
ఇంటర్నెట్ డెస్క్: కిర్గిస్థాన్‌లో జరుగుతున్న షాంఘై సహకార సంస్థ (SCO) సదస్సును పాకిస్థాన్ మరోసారి భారత్‌పై ఆరోపణలకు వేదికగా మార్చుకుంది. సింధు జలాల (Indus Treaty) ఒప్పందాన్ని ప్రస్తావించిన పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ (Shehbaz Sharif).. నీటిని రాజకీయ ఘర్షణలకు ముడి పెట్టొదంటూ మళ్లీ పాత పాటే పాడారు. దీంతో అంతర్జాతీయ మద్దతు కూడగట్టేందుకు పాక్ ఎంతకైనా దిగజారుతోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత సింధు జలాల ఒప్పందాన్ని భారత్ నిలిపివేసింది. తాజాగా ది హేగ్‌లోని మధ్యవర్తిత్వ కోర్టు ఇచ్చిన తీర్పును భారత్ తోసిపుచ్చింది. ఆ కోర్టుకు ఈ వ్యవహారంలో అధికార పరిధే లేదని స్పష్టం చేసింది. షాంఘై సహకార సంస్థ సదస్సుపై ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) ఉగ్రవాద సమస్యను మరోసారి ప్రస్తావించారు. ఉగ్రవాదానికి నిధులు, మద్దతు, సురక్షిత స్థావరాలు కల్పించే వ్యవస్థలపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎస్సీవో దేశాలకు పిలుపునిచ్చారు. దీంతో ఒకవైపు పాక్ నీటి అంశాన్ని అంతర్జాతీయ సమస్యగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తే.. మరోవైపు ఉగ్రవాదమే ప్రాంతీయ శాంతికి ప్రధాన ముప్పు అని భారత్ బలంగా చాటింది.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
Found this helpful?
Share this story with your network









