
పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్ స్టైల్ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.
Sawan putrada Ekadashi 2026 date rituals: శ్రావణ మాసంను పండగల మాసం అని కూడా పిలుస్తారు. ఈ మాసంలో ప్రతి రోజు ఏదో ఒక పండగను మనం జరుపుకుంటాం. శ్రావణ సోమ, మంగళ, శుక్ర, శనివారాలలో చాలా మంది ఉపవాసాలు చేస్తారు. శ్రావణ మంగళ గౌరీ వ్రతాలు, వరలక్ష్మీ వ్రతం, జన్మాష్టమి, మొదలైనవి మనం జరుపుకుంటాం. అయితే.. శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే ఏకాదశికి పుత్రదా ఏకాదశి అని పిలుస్తారు. అంతే కాకుండా ఈరోజు చాలా మంది సంతానం లేని వారు భక్తితో ఆ విష్ణు భగవానుడ్ని పూజించుకుంటారు.
ఈ సారి మనం శ్రావణ మాసం వేళ ఆదివారం రోజు అంటే ఆగస్టు 23న పుత్రదా ఏకాదశిని జరుపుకుంటాం. ఏకాదశి తిథి తెల్లవారు జామున 5 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఉంది. చాలా మంది పుత్రదా ఏకాదశి రోజున ఉపవాసం ఉంటారు. విష్ణుభగవానుడ్ని యథా శక్తి మేరకు షోడషోపచారాలతో పూజలు చేసుకొవాలి. సత్యనారాయణ వ్రతం విశేషమైన గొప్పఫలితాలను ఇస్తుంది.
అంతే కాకుండా స్వామి వారికి ఐదురకాల ఫలాల నివేదన, కొబ్బరికాయలు, స్వీట్ల నివేదన చేయాలని పండితులు సూచిస్తుంటారు. తులసీదళాలు స్వామివారికి అత్యం ప్రీతికరమైనది. ఈ విధంగా భక్తి శ్రద్దలతో విష్ణుమూర్తిని, అమ్మవారిని పూజించుకొవాలి.
చాలా మంది పెళ్లైన జంటలు సంతానంలేక అనేక సమస్యలు పడుతారు. అలాంటి వారు పుత్రదా ఏకాదశి రోజు శ్రీమన్నారాయణుడ్ని భక్తితో కొలుచుకొవాలి. సంతాన వేణుగోపాల స్వామినికొలుచుకుంటూ ఆయన మంత్రాలను జపించాలి.
Read more: Varalakshmi Vratam 2026 Date:వరలక్ష్మీ వ్రతం ఆగస్టు 21నా.. 28నా? అసలు తేదీ ఇదే!
వేణు గోపాల స్వామికి డోలోత్సవంను నిర్వహించుకొవాలి. చిన్న పిల్లలకు స్వీట్లు పంచిపెట్టాలి. ఈవిధంగా భక్తితో ఈ విష్ణుమూర్తిని పూజించుకుంటే సంతానం విషయంలో కల్గుతున్న ఆపదలు, విఘ్నాలు దూరమై చక్కని సంతానం కల్గుతుందని పండితులు చెబుతుంటారు. రాహు,కేతుల పూజలు చేయించుకొవాలి. సర్పశాంతులు చేయించుకొవాలి.ఈ రోజు చేేసే వ్రతాలు, దానాలు, హోమాలు వెయ్యిరెట్లు గొప్ప ఫలితాలు ఇస్తాయని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.





