
జి.కొండూరు: ఎన్టీఆర్ జిల్లా జి.కొండూరు మండలం కట్టుబడిపాలెం వద్ద శనివారం ఓ ప్రైవేటు పాఠశాల బస్సు ప్రమాదానికి గురైంది. పిల్లలను తీసుకెళ్తున్న పాఠశాల బస్సు అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న తారకరామా ఎత్తిపోతల కాలువలోకి దూసుకెళ్లింది. ఇబ్రహీంపట్నం నుంచి కవులూరు వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో దాదాపు 40 మంది విద్యార్థులు ఉన్నట్లు సమాచారం. వారిలో ముగ్గురు విద్యార్థులకు స్వల్ప గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న విద్యార్థుల తల్లిదండ్రులు.. స్థానికుల సాయంతో చిన్నారులను విజయవాడ ఆసుపత్రికి తరలించారు. జి.కొండూరు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఘటనపై ఆరా తీశారు. కాలువలో పడిన బస్సును బయటకు తీయించారు. దర్యాప్తు చేస్తున్నట్లు జి.కొండూరు పోలీసులు తెలిపారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.





