ గ్లోబల్ మీడియా సంస్థలు సంయుక్తంగా అత్యంత ప్రతిష్ఠాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ఈ సినిమాలో చిరంజీవి సరసన ప్రముఖ నటి త్రిష హీరోయిన్గా నటిస్తుండగా, ఆషికా రంగనాథ్, కునాల్ కపూర్, మౌనీ రాయ్, పునీత్ ఇస్సార్ వంటి భారీ తారాగణం కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఆస్కార్ విజేత ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తుండగా, చోటా కె. నాయుడు సినిమాటోగ్రఫీ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ప్రస్తుతం ఈ స్పెషల్ పోస్టర్, ఓఎస్టీ సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో ఉన్నాయి. మెగాస్టార్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ చిత్రబృందం ఇచ్చిన ఈ సర్ప్రైజ్తో అభిమానులు పండగ చేసుకుంటున్నారు

సాధారణ ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని మూటగట్టుకున్న వైసీపీ.. స్థానిక సంస్థల ఎన్నికల్లో అయినా నాలుగు సీట్లు దక్కించుకోవాలనే ప్రయత్నంలో ఉంది. అమరావతి, ఆగస్టు 22: 2024 సాధారణ ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని మూటగట్టుకున్న వైసీపీ.. స్థానిక సంస్థల ఎన్నికల్లో అయినా నాలుగు సీట్లు దక్కించుకోవాలనే ప్రయత్నంలో ఉంది. ఈ క్రమంలోనే కుట్ర రాజకీయాలకు తెరతీస్తోందన్న ప్రచారమూ జరుగుతోంది. హత్యలు, దాడులనే నమ్ముకుని పాలిటిక్స్ చేస్తోందని వినిపిస్తోంది

నేటి రాశి ఫలాలు.. ఈరోజు శ్రీపర బావ నామ సంవత్సరం, శ్రావణమాసం, వర్షఋతువు, దక్షిణాయనం, 2026 ఆగస్టు 22 శనివారం. పండితుల ప్రకారం ఈరోజు అదృష్టం కలిసి వచ్చే రాశులు ఏవి? ఏ రాశులు కొత్త పనులు ప్రారంభించకూడదు? అనే పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. మేష రాశి వారు ఈరోజు చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రతి నిర్ణయాన్ని ఆచితూచి తీసుకోవాలి. ప్రయాణాలను వాయిదా వేయడం మంచిది. ఆరోగ్యంపై ప్రభావం పడే అవకాశం ఉన్నందున కోపాన్ని తగ్గించుకోవాలి. కుటుంబ సభ్యులతో సఖ్యత పెంచుకోవడానికి ప్రయత్నించండి. మిథున రాశి వారికి ఈరోజు శుభకరంగా ఉంటుంది. కొత్త నిర్ణయాలు తీసుకుంటారు. కీలకమైన పనులను ప్రారంభిస్తారు. పెండింగ్‌లో ఉన్న పనులను కూడా పూర్తి చేస్తారు. ఆర్థికంగా కలిసివచ్చే రోజు కావడంతో ప్రాంతీయ ప్రయాణాలు చేస్తారు. బంధుమిత్రులతో కలిసి సంతోషంగా గడుపుతారు. కర్కాటక రాశి వారికి ఈరోజు శుభకరం. మీరు తీసుకునే కొత్త నిర్ణయాలు సానుకూలంగా సాగుతాయి. అయితే కోపాన్ని నియంత్రించుకోవడం మంచిది.. ఇతరులతో అనవసరపు గొడవలకు దిగకండి. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండండి. పని ప్రదేశంలో మంచి ప్రశంసలు పొందుతారు. కుంభ రాశి వారికి కూడా ఈరోజు అనుకూలంగా ఉంటుంది. కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు. పెండింగ్‌లో ఉన్న పనులను పూర్తి చేస్తారు. కార్యాలయంలో మంచి గుర్తింపు, ప్రశంసలు లభిస్తాయి. సమాజంలో గౌరవం పెరుగుతుంది. ఆరోగ్య పరంగా కూడా ఈరోజు బాగుంటుంది. మీన రాశి వారు ఈరోజు చాలా చురుకుగా ఉంటారు. దూర ప్రయాణాలు చేసే అవకాశం ఉంది.. దీనివల్ల లాభాలు కలుగుతాయి. బంధుమిత్రులతో కలిసి సరదాగా గడుపుతారు.(Disclaimer: ఇక్కడ అందించిన జ్యోతిష్య సమాచారం సాధారణ నమ్మకాలు, పంచాంగాలు, జ్యోతిష్య అభిప్రాయాల ఆధారంగా మాత్రమే ఇవ్వబడింది. దీనిని శాస్త్రీయంగా నిర్ధారించబడిన సమాచారంగా పరిగణించరాదు. ఈ సమాచారాన్ని Zee Telugu News స్వతంత్రంగా ధృవీకరించలేదు.)

ఇండిపెండెంట్ ఆర్టిస్టులను ప్రోత్సహించే తరుణంలో ప్రముఖ సంగీత దర్శకుడు కీరవాణి గారు ఇటీవల లేథోవిస్ అనే మ్యూజిక్ లేబుల్ ప్రారంభించడం జరిగింది. ఈ లేబుల్ ద్వారా ఇప్పటికే నాలుగు పాటలు ఆ పాటలు మ్యూజిక్ లవర్స్ నుండి అద్భుతమైన ఆదరణను పొందాయి. కొన్ని నెలల క్రితం ఏర్పాటు చేసిన ఈ లేబుల్ ద్వారా వచ్చిన తొలి గీతం ముమ్ముకుస్సు వివిధ భాషలలో రావడంతో ప్రత్యేక ఆదరణ లభించింది. ఆ తర్వాత వచ్చిన రాసింది కీరవాణి కూసింది చంద్రబోస్ అంటూ సాగే పాటకు గాయని లిప్సిక తన గాత్రం అందించారు. ఆ తరువాత వచ్చిన రాహుల్ సిప్లిగన్జ్ సర్పంచ్ కూతురు వైరల్ గా మారిన విషయం అందరికీ తెలిసిందే. ఈ లేబుల్ నుండి వచ్చిన నాలుగవ పాట అన్‌ఫైర్ లైఫ్ ఒక వినూత్న విధంగా షార్ట్ ఫిలిం తరహాలో వచ్చింది. అయితే ఇప్పుడు ఈ లేబుల్ నుండి వచ్చిన 5వ పాటను ప్రముఖ మలయాళ సింగర్ సితార కృష్ణకుమార్ గారు పాడటం మరొక సంచలనం. ఆమెతో కలిసి కీరవాణి గారు తొలిసారి వీడియోలో కనిపిస్తూ రానున్న సాంగ్ చాయురంగ్. ఈ నెల 28న విడుదలకు సిద్ధమవుతున్న ఈ పాటకు సంబంధించిన పోస్టర్ విడుదల చేయడంతో ఈ పాట పై ఇప్పటికే మ్యూజిక్ లవర్స్ నుండి ఎన్నో ప్రశంసలు వస్తున్నాయి. ఇప్పటికే ఈ లేథోవిస్ మ్యూజిక్ లేబుల్ నుండి వచ్చిన పాటలకు ప్రేక్షకుల నుండి అద్భుతమైన స్పందన లభించడంతో ఈ పాట ఎలా ఉండబోతుందో అంటూ అందరూ ఈ పాటపై ఎన్నో అంచనాలను పెట్టుకున్నారు. ఈ పాట గురించి తెలిసిన వారంతా ఈ పాట కీరవాణి గారి మనసులో నుండి పుట్టుకు వచ్చిన పాటగా చెప్తున్నారు. దీనితో ఈ పాట ఏ స్థాయిలో ఉండబోతుందో అంటూ ప్రేక్షకులలో మరింత అంచనాలు పెరిగాయి. అంతేకాక ఈ లేథోవిస్ మ్యూజిక్ లేబుల్ నుండి మరెన్నో పాటలు రానున్నట్లు, రాబోయే కొన్ని

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్ స్టైల్ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. Sawan putrada Ekadashi 2026 date rituals: శ్రావణ మాసంను పండగల మాసం అని కూడా పిలుస్తారు. ఈ మాసంలో ప్రతి రోజు ఏదో ఒక పండగను మనం జరుపుకుంటాం. శ్రావణ సోమ, మంగళ, శుక్ర, శనివారాలలో చాలా మంది ఉపవాసాలు చేస్తారు. శ్రావణ మంగళ గౌరీ వ్రతాలు, వరలక్ష్మీ వ్రతం, జన్మాష్టమి, మొదలైనవి మనం జరుపుకుంటాం. అయితే.. శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే ఏకాదశికి పుత్రదా ఏకాదశి అని పిలుస్తారు. అంతే కాకుండా ఈరోజు చాలా మంది సంతానం లేని వారు భక్తితో ఆ విష్ణు భగవానుడ్ని పూజించుకుంటారు. ఈ సారి మనం శ్రావణ మాసం వేళ ఆదివారం రోజు అంటే ఆగస్టు 23న పుత్రదా ఏకాదశిని జరుపుకుంటాం. ఏకాదశి తిథి తెల్లవారు జామున 5 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఉంది. చాలా మంది పుత్రదా ఏకాదశి రోజున ఉపవాసం ఉంటారు. విష్ణుభగవానుడ్ని యథా శక్తి మేరకు షోడషోపచారాలతో పూజలు చేసుకొవాలి. సత్యనారాయణ వ్రతం విశేషమైన గొప్పఫలితాలను ఇస్తుంది. అంతే కాకుండా స్వామి వారికి ఐదురకాల ఫలాల నివేదన, కొబ్బరికాయలు, స్వీట్ల నివేదన చేయాలని పండితులు సూచిస్తుంటారు. తులసీదళాలు స్వామివారికి అత్యం ప్రీతికరమైనది. ఈ విధంగా భక్తి శ్రద్దలతో విష్ణుమూర్తిని, అమ్మవారిని పూజించుకొవాలి. చాలా మంది పెళ్లైన జంటలు సంతానంలేక అనేక సమస్యలు పడుతారు. అలాంటి వారు పుత్రదా ఏకాదశి రోజు శ్రీమన్నారాయణుడ్ని భక్తితో కొలుచుకొవాలి. సంతాన వేణుగోపాల స్వామినికొలుచుకుంటూ ఆయన మంత్రాలను జపించాలి. Read more: Varalakshmi Vratam 2026 Date:వరలక్ష్మీ వ్రతం ఆగస్టు

ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, టెక్నాలజీ రంగంలో తీసుకొస్తున్న మార్పులు, అమరావతి అభివృద్ధి ప్రణాళికలను అమెరికాలోని ఐటీ పారిశ్రామికవేత్తలకు ఏపీ టెక్నాలజీ సర్వీసెస్ ఛైర్మన్ మన్నవ మోహన కృష్ణ వివరించారు. కూటమి ప్రభుత్వం విధానాలతో టెక్నాలజీ, పెట్టుబడులకు అనుకూల వాతావరణం క్వాంటం వ్యాలీతో అమరావతిని భవిష్యత్ టెక్నాలజీ కేంద్రంగా అభివృద్ధి చేసే ప్రణాళిక గ్లోబల్ టెక్నాలజీ సంస్థలు ఏపీలో తమ కార్యకలాపాలు విస్తరించేందుకు విస్తృత అవకాశాలు ప్రవాసాంధ్ర పారిశ్రామికవేత్తలు రాష్ట్ర ప్రగతిలో భాగస్వాములు కావాలి కొత్త పెట్టుబడులతో రాష్ట్ర యువతకు మరిన్ని ఉపాధి అవకాశాలు అమెరికా (న్యూజెర్సీ): ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, టెక్నాలజీ రంగంలో తీసుకొస్తున్న మార్పులు, అమరావతి అభివృద్ధి ప్రణాళికలను అమెరికాలోని ఐటీ పారిశ్రామికవేత్తలకు ఏపీ టెక్నాలజీ సర్వీసెస్ ఛైర్మన్ మన్నవ మోహన కృష్ణ వివరించారు. న్యూజెర్సీలో ప్రవాసాంధ్ర ఐటీ పారిశ్రామికవేత్తలతో జరిగిన సమావేశంలో రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలపై చర్చించారు. క్వాంటం వ్యాలీతో అమరావతికి కొత్త గుర్తింపు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దార్శనికత, ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ చొరవతో ఆంధ్రప్రదేశ్‌ను ఆధునిక టెక్నాలజీ రంగాల్లో ముందుకు తీసుకెళ్లేందుకు ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా పనిచేస్తోందని మన్నవ మోహన కృష్ణ తెలిపారు. అమరావతిలో ప్రతిష్ఠాత్మకంగా అభివృద్ధి చేయనున్న ‘క్వాంటం వ్యాలీ’ రాష్ట్ర టెక్నాలజీ ప్రస్థానంలో కీలక అడుగుగా నిలుస్తుందని ఆయన పేర్కొన్నారు. క్వాంటం కంప్యూటింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డీప్‌టెక్, పరిశోధన, ఆవిష్కరణల వంటి రంగాల్లో కొత్త అవకాశాలకు ఇది వేదికగా మారనుందని తెలిపారు. 'చంద్రబాబు నాయకత్వంలో గతంలో హైదరాబాద్ ఐటీ రంగంలో ప్రత్యేక గుర్తింపు సాధించింది. ఇప్పుడు అదే దార్శనికతతో అమరావతిని భవిష్యత్తు టెక్నాలజీకి కేంద్రంగా అభివృద్ధి చేసే అవకాశం మన ముందుంది. క్వాంటం వ్యాలీ ఈ ప్రయాణంలో కీలక భాగం' అని మన్నవ మోహన కృష్ణ అన్నారు. అంతర్జాతీయ సంస్థలతో భాగస్వామ్యాలు, అమరావతి అభివృద్ధి, క్వాంటం టెక్నాలజీ వంటి రంగాల్లో ప్రభుత్వం తీసుకుంటున్న

శ్రావణ శుక్రవారం వరలక్ష్మీ వ్రతం సందర్భంగా ఇంద్రకీలాద్రిపై వెలసిన విజయవాడ కనకదుర్గమ్మ ఆలయానికి భక్తులు పోటెత్తారు. వరలక్ష్మీ దేవిగా దుర్గమ్మ దర్శనమిస్తున్నారు. విజయవాడ, ఆగస్టు 21: శ్రావణ శుక్రవారం వరలక్ష్మీ వ్రతం సందర్భంగా ఇంద్రకీలాద్రిపై వెలసిన విజయవాడ కనకదుర్గమ్మ ఆలయానికి భక్తులు పోటెత్తారు. వరలక్ష్మీ దేవిగా దుర్గమ్మ దర్శనమిస్తున్నారు. అమ్మవారికి దర్శించుకునేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు. దీంతో భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని అంతరాలయ దర్శనాన్ని ఆలయ అధికారులు రద్దు చేశారు. జై దుర్గా జై జై దుర్గా నామస్మరణతో ఇంద్రకీలాద్రి మారుమోగుతోంది. వరలక్ష్మీ వ్రతం సందర్భంగా దుర్గమ్మ ఆలయంతోపాటు రాష్ట్రంలో పలు ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. తెల్లవారుజాము నుంచే భక్తులు అమ్మవారి ఆలయాలకు చేరుకుని ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. అలాగే కొన్ని ఆలయాల్లో సామూహిక వరలక్ష్మీ వ్రతాలు నిర్వహించారు. ఏలూరు జిల్లా: జిల్లాలోని ద్వారకాతిరుమల కుంకుళ్లమ్మ ఆలయంలో శ్రావణ శుక్రవారం పూజలు నిర్వహించారు. శాకంబరీ దేవి అలంకరణలో కుంకుళ్లమ్మ అమ్మవారు.. భక్తులకు దర్శనమిస్తున్నారు. శ్రావణ శుక్రవారం సందర్భంగా ఆలయంలో ప్రత్యేకంగా చండీ హోమం నిర్వహించారు. భక్తులు.. అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలను స్వీకరిస్తున్నారు. ప.గో: భీమవరం మావుళ్లమ్మకు నాలుగు లక్షల గాజులతో అలంకరించారు.శ్రావణ శుక్రవారం, వరలక్ష్మి వ్రతం సందర్భంగా అమ్మవారిని ఆలయ అర్చకులు, అధికారులు ప్రత్యేక అలంకరణ చేశారు. ఇందుకోసం భక్తులు నాలుగు లక్షల గాజులను సమర్పించారు. నెల్లూరు: జిల్లాలో శ్రావణ శుక్రవార పండుగ వేడుకలు ఘనంగా నిర్వహించారు. మహిళా భక్తులతో ఆలయాలు కిటకిటలాడుతున్నాయి. శ్రావణ శుక్రవారం సందర్భంగా ఆలయాల్లో ప్రత్యేక పూజలు, విశేషార్చనలు, సామూహిక వరలక్ష్మీ వ్రతాలు నిర్వహించారు. తిరుపతి: తాతయ్యగుంట గంగమ్మ గుడిలో సామూహిక వరలక్ష్మి వ్రతం నిర్వహించగా.. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అమ్మవారిని గాజులు, వజ్రకిరీటంతో ప్రత్యేకంగా అలంకరించారు. అటు తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయ ఆస్థాన మండపంలో వరలక్ష్మి వ్రతం వైభవంగా నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. విశాఖపట్నం: శ్రావణమాసం రెండో శుక్రవారం

ఏపీ రాజధాని అమరావతిలో SBI సిబ్బంది నివాస గృహ సముదాయానికి కీలక ముందడుగు పడింది. ఎస్బీఐ హౌసింగ్ ప్రాజెక్ట్‌కు సంబంధించి SBI-APCRDA మధ్య భూ అగ్రిమెంట్ పూర్తైంది. అమరావతి, ఆగస్టు 21: ఏపీ రాజధాని అమరావతిలో SBI సిబ్బంది నివాస గృహ సముదాయానికి కీలక ముందడుగు పడింది. ఎస్బీఐ హౌసింగ్ ప్రాజెక్ట్‌కు సంబంధించి SBI-APCRDA మధ్య భూ అగ్రిమెంట్ పూర్తైంది. ఐనవోలులో మొత్తం 2.05 ఎకరాల్లో SBI నివాస సముదాయాన్ని నిర్మించనున్నారు. దాదాపు రూ.214 కోట్లతో SBI హౌసింగ్ ప్రాజెక్ట్‌ను చేపట్టనున్నారు. 4.46 లక్షల చదరపు అడుగుల బిల్ట్-అప్ ఏరియాతో నిర్మాణం జరుగనుంది. జూన్, 2027లో నిర్మాణ పనులు ప్రారంభంకానున్నాయి. 2028లోపు నివాస సముదాయం పూర్తి చేయడమే లక్ష్యమని అధికారులు వెల్లడించారు. ఇక, లింగాయపాలెం-ఉద్దండరాయునిపాలెంలో 3 ఎకరాల్లో SBI ప్రాంతీయ కార్యాలయాన్ని నిర్మించనున్నారు. SBI కార్యాలయానికి గతంలో కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ శంకుస్థాపన చేసిన విషయం తెలిసిందే. రాజధాని అమరావతిని జాతీయ స్థాయి ఆర్థిక, పరిపాలనా కేంద్రంగా అభివృద్ధి చేయాలనే లక్ష్యానికి ఎస్బీఐ ప్రాంతీయ కార్యాలయం, ఎస్బీఐ సిబ్బంది నివాస సముదాయ నిర్మాణం మరో ముఖ్యమైన అడుగుగా నిలవనుంది. ఎంపీ అవినాశ్ రెడ్డికి షాక్.. ఇళ్లు, కార్యాలయాల్లో ఈడీ సోదాలు.. అన్నవరం బస్టాండ్‌లో మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ఆకస్మిక తనిఖీలు
జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, మేష రాశి వారికి కుజుడు అధిపతిగా ఉంటాడు. ఈ గ్రహం ప్రభావంతో ఏ పని అయినా చాలా కష్టపడి చేస్తారు. తాము అనుకున్న పనులు పూర్తయ్యేంత వరకు విశ్రాంతి అనేదే తీసుకోరు. అందుకే వీరికి వరమహాలక్ష్మీ అనుగ్రహం లభిస్తుంది. వీరు తాము చేసే పనులన్నీ నిజాయితీగా చేస్తారు. అంతేకాదు వీరికి నాయకత్వ సామర్థ్యాలు కూడా ఎక్కువగా ఉంటాయి. ఈ కారణంగా వీరు జీవితంలో బాగా రాణిస్తారు. అన్నింటికంటే ముఖ్యంగా మహాలక్ష్మీ అనుగ్రహం భారీ ప్రయోజనాలు పొందే అవకాశం ఉంది. ఈ కారణంగా వీరికి జీవితంలో వీరికి డబ్బు లోటు అనేదే ఉండదు. జ్యోతిష్యశాస్త్రం ప్రకారం వృషభ రాశి వారికి శుక్రుడు అధిపతిగా ఉంటాడు. వరమహాలక్ష్మీ అనుగ్రహంతో వీరు అన్ని రంగాల్లో మంచి విజయం సాధించే అవకాశం ఉంది. వీరు అనుకున్న పనులను సకాలంలో పూర్తి చేసేందుకు ప్రయత్నిస్తారు. మీ ఆదాయం కూడా పెరుగుతుంది. మీ ఇంట్లో శుభకార్యాలు నిర్వహించే అవకాశాలున్నాయి. అంతేకాదు వీరు నలుగురిలో చాలా సులభంగా కలిసిపోతారు. లక్ష్మీదేవి ఆశీస్సులతో వీరు సురక్షితమైన జీవించడానికి ఇష్టపడతారు. మిథున రాశి వారు బుధుడి ప్రభావంతో చాలా సౌమ్యంగా ఉంటారు. వీరు వరమహాలక్ష్మీ అనుగ్రహంతో మానసికంగా చాలా బలంగా ఉంటారు. వీరికి ఆత్మవిశ్వాసం కూడా ఎక్కువగా ఉంటుంది. సొంతంగా వ్యాపారం చేయాలనుకునే వారికి సమయం అనుకూలంగా ఉంటుంది. లక్ష్మీదేవి అనుగ్రహంతో మంచి సక్సెస్ కూడా సాధించొచ్చు. కెరీర్ పరంగా అద్భుతమైన విజయం సాధిస్తారు. కన్య రాశి వారికి బుధుడు అధిపతిగా ఉంటాడు. వీరు ఎల్లప్పుడూ నిజాయితీతో పని చేస్తారు. అందుకే వీరికి లక్ష్మీదేవి అనుగ్రహం లభించనుంది. వీరు ఎలాంటి పనులైనా సకాలంలో పూర్తి చేసేందుకు ప్రయత్నిస్తారు. అందుకే వీరు కెరీర్ పరంగా మంచి పురోగతి సాధిస్తారు. అంతేకాదు వీరు ఎల్లప్పుడూ ఇతరులకు సాయం చేసేందుకు సిద్ధంగా ఉంటారు. లక్ష్మీదేవి ఆశీస్సులు కూడా పుష్కలంగా లభించడంతో వీరికి ఆర్థిక సమస్యలేనే ఉండవు. రచయిత గురించిఎస్.వెంకటేష్ఎస్.వెంకటేష్

భారత్‌కు భవిష్యత్తులో చైనాతోనే ప్రధాన పోటీ ఉంటుందని ఆర్మీ మాజీ చీఫ్ జనరల్ మనోజ్ నరవణే వ్యాఖ్యానించారు. భారత్‌పై పాక్ ఉగ్రవాదాన్ని ఉసిగొల్పుతున్నందున దాయాదిపై దృష్టిపెట్టాల్సి వస్తోందని చెప్పారు. ఇంటర్నెట్ డెస్క్: భారత్‌కు భవిష్యత్తులో చైనాతోనే ప్రధాన పోటీ ఉంటుందని ఆర్మీ మాజీ చీఫ్ జనరల్ మనోజ్ నరవణే వ్యాఖ్యానించారు. భారత్‌పై పాక్ ఉగ్రవాదాన్ని ఉసిగొల్పుతున్నందున దాయాదిపై దృష్టిపెట్టాల్సి వస్తోందని చెప్పారు. పలు రంగాల్లో చైనా భారత్‌కు ప్రధాన పోటీగా మారుతోందని అన్నారు. తాను రచించిన నూతన పుస్తకం ‘ది క్యూరియస్ అంది క్లాసిఫైడ్: అన్ఎర్తింగ్ మిలిటరీ మిథ్స్ అండ్ మిస్టరీస్’ విడుదల సందర్భంగా జనరల్ నరవణే ఈ వ్యాఖ్యలు చేశారు. 2019-22 మద్య నరవణే భారత ఆర్మీ చీఫ్‌గా వ్యవహరించిన విషయం తెలిసిందే. పాక్, చైనాలతో భారత్ ఎదుర్కొంటున్న సమస్యలు భిన్నమైనవని జనరల్ నవరణే అన్నారు. ‘రెండు దేశాలతోనూ మనం యుద్ధాలు చేశాము. వాళ్లతో ఎప్పటికీ ముప్పు ఉంటూనే ఉంటుంది. పాక్‌తో నాలుగు యుద్ధాలు జరిగాయి. ఉగ్రవాదం ఎగదోస్తున్న పాక్‌పై దృష్టి పెట్టాల్సి వస్తోంది. కానీ నా అభిప్రాయం ప్రకారం, దీర్ఘకాలంలో చైనాతోనే భారత్‌కు ప్రధాన పోటీ ఉంటుంది. నేను చైనాను శత్రువుగా కాకుండా పోటీదారుగా పేర్కొనడానికి కారణం కూడా ఉంది. కేవలం యుద్ధరంగంలోనే కాకుండా రాజకీయాలు, ఆర్థికరంగం, వాణిజ్య రంగాల్లో కూడా చైనాతో పోటీ ఉంటోంది’ ‘పోటీ ఉన్న చోట ఎంతో కొంత ఘర్షణ ఉంటూనే ఉంటుంది. అయితే, ఈ పొరపొచ్చాలను దౌత్యం, చర్చల ద్వారానే పరిష్కరించుకోవాలి. మరో మార్గం లేనప్పుడే బలప్రయోగానికి దిగాలి. ఒక్కోసారి ఈ పరిస్థితి ఎదురు కావొచ్చు. అలాంటి సమయాల్లో ప్రత్యర్థి ఒకింత వెనకడుగు వేసేలా మిలిటరీ సామర్థ్యాలను అందిపుచ్చుకోవాలి. భౌగోళిక రాజకీయాల్లోనైనా, వ్యక్తిగత జీవితంలో అయినా మన ఇరుగుపొరుగుగా ఎవరు ఉంటారనేది చెప్పలేము. కాబట్టి, అందుబాటులో ఉన్న అవకాశాలను పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలి’ అని జనరల్ నరవణే అన్నారు. దేశాభివృద్ధికి దక్షిణ రాష్ట్రాలే మూలస్తంభాలు మహారాష్ట్ర
శ్రావణ మాసం వచ్చిందంటే ప్రతి ఇల్లూ కళకళలాడిపోతుంది. పూజలు, వ్రతాలతో లక్ష్మీ కళ ఉట్టిపడుతుంది.హిందువులకు శ్రావణ మాసం వచ్చిందంటే పండగ వాతావరణమే. మహిళలు తాము ముస్తాబవ్వడమే కాకుండా ఇంటిని కూడా చూడచక్కని విధంగా అలంకరిస్తారు. దాంతో ప్రతి శుభకార్యంలో తప్పక కావాల్సిన తమలపాకు ధరకు రెక్కలు వచ్చాయి. ప్రతీ తాంబూలంలోనూ తమలపాకే ముఖ్యం. తమలపాకు లేనిదే ఏ శుభకార్యం కూడా జరగదు. దాంతో తమలపాకుతో పాటు అరటిపళ్లు, కొబ్బరి కాయలు, పూల రేట్లకు రెక్కలు వచ్చాయి.రాష్ట్రంలో ఎక్కువగా ఉన్న చింతలపూడి, మాచవరం, ములుకుదురు ప్రాంతాల్లో తమలపాకు తోటలు ఉన్నాయి. రైతు వద్ద తక్కువకే కొనుగోలు చేస్తున్న వ్యాపారులు.. తమ కొట్లల్లో మాత్రం భారీగా అమ్మేస్తున్నారు. ఎందుకంటే పండగ సీజన్లో తమలపాకుకు ఉన్న డిమాండ్ అలాంటిది. రైతు వద్ద 150 ఆకుల కట్టను రూ. 16కు కొనుగోలు చేస్తున్న వ్యాపారులు.. విడిగా ప్రజలకు మాత్రం ఒక్కొక్కటి రూపాయి చొప్పున విక్రయిస్తున్నారు. మంగళగిరి ప్రాంతంలో అయితే 30 ఆకులను రూ. 50 వరకు వసూలు చేస్తున్నారు.READ ALSO గోదావరి నది మధ్యలో క్యాండిల్ లైట్ డిన్నర్.. అందమైన బోటు, ఆ లోపల బెడ్డు.. పర్యాటకులకు స్వర్గమే, ఫుల్ డీటెయిల్స్ ఇవిగో!తమలపాకుతో పాటు కొబ్బరి కాయలు కూడా భారీగా పెరిగాయి. శ్రావణ మాసానికి ముందు కొబ్బరి కాయ సైజును బట్టి రూ. 15 నుంచి రూ. 35 మధ్య అమ్మేవారు. ప్రస్తుతం మీడియం సైజు కాయ ధరే రూ. 50 ఉంది. అరటి పళ్లు కూడా గతంలో డజను రూ. 40 నుంచి రూ. 60 వరకు అమ్మేవారు. ఇప్పుడు అదే అరటి కాయ ప్రాంతాన్ని బట్టి పెరిగిపోయింది. యావరేజ్‌గా రూ. 80 నుంచి రూ. 100 వరకు అమ్మేస్తున్నారు.వర్షాభావ పరిస్థితుల్లో పూలకు మంచి డిమాండ్ పెరిగింది. వర్షాలు సరిగా లేకపోవడంతో కాల్వల కింద, బోర్ల కింద పండిస్తూ భారీ లాభాలు ఆర్జిస్తున్నారు. గతంలో రూ. 200 లోపే

భారత్‌కు ప్రస్తుతం పాకిస్థాన్ నుంచి ఉగ్రవాద ముప్పు ఎక్కువగా ఉందని మాజీ ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ నరవణె అన్నారు. అయితే రాబోయే రోజుల్లో భారత్‌కు చైనానే ప్రధాన పోటీదారుగా మారుతుందని చెప్పారు. రాజకీయాలు, ఆర్థిక వ్యవస్థ, వాణిజ్యం, సైనిక రంగాల్లో చైనాతో పోటీ పెరుగుతుందని అంచనా వేశారు.తన కొత్త పుస్తకం ‘ది క్యూరియస్ అండ్ ది క్లాసిఫైడ్’ ఆవిష్కరణ కార్యక్రమంలో గురువారం ఆయన మాట్లాడారు. పాకిస్థాన్, చైనాలతో భారత్ గతంలో యుద్ధాలు చేసిందని గుర్తు చేశారు. రెండు దేశాలతోనూ సరిహద్దు సమస్యలు ఇంకా ఉన్నాయని తెలిపారు.ఉగ్రవాదానికి పాకిస్థాన్ మద్దతు కొనసాగుతుండటంతో ప్రస్తుతం పశ్చిమ సరిహద్దుపైనే భారత్ ఎక్కువ దృష్టి పెట్టాల్సి వస్తోందన్నారు. అందుకే పాకిస్థాన్ తక్షణ భద్రతా సవాలుగా ఉందని చెప్పారు.అయితే దీర్ఘకాలంలో చైనాతో పోటీ మరింత పెరుగుతుందని నరవణె అన్నారు. చైనాను తాను ‘శత్రువు’గా కాకుండా ‘పోటీదారు’గా చూస్తున్నట్లు చెప్పారు. పోటీ ఉన్నచోట విభేదాలు రావడం సహజమేనన్నారు.చైనాతో ఉన్న సమస్యలను చర్చలు, సంభాషణల ద్వారానే పరిష్కరించేందుకు ప్రయత్నించాలని సూచించారు. బలప్రయోగం చివరి మార్గంగా ఉండాలని చెప్పారు. అదే సమయంలో దేశ భద్రత కోసం బలమైన సైనిక శక్తి అవసరమని స్పష్టం చేశారు. ఎలాంటి దుస్సాహసాన్నైనా అడ్డుకునే స్థాయిలో సైన్యం సిద్ధంగా ఉండాలని అన్నారు.నేపాల్, భూటాన్, బంగ్లాదేశ్, మయన్మార్ వంటి పొరుగు దేశాల్లో స్థిరత్వం ఉండేలా భారత్ సహకరించాలని నరవణె పేర్కొన్నారు. పొరుగు దేశంలో అశాంతి పెరిగితే శరణార్థులు, అక్రమ రవాణా, మాదకద్రవ్యాలు, అక్రమ ఆయుధాల సమస్యలు భారత్‌పైనా ప్రభావం చూపుతాయని హెచ్చరించారు.శాంతే భారత్ ప్రధాన

హిందూ సంప్రదాయంలో శ్రావణ మాసానికి అత్యంత విశిష్ట స్థానం ఉంది. పరమశివుడికి అత్యంత ప్రీతిపాత్రమైన ఈ మాసంలో భక్తులు పూజలు, కఠిన ఉపవాసాలు, అభిషేకాలను ఎంతో భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తూ ఉంటారు. శ్రావణ మాసంలో జపతాపాలు, నిత్య పూజా కార్యక్రమాలు మాత్రమే కాకుండా, దానధర్మాలు చేయడం కూడా అంతే ముఖ్యమైన విధిగా పురాణాలు చెబుతున్నాయి. ఈ పవిత్ర కాలంలో చేసే దానాలు అనంత పుణ్యఫలాలతో పాటు మానసిక ప్రశాంతతను కలిగిస్తాయి.వైదిక శాస్త్రాల ప్రకారం, శ్రావణ మాసంలో చేసే దానాల వల్ల కష్టాలు, జాతక దోషాలు తొలగిపోతాయి. పేదలకు వారి అవసరాన్ని బట్టి తోచిన సహాయం చేయడం వల్ల సత్కర్మల ప్రభావం గణనీయంగా పెరుగుతుంది. మన శక్తి కొద్దీ ఇతరులకు దానధర్మాలు చేయడం ద్వారా ఆ భోళాశంకరుని అనుగ్రహం నేరుగా భక్తులపై ప్రసరిస్తుందని నమ్ముతారు. ఈ పవిత్ర మాసంలో ఎటువంటి వస్తువులను దానం చేయాలో స్పష్టంగా తెలుసుకోవడం మంచి ఫలితాలను ఇస్తుంది.గాజులు, పసుపు, కుంకుమ ఇవ్వడం ఆనవాయితీ. ఇవే కాకుండా మరికొన్ని ఉన్నాయి. ఈ మాసంలో దానం చేయాల్సిన వస్తువులలో మొదటిగా చెప్పుకోవాల్సింది.. ఆహార ధాన్యాలు, అన్నదానం. పేదలకు అన్నం పెట్టడం లేదా అవసరమైనన్ని వారికి బియ్యం, పప్పులు వంటి నిత్యావసర ఆహార ధాన్యాలను దానంగా సమర్పించడం చాలా శ్రేయస్కరం. ఈ విధమైన దానం చేయడం వల్ల ఇంట్లో ధనధాన్యాలకు ఎన్నడూ కొరత రాదని, లక్ష్మీదేవి ఎప్పుడూ ఇంట కొలువై ఉంటుందని విశ్వసిస్తారు. పూర్వీకుల ఆశీస్సులు కూడా లభిస్తాయి.పూలు, పండ్ల రేట్లు స్కైరాకెట్: ఇప్పటి దాకా ఒక లెక్క.. ఇక నుంచి మరో లెక్కగ్రహ పీడల నివారణ కోసం నల్ల నువ్వులు, కొంత నగదును దానం చేయడం ఎంతో మంచిది. శ్రావణ మాసంలో నల్ల నువ్వులను దానం చేయడం వల్ల.. ముఖ్యంగా శని దేవుని ఆగ్రహం, జాతకంలోని శని మహాదశ ప్రభావాలు చాలా వరకు తగ్గుముఖం పడతాయని పురాణాలు చెబుతున్నాయి. జీవితంలో ఎదుర్కొంటున్న మానసిక ఆందోళనలు, కోర్టు/ఆస్తి

సర్గం రవి కుమార్. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. Varalakshmi Vratham 2026 Guide: హిందూవులు.. ముఖ్యంగా తెలుగువారు అత్యంత భక్తిప్రపత్తులతో శ్రావణమాసం చేసుకుంటారు. ఈ మాసంలో అత్యంత పవిత్రంగా దైవ చింతనలో మునుగుతారు. శ్రావణమాసంలో ఇప్పటికే నాగులపంచమి ముగిసిపోగా.. ఈ మాసంలో వరాలు కురిపించే వరలక్ష్మిని పూజిస్తారు. ఎంతో భక్తిశ్రద్ధలతో వరలక్ష్మి అమ్మవారిని మహిళలు కొలుస్తారు. తమ మాంగళ్య బలం బలంగా ఉండాలని.. కోరిన కోరికలు తీరాలని వరలక్ష్మి అమ్మవారిని పూజిస్తారు. శ్రావణమాసంలో వచ్చిన రెండో శుక్రవారం రోజు వరలక్ష్మీ వ్రతం చేయనున్నారు. వరలక్ష్మీ వత్రం ఎలా చేయాలి? పూజా విధానం ఏమిటనేది తెలుసుకుందాం. వ్రతానికి ఏర్పాట్లు ఉదయాన్నే ఇల్లు శుభ్రం చేసుకోవాలి. పూజా స్థలం అంటే పూజా మందిరంతోపాటు వ్రతం చేసే ప్రదేశం చోట ముగ్గు వేయాలి. వ్రతానికి సిద్ధం చేసుకున్న పీటపై కొత్త వస్త్రం పరచాలి. అనంతరం వరలక్ష్మి అమ్మవారి విగ్రహం లేదా ఫొటో ఉంచాలి. మామిడి తోరణాలు, ఆరటి ఆకులతో వ్రతం ప్రదేశాన్ని అలంకరించండి. ఇంటి గుమ్మానికి మామిడి తోరణాలు, బంతిపూలతో అలంకరించాలి. కలశం ఏర్పాటు అనంతరం అమ్మవారి విగ్రహం లేదా ఫొటో ఎదుట చిన్న కలశం ఏర్పాటుచేయాలి. కలశంలో నీరు పోసి పసుపు, ఒక నాణెం వేయాలి. అనంతరం పైన మామిడి ఆకులు లేదా తమలపాకులు ఉంచి కొబ్బరికాయ ఉంచాలి. కలశం లేకున్నా అమ్మవారి ఫొటోతో కూడా పూజ చేయవచ్చు. వినాయక పూజ ఏ పూజలో అయినా కూడా మొదట వినాయకుడిని పూజించడం సంప్రదాయం. అదే మాదిరి వరలక్ష్మీ వ్రతం ప్రారంభానికి ముందుగా వినాయకుడిని పూజంచాలి. అనంతరం వరలక్ష్మి అమ్మవారిలి అవాహన చేసుకోవాలి. ఓం శ్రీ వరలక్ష్మి నమః అని భక్తితో

అమృతలూరు: వేమూరు నియోజకవర్గం కొల్లూరు మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన 13 మందికి ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా రూ.5,30,852 నిధులు మంజూరయ్యాయి. గురువారం ఎమ్మెల్యే నక్కా ఆనంద బాబు.. లబ్ధిదారులకు, వారి కుటుంబ సభ్యులకు సహాయనిధి చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్న కుటుంబాలకు కూటమి ప్రభుత్వం వైద్య ఖర్చులు సమకూర్చి ఆర్థిక భరోసా కల్పిస్తోందని పేర్కొన్నారు. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు

తమిళనాడులోని మహాబలిపురం వేదికగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధ్యక్షతన జరిగిన 31వ సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశం దక్షిణాది రాష్ట్రాల భవిష్యత్తుకు సరికొత్త దిశానిర్దేశం చేసింది. ఈ కార్యక్రమానికి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, తమిళనాడు సీఎం విజయ్, కర్ణాటక సీఎం డీకే శివ కుమార్, కేరళ సీఎం సతీషన్, తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్, పలువురు సీనియర్ అధికారులు పాల్గొన్నారు ఈ కీలక సదస్సులో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమర్పించిన సమగ్ర అభివృద్ధి ప్రణాళిక సమావేశానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.ప్రాంతీయ సహకారం, మౌలిక వసతుల విస్తరణ, నదీ జలాల సమర్థ నిర్వహణపై చంద్రబాబు విజన్‌ను కర్ణాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌తో పాటు ఇతర రాష్ట్రాల ప్రతినిధులు ప్రశంసలతో ముంచెత్తారు. ఒక సీనియర్ రాజకీయ వేత్తగా కేవలం సొంత రాష్ట్రానికే పరిమితం కాకుండా, మొత్తం దక్షిణాది ప్రాంతాన్నంతా ఒక ఆర్థిక శక్తిగా తీర్చిదిద్దే ప్రతిపాదనలను ఆయన సదస్సు ముందుంచారు.అమరావతి-బెంగళూరు-చెన్నై బుల్లెట్ కారిడార్!దక్షిణాదిలో రవాణా రంగాన్ని విప్లవాత్మకంగా మార్చేందుకు ఏపీ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలను అనుసంధానిస్తూ ప్రత్యేక బుల్లెట్ ట్రైన్ కారిడార్‌ను ఏర్పాటు చేయాలని సీఎం చంద్రబాబు ప్రతిపాదించారు. ముఖ్యంగా అమరావతి, బెంగళూరు, చెన్నై నగరాలను అనుసంధానిస్తూ కుప్పం మీదుగా ఈ హైస్పీడ్ రైలు మార్గాన్ని నిర్మించాలని సూచించారు.దీంతో పాటు దక్షిణాది వ్యాప్తంగా సమర్థవంతమైన లాజిస్టిక్స్ నెట్వర్క్, డ్రై పోర్టుల ఏర్పాటు, విద్యుత్ గ్రిడ్‌ను జాతీయ గ్రిడ్‌తో మరింత పటిష్టంగా అనుసంధానించాలని స్పష్టం చేశారు. విపత్తుల సమయంలో రాష్ట్రాలు ఒకదానికొకటి తక్షణమే సహకరించుకునేలా మ్యూచువల్ ఎయిడ్ ఫోర్స్ ఏర్పాటుతో పాటు, తిరుపతి నుంచి కాశీ, అయోధ్య, చార్ధామ్ వరకు ఉమ్మడి ఆధ్యాత్మిక పర్యాటక సర్క్యూట్‌ను అభివృద్ధి చేయాలని కోరారు.దక్షిణాది సీఎంల దండయాత్ర.. అమిత్ షా ముందు జల జగడం! 2047 నాటికి 10 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక శక్తి!దేశ జీడీపీలో ప్రస్తుతం దక్షిణాది రాష్ట్రాల వాటా

Mahesh Babu’s Varanasi Music Album Update: ‘సూపర్‌స్టార్’ మహేష్ బాబు హీరోగా, దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కిస్తున్న ప్రతిష్టాత్మక పాన్ వరల్డ్ చిత్రం ‘వారణాసి’. ఈ మూవీ కోసం సినీ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ సినిమాపై ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి. మహేష్, రాజమౌళి కాంబినేషన్లో వస్తున్న తొలి చిత్రం కావడంతో.. ఈ ప్రాజెక్ట్‌పై ప్రేక్షకుల్లో మరింత ఆసక్తి నెలకొంది. వారణాసి సినిమాకు లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన కాన్సెప్ట్ గ్లింప్స్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌తో పాటు పాటలు కూడా సినిమాపై అంచనాలను మరింత పెంచాయి. తాజాగా వారణాసి మ్యూజికల్ ఆల్బమ్ గురించి కీరవాణి చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. వారణాసి ఆల్బమ్ చాలా గ్రాండ్‌గా ఉండబోతుందని, సినిమాలో మొత్తం ఆరు పాటలు ఉండనున్నట్లు చెప్పారు. ఇప్పటికే విడుదలైన ‘రణ కుంభ’, ‘సంచారి’ పాటలు ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో పాటు చార్ట్‌బస్టర్స్‌గా నిలిచాయి. అయితే ఎంఎం కీరవాణి చెప్పిన ఆరు పాటల సంఖ్యపై ప్రస్తుతం అభిమానుల్లో ఓ సందేహం నెలకొంది. ఇప్పటికే విడుదలైన రణ కుంభ, సంచారి పాటలను కలుపుకుని మొత్తం ఆరు పాటలు ఉంటాయా?.. లేదా ఆ రెండు పాటలకు అదనంగా మరో ఆరు పాటలు ఉండనున్నాయా? అనే విషయంలో ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. దీనిపై చిత్ర బృందం అధికారికంగా క్లారిటీ ఇవ్వాల్సి ఉంది. రాజమౌళి సినిమాల్లో సంగీతానికి ఉండే ప్రత్యేకత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన విజన్‌కు కీరవాణి సంగీతం తోడైతే.. తెరపై ఎలాంటి అద్భుతం జరుగుతుందో అభిమానులు ఇప్పటికే చూశారు. ఇక వారణాసిలో ఆ అద్భుతం మరింత ఎక్కువగా ఉంటుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇప్పటికే విడుదలైన పాటలు, గ్లింప్స్‌కు వస్తున్న స్పందన చూస్తుంటే వారణాసి మ్యూజిక్ ఆల్బమ్ కూడా భారీ విజయాన్ని అందుకోవడం పక్కా

మిలాద్-ఉన్-నబి పండుగకు సంబంధించిన సెలవు తేదీని మారుస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ముందుగా ప్రకటించిన ఆగస్టు 25కు బదులుగా ఆగస్టు 26వ తేదీని(బుధవారం) సాధారణ సెలవు దినంగా ప్రకటించింది. అమరావతి, ఆగస్టు 20: మిలాద్-ఉన్-నబి పండుగకు సంబంధించిన సెలవు తేదీని మారుస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ముందుగా ప్రకటించిన ఆగస్టు 25కు బదులుగా ఆగస్టు 26వ తేదీని(బుధవారం) సాధారణ సెలవు దినంగా ప్రకటించింది. చంద్ర దర్శనం ఆధారంగా ఈ ఏడాది మిలాద్-ఉన్-నబి పండుగ ఆగస్టు 26న వస్తుందని ఏపీ స్టేట్ వక్ఫ్ బోర్డు ప్రభుత్వానికి తెలియజేసింది. సెలవు తేదీని సవరించాలని వక్ఫ్ బోర్డు సీఈఓ చేసిన విజ్ఞప్తి మేరకు సెలవు తేదీని సవరిస్తూ నిర్ణయం తీసుకుంది. ఆగస్టు 26ను సాధారణ సెలవు దినంగా ప్రకటిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జె. శ్యామల రావు అధికారికంగా జీవో జారీ చేశారు. అయ్యో పాపం.. ఫ్లోర్, లిఫ్ట్‌కి మధ్యలో ఇరుక్కుని అనకాపల్లి జిల్లాలో BARC ప్రాజెక్టుకు రిలీఫ్.. స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజుల మినహాయింపు

Singer Hemachandra: శ్రావణ భార్గవితో విడాకులపై తొలిసారి నోరు విప్పిన హేమచంద్ర! Sravana Bhargavi: ప్రముఖ టాలీవుడ్ నేపథ్య గాయకుడు హేమచంద్ర తన వ్యక్తిగత జీవితంపై, ముఖ్యంగా భార్య శ్రావణ భార్గవితో విడాకులు తీసుకుంటున్నారంటూ వస్తున్న వార్తలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. తాజా ఇంటర్వ్యూలో గత మూడేళ్లుగా తమపై చెలరేగుతున్న ఊహాగానాలపై స్పందిస్తూ, మీడియాలో జరుగుతున్న చర్చల తీరుపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. కొన్ని యూట్యూబ్ ఛానెళ్లు క్లిక్‌బైట్, సంచలనాల కోసం దారుణమైన థంబ్‌నైల్స్ క్రియేట్ చేస్తున్నాయని హేమచంద్ర మండిపడ్డారు.ఆవేదన వ్యక్తం చేసిన సంఘటన: తన కుమార్తె తల్లిదండ్రులు తిరిగి కలవాలని వేడుకుంటున్నట్లు రూపొందించిన ఒక వీడియో థంబ్‌నైల్‌ను ప్రస్తావిస్తూ తీవ్రంగా స్పందించారు. మా ఇంట్లో ఎప్పుడూ జరగని విషయాన్ని మీరెలా చిత్రీకరిస్తారు? ఏం పిచ్చి దొబ్బిందా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటువంటి క్రియేటివిటీ చూపించడాన్ని పక్కన పెడితే, కుటుంబ సభ్యులతో పంచుకోలేని, సమాజంలో సిగ్గుపడే పనులను ఎవరూ చేయకూడదని హెచ్చరించారు. ఎవరైనా కుట్రపూరితంగా ప్రచారాలు చేసినప్పుడు వాటికి అనవసరంగా బహిరంగ స్పష్టత ఇవ్వాల్సిన అవసరం లేదని ఆయన అభిప్రాయపడ్డారు. వ్యక్తిగత జీవితంలో ఏవైనా సమస్యలు ఎదురైనప్పుడు వాటిని పబ్లిక్ డొమైన్లో పెట్టి ప్రొలాంగ్ చేయకుండా, కొంత సమయం తీసుకుని ప్రైవేటుగా పరిష్కరించుకోవాలి.సెలబ్రిటీల వ్యక్తిగత విషయాలపై చేసే ఇటువంటి చర్చలు, పబ్లిక్ స్పేస్‌లో లేని వారి కుటుంబ సభ్యులపై, ముఖ్యంగా ఇంట్లోని పెద్దలు, పిల్లలపై తీవ్రమైన ప్రభావం చూపుతాయని ఆందోళన వ్యక్తం చేశారు. తన భావోద్వేగాలు, ఆలోచనా విధానాన్ని అర్థం చేసుకోవడానికి తన ‘ADHD’ ఆల్బమ్ వినాలని హేమచంద్ర సూచించారు.ఈ ఆల్బమ్‌లోని "యు ఆర్ మైన్" అనే పాట తన నిజమైన భావోద్వేగాల ప్రవాహమని చెప్పారు. కొంచెం తెలివైన వ్యక్తి అయితే ఆ ఆల్బమ్ వినగానే నా మనసులోని సమాధానం ఏంటో స్పష్టంగా అర్థమవుతుంది అని వ్యాఖ్యానించారు. అంతేకాకుండా, తన భార్య శ్రావణ భార్గవి గురించి మాట్లాడుతూ.. ఆమె ఒక అద్భుతమైన

ఆంధ్రప్రదేశ్ శాసనసభ, శాసనమండలి వర్షాకాల సమావేశాలు నేటితో ముగియనున్నాయి. చివరి రోజు ఉభయ సభల్లో పలు కీలక అంశాలపై చర్చలు, బిల్లుల ఆమోదం, నివేదికల సమర్పణ జరగనున్నాయి. అమరావతి: ఆంధ్రప్రదేశ్ శాసనసభ, శాసనమండలి వర్షాకాల సమావేశాలు నేటితో ముగియనున్నాయి. చివరి రోజు ఉభయ సభల్లో పలు కీలక అంశాలపై చర్చలు, బిల్లుల ఆమోదం, నివేదికల సమర్పణ జరగనున్నాయి. ఉభయ సభల్లో జల కాలుష్య నివారణ, నియంత్రణ సవరణ చట్టం-2024ను ఆమోదించాలని కోరుతూ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఏకగ్రీవ తీర్మానాన్ని ప్రవేశపెట్టనున్నారు. అలాగే, శాసనసభలో ప్రభుత్వం రెండు బిల్లులను ప్రవేశపెట్టి ఆమోదింపజేయనుంది. ఈ మేరకు శాసనసభలో పంచాయతీరాజ్ చట్ట సవరణ బిల్లును డిప్యూటీ సీఎం ప్రవేశపెట్టనుండగా.. ఒప్పంద ఉద్యోగుల సేవల క్రమబద్ధీకరణ సవరణ బిల్లును సభ ముందుకు మంత్రి పయ్యావుల కేశవ్ తీసుకురానున్నారు. అలాగే, ఉభయ సభల్లో వన్యప్రాణులు, పర్యావరణ పరిరక్షణ కమిటీ నివేదికను ఎమ్మెల్యేలు గొండు శంకరరావు, వేగేశన నరేంద్రవర్మ రాజు ప్రవేశపెట్టనున్నారు. సూపర్ సిక్స్-ప్రజా సంక్షేమంపై శాసనసభలో స్వల్పకాలిక చర్చ జరగనుంది. మరోవైపు, ఇప్పటికే అసెంబ్లీలో ఆమోదం పొందిన బిల్లులకు నేడు శాసనమండలి ఆమోదం తెలిపే అవకాశం ఉంది. శాసనసభలో ప్రశ్నోత్తరాల సమయంలో ప్రైవేట్ నెట్వర్క్ ఆస్పత్రుల్లో వైద్య సేవల నిలుపుదల, గ్రామ పంచాయతీల్లో నిధుల దుర్వినియోగం, నిరుద్యోగ భృతి, తిరుపతి గ్రామీణ మండలంలో గృహ నిర్మాణాల క్రమబద్ధీకరణ, భీమవరంలోని సమీకృత కలెక్టరేట్ కార్యాలయ సముదాయం వంటి అంశాలపై సభ్యులు ప్రశ్నలు సంధించనున్నారు. అన్నదాత సుఖీభవ-పీఎం కిసాన్ పథకాల కింద నిధుల మంజూరు, తీరప్రాంతాల్లో మౌలిక సదుపాయాలు, భవ్య పథకం కింద పారిశ్రామిక పార్కులు, ఎరువుల కోసం యాప్స్, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు సొంత భవనాల నిర్మాణంపైనా మంత్రులు సమాధానాలు ఇవ్వనున్నారు. శాసనమండలిలో పీఎం విద్యాలక్ష్మి పథకం, గోదావరి పుష్కరాలకు నిధులు, కాపు కార్పొరేషన్‌కు నిధులు, విద్యా హక్కు చట్టం, మహిళలకు ఆర్థిక సహాయం వంటి అంశాలపై ప్రశ్నోత్తరాలు జరగనున్నాయి. రాయలసీమ ఎత్తిపోతల

'విజువల్ ఎఫెక్ట్స్' లేకుండా ప్రస్తుతం తెలుగు సినిమా సాగడం లేదు. ఇక ఫాంటసీ మూవీస్ లో గ్రాఫిక్స్ తప్పనిసరి. 'విజువల్ ఎఫెక్ట్స్' లేకుండా ప్రస్తుతం తెలుగు సినిమా సాగడం లేదు. ఇక ఫాంటసీ మూవీస్ లో గ్రాఫిక్స్ తప్పనిసరి. వీఎఫ్ఎక్స్ కారణంగా పలు సినిమాల బడ్జెట్ పెరుగుతోంది. వీటివల్లే కొన్ని చిత్రాల రిలీజ్ డేట్స్ తారుమారవుతున్నాయి. వీఎఫ్ఎక్స్ కారణంగానే రెండు ఫాంటసీ పిక్చర్స్ నత్త నడకన పయనిస్తున్నాయట. ఆ రెండు సినిమాలేవో? అభూతకల్పనలతో తెరకెక్కే చిత్రాలకు గ్రాఫిక్స్ మాయాజాలం అత్యంత అవసరం. 'వీఎఫ్ఎక్స్' వర్క్ సవ్యంగా సాగితే అనుకున్న సమయానికే సినిమాలను రిలీజ్ చేయవచ్చు. అందులో ఓ సారి జాప్యం చోటు చేసుకుంటే చాలు- విడుదల తేదీలను వాయిదా వేసుకుంటూ పోవలసిందే. మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) హీరోగా వశిష్ఠ దర్శకత్వంలో యూవీ క్రియేషన్స్ సంస్థ నిర్మించిన విశ్వంభర (Vishwambhara) చిత్రం వాస్తవానికి గత యేడాది సంక్రాంతి సంబరాలకే రావలసింది. ఆ సమయంలో రామ్ చరణ్ గేమ్ చేంజర్ కోసం తాము బరి నుండి తప్పుకుంటున్నామని ప్రకటించారు మేకర్స్. తరువాత వేసవికి వస్తుందని, ఆ పై దసరాకు రానుందని టముకు సాగింది. కానీ, 'విశ్వంభర' ఇప్పటికీ వెలుగు చూడలేదు. కారణమేంటంటే- 'విశ్వంభర' కోసం ఇంతకు ముందు చేయించిన గ్రాఫిక్ వర్క్ అంత ఎఫెక్ట్ గా లేకపోవడంతో మొత్తం మళ్ళీ రిపీట్ చేయవలసి వచ్చిందట. అందువల్లే 'విశ్వంభర' పోస్ట్ పోన్ అవుతూ వచ్చింది. ఇప్పుడు అక్టోబర్ 16న రిలీజ్ కానుందని తెలుస్తోంది. 'విశ్వంభర'లాగే నాగచైతన్య హీరోగా కార్తిక్ వర్మ దండు (Karthik Varma Dandu) దర్శకత్వంలో బీవీయస్.యన్. ప్రసాద్ నిర్మిస్తోన్న వృషకర్మ (Vrushakarma) కూడా విజువల్ ఎఫెక్ట్స్ కారణంగా ఆలస్యమవుతోందని సమాచారం. ఈ సినిమా మిథికల్ యాక్షన్ అడ్వెంచర్ గా రూపొందుతోంది. కాబట్టి గ్రాఫిక్ వర్క్ అత్యవసరం. అయితే ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ లో వీఎఫ్ఎక్స్ రూపొందించాలని మేకర్స్ భావించారు. అందువల్ల రాజీ పడకుండా విజువల్ ఎఫెక్ట్స్ సిద్ధం

సముద్రంలో గల్లంతైన మత్స్యకారుల కుటుంబాలకు ఎప్పటికప్పుడు గాలింపు చర్యలకు సంబంధించిన వివరాలు తెలియచేస్తూ ఉండాలని ఉన్నతాధికారులను సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశించారు. అమరావతి, ఆగస్టు 19: సముద్రంలో గల్లంతైన మత్స్యకారుల కుటుంబాలకు ఎప్పటికప్పుడు గాలింపు చర్యలకు సంబంధించిన వివరాలు తెలియచేస్తూ ఉండాలని ఉన్నతాధికారులను సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశించారు. సముద్రంలో చేపల వేటకు వెళ్లి గల్లంతైన కోనసీమ జిల్లాలోని మత్స్యకారుల గాలింపు చర్యలపై సీఎం చంద్రబాబు బుధవారం ఆరా తీశారు. వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడుతోపాటు ఉన్నతాధికారులతో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా ఉన్నతాధికారులతో సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి అచ్చెన్నాయుడు వర్చువల్‌గా సమావేశమయ్యారు. సముద్రంలో గల్లంతైన మత్స్యకారుల ఆచూకీని కనుగొనేందుకు గాలింపు చర్యలను మరింత ముమ్మరం చేయాలని ఈ సందర్భంగా వారిని ఆదేశించారు. గాలింపు చర్యలు ఏ మేరకు జరుగుతున్నాయని వారిని సీఎం అడిగి తెలుసుకున్నారు. మత్స్యకారుల ఆచూకీ కోసం కోస్ట్ గార్డ్స్, మెరైన్ పోలీసులు గాలిస్తున్నారని సీఎంకు వారు వివరించారు. జిల్లా యంత్రాంగం ఎప్పటికప్పుడు గాలింపు చర్యలను పర్యవేక్షిస్తోందని తెలిపారు. ఇప్పటికే రెండు డార్నియర్ విమానాలు, నేవీ బోట్లతో పాటు మరో ఏడు బోట్లతో గాలింపు చర్యలు చేపట్టామని ఉన్నతాధికారులు వివరించారు. పారాదీప్‌కు 14 నాటికల్ మైళ్ల దూరంలో కొన్ని పడవలను గుర్తించామని.. వాటి గురించి ఆరా తీస్తున్నామని చెప్పారు. కాకినాడ, భైరవపాలెం, విశాఖపట్నం, పారాదీప్ ప్రాంతాలకు చెందిన మత్స్యకారులను కూడా అప్రమత్తం చేసి గల్లంతైన బోటు ఆచూకీపై సమాచారం సేకరిస్తున్నట్లు సీఎం చంద్రబాబు దృష్టికి ఉన్నతాధికారులు తీసుకెళ్లారు. వైసీపీ హయాంలో జరిగిన గ్రూప్-1 అక్రమాలపై కఠిన చర్యలు: సీఎం చంద్రబాబు తివాచీని ఇలా కూడా ఉతుకుతారా? వీడియో వైరల్

సర్గం రవి కుమార్. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. YS Jagan Padayatra: మరో ఏడాదిలో తన పాదయాత్ర మొదలవుతుందని వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రకటించారు. పాదయాత్ర జరిగిన తర్వాత ఏడాది ఎన్నికలు జరుగుతాయని.. ఎన్నికలు ఎప్పుడు జరిగినా తమదే (వైఎస్సార్సీపీ) విజయం అని పూర్తి విశ్వాసం ప్రకటించారు. నిత్యం ప్రజలతో మమేకమై పని చేయాలని వైఎస్సార్సీపీ శ్రేణులకు సూచించారు. 'అన్నింట్లో చంద్రబాబు విఫలమవడంతో వైఎస్సార్సీపీపై రోజురోజుకీ ప్రజాదరణ పెరుగుతోంది. అందుకే నాటి వైఎస్సార్సీపీ పరిపాలనను, ఇప్పుడు వెన్నుపోటు పార్టీ కూటమి పాలనతో పోల్చి చూస్తున్నారు. దీనిపై ప్రతి ఇంట్లో చర్చ జరుగుతోంది' అని మాజీ సీఎం వైఎస్ జగన్ తెలిపారు. స్థానిక యుద్ధానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. రాజమండ్రి రూరల్ అసెంబ్లీ నియోజకవర్గ వైఎస్సార్సీపీ స్ధానిక సంస్ధల ప్రజా ప్రతినిధులు, నాయకులు, ముఖ్య కార్యకర్తలతో ఆ పార్టీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సమావేశారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో వైఎస్ జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. 'స్థానిక సంస్థల ఎన్నికల పోరుకు సిద్ధం కండి. గెలుపే లక్ష్యంగా పని చేయాలి. వెన్నుపోటు పార్టీ కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉంది. ఏ ఒక్క వర్గమూ కూడా సంతోషంగా లేదు' అని తెలిపారు. ప్రజల్లో ఉన్న వ్యతిరేకత స్థానిక ఎన్నికల్లో కనిపించకుండా చేసేందుకు పోలీసులను ప్రయోగిస్తారు. అన్నీ ఎదుర్కొని యుద్ధం చేయాలి' అని పార్టీ శ్రేణులకు సూచించారు. మనకు అత్యంత ప్రజాదరణ ఉందని.. తప్పకుండా గెలుస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు. 'ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దారుణంగా శాంతి భద్రతలు దిగజారిపోయాయి. ఇసుక

అమరావతి: దేవాలయం లాంటి అసెంబ్లీని ఓ పార్టీ మొత్తం బహిష్కరించడం తన రాజకీయ జీవితంలోనే చూడలేదని ముఖ్యమంత్రి చంద్రబాబు (chandrababu) విమర్శించారు. అసెంబ్లీ లాబీలో మీడియాతో సీఎం చంద్రబాబు.. తాజా పరిణామాలపై కొద్దిసేపు ముచ్చటించారు. ప్రజా సమస్యలపై అసెంబ్లీలో చర్చిస్తేనే వాటికి విలువ, గుర్తింపు ఉంటుందని.. బయట కూర్చొని ఎంత మాట్లాడినా ప్రయోజనం ఉండదని స్పష్టం చేశారు. ప్రజాస్వామ్యంలో అసెంబ్లీ అత్యున్నత వేదిక అని తెలిపారు. 1978లో వెంకయ్యనాయుడు, జైపాల్‌రెడ్డి ఇద్దరే సభలో గట్టిగా మాట్లాడారని గుర్తు చేశారు. 1989-94లో ఎన్టీఆర్ కొన్ని రోజులు సభకు రాకపోయినా తామంతా పార్టీ తరఫున అసెంబ్లీలో ప్రజల కోసం పోరాడామని వివరించారు. 2019-24 మధ్య తాను సభలో సవాల్ చేసి బయటకు వచ్చినా తమ ఎమ్మెల్యేలు చివరి రోజు వరకు ప్రజా సమస్యలపై పోరాటం కొనసాగించారని వెల్లడించారు. ప్రజాస్వామ్యాన్ని చులకన చేసే ‘గొడ్డలి పార్టీ’ నాయకుడికి రాజకీయాలు అవసరమా? అని చంద్రబాబు నిలదీశారు. గ్రూప్-1 అక్రమాలను కప్పిపుచ్చుకునేందుకే సభకు రాకుండా బయట కూర్చొని డీఎస్సీపై బురద జల్లుతున్నారని ధ్వజమెత్తారు. గొడ్డలి ప్రభుత్వం కోత పెట్టిన బీసీ రిజర్వేషన్లను తామే పునరుద్ధరించామని, ప్రభుత్వం తీసుకున్న చరిత్రాత్మక నిర్ణయాన్ని అన్ని వర్గాలు స్వాగతిస్తున్నాయని చంద్రబాబు అన్నారు. గొడ్డలి పార్టీ నాయకుడు అసత్యాలు ఎన్ని చెప్పినా ప్రజలు నమ్మే పరిస్థితి లేదని.. అతని మాటలను ప్రజలు పట్టించుకోవడం లేదన్నారు. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు

వరల్డ్ ఫొటోగ్రఫీ డే సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఫొటో జర్నలిస్ట్‌గా మారారు. ఫొటో జర్నలిస్ట్‌లు అందరిని కలిపి సీఎం గ్రూప్ ఫొటో తీశారు. కెమెరా తీసుకుని తానే ఫొటో తీస్తానని చెప్పారు. అమరావతి, ఆగస్టు 19 (ఆంధ్రజ్యోతి): వరల్డ్ ఫొటోగ్రఫీ డే సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (AP CM Chandrababu Naidu) ఫొటో జర్నలిస్ట్‌గా మారారు. ఫొటో జర్నలిస్ట్‌లు అందరిని కలిపి సీఎం గ్రూప్ ఫొటో తీశారు. కెమెరా తీసుకుని తానే ఫొటో తీస్తానని చెప్పారు. వరల్డ్ ఫోటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా అసెంబ్లీ ప్రాంగణంలో ముఖ్యమంత్రి చంద్రబాబును ఫొటో జర్నలిస్ట్‌లు ఈరోజు (బుధవారం) కలిశారు. ఈ సందర్భంగా ఫొటో జర్నలిస్టులకు శుభాకాంక్షలు తెలిపారు. ఫొటోగ్రాఫర్లను కలవడం ఎంతో గౌరవంగా భావిస్తున్నా: సీఎం చరిత్రను నమోదు చేస్తూ.. జ్ఞాపకాలను పదిలపరుస్తున్న ఫొటోగ్రాఫర్లకు సీఎం అభినందనలు తెలిపారు. మానవ అనుభవాలను, అద్భుతమైన చిత్రాలుగా ఆవిష్కరిస్తున్న ఫొటోగ్రాఫర్లకు శుభాకాంక్షలు చెప్పారు. మీడియా, ప్రొఫెషనల్ ఫొటోగ్రాఫర్లను కలవడం ఎంతో గౌరవంగా భావిస్తున్నానని పేర్కొన్నారు. ఫొటోగ్రాఫర్ల అంకితభావం, కళాత్మకత, నిరంతర కృషి అభినందనీయమని ప్రశంసించారు. ప్రతి ఫొటో ఓ మధురమైన ఘట్టాన్ని పదిలపరుస్తుంది.. ఎన్నో చెప్పని కథలకు ఫొటోగ్రాఫర్లు తమ చిత్రాల ద్వారా గొంతుకనిస్తున్నారని సీఎం వ్యాఖ్యానించారు. ప్రతి ఫొటో భవిష్యత్తు తరాల కోసం కాలంలోని ఓ మధురమైన ఘట్టాన్ని పదిలపరుస్తుందని వివరించారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఫొటోగ్రాఫర్లకు సీఎం చంద్రబాబు శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలకు సమాచారం, స్ఫూర్తి అందించేలా చిరస్థాయిగా నిలిచే క్షణాలను మరింతగా బంధించాలని ఆకాంక్షించారు. ఈ మేరకు ఎక్స్‌లో సీఎం చంద్రబాబు పోస్టు పెట్టారు. 55కు పైగా అజెండా అంశాలతో ఏపీ క్యాబినెట్ భేటీ నిర్మలా సీతారామన్ నాయకత్వంలో భారత్ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగింది: పవన్

ప్రస్తుతం ఇండియన్ సినిమా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న అవైటెడ్ చిత్రాల్లో పాన్ వరల్డ్ లెవెల్ చిత్రం ‘వారణాసి’ కూడా ఒకటి. సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా గ్లోబల్ దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి కలయికలో వస్తున్న ఈ తొలి సినిమా కోసం ప్రపంచమే ఆసక్తిగా ఎదురు చూస్తుంది. అయితే ఈ సినిమాకి లెజెండరీ సంగీత దర్శకుడు ఎం ఎం కీరవాణి సంగీతం అందిస్తున్న సంగతి తెలిసిందే. కాన్సెప్ట్ గ్లింప్స్ కి ఇచ్చిన స్కోరే ఇప్పటికీ ఓ రేంజ్ లో హై ఇస్తూ వస్తుంది. ఇక మొత్తం సినిమాకి తన వర్క్ ఎలా ఉంటుందా అని అంతా మరింత ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో వారణాసి ఆల్బమ్ పై తాను బిగ్ క్లారిటీ అందించారు. ఇటీవల ఓ ఇంటరాక్షన్ లో కీరవాణి కామెంట్స్ వైరల్ గా మారాయి. వారణాసి ఆల్బమ్ ఎంతో గ్రాండియర్ గా ఉంటుంది అని ప్రామిస్ చేశారు. అంతే కాకుండా వారణాసి ఆల్బమ్ లో మొత్తం 6 పాటలు ఉన్నాయని ఖరారు చేశారు. వారణాసి ఆల్బమ్ నుంచి ఆల్రెడీ రెండు పాటలు వచ్చేసిన సంగతి తెలిసిందే. రణ కుంభ అలాగే సంచారి పాటలు చార్ట్ బస్టర్స్ అయ్యాయి. సో ఇంకా నాలుగు పాటలు మాత్రమే బాకీ ఉన్నాయని చెప్పొచ్చు. ఇవన్నీ ఎప్పుడు వస్తాయో చూడాలి మరి

ఆంధ్రప్రదేశ్ శాసన మండలి డిప్యూటీ చైర్మన్‌గా ఎమ్మెల్సీ తూమాటి మాధవరావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మాధవరావు ఎన్నికను మండలి చైర్మన్ మోషేన్ రాజు ప్రకటించారు. అమరావతి, ఆగస్టు 19: ఆంధ్రప్రదేశ్ శాసన మండలి డిప్యూటీ చైర్మన్‌గా ఎమ్మెల్సీ తూమాటి మాధవరావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మాధవరావు ఎన్నికను మండలి చైర్మన్ మోషేన్ రాజు ప్రకటించారు. అనంతరం మాధవరావును చైర్మన్ స్థానంలో కూర్చోబెట్టి అభినందించారు. మాధవరావును అధ్యక్ష స్థానంలో కూర్చోబెట్టేందుకు అన్ని పార్టీల సభ్యులు కలిసి రావాలని మండలి చైర్మన్ కోరారు. డిప్యూటీ చైర్మన్ ఎన్నికకు సంబంధించి పూర్తి వివరాలను పై వీడియోలో వీక్షించండి
హిందూ పురాణాల ప్రకారం, అష్టలక్ష్ముల్లో ఆదిలక్ష్మికి ఎంతో ప్రాధాన్యత ఉంది. ‘ఆది’ అంటే మొట్టమొదటిది అని అర్థం. మనం ఏదైనా సాధించాలంటే ముందుగా ఒక ఆలోచన, కచ్చితమైన లక్ష్యం, దాన్ని నెరవేర్చుకోవాలనే సంకల్పం కచ్చితంగా అవసరం పడుతుంది. అందుకే ఆదిలక్ష్మిని సంకల్పశక్తి, అంతరంగ బలం, ధార్మిక చైతన్యానికి ప్రతీకగా భావించొచ్చు. మనలో కొందరికి ధైర్యం పుష్కలంగా ఉంటుంది. అయితే జ్ఞానం లేకపోతే సక్సెస్ సాధించడం కష్టం. ఏ పనిలో అయినా విజయం సాధించాలంటే సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకోవాలి. అందుకు తెలివితేటలు, విద్య, జ్ఞానం, నైపుణ్యాలు చాలా అవసరం. వీటన్నింటికీ విద్యాలక్ష్మిని సంకేతంగా భావిస్తారు. అందుకే విద్యను అత్యంత విలువైన సంపదగా పరిగణిస్తారు. మనలో ప్రతి ఒక్కరికీ జీవితంలో కష్టాలు, సమస్యలు అనేవి ఎదురవుతూ ఉంటాయి. అయితే వాటిని చూసి భయపడకుండా ధైర్యంగా ఎదుర్కొనేందుకు శక్తి, సామర్థ్యాలు కావాలి. అందుకే ధైర్యలక్ష్మిని సాహసం, సహనం, ఆత్మవిశ్వాసానికి సంకేతంగా పరిగణిస్తారు. క్లిష్టమైన పరిస్థితుల్లో మనోధైర్యంగా ఉండేందుకు, అమ్మవారి అనుగ్రహం ముఖ్యమని పండితులు చెబుతారు. మనలో ప్రతి ఒక్కరికి ధైర్యం, విద్య, శక్తి, సామర్థ్యాలు ఎన్ని ఉన్నా గెలుపు సాధిస్తేనే అన్నింటికి ప్రయోజనం చేకూరుతుంది. అలాంటి శక్తిని అందించే దేవత విజయలక్ష్మి. గెలుపు అంటే కేవలం పరీక్షల్లో పాస్ అవ్వడం, మంచి ఉద్యోగం సంపాదించడం, వ్యాపారులు మంచి లాభాలు పొందడమే కాదు, మంచి ఆలోచనలతో జీవించడం, ధర్మబద్ధంగా లక్ష్యాలను చేరుకోవడమే నిజమైన గెలుపుకు అర్థం. మనలో ప్రతి ఒక్కరి జీవిత మనుగడ కోసం ఆహారం అత్యంత ముఖ్యమైనది. ఎంత డబ్బు ఉన్నా ఆహారం లేకుండా జీవితం సాఫీగా సాగదు. అందుకే ధాన్యలక్ష్మిని ఆహారం, వ్యవసాయానికి సంకేతంగా భావిస్తారు. ఇంట్లో ఉండే ఆహారాన్ని అన్నపూర్ణ దేవతగా భావించి పూజిస్తారు. అందుకే ఆకలితో ఉండే వారికి అన్నం పెట్టడం వల్ల ధాన్యలక్ష్మిని ఆశీస్సులు లభిస్తాయని చాలా మంది నమ్ముతారు. హిందూ సంప్రదాయం ప్రకారం, ధనలక్ష్మి అంటే డబ్బు, బంగారానికి

Rajahmundry: వైశ్య సంఘాలు రాజకీయాలకు అతీతంగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయని, వాటిపై రాజకీయ జోక్యం లేకుండా చూడాలని వైశ్య సంఘాల ప్రతినిధులు కోరారు. తమ సంఘీయులు అన్ని రాజకీయ పార్టీల్లో ఉన్నారని, అయితే సంఘాల విషయానికి వచ్చేసరికి పార్టీలతో సంబంధం లేకుండా సేవా కార్యక్రమాలను కొనసాగిస్తున్నామని తెలిపారు. సేవా సంస్థలపై రాజకీయ నీడలు పడకుండా మీడియా, ప్రజలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. మంగళవారం లాలాచెరువు రోడ్డులోని వైశ్య హాస్టల్లో నిర్వహించిన మీడియా సమావేశంలో కోట్ల కనకేశ్వరరావు, మద్దుల మురళీకృష్ణ, పందిరి వీరభద్రస్వామి, ఇన్నమూరి శ్రీరామచంద్రమూర్తి, ఇన్నమూరి దీపు తదితరులు మాట్లాడారు. ఇటీవల వైఎంవిఏ హాలుకు లిఫ్ట్ ఏర్పాటు చేసే విషయంలో వస్తున్న వార్తలపై వారు వివరణ ఇచ్చారు. సేవే ప్రధాన లక్ష్యం కోట్ల కనకేశ్వరరావు మాట్లాడుతూ రాజమహేంద్రవరంలో ఎన్ని వైశ్య సంఘాలు ఉన్నప్పటికీ అందరి ప్రధాన లక్ష్యం సేవాభావమేనని తెలిపారు. సంఘాల్లో అన్ని రాజకీయ పార్టీలకు చెందిన వారు సభ్యులుగా ఉన్నప్పటికీ పార్టీలు, రాజకీయాలకు ఎప్పుడూ ప్రాధాన్యం ఇవ్వలేదన్నారు. విద్యార్థులకు విద్య, వసతి వంటి సేవలను అందిస్తూ అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని చెప్పారు. వైశ్య సంఘాల ఆధ్వర్యంలోని విద్యా సంస్థల్లో వందలాది మంది విద్యార్థులు వసతి పొందుతూ మంచి ఉత్తీర్ణత సాధిస్తున్నారని తెలిపారు. సేవా సంస్థల్లో రాజకీయ జోక్యం వల్ల సభ్యులకు ఇబ్బందులు ఎదురవుతాయని ఆవేదన వ్యక్తం చేశారు. వైశ్య సంస్థలపై రాజకీయ నీడలు పడకుండా మీడియా, ప్రజలు సహకరించాలని కోరారు.లిఫ్ట్ నిర్మాణానికి ప్రభుత్వ నిధులు తీసుకోలేదు మద్దుల మురళీకృష్ణ మాట్లాడుతూ వైఎంవిఏ హాలును తక్కువ ఖర్చుతో పెళ్లిళ్లు, ఇతర వేడుకలకు అందుబాటులో ఉంచుతున్నామని, ఎన్నో సేవా కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నామని చెప్పారు. వైఎంవిఏ హాలు పక్కన ఉన్న చిన్న స్థలంలో వ్యాయామ కళాశాల ఉన్నప్పటికీ గత 15 ఏళ్లుగా అక్కడ ఎలాంటి కార్యకలాపాలు జరగడం లేదన్నారు. ఇటీవల వైఎంవిఏ హాలుకు లిఫ్ట్ ఏర్పాటు చేయాలని భావించి, ఖాళీ స్థలానికి కొంత పరిహారం కూడా

సినీ హీరో రామ్ పోతినేని అంటే ఆమెకు ప్రాణం. ఆయన పాటలు, సినిమాలు చూపిస్తే తప్ప ఆమె ముద్ద కూడా నోట్లోకి తీసుకోదు. సినీ హీరో రామ్ పోతినేని (Ram Pothineni) అంటే ఆమెకు ప్రాణం. ఆయన పాటలు, సినిమాలు చూపిస్తే తప్ప ఆమె ముద్ద కూడా నోట్లోకి తీసుకోదు. ఒకప్పుడు ఎంతో చురుగ్గా ఉంటూ చదువుల్లో ముందున్న ఆ అమ్మాయిని.. నేడు ఓ అరుదైన జన్యు వ్యాధి మంచానికే పరిమితం చేసింది. కనీసం మాట్లాడలేని, గుర్తు పట్టలేని స్థితిలోనూ ఆ అభిమాన హీరో పేరు వింటే మాత్రం ఆమె కళ్లల్లో మెరుపు కనిపిస్తోంది. తూర్పుగోదావరి జిల్లా అనపర్తి మండలం దుప్పలపూడి గ్రామానికి చెందిన సలాది శ్రీను, శ్రీదుర్గ దంపతుల కుమార్తె శశి భవ్యత (Shashi Bhavyata). వయసు పద్దెనిమిదేళ్లు. అనపర్తి శ్రీరామారెడ్డి జడ్పీ ఉన్నత పాఠశాలలో పదో తరగతి పూర్తి చేసి, ప్రస్తుతం ఇంటర్మీడియట్ చదువుతోంది. చక్కటి ప్రతిభ కనబరుస్తూ కుటుంబానికి వెలుగుగా నిలుస్తుందనుకున్న కూతురి జీవితంలో 2022 నుంచి ఊహించని కష్టం మొదలైంది. మూడు తరాలుగా కుటుంబంలో జరుగుతున్న మేనరికపు వివాహాల కారణంగా శశి భవ్యత అరుదైన జన్యుపరమైన సమస్య బారిన పడింది. 2022లో మొదలైన ఫిట్స్ సమస్య క్రమంగా తీవ్రరూపం దాల్చింది. నాడీ వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడటంతో మతిస్థిమితం కోల్పోయి పూర్తిగా మంచానికే పరిమితమైంది. పెద్ద ఆసుపత్రుల్లో ఖరీదైన వైద్యం చేయించే స్తోమత లేక, దిక్కుతోచని స్థితిలో తల్లిదండ్రులు ఆమెను రాజమహేంద్రవరం జీజీహెచ్ (Rajamahendravaram GGH) లో చేర్పించారు. చుట్టూ ఉన్న ప్రపంచాన్ని మర్చిపోయినా, తన అభిమాన హీరో రామ్ పాటలు వింటూ ఆ బాధను తట్టుకునే ప్రయత్నం చేస్తోంది ఈ యువతి. సరైన వైద్యం అందితే తమ బిడ్డ మళ్లీ మామూలు మనిషి అవుతుందన్న ఆశతో ఆ తల్లిదండ్రులు దాతల సాయం కోసం, ప్రభుత్వం అందించే తోడ్పాటు కోసం ఎదురు చూస్తున్నారు

Rajahmundry: రాజమండ్రి: వీధి వ్యాపారులకు 'జోన్ల' భరోసా! Rajahmundry: నగరంలో ఏ ఒక్క వీధి వ్యాపారికి అన్యాయం జరగకుండా వీధులను జోన్లు వారీగా విభజించినట్లు కమిషనర్ రాహుల్ మీనా తెలిపారు. మంగళవారం నగరపాలక సంస్థ కార్యాలయంలోని మీటింగ్ హాల్ నందు టౌన్ వెండింగ్ కమిటీ సభ్యులతో సమావేశం నిర్వహించారు. వీధి వ్యాపారస్తుల చట్టం ప్రకారం పట్టణ ప్రణాళిక మరియు మెప్మా సిబ్బంది క్షేత్రస్థాయిలో పరిశీలించి రెడ్ జోన్, యాంబర్ జోన్, గ్రీన్ జోన్లను గుర్తించినట్లు చెప్పారు. నగర పరిధిలోగల వీధులన్నీ జోన్లు వారీగా విభజించి నివేదికను సిద్ధం చేసుకున్నట్లు వివరించారు. విద్యా సంస్థలు, వైద్యశాలలు, ప్రభుత్వ కార్యాలయాలు, జంక్షన్ లు, ట్రాఫిక్ ఎక్కువగా ఉండే ప్రాంతాలను రెడ్ జోన్లుగా ప్రకటించినట్లు తెలిపారు. నిర్దేశిత సమయాలు, నిర్దేశిత రోజులలో వ్యాపారాలు చేసుకునే ప్రాంతాలను యాంబర్ జోన్లుగా మిగతా ప్రాంతాలను గ్రీన్ జోన్లుగా ప్రకటించటం జరిగిందన్నారు. మొత్తంగా నగర పరిధిలో 62 గ్రీన్, 26 యాంబర్, 58 రెడ్ జోన్లను గుర్తించినట్లు వెల్లడించారు. రెడ్ జోన్లకు సంబంధించి అభ్యంతరాలు ఉన్నట్లయితే.. అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో పర్యటించి తెలియజేయాలని కమిటీ సభ్యులకు సూచించారు. జోన్ల గుర్తింపు అనంతరం వీధి వ్యాపారులకు గుర్తింపు కార్డులను జారీ చేసి వెండింగ్ జోన్లలో స్థలాలను కేటాయించి తగు మౌలిక సదుపాయాలు కల్పిస్తామన్నారు. వీధి వ్యాపారుల జీవనోపాధికి ఎటువంటి నష్టం వాటిల్లకుండా, ఒక స్పష్టమైన మరియు యోచనాత్మక ప్రణాళికతో ముందుకు వెళ్తున్నట్లు ఈ సందర్భంగా తెలియజేశారు. సమీక్షలో అడిషనల్ కమిషనర్ పి.వి.రామలింగేశ్వర్, సిటీ ప్లానర్ జి.వి.ఎస్.ఎన్.మూర్తి, సీఎంఎం రామలక్ష్మి, శానిటరీ సూపర్ వైజర్ శ్రీనివాస్, ట్రాఫిక్ ఎస్సై పి.శ్రీనివాసరావు, టౌన్ వెండింగ్ కమిటీ ప్రెసిడెంట్ సత్యనారాయణ, ఎన్జీఓ రాంబాబు, ఇతర సభ్యులు పాల్గొన్నారు