
Tupaki Exclusive: ప్యారడైజ్ ఇంట్రడక్షన్ ఫైట్.. షాకింగ్ విషయాలు రివీల్ చేసిన ఫైట్ మాస్టర్ సతీష్!
దసరా వంటి మాస్ హిట్ తర్వాత శ్రీకాంత్ ఓదెల- నాని కాంబోలో వస్తున్న ది ప్యారడైజ్ పై అంచనాలు ఏ రేంజ్ లో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
© 2026 nimisham.in

దసరా వంటి మాస్ హిట్ తర్వాత శ్రీకాంత్ ఓదెల- నాని కాంబోలో వస్తున్న ది ప్యారడైజ్ పై అంచనాలు ఏ రేంజ్ లో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

anumanapakshi New film from the director of DJ Tillu — Anumana Pakshi trailer impresses — releasing in theaters on September 18డీజే టిల్లు దర్శకుడి కొత్త చిత్రం.. ఆకట్టుకుంటున్న అనుమాన పక్షి ట్రైలర్.. సెప్టెంబర్ 18 న థియేటర్లలో విడుదల

ఉగ్రవాది మసూద్ అజర్‌పై ఇనామ్ పెంచుతున్నట్లు పాకిస్థాన్ చేసిన ప్రకటన ఓ

Pakistan: ఇంగ్లండ్ చేతిలో 3-0తో వైట్‌వాష్ అయిన పాకిస్థాన్‌కు మరో భారీ షాక్ తగిలింది. ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్‌లో 71 రేటింగ్ పాయింట్లతో తొమ్మిదో స్థానానికి పడిపోయింది. ఇది పాక్ క్రికెట్ చరిత్రలోనే అత్యంత కనిష్ట ర్యాంకింగ్‌గా నిలిచింది. డబ్ల్యూటీసీ పట్టికలోనూ 4.63 శాతం పాయింట్లతో అట్టడుగుకు చేరింది. జింబాబ్వే మాత్రమే పాక్ కంటే వెనుక ఉంది.

కామెడీకి కాస్త అనుమానాన్ని జోడించి తెరకెక్కిన ‘అనుమాన పక్షి’ చిత్రం ట్రైలర్ వినాయక చవితి సందర్భంగా విడుదల చేశారు.

రాగ్‌మయూర్, మెరిన్ ఫిలిప్ జంటగా నటిస్తున్న కామెడీ ఎంటర్టైనర్ ‘అనుమాన పక్షి’. ‘డీజే టిల్లు’ సినిమాతో పరిచయమైన విమల్‌కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు.

మీరు కూడా ఈ అనుమాన పక్షి ట్రైలర్ చూసేయండి.. (Anumana Pakshi Trailer)

Pakistan Hockey Team will visit India for the Asian Champions Trophy 2026. Matches will be held in Jalandhar and Mohali, with India vs Pakistan on November 1. ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీ 2026 కోసం పాకిస్తాన్ జట్టు భారత్‌కు రానుంది. జలంధర్, మొహాలీలో మ్యాచ్‌లు, నవంబర్ 1న ఇండియా-పాక్ పోరు.

Ayurveda Treatment గురించి తెలుసుకోండి. విరూపాక్షపురంలో మూడు తరాలుగా మోహన్‌రావు కుటుంబం కొనసాగిస్తున్న సంప్రదాయ ఆయుర్వేద సేవా ప్రస్థానం, సేవల వివరాలు మరియు ప్రత్యేకతలు. Virupakshapuram Mohan Rao Ayurveda Treatment పేరుతో పలమనేరు సమీపంలోని విరూపాక్షపురం ప్రాంతంలో మూడు తరాలుగా కొనసాగుతున్న సంప్రదాయ ఆయుర్వేద సేవా ప్రస్థానం ప్రస్తుతం ఎంతో మందిని ఆకర్షిస్తోంది. నిన్నటి వరకు సక్రమంగా నడిచిన కాళ్లు ఒక్కసారిగా కదలడం మానేస్తాయి. మాట్లాడిన నోరు మాట కోసం తడబడుతుంది. చేతులు పనిచేయకపోతే ఒక […]

ఏపీ ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ పల్నాడు జిల్లాలో పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన నరసరావుపేట సమీపంలోని కాకాని జేఎన్టీయూకే ఇంజనీరింగ్ కళాశాలలో నూతన హాస్టల్ భవనాలను ప్రారంభించారు. అనంతరం, ప్రముఖ పుణ్యక్షేత్రమైన కోటప్పకొండను సందర్శించి శ్రీ త్రికోటేశ్వర స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.కాకానిలోని జేఎన్టీయూకే ఇంజనీరింగ్ కళాశాలలో సుమారు రూ.70 కోట్ల వ్యయంతో నిర్మించిన గౌతమి, కృష్ణవేణి, నాగార్జున హాస్టల్ భవనాలను మంత్రి లోకేశ్ ప్రారంభించారు. అనంతరం ఆయన కోటప్పకొండ క్షేత్రాన్ని దర్శించారు. ఆలయ అధికారులు, అర్చకులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. గర్భాలయంలో త్రికోటేశ్వర స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా అర్చకులు ఆయనకు వేదాశీర్వచనాలు అందించి, తీర్థప్రసాదాలను అందజేశారు.తన పర్యటనలో భాగంగా స్వామివారిని దర్శించుకున్న విషయాన్ని లోకేశ్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. ఈ కార్యక్రమంలో మంత్రి గొట్టిపాటి రవికుమార్, ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, పలువురు ఎమ్మెల్యేలు, ఇతర ముఖ్య నేతలు పాల్గొన్నారు

మొట్టమొదటి మహిళల ఛాంపియన్స్ ట్రోఫీకి భారత్ ఆతిథ్యమివ్వనుంది. ఈ విషయాన్ని అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) ఇవాళ ప్రకటించింది. స్పోర్ట్స్ డెస్క్: మొట్టమొదటి మహిళల ఛాంపియన్స్ ట్రోఫీకి భారత్ ఆతిథ్యమివ్వనుంది. ఈ విషయాన్ని అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) ఇవాళ(బుధవారం)ప్రకటించింది. వాస్తవానికి ఈ టోర్నీ శ్రీలంకలో జరగాల్సి ఉంది. అయితే శ్రీలంక క్రికెట్ బోర్డు పరిపాలన వ్యవహారాల్లో ఆ దేశ ప్రభుత్వం జోక్యం చేసుకుంటుందన్న కారణంగా ఆతిథ్య హక్కులను కోల్పోయింది. ఈక్రమంలో ఈ టోర్నీ నిర్వహించేందుకు భారత్‌కు అవకాశం లభించింది. వాస్తవానికి టోర్నమెంట్ నిర్వహణకు బంగ్లాదేశ్, భారత్, దక్షిణాఫ్రికాలను ఐసీసీ ఆప్షన్లుగా పెట్టుకుంది. అయితే చివరకు ప్రత్యామ్నాయ ఆతిథ్య దేశంగా భారత్‌ను ఐసీసీ సిఫార్సు చేసింది. ఈ నిర్ణయాన్ని ఇవాళ(సెప్టెంబర్ 2) ఐసీసీ బోర్డు ఆమోదించింది. ఇక టోర్నీ విషయానికి వస్తే.. వచ్చే ఏడాది ఫిబ్రవరి 14 నుంచి 28 వరకు జరగనుంది. మ్యాచ్‌లు ముంబై, వడోదర అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరుగుతాయి. ఇక టోర్నీలో పాల్గొనే జట్ల అర్హతలను కూడా ఐసీసీ వెల్లడించింది. కటాఫ్ డేట్ అయిన జులై 6 నాటికి మహిళల టీ20 ర్యాంకింగ్స్‌లో తొలి ఆరు స్థానాల్లో ఉన్న జట్లు ఛాంపియన్స్ ట్రోఫీలో పోటీపడనున్నాయి. ఆ విధంగా చూస్తే.. ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, భారత్, న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా, శ్రీలంక టోర్నమెంట్‌కు అర్హత సాధించాయి. ప్రస్తుతం ఎనిమిదో స్థానంలో కొనసాగుతున్న పాకిస్థాన్ ఈ టోర్నీకి దూరమైంది. టీ20 ఫార్మాట్లో మ్యాచ్‌లు జరుగుతాయి. ప్రతి జట్టు మిగతా జట్లతో ఒక్కో మ్యాచ్ ఆడుతుంది. టాప్-2లో నిలిచిన జట్లు ఫిబ్రవరి 28న జరిగే ఫైనల్లో తలపడతాయి. నాకు టెస్ట్ క్రికెట్ అంటే చాలా ఇష్టం: తిలక్ వర్మ ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్ .. పడిపోయిన గిల్, బుమ్రా స్థానాలు!

ఇంటర్నెట్ డెస్క్: పాకిస్థాన్ క్రికెట్ బోర్డు మరోసారి వార్తల్లో నిలిచింది. లార్డ్స్ మైదానంలో ఇంగ్లాండ్ చేతిలో ఘోర పరాజయం తర్వాత ప్రధాన కోచ్ సర్ఫరాజ్ అహ్మద్, బౌలింగ్ కోచ్ ఉమర్ గుల్లను తొలగించి, ఏడుగురు ఆటగాళ్లను స్వదేశానికి పంపిన మరుసటి రోజే పీసీబీ మళ్లీ వార్తల్లోకెక్కింది. మొన్నటివరకు ఫీల్డింగ్ కోచ్‌గా ఉన్న షేన్ మెక్‌డెర్మాట్ పదవీకాలం జులైలో ముగిసింది. ప్రస్తుతం ఆ పదవి ఖాళీగా ఉంది. ఫీల్డింగ్ కోచ్ పదవిని భర్తీ చేయడానికి పాకిస్థాన్ దరఖాస్తులు ఆహ్వానించింది. అయితే, ఇందులో వింతేముంది అంటారా.. ఆగండి అసలు ట్విస్ట్ ఇక్కడే ఉంది మరి. కోచ్ నియమకానికి పీసీబీ ఏకంగా లింక్డ్ఇన్లో ఓపెన్ హైరింగ్ మొదలుపెట్టింది. పాకిస్థాన్ బోర్డు ఎంచుకున్న ఈ విధానాన్ని సోషల్ మీడియాలో నెటిజన్లు తెగ ట్రోల్ చేస్తున్నారు. తమదైన శైలిలో విమర్శలు, సెటైర్లతో ఆటాడుకుంటున్నారు. ‘‘నాకు ఆశ్చర్యంగా ఉంది! పీసీబీలో ఉద్యోగాల భర్తీ పూర్తిగా ప్రతిభ ఆధారంగానే జరుగుతోందా? ఇక్కడ సిఫార్సులు, పలుకుబడి ఏమీ పనిచేయవా?’’ అని ఓ యూజర్ వ్యంగ్యంగా స్పందించాడు. ‘‘దీన్ని ఇక్కడ ఎందుకు పోస్ట్ చేస్తున్నారు?ఆ పని కోసం నేరుగా ఏదైనా రిటైర్డ్ మిలిటరీ లేదా ఆర్మీ సిబ్బందిని సంప్రదించండి’’ అని మరో యూజర్ సెటైర్ వేశాడు. ‘‘దీనికి దరఖాస్తు చేద్దామని అనుకుంటున్నాను. గత 13 ఏళ్లుగా నేను ఇండస్ట్రియల్ ఆటోమేషన్ రంగంలో పనిచేశాను. ఏం జరుగుతుందో చూద్దాం’’ అని మరో నెటిజన్ కామెంట్ చేశాడు. ‘‘ఈ పదవి గురించి ఆసక్తిగా ఉంది.. మొన్న రెండు క్యాచ్‌లు డ్రాప్ చేశా’’ అని మరో యూజర్ వ్యంగ్యంగా అన్నాడు. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత

షాంఘై సహకార సంస్థ (SCO) శిఖరాగ్ర సదస్సు గ్రూప్ ఫొటో నుంచి భారత ప్రధాని మోదీ చిత్రాన్ని పాకిస్థాన్ ప్రధాని కార్యాలయం ఎడిట్ చేసి తొలగించడంపై మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఏక్ నాథ్ షిండే తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ కార్యాలయం చేసిన ఈ చిల్లర చేష్టలను ఆయన తీవ్రంగా ఖండించారు. ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన ఏక్ నాథ్ షిండే... పాకిస్థాన్ చేసిన పని అత్యంత దురదృష్టకరమని మండిపడ్డారు. వారు ఫొటో నుంచి మాత్రమే మోదీ చిత్రాన్ని తొలగించగలరని... కానీ మోదీ అనుకుంటే ప్రపంచపటం నుంచి పాకిస్థాన్‌ను లేకుండా చేయగలరనే విషయాన్ని గుర్తుంచుకోవాలని హెచ్చరించారు. గతంలో పహల్గామ్లో ఉగ్రవాదులు ఘోరానికి ఒడిగట్టినప్పుడు, మోదీ నాయకత్వంలో మన భారత సాయుధ బలగాలు పాకిస్థాన్‌లోని ఉగ్రవాద స్థావరాలను, 11 ఎయిర్‌బేస్ క్యాంపులను ధ్వంసం చేసి వారిని మోకాళ్లపై నిలబెట్టాయని గుర్తుచేశారు. ఇటువంటి చవకబారు ట్రిక్కులతో భారత్‌తో కానీ, ప్రధాని మోదీతో కానీ ఆడుకోవాలని చూడవద్దని పాకిస్థాన్‌కు ఆయన హితవు పలికారు. కేవలం ఫొటో నుంచి మోదీని కట్ చేసినంత మాత్రాన దేశంలోనూ, అంతర్జాతీయ వేదికలపైనా ఆయనకు ఉన్న గుర్తింపు, స్థాయి ఎంతమాత్రం తగ్గబోవని ఏక్ నాథ్ షిండే స్పష్టం చేశారు

ఇంగ్లండ్‌తో లార్డ్స్ వేదికగా జరిగిన రెండో టెస్టులో పాకిస్థాన్ 194 పరుగుల భారీ తేడాతో ఓటమి పాలైన నేపథ్యంలో ఆ జట్టు ఓపెనర్ ఇమామ్-ఉల్-హక్ గాయంపై వివాదం మొదలైంది. మ్యాచ్ సందర్భంగా కాలి పిక్కకు గాయమైన ఇమామ్.. రెండు ఇన్నింగ్స్‌లలోనూ బ్యాటింగ్‌కు రాకపోవడంపై పాకిస్థాన్ సెలక్షన్ కమిటీలోని సీనియర్ సభ్యుడు ఆకిబ్ జావేద్ అనుమానాలు వ్యక్తం చేశారు. ఈ వ్యవహారంపై పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (PCB) విచారణ జరుపుతుందని వెల్లడించారు. పాకిస్థాన్ నాలుగు సభ్యుల సెలక్షన్ ప్యానెల్లో ఉన్న ఆకిబ్ జావేద్.. కండరాల గాయం కారణంగా ఆటగాడు రెండు ఇన్నింగ్స్‌లలోనూ బ్యాటింగ్‌కు దూరంగా ఉండటం ఎలా సాధ్యమని ప్రశ్నించారు. గాయాలు క్రికెట్లో సహజమేనని, గతంలో ఆటగాళ్లు గాయాలతోనూ కట్టులు కట్టుకుని బ్యాటింగ్ చేసిన సందర్భాలు ఉన్నాయని గుర్తుచేశారు. అయితే ఇమామ్ విషయంలో పరిస్థితి భిన్నంగా ఉందని, ఇది ఆందోళన కలిగించే అంశమని అన్నారు. లార్డ్స్ టెస్టు తొలి రోజు ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో ఇమామ్ ఎడమ కాలి పిక్కకు గాయమైంది. దీంతో మ్యాచ్‌లో మిగిలిన భాగానికి అతడు దూరమయ్యాడు. అయితే నాలుగో రోజు ఆట ప్రారంభానికి ముందు ఇమామ్ మైదానంలోని అవుట్‌ఫీల్డ్‌లో కనిపించాడు. కాలికి భారీగా కట్టు కట్టుకుని షాడో బ్యాటింగ్ ప్రాక్టీస్ చేసిన అతడు నడిచేటప్పుడు కుంటుతూ కనిపించడం చర్చకు దారితీసింది. లార్డ్స్ టెస్టు కోసం తుది జట్టు ఎంపిక విషయంలో సెలెక్టర్లు, జట్టు యాజమాన్యం మధ్య విభేదాలు ఉన్నాయన్న వార్తలపైనా ఆకిబ్ జావేద్ స్పందించారు. గంటకు 140 కిలోమీటర్ల వేగంతో బౌలింగ్ చేయగల ఫాస్ట్ బౌలింగ్ ఆల్‌రౌండర్ ఉబైద్ షాను జట్టులోకి తీసుకోవాలని తాను సూచించినట్లు తెలిపారు. వికెట్ కీపర్-బ్యాటర్ ఘాజీ ఘోరీకి అవకాశం ఇవ్వాలని, మహమ్మద్ రిజ్వాన్ స్థానంలో అతడిని ఆడించాలని తాను అభిప్రాయపడినట్లు చెప్పారు. అయితే తుది జట్టు ఎంపికలో తన సూచనలు పూర్తిగా అమలు కాలేదని పేర్కొన్నారు. హెడ్డింగ్లీ, లార్డ్స్‌లో జరిగిన తొలి రెండు టెస్టుల్లో పాకిస్థాన్

ICC Rankings 2026: ప్రపంచ క్రికెట్లో భారత జట్టు తన అజేయ ప్రయాణాన్ని కొనసాగిస్తోంది. ఐసీసీ విడుదల చేసిన తాజా ర్యాంకింగ్స్ ప్రకారం వన్డే, టీ20 ఫార్మాట్లలో టీమిండియా నంబర్ వన్ స్థానంలో నిలిచింది. టెస్టుల్లో ప్రస్తుతం నాలుగో స్థానంలో ఉన్నప్పటికీ, మరో విజయం సాధిస్తే మూడో స్థానానికి చేరే అవకాశం స్పష్టంగా ఉంది. పాకిస్థాన్ జట్టు విషయానికొస్తే వన్డేల్లో మాత్రమే ఐదో స్థానంలో నిలిచి టాప్-5లో చోటు దక్కించుకుంది. టెస్టుల్లో ఎనిమిదో స్థానానికి పడిపోగా, టీ20ల్లో ఆరో స్థానానికి పరిమితమైంది. వ్యక్తిగత బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో భారత ఆటగాళ్లు పూర్తి ఆధిపత్యం ప్రదర్శించారు. వన్డేల్లో ఓపెనర్ శుభ్‌మన్ గిల్ మొదటి స్థానంలో నిలవగా, విరాట్ కోహ్లీ మూడో స్థానంలో, రోహిత్ శర్మ నాలుగో స్థానంలో ఉన్నారు. టీ20 బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో యువ కిరటం ఇషాన్ కిషన్ అగ్రపీఠాన్ని కైవసం చేసుకోగా, అభిషేక్ శర్మ మూడో స్థానంలో, తిలక్ వర్మ ఆరో స్థానంలో నిలిచారు. టెస్టుల్లో రిషభ్ పంత్ ఏడో స్థానంలో, శుభ్ మన్ గిల్ ఎనిమిదో స్థానంలో కొనసాగుతున్నారు. పాకిస్థాన్ నుంచి కేవలం బాబర్ ఆజమ్ మాత్రమే టెస్టుల్లో 10వ ర్యాంక్, వన్డేల్లో 6వ ర్యాంక్‌లో స్థానం సంపాదించుకున్నాడు. బౌలింగ్, ఆల్‌రౌండర్ విభాగాల్లో మనోళ్ల హవా బౌలింగ్, ఆల్‌రౌండర్ విభాగాల్లోనూ భారత్ అత్యంత బలంగా కనిపిస్తోంది. టెస్టు బౌలింగ్‌లో జస్ప్రీత్ బుమ్రా రెండో స్థానంలో కొనసాగుతుండగా, టీ20ల్లో వరుణ్ చక్రవర్తి ఎనిమిదో ర్యాంక్‌లో ఉన్నాడు. టెస్టు ఆల్‌రౌండర్ల జాబితాలో రవీంద్ర జడేజా మొదటి స్థానంలో, వాషింగ్టన్ సుందర్ ఆరో స్థానంలో నిలిచి సత్తా చాటారు. టీ20 ఆల్రౌండర్లలో హార్దిక్ పాండ్యా ఐదో ర్యాంక్‌ను దక్కించుకున్నాడు. పాకిస్థాన్ బౌలర్లలో నోమాన్ అలీ టెస్టుల్లో 8వ ర్యాంక్, అబ్రార్ అహ్మద్ వన్డే, టీ20ల్లో రెండో స్థానంలో నిలిచారు. ఇంగ్లాండ్‌తో జరిగిన మొదటి రెండు టెస్టుల్లో ఘోరంగా ఓడిపోవడంతో పాకిస్థాన్ క్రికెట్ బోర్డు తీవ్ర నిర్ణయాలు తీసుకుంది. జట్టు

Babar Azam: ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీస్‌లో పాకిస్థాన్ పేలవ ప్రదర్శనపై సెలెక్షన్ కమిటీ చీఫ్ ఆఖిబ్ జావేద్ తీవ్రంగా స్పందించాడు. కెప్టెన్ బాబర్ అజామ్, హెడ్ కోచ్ సర్ఫరాజ్ అహ్మద్ అవసరమైన నిర్ణయాలు తీసుకోకపోవడంతోనే జట్టు కూర్పులో మార్పులు చేయాల్సి వచ్చిందని పేర్కొన్నాడు. పాకిస్థాన్ తొలి రెండు టెస్టుల్లో ఓడిపోయి సిరీస్‌ను 0-2తో కోల్పోయిన తర్వాత ఏకంగా ఏడుగురు ఆటగాళ్లను జట్టు నుంచి విడుదల చేసింది. మూడో టెస్టుకు కొత్త ఆటగాళ్లను చేర్చడంతోపాటు కోచింగ్ బృందంలోనూ మార్పులు చేసింది. కెప్టెన్, కోచ్ కఠిన నిర్ణయాలు తీసుకోలేనప్పుడు బోర్డు జోక్యం చేసుకోవాల్సి వచ్చిందని ఆఖిబ్ తెలిపాడు. ముఖ్యంగా పేస్ బౌలింగ్‌లో ఉబైద్ షాకు అవకాశం ఇవ్వాలని తాను సూచించినా ఆ నిర్ణయం అమలు కాలేదని చెప్పాడు. దీంతో కీలక పర్యటనలో జట్టు పోటీ ఇవ్వలేకపోవడం పరిస్థితిని తీవ్రంగా మార్చిందని వివరించాడు. ఆఖిబ్ ప్రకారం.. పాకిస్థాన్ జట్టులో ఉబైద్ షా, అదనపు వికెట్ కీపర్, పేస్ ఆల్‌రౌండర్ వంటి ప్రత్యామ్నాయాలు అందుబాటులో ఉన్నాయి. సుమారు 140 కిలోమీటర్ల వేగంతో బౌలింగ్ చేయగల ఉబైద్‌ను ఆడించాలని బాబర్, సర్ఫరాజ్‌కు సూచించినట్లు వెల్లడించాడు. ప్రస్తుత పేసర్లలో ఒకే తరహా వేగం ఉండటంతో బౌలింగ్ విభాగంలో వైవిధ్యం అవసరమని చెప్పాడు. Viral Video: ఏం క్యాచ్ గురూ.. సూపర్‌మ్యాన్ కూడా చేతులెత్తేయాల్సిందే.. బౌండరీ లైన్లో ఒంటి చేత్తో..! లార్డ్స్ టెస్టు ముగిసిన తర్వాత పాకిస్థాన్ ఏడుగురు ఆటగాళ్లను జట్టు నుంచి విడుదల చేసింది. మహమ్మద్ రిజ్వాన్, ఇమామ్ ఉల్ హక్, సల్మాన్ అలీ ఆఘా, అలీ ఉస్మాన్, ఆమిర్ జమాల్, మహమ్మద్ అవైస్ జఫర్, ఖుర్రమ్ షహ్జాద్ ఈ జాబితాలో ఉన్నారు. వారి స్థానాల్లో సైమ్ అయూబ్, అబ్దుల్లా ఫజల్, అరాఫత్ మిన్హాస్ తదితరులను చేర్చారు. Team India: 24 గంటల్లోనే మరో గాయం.. టీమిండియా స్టార్ ఆల్ రౌండర్ రీఎంట్రీపై వీడని ఉత్కంఠ..? ఇదే సమయంలో హెడ్ కోచ్ సర్ఫరాజ్
మలేరియా మాత్రలు వికటించి చిన్నారి మృతి.. 57 మందికి అస్వస్థత మలేరియా మాత్రలు వికటించి ఓ చిన్నారి మృతి చెందగా మరో 57 మంది అస్వస్థతకు గురయ్యారు. ఈ సంఘటన పోలవరం జిల్లా ఎటపాక మండలం గొల్లగుప్పలో.. మలేరియా నివారణ మాత్రలు అయిన క్లోరోక్విన్ మాత్రలు వికటించి ఒక చిన్నారి మృతి చెందడమే కాకుండా మరో 57 మంది తీవ్ర అస్వస్థతతకు గురయ్యారు. వీరిలో 41 మంది చిన్నారులు ఉండగా.. 16 మంది గ్రామస్తులు ఉన్నారు. ప్రస్తుతం వీరిందరికీ చికిత్స అందిస్తుండగా పరిస్థితి విషమంగా ఉన్నవారిని మెరుగైన చికిత్స నిమిత్తం భద్రాచలం ఆస్పత్రికి తరలించారు. ఈ వార్తకు సంబంధించిన

ఇంగ్లండ్‌తో జరిగిన రెండో టెస్టులో పాకిస్థాన్ బ్యాటర్ ఇమామ్ ఉల్ హక్ గాయం వ్యవహారం ఇప్పుడు తీవ్ర వివాదంగా మారింది. మ్యాచ్ మధ్యలో కాలి కండరాలు పట్టేయడంతో అతను రెండు ఇన్నింగ్స్‌లలోనూ బ్యాటింగ్‌కు రాలేదు. ఈ ఘటనపై పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) విచారణకు ఆదేశించడంతో పాక్ క్రికెట్లో కలకలం రేగింది.లార్డ్స్‌లో జరిగిన ఈ మ్యాచ్‌లో పాకిస్థాన్ 194 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. ఈ ఓటమి తర్వాత పాక్ సెలక్షన్ కమిటీ సభ్యుడు ఆకిబ్ జావేద్ ఈ విషయంపై స్పందించాడు. "కేవలం కండరాలు పట్టేసిన గాయంతో ఒక ఆటగాడు రెండు ఇన్నింగ్స్‌లలో ఎలా బ్యాటింగ్‌కు రాలేకుండా ఉంటాడు? ఈ విషయంపై కచ్చితంగా విచారణ జరుగుతుంది" అని ఓ స్థానిక టీవీ ఛానెల్‌తో అన్నాడు. "గతంలో ఆటగాళ్లు ఫ్రాక్చర్లతో కూడా జట్టు కోసం మైదానంలోకి వచ్చారు. ఇది చాలా తీవ్రమైన విషయం, విచారణ తర్వాత తగిన చర్యలు తీసుకుంటాం" అని స్పష్టం చేశాడు.మరోవైపు, పీసీబీ విచారణను ఎదుర్కోవడానికి ఇమామ్ న్యాయవాది సహాయం తీసుకునే అవకాశం ఉందని పీటీఐ వార్తా సంస్థ తన కథనంలో పేర్కొంది. ఈ పరిణామంతో ఇమామ్ తీవ్ర ఇబ్బందుల్లో పడినట్లు తెలుస్తోంది. సిరీస్‌లో వరుస ఓటముల నేపథ్యంలో పీసీబీ కఠిన నిర్ణయాలు తీసుకుంది. ఇమామ్‌తో పాటు మరో ఆరుగురు ఆటగాళ్లను, హెడ్ కోచ్ సర్ఫరాజ్ అహ్మద్, బౌలింగ్ కోచ్ ఉమర్ గుల్‌ను వెంటనే ఇంగ్లండ్ నుంచి వెనక్కి పిలిపించింది.సెప్టెంబర్ 9న బర్మింగ్‌హామ్‌లో ప్రారంభం కానున్న ఆఖరి టెస్టుకు వైట్-బాల్ హెడ్ కోచ్ మైక్ హెస్సన్, బౌలింగ్ కోచ్

మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. Chloroquine Tablets Reaction: పోలవరం జిల్లాలో విషాదం నెలకొంది. ఇద్దరు విద్యార్థులు మరణించారు. వరుసగా చిన్నారుల మరణం ఘటన ఏటపాక మండలం పరిధిలోని గొల్లగుప్ప గ్రామంలో చోటుచేసుకుంది. మలేరియా రాకుండా ముందస్తు జాగ్రత్తలో భాగంగా చిన్నారులకు వేసిన క్లోరోక్విన్ మాత్రలు వికటించి ఇద్దరు విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. మరో 75 మందికి పైగా తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. మరో 5గురు చిన్నారుల పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. వరుసగా చిన్నారులు మరణించడంతో గ్రామంలో తీవ్ర భయాందోళన పరిస్థితులు అలుముకున్నాయి. అసలేం జరిగిందంటే.. ఆరోగ్య శాఖ సిబ్బంది సూచించిన మలేరియా నివారణ క్లోరోక్విన్ మాత్రలు తీసుకున్న తర్వాత పిల్లలు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. గత శుక్రవారం పద్దం రోజా, మాడమ జమున అనే ఇద్దరు బాలికలు మరణించారు. తాజాగా మరో ఇద్దరు పిల్లలు అకస్మాత్తుగా కుప్పకూలడంతో పరిస్థితి మరింత ఆందోళనకరంగా మారింది. అయితే, గొల్లగుప్ప గ్రామంలో 75 మంది పిల్లలు అనారోగ్యానికి గురికావడం తీవ్ర కలకలం సృష్టించింది. స్థానిక లక్ష్మీపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో (పీహెచ్సీ) వైద్యుల కొరతతో పాటు తగినన్న బెడ్లు లేకపోవడంతో అస్వస్థతకు గురైన పిల్లలకు తగిన వైద్యం అందలేదు. దీంతో గ్రామస్థులు తీవ్ర అవస్థలు పడుతూ.. చిన్నారులను ట్రాక్టర్లపై భద్రాచలం ఏరియా ప్రభుత్వాసుపత్రికి తరలిస్తున్నారు. ప్రస్తుతం ఆదివాసీ పిల్లల పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. వైద్య శాఖ నిర్లక్ష్యం, డోసేజ్ విషయంలో సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్లే ఈ ఘటన జరిగిందని గిరిజన సంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పోలవరం జిల్లా కలెక్టర్ తక్షణమే స్పందించి, గొల్లగుప్ప గ్రామానికి ప్రత్యేక వైద్య బృందాన్ని పంపి, బాధితులకు మెరుగైన చికిత్స అందించాలని

పోలవరం జిల్లా, ఏటపాక మండలం గొల్లగుప్ప గ్రామంలో క్లోరోక్విన్ మాత్రలు వేసుకున్న అనంతరం ఏడేళ్ల బాలిక మృతి చెందడం, పలువురు అస్వస్థతకు గురికావడంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్రంగా స్పందించారు. ఈ ఘటనపై తక్షణమే సమగ్ర విచారణ జరపాలని అధికారులను ఆదేశించారు. బాధితులందరికీ అత్యుత్తమ వైద్య సేవలు అందించాలని ఆయన స్పష్టం చేశారు.ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు, జిల్లా కలెక్టర్ కె. దినేష్ కుమార్‌తో ముఖ్యమంత్రి ఈ ఘటనపై సమీక్ష నిర్వహించారు. మలేరియా రాకుండా ముందస్తు చర్యల్లో భాగంగా గ్రామంలోని 71 మందికి క్లోరోక్విన్ మాత్రలు పంపిణీ చేయగా, వాటిని తీసుకున్న తర్వాత పలువురు అనారోగ్యం పాలయ్యారు. ఈ దురదృష్టకర ఘటనలో జమున అనే ఏడేళ్ల చిన్నారి ప్రాణాలు కోల్పోయింది.ప్రభుత్వ ఆదేశాలతో అధికార యంత్రాంగం తక్షణమే సహాయక చర్యలు చేపట్టింది. అస్వస్థతకు గురైన వారిలో 29 మందిని భద్రాచలం ఏరియా ఆసుపత్రికి, మరో 24 మందిని లక్ష్మీపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించి చికిత్స అందిస్తున్నారు. గ్రామంలో అత్యవసర వైద్య శిబిరాలను ఏర్పాటు చేశారు. కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రి నుంచి తొమ్మిది మంది సభ్యులతో కూడిన ప్రత్యేక వైద్య బృందం ఇప్పటికే గ్రామానికి చేరుకోగా, విజయవాడ, రాజమండ్రి నుంచి మరిన్ని బృందాలు బయలుదేరాయి.ఈ ఘటనలో ఇద్దరు చిన్నారులు మరణించారంటూ వస్తున్న వార్తల్లో నిజం లేదని, కేవలం ఒక బాలిక మాత్రమే మృతి చెందిందని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. ప్రస్తుతం ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న వారి ఆరోగ్యం నిలకడగా ఉందని, జిల్లా యంత్రాంగం పరిస్థితిని నిశితంగా పర్యవేక్షిస్తోందని వారు వెల్లడించారు

ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌లో ఇప్పటికే 0-2తో వెనుకబడిన పాకిస్థాన్‌కు మరో షాక్ తగిలింది. మూడో టెస్టులోనైనా పరువు దక్కించుకోవాలని చూస్తున్న ఆ జట్టుకు కెప్టెన్ బాబర్ ఆజమ్ అనారోగ్యానికి గురికావడం కొత్త తలనొప్పిగా మారింది. ఇంటర్నెట్ డెస్క్: ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌లో ఇప్పటికే 0-2తో వెనుకబడిన పాకిస్థాన్‌కు మరో షాక్ తగిలింది. మూడో టెస్టులోనైనా పరువు దక్కించుకోవాలని చూస్తున్న ఆ జట్టుకు కెప్టెన్ బాబర్ ఆజమ్ అనారోగ్యానికి గురికావడం కొత్త తలనొప్పిగా మారింది. బాబర్‌కు జ్వరం వచ్చినట్లు సమాచారం. దీంతో కీలక మ్యాచ్‌కు ముందు పాక్ శిబిరంలో ఆందోళన నెలకొంది. అయితే బాబర్ ఆరోగ్యంపై ఎలాంటి భయాందోళనలు అవసరం లేదని పాక్ జట్టు మేనేజర్ నవీద్ అక్రమ్ చీమా తెలిపారు. బాబర్‌కు జ్వరం ఉన్నప్పటికీ.. ఫిట్‌గానే ఉన్నాడని, త్వరగా కోలుకుంటాడని వెల్లడించారు. లార్డ్స్ వేదికగా జరిగిన రెండో టెస్టులో బాబర్ ఆజమ్ బ్యాట్‌తో పూర్తిగా విఫలమయ్యాడు. తొలి ఇన్నింగ్స్‌లో 8 పరుగులు, రెండో ఇన్నింగ్స్‌లో కేవలం 6 పరుగులకే పెవిలియన్‌కు చేరాడు. ఈ మ్యాచ్‌లో పాకిస్థాన్ ఏకంగా 194 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. ఇక తొలి టెస్టుకు గాయం కారణంగా బాబర్ దూరమయ్యాడు. అతడి స్థానంలో సల్మాన్ అలీ అఘా పాక్ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించాడు. రెండో టెస్టులో బాబర్ తిరిగి జట్టులోకి వచ్చాడు. కాగా మూడో టెస్టుకు ముందు మళ్లీ అనారోగ్యం పాలవ్వడం చర్చనీయాంశమైంది. పాకిస్థాన్ మాజీ కెప్టెన్ మిస్బా ఉల్ హక్ కూడా జాతీయ సెలక్షన్ కమిటీ నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నాడు. టెస్టు జట్టు, కోచింగ్ సిబ్బందిలో పీసీబీ భారీ మార్పులు చేయడాన్ని నిరసిస్తూ ఆయన తన రాజీనామాను సమర్పించినట్లు సమాచారం. అయితే మిస్బా రాజీనామాను పీసీబీ ఇంకా ఆమోదించలేదని తెలుస్తోంది. అంతేకాకుండా లాహోర్‌లోని నేషనల్ క్రికెట్ అకాడమీలో బ్యాటింగ్ కన్సల్టెంట్‌గా ఉన్న బాధ్యతల నుంచి కూడా తప్పుకోవాలని మిస్బా నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఇలా ఓవైపు వరుస ఓటములు.. మరోవైపు
దాయాది పాకిస్థాన్ మరోసారి తన వక్రబుద్దిని బయటపెట్టింది. షాంఘై సహకార సంస్థ (SCO) శిఖరాగ్ర సదస్సులో ప్రపంచ నేతలు దిగిన గ్రూప్ ఫోటో పాకిస్థాన్ ప్రధాన మంత్రి కార్యాలయం మంగళవారం షేర్ చేసింది. అయితే, ఇందులో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ లేకుండా క్రాప్ చేసి.. షెహబాజ్ షరీఫ్ మాత్రమే మధ్యలో ఉన్నట్లుగా చూపించింది. పాకిస్థాన్ ప్రధాని షేర్ చేసిన ఆ ఫోటోలో కేవలం చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్, కిర్గిజ్ అధ్యక్షుడు సదిర్ జపరోవ్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, తజికిస్థాన్ అధ్యక్షుడు ఎమోమాలి రహ్మాన్, ఉజ్బెకిస్థాన్ అధ్యక్షుడు షవ్కత్ మిర్జియోయేవ్, కిర్గిజ్ కల్నల్ ఉలార్బెక్ జార్లికోవిచ్ షార్షీవ్ మాత్రమే కనిపించారు. వారి మధ్యలో తాను నిలబడి ఉన్నట్టు షెహబాజ్ బిల్డప్ ఇచ్చారు.ఎస్సిఓ సమ్మిట్ సెషన్‌కు ముందు సభ్యదేశాల నాయకులందరూ కలిసిన సమయంలో ఈ ఫోటో తీశారు. అంతటితో ఆగకుండా ఎస్సీఓ నేతలు రౌండ్‌టేబుల్ సమావేశమైన ఒక వీడియోలోనూ మోదీ ఉన్న భాగాన్ని ఎడిట్ చేసి, తొలగించింది. ఆ వీడియోను షెహబాజ్ షరీఫ్ తన అధికారిక ఫేస్బుక్ అకౌంట్లో షేర్ చేశారు.అయితే ప్రధాని నరేంద్ర మోదీ ఒరిజినల్ ఫోటోను షేర్ చేయడంతో అసలు విషయం బయటపడింది. వాస్తవానికి షెహబాజ్ కుడివైపు నుంచి నాలుగో స్థానంలో నిలబడి ఉండగా.. మరో ఐదుగురు నేతలను ఆ ఫోటో నుంచి క్రాప్ చేశారని స్పష్టమైంది.దీంతో పాకిస్థాన్ తీరుపై నెటిజన్లు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. ప్రాంతీయ, ప్రపంచ సమస్యలపై చర్చలు, సహకారాన్ని పెంపొందించడానికి నిర్వహించిన ఈ 26వ ఎస్సీఓ లీడర్షిప్ సమ్మిట్‌లో 10 సభ్యదేశాలు, 15 భాగస్వామ్య దేశాలు, రెండు పరిశీలక దేశాలు పాల్గొన్నాయి.ఎస్సీఓ సమ్మిట్‌లో మోదీ ప్రసంగంకిర్గిజిస్థాన్లో జరిగిన 26వ షాంఘై సహకార సంస్థ (SCO) శిఖరాగ్ర సదస్సులో ప్రసంగించిన ప్రధాని మోదీ.. ప్రాంతీయ సహకారాన్ని బలోపేతం చేయడానికి అవసరమైన చర్యలను వివరించారు. ప్రపంచ ఇంధన సరఫరాలు, ఆర్థిక వ్యవస్థలపై ప్రభావం చూపుతున్న పశ్చిమాసియా ఘర్షణల నేపథ్యంలో

ఇంటర్నెట్ డెస్క్: కిర్గిస్థాన్‌లో జరుగుతున్న షాంఘై సహకార సంస్థ (SCO) సదస్సును పాకిస్థాన్ మరోసారి భారత్‌పై ఆరోపణలకు వేదికగా మార్చుకుంది. సింధు జలాల (Indus Treaty) ఒప్పందాన్ని ప్రస్తావించిన పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ (Shehbaz Sharif).. నీటిని రాజకీయ ఘర్షణలకు ముడి పెట్టొదంటూ మళ్లీ పాత పాటే పాడారు. దీంతో అంతర్జాతీయ మద్దతు కూడగట్టేందుకు పాక్ ఎంతకైనా దిగజారుతోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత సింధు జలాల ఒప్పందాన్ని భారత్ నిలిపివేసింది. తాజాగా ది హేగ్‌లోని మధ్యవర్తిత్వ కోర్టు ఇచ్చిన తీర్పును భారత్ తోసిపుచ్చింది. ఆ కోర్టుకు ఈ వ్యవహారంలో అధికార పరిధే లేదని స్పష్టం చేసింది. షాంఘై సహకార సంస్థ సదస్సుపై ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) ఉగ్రవాద సమస్యను మరోసారి ప్రస్తావించారు. ఉగ్రవాదానికి నిధులు, మద్దతు, సురక్షిత స్థావరాలు కల్పించే వ్యవస్థలపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎస్సీవో దేశాలకు పిలుపునిచ్చారు. దీంతో ఒకవైపు పాక్ నీటి అంశాన్ని అంతర్జాతీయ సమస్యగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తే.. మరోవైపు ఉగ్రవాదమే ప్రాంతీయ శాంతికి ప్రధాన ముప్పు అని భారత్ బలంగా చాటింది. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు

కిర్గిస్థాన్ రాజధాని బిష్కేక్ లో జరుగుతున్న షాంఘై సహకార సంస్థ (SCO) సదస్సులో సింధు జలాల ఒప్పందం అంశాన్ని పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ లేవనెత్తారు. సింధు జలాల నిలిపివేతపై మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. సింధు నది జలాలను పాకిస్థాన్ కు జీవనాధారంగా అభివర్ణించారు. నీటిని రాజకీయ లబ్ధి కోసం ఎన్నడూ ఆయుధంగా ఉపయోగించకూడదని అన్నారు. సింధు జలాలు మా ప్రాంతంలో జీవనాధారం. లక్షలాది మందిని సింధు జలాలు బతికిస్తున్నాయి. మా భూమిని తడుపుతున్నాయి. భావి తరాల కోసం ఇప్పుడున్న వనరులను సంరక్షిస్తున్నాయి అని షెహబాజ్ షరీఫ్ పేర్కొన్నారు. భారత్ పేరును ప్రస్తావించకుండా పరోక్షంగా మన దేశానికి చురకలు అంటించే ప్రయత్నం చేశారు.సింధు జలాల అంతర్జాతీయ ఒప్పందాన్ని రాజకీయాలకు అతీతంగా అందరూ గౌరవించాలని పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ నొక్కి చెప్పారు. ప్రస్తుతం భారత్- పాకిస్థాన్ మధ్య సింధు జలాల పంపిణీ నిలిపివేత వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో షెహబాజ్ షరీఫ్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. గతేడాది జమ్మూ కాశ్మీర్ లోని పహల్గామ్ లోయలో పాకిస్థాన్ కు చెందిన ముష్కరులు జరిపిన మారణహోమంలో 26 మంది అమాయక టూరిస్టులు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. దాంతో పాకిస్థాన్ పై భారత్ మే 7 నుంచి 10 వరకు ఆపరేషన్ సింధూర్ చేపట్టింది. పాకిస్థాన్, పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్ లోని 9 కీలక ఉగ్రస్థావరాలను ధ్వంసం చేసింది. వందలాది మంది ఉగ్రమూకలను ఏరివేసింది. అంతేకాక అదే సమయంలో సింధూ జలాల ఒప్పందాన్ని నిలిపివేస్తున్నట్లు భారత్ ప్రకటించింది. పాకిస్థాన్ ఉగ్రవాదాన్ని నిర్మూలించేంత వరకు సింధు జలాల అంశం ఒప్పంద కార్యకలాపాలు నిలిపివేస్తున్నట్లు భారత్ స్పష్టం చేసింది. రక్తం, నీరు కలిసి ప్రవహించలేవు అని ప్రధాని మోదీ ఆ సందర్భంలో పేర్కొన్నారు. ఇక సింధు జలాలను విడుదల చేయాలని.. ఒప్పందాన్ని పునరుద్ధరించాలని పదేపదే పాకిస్థాన్ డిమాండ్లు చేస్తూ వస్తోంది. ఎందుకంటే పాకిస్థాన్ లో నీటి కొరత తీవ్రంగా పెరుగుతోంది.

భారత్-పాకిస్థాన్ మధ్య సింధు జలాల వివాదం మరోసారి తెరపైకి వచ్చింది. సింధు జలాల ఒప్పందంపై హేగ్‌లోని కోర్టు ఆఫ్ ఆర్బిట్రేషన్ ఇచ్చిన తీర్పును భారత్ తిరస్కరించిన సంగతి తెలిసిందే. ఇంటర్నెట్ డెస్క్: భారత్-పాకిస్థాన్ మధ్య సింధు జలాల వివాదం మరోసారి తెరపైకి వచ్చింది. సింధు జలాల ఒప్పందం (Indus Waters Treaty)పై హేగ్‌లోని కోర్టు ఆఫ్ ఆర్బిట్రేషన్ ఇచ్చిన తీర్పును భారత్ తిరస్కరించిన సంగతి తెలిసిందే. తాజాగా పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ఈ అంశాన్ని షాంఘై సహకార సంస్థ (SCO) సదస్సులో ప్రస్తావించారు. నీటిని రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించకూడదని ఆయన అన్నారు (India Pakistan water dispute). ఎస్సీఓ కౌన్సిల్ ఆఫ్ హెడ్స్ ఆఫ్ స్టేట్ సమావేశంలో మాట్లాడిన షెహబాజ్ షరీఫ్.. నీరు లక్షలాది మంది జీవితాలకు ఆధారమని, వ్యవసాయానికి కీలకమని, భవిష్యత్ తరాల అవసరాలను తీర్చే వనరని అన్నారు. నీటిని ఆయుధంగా ఉపయోగించడానికి అనుమతించకూడదని షరీఫ్ వ్యాఖ్యానించారు. ఉమ్మడి జల వనరులను ఒక దేశంపై ఒత్తిడి తీసుకురావడానికి లేదా రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించకూడదని పేర్కొన్నారు (Shehbaz Sharif about Indus Waters Treaty). షెహబాజ్ షరీఫ్ జల వివాదాన్ని ప్రస్తావించడానికి కొద్దిసేపటి ముందు ప్రధాని నరేంద్ర మోదీ కూడా ఎస్సీఓ సదస్సులో ప్రసంగించారు (Pakistan water dispute). ఆయన ప్రసంగంలో ఉగ్రవాదంపై ప్రధానంగా దృష్టి పెట్టారు. ఉగ్రవాదాన్ని ఎదుర్కొనే విషయంలో డబుల్ స్టాండర్డ్స్ ఉండకూడదని మోదీ స్పష్టం చేశారు. ఉగ్రవాదానికి నిధులు అందించడం, ఉగ్రవాదుల నియామకం, ఉగ్ర స్థావరాలు వంటి మొత్తం వ్యవస్థను నిర్మూలించాల్సిన అవసరం ఉందని అన్నారు. ఉగ్రవాదాన్ని తమ సాధనంగా ఉపయోగించే దేశాలకు గట్టి సందేశం ఇవ్వాలని కూడా ప్రధాని పేర్కొన్నారు. ఇమ్రాన్ ఖాన్‌కు పాకిస్థాన్ కోర్టు భారీ ఊరట.. ఇక ఏకాంత నిర్బంధం ఉండదు.. విజయ్ ఫర్ పీఎం.. టీవీకే-కాంగ్రెస్ మధ్య విభేదాలు ముదురుతున్నాయా
జైల్లో ఉన్న పాకిస్థాన్ మాజీ ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్ , ఆయన భార్య బుష్రా బీబీకి భారీ ఉపశమనం లభించింది. వారికి ఇకపై ఏకాంత నిర్బంధం విధించవద్దని ఇస్లామాబాద్ హైకోర్టు ఆదేశించింది. చట్టం ప్రకారం ఖాన్, ఆయన భార్య సమావేశమయ్యేందుకు వీలు కల్పించాలని అడియాలా జైలు అధికారులకు స్పష్టం చేసింది. జీ ప్రధాని 73 ఏళ్ల ఇమ్రాన్ ఖాన్, ఆయన భార్య ప్రస్తుతం రావల్పిండిలోని అడియాలా జైలులో అవినీతి, సంబంధిత కేసుల్లో సుదీర్ఘ జైలు శిక్ష అనుభవిస్తున్నారు.పాకిస్థాన్ తెహ్రీక్-ఎ-ఇన్సాఫ్ (పీటీఐ) పార్టీ వ్యవస్థాపకుడైన ఇమ్రాన్ ఖాన్‌ను ఏకాంత నిర్బంధంలో ఉంచారని ఆరోపిస్తూ ఆయన సోదరి అలీమా ఖాన్ కోర్టును ఆశ్రయించగా.. బుష్రా బీబీ కుమార్తె ముబషరా ఖవార్ మనేకా ఆమెకు సంబంధించి పిటిషన్ దాఖలు చేశారు. ఈ రెండు పిటిషన్లపై జస్టిస్ ఖాదిమ్ హుస్సేన్ సూమ్రో విచారణ చేపట్టి ఈ తీర్పు వెలువరించారు.జైలు నిబంధనల ప్రకారం ఖాన్‌ను కలవడానికి ఆయన కుటుంబ సభ్యులను అనుమతించాలని, అలాగే ఆయన తన కుమారులతో టెలిఫోన్ సంభాషణలు జరిపేందుకు ఏర్పాట్లు చేయాలని అధికారులను న్యాయమూర్తి ఆదేశించారు. ప్రతిరోజూ వార్తాపత్రికలు, పుస్తకాలు అందించాలని, జైలు నిబంధనలకు అనుగుణంగా ఆయనకు వైద్య సౌకర్యాలు అందేలా చూడాలని సూచించారు. కోర్టు ఆదేశాలను అమలుచేసి, 15 రోజుల్లోగా నివేదికను సమర్పించాలని జైలు సూపరింటెండెంట్‌కు జస్టిస్ ఖాదిమ్ స్పష్టం చేశారు.జైలులో ఇమ్రాన్ ఖాన్ఇమ్రాన్ ఖాన్ ఆగస్టు 2023 నుంచి జైలులోనే ఉన్నారు. కుటుంబ సభ్యులను కలవకుండా అధికారులు అడ్డుకుంటున్నారని, సరైన వైద్య సంరక్షణ కూడా అందజేయడం లేదని ఆయన మద్దతుదారులు, బంధువులు ఆరోపిస్తున్నాయి. అయితే, ఈ ఆరోపణలను ప్రభుత్వం ఖండించింది. అవినీతికి సంబంధించిన కేసులో దోషిగా తేలడంతో బీబీని 2024 జనవరి 31న జైలుకు పంపారు. దాదాపు తొమ్మిది నెలల తర్వాత అదే ఏడాది అక్టోబర్ 24న ఆమె బెయిల్‌పై విడుదలయ్యారు.మరో అవినీతి కేసులో దోషిగా తేలడంతో ఆమెను 2025 జనవరి 17న తిరిగి

పాకిస్థాన్ క్రికెట్లో మరోసారి సంక్షోభం నెలకొంది. ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌లో రెండు వరుస ఓటములు ఆ జట్టులో ముసలం పుట్టించింది. టెస్టు సిరీస్‌లో పాక్ వరుస ఓటముల కారణంగా పీసీబీ (PCB) జట్టులో భారీ మార్పులు చేసింది. అయితే సెలెక్టర్లతో ఎలాంటి సంప్రదింపులు జరపకుండానే ప్లేయర్లను తొలగించడం, కోచింగ్ స్టాప్‌ను మార్చడం చేసింది. దీంతో మనస్తాపానికి గురైన పాకిస్తాన్ జట్టు సెలెక్షన్ కమిటీ సభ్యుడు, మాజీ కెప్టెన్ మిస్బా-ఉల్-హక్ తన పదవికి రాజీనామా చేశాడు. అంతేకాదు లాహోర్‌లోని నేషనల్ క్రికెట్ అకాడమీలో బ్యాటింగ్ కన్సల్టెంట్ పదవికి కూడా రాజీనామా చేస్తున్నట్లు మిస్బా ప్రకటించాడు. అయితే మిస్బా రాజీనామాను పీసీబీ ఇంకా ఆమోదించలేదు. అసలేం జరిగింది? లార్డ్స్ వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన రెండో టెస్టులో 194 పరుగుల తేడాతో ఓటమి పాలైన తర్వాత పాకిస్థాన్ జట్టులో పీసీబీ భారీ మార్పులు చేసింది. సెలక్టర్లను సంప్రదించకుండానే టెస్టు జట్టు నుంచి ఏడుగురు ఆటగాళ్లను విడుదల చేసింది. టెస్టు కోచ్ సర్ఫరాజ్ అహ్మద్, బౌలింగ్ కోచ్ ఉమర్ గుల్లను కూడా వారి పదవుల నుంచి తొలగించినట్లు సమాచారం. మూడో టెస్టుకు ముందు వైట్-బాల్ హెడ్ కోచ్ మైక్ హసన్, బౌలింగ్ కోచ్ ఆష్లే నాఫ్కే టెస్టు కోచింగ్ సిబ్బందిలో చేరారు. పాక్ జట్టు నుంచి విడుదలైన ఆటగాళ్లలో మహమ్మద్ రిజ్వాన్, ఇమామ్-ఉల్-హక్, సల్మాన్ ఆఘా, అలీ ఉస్మాన్, ఆమిర్ జమాల్, అవైస్ జాఫర్, ఖుర్రం షాజాద్ ఉన్నారు. వీరి స్థానంలో సయీమ్ అయూబ్, అబ్దుల్లా ఫజల్‌తో పాటు కేవలం 10 మ్యాచ్‌ల ఉమ్మడి అనుభవం ఉన్న ఐదుగురు కొత్త ఆటగాళ్లను జట్టులోకి తీసుకువచ్చింది. జట్టులోకి వచ్చిన ఐదుగురు కొత్త ఆటగాళ్లు: అరాఫత్ మిన్హాస్, మహమ్మద్ ఇమ్రాన్ జూనియర్, సాద్ బేగ్, మహమ్మద్ ఇమ్రాన్ రంధావా, రజావుల్లా. 2019లో పాకిస్తాన్ హెడ్‌కోచ్ పదవి పాకిస్తాన్ అత్యంత విజయవంతమైన టెస్టు కెప్టెన్‌గా పేరు పొందిన మిస్బా ఉల్ హక్ వీడ్కోలు అనంతరం

అవినీతి ఆరోపణలపై మూడేళ్లుగా జైలు జీవితం గడుపుతూ, తరచుగా అనారోగ్యం పాలవుతున్న మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కు (Imran Khan), ఆయన భార్య బుష్రా బీబీకి ఇవాళ ఇస్లామాబాద్ హైకోర్టులో భారీ ఊరట లభించింది. ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్యం, ఆయన పట్ల ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై అంతర్జాతీయంగా విమర్శలు వెల్లువెత్తుతున్న వేళ హైకోర్టు.. ఈ వ్యవహారంపై విచారణ జరిపింది. అనంతరం ఇమ్రాన్ తో పాటు ఆయన భార్యకు పలు వెసులుబాట్లు కల్పిస్తూ కీలక తీర్పు వెలువరించింది.ఇ లార్డ్స్ టెస్టు బాయ్ కాట్ కు పాక్ విఫలయత్నం..? ఇమ్రాన్ కొడుకుల ఇంటర్వ్యూ చిచ్చు..!ఇమ్రాన్ ఖాన్, ఆయన భార్య బుష్రా బీబీలను ఇకపై ఏకాంత నిర్బంధంలో ఉంచకూడదని హైకోర్టు ఆదేశించింది. జైలు నిబంధనల ప్రకారం వీరిద్దరూ సమావేశమయ్యేందుకు వీలు కల్పించాలని కూడా ఇస్లామాబాద్ హైకోర్టు అడియాలా జైలు అధికారులను ఆదేశించింది. ఇమ్రాన్ ఖాన్‌ను ఏకాంత నిర్బంధంలో ఉంచడాన్ని సవాలు చేస్తూ ఆయన సోదరి అలీమా ఖాన్ కోర్టును ఆశ్రయించగా, బుష్రా బీబీకి సంబంధించి ఆమె కుమార్తె ముబషరా ఖవార్ మనేకా పిటిషన్ దాఖలు చేశారు. ఈ రెండు పిటిషన్లపై విచారణ జరిపిన హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. Imran Khan: ఇమ్రాన్ ఖాన్ కోసం ఏకమైన 21 మాజీ కెప్టెన్లు- భారత్ నుంచి వీరే..!జైలు నిబంధనల ప్రకారం ఇమ్రాన్ కుటుంబ సభ్యులు ఆయనను కలిసేందుకు అనుమతించాలని, అలాగే ఆయన తన కుమారులతో టెలిఫోన్ ద్వారా మాట్లాడేందుకు ఏర్పాట్లు చేయాలని హైకోర్టు న్యాయమూర్తి ఖాదిమ్ హుస్సేన్ ఆదేశించారు.ఇమ్రాన్ ఖాన్ కు ప్రతిరోజూ వార్తాపత్రికలు, పుస్తకాలు అందించాలని, జైలు నిబంధనల ప్రకారం వైద్య సదుపాయాలు అందేలా చూడాలని కూడా ఆదేశించారు. కోర్టు ఆదేశాలను పూర్తిగా అమలు చేసేలా చూడాలని, 15 రోజుల్లోగా అమలుకు సంబంధించిన నివేదికను సమర్పించాలని అడియాలా జైలు సూపరింటెండెంట్‌ను హైకోర్టు న్యాయమూర్తి ఆదేశాలు ఇచ్చారు

బూర్గంపహాడ్, సెప్టెంబరు 01 : బూర్గంపహాడ్ మండల పరిధిలోని సారపాక బ్రిలియంట్ నవోదయ కోచింగ్ ఆధ్వర్యంలో జవహర్ నవోదయ విద్యాలయ ప్రవేశ పరీక్ష 2027-28 సంవత్సరానికి సంబంధించి నూతన సిలబస్ విధానంలో జిల్లా స్థాయిలో నూతన సిలబస్‌పై మోడల్ ప్రవేశ పరీక్ష ఈ నెల 6న నిర్వహించనున్నట్లు కోచింగ్ సెంటర్ నిర్వాహకులు, బ్రిలియంట్ విద్యాసంస్థల చైర్మన్ బీఎన్ఆర్ మంగళవారం తెలిపారు. జవహర్ విద్యాలయ సమితిలో కేంద్రం ఈ ఏడాది నవోదయ సిలబస్‌లో స్వల్ప మార్పులు చేసిన నేపథ్యంలో, విద్యార్థులకు కొత్త సిలబస్ పరీక్ష విధానంపై అవగాహన కల్పించేందుకు ఈ పరీక్ష ఉపయోగడుతుందన్నారు. 6వ తేదీ ఉదయం 9.30 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్ష నిర్వహణ జరుగుతుందన్నారు. ప్రస్తుతం 5వ తరగతి చదువుతున్న ఇంగ్లీష్, తెలుగు మీడియం విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. 100 మార్కులకు మెంటల్ ఎబిలిటీ 20, ఎన్విరాన్మెంట్ 20, మ్యాథ్స్ 20, లాంగ్వేజ్ టెస్ట్ 20 మార్కుల చొప్పున ఓఎంఆర్ విధానంలో ఈ పరీక్ష ఉంటుందని వెల్లడించారు

వరుణ్ తేజ్ నటించిన హిట్ హారర్ కామెడీ చిత్రం కొరియన్ కనకరాజు ఓటీటీ విడుదల తేదీ ఖరారైంది. థియేటర్లలో మంచి విజయం సాధించిన ఈ చిత్రం సెప్టెంబర్ 4 నుంచి డిజిటల్లో స్ట్రీమింగ్ కానుంది. తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో కూడా అందుబాటులోకి రానుంది. మేర్లపాక గాంధీ దర్శకత్వం వహించిన ఈ చిత్రం వరుణ్ తేజ్ కెరీర్లో పెద్ద హిట్లలో ఒకటిగా నిలిచింది

ఇంటర్నెట్ డెస్క్: అవినీతి సంబంధిత కేసుల్లో జైలుశిక్ష అనుభవిస్తోన్న పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్, ఆయన సతీమణి బుష్రా బీబీకి భారీ ఊరట లభించింది. రావల్పిండిలోని అడియాలా కారాగారంలో ఉన్న ఈ ఇద్దరిని జైలులో ఒంటరిగా నిర్బంధించకుండా చూడాలని అధికారులను ఇస్లామాబాద్ హైకోర్టు ఆదేశించింది. నిబంధనలకు అనుగుణంగా ఇమ్రాన్‌ను కుటుంబ సభ్యులు కలిసేందుకు అనుమతించాలని, తన కుమారులతో ఆయన టెలిఫోన్లో మాట్లాడేందుకు ఏర్పాట్లు చేయాలని తెలిపింది. ఇమ్రాన్ ఖాన్ (Imran Khan), బుష్రా బీబీలను జైలులో ఒంటరిగా నిర్బంధించారని ఆరోపిస్తూ.. కుటుంబసభ్యులు వేర్వేరుగా దాఖలు చేసిన పిటిషన్లపై హైకోర్టు ఆగస్టు 6న తీర్పును రిజర్వ్ చేసింది. మంగళవారం దాన్ని వెలువరించింది. ఇమ్రాన్ ఖాన్‌కు రోజూ వార్తాపత్రికలు, పుస్తకాలు ఇవ్వాలని, వైద్య సౌకర్యాలు అందేలా చూడాలని సూచించింది. కోర్టు ఉత్తర్వుల అమలుపై 15 రోజుల్లోగా నివేదికను సమర్పించాలని అడియాలా జైలు సూపరింటెండెంట్‌కు ఆదేశాలు జారీ చేసింది. ఉగ్రవాదం వ్యూహాత్మక సంపద కారాదు: పాక్‌కు సూటిగా చెప్పిన మోదీ 2023 ఆగస్టు నుంచి ఇమ్రాన్ ఖాన్ జైల్లోనే ఉన్నారు. కుటుంబ సభ్యులను కలవనీయకుండా, తగిన వైద్య సేవలు అందనీయకుండా అధికారులు అడ్డుకుంటున్నారని ఆయన మద్దతుదారులు, బంధువులు పదేపదే ఆరోపిస్తున్నారు. ఈ ఆరోపణలను ప్రభుత్వం ఖండిస్తూ వస్తోంది. ఇటీవల పాకిస్థాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌లో వైద్య పరీక్షల అనంతరం ఇమ్రాన్‌ను తిరిగి జైలుకు తరలించింది. అల్ షిపా ఆస్పత్రి డాక్టర్ల సమక్షంలో వైద్యపరీక్షలు నిర్వహించామని, ఆయన ఆరోగ్యంగా ఉన్నట్టు తేలిందని ప్రకటించింది. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర

షాంఘై సహకార సంస్థ (ఎస్సీఓ) శిఖరాగ్ర సదస్సు వేదికగా భారత్-పాకిస్థాన్ మధ్య సింధు జలాల ఒప్పందం వివాదం మరోసారి చర్చనీయాంశమైంది. మంగళవారం ఈ అంశాన్ని ప్రస్తావించిన పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్, నీటిని ఎట్టి పరిస్థితుల్లోనూ రాజకీయ అస్త్రంగా మలుచుకోకూడదని భారత్‌ను ఉద్దేశించి పరోక్ష వ్యాఖ్యలు చేశారు. అంతర్జాతీయ ఒప్పందాలను వాటి అసలు స్ఫూర్తికి అనుగుణంగా అమలు చేయాలని ఆయన పిలుపునిచ్చారు.హేగ్‌లోని శాశ్వత మధ్యవర్తిత్వ న్యాయస్థానం సింధు జలాల ఒప్పందం చెల్లుబాటును సమర్థిస్తూ, వివాద పరిష్కార యంత్రాంగం కొనసాగుతుందని తీర్పు వెలువరించిన మరుసటి రోజే షెహబాజ్ ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.అయితే, ఈ న్యాయస్థానం తీర్పును భారత్ తీవ్రంగా వ్యతిరేకించింది. అసలు, ఆ కోర్టు ఏర్పాటే చట్టవిరుద్ధమని, దాని పరిధిని తాము గుర్తించబోమని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ఇప్పటికే స్పష్టం చేసింది. సదరు ట్రైబ్యునల్ విచారణలో భారత్ పాల్గొనలేదని, ఆ తీర్పులు తమ జలవిద్యుత్ ప్రాజెక్టులపై ఎలాంటి ప్రభావం చూపబోవని తేల్చిచెప్పింది.2025 ఏప్రిల్‌లో జరిగిన పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో సింధు జలాల ఒప్పందాన్ని భారత్ నిలిపివేసింది. తాజా తీర్పు వెలువడినప్పటికీ, ఈ విషయంలో తన వైఖరిలో ఎలాంటి మార్పు లేదని భారత్ పునరుద్ఘాటించింది.ఇదే ఎస్సీఓ సదస్సులో ప్రసంగించిన భారత ప్రధాని నరేంద్ర మోదీ, ఉగ్రవాదంపై పోరాటంలో ద్వంద్వ ప్రమాణాలు పాటించడం తగదని హెచ్చరించారు. ఉగ్రవాదానికి అందుతున్న నిధులు, నియామకాలు, సురక్షిత స్థావరాలను కూకటివేళ్లతో పెకిలించాలని పిలుపునిచ్చారు. ఈ పరిణామాలతో భారత్-పాకిస్థాన్ మధ్య ఇప్పటికే నెలకొన్న ఉద్రిక్తతల మధ్య సింధు జలాల వివాదం మరోసారి కీలక

ఎస్సీఓ వేదికపై ఫొటోగ్రాఫ్ అనంతరం వెళ్లిపోతున్న రష్యా అధ్యక్షుడు పుతిన్‌ను పాక్ ప్రధాని పిలిచారు. అనంతరం ఆయనతో సంభాషించారు. ఇంటర్నెట్ డెస్క్: కిర్గిస్థాన్‌లో జరుగుతున్న షాంఘై కోపరేషన్ ఆర్గనైజేషన్(ఎస్సీఓ) సదస్సులో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. ఈరోజు(మంగళవారం) సభ్యదేశాల అధ్యక్షులు, ప్రధాన మంత్రుల ఫొటోగ్రాఫ్ తరవాత అక్కడి నుంచి వెళ్లిపోతున్న రష్యా అధ్యక్షుడు వ్లాదిమర్ పుతిన్‌ను పాకిస్థాన్ ప్రధాన మంత్రి షెహబాజ్ షరీఫ్ వెనుక నుంచి తట్టారు. అనంతరం ఆయనతో సంభాషించారు. అయితే పాక్ ప్రధాని రష్యా అధ్యక్షుడికి ఏం చెప్పి ఉంటారనే విషయమై ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చ జోరందుకుంది. ఉక్రెయిన్‌తో యుద్ధానికి రష్యా ముగింపు చెప్పాలని భారత ప్రధాని నరేంద్ర మోదీ పిలుపిచ్చిన తరువాతి రోజే ఈ ఘటన జరిగింది. బీష్కెక్లో రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు, తనకు జరిగిన భేటీలో మోదీ ఈ సూచనలు చేశారు. ‘యుద్ధానికి కేటాయించే ప్రతి దినమూ మానవత్వాన్ని అంతం చేస్తుంది. శాంతి కోసం కేటాయించే ప్రతి ఒక్కరోజూ మావవత్వాన్ని బతికించి, కొత్త ఆశలు చిగురించేలా చేస్తుంది’ అని ఆయన చెప్పారు. అందుకే యుద్ధాన్ని వీడాలని సూచించారు. హెగ్సెత్‌పై ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలు.. 2028 రేసులో ఉన్నట్టా? విమాన ఇంధనానికి మళ్లీ మంట.. లీటరుకు రూ.6.28 పెరిగిన ఏటీఎఫ్ ధర

Pakistan Cricket: పాకిస్థాన్ క్రికెట్ బోర్డు చరిత్రలోనే అత్యంత షాకింగ్ నిర్ణయంతో ప్రపంచ క్రికెట్‌ను విస్మయానికి గురిచేసింది. ఇంగ్లండ్‌తో జరుగుతున్న టెస్టు సిరీస్ మధ్యలోనే ఏకంగా ఏడుగురు కీలక ఆటగాళ్లను స్వదేశానికి పంపిస్తూ, ఇద్దరు కోచ్‌లను తొలగించింది. ఈ పరిణామంపై మాజీ క్రికెటర్ రమీజ్ రాజా తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఇంగ్లాండ్ పర్యటనలో పాకిస్థాన్ టెస్టు జట్టు ప్రదర్శన దారుణంగా తయారైంది. మొదటి రెండు టెస్టుల్లోనూ ఘోర పరాజయాన్ని మూటగట్టుకుని సిరీస్‌ను 0-2 తేడాతో ముందస్తుగానే కోల్పోయింది. సెప్టెంబర్ 9న ప్రారంభం కానున్న మూడో ఆఖరి టెస్టు మ్యాచ్‌కు ముందే పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఊహించని నిర్ణయం తీసుకుంది. జట్టులోని ఏడుగురు కీలక సభ్యులతో పాటు ఇద్దరు కోచ్‌లను అర్ధాంతరంగా తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. క్రికెట్ చరిత్రలోనే పర్యటన మధ్యలో ఇంత పెద్ద సంఖ్యలో ఆటగాళ్లను ఇంటికి పంపడం ఎప్పుడూ జరగలేదని విశ్లేషకులు చెబుతున్నారు. పీసీబీ తీసుకున్న ఈ అకస్మాత్తు చర్యపై పాకిస్థాన్ మాజీ క్రికెటర్ రమీజ్ రాజా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. బీబీసీ పాడ్‌కాస్ట్ ముఖాముఖిలో మాట్లాడుతూ పీసీబీ తీరును ఎద్దేవా చేశారు. క్రికెట్లో ఎక్కడా ఇలాంటి వింత నిర్ణయాలు ఉండవని, ఒకేసారి ఇంతమందిని పక్కన పెట్టి పాకిస్థాన్ కొత్త వరల్డ్ రికార్డు క్రియేట్ చేసిందని కామెంట్ చేశాడు. బోర్డు ఒత్తిడికి తలొగ్గి ఇలాంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం ఏమాత్రం తగదని హితవు పలికారు. ఫుట్‌బాల్ సంస్కృతిని క్రికెట్‌కు రుద్దడమేంటి? పీసీబీ వ్యవహరించిన తీరును తీవ్రంగా తప్పుబట్టిన రమీజ్ రాజా, ఇది క్రికెట్ బోర్డులా కాకుండా ఫుట్‌బాల్ క్లబ్‌లా ప్రవర్తిస్తోందని మండిపడ్డారు. ఫుట్‌బాల్ లీగ్‌లలో మధ్యలోనే మేనేజర్లను, ప్లేయర్లను మార్చినట్లుగా క్రికెట్లో చేయడం ఆట ప్రాథమిక సూత్రాలకే విరుద్ధమని స్పష్టం చేశారు. మూడో టెస్టు ముగిసే వరకు కనీసం పది రోజుల పాటు ఓపిక పట్టకుండా ఇలాంటి నిర్ణయం తీసుకోవడం సరైంది కాదన్నారు. మొదటి టెస్టులో ఇన్నింగ్స్ 103 పరుగుల

Osmania University: దళిత బంధు పెండింగ్ నిధులు విడుదల చేయాలని ఓయూలో నిరసన! Osmania University: రాష్ట్రవ్యాప్తంగా పెండింగ్ లో ఉన్న దళిత బంధు నిధులను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ దళిత బంధు సాధన సమితి రాష్ట్ర కన్వీనర్ డా. బుషిపాక గణేశ్ ఆధ్వర్యంలో మోత్కూర్, అడ్డగూడూరు మండలాలకు చెందిన దళిత బంధు లబ్ధిదారులు ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాలలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా డా. బుషిపాక గణేశ్ మాట్లాడుతూ.. పేదల సంక్షేమం కోసం గత ప్రభుత్వం దళిత బంధు పథకాన్ని ప్రవేశపెట్టిందన్నారు. రెండో విడతలో భాగంగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో రూ.3 లక్షలు జమ చేసిన అనంతరం 2023 అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ రావడంతో కలెక్టర్లు బ్యాంకు ఖాతాలను ఫ్రీజ్ చేశారని తెలిపారు. రెండో విడత దళిత బంధు నిధులను విడుదల చేయాలని రాష్ట్ర కార్పొరేషన్ ఎండీ ఆదేశాలు ఇచ్చినప్పటికీ, ఇప్పటివరకు నిధులు పూర్తిస్థాయిలో విడుదల కాలేదని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మూడు సంవత్సరాలు గడిచినా దళిత బంధు నిధుల సమస్య పరిష్కారం కాలేదని, దీంతో లబ్ధిదారుల కుటుంబాలు అనేక సంక్షేమ పథకాలకు దూరమవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే బ్యాంకు ఖాతాలపై ఉన్న ఫ్రీజింగ్‌ను ఎత్తివేసి, గ్రౌండింగ్ ప్రక్రియను పూర్తి చేసి ప్రతి లబ్ధిదారుడి ఖాతాలో మిగిలిన రూ.10 లక్షల దళిత బంధు నిధులను జమ చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో టిఎస్ఎస్ఏ రాష్ట్ర అధ్యక్షుడు తాళ్ల అజయ్, బీఆర్ఎస్వి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొంపల్లి నరేష్ తో పాటు దళిత బంధు లబ్ధిదారులు జిల్లా శివాజీ, జక్కుల గిరిబాబు, ఇటీకాల అంజన్న, చేడే సైదులు, బాలెంల నరేందర్, శ్రీరామ్‌ల ప్రదీప్, బుషిపాక సంజీవ, బట్ట చిన్న వెంకన్న, మంద విష్ణు తదితరులు పాల్గొన్నారు

టెక్నాలజీ కొత్త పుంతలు తొక్కుతున్న కాలంలో.. వినూత్న ఆవిష్కరణలు, ప్రయోగాలు నిత్యకృత్యంగా మారాయి. అయితే కొత్తదనం ఎంత ఆసక్తికరంగా ఉన్నా.. భద్రత విషయంలో ఏమాత్రం నిర్లక్ష్యం చేసినా ఊహించని పరిణామాలు తప్పవు. పాకిస్థాన్‌లో జరిగిన ఈ ఘటన అందుకు ఓ ఉదాహరణ. పాకిస్తాన్లో టెక్నాలజీ ప్రయోగం కాస్తా.. పోలీస్ వ్యాన్‌ను ఢీకొట్టే ఘటనగా మారింది. ఇంటర్నెట్ కనెక్షన్ ఒక్కసారిగా తెగిపోవడంతో రిమోట్ కంట్రోల్‌తో నడుస్తున్న ఓ ఆటోమేటిక్ కారు అదుపు తప్పి నేరుగా పోలీస్ వ్యాన్‌ను ఢీకొట్టింది. పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్‌లోని డీ-చౌక్ వద్ద జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారిపోయి నవ్వులు పూయిస్తోంది. ఆటోమేటెడ్ డ్రైవింగ్ టెక్నాలజీని ప్రదర్శిస్తున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. అక్కడి జర్నలిస్టు మహ్మద్ ఆలిజా కారులో ముందు సీట్లో కూర్చొని దాని ప్రత్యేకతలను వివరిస్తున్నారు. అబ్బొట్టాబాద్కు చెందిన టెక్నాలజీ ఔత్సాహికుడు ఇహ్సాన్ జాఫర్ రూపొందించిన ఈ ఆటోమేటెడ్ డ్రైవింగ్ టెక్నాలజీపై రిపోర్టు చేసేందుకు తాను అక్కడికి వెళ్లినట్లు ఆలిజా వెల్లడించారు. కారు ముందుకు కదులుతుండగా.. ఒక్కసారిగా రిమోట్ ద్వారా నియంత్రించే స్టీరింగ్ స్పందించడం ఆపేసింది. పరిస్థితిని గమనించిన ఆలిజా వెంటనే హ్యాండ్‌బ్రేక్ వేసేందుకు ప్రయత్నించినా ప్రయోజనం లేకపోయింది. కారు వేగంగా ముందుకు దూసుకెళ్లి అక్కడే ఉన్న పోలీస్ వ్యాన్‌ను ఢీకొట్టింది. కనెక్షన్ కట్.. కారు కంట్రోల్ ఔట్! ఈ కారును ఇంటర్నెట్, శాటిలైట్ కనెక్షన్ల సాయంతో రిమోట్‌గా నియంత్రిస్తున్నట్లు ఆలిజా తెలిపారు. అయితే ప్రయోగం జరుగుతున్న సమయంలో ఇంటర్నెట్ కనెక్షన్ తెగిపోవడంతో కారు నియంత్రణ కోల్పోయిందని చెప్పారు. అదృష్టవశాత్తూ ఘటన జరిగిన సమయంలో అక్కడ ట్రాఫిక్ తక్కువగా ఉండటంతో పెద్ద ప్రమాదం తప్పింది. అదే కారు రద్దీగా ఉండే రోడ్డుపై అదుపు తప్పి ఉంటే పరిస్థితి తీవ్రంగా ఉండేదని ఆలిజా పేర్కొన్నారు. అయితే పోలీసులు ఎలా స్పందించారో అనేది మాత్రం ఆయన వివరించలేదు. ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్

కిర్గిజిస్తాన్ రాజధాని బిష్కెక్ లో ఆరంభమైన షాంఘై సహకార సంస్థ (SCO) శిఖరాగ్ర సదస్సులో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్నారు. 26వ సమ్మిట్ ఇది. సభ్య దేశాల అధినేతలు, ప్రధానులతో భేటీ అయ్యారు. చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్, ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌లను కలిశారు. రష్యా అధ్యక్షుడితో జరిగిన ప్రత్యేక ద్వైపాక్షిక చర్చల్లో పరస్పర సంబంధాల బలోపేతంతో పాటు అంతర్జాతీయ శాంతి స్థాపన ప్రాధాన్యత గురించి వివరించారు.ఎస్సీఓ రౌండ్ టేబుల్ ను ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగించారు. ఆయా దేశాధినేతలతో పాటు పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ కూడా ఇందులో పాల్గొన్నారు. ఉగ్రవాదంపై పోరు, సభ్యదేశాల సార్వభౌమాధికారం, రీజినల్ కనెక్టివిటీ వంటి అంశాలపై తన వైఖరిని స్పష్టం చేశారు. భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల మధ్య వ్యూహాత్మక స్వయంప్రతిపత్తిని కాపాడుకుంటూనే యురేషియా ప్రాంతంలోని ఇతర దేశాలతో సహకారాన్ని పెంచుకుంటోందని పునరుద్ఘాటించారు. ఈ విషయంలో రాజీపడబోమని తేల్చి చెప్పారు.సరిహద్దు దేశాల ఉగ్రవాద విధానాల గురించి ప్రధాని మోదీ ప్రత్యేకంగా ప్రస్తావించారు. పాకిస్తాన్, ఇతర ఉగ్రవాద దేశాలు అనుసరిస్తోన్న వైఖరిని ఎండగట్టారు. ఉగ్రవాదంపై ద్వంద్వనీతిని అనుసరించవద్దని హెచ్చరించారు. ఒకవైపు ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తూనే మరో వైపు దీన్ని అంతం చేస్తామంటూ మాట్లాడటం సరికాదని, ఇటువంటి వైఖరికి ఏ మాత్రం ఆస్కారం ఇవ్వకూడదని ప్రధాని మోదీ స్పష్టం చేశారు.నేటి నుంచి.. అరుణాచలం, తమిళనాడులోని ఇతర ఆలయాలకు వెళ్లే భక్తులకు ముఖ్య గమనికఉగ్రవాదాన్ని ఒక వ్యూహాత్మక ఆయుధంగా ఉపయోగించుకోవడం, తీవ్రవాదులకు ఆశ్రయం కల్పించే దేశాల విషయంలో ద్వంద్వ ప్రమాణాలను వీడాలని ప్రధాని మోదీ హితవు పలికారు. ఉగ్రవాదులకు నిధులు సమకూర్చడం, వారిని పెద్ద ఎత్తున రిక్రూట్మెంట్ చేసుకోవడం, షెల్టర్ జోన్ లను ఏర్పాటు చేయడం వంటి విధానాలను ఏ దేశం కూడా ప్రోత్సహించబోదని, ఈ వ్యవస్థను సమూలంగా మట్టుబెట్టాల్సిందేనని చెప్పారు.మీరు నిత్యం ధ్వేషించే మొఘల్ చక్రవర్తి పుట్టిన గడ్డ అది: ప్రధాని మోదీకి ఒవైసీ
Pakistan Food Crisis 2026 : పాకిస్థాన్‌లో రోజురోజుకూ విపరీతంగా పెరుగుతున్న ద్రవ్యోల్బణం, దయనీయ ఆర్థిక పరిస్థితులు ఆ దేశ ప్రజల ఆహారంపై కూడా తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి. నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటుతుండటంతో.. సామాన్య కుటుంబాల బడ్జెట్ తలకిందులైంది. దీంతో మనుగడ సాగించేందుకు పౌరులు తమ ఆహార అలవాట్లను బలవంతంగా మార్చుకుంటున్నారు. కనీసం పాలు, మాంసం, గోధమలు వంటివి కూడా కొనుక్కొని తినే పరిస్థితి లేకుండా పోయింది. పాకిస్థాన్ బ్యూరో ఆఫ్ స్టాటిస్టిక్స్ (పీబీఎస్) డేటాను ఉటంకిస్తూ వచ్చిన నివేదికల ప్రకారం.. గడిచిన ఆరేళ్ల కాలంలో దేశవ్యాప్తంగా దాదాపు అన్ని ప్రధాన ఆహార పదార్థాల వినియోగం దారుణంగా పడిపోయింది.పాలు, మాంసం కోత.. పెరిగిన ఆహార అభద్రతగ్రామీణ, పట్టణ ప్రాంతాలు అనే తేడా లేకుండా పాలు, మాంసం, గోధుమలు, బియ్యం, టీ పొడి వంటి ప్రాథమిక ఆహార పదార్థాల కొనుగోలును ప్రజలు గణనీయంగా తగ్గించేశారు. 2018-19 కాలంలో దేశంలో 15.92 శాతంగా ఉన్న ఆహార అభద్రత.. 2024-25 నాటికి ఏకంగా 24.35 శాతానికి చేరుకుంది. ఇదే సమయంలో తీవ్రమైన ఆహార అభద్రతను ఎదుర్కొంటున్న కుటుంబాల సంఖ్య 2.37 శాతం నుంచి 5.04 శాతానికి పెరిగి రెట్టింపు కావడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. పౌష్టికాహారం అందించే పాలు, మాంసం వంటి ఖరీదైన పదార్థాలను కొనే శక్తి లేక ప్రజలు సతమతమవుతున్నారు.వనస్పతి గీ వినియోగం 81 శాతం పెరుగుదలఅన్ని రకాల ఆహార పదార్థాల వినియోగం తగ్గుతుంటే.. ఒక్క వనస్పతి గీ వినియోగం మాత్రం ఊహించని రీతిలో పెరగడం గమనార్హం. నెలకు సగటున 690 గ్రాములుగా ఉన్న వనస్పతి గీ వినియోగం ఏకంగా 81 శాతం పెరిగి 1.25 కిలోగ్రాములకు చేరింది. ఖరీదైన మాంసకృత్తులు, ఇతర పోషకాహార పదార్థాలకు ప్రత్యామ్నాయంగా తక్కువ ధరలో ఎక్కువ క్యాలరీలు అందించే వనస్పతి గీని ప్రజలు తమ రోజువారీ వంటకాల్లో అధికంగా ఉపయోగిస్తున్నారని ఈ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.పట్టణాల్లోనూ ఆకలి కేకలు
ఇంగ్లాండ్‌తో జరుగుతున్న టెస్ట్ సిరీస్‌లో వరుసగా తొలి రెండు మ్యాచ్‌లలో ఓడిపోయి సిరీస్ కోల్పోవడంతో పాకిస్థాన్ జట్టు యాజమాన్యం తీవ్ర చర్యలు చేపట్టింది. జట్టులో ఉన్న ఏడుగురు ఆటగాళ్లను తక్షణమే పర్యటన నుంచి తొలగించి స్వదేశానికి తిప్పి పంపింది. ఈ జాబితాలో మాజీ పరిమిత ఓవర్ల సారథి సల్మాన్ అఘా, వికెట్ కీపర్ మహమ్మద్ రిజ్వాన్, ఓపెనర్ ఇమామ్ ఉల్ హక్‌లతో పాటు ఆమిర్ జమాల్, ఖుర్రం షెహజాద్, అలీ ఉస్మాన్, మహమ్మద్ అవైస్ జఫార్ ఉన్నారు. ఇటీవల ఆడిన ఆరు టెస్టుల్లో ఐదింటిలో ఓడిపోవడం, ఆటగాళ్ల ప్రదర్శన ఘోరంగా ఉండటంతో బోర్డు ఈ కఠిన నిర్ణయం తీసుకుంది.కేవలం ఆటగాళ్లపైనే కాకుండా బౌలింగ్, హెడ్ కోచ్‌లపై కూడా పాకిస్థాన్ క్రికెట్ బోర్డు చర్యలు తీసుకుంది. ప్రస్తుత టెస్ట్ హెడ్ కోచ్ సర్ఫరాజ్ అహ్మద్, బౌలింగ్ కోచ్ ఉమర్ గుల్లను బాధ్యతల నుంచి తొలగించింది. వీరి స్థానంలో పరిమిత ఓవర్ల క్రికెట్ హెడ్ కోచ్‌గా ఉన్న న్యూజిలాండ్ మాజీ దిగ్గజం మైక్ హెస్సన్‌కు టెస్ట్ జట్టు బాధ్యతలను కూడా అప్పగించింది. ప్రస్తుత ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ సైకిల్ పూర్తయ్యే వరకు మైక్ హెస్సన్ పాకిస్థాన్ టెస్ట్ జట్టుకు మార్గదర్శకం వహిస్తారు.మూడో టెస్టు మ్యాచ్ సెప్టెంబర్ 9 నుంచి బర్మింగ్‌హామ్ వేదికగా ప్రారంభం కానుంది. దీనికోసం సామ్ ఆయుబ్, అబ్దుల్లా ఫజాల్లను జట్టులోకి తీసుకున్నారు. వారితో పాటు అరాఫత్ మిన్హాస్, మహమ్మద్ ఇమ్రాన్ జూనియర్, సాద్ బైగ్, రాజావుల్లా, మహమ్మద్ ఇమ్రాన్‌లను నూతనంగా జట్టులోకి ఎంపిక చేశారు. వీరికి వీసాలు లభించిన వెంటనే ఇంగ్లాండ్‌లోని జట్టుతో కలవనున్నారు.ఇప్పటికే సిరీస్ కోల్పోవడంతో పాటు ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్ రేసు నుంచి కూడా పాకిస్థాన్ నిష్క్రమించింది. ఈ క్రమంలో బర్మింగ్‌హామ్‌లో జరిగే చివరి టెస్టులోనైనా గెలిచి పరువు కాపాడుకోవడంతోపాటు వైట్ వాష్ పరాభవాన్ని తప్పించుకోవాలని పాకిస్థాన్ భావిస్తోంది. చివరి టెస్టులో బాబర్ ఆజామ్ సారథ్యంలో యువ ఆటగాళ్లతో బరిలోకి

పాకిస్థాన్‌లో ఆహార సంక్షోభం తీవ్రరూపం దాల్చుతోంది. నిత్యావసరాల ధరలు ఆకాశాన్నంటడం, ఆదాయం పడిపోవడంతో ప్రజలు తమ ఆహారపు అలవాట్లను గణనీయంగా మార్చుకుంటున్నారు. ఆరేళ్ల క్రితంతో పోలిస్తే పాలు, మాంసం, బియ్యం, గోధుమలు వంటి ప్రధాన ఆహార పదార్థాల వినియోగాన్ని భారీగా తగ్గించుకున్నారని పాకిస్థాన్ బ్యూరో ఆఫ్ స్టాటిస్టిక్స్ (పీబీఎస్) విడుదల చేసిన తాజా గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.పీబీఎస్ నివేదిక ప్రకారం, 2018-19లో తలసరి నెలవారీ గోధుమల వినియోగం 7.0 కిలోలు ఉండగా, 2024-25 నాటికి అది 6.59 కిలోలకు తగ్గింది. ఇదే కాలంలో బియ్యం వాడకం 1.06 కిలోల నుంచి 0.86 కిలోలకు, పప్పుధాన్యాలు 0.35 కిలోల నుంచి 0.26 కిలోలకు పడిపోయాయి. పౌష్టికాహారంలో కీలకమైన తాజా పాల వినియోగం 6.85 కిలోల నుంచి 6.15 కిలోలకు, మాంసం (బీఫ్, మటన్, చికెన్) వినియోగం 0.61 కిలోల నుంచి 0.50 కిలోలకు క్షీణించింది. దీనికి పూర్తి విరుద్ధంగా, వనస్పతి (వెజిటబుల్ ఘీ) వినియోగం మాత్రం 81 శాతం పెరిగి, నెలకు 0.69 కిలోల నుంచి 1.25 కిలోలకు చేరడం గమనార్హం.ఈ మార్పులకు గల కారణాలను పాకిస్థాన్ ఎకనామిక్ సర్వే 2025-26, హౌస్‌హోల్డ్ ఇంటిగ్రేటెడ్ ఎకనామిక్ సర్వే (హెచ్ఐఈఎస్) 2024-25 స్పష్టంగా విశ్లేషించాయి. ఆహార పదార్థాల ధరలు పెరిగి, ప్రజల కొనుగోలు శక్తికి మించినప్పుడు పోషకాహారాన్ని వదులుకోవాల్సి వస్తోందని సర్వే పేర్కొంది. ముఖ్యంగా తక్కువ ఆదాయ వర్గాల వారు ప్రొటీన్లు అధికంగా ఉండే పాలు, మాంసం వంటి వాటికి బదులుగా, చౌకగా లభించే, కేలరీలు ఎక్కువగా ఉండి పోషకాలు

పాకిస్థాన్‌లోని పంజాబ్ ప్రావిన్స్‌లో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఒక పురాతన హిందూ దేవాలయాన్ని కూల్చివేయడం తీవ్ర వివాదాస్పదంగా మారింది. మదర్సా విస్తరణ కోసం మత ఛాందసవాదులు ఈ ఆలయాన్ని ఉద్దేశపూర్వకంగానే ధ్వంసం చేశారని హక్కుల సంఘాలు, మైనారిటీ సంస్థలు ఆరోపిస్తున్నాయి. దీనిపై సమగ్ర దర్యాప్తు జరిపి, ఆలయాన్ని పునర్నిర్మించాలని షెహబాజ్ షరీఫ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాయి. అయితే, ఈ ఆరోపణలను స్థానిక అధికారులు ఖండిస్తున్నారు. భారీ వర్షాల కారణంగానే పాత నిర్మాణం కూలిపోయిందని చెబుతున్నారు.పీటీఐ వార్తా సంస్థ కథనం ప్రకారం.. లాహోర్‌కు సుమారు 130 కిలోమీటర్ల దూరంలో ఉన్న నరోవల్ జిల్లాలోని సిరాజ్ గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. దాదాపు 125 ఏళ్ల నాటి ఈ ఆలయాన్ని ఆగస్టు 21న నిషేధిత తెహ్రీక్-ఇ-లబ్బైక్ పాకిస్థాన్ (టీఎల్పీ) పార్టీకి చెందిన కొందరు వ్యక్తులు కూల్చివేశారని ఆరోపణలు వస్తున్నాయి. సుమారు 1,000 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఉన్న ఈ ఆలయ భూమిని, దానికి ఆనుకుని ఉన్న మదర్సాలో కలిపేందుకే ఈ దుశ్చర్యకు పాల్పడినట్లు మైనారిటీ సంఘాలు ఆరోపిస్తున్నాయి.ఈ ఘటనపై పాకిస్థాన్ మసిహా మిల్లత్ పార్టీ (పీఎంఎంపీ) తీవ్రంగా స్పందించింది. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని, ఆలయాన్ని తిరిగి నిర్మించాలని పంజాబ్ ముఖ్యమంత్రి మర్యం నవాజ్ షరీఫ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. పీఎంఎంపీ ఛైర్మన్ అస్లాం పర్వేజ్ సహోత్రా మాట్లాడుతూ.. కూల్చివేసిన ఆలయానికి చెందిన ఇటుకలు, శిఖరానికి ఉన్న లోహపు సామాగ్రిని కూడా దుండగులు అమ్ముకున్నారని ఆరోపించారు. గతంలో ఆలయానికి ఆనుకుని ఉన్న భూమిని ఎవాక్యూ ట్రస్ట్ ప్రాపర్టీ బోర్డ్

మదరసా విస్తరణ కోసం 100 ఏళ్ల నాటి హిందూ దేవాలయాన్ని కూల్చేసిన ఘటన పాకిస్థాన్‌లోని పంజాబ్ ప్రావిన్స్‌లో చోటుచేసుకుంది. ఇంటర్నెట్ డెస్క్: మదరసా విస్తరణ కోసం 100 ఏళ్ల నాటి హిందూ దేవాలయాన్ని కూల్చేసిన ఘటన పాకిస్థాన్‌లోని పంజాబ్ ప్రావిన్స్‌లో చోటుచేసుకుంది. న్యూస్ ఏజెన్సీ పీటీఐ రిపోర్టు ప్రకారం.. లాహోర్‌కు దాదాపు 130 కిలోమీటర్ల దూరంలో ఉన్న నరోవాల్ జిల్లాలోని 'సిరాజ్' అనే గ్రామంలో 100 ఏళ్లనాటి ఓ ఆలయం ఉంది. ఆ ఆలయం సుమారు 1,000 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఉంది. ఆలయం పక్కనే మదరసా ఉంది. నిషేధిత తీవ్రవాద ఇస్లామిక్ పార్టీ 'తెహ్రీక్-ఇ-లబ్బైక్ పాకిస్తాన్'కి చెందిన కొందరు వ్యక్తులు మదరసాను విస్తరించటం కోసం ఆగస్టు 21వ తేదీన ఆలయాన్ని కూల్చివేశారు. ఆలయ శిఖరానికి సంబంధించిన మెటల్ ఫిట్టింగులను, ఇటుకలను అక్కడి నుంచి తరలించారు. హక్కుల కార్యకర్తలు ఈ సంఘటనపై వెంటనే దర్యాప్తు చేయించాలని ప్రభుత్వాన్ని కోరారు. కూలగొట్టిన చోటే ఆలయాన్ని పునర్నిర్మించాలని స్థానిక నాయకులు, మైనారిటీ సంఘాలు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశాయి. ఈ సంఘటనపై ప్రభుత్వ వాదనలు భిన్నంగా ఉన్నాయి. 100 నుంచి 125 ఏళ్ల చరిత్ర కలిగిన ఆ గుడి భారీ వర్షాల కారణంగా కూలిపోయిందని ప్రభుత్వం అంటోంది. ఎవాక్యూ ట్రస్ట్ ప్రాపర్టీ బోర్డ్ అధికారి మీడియాతో మాట్లాడుతూ.. ‘ప్రభుత్వ రికార్డుల్లో గుడికి పేరు లేదు. అది చాలా పురాతనమైన గుడి. 100 నుంచి 125 సంవత్సరాల పాతది. భారీ వర్షాల కారణంగా గుడి కూలిపోయింది. ఆ భూమిని ఎవ్వరికీ లీజుకు ఇవ్వలేదు. గుడిని పునర్నిర్మించే బాధ్యత మా అధికారులు తీసుకుంటారు’ అని తెలిపారు. ఎన్ని అడ్డంకులు వచ్చినా స్థానిక ఎన్నికలు జరగడం ఖాయం: మంత్రి నారాయణ

నీళ్ల విషయంలో పాకిస్తాన్‌కు భారత్ మరోసారి గట్టి షాక్ ఇచ్చింది. సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేసిన తమ నిర్ణయం వెనక్కి తీసుకునే ప్రసక్తే లేదని భారత ప్రభుత్వం స్పష్టం చేసింది. హేగ్‌లోని శాశ్వత మధ్యవర్తిత్వ న్యాయస్థానం ఒప్పందాన్ని పునరుద్ధరించాలని సూచించినా.. భారత్ సార్వభౌమ నిర్ణయాలపై తీర్పులు ఇచ్చే అధికారం ఆ కోర్టుకు లేదని కేంద్ర విదేశాంగ శాఖ తేల్చిచెప్పింది. పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో తీసుకున్న ఈ నిర్ణయం కొనసాగుతుందని స్పష్టం చేస్తూ.. పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని పెంచిపోషిస్తున్నంత కాలం నీటి విషయంలోనూ వెనక్కి తగ్గబోమని భారత్ సంకేతాలు ఇచ్చింది. ఒప్పందాన్ని నిలిపివేస్తూ భారత్ తీసుకున్న నిర్ణయం ఇప్పటికీ అమల్లోనే ఉందని తేల్చిచెప్పింది. కాగా, 1960 సెప్టెంబర్‌లో భారత్, పాకిస్తాన్ మధ్య కుదిరిన సింధు జలాల ఒప్పందం.. సింధు నదీ వ్యవస్థలోని జలాల వినియోగం, పంపిణీకి సంబంధించి ఇరు దేశాల మధ్య కీలక ఒప్పందంగా కొనసాగుతోంది. అయితే, గతేడాది ఏప్రిల్ 22న పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడిలో 26 మంది ప్రాణాలు కోల్పోయిన తర్వాత పాకిస్తాన్‌పై భారత్ పలు కఠిన చర్యలు తీసుకుంది. ఇందులో భాగంగానే సింధు జలాల ఒప్పందాన్ని ‘అబేయన్స్’లో ఉంచుతున్నట్లు ప్రకటించింది. భారత్ తాజా నిర్ణయానికి పహల్గామ్ ఉగ్రదాడితో పాటు పాకిస్తాన్ భూభాగం నుంచి కొనసాగుతున్న సరిహద్దు ఉగ్రవాదమే ప్రధాన కారణమని కేంద్రం స్పష్టం చేస్తోంది. పాక్‌లో తన భూభాగం నుంచి పనిచేస్తున్న ఉగ్రవాద నెట్‌వర్క్‌లను ధ్వంసం చేసే విషయంలో నమ్మదగిన, తిరుగులేని చర్యలు తీసుకునే వరకు ఒప్పంద కార్యకలాపాలు పునరుద్ధరించబోమని భారత్ స్పష్టం చేసింది. మధ్యవర్తిత్వ ప్రక్రియపైనా అభ్యంతరం.. మరోవైపు.. భారత్-పాకిస్థాన్ మధ్య కిషన్‌గంగా, రాట్లే జలవిద్యుత్ ప్రాజెక్టుల డిజైన్‌కు సంబంధించి తలెత్తిన విభేదాలపై పాకిస్తాన్ మధ్యవర్తిత్వాన్ని కోరింది. ఈ అంశాలపై శాశ్వత మధ్యవర్తిత్వ న్యాయస్థానం విచారణ చేపట్టింది. అయితే, భారత్ మొదటి నుంచే ఈ ప్రక్రియను వ్యతిరేకిస్తోంది. ఇలాంటి వివాదాలు సాంకేతిక అంశాలకు సంబంధించినవని, ఒప్పందంలో పేర్కొన్న విధంగా ‘న్యూట్రల్ ఎక్స్పర్ట్’ ద్వారా

ఇంగ్లాండ్‌తో జరుగుతున్న టెస్ట్ సిరీస్‌లో ఎదురైన ఘోర పరాజయాల నేపథ్యంలో పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) ప్రక్షాళన చర్యలకు ఉపక్రమించింది. లార్డ్స్‌లో జరిగిన రెండో టెస్టులో 194 పరుగుల భారీ తేడాతో ఓటమి పాలైన వెంటనే, సిరీస్ మధ్యలోనే జట్టులో సమూల మార్పులు చేపట్టింది. ఏడుగురు ఆటగాళ్లను జట్టు నుంచి తప్పించడంతో పాటు, రెడ్-బాల్ కోచింగ్ సిబ్బందిపై కూడా వేటు వేసింది.వికెట్ కీపర్ మహమ్మద్ రిజ్వాన్, ఓపెనర్ ఇమామ్-ఉల్-హక్, పరిమిత ఓవర్ల క్రికెట్ మాజీ కెప్టెన్ సల్మాన్ అలీ ఆఘాతో పాటు అలీ ఉస్మాన్, అమీర్ జమాల్, ముహమ్మద్ అవైస్ జాఫర్, ఖుర్రం షాజాద్లను జట్టు నుంచి విడుదల చేస్తున్నట్లు పీసీబీ ప్రకటించింది. వీరి స్థానంలో ఏడుగురు కొత్త ఆటగాళ్లను ఎంపిక చేసింది. వీరిలో సైమ్ అయూబ్, అబ్దుల్లా ఫజల్లకు టెస్ట్ అనుభవం ఉండగా, అరాఫత్ మిన్హాస్, మహమ్మద్ ఇమ్రాన్ జూనియర్, సాద్ బేగ్, మహమ్మద్ ఇమ్రాన్, రజావుల్లాలకు తొలిసారిగా టెస్ట్ జట్టులో చోటు లభించింది.ఆటగాళ్లపైనే కాకుండా కోచింగ్ సిబ్బందిలోనూ మార్పులు చేసింది. టెస్ట్ క్రికెట్ హెడ్ కోచ్ సర్ఫరాజ్ అహ్మద్, బౌలింగ్ కోచ్ ఉమర్ గుల్‌ను బాధ్యతల నుంచి తప్పించింది. వారి స్థానంలో ఈ పర్యటన ముగిసే వరకు వైట్-బాల్ కోచ్ మైక్ హెసన్, యాష్లే నోఫ్కేలకు అదనపు బాధ్యతలు అప్పగించింది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో పాకిస్థాన్ ఇప్పటికే 0-2తో వెనుకబడగా.. ఆటగాళ్ల పేలవ ఫామ్, గాయాల వివాదాలే ఈ మార్పులకు ప్రధాన కారణమని తెలుస్తోంది. ఇరు జట్ల మధ్య మూడో టెస్టు సెప్టెంబర్ 9న

వరుసగా ఎల్బీడబ్ల్యూ రూపంలో ఔట్ అవుతున్నాడంటూ వస్తున్న విమర్శలపై ఇంగ్లండ్ స్టార్ బ్యాటర్ జో రూట్ ఘాటుగా స్పందించాడు. సమస్య ఏదైనా సరే పరిష్కరించుకునే సత్తా తనకు ఉందని స్పష్టం చేశాడు. ఇంటర్నెట్ డెస్క్: వరుసగా ఎల్బీడబ్ల్యూ రూపంలో ఔట్ అవుతున్నాడంటూ వస్తున్న విమర్శలపై ఇంగ్లండ్ స్టార్ బ్యాటర్ జో రూట్ ఘాటుగా స్పందించాడు. సమస్య ఏదైనా సరే పరిష్కరించుకునే సత్తా తనకు ఉందని స్పష్టం చేశాడు. టెస్టు క్రికెట్లో 14 వేలకుపైగా పరుగులు చేశానని, అందుకు తన అనుభవమే నిదర్శనమని చెప్పాడు. ఇటీవల ఆడిన 10 ఇన్నింగ్స్‌ల్లో రూట్ ఏకంగా ఎనిమిది సార్లు ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. పాకిస్థాన్‌తో జరుగుతున్న టెస్టు సిరీస్‌లోనే మూడుసార్లు ఎల్బీడబ్ల్యూ అవ్వడం గమనార్హం. అంతకుముందు న్యూజిలాండ్‌తో జరిగిన స్వదేశీ సిరీస్‌లోనూ ఎనిమిది ఇన్నింగ్స్‌ల్లో ఆరుసార్లు ఎల్బీడబ్ల్యూగా పెవిలియన్ చేరాడు. ‘నేను చాలా కాలంగా క్రికెట్ ఆడుతున్నాను. ఇలాంటి సమస్యలను గతంలోనూ అధిగమించాను. దీనిని కూడా అలాగే పరిష్కరించుకుంటాను. నాకు 14 వేల పరుగులు ఊరికే రాలేదు. దీని వెనుక దాదాపు 15 ఏళ్లుకు పైగా కష్టం, శ్రమ ఉన్నాయి. అయితే ఈ వరుస వైఫల్యాలు నన్ను కూడా అసహనానికి గురి చేస్తున్నాయి. కానీ అందులో కొన్ని నిర్ణయాలు ‘అంపైర్స్ కాల్’ కారణంగా నాకు అనుకూలంగా రాలేదు. ఈ సమస్య నుంచి కూడా బయటపడతాను. దీనిపై నాకు పెద్దగా ఆందోళన లేదు’ అని రూట్ తెలిపాడు. పాకిస్థాన్‌తో జరుగుతున్న సిరీస్‌లో బ్యాటర్ల తడబాటుకు కొత్త డ్యూక్స్ బంతి కూడా ఒక కారణమని రూట్ అభిప్రాయపడ్డాడు. ఈ ఏడాది ఉపయోగిస్తున్న బంతుల్లో మార్పు కనిపిస్తోందని చెప్పాడు. ‘ఈ ఏడాది బంతులు చాలా భిన్నంగా ఉన్నాయి. వాటికి వేరే రకమైన లాకర్ ఉన్నట్లు అనిపిస్తోంది. దీనిపై నా దగ్గర ఆధారాలు లేవు. డ్యూక్స్నే అడగాలి. బంతి త్వరగా ఆకారం కోల్పోకుండా ఉండేందుకు సీమ్‌పై ప్రత్యేకమైన లాకర్ వేసి ఉండొచ్చు’ అని రూట్ పేర్కొన్నాడు

– సారపాక జడ్పీహెచ్ఎస్ పూర్వ విద్యార్ధిని రత్నదీపిక బూర్గంపహాడ్, ఆగస్టు 22 : దృఢమైన సంకల్పంతో లక్ష్యాన్ని సాధించాలని బూర్గంపహాడ్ మండల పరిధిలోని సారపాక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పూర్వ విద్యార్ధిని కింతాడి రత్నదీపిక అన్నారు. గర్ల్ చైల్డ్ ఎంపర్మెంట్ కార్యక్రమంలో భాగంగా శనివారం పాఠశాలలో హెచ్ఎం దూద అధ్యక్షతన బాలికల కోసం ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రత్నదీపిక హాజరై మాట్లాడుతూ.. జీవితంలో ఒక గోల్ పెట్టుకుని దానిని సాధించాలంటే ఎలాంటి ఆటంకాలు వచ్చినా దృఢసంకల్పంతో ఎదుర్కొని అధిగమించాలని ఉద్భోధించారు. క్రమశిక్షణ, పట్టుదల ఇందుకు చాలా అవసరమన్నారు. తాను మొదటి నుండి ప్రభుత్వ పాఠశాలలో, ప్రభుత్వ పాలిటెక్నిక్‌లో చదువు పూర్తిచేసి నేడు గ్రాన్యూల్ ఇండియా లిమిటెడ్‌లో సీనియర్ టెక్నికల్ అసోసియేట్‌గా ఉద్యోగం చేస్తున్నానని తెలిపారు. చదువు ద్వారా మహిళల సాధికారత సాధ్యమవుతుందన్నారు. కడు పేదరికం నుండి కష్టపడి ఉన్నతస్థాయికి చేరానని విద్యార్థుల్లో స్పూర్తి, ఉత్తేజాన్ని నింపారు. అనంతరం రత్నదీపికను పాఠశాల యాజమాన్యం శాలువాతో సత్కరించి మెమోంటో అందజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు శ్రీదేవి, కృష్ణవేణి, హేమ, స్వరూప, శ్రీనివాసరావు, విద్యార్థులు పాల్గొన్నారు

WTC Points Table: వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ నాలుగో సీజన్ పాయింట్ల పట్టికలో పాకిస్థాన్ పరిస్థితి అత్యంత ఘోరంగా తయారైంది. ఇంగ్లండ్‌తో జరిగిన తొలి టెస్టులో ఇన్నింగ్స్ 103 పరుగుల భారీ తేడాతో పరాజయం పాలవ్వడం పాక్ ఆశలపై నీళ్లు చల్లింది. ఈ కరెంట్ ఛాంపియన్షిప్ సైకిల్లో ఆడిన 7 మ్యాచుల్లో పాకిస్థాన్‌కు ఇది ఐదో ఓటమి కావడం గమనార్హం. ప్రస్తుతం కేవలం 19.05 విజయ శాతంతో పాక్ పాయింట్ల పట్టికలో అందరికంటే దిగువన 9వ స్థానానికి చేరుకుంది. వెస్టిండీస్ కంటే వెనుకబడి ఆఖరి స్థానంలో నిలవడంతో ఆ జట్టు ఫైనల్ రేసు నుంచి దాదాపు నిష్క్రమించినట్లేనని విశ్లేషకులు భావిస్తున్నారు. టాప్-5లో స్థానాన్ని పదిలం చేసుకున్న భారత్ పాకిస్థాన్ వరుస ఓటములతో తంటాలు పడుతుంటే టీమిండియా మాత్రం పాయింట్ల పట్టికలో శుభ్‌మన్ గిల్ సారథ్యంలో రేసులో ముందుకు సాగుతోంది. ప్రస్తుతం శ్రీలంక పర్యటనలో ఉన్న భారత్, మొదటి టెస్టులో విజయం సాధించి 1-0 ఆధిక్యంలో నిలిచింది. 53.33 విజయ శాతంతో భారత జట్టు టేబుల్లో 5వ స్థానాన్ని భద్రపరుచుకుంది. రెండో టెస్టులో కూడా లంకను ఓడించి సిరీస్‌ను కైవసం చేసుకుంటే టీమిండియా నాలుగో స్థానానికి ఎగబాకే అవకాశాలు మెండుగా ఉన్నాయి. బంగ్లాదేశ్ జట్టు ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోతే భారత్‌కు నాలుగో స్థానం మరింత సులభమవుతుంది. ఇది కూడా చదవండి: Cricket Records: 39 మ్యాచులు, 12 సెంచరీలు, 2541 పరుగులు.. 25 ఏళ్లుగా చెక్కుచెదరని రికార్డు డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో టాప్ స్థానాల కోసం తీవ్ర పోటీ నెలకొంది. ఆస్ట్రేలియా జట్టు 77.78 విజయ శాతంతో అగ్రస్థానంలో కొనసాగుతుంటే, సౌతాఫ్రికా 75 శాతంతో రెండో స్థానంలో ఉంది. న్యూజిలాండ్ 72.22 శాతంతో మూడో స్థానంలో ఉంది. ఈ మూడు జట్లు ఫైనల్ బెర్త్ కోసం ప్రధాన పోటీదారులుగా కనిపిస్తున్నాయి. బంగ్లాదేశ్ 66.67 శాతంతో నాలుగో స్థానంలో ఉండి గట్టి పోటీ ఇస్తోంది. ఇంగ్లండ్ జట్టు

పాకిస్థాన్ టెక్నాలజీ రంగంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ప్రపంచ టెక్ దిగ్గజం గూగుల్ అధికారికంగా పాకిస్థాన్‌లో తన మొట్టమొదటి కార్యాలయాన్ని ప్రారంభించింది. స్వయంగా పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ఈ కొత్త ఆఫీసును ప్రారంభించడంతో పాటు గూగుల్ ఉన్నత స్థాయి ప్రతినిధి బృందంతో చర్చలు జరిపారు. దేశ డిజిటల్ ఆర్థిక వ్యవస్థను పరుగులు పెట్టించేందుకు, స్థానిక యువతకు అత్యాధునిక టెక్నాలజీ నైపుణ్యాలు అందించేందుకు ఈ కార్యాలయం ఒక గేమ్ చేంజర్‌గా మారనుందని ప్రభుత్వం ఆశాభావం వ్యక్తం చేస్తున్నది. పాకిస్థాన్‌లో సరికొత్త అధ్యాయం: గూగుల్ తొలి కార్యాలయం పాకిస్థాన్‌లో గూగుల్ తన కార్యకలాపాలను విస్తరిస్తూ తొలి కార్యాలయాన్ని ప్రారంభించింది. ప్రధాని షెహబాజ్ షరీఫ్ సమక్షంలో జరిగిన ఈ ప్రారంభోత్సవంలో గూగుల్ ప్రతినిధులతో ద్వైపాక్షిక చర్చలు జరిగాయి. దేశంలో సాంకేతికత, డిజిటల్ రంగాలను ప్రోత్సహించడమే ప్రధాన లక్ష్యంగా ఈ ముందడుగు పడింది. ముఖ్యంగా ఐటీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)విభాగాలలో స్థానిక యువతకు ప్రత్యేక శిక్షణ ఇచ్చేందుకు ప్రాధాన్యత ఇవ్వనున్నారు. పాకిస్థాన్ ప్రభుత్వం దీనిని దేశ డిజిటల్ ఎకానమీ అభివృద్ధిలో ఒక చారిత్రక మైలురాయిగా భావిస్తోంది. కార్యాలయం లోపల లుక్ ఎలా ఉంది? ఈ సరికొత్త గూగుల్ ఆఫీస్ సాధారణ ప్రభుత్వ కార్యాలయాల మాదిరిగా కాకుండా, అత్యంత ఆధునిక శైలిలో రూపుదిద్దుకుంది. గూగుల్ అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ఓపెన్ వర్క్‌స్పేస్, టీమ్ కొలాబరేషన్ ఏరియాలు, హైటెక్ మీటింగ్ రూమ్‌లతో ఈ కార్యాలయాన్ని సిద్ధం చేశారు. లోపలి పూర్తి దృశ్యాలు ఇంకా అధికారికంగా విడుదల కానప్పటికీ, సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఫోటోల ఆధారంగా ఇది చాలా స్టైలిష్, ప్రీమియం టెక్ లుక్‌తో కనిపిస్తోంది. యువత డిజిటల్ నైపుణ్యాలే లక్ష్యం పాకిస్థాన్ వేగంగా డిజిటల్ పరివర్తన వైపు అడుగులు వేస్తోందని ప్రధాని షెహబాజ్ షరీఫ్ తెలిపారు. ప్రభుత్వ సేవలు, ఆర్థిక వ్యవస్థను డిజిటలైజ్ చేయడంలో భాగంగా స్థానిక యువతకు కృత్రిమ మేధ (ఏఐ), ఐటీ నైపుణ్యాలను నేర్పించే కార్యక్రమాలను ప్రభుత్వం

ఇంగ్లండ్ టెస్టు కెప్టెన్ జో రూట్ మరో అరుదైన ఘనతను తన పేరిట లిఖించుకున్నాడు. టెస్టు క్రికెట్లో అత్యధిక క్యాచ్‌లు పట్టిన ప్లేయగా రూట్ ప్రపంచ రికార్డు సృష్టించాడు. స్పోర్ట్స్ డెస్క్: లీడ్స్ వేదికగా పాకిస్థాన్‌తో జరిగిన తొలి టెస్టులో ఇంగ్లండ్ కెప్టెన్ జో రూట్ పలు రికార్డులు తన పేరిట లిఖించుకున్నాడు. మ్యాచ్ రెండో రోజు ఆటలో అర్ధ సెంచరీ చేసి.. అత్యధిక హాఫ్ సెంచరీలు(68) చేసిన వారి జాబితాలో క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్‌తో సమానంగా అగ్రస్థానంలో నిలిచాడు. తాజాగా మరో అరుదైన ఘనతను జో రూట్ తన ఖాతాలో వేసుకున్నాడు. టెస్టు ఫార్మాట్ లో అత్యధిక క్యాచ్‌లు పట్టిన ఆటగాడిగా రూట్ ప్రపంచ రికార్డు సృష్టించాడు. పాకిస్థాన్‌తో జరిగిన తొలి టెస్టు మూడో రోజు ఆటలో జోఫ్రా ఆర్చర్ బౌలింగ్‌లో ఓపెనర్ అజాన్ అవాయిస్ ఇచ్చిన క్యాచ్‌ను అందుకోవడంతో రూట్ ఈ అరుదైన రికారక్డును నమోదు చేశాడు. ఈ స్టార్ బ్యాటర్ ఇప్పటివరకు 219 టెస్టు క్యాచ్‌లను అందుకున్నాడు. గతంలో ఈ రికార్డు ఆస్ట్రేలియా స్టార్ ప్లేయర్, మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్ (218 క్యాచ్‌లు) పేరిట ఉండేది. తాజా అజాన్ అవాయిస్ క్యాచ్‌తో స్మిత్ ప్రపంచ రికార్డును రూట్ బద్దలు కొట్టాడు. ఇక లీడ్స్ టెస్టులో పాకిస్తాన్‌పై ఇన్నింగ్స్ 103 పరుగుల తేడాతో ఇంగ్లండ్ ఘన విజయం సాధించింది. టెస్టుల్లో అత్యధిక క్యాచ్‌లు పట్టిన ఆటగాళ్లు

పాకిస్థాన్‌తో జరిగిన తొలి టెస్టులో ఇంగ్లండ్ ఘన విజయం సాధించింది. కేవలం మూడు రోజుల్లోనే మ్యాచ్‌ను ముగించిన ఆతిథ్య జట్టు.. ఇన్నింగ్స్ 103 పరుగుల తేడాతో పాకిస్థాన్‌ను చిత్తు చేసింది. ఈ విజయంతో మూడు టెస్టుల సిరీస్‌లో ఇంగ్లండ్ 1-0 ఆధిక్యంలోకి వెళ్లింది. తొలి రోజు నుంచే ఒత్తిడిలో కనిపించిన పాకిస్థాన్ బ్యాటర్లు రెండో ఇన్నింగ్స్‌లోనూ పూర్తిగా విఫలమయ్యారు. మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ తొలి ఇన్నింగ్స్‌లో 171 పరుగులకే ఆలౌటైంది. అబ్దుల్లా షఫీక్ మాత్రమే అర్ధశతకం సాధించి 61 పరుగులు చేశాడు. ఇంగ్లండ్ బౌలర్లలో ఓలీ రాబిన్సన్ అద్భుతంగా బౌలింగ్ చేసి ఐదు వికెట్లు పడగొట్టాడు. జోష్ టంగ్ కూడా పాక్ బ్యాటింగ్ లైనప్‌ను తీవ్రంగా ఇబ్బంది పెట్టాడు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్ 409 పరుగుల భారీ స్కోరు సాధించింది. దీంతో పాకిస్థాన్‌పై ఏకంగా 238 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది. ఇంగ్లండ్ బ్యాటర్లు సమష్టిగా రాణించడంతో భారీ స్కోరు నమోదైంది. వైస్ కెప్టెన్ హ్యారీ బ్రూక్ అద్భుత బ్యాటింగ్‌తో జట్టును ముందుండి నడిపించాడు. 93 బంతుల్లో 91 పరుగులు చేసిన అతడు 13 బౌండరీలు బాదాడు. జోర్డాన్ కాక్స్ 73, కొత్త టెస్టు కెప్టెన్ జో రూట్ 66, డాన్ లారెన్స్ 51 పరుగులతో అర్ధశతకాలు సాధించారు. పాకిస్థాన్ బౌలర్లలో అలీ ఉస్మాన్ ఐదు వికెట్లు పడగొట్టి ఇంగ్లండ్ భారీ స్కోరును కొంతమేర అడ్డుకున్నాడు. 238 పరుగుల లోటుతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన పాకిస్థాన్ బ్యాటింగ్ మరోసారి కుప్పకూలింది. షాన్ మసూద్ 29, అబ్దుల్లా షఫీక్ 15, సౌద్ షకీల్ 14, మహమ్మద్ రిజ్వాన్ 41 పరుగులతో కొంతసేపు పోరాడినా.. ఎవరూ భారీ ఇన్నింగ్స్ ఆడలేకపోయారు. చివరకు పాక్ 135 పరుగులకే ఆలౌటైంది. ఇంగ్లండ్ విజయానికి జోష్ టంగ్, ఓలీ రాబిన్సన్ కీలకంగా నిలిచారు. తొలి ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లు తీసిన టంగ్.. రెండో ఇన్నింగ్స్‌లో మరో