
Kavyasa Naidu : యాంకర్ కావ్యాస.. వినాయక చవితి సెలబ్రేషన్స్.. ఫోటోలు..
యాంకర్ కావ్యాస (Kavyasa Naidu) సోషల్ మీడియాలో వినాయక చవితి సెలబ్రేషన్స్‌కు సంబంధించిన ఫోటోలను షేర్ చేసింది.

యాంకర్ కావ్యాస (Kavyasa Naidu) సోషల్ మీడియాలో వినాయక చవితి సెలబ్రేషన్స్‌కు సంబంధించిన ఫోటోలను షేర్ చేసింది.

డ్యాన్సర్ శ్వేతా నాయుడు వినాయక చవితి పండుగను తన కుటుంబంతో కలిసి సెలబ్రేట్ చేసుకుంది. వినాయక మండపంలో దిగిన పలు ఫోటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేసింది.

దశాబ్దాల కాలం నాటి కల సాకారమైంది. ఉత్తరాంధ్ర బీళ్లకు జీవం పోసేందుకు గోదారమ్మ పరవళ్లు తొక్కుతూ తరలివచ్చింది. ఈ చారిత్రక ఘట్టంతో పులకించిపోయిన ఉత్తరాంధ్ర రైతులు, ప్రజలు.. తమ ప్రాంతానికి గోదావరి జలాలు తీసుకొచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబుకు మనసారా కృతజ్ఞతలు తెలిపారు. అనకాపల్లి జిల్లా పాయకరావుపేట వద్ద పోలవరం ఎడమ ప్రధాన కాలువ నుంచి గోదావరి జలాలను విడుదల చేసిన ముఖ్యమంత్రి, ఈ అపూర్వ ఘట్టానికి ప్రత్యక్ష సాక్షిగా నిలిచారు.బుధవారం పాయకరావుపేట వద్ద క్రాస్ రెగ్యులేటర్ నుంచి ఉత్తరాంధ్ర భూముల్లోకి అడుగుపెట్టిన గోదావరి జలాలకు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రత్యేక పూజలు నిర్వహించి, జలహారతి ఇచ్చారు. అరుణ వర్ణంలో ప్రవహిస్తున్న పవిత్ర జలాలను శిరస్సున చల్లుకుని, భావోద్వేగంతో కాలువలో నిల్చుని పుష్పాలు, పసుపు కుంకుమ సమర్పించారు. అనంతరం గోదావరి తల్లికి సాష్టాంగ నమస్కారం చేసి తన ప్రణామం అర్పించారు. ఈ కార్యక్రమానికి భారీ సంఖ్యలో తరలివచ్చిన స్థానిక రైతులు, మహిళలు హారతులు పడుతూ, పూలు చల్లుతూ గోదారమ్మకు స్వాగతం పలికారు.ఉత్తరాంధ్ర ఉన్నతాంధ్రగా మారుతుంది: సీఎంఅనంతరం జరిగిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ.. "ఉత్తరాంధ్రకు గోదావరి నీళ్లు వచ్చాయి. ఇక ఈ ప్రాంతంలోని బీళ్లన్నీ పంటలతో కళకళలాడతాయి. అన్నవరం సత్యదేవుడి ఆశీస్సులతో అనకాపల్లికి వచ్చిన గోదారమ్మను.. వచ్చే ఏడాదికి సింహాచలం అప్పన్న చెంతకు, ఆపై అరసవల్లి సూరీడి పాదాల వద్దకు తీసుకెళ్లి, వంశధార వరకు గోదావరి జలాలను తరలిస్తాం" అని స్పష్టం చేశారు.ఈ ప్రాజెక్టు ద్వారా తొలి దశలో తూర్పుగోదావరి, కాకినాడ, కోనసీమ, అనకాపల్లి జిల్లాల్లో 2.87 లక్షల

ఉత్తరాంధ్ర ప్రజల దశాబ్దాల కల నెరవేరింది. అనకాపల్లి జిల్లాలో గోదావరి జలాలు గలగలా పారాయి. పాయకరావుపేట మండలం వద్ద పోలవరం ప్రాజెక్టు ఎడమ ప్రధాన కాలువ నుంచి ఉత్తరాంధ్రకు గోదావరి జలాలను ముఖ్యమంత్రి చంద్రబాబు బుధవారం విడుదల చేశారు. ఈ చారిత్రక ఘట్టానికి గుర్తుగా ఆయన గోదావరి తల్లికి ప్రత్యేక పూజలు చేసి, జలహారతి ఇచ్చారు. అనంతరం కాలువ గట్టుపై సాష్టాంగ నమస్కారం చేసి తన మొక్కు తీర్చుకున్నారు.ఈ కార్యక్రమంపై చంద్రబాబు సోషల్ మీడియాలో స్పందించారు. "అదే సంతోషం.. అదే భావోద్వేగం! నిన్న మార్కాపురంలో బిరబిరా కృష్ణమ్మ.. నేడు అనకాపల్లిలో గలగలా గోదారమ్మ.. రైతుల జీవితాల్లో వెలుగులు నింపేందుకు జీవనదుల పరవళ్లు ఎనలేని సంతోషాన్ని, సంతృప్తిని కలిగించాయి. అనకాపల్లి జిల్లా పాయకరావుపేట వద్ద పోలవరం ఎడమ ప్రధాన కాలువ ద్వారా ఉత్తరాంధ్రకు చేరిన గోదావరి జలాలకు జల హారతి ఇచ్చి ప్రణమిల్లాను. రాష్ట్రాన్ని చల్లగా చూడమని ప్రార్థించాను. కృష్ణా, గోదావరి సహా రాష్ట్రంలో శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు అన్ని నదులను అనుసంధానం చేసి తెలుగు తల్లికి జలహారతి ఇస్తాను. అందుకు అవసరమైన శక్తిని ప్రసాదించమని గంగమ్మ తల్లిని కోరుకున్నాను" అని చంద్రబాబు తన పోస్ట్ లో పేర్కొన్నారు. రూ. 4,192 కోట్లతో నిర్మించిన 213 కిలోమీటర్ల ఈ కాలువ ద్వారా ఉత్తరాంధ్రలోని లక్షలాది ఎకరాలకు సాగు, తాగునీరు అందించడమే ప్రభుత్వ లక్ష్యం. తొలి దశలో ఈ నీటితో అనకాపల్లి జిల్లాలోని 110 చెరువులను నింపనున్నారు. దీన్ని విస్తరించి ఇతర ఉత్తరాంధ్ర జిల్లాలకు కూడా నీరు అందించనున్నారు
తెలంగాణలో విమానయాన రంగాన్ని మరింత విస్తరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు వేగవంతం చేస్తోంది. ఇందులో భాగంగా హైదరాబాద్‌లోని హుస్సేన్‌సాగర్‌లో సీప్లేన్ ల్యాండింగ్‌కు ఉన్న అవకాశాలపై కేంద్ర పౌర విమానయాన శాఖ అధ్యయనం చేస్తోంది. దీనికి సంబంధించిన నివేదికను మరో రెండు వారాల్లో తెలంగాణ ప్రభుత్వానికి అందజేస్తామని కేంద్ర శాఖ అధికారులు తాజాగా ఢిల్లీ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి తెలిపారు. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడుతో సీఎం రేవంత్‌రెడ్డి బుధవారం ఢిల్లీలో సమావేశం అయ్యారు. రాజీవ్‌గాంధీ భవన్లో జరిగిన ఈ భేటీలో తెలంగాణలో విమానాశ్రయాల అభివృద్ధి, కొత్త విమానాశ్రయాల ప్రతిపాదనలు, హెలీ టూరిజం, సీప్లేన్ సేవలు తదితర అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు.తెలంగాణలోని ఆదిలాబాద్, వరంగల్ మామునూరు విమానాశ్రయాల పనులను వేగవంతం చేయాలని సీఎం రేవంత్‌రెడ్డి కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడుకు విజ్ఞప్తి చేశారు. మామునూరు విమానాశ్రయానికి అవసరమైన భూసేకరణ ప్రక్రియను రాష్ట్ర ప్రభుత్వం పూర్తి చేసి ఇచ్చిందని ఆయన వివరించారు. ఇక మిగిలిన పనులను త్వరితగతిన చేపట్టి విమానాశ్రయాన్ని అందుబాటులోకి తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు. మామునూరు విమానాశ్రయానికి సంబంధించిన టెండర్లను రెండు వారాల్లో పిలిచి, డిసెంబర్ నాటికి ఖరారు చేస్తామని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు సీఎంకు తెలిపారు. అదే నెలలో విమానాశ్రయ పనులకు శంకుస్థాపన చేసేలా చర్యలు తీసుకుంటామని వెల్లడించినట్లు సమాచారం.ఆదిలాబాద్ విమానాశ్రయంలో కేవలం ప్రయాణికుల రాకపోకలకే పరిమితం కాకుండా కార్గో, ప్యాసింజర్ టెర్మినల్‌తో పాటు ఎంఆర్ఓ (MRO) (Maintenance, Repair and Overhaul) సదుపాయాలను ఏర్పాటు చేయాలని సీఎం రేవంత్‌రెడ్డి కోరారు. ఆదిలాబాద్ ఎయిర్‌పోర్టులో రన్‌వేకు సంబంధించి తుది నిర్ణయం తీసుకునేందుకు రక్షణ, పౌర విమానయాన శాఖల అధికారులతో సంయుక్త సమావేశం ఏర్పాటు చేయాలని కేంద్రమంత్రిని సీఎం రేవంత్ రెడ్డి కోరారు. రన్‌వే అంశంపై ఉన్న సాంకేతిక అంశాలను త్వరగా పరిష్కరించి పనులు ముందుకు తీసుకెళ్లాలని సూచించారు.తెలంగాణలో పర్యాటక రంగాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు హెలికాప్టర్ సేవలను

సాక్షి, విశాఖపట్నం: చంద్రబాబు మరో ఈవెంట్ మేనేజ్మెంట్కు తెరలేపారని.. రెండున్నరేళ్ల నుంచి ఇదే తరహాలో కాలం గడుపుతూ వచ్చారంటూ వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ మండిపడ్డారు. ‘‘పురుషోత్తపట్నం ద్వారా పోలవరం ఎడమ కాల్వలోకి నీళ్లు వదిలారు. పోలవరం నీళ్లు వస్తున్నాయని చంద్రబాబు అబద్ధాలు ఆడుతున్నారు. ఉత్తరాంధ్ర ప్రజలను చంద్రబాబు మోసం చేస్తున్నారు’’ అని అమర్నాథ్ దుయ్యబట్టారు. ‘‘పోలవరం కాలువ ప్యాకేజీలను అంచనాలు పెంచి తనకు నచ్చిన వాళ్లకు ఇచ్చుకున్నారు. పోలవరం ఏటీఎం అని స్వయంగా ప్రధాని మోదీ చెప్పారు. పోలవరం ఎత్తు 41 మీటర్లు కాంటూరు వద్ద నీటిని నిల్వ చేస్తే ఉత్తరాంధ్ర ప్రజలకు అన్యాయం జరుగుతుందని తెలియదా?. 45 మీటర్ల నుంచి ఎత్తును 41 మీటర్లకు తగ్గించేందుకు ఎందుకు ఒప్పుకున్నారు? ఇంకా ఎన్ని రోజులు ప్రజలను మోసం చేస్తారు. చంద్రబాబు పాలనలో ఉత్తరాంధ్రకు తెచ్చిన ఒక ప్రాజెక్ట్ పేరు చెప్పండి’’ అంటూ అమర్నాథ్ ప్రశ్నించారు. వైఎస్ జగన్ ఫోబియాతో చంద్రబాబు భయపడుతున్నారు. జగన్నామస్మరణతో చంద్రబాబు బతుకుతున్నారు. చంద్రబాబు చేసిన ఈవెంట్ మేనేజ్మెంట్ల ఖర్చుతో మరొక పోలవరం ప్రాజెక్టు కట్టవచ్చు. పోలవరం ప్రాజెక్ట్ నుంచి నీళ్లు ఇస్తున్నారా? పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకం ద్వారా నీళ్లు ఇస్తున్నారా? ప్రజలకు చెప్పాలి. వైఎస్సార్ మరణించిన రోజు నీళ్లు విడుదల చేయడం దేవుడు రాసిన స్క్రిప్ట్. చేతకాని వాడు మంగళవారం అన్నారనే సామెత చందంగా ఉంది చంద్రబాబు తీరు. చంద్రబాబు పాలనలో పనులు చేయలేక ఆ నెపాన్ని ఉద్యోగుల మీద నెడుతున్నారు. గ్రావిటీ ద్వారా పోలవరం కాలువకు నీళ్లు ఇవ్వాలి.. ఎత్తిపోతల పథకం ద్వారా కాదు.’’ అని గుడివాడ అమర్నాథ్ పేర్కొన్నారు. మై లిటిల్ ప్యారడైజ్.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్ (ఫోటోలు) ప్రభాస్‌ని కలిసిన డై హార్డ్ ఫ్యాన్.. షర్ట్‌పై ఆటోగ్రాఫ్ తీసుకున్న యంగ్ హీరో (ఫోటోలు) పని.. ప్రకృతిలో మమేకం.. శ్రీనిధి జ్ఞాపకాలు (ఫొటోలు) 'బెత్లెహెమ్ కుటుంబ యూనిట్' సినిమా ప్రీ-రిలీజ్

ఉత్తరాంధ్ర ప్రజల దశాబ్దాల దాహార్తిని తీరుస్తూ, పోలవరం ఎడమ ప్రధాన కాలువ ద్వారా పయనించి వచ్చిన గోదావరి జలాలకు ముఖ్యమంత్రి చంద్రబాబు అపూర్వ రీతిలో స్వాగతం పలికారు. అనకాపల్లి జిల్లా పాయకరావుపేట వద్ద క్రాస్ రెగ్యులేటర్ నుంచి వస్తున్న గోదావరి జలాలకు, స్వయంగా కాలువలోనే నిల్చుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అరుణ వర్ణంలో ప్రవహిస్తున్న గోదారమ్మకు పుష్పాలు సమర్పించి, జలహారతి ఇచ్చి తన కృతజ్ఞతను చాటుకున్నారు. పవిత్ర గోదావరి జలాలను శిరస్సుపై చల్లుకున్న అనంతరం, ఉద్విగ్నభరిత వాతావరణంలో గోదావరి ప్రవాహానికి సాష్టాంగ నమస్కారం చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు.బుధవారం పాయకరావుపేటలో జరిగిన ఈ చారిత్రక కార్యక్రమంలో భాగంగా, ముఖ్యమంత్రి చంద్రబాబు తొలుత శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. మంత్రులు నిమ్మల రామానాయుడు, వంగలపూడి అనిత, కొల్లు రవీంద్ర, నారాయణ, అచ్చెన్నాయుడు, కొలుసు పార్థసారధి, ఎంపీలు చింతకాయల విజయ్, సీఎం రమేశ్, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి ఆయన గోదావరి జలాలను ఉత్తరాంధ్ర జిల్లాలకు విడుదల చేశారు. ఈ సందర్భంగా సాంప్రదాయ కోలాటంతో కళాకారులు ముఖ్యమంత్రికి ఘన స్వాగతం పలికారు.రూ.4,192 కోట్ల వ్యయంతో నిర్మించిన పోలవరం ఎడమ కాలువ ద్వారా విడుదల చేసిన ఈ నీటితో నాలుగు జిల్లాల పరిధిలో 2.87 లక్షల ఎకరాలకు సాగునీరు, 9 లక్షల మందికి తాగునీరు అందించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. మొత్తం 23.44 టీఎంసీల గోదావరి జలాలతో విశాఖ, అనకాపల్లి జిల్లాల్లోని పారిశ్రామిక, తాగు, సాగునీటి అవసరాలు తీరనున్నాయి. ఈ నీటితో అనకాపల్లి వద్ద ఏలేరు కాలువతో పాటు జిల్లాలోని 110 చెరువులను నింపేందుకు జలవనరుల

ఉత్తరాంధ్ర ప్రజల దశాబ్దాల కలను సాకారం చేస్తూ గోదావరి జలాలు ఈ ప్రాంతాన్ని తాకాయని, ఇది ముఖ్యమంత్రి, అపర భగీరథుడు చంద్రబాబు దార్శనికత వల్లే సాధ్యమైందని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు కొనియాడారు. పోలవరం లెఫ్ట్ మెయిన్ కెనాల్ ద్వారా ఉత్తరాంధ్రకు నీరు చేరడం రాష్ట్ర జలవనరుల చరిత్రలో ఒక సువర్ణ అధ్యాయమని ఆయన అభివర్ణించారు. బుధవారం అనకాపల్లి జిల్లా పాయకరావుపేట వద్ద సీఎం చంద్రబాబు గోదావరి జలాలకు హారతి పట్టడం తెలిసిందే. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో నిమ్మల రామానాయుడు మాట్లాడారు.పోలవరం ప్రాజెక్ట్ పూర్తి కాకముందే, పట్టిసీమ ద్వారా కృష్ణా డెల్టాకు, పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకం ద్వారా ఉత్తరాంధ్రకు నీరందించాలన్న చంద్రబాబు ముందుచూపు వల్లే ఈరోజు ఈ ప్రాంత ప్రజల దాహం తీరుతోందని మంత్రి అన్నారు. "2024లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే, 2026 నాటికి లెఫ్ట్ మెయిన్ కెనాల్ పూర్తి చేస్తామని మాట ఇచ్చాం. ఇచ్చిన మాట ప్రకారం గడువులోగా పూర్తి చేసి ఈ ప్రాంతానికి గోదావరి జలాలను తీసుకొచ్చాం" అని ఆయన స్పష్టం చేశారు. ఈ రెండేళ్ల కాలంలోనే ఏలేరు, పంప, తాండవ, శారద, వరాహ వంటి ఐదు ప్రధాన నదులను, తొమ్మిది జాతీయ రహదారులను దాటుతూ కెనాల్ నిర్మాణంలో ఉన్న క్లిష్టమైన పనులను పూర్తి చేశామని తెలిపారు. కొమ్మరిలోవ వద్ద 100 మీటర్ల లోతైన కొండను తవ్వి కాలువను తీసుకురావడం తమ ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనమని అన్నారు.ఈ సందర్భంగా గత వైసీపీ ప్రభుత్వంపై మంత్రి నిమ్మల తీవ్ర

ఉత్తరాంధ్ర ప్రజలు ఎన్నాళ్లుగానో ఎదురుచూస్తున్న గోదావరి జలాల కల సాకారమైంది. పోలవరం ఎడమ ప్రధాన కాలువ ద్వారా తొలిసారిగా గోదావరి నీటిని ఉత్తరాంధ్ర వైపు విడుదల చేశారు. అనకాపల్లి జిల్లా పాయకరావుపేట మండలం పీఎల్ పురం వద్ద సీఎం చంద్రబాబు నాయుడు రెగ్యులేటర్‌ను ప్రారంభించి జలప్రవాహానికి శ్రీకారం చుట్టారు. అంతకుముందు కాలువ శిలాఫలకాన్ని ఆవిష్కరించిన ఆయన గోదావరికి జలహారతి ఇచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు. రూ.4,192 కోట్ల వ్యయంతో నిర్మించిన ఈ కాలువ ద్వారా ఏలేరు కాలువకు నీటిని అందించడంతో పాటు అనకాపల్లి జిల్లాలోని 110 చెరువులను నింపే ప్రణాళిక ఉంది. దీంతో సాగునీరు, తాగునీటి అవసరాలకు భరోసా లభించడంతో పాటు భూగర్భ జలాలు మెరుగుపడి ఈ ప్రాంత అభివృద్ధికి కొత్త ఊపు వచ్చే అవకాశం ఉంది. పోలవరం ఎడమ ప్రధాన కాలువ పోలవరం ప్రాంతం నుంచి ప్రారంభమై తూర్పు దిశగా విస్తరిస్తుంది. గోదావరి జలాలను కొండ ప్రాంతాల నుంచి మైదాన ప్రాంతాలకు తరలించేలా దీని మార్గాన్ని రూపొందించారు. ప్రారంభ ప్రాంతంలోనే కొండను తొలిచి సొరంగ మార్గం ఏర్పాటు చేయడం ఈ ప్రాజెక్టులో కీలకమైన ఇంజినీరింగ్ ప్రత్యేకత. సుమారు 914 మీటర్ల పొడవుతో నిర్మించిన సొరంగం ద్వారా గోదావరి జలాలు ముందుకు సాగుతాయి. ఆ తర్వాత వివిధ ప్రాంతాల గుండా ప్రవహిస్తూ కాకినాడ, అనకాపల్లి మీదుగా విశాఖ ప్రాంతానికి చేరేలా కాలువ వ్యవస్థను రూపొందించారు. ఈ మార్గంలో పుష్కర, పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకాలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. పోలవరం హెడ్‌వర్క్స్ పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చే వరకు ఎత్తిపోతల పథకాల ద్వారా నీటిని తరలించే విధానాన్ని అమలు చేస్తున్నారు. భవిష్యత్‌లో పోలవరం ప్రాజెక్టు పూర్తయిన తర్వాత గ్రావిటీ ద్వారా నీరు సహజ ప్రవాహంతోనే ముందుకు సాగేలా ప్రణాళిక రూపొందించారు. ప్రస్తుతం నిర్మించిన ప్రధాన కాలువతో పాటు తాగునీటి పంపిణీ వ్యవస్థలను కలుపుకొని సుమారు 213 కిలోమీటర్ల మేర జలమార్గాన్ని అభివృద్ధి చేశారు. పోలవరం ఎడమ కాలువ

జనసేన పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ 55వ జన్మదినం సందర్భంగా పార్టీ యువజన విభాగానికి అధికారిక రూపం లభించింది. కాకినాడ జిల్లా పిఠాపురంలో బుధవారం జరిగిన కార్యక్రమంలో ‘జై కొట్టు’ పేరుతో జనసేన యువజన విభాగం లోగో, థీమ్ సాంగ్‌ను నాదెండ్ల మనోహర్ గ్రాండ్‌గా లాంచ్ చేశారు. జనసేన యువతను అత్యంత సంఘటితంగా రాజకీయంలోకి తీసుకురావడానికి ఈ విభాగం ఎంతో కీలకమని పార్టీ భావిస్తోంది. సినీ నేపథ్యం నుంచి వచ్చిన పవన్ కళ్యాణ్‌కు యువతలో ఉన్న బలమైన కనెక్షన్‌ను ఇప్పుడు సంస్థాగత రూపంలోకి మార్చేందుకు ఈ అడుగు పడింది. కేరళలో వైద్య చికిత్స పొందుతున్న కారణంగా ఈ ముఖ్యమైన కార్యక్రమానికి స్వయంగా హాజరుకాని పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా ఒక ఆడియో సందేశాన్ని పంపారు. ఆ సందేశంలో ఆయన యువతకు రాజకీయ చైతన్యంతో పాటు బాధ్యతను గుర్తుచేస్తూ స్పష్టమైన పిలుపునిచ్చారు. ఇన్నాళ్లు కేవలం నాయకులు, రాజకీయ పార్టీల కోసం జిందాబాద్ కొట్టామని, ఇకపై యువత తమ భవిష్యత్తు కోసం, సమాజంలో మార్పు కోసం జై కొట్టాలని పవన్ కళ్యాణ్ ఉద్బోధించారు. దేహి అని ఇతరుల ముందుకు చేతులు చాపకుండా దేశం కోసం సేవ చేసే చేతులు కావాలని ఆయన తన ప్రసంగంలో ఆకాంక్షించారు. ఈ వేడుకల సందర్భంగా పిఠాపురం నుంచి చిత్రాడ వరకు భారీ బైక్ ర్యాలీ నిర్వహించగా, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని సందడి చేశారు. దీంతో పాటు రాష్ట్రంలోని 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ సమాంతరంగా కార్యక్రమాలు జరిగాయి. ఇదిలా ఉండగా, కొన్ని ప్రధాన కేంద్రాల్లో పవన్ కళ్యాణ్ ఆడియో సందేశాన్ని వినేందుకు ప్రత్యేకంగా లైవ్ ప్రసారాలు కూడా ఏర్పాటు చేశారు. రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్‌లోనే కాకుండా తెలంగాణ సహా ఇతర పొరుగు రాష్ట్రాల్లో కూడా ఈ విధమైన కార్యక్రమాలు నిర్వహించేందుకు పార్టీ వర్గాలు భారీ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాయి. కార్యక్రమంలో నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ యువజన విభాగం ద్వారా

విశాఖపట్నంలో ఏర్పాటు చేస్తున్న ఏఐ డేటా సెంటర్ ప్రాజెక్టులపై విపక్ష వైఎస్ఆర్సీపీ తప్పుడు ప్రచారం చేస్తోందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. డేటా సెంటర్ల నిర్మాణం వల్ల విశాఖ నగరం తీవ్ర నీటి, విద్యుత్ కొరతను ఎదుర్కొంటుందని సోషల్ మీడియా వేదికగా విపక్షాలు భయాలను రేకెత్తిస్తున్నాయని ఆయన మండిపడ్డారు. ఈ ప్రాజెక్టులు పూర్తి స్థాయిలో అందుబాటులోకి రాకముందే నీటి కొరత వస్తుందనడం అసత్యమని సీఎం తేల్చి చెప్పారు. విశాఖను గ్లోబల్ టెక్ హబ్‌గా మార్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తుంటే విపక్షం ఉద్దేశపూర్వకంగానే విషం కక్కుతోందని ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. విశాఖ మరియు అనకాపల్లి ప్రాంతాల్లో గూగుల్, అదానీ, ఎయిర్టెల్ భాగస్వామ్యంతో 15 బిలియన్ డాలర్ల పెట్టుబడితో 1 గిగావాట్ సామర్థ్యం గల ఏఐ డేటా సెంటర్ హబ్ నిర్మాణం వేగంగా సాగుతోంది. 2026 ఏప్రిల్ నెలలో గూగుల్ ప్రాజెక్టుకు శంకుస్థాపన జరగగా, కొన్ని నిర్దేశిత ప్రాంతాలలో ఇప్పటికే భూమి పనులు కూడా ప్రారంభమయ్యాయి. రాష్ట్రంలో మొత్తం 6.5 గిగావాట్ల సామర్థ్యంతో ప్రాజెక్టులు స్థాపించాలని లక్ష్యంగా పెట్టుకోగా, రిలయన్స్ సహా పలు దిగ్గజ సంస్థలు పెట్టుబడులతో ముందుకు వచ్చాయి. 2029-30 నాటికి 50 గిగావాట్ల పునరుత్పాదక విద్యుత్ లక్ష్యాన్ని అందుకోవడానికి ప్రభుత్వం పక్కా ప్రణాళికతో అడుగులు వేస్తోంది. ఈ భారీ ప్రాజెక్టుల నిర్వహణకు సంవత్సరానికి 3 నుంచి 3.5 టీఎంసీల నీరు అవసరమని ప్రభుత్వం అధికారికంగా వెల్లడించింది. దీంతో నగర తాగునీటి సరఫరాకు ఎలాంటి విఘాతం కలగకుండా పోలవరం పారిశ్రామిక కేటాయింపుల నుంచి ప్రత్యేక పైప్లైన్ల ద్వారా నీటిని అందిస్తామని స్పష్టం చేసింది. ఇదిలా ఉండగా సాధారణ 1 గిగావాట్ థర్మల్ ప్లాంట్ దీనికంటే పది రెట్లు ఎక్కువ నీటిని వినియోగిస్తుందని ఐటీ మంత్రి నారా లోకేష్ అసెంబ్లీలో వివరించారు. మరోవైపు డేటా సెంటర్లకు నిరంతర విద్యుత్ సరఫరా కోసం ప్రత్యేక ట్రాన్స్మిషన్ లైన్లు ఏర్పాటు

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా సినీ, రాజకీయ రంగాలకు చెందిన ప్రముఖుల నుంచి పెద్ద ఎత్తున శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. పవర్ స్టార్, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ (AP Deputy CM Pawan Kalyan) పుట్టినరోజు వేడుకల అదరహో అనే రేంజ్లో జరిగాయి. తెలుగునేలపైనే కాదు తెలుగువారున్న పలు ప్రాంతాల్లో పవన్ పుట్టినరోజు (HBDPawanKalyan)ను ఘనంగా జరుపుకున్నారు ఫ్యాన్స్. ఈ సందర్భంగా సినీ, రాజకీయ రంగాలకు చెందిన ప్రముఖుల నుంచి పెద్ద ఎత్తున శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. పవన్ కళ్యాణ్ పుట్టినరోజు ఈ సారి మరింత ఘనంగా జరిగిందని చెప్పవచ్చు. ఊరూరా, వాడవాడలా పవన్ బర్త్ డే సెలబ్రేషన్స్‌ను ఫ్యాన్స్ ఉత్సాహంగా జరుపుకున్నారు. తెలుగునేలపైనే కాదు ప్రపంచంలోని నలుమూలల ఉన్న తెలుగువారిలో చాలామంది పవన్ పుట్టినరోజు వేడుకలు చేసుకోవడం విశేషం. పవన్‌కు దేశప్రధాని నరేంద్ర మోదీ, ఆయన అన్న మెగాస్టార్ చిరంజీవితో పాటు పవన్ భార్య అన్నా, ఆయన నిర్మాత బండ్ల గణేశ్ తదితరులు విషెస్ తెలిపారు. ఈ సందర్భంగా పలువురు పలు స్పెషల్ వీడియోస్ కూడా క్రియేట్ చేశారు. సురేశ్ ప్రొడక్షన్స్ సంస్థ పవన్ పై ఓ స్పెషల్ వీడియో రిలీజ్ చేయడం అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. మరికొందరు సినీజనం కూడా పవన్ పుట్టినరోజున స్పెషల్ వీడియోస్ రిలీజ్ చేయడం విశేషం. ఇక పవన్ బర్త్ డే సెలబ్రేషన్స్‌లో సాయిధరమ్ పాల్గొని అభిమానులకు ఆనందం పంచారు... చిత్రసీమలోని పలువురు పవన్‌కు బర్త్ డే విషెస్ చెప్పారు. పవన్ కళ్యాణ్‌పై ‘ఓజీ’ నటి శ్రియా రెడ్డి ఎమోషనల్ పోస్ట్ 200 కోట్ల క్లబ్‌లోకి ‘ఇరుముడి’.. మణికంఠుడి పోస్టర్ వైరల్ ఈశ్వరా.. పవనేశ్వరా.. పవరేశ్వరా.. బండ్లన్న మళ్లీ స్టార్ట్ చేశాడ్రోయ్

ఏపీలో అన్ని నదులను అనుసంధానం చేస్తామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. ప్రతి ఎకరాకు నీళ్లు ఇచ్చి తెలుగుతల్లి రుణం తీర్చుకుంటామని పేర్కొన్నారు. అనకాపల్లి జిల్లా, సెప్టెంబర్ 2 (ఆంధ్రజ్యోతి): ఏపీలో అన్ని నదులను అనుసంధానం చేస్తామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (AP CM Chandrababu Naidu) వ్యాఖ్యానించారు. ప్రతి ఎకరాకు నీళ్లు ఇచ్చి తెలుగుతల్లి రుణం తీర్చుకుంటామని పేర్కొన్నారు. ఈరోజు (బుధవారం) ఉత్తరాంధ్రకు గోదావరి జలాలను విడుదల చేసి సీఎం జలహారతి ఇచ్చారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ప్రసంగించారు. ఉత్తరాంధ్రకు గోదారమ్మను తీసుకువచ్చామని తెలిపారు. నదులు, వాగులు, వంకలు దాటుకుని గోదారమ్మ వచ్చిందని ప్రస్తావించారు. వెలిగొండ ప్రాజెక్ట్ ద్వారా కృష్ణమ్మను తరలించి.. కరువు పీడిత మార్కాపురానికి నీళ్లిచ్చామని ఉద్ఘాటించారు. నల్లమల కొండలను చీల్చుకుని కృష్ణమ్మ వచ్చిందని అన్నారు. ఎన్నో సమస్యలను అధిగమించి గోదావరి జలాలు తీసుకువచ్చామని తెలిపారు. పోలవరం ఎడమ కాలువ కోసం రూ.4 వేల కోట్ల ఖర్చు చేశామని సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు. రాష్ట్రం సుభిక్షంగా మారేలా చేస్తామని తెలిపారు. ఈ జల విజయం.. ప్రజల విజయమని చెప్పుకొచ్చారు. ఆధునిక దేవాలయాలు.. సాగునీటి ప్రాజెక్టులు అని అభివర్ణించారు. నీరు ఉంటేనే భద్రత, భవిష్యత్తుపై ఓ భరోసా కల్పిస్తుందని తెలిపారు. నీరు ఉంటేనే పరిశ్రమలు.. తద్వారా ఉపాధి అవకాశాలు వస్తాయని వివరించారు. 2014లో తాము అధికారంలోకి వచ్చాక పోలవరంపై దృష్టిపెట్టామని అన్నారు. 2019 నాటికి 72 శాతం పోలవరం పనులు పూర్తిచేశామని స్పష్టం చేశారు. ప్రతి సోమవారం.. పోలవరాన్ని పర్యవేక్షించేలా మార్చామని వెల్లడించారు. 2019లో గొడ్డలి పార్టీ అధికారంలోకి వచ్చిందని.. పోలవరానికి శాపమైందని ఆవేదన వ్యక్తం చేశారు. గొడ్డలి పార్టీ నిర్లక్ష్యం వల్ల డయాఫ్రం వాల్ కొట్టుకుపోయిందని ధ్వజమెత్తారు. పోలవరం నిర్వాసితులకు గొడ్డలి పార్టీ పైసా కూడా ఇవ్వలేదని సీఎం చంద్రబాబు ఆగ్రహించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక.. పోలవరానికి శాపవిముక్త కలిగిందని వ్యాఖ్యానించారు. 2028 నాటికి

కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడుతో.. తెలంగాణ ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి ఢిల్లీలోని పౌర విమానయాన శాఖ కార్యాలయం రాజీవ్ గాంధీ భవన్లో బుధవారం సమావేశం అయ్యారు. ఈ భేటీలో పలు కీలక అంశాలపై ఇరువురు నేతలు చర్చించారు. ఢిల్లీ, సెప్టెంబర్ 2 (ఆంధ్రజ్యోతి): కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడుతో.. తెలంగాణ ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి (Telangana CM Revanth Reddy) ఢిల్లీలోని పౌర విమానయాన శాఖ కార్యాలయం రాజీవ్ గాంధీ భవన్లో ఈరోజు (బుధవారం) సమావేశం అయ్యారు. ఈ భేటీలో పలు కీలక అంశాలపై ఇరువురు నేతలు చర్చించారు. తెలంగాణలో ఆదిలాబాద్, మామూనురు (వరంగల్) విమానాశ్రయాల పనులు వేగవంతం చేయాలని కోరారు. మామూనురు విమానాశ్రయానికి అవసరమైన భూ సేకరణను పూర్తి చేసి ఇచ్చామని కేంద్రమంత్రికి.. సీఎం రేవంత్ తెలిపారు. ఆదిలాబాద్ విమానాశ్రయంలో కార్గో, ప్యాసింజర్ టెర్మినల్, ఎంఆర్వో (మెయింటెనెన్స్, రిపేర్స్, ఓవర్‌హాలింగ్) వసతులు ఏర్పాటు చేయాలని సీఎం విజ్ఞప్తి చేశారు. ఆదిలాబాద్‌లో రన్ వే ఫైనలైజ్‌కు సంబంధించి రక్షణ, పౌర విమానయన శాఖల సంయుక్త సమావేశం ఏర్పాటు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి కోరారు. మామునూరు ఎయిర్పోర్ట్ టెండర్లను రెండు వారాల్లో పిలిచి డిసెంబర్ నాటికి ఖరారు చేస్తామని కేంద్రమంత్రి రామ్మోహన్ వెల్లడించారు. ఆ పనులకు అదే నెలలో శంకుస్థాపన చేస్తామని రామ్మోహన్ తెలిపారు. తెలంగాణలో ఛాపర్ల ద్వారా హెలీ టూరిజం అభివృద్ధికి కృషి చేయాలని కేంద్రమంత్రి రామ్మోహన్‌కు.. సీఎం రేవంత్ విజ్ఞప్తి చేశారు. హెలీ టూరిజంతో తెలంగాణలో పర్యాటక రంగం మరింత అభివృద్ధికి అవకాశం ఉంటుందని సీఎం తెలిపారు. హుస్సేన్ సాగర్‌లో సీ ప్లేన్ ల్యాండింగ్‌కు సంబంధించిన నివేదికను రెండు వారాల్లో రాష్ట్ర ప్రభుత్వానికి అందజేస్తామని పౌర విమానయాన శాఖ అధికారులు తెలిపారు. ఈ సమావేశంలో ఎంపీలు సురేశ్ షెట్కార్, ఎం.అనిల్ కుమార్ యాదవ్, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు (ప్రొటోకాల్) హర్కార వేణుగోపాల్, రాష్ట్ర

ఉత్తరాంధ్ర దశాబ్దాల కల సాకారమైంది. పోలవరం ప్రాజెక్టు ఎడమ ప్రధాన కాలువ ద్వారా గోదావరి జలాలు ఉత్తరాంధ్ర నేలను తాకాయి. ఈ చారిత్రక ఘట్టానికి అనకాపల్లి జిల్లా పాయకరావుపేట వేదికైంది. ముఖ్యమంత్రి చంద్రబాబు గోదావరి జలాలకు జలహారతి ఇచ్చి, పవిత్ర జలాలను శిరస్సున చల్లుకున్నారు. అనంతరం నేలపై సాష్టాంగ ప్రమాణం ఆచరించి, ఉత్తరాంధ్ర ప్రజల చిరకాల వాంఛ నెరవేరిన క్షణాన తన కృతజ్ఞతను చాటుకున్నారు. ఓ దశలో కాలువ నుంచి నీరు ప్రవహిస్తుంటే, చంద్రబాబు మెడలోని పచ్చ కండువా తీసి గాల్లో గిరగిరా తిప్పి తన ఆనందం వ్యక్తం చేశారు. చంద్రబాబును చూసి మిగతా నేతలు, రైతులు కూడా తమ కండువాలను గాల్లో ఊపుతూ హర్షం వెలిబుచ్చారు.అంతకుముందు, నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు రెగ్యులేటర్ బటన్ నొక్కి ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పథకంలోకి గోదావరి నీటిని విడుదల చేశారు. పాయకరావుపేట వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సీఎం చంద్రబాబు శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి మంత్రులు వంగలపూడి అనిత, అచ్చెన్నాయుడు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్, ఎంపీ సీఎం రమేశ్ తదితరులు హాజరయ్యారు.పోలవరం జలాల ప్రయాణం ఒక అద్భుతమైన ఇంజనీరింగ్ విన్యాసం. తూర్పు కనుమలను తొలిచి, ఏలేరు, పంపా, తాండవ, వరాహ, శారద వంటి నదులను దాటుకుంటూ ఈ కాలువను నిర్మించారు. కొన్ని చోట్ల నదుల ప్రవాహానికి ఎగువన అక్విడెక్టులు నిర్మించగా, ఏలేరు నది గర్భం కింద నుంచి సైఫన్ ద్వారా నీటిని తరలించడం ఈ ప్రాజెక్టు ప్రత్యేకత. ఈ కాలువను ఉత్తరాంధ్ర సుజల

ఏపీలో రెండున్నరేళ్ల క్రితం అధికారంలోకి వచ్చిన కూటమి సర్కార్ తనదైన శైలిలో పాలన సాగిస్తోంది. సీఎం చంద్రబాబు కూడా గతానికి భిన్నంగా దూకుడుగా నిర్ణయాలు తీసుకుంటూ ముందుకెళ్తున్నారు. కేబినెట్లో మంత్రులు కూడా తనతో పోటీ పడాలని ఆయన పదే పదే చెప్తుంటారు. అయితే ఆయన కేబినెట్లో తనతో పాటు కుమారుడు లోకేష్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాత్రమే ఎక్కువగా ఫోకస్ అవుతుంటారు. మిగతా మంత్రుల పాత్ర నామమాత్రమే అన్న విమర్శలు వినిపిస్తుంటాయి. ఇదే విషయం తాజాగా మరోసారి రుజువైంది.పోలవరం లోపాల పుట్ట- హైకోర్టు ముందు స్వయంగా వాదించబోతున్న మాజీ ఐపీఎస్ ..!పోలవరం కుడి కాలువ ద్వారా ఉత్తరాంధ్రకు నీళ్లు విడుదల చేసే కార్యక్రమాన్ని ఇవాళ సీఎం చంద్రబాబు లాంఛనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమం సందర్భంగా ప్రధాన పత్రికల్లో ప్రభుత్వం విడుదల చేసిన ప్రకటనలో సీఎం చంద్రబాబుతో పాటు ప్రధాని మోడీ, మంత్రి నారా లోకేష్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఫొటోలు మాత్రమే ఉన్నాయి. సాగునీటిపారుదల ప్రాజెక్టు ప్రారంభోత్సవం అయినా ఆ శాఖను చూస్తున్న జలవనరుల మంత్రి నిమ్మల రామానాయుడు ఫొటో మాత్రం లేదు. దీనిపై చంద్రబాబు మాజీ ఇంటెలిజెన్స్ ఛీఫ్, మాజీ ఐపీఎస్ ఏబీ వెంకటేశ్వరరావు (AB Venkateswara Rao) వ్యంగాస్త్రాలు సంధించారు. Bhogapuram Airport: భోగాపురం క్రెడిట్ వారిదే ? ఆధారాలతో తేల్చేసిన మాజీ ఇంటెల్ ఛీఫ్ ..!ముఖ్యమంత్రి గారూ,.. మీరు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు తప్పించి కాబినెట్ లోని మంత్రులందరూ నామమాత్రులే అనేది లోక విదితం అంటూ ఏబీ వెంకటేశ్వరావు ఇవాళ ట్వీట్ చేశారు. అయినా ఏదో సంప్రదాయాలంటూ ఉంటాయి కదా!

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ఏపీ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఉనికి కోసం గొడ్డలి పార్టీ ఆరాట పడుతోందని విమర్శించారు. కర్నూలు, సెప్టెంబర్ 2 (ఆంధ్రజ్యోతి): వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై (YS Jagan Mohan Reddy) ఏపీ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి (AP Minister BC Janardhan Reddy) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఉనికి కోసం గొడ్డలి పార్టీ ఆరాట పడుతోందని విమర్శించారు. వైసీపీ ఏ రోజు ప్రజల సమస్యలపై ఎందుకు స్పందించ లేదని ప్రశ్నించారు. ఈరోజు (బుధవారం) కర్నూలు జిల్లాల్లో మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పర్యటించి, పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ఎల్‌నినో ప్రభావం ఉన్నప్పటికీ సీఎం చంద్రబాబు ముందస్తు ఆలోచనతో ప్రజలకు ఏ ఇబ్బంది లేకుండా చూస్తున్నారని పేర్కొన్నారు. చంద్రబాబు దూరదృష్టితో పట్టిసీమను పూర్తి చేసి ఆదుకున్నారు.. జగన్ హయాంలోని ఐదేళ్లలో ప్రజా సంక్షేమం కోసం ఏమి చేశారో చెప్పే దమ్ము ఉందా అని బీసీ జనార్దన్ రెడ్డి నిలదీశారు. సీఎం చంద్రబాబు దూరదృష్టితో పట్టిసీమను పూర్తి చేసి ఆదుకున్నారని తెలిపారు. పులివెందులకు కూడా నీరు ఇచ్చిన ఘనత చంద్రబాబుదని చెప్పుకొచ్చారు. 36 నీటి ప్రాధాన్య ప్రాజెక్టులకు నీరు ఇస్తున్నామని వెల్లడించారు. ఏపీలో డ్రిప్ ఇరిగేషన్ లేకుండా చేసింది జగన్ మోహన్ రెడ్డినే అని విమర్శించారు. వైసీపీ దొంగ దీక్షలు, ధర్నాలు చేస్తే ప్రజలు నమ్మరు.. వైసీపీ నేతలు దొంగ దీక్షలు, ధర్నాలు చేస్తే ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని మంత్రి అన్నారు. ప్రజలకు, రైతులకు ఏ విధంగా నీరు ఇవ్వాలో అధికారులతో తాము సమీక్షలు చేస్తున్నామని తెలిపారు. తలకిందులు చేసిన కూడా గొడ్డలి పార్టీ అధికారంలోకి వచ్చే పరిస్థితి లేదన్నారు. కేసీ కెనాల్‌కు నీరు ఎప్పుడు విడుదల

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సెప్టెంబర్ 2వ తేదీన తన 55వ జన్మదినాన్ని ఎంతో ఘనంగా జరుపుకుంటున్నారు. ఈ ప్రత్యేకమైన సందర్భాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఐటీ మరియు విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా పవన్ కల్యాణ్‌కు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. కేవలం రాష్ట్ర నాయకులే కాకుండా దేశవ్యాప్తంగా ఉన్న పలువురు ప్రముఖులు ఆయనకు శుభాకాంక్షల సందేశాలు పంపించారు. సినిమా రంగంలో పవర్ స్టార్‌గా కోట్ల మంది అభిమానుల హృదయాల్లో స్థానం సంపాదించుకున్న పవన్ కల్యాణ్, ఆ తర్వాత రాజకీయాల్లోకి అడుగుపెట్టి ప్రజాసేవలో బిజీగా మారారు. జనసేన పార్టీని స్థాపించి ప్రజా సమస్యలపై నిరంతరం పోరాటం చేస్తూ, ఇటీవల జరిగిన ఎన్నికల్లో అద్భుత విజయం సాధించి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ఈ క్రమంలోనే ఆయన తన 55వ పుట్టినరోజు వేడుకలను జరుపుకోవడం ఎంతో ప్రాధాన్యత సంతరించుకుంది. సీఎం చంద్రబాబు తన పోస్టులో పవన్ కల్యాణ్‌ను ప్రియ మిత్రుడిగా సంబోధిస్తూ ఆయన సేవా నిరతిని కొనియాడారు. పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా పవన్ కల్యాణ్ రోడ్ల నిర్మాణం, పచ్చదనం పెంపొందించడం మరియు గిరిజన ప్రాంతాల అభివృద్ధికి అనేక సంస్కరణలు చేపట్టారని కొనియాడారు. దీంతో రాష్ట్ర పునర్నిర్మాణ హామీలను నెరవేర్చేందుకు పవన్ నిరంతరం శ్రమిస్తున్నారని స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా ఆయన ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు సంతోషంగా వర్ధిల్లాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు. మంత్రి నారా లోకేశ్ కూడా పవన్ కల్యాణ్‌పై తనకున్న అభిమానాన్ని ప్రత్యేక పోస్ట్ ద్వారా చాటుకున్నారు. పవన్ కల్యాణ్‌ను దేవుడిచ్చిన అన్నయ్యగా అభివర్ణించిన లోకేశ్, సినీ అభిమానులకు ఆయన పవర్ స్టార్ అయితే జనసైనికులకు మార్గదర్శకుడైన సేనాని అని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో పవన్ జన్మదిన వేడుకలు ఒక పండగ వాతావరణాన్ని తలపిస్తున్నాయని చెప్పారు. ఫలితంగా అభిమానులు, నాయకులు భారీ ఎత్తున సేవా

ఏసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం సిఎం చంద్రబాబు కీలక ప్రకటన తగ్గనున్న సాధారణ బస్సుల రద్దీ Stree Shakthi Scheme: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మహిళల సంక్షేమానికి మరో కీలక నిర్ణయం తీసుకుంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 'స్త్రీశక్తి(Stree Shakthi Scheme)' పథకం ద్వారా ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పించిన విషయం తెలిసిందే. అయితే, ప్రస్తుతం కేవలం పల్లెవెలుగు, ఎక్స్‌ప్రెస్ వంటి ఐదు కేటగిరీల బస్సులకే ఇది పరిమితం కావడంతో విపరీతమైన రద్దీ పెరుగుతోంది. ఈ సమస్యకు పరిష్కారంగా, మహిళలకు మరింత సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందించేందుకు త్వరలోనే ఏసీ బస్సుల్లో కూడా ఉచిత ప్రయాణ సదుపాయం కల్పించనున్నట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారికంగా ప్రకటించారు. Hitech City Railway Station: పండుగ రద్దీకి పక్కా ప్లాన్.. హైటెక్ సిటీలో రైళ్ల నిలుపుదల పొడగింపు.. పూర్తి వివరాలు మీకోసం! మోగల్తూరు సభలో ప్రకటన.. రద్దీ నియంత్రణకు ముందడుగు: మోగల్తూరులో నిర్వహించిన పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు ఈ తీపి కబురు అందించారు. రాష్ట్రంలో త్వరలోనే భారీ సంఖ్యలో కొత్త ఏసీ బస్సులను ప్రవేశపెట్టనున్నామని, వాటిలో మహిళలకు స్త్రీశక్తి పథకం వర్తింపజేస్తామని స్పష్టం చేశారు. సాధారణ బస్సులపై ఒత్తిడి తగ్గించడంతో పాటు, వేసవిలో కూడా మహిళలు హాయిగా ప్రయాణించేలా ఆర్టీసీ అధికారులు ఈ దిశగా కసరత్తు చేస్తున్నారు. చంద్రబాబు స్పష్టమైన హామీ ఇవ్వడంతో త్వరలోనే ఇది అమల్లోకి రానుంది. 'దివ్యాంగశక్తి' సేవలు విస్తరణపై ఆసక్తి.. పెరగనున్న సౌకర్యాలు: ఇప్పటికే రాష్ట్రంలో 'దివ్యాంగశక్తి' పథకం ద్వారా 40 శాతానికి పైగా అంగవైకల్యం ఉన్న వారికి ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణాన్ని, వారి సహాయకులకు 50 శాతం రాయితీని ప్రభుత్వం అందిస్తోంది. అయితే, ఏసీ బస్సుల్లో కూడా దివ్యాంగులకు ఉచిత ప్రయాణం వర్తిస్తుందా లేదా అన్నదానిపై త్వరలో స్పష్టత రానుంది. ఏదేమైనా, ఏసీ బస్సుల్లోనూ స్త్రీశక్తి పథకాన్ని వర్తింపజేయాలన్న నిర్ణయం పట్ల

పోలవరం జిల్లాలోని గొల్లగుప్ప గ్రామంలో మలేరియా నివారణ మందుల (క్లోరోక్విన్) వికటన ఘటన తీవ్ర కలకలం రేపింది. సంఘటనపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ వెంటనే స్పందించి ఉన్నతాధికారులతో వేర్వేరుగా అత్యవసర సమీక్ష నిర్వహించారు. మందులు వికటించి ఒక బాలిక మృతి చెందిందనే సమాచారం అందుకోవడంతో సీఎం చంద్రబాబు జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్, వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులతో ఫోన్లో మాట్లాడి పరిస్థితులను స్వయంగా సమీక్షించారు. బాధితులకు తక్షణమే అత్యుత్తమ వైద్యం అందించాలని, ఘటనపై సమగ్ర విచారణ జరిపించాలని సీఎంతో పాటు మంత్రి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.గ్రామంలో మొత్తం 71 మందికి మలేరియా నివారణ మందులు పంపిణీ చేయగా, వాటి ప్రభావంతో పలువురు అస్వస్థతకు గురయ్యారు. విషయం తెలిసిన వెంటనే అధికారులు అప్రమత్తమై గ్రామంలో అత్యవసర మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేశారు. అస్వస్థతకు గురైన వారిలో 47 మంది చిన్నారులతో సహా మొత్తం 52 మందికి తెలంగాణలోని భద్రాచలం ఏరియా ఆసుపత్రిలో ప్రత్యేక చికిత్స అందిస్తున్నారు. మరో 24 మందికి స్థానిక లక్ష్మీపురం పీహెచ్సీలో వైద్య సేవలు అందిస్తున్నారు. పొరుగు రాష్ట్రంలో ఉన్న భద్రాచలం ఆసుపత్రికి చింతూరు ఐటీడీఏ పీవో, ఏఎస్పీ సహా ఇతర అధికారులు స్వయంగా వెళ్లి బాధితుల ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. డయేరియా పంజా: ముగ్గురు మృతి, 76 మందికి అస్వస్థతఅసత్య ప్రచారాలు నమ్మొద్దు!భద్రాచలం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న 52 మందికి మలేరియా ఆర్డీటీ పరీక్షలు నిర్వహించగా, వారిలో ఆరుగురికి మలేరియా పాజిటివ్‌గా తేలిందని వైద్యులు వెల్లడించారు. పాజిటివ్ వచ్చిన వారందరికీ తగిన యాంటీ మలేరియా చికిత్సను ప్రారంభించినట్లు మంత్రి సత్యకుమార్‌కు అధికారులు నివేదించారు. ముందు జాగ్రత్త చర్యగానే బాధితులందరినీ మెరుగైన వైద్యం కోసం దగ్గర్లోని ఏరియా ఆసుపత్రికి తరలించామని, ప్రస్తుతం వారందరి ఆరోగ్య పరిస్థితి పూర్తి నిలకడగా ఉందని స్పష్టం చేశారు. ఈ ఘటనలో ఇద్దరు చనిపోయారంటూ వస్తున్న

పోలవరం జిల్లా, ఏటపాక మండలం గొల్లగుప్ప గ్రామంలో క్లోరోక్విన్ మాత్రలు వేసుకున్న అనంతరం ఏడేళ్ల బాలిక మృతి చెందడం, పలువురు అస్వస్థతకు గురికావడంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్రంగా స్పందించారు. ఈ ఘటనపై తక్షణమే సమగ్ర విచారణ జరపాలని అధికారులను ఆదేశించారు. బాధితులందరికీ అత్యుత్తమ వైద్య సేవలు అందించాలని ఆయన స్పష్టం చేశారు.ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు, జిల్లా కలెక్టర్ కె. దినేష్ కుమార్‌తో ముఖ్యమంత్రి ఈ ఘటనపై సమీక్ష నిర్వహించారు. మలేరియా రాకుండా ముందస్తు చర్యల్లో భాగంగా గ్రామంలోని 71 మందికి క్లోరోక్విన్ మాత్రలు పంపిణీ చేయగా, వాటిని తీసుకున్న తర్వాత పలువురు అనారోగ్యం పాలయ్యారు. ఈ దురదృష్టకర ఘటనలో జమున అనే ఏడేళ్ల చిన్నారి ప్రాణాలు కోల్పోయింది.ప్రభుత్వ ఆదేశాలతో అధికార యంత్రాంగం తక్షణమే సహాయక చర్యలు చేపట్టింది. అస్వస్థతకు గురైన వారిలో 29 మందిని భద్రాచలం ఏరియా ఆసుపత్రికి, మరో 24 మందిని లక్ష్మీపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించి చికిత్స అందిస్తున్నారు. గ్రామంలో అత్యవసర వైద్య శిబిరాలను ఏర్పాటు చేశారు. కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రి నుంచి తొమ్మిది మంది సభ్యులతో కూడిన ప్రత్యేక వైద్య బృందం ఇప్పటికే గ్రామానికి చేరుకోగా, విజయవాడ, రాజమండ్రి నుంచి మరిన్ని బృందాలు బయలుదేరాయి.ఈ ఘటనలో ఇద్దరు చిన్నారులు మరణించారంటూ వస్తున్న వార్తల్లో నిజం లేదని, కేవలం ఒక బాలిక మాత్రమే మృతి చెందిందని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. ప్రస్తుతం ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న వారి ఆరోగ్యం నిలకడగా ఉందని, జిల్లా యంత్రాంగం పరిస్థితిని నిశితంగా పర్యవేక్షిస్తోందని వారు వెల్లడించారు

రాజమండ్రి(తూ.గో. జిల్లా): చంద్రబాబు పూర్తి చేసిన కాలువ పనులు కూడా అవినీతిమయమేనని మాజీ ఎంపీ, వైఎస్సార్సీపీ నేత మార్గాని భరత్ విమర్శించారు. వెలిగొండ ప్రాజెక్టుతో పాటు అనేక ప్రాజెక్టులు వైఎస్సార్ రెక్కల కష్టమన్నారు. చంద్రబాబుది క్రెడిట్ చోరీ తప్ప ఏమీలేదని ధ్వజమెత్తారు. పోలవరం ప్రాజెక్టు నుండి ఒక్క చుక్క నీరు కూడా ఎడమ కాలువ ద్వారా తరలించడం లేదని, పురుషోత్తపట్నం నుండి ఏలేరులో నీటిని ఎత్తిపోసి ఎడమ కాలువ ద్వారా పంపుతున్నారన్నారు. ఇది పోలవరం ప్రాజెక్టు నీరు కాదని.... గ్రావిటీపై ఒక చుక్క కూడా నీరు రావటం లేదన్నారు. ‘పోలవరం ఎడమ కాలువ నుండి నీటిని విడుదల చేస్తామని చంద్రబాబు చెప్తున్నారు. వైఎస్సార్ హయాంలోనే రైట్ మెయిన్ కెనాల్, లెఫ్ట్ మెయిన్ కెనాల్ చాలావరకు పూర్తయ్యాయి. ఇది జల యజ్ఞం కాదు... ధన యజ్ఞం.. అని అప్పట్లో చంద్రబాబు అన్నారు. 45.72 మీటర్లు నీటిని నిల్వ చేస్తే తప్ప గ్రావిటీపై ఉత్తరాంధ్రకు నీటి సరఫరా సాధ్యం కాదు. పోలవరం ప్రాజెక్టును 41.15 మీటర్లకు పరిమితం చేస్తే ఇది కేవలం బ్యారేజ్ గా మిగులుతుంది. కుడి, ఎడమ కాలువలు తవ్వించకపోతే అసలు పోలవరం ప్రాజెక్టు ముందుకు వెళ్లే పరిస్థితి ఉందా?, ఇప్పుడు ఉన్నదంతా జంజీ జనరేషనే... గతంలో చంద్రబాబు పవిత్ర సంగమం పేరిట డ్రామా చేశారు. మీరు చేసే పనులు వల్ల విద్యుత్ ఎంత అవుతుంది. చంద్రబాబు దారుణంగా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారు’ అని విమర్శించారు. చంద్రబాబు మొగల్తూరు పర్యటన అట్టర్ ఫ్లాప్ మెరుపుతీగలా మారిపోయిన హెబ్బా పటేల్ (ఫొటోలు) తమిళ బ్యూటీ ఆండ్రియా పారిస్ ట్రిప్ (ఫొటోలు) హీరోగా రవితేజ తమ్ముడి కొడుకు.. 'మారెమ్మ' ట్రైలర్ లాంచ్ (ఫొటోలు) అనిరుధ్ కన్సర్ట్ కోసం జోనితా గాంధీ రెడీ అయిందిలా (ఫొటోలు) కీర్తి సురేశ్ కలర్‌ఫుల్ ఓనం సెలబ్రేషన్ (ఫొటోలు) భువనగిరిలో ఉద్రిక్తత ఎమ్మెల్యే, సీఎం రేవంత్ ఫ్లెక్సీపై నల్ల రంగు పుష్ప శ్రీవాణి పై

హైదరాబాద్: చంద్రబాబు జీవితమంతా అబద్ధాల మయమేనని, ఎన్నికలకు ముందు సంక్షేమం.. గెలిచాక పచ్చి మోసం చేయడమమే ఆయన నైజమని వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నందమూరి లక్ష్మీపార్వతి ధ్వజమెత్తారు. ’విజనరీ’ అనే పదాన్ని కూడా చోరీ చేసిన ఘనుడు ఎవరైనా ఉన్నారంటే అది చంద్రబాబేనని, ఇతరుల ప్రాజెక్టులకు శిలాఫలకాలు వేసి క్రెడిట్ కొట్టేసే వ్యక్తి అంటూ విమర్శించారు. నందమూరి తారక రామారావుకు వెన్నుపోటు పొడిచి, తెలుగుదేశం పార్టీని, ఆయన పదవిని లాక్కుని, సరిగ్గా 31 ఏళ్ల క్రితం ఇదే రోజు సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేశారని, అందుకే వెన్నుపోటుకు కేరాఫ్ అడ్రస్ చంద్రబాబునాయుడు అని మండిపడ్డారు.. అలా అడ్డదారిలో గద్దెనెక్కిన చంద్రబాబు, ఆనాటి నుంచి ఇప్పటి వరకు ఏ మాత్రం నైతిక విలువలు లేని రాజకీయాలు చేస్తున్నారని ఆమె గుర్తు చేశారు. హైదరాబాద్‌లోని తన నివాసంలో నందమూరి లక్ష్మీపార్వతి మీడియాతో మాట్లాడుతూ.. మహనీయుడు ఎన్టీఆర్ అయితే ద్రోహి చంద్రబాబు ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మహిళా యూనివర్సిటీ తీసుకువచ్చారు. ఉద్యోగాల్లో మహిళలకు 9 శాతం, స్థానిక సంస్థల్లో 33 శాతం రిజర్వేషన్లు కల్పించారు. మునసబు, కరణాల వ్యవస్థను రద్దు చేసి పరిపాలనను గ్రామ స్థాయికి తీసుకువెళ్లిన గొప్ప నేత ఆయన. కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా దేశంలోని పార్టీలన్నింటినీ ఏకం చేసి, నేషనల్ ఫ్రంట్ ఏర్పాటు చేసి వీపీ సింగ్గారిని ప్రధానిని చేసిన మహానుభావుడు. 1994 ఎన్నికల్లో 222 సీట్లు, కమ్యూనిస్టులతో కలిపి ఏకంగా 258 స్థానాలతో అఖండ మెజారిటీ సాధించారు. అలాంటి గొప్ప వ్యక్తికి ఎనిమిది నెలలు తిరక్కుండానే చంద్రబాబు ద్రోహం చేశాడు. వెన్నుపోటుకు కేరాఫ్ అడ్రస్ చంద్రబాబు ఆ రోజుల్లో ఎన్టీఆర్ ఆరోగ్యం బాగాలేక ప్రాణాపాయ స్థితిలో ఉంటే.. చంద్రబాబు మాత్రం వైస్రాయ్ హోటల్లో ఎమ్మెల్యేలతో మందు, మాంసంతో విందులు, వినోదాలు చేసుకున్నారు. ఆగస్టు 25వ తేదీన ఎన్టీఆర్ గారిని పార్టీ అధ్యక్ష పదవి నుంచి అన్యాయంగా తొలగించి, పార్టీ ఫండ్‌ను ఆపేశారు. తండ్రిని

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జాతీయ రహదారుల ఏర్పాటుకు కేంద్రం తోడ్పాటును అందిస్తున్న విషయం తెలిసిందే. హైదరాబాద్ నుంచి విజయవాడ మీదుగా మచిలీపట్నం వరకు ఉన్న జాతీయ రహదారి 65ను ఆరు లేన్లుగా విస్తరించే ప్రతిపాదనకు కేంద్రం కీలక ఆమోదం లభించింది. నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా సమర్పించిన ప్రతిపాదనపై కేంద్ర ప్రభుత్వ పబ్లిక్-ప్రైవేట్ పార్ట్నర్షిప్ అప్రైజల్ కమిటీ పీపీపీఏసీ ఆమోదం తెలిపింది.ప్రైవేటుకు భూగర్భ బొగ్గు గనులు.. కేంద్రం సూచన .. సింగరేణి యోచన!జాతీయ రహదారి 65ను ఆరు లేన్లుగా విస్తరణకు భూసేకరణ, నిర్మాణం కోసం భారీ వ్యయంప్రధాని నేతృత్వంలోని ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్ కమిటీ సీసీఈఏ తుది అనుమతి ఇచ్చిన వెంటనే టెండర్లు, భూసేకరణ పనులు వేగంగా మొదలుకానున్నాయి. మొత్తం 284 కిలోమీటర్ల మేర ఈ విస్తరణకు భూసేకరణ, నిర్మాణం కోసం భారీ వ్యయం కానుంది. ప్రాజెక్టును మూడు ప్యాకేజీలుగా అమలు చేయనున్నారు. మల్కాపూర్ నుంచి విజయవాడ గొల్లపూడి బైపాస్ వరకు 284 కి.మీ మార్గాన్ని నాలుగులేన్ల నుంచి ఆరు లేన్లుగా మారుస్తారు.ప్రాజెక్టును మూడు ప్యాకేజీలుగా నిర్మాణందీనిని బిల్డ్-ఆపరేట్-ట్రాన్స్ఫర్ బీఓటీ విధానంలో రెండు ప్యాకేజీలుగా హైదరాబాద్-నందిగామ ఒక ప్యాకేజీ, నందిగామ-గొల్లపూడి మరో ప్యాకేజీగా చేపడతారు. ప్రస్తుత నాలుగు లేన్లను ఉంచి ఇరువైపులా కొత్త సర్వీస్ రోడ్లు నిర్మిస్తారు. అమరావతి ఔటర్ రింగ్ రోడ్ క్రాసింగ్ నుంచి మచిలీపట్నం వరకు 44 కి.మీ మార్గాన్ని హైబ్రిడ్ అన్యుటీ మోడల్ హ్యామ్ కింద ఒకే ప్యాకేజీగా ఆరు లేన్లుగా విస్తరిస్తారు.పోర్న్ కంటెంట్ తో బిగ్ ఫైనాన్షియల్ ఫ్రాడ్: ఈ యాప్‌లు తక్షణమే డిజేబుల్ చేయండి- కేంద్రంగొల్లపూడి వరకు ప్రతిపాదనకు ఓకే.. ఆ ప్రతిపాదనలకు నో పర్మిషన్ప్రారంభంలో కంచికచర్ల వరకే ఉన్న ప్రతిపాదనను గొల్లపూడి వరకు పొడిగించాలని సీఎం నారా చంద్రబాబు నాయుడు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి లేఖ రాయడంతో విస్తరణ పెంచారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం అడిగిన గొల్లపూడి నుంచి భవానీపురం కనకదుర్గ ఫ్లైఓవర్ వరకు

తెలంగాణలో మరో విమానాశ్రయం నిర్మాణానికి కేంద్రం సిద్ధమవుతోంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కొత్త ఎయిర్పోర్ట్ ఏర్పాటు చేయాలని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు స్పష్టం చేశారు. భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం ఉన్న ఈ ప్రాంత ప్రజల సౌకర్యార్థం తప్పకుండా విమానాశ్రయం నిర్మించాలని అధికారులను ఆదేశించారు.భద్రాద్రి కొత్తగూడెంలో ఎయిర్పోర్ట్ స్థల పరిశీలనకు రానున్న కేంద్ర సాంకేతిక బృందంఈ మేరకు నాలుగు నుంచి ఐదు ప్రత్యామ్నాయ స్థలాలను పరిశీలించేందుకు కేంద్ర సాంకేతిక బృందం సెప్టెంబర్ 7న తెలంగాణలో పర్యటించనుందని మంత్రి వెల్లడించారు. రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కేంద్ర మంత్రితో భేటీ అయి, గతంలో పరిశీలించిన రెండు స్థలాలు సాంకేతిక కారణాలతో అనుకూలం కాకపోవడంతో కొత్తగా గుర్తించిన స్థలాల వివరాలు తెలిపారు.నివేదిక అనుకూలంగా వస్తే కేంద్ర ప్రభుత్వం తదుపరి చర్యలుకొత్త స్థలాల్లో భౌగోళిక, వాతావరణ పరిస్థితులు, విమానాశ్రయ నిర్మాణానికి అవసరమైన సాంకేతిక అంశాలను బృందం క్షేత్రస్థాయిలో పరిశీలించనుంది. వారి నివేదిక అనుకూలంగా వస్తే కేంద్ర ప్రభుత్వం తదుపరి చర్యలు చేపడుతుందని తెలిపారు. ఎయిర్పోర్ట్ ఏర్పాటుకు సాంకేతిక బృందాన్ని పంపించేందుకు చొరవ తీసుకున్న కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడికి, కేంద్ర ప్రభుత్వానికి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ధన్యవాదాలు తెలిపారు.ఈ ప్రాజెక్ట్ తీర్ధ యాత్రికులకే కాదు ప్రాంత అభివృద్ధికి కీలకం ఈ ప్రాజెక్టు భద్రాచలం తీర్థయాత్రికులు, స్థానిక ప్రజలకు గొప్ప ఉపయోగం చేకూర్చనుంది.సింగరేణి పారిశ్రామిక ప్రాంతంతో పాటు ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన భద్రాచలం రామాలయం సందర్శనకు వచ్చే భక్తులకు, వ్యాపారవేత్తలకు ఈ విమానాశ్రయం అందుబాటులోకి వస్తే ఎంతో మేలు జరుగుతుంది. రవాణా సౌకర్యాలు మెరుగై, ఈ ప్రాంత సమగ్ర ఆర్థిక పురోగతికి బాటలు పడతాయని భావిస్తున్నారు.తెలంగాణలో కొత్త ఎయిర్ పోర్ట్ ల నిర్మాణానికి కేంద్ర సహకారం తెలంగాణా రాష్ట్రంలో కొత్త ఎయిర్ పోర్ట్ ల నిర్మాణానికి కేంద్రం నుండి సహకారం లభిస్తోంది, ఇప్పటికే వరంగల్ మామునూరు ఎయిర్పోర్ట్ నిర్మాణానికి సంబంధించిన భూసేకరణ పూర్తి చేసి

ఉత్తరాంధ్ర ప్రజా సమూహాల దశాబ్దాల కల నెరవేరే సువర్ణ ఘడియలు ఆసన్నమయ్యాయి. పోలవరం ప్రాజెక్టు ఎడమ కాలువ ద్వారా గోదావరి జలాలు ఉత్తరాంధ్ర భూముల్లోకి పారేందుకు మార్గం సుగమమైంది. రేపు పాయకరావుపేట వద్ద ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రెగ్యులేటర్ ఆన్ చేసి, పుడమి తల్లిని తడిపే గోదావరి తరంగాలకు జల హారతి ఇచ్చి ఘనంగా స్వాగతం పలకనున్నారు. ఇంజనీరింగ్ అద్భుతంగా రూపొందిన ఈ కాలువ ద్వారా ఉగ్రరూప మెత్తే గోదావరి ప్రవాహం ఇకపై ఉత్తరాంధ్ర జిల్లాల సాగు, తాగునీటి దాహాన్ని తీర్చబోతోంది.తూర్పు కనుమల విసిరిన క్లిష్టమైన భౌగోళిక సవాళ్లను దాటుకుంటూ, రూ.4,192 కోట్ల భారీ వ్యయంతో 213 కిలోమీటర్ల మేర పోలవరం ఎడమ ప్రధాన కాలువ నిర్మాణం పూర్తయింది. ఏలేరు, పంపా, తాండవ, వరాహ, శారద వంటి అనేక నదులు, వాగులను దాటుకుంటూ ఈ కాలువ సాగుతుంది. ఇంజనీరింగ్ అద్భుతాలకు ప్రతీకగా కొన్ని చోట్ల నదీ ప్రవాహానికి ఎగువ నుంచి అక్విడెక్టులు, మరికొన్ని చోట్ల దిగువ నుంచి సైఫన్లు నిర్మించారు.ముఖ్యంగా పంపా నదిపై 30 మీటర్ల లోతులో 312 పైల్స్‌తో అక్విడెక్ట్, తాండవ నదిపై 10,634 క్యూసెక్కుల ప్రవాహ సామర్థ్యాన్ని తట్టుకునేలా 447 మీటర్ల పొడవున భారీ నిర్మాణాలు పూర్తి చేశారు. దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న తాళ్లపాలెం భూ వివాదాన్ని పరిష్కరించి 472 కుటుంబాలకు పునరావాసం కల్పించడం ద్వారా ప్రాజెక్టును వేగవంతం చేశారు.Veligonda Project: వెలిగొండ ప్రాజెక్టు కట్టిందెవరు ? జగన్- లోకేష్ క్రెడిట్ వార్..!2.87 లక్షల ఎకరాలకు సాగునీరు..ఈ గోదావరి జలాల విడుదలతో నాలుగు జిల్లాల పరిధిలోని 2,87,320 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందడమే కాకుండా, 5.23 లక్షల మంది ప్రజలకు శాశ్వత తాగునీటి భరోసా లభించనుంది. మొత్తం 23.44 టీఎంసీల నీటిని వినియోగించుకుంటూ పరిశ్రమలకు, తాగునీటికి, సాగుకు ఇబ్బంది లేకుండా డిజైన్ చేశారు. పాయకరావుపేట అక్విడెక్ట్ ద్వారా విడుదలయ్యే నీటితో అనకాపల్లి వద్ద ఏలేరు కాలువను, అలాగే జిల్లాలోని

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అనగానే మనకు వెంటనే గుర్తుకొచ్చేది భారీ బిల్డింగ్లు, పెద్ద రోడ్లు, వరల్డ్ క్లాస్ సిటీ ప్లాన్స్ మాత్రమే కాదు. భారతదేశ రియల్ ఎస్టేట్ చరిత్రలోనే ఇది ఒక అత్యంత ఆసక్తికరమైన ప్రయాణం. ఒకప్పుడు పచ్చని పంట పొలాలతో ఎంతో ప్రశాంతంగా ఉన్న కృష్ణా నదీ తీర ప్రాంతం, రాజధాని ప్రకటన రాగానే రాత్రికి రాత్రే కోట్ల రూపాయల బిజినెస్‌కు కేరాఫ్ అడ్రస్‌గా మారిపోయింది. గత పదేళ్ల కాలంలో అమరావతి భూముల ధరలు చూసిన ఎత్తుపల్లాలు, పొలిటికల్ ట్విస్టులు, చివరకు ఇన్వెస్టర్లకు ఇచ్చిన లాభాలు రియల్ ఎస్టేట్ వరల్డ్‌లోనే ఒక కొత్త చరిత్ర సృష్టించాయి. 2014 సంవత్సరానికి ముందు తుళ్లూరు, నేలపాడు, మందడం, నవులూరు, రాయపూడి లాంటి గ్రామాల్లో భూముల వ్యాపారం ఎకరాల లెక్కన మాత్రమే జరిగేది. అప్పట్లో ఎకరం ధర రూ.15 లక్షల నుంచి రూ.30 లక్షల వరకు ఉండేది. అంటే గజం లెక్కన చూసుకుంటే కేవలం రూ.3,000 నుంచి రూ.6,000 మాత్రమే. కానీ 2014 చివరిలో ఉమ్మడి ఏపీ విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధానిగా అమరావతిని ప్రకటించడంతో రియల్ ఎస్టేట్ స్ సీన్ ఒక్కసారిగా మారిపోయింది. రైతుల నుంచి ఏకంగా 33,000 ఎకరాలను ల్యాండ్ పూలింగ్ కింద సేకరించారు. 2016 నుంచి 2018 మధ్య వెలగపూడిలో తాత్కాలిక సచివాలయం, అసెంబ్లీ, హైకోర్టు నిర్మాణాలు ప్రారంభం కావడంతో భూముల రేట్లు ఆకాశాన్ని తాకాయి. అయితే 2019లో ప్రభుత్వం మారడం, మూడు రాజధానుల ప్రతిపాదన ముందుకు రావడంతో 2019-2023 మధ్య మార్కెట్ తీవ్రంగా పడిపోయింది. ఆ సమయంలో భూమి అమ్మకాలు తగ్గిపోయి గజం ధర రూ.12,000 వరకు పడిపోయింది. కానీ 2024లో మళ్లీ ప్రభుత్వం మారడం, వరల్డ్ బ్యాంక్, ఆసియా అభివృద్ధి బ్యాంక్ (ADB) నుంచి నిధులు రావడంతో అమరావతిలో భూముల రేట్లు మళ్లీ రికార్డు స్థాయికి చేరాయి. ఒక సాధారణ ఇన్వెస్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తే అమరావతి

Kothagudem Airport: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో విమానాశ్రయం ఏర్పాటు ప్రతిపాదనకు సంబంధించి నాలుగు నుంచి ఐదు ప్రత్యామ్నాయ స్థలాలను పరిశీలించేందుకు కేంద్ర సాంకేతిక బృందం సెప్టెంబర్ 7న తెలంగాణలో పర్యటించనుంది. న్యూఢిల్లీలో మంగళవారం కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడితో సమావేశమైన అనంతరం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఈ విషయాన్ని వెల్లడించారు. గతంలో పరిశీలించిన రెండు స్థలాలు సాంకేతిక కారణాలతో విమానాశ్రయ నిర్మాణానికి అనుకూలంగా లేవని తేలడంతో.. తాజాగా నాలుగు నుంచి ఐదు ప్రత్యామ్నాయ స్థలాలను గుర్తించినట్లు మంత్రి తెలిపారు. ఈ స్థలాల్లోని భౌగోళిక, వాతావరణ పరిస్థితులతోపాటు విమానాశ్రయ నిర్మాణానికి అవసరమైన సాంకేతిక సాధ్యాసాధ్యాలను కేంద్ర బృందం క్షేత్రస్థాయిలో పరిశీలిస్తుందని చెప్పారు. కేంద్ర సాంకేతిక బృందం నివేదిక అనుకూలంగా వచ్చిన తర్వాత కొత్తగూడెం విమానాశ్రయం ఏర్పాటుకు అవసరమైన తదుపరి చర్యలను కేంద్ర ప్రభుత్వం చేపడుతుందని కేంద్ర మంత్రి హామీ ఇచ్చినట్లు మంత్రి తుమ్మల తెలిపారు. తెలంగాణలోని మామునూరు (వరంగల్), ఆదిలాబాద్ విమానాశ్రయాల ప్రతిపాదనలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సెప్టెంబర్ 2న కేంద్ర ప్రభుత్వంతో చర్చించే అవకాశం ఉందని పేర్కొన్నారు. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు తండ్రి, దివంగత ఎర్రన్నాయుడు తన చిరకాల మిత్రుడని మంత్రి తుమ్మల గుర్తుచేసుకున్నారు. భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం ఉన్న ఈ ప్రాంత ప్రాధాన్యాన్ని, జిల్లా ప్రజలకు విమానాశ్రయం అవసరాన్ని కేంద్ర మంత్రికి వివరించినట్లు తెలిపారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రజల దీర్ఘకాల ఆకాంక్షను కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లాను. నా విజ్ఞప్తికి సానుకూలంగా స్పందించి, వెంటనే కేంద్ర సాంకేతిక బృందాన్ని పంపేందుకు చర్యలు చేపట్టిన కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడికి, కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు

మొగల్తూరు: రాష్ట్రంలో సంక్షేమం, అభివృద్ధి ఇంకా బాగా జరగాలి.. అందుకోసం సలహాలు, సూచనలు చెప్పాలని ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu) పిలుపునిచ్చారు. పశ్చిమగోదావరి జిల్లా మొగల్తూరులో ఏర్పాటుచేసిన పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో సీఎం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సంక్షేమం పేదవాడిని నిలబెట్టాలి.. తాత్కాలిక ఉపశమనం ఉండాలన్నారు. ‘‘ఆడ బిడ్డలు ఎక్కడికి వెళ్లాలన్నా.. ఉచిత బస్సులు తెచ్చాం. దీపం పథకం ద్వారా 3 సిలిండర్లు ఇస్తున్నాం. పేదల సేవ కోసమే మొగల్తూరు వచ్చాను. సీఎం స్థాయిలో అనేక మార్పులు చేశాను. ఎంత సేవ చేసినా మీ రుణం తీర్చుకోలేను. అనేక సంస్కరణలకు నాంది పలికాం.. ప్రజా చైతన్య కార్యక్రమాలు తెచ్చాం. ఎన్నికల్లో మీరిచ్చిన తీర్పును ఎన్నటికీ మర్చిపోలేను. వైకాపా హయాంలో రాష్ట్రానికి కోలుకోలేని నష్టం జరిగింది. కూటమిగా ఏర్పడి రాష్ట్రాన్ని మళ్లీ గాడిన పెడుతున్నాం. 45 సంవత్సరాలుగా వెనుకబడిన వర్గాలు తెదేపాని అంటిపెట్టుకునే ఉన్నాయి. ఆర్టీసీలో మహిళా కండక్టర్ల వ్యవస్థను తీసుకొచ్చాం. త్వరలో మహిళా డ్రైవర్ల వ్యవస్థను తీసుకొస్తాం. వడ్డెర సమాజిక వర్గానికి మైనింగ్ లీజులు పెట్టాం. గౌడ్ కులానికి మద్యంషాపులు కేటాయిస్తున్నాం. డీఎస్సీపై వైకాపా 350 కేసులు వేసింది. వైకాపా చేస్తోన్న ప్రచారాన్ని డీఎస్సీ ఉద్యోగులు వ్యతిరేకిస్తున్నారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా పింఛన్లు పెంచాం. పేదల పట్ల ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంది. పేదలకు చేయూతనిస్తే ఏదైనా సాధించే సత్తా ఉంటుంది’’ అని చంద్రబాబు అన్నారు. కార్యక్రమంలో కేంద్ర మంత్రి శ్రీనివాసవర్మ, రాష్ట్ర మంత్రులు నిమ్మల రామానాయుడు, గొట్టిపాటి రవికుమార్, ఉపసభాపతి రఘురామకృష్ణరాజు తదితరులు పాల్గొన్నారు. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం

రాజధాని అమరావతి పరిధిలోని వెంకటపాలెంలో శ్రీ వేంకటేశ్వరస్వామి దివ్యక్షేత్రం నూతన శోభను సంతరించుకుంటోంది. ఈ ఆలయ విస్తరణ పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. తిరుమల తరహాలో ఈ ఆలయం రూపుదిద్దుకుంటోంది. బ్రహ్మోత్సవాల నాటికి ఈ పనులన్నీ ముగించాలని టీటీడీ నిర్ణయించింది. ఆలయ విస్తరణ, ఆధునీకరణ కోసం టీటీడీ ఇదివరకే 260 కోట్ల రూపాయలను మంజూరు చేసింది.నిజానికి ఈ ఆలయ పనులు 2028 ఉగాది నాటికి పూర్తి చేయాలని మొదట్లో టీటీడీ భావించింది. అంతకంటే ముందే.. అంటే ఈ సెప్టెంబర్ లో తిరుమలలో నిర్వహించే శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల నాటికే ప్రధాన నిర్మాణాలన్నింటినీ పూర్తి చేయాలని ప్రతిపాదించింది. దీంతో విస్తరణ పనులు వేగం పుంజుకొన్నాయి. మూడు షిఫ్టుల్లో కొనసాగుతున్నాయి. రాత్రి వేళ కూడా పనులు చకచకా సాగుతున్నాయి. టీటీడీ జేఈఓ డాక్టర్ ఎ శరత్.. ఈ పనులను స్వయంగా పర్యవేక్షిస్తోన్నారు.అర్ధరాత్రి వేళల్లో ఆలయ నిర్మాణ స్థలాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేస్తూ, కాంట్రాక్ట్ సంస్థలను పరుగులు పెట్టిస్తున్నారు. ఆలయ పనుల్లో ఎక్కడా జాప్యం జరగకుండా చూసుకుంటోన్నారు. మూడు షిఫ్టుల్లో పనులు చేపట్టినందున అదనపు కార్మికులను నియమించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ శ్రీవారి బ్రహ్మోత్సవాల నాటికి పూర్తిస్థాయిలో ఈ ఆలయాన్ని భక్తుల కోసం అందుబాటులోకి తీసుకుని రావాలనే పట్టుదలతో ఉంది టీటీడీ.దుబాయ్, సింగపూర్, దోహా.. ఇప్పుడిక ఏపీ రాజధాని అమరావతిలో.. !!ఈ నేపథ్యంలో వేంకటపాలెం శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయ నిర్మాణ పనులను సోమవారం ఆయన మరోసారి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆలయం రెండో ప్రాకారం, నాలుగు గాలి గోపురాల నిర్మాణ పనుల పురోగతిని ఆయన పరిశీలించారు. పనులను నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. నిర్మాణ పనుల్లో ఎలాంటి అలసత్వానికి తావులేకుండా నిరంతరం పర్యవేక్షించాలని, పురోగతిపై ఎప్పటికప్పుడు నివేదికలు అందించాలని సూచించారు.హైదరాబాద్ లో నేటి నుంచి అందుబాటులోకి రానున్న భారీ హైలెవెల్ బ్రిడ్జి- ట్రాఫిక్ కు చెక్పనుల సందర్భంగా ఎదురయ్యే సమస్యలను వెంటనే తన దృష్టికి తీసుకురావాలని, వాటన్నింటిని

వెలిగొండ నుంచి వస్తున్న కృష్ణా జలాలు చూసేందుకు ముంపు గ్రామం కలనూతల వెళ్లి ఆ నీటి ప్రవాహంలో యువకులు చిక్కుకుపోయారు. వారిని జిల్లా అధికారులు రక్షించారు. మార్కాపురం,సెప్టెంబర్01: జిల్లాలోని పెద్దారవీడు మండలం కలనూతల సమీపంలోని వెలిగొండ నీటి ప్రవాహంలో కారు కొట్టుకుపోయింది. కారులోని ముగ్గురు యువకులు సమీపంలోని చెట్టు ఎక్కి రక్షించాలంటూ బిగ్గరగా కేకలు వేశారు. ఈ విషయాన్ని గమనించిన స్థానికులు.. వెంటనే జిల్లా అధికారులతోపాటు పోలీసులకు సమాచారం అందించారు. జిల్లా కలెక్టర్ విజయ సునీత ఆధ్వర్యంలో దాదాపు ఏడు గంటల పాటు శ్రమించి.. ఆ యువకులను రెస్క్యూ టీం కాపాడింది. వెలిగొండ నుంచి వస్తున్న కృష్ణా జలాలు చూసేందుకు ముంపు గ్రామం కలనూతల వెళ్లి.. ఈ నీటి ప్రవాహంలో చిక్కుకున్నట్లు ఆ యువకులు వెల్లడించారు. వెలిగొండ ప్రాజెక్టును సోమవారం సీఎం చంద్రబాబు ప్రారంభించిన విషయం విదితమే
రాష్ట్రంలో కూటమి సర్కార్ వరుసగా తాగు, సాగునీటి ప్రాజెక్టులను ప్రారంభిస్తోంది. 30 ఏళ్లుగా పశ్చిమ ప్రకాశం వాసుల కలగా మిగిలిపోయిన వెలిగొండ ప్రాజెక్టును మొత్తానికి పూర్తి చేసి, కృష్ణమ్మ జలాలను నల్లమల సాగర్‌కు విడుదల చేసి చంద్రబాబు నాయుడు జాతికి అంకితం చేశారు. వెలిగొండ పూర్తయిన వెంటనే ఉత్తరాంధ్ర ప్రజలు ఎన్నాళ్లుగానో గోదావరి రాక కోసం ఎదురుచూస్తున్నారు. ఇప్పుడు ఆ ప్రాజెక్టును కూడా ప్రారంభించేందుకు కూటమి ప్రభుత్వం సిద్ధమైంది.పోలవరం ఎడమ ప్రధాన కాలువ ద్వారా అనకాపల్లి వరకు గోదావరి జలాలను అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. తుని సమీపంలో నర్సీపట్నం రోడ్డును క్రాస్ చేస్తూ నిర్మించిన అక్విడెక్టు నుంచి సీఎం చంద్రబాబు నాయుడు బుధవారం నీటిని విడుదల చేయనున్నారు. దాంతో దశాబ్దాలుగా ఉత్తరాంధ్రవాసుల కలగా మారిన ఉత్తరాంధ్ర సుజల స్రవంతికి తొలి అడుగు పడనున్నట్లయింది.READ ALSO కరువు సీమలో కృష్ణా జలాలు.. వెలిగొండ ప్రాజెక్టును జాతికి అంకితం చేసిన చంద్రబాబు!తుని - నర్సీపట్నం రహదారిపై నిర్మించిన అక్విడెక్టు గేట్లను ఎత్తి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉత్తరాంధ్రకు గోదావరి జలాలను విడుదల చేస్తారు. ఇవి కణితి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌కు చేరుకుంటాయి. మొదటి దశలో 30 టీఎంసీల నీటిని అనకాపల్లి తరలిస్తారు. తూర్పు గోదావరి జిల్లా పురుషోత్తపట్నం పంప్‌హౌస్ నుంచి పోలవరం ఎడమ కాలువలోకి ఈ నీటిని ఎత్తిపోస్తారు.గోదావరి జలాలను అనకాపల్లి జిల్లాకు విడుదల చేయడం వల్ల 110 చెరువులు నిండటమే కాకుండా, 148000 ఎకరాలకు సాగునీరు దక్కుతుంది. పోలవరం ఎడమ కాలువతో ఏలేరు నది అనుసంధానం కావడం వల్ల ఏలేరు ఆయకట్టు స్థిరీకరణ జరగనుంది. ఫలితంగా పిఠాపురం బ్రాంచ్ కెనాల్ ఆయకట్టు పరిధిలోని 80,700 ఎకరాలు, పంపా ఆయకట్టు పరిధిలో 12 వేల ఎకరాల స్థిరీకరణ జరుగుతుంది.తాండవ, వరాహ, మావిడివాక గెడ్డ నదులు కూడా అనుసంధానం కావడంతో పాయకరావుపేట, అనకాపల్లి అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలోని చెరువులన్నీ నిండుతాయి. 46,620 ఎకరాలకు సాగు నీరు

ప్రజల నుంచి వచ్చే అభిప్రాయాలు, డేటా అనలటిక్స్‌ను విశ్లేషించడం ద్వారా ప్రభుత్వ శాఖలు అందించే పౌరసేవలను మరింత మెరుగుపరచాలని, అవసరమైన మార్పులు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. సోమవారం అమరావతిలోని తన క్యాంపు కార్యాలయంలో ‘రియల్ టైమ్ గవర్నెన్స్’ (ఆర్టీజీ)పై ఆయన ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. వెలిగొండ ప్రాజెక్టు ప్రారంభోత్సవం, అల్లూరి విమానాశ్రయం వంటి కార్యక్రమాలకు ప్రజలు పెద్దఎత్తున తరలివచ్చారని, ఇదే స్ఫూర్తిని ఇతర ప్రభుత్వ కార్యక్రమాల్లోనూ కొనసాగించి, ప్రజల భాగస్వామ్యాన్ని పెంచాలని సూచించారు.రాష్ట్రంలో పారిశుద్ధ్య నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలని, ఈ విషయంలో ఎలాంటి రాజీ పడే ప్రసక్తే లేదని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో పరిశుభ్రతపై ప్రజల్లో మరింత అవగాహన కల్పించాలన్నారు. ఇప్పటివరకు తాను 'స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర' కార్యక్రమంలో 20 సార్లు పాల్గొన్నానని గుర్తుచేశారు. ఇదే క్రమంలో సంక్షేమ హాస్టళ్లలో పారిశుద్ధ్య నిర్వహణను అత్యుత్తమంగా తీర్చిదిద్దాలని నిర్దేశించారు. ప్రతి నెలా మొదటి ఆదివారం విద్యార్థుల తల్లిదండ్రులను హాస్టళ్లకు ఆహ్వానించి, అక్కడి పరిస్థితులు, భోజనం, తాగునీటి సౌకర్యాలపై వివరించాలని సూచించారు. దీనివల్ల పారదర్శకత, జవాబుదారీతనం పెరుగుతాయన్నారు. అదేవిధంగా అన్నా క్యాంటీన్ల ద్వారా అన్నార్తులకు సాయం అందించే దాతలను గుర్తించి ప్రోత్సహించాలని పేర్కొన్నారు.ప్రభుత్వంలోని అన్ని శాఖలు తమ సేవలను పూర్తిగా ఆన్లైన్లోనే అందించాలని చంద్రబాబు ఆదేశించారు. రెవెన్యూ సహా అన్ని విభాగాలు ధ్రువపత్రాలను ఆన్లైన్లోనే జారీ చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. సమీకృత సేవల విధానం ద్వారా ప్రజలకు వేగంగా నిర్ణయాలు అందేలా చూడాలని అన్నారు. పనితీరు ఆధారంగా జిల్లా, నియోజకవర్గ స్థాయిలో బాధ్యులకు ర్యాంకులు ఇవ్వాలని

అది కేవలం నీటి ప్రవాహం కాదు, దశాబ్దాలుగా కరవు నేల చూస్తున్న కల సాకారమైన క్షణం. అందుకే, పరుగులు పెడుతున్న కృష్ణమ్మను చూసి అక్కడికి వచ్చిన జనం కేవలం కేరింతలు కొట్టడమే కాదు, ఆ నీటిని చేతులతో తాకి భక్తితో కళ్లకద్దుకున్నారు. ఎంతో పవిత్రంగా భావిస్తూ తలపై చల్లుకున్నారు. కొందరైతే తాము తెచ్చుకున్న బాటిళ్లలో ఆ పుణ్య జలాలను నింపుకుని ఇళ్లకు పట్టుకెళ్లారు. మార్కాపురం జిల్లాలోని వెలిగొండ ప్రాజెక్టు ప్రారంభోత్సవం సందర్భంగా కనిపించిన ఈ దృశ్యం, ఆ ప్రాంత ప్రజల గుండెల్లో కృష్ణా జలాలకు ఉన్న స్థానాన్ని, వారి నిరీక్షణ తీవ్రతను చెప్పకనే చెప్పింది.దశాబ్దాల నిరీక్షణకు తెరదించుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు సోమవారం వెలిగొండ ప్రాజెక్టు ఫేజ్-1ను ప్రారంభించారు. ఫీడర్ కెనాల్ గేట్లు ఎత్తి నల్లమల సాగర్‌లోకి కృష్ణా జలాలను విడుదల చేయడంతో ఆ ప్రాంతమంతా ఒక్కసారిగా జల సంబరంతో పులకించింది. ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న తమ కల కళ్లముందే ప్రవాహమై పరుగులెడుతుంటే, అక్కడికి తరలివచ్చిన రైతులు, మహిళలు, ప్రజల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి.గేట్లు ఎత్తగానే కృష్ణమ్మ పరుగులు పెడుతుంటే, ప్రజల ఈలలు, కేరింతలతో ఆ ప్రాంతమంతా దద్దరిల్లింది. చాలా మంది తమ సెల్ఫోన్లలో ఈ అపురూప దృశ్యాన్ని బంధించారు. తమ ప్రాంతానికి నీళ్లు వస్తాయో రావో అనే సందేహంతో బతికిన తాము, ఇప్పుడు కళ్లారా కృష్ణమ్మ పరవళ్లను చూస్తున్నామంటూ పలువురు రైతులు భావోద్వేగానికి గురయ్యారు. తమ జీవితాల్లో ఇదొక చారిత్రక మలుపు అని, తమ కరవు కష్టాలు తీరినట్టేనని ఆనందబాష్పాలతో తెలిపారు.సాధారణంగా సభ ముగియగానే జనం ఇళ్లకు

బీసీ డెడికేటెడ్ కమిషన్ గడువు పెంపు సెప్టెంబర్ 30 వరకు సమయం పెంపు స్థానిక ఎన్నికల రిజర్వేషన్లకు అత్యంత కీలకం BC Dedicated Commission: ఆంధ్రప్రదేశ్‌లోని స్థానిక సంస్థల్లో వెనుకబడిన తరగతుల (బీసీ) రాజకీయ ప్రాతినిధ్యం, సామాజిక-ఆర్థిక పరిస్థితులపై కీలక అధ్యయనం చేస్తున్న బీసీ డెడికేటెడ్ కమిషన్‌కు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. కమిషన్ (BC Dedicated Commission)పరిమితి గడువును పెంచుతూ కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ పొడిగింపు ద్వారా కమిషన్ తన సమగ్ర విచారణను, నివేదిక తయారీ ప్రక్రియను ఎలాంటి ఆటంకాలు లేకుండా పూర్తి చేసేందుకు మరింత సమయం లభించినట్లయింది. Cheyutha Pension: ‘చేయూత పెన్షన్ల’ లబ్ధిదారులకు బిగ్ రిలీఫ్.. దరఖాస్తు గడువు పెంపు రాజీవ్ రంజన్ మిశ్రా ఆధ్వర్యంలో సమగ్ర అధ్యయనం: బీసీ సంక్షేమ శాఖ ఈ గడువు పెంపునకు సంబంధించి అధికారికంగా 'జీవో ఎంఎస్ నంబర్ -11'ను విడుదల చేసింది. నూతన ఉత్తర్వుల ప్రకారం కమిషన్ కాలపరిమితిని ఈ ఏడాది సెప్టెంబర్ 30వ తేదీ వరకు పొడిగించారు. ప్రస్తుతం రిటైర్డ్ ఐఏఎస్ అధికారి రాజీవ్ రంజన్ మిశ్రా నేతృత్వంలో కొనసాగుతున్న ఈ కమిషన్, రాష్ట్రంలోని గ్రామ పంచాయతీలు, మండల పరిషత్‌లు, జిల్లా పరిషత్‌లతో పాటు మున్సిపాలిటీలు, నగర కార్పొరేషన్లలో బీసీల ప్రాతినిధ్యంపై క్షేత్రస్థాయిలో లోతైన అధ్యయనం జరుపుతోంది. స్థానిక ఎన్నికల రిజర్వేషన్లకు ఈ నివేదికే కీలకం: రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు తగిన ప్రాతినిధ్యం, సమగ్ర రిజర్వేషన్లను ఖరారు చేయడానికి ఈ కమిషన్ అందించే సిఫార్సులే అత్యంత కీలకం కానున్నాయి. వివిధ ప్రాంతాల్లో సేకరించిన సమాచారం, రాజకీయ వెనుకబాటుతనం ఆధారంగా కమిషన్ సమర్పించే నివేదికను బట్టే ప్రభుత్వం తదుపరి న్యాయపరమైన, రాజకీయ నిర్ణయాలు తీసుకోనుంది. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం తీసుకున్న గడువు పొడిగింపు నిర్ణయం తీవ్ర ప్రాధాన్యతను సంతరించుకుంది

పర్యావరణ పరిరక్షణను ఒక ప్రభుత్వ కార్యక్రమంగా కాకుండా ఇంటింటి ఉద్యమంగా మార్చి, గ్రామాలను స్వచ్ఛంగా, ఆరోగ్యవంతంగా తీర్చిదిద్దేందుకు 'నెట్‌జీరో' విధానాన్ని అమలు చేస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. కార్బన్ ఉద్గారాలను తగ్గించి, పర్యావరణహిత జీవనశైలిని ప్రోత్సహించడమే ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశమని ఆయన స్పష్టం చేశారు. శనివారం 'స్వర్ణాంధ్ర–స్వచ్ఛాంధ్ర' కార్యక్రమంలో భాగంగా అనకాపల్లి జిల్లా మాడుగుల నియోజకవర్గంలోని అలవరం కోడూరు గ్రామంలో సీఎం పర్యటించారు.ఈ సందర్భంగా, గ్రామంలో అమలు చేస్తున్న నెట్‌జీరో కార్యక్రమాల గురించి జిల్లా కలెక్టర్ విజయ కృష్ణన్ ముఖ్యమంత్రికి వివరించారు. ఇంటింటా సౌర విద్యుత్ వినియోగం, పరిశుభ్రమైన వంట విధానాలు, తడి చెత్తతో సేంద్రియ ఎరువుల తయారీ, మురుగునీటిని ఇంటి వద్దే శుద్ధి చేయడం వంటి పద్ధతుల ద్వారా గ్రామాలను ఎలా ఆదర్శంగా తీర్చిదిద్దుతున్నారో తెలిపారు.క్షేత్రస్థాయిలో కార్యక్రమాల పరిశీలనకార్యక్రమం అమలును క్షేత్రస్థాయిలో పరిశీలించేందుకు సీఎం చంద్రబాబు, గ్రామానికి చెందిన జె. మహేశ్వరరావు ఇంటిని సందర్శించారు. మహేశ్వరరావు కుటుంబం చేపడుతున్న పర్యావరణహిత కార్యక్రమాలను సీఎం ఆసక్తిగా అడిగి తెలుసుకున్నారు. వంటింటి నుంచి వెలువడే తడి వ్యర్థాలను ప్రత్యేక కంపోస్ట్ గుంతలో వేసి సేంద్రియ ఎరువుగా మార్చుతున్న విధానాన్ని వారు ముఖ్యమంత్రికి చూపించారు. దీనివల్ల ఎరువుల ఖర్చు తగ్గడమే కాకుండా, వ్యర్థాల నిర్వహణ భారం కూడా తగ్గుతుందని వివరించారు.అలాగే, ఇంటి నుంచి వెలువడే మురుగునీటిని బయటకు వదలకుండా, ఆవరణలోనే నిర్మించిన ఇంకుడు గుంతలోకి మళ్లిస్తున్న విధానాన్ని సీఎం పరిశీలించారు. ఈ 'ఇన్‌సిటు వేస్ట్‌వాటర్ మేనేజ్మెంట్' వల్ల రోడ్లపై మురుగు నిలవకుండా, దోమల బెడద తగ్గి, ఆరోగ్యకరమైన వాతావరణం

కె.కోటపాడు: అభివృద్ధి అంటే పరిశ్రమలు, పెట్టుబడులు, కంపెనీలే కాదు.. స్వచ్ఛమైన ప్రాంతాలని ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu) అన్నారు. స్వర్ణాంధ్ర- స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా అనకాపల్లి జిల్లా కె.కోటపాడు మండలం ఎ.కోడూరులో పర్యటించిన సీఎం.. ప్రజావేదికలో మాట్లాడారు. సెప్టెంబరు తొలివారంలోనే అనకాపల్లి, విశాఖకు గోదావరి జలాలు తీసుకొస్తామని ప్రకటించారు. మన ఊరు-మన బాధ్యత సంకల్పం అందరూ తీసుకోవాలని సూచించిన సీఎం.. స్వచ్ఛత కోసం ముందుకొస్తున్న ప్రతి ఒక్కరినీ అభినందించారు. ఆరోగ్యకర జీవనానికి స్వచ్ఛత మరింత అవసరమన్నారు. 2047 నాటికి మోదీ నాయకత్వంలో అగ్రదేశంగా వికసిత్ భారత్ వెలుగొందుతుందన్నారు. 2047కు తలసరి ఆదాయం రూ.50లక్షల వరకు పెరిగే అవకాశం ఉందని తెలిపారు. ‘‘విశాఖకు మించి అనకాపల్లికి పెట్టుబడులు వస్తున్నాయి. స్టీల్ సిటీ నిర్మాణం కాబోతోంది. డేటా సెంటర్లు వస్తున్నాయి. భవిష్యత్తులో నాలెడ్జ్ ఎకానమీకి కేంద్రంగా అనకాపల్లి మారబోతోంది. మంచి పనులు చేస్తుంటే అడ్డుకోవడానికి కొంతమంది ప్రయత్నిస్తున్నారు. గూగుల్ డేటా సెంటర్.. సుందరమైన విశాఖకు వస్తోంది. మన అభివృద్ధిని చూసి వేరే రాష్ట్రాలు ఆశ్చర్యపోతే.. ఇక్కడుండే కొద్దిమంది మాత్రం దుష్ప్రచారం చేస్తున్నారు. ఇంతవరకూ డేటా సెంటర్ ప్రారంభం కాలేదు.. అప్పుడే నీళ్లు ఇంకిపోయాయంటారు. తాగడానికి నీళ్లు లేవంటూ.. తప్పుడు ప్రచారం ప్రారంభించారు. డేటా సెంటర్ వస్తే లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయి. ఆదాయం కూడా ఆకాశమే హద్దుగా ఉండబోతుంది. అనకాపల్లి జిల్లాలోని ప్రతి చెరువు, రిజర్వాయర్ నింపే బాధ్యత మాది. ప్రతి గ్రామం జీరో వేస్ట్ పంచాయతీగా తయారు కావాలి. గత ఐదేళ్ల వైకాపా పాలనలో చెత్తమయం చేశారు. గుట్టలుగా పేరుకుపోయిన చెత్తను తొలగించే పనులు ఊపందుకున్నాయి. ప్రతి గ్రామానికి స్వచ్ఛరథాలను పంపుతున్నాం. ఇంటిపై సోలార్ ప్యానెల్ పెట్టుకుంటే ఒక్క రూపాయి ఖర్చు ఉండదు’’ అని సీఎం అన్నారు. రాష్ట్రమంత్రులు నారాయణ, కొల్లు రవీంద్ర, స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ఛైర్మన్ పట్టాభిరామ్ తదితరులు పాల్గొన్నారు. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి

మార్కాపురం, ప్రకాశం, నెల్లూరు, కడప జిల్లాల ప్రజల మూడు దశాబ్దాల చిరకాల స్వప్నం నెరవేరబోతోంది. ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న వెలిగొండ ప్రాజెక్టు మొదటి దశను ఆగస్టు 31వ తేదీన ప్రారంభించి నీటిని విడుదల చేయనున్నట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రకటించారు. శుక్రవారం తన క్యాంపు కార్యాలయంలో జరిగిన ఒక కార్యక్రమంలో, వెలిగొండ ప్రాజెక్టు నిర్వాసితులకు మూడో విడత పరిహారంగా రూ.250 కోట్ల చెక్కును ఆయన అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటున్నామని స్పష్టం చేశారు.48 రోజుల్లోనే రూ.768 కోట్ల పరిహారంకూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కేవలం 48 రోజుల్లోనే వెలిగొండ ప్రాజెక్టు నిర్వాసితులకు రికార్డు స్థాయిలో పరిహారం అందించింది. మూడు విడతల్లో మొత్తం 6,206 నిర్వాసిత కుటుంబాలకు రూ.768 కోట్లను ప్రభుత్వం చెల్లించింది. తొలి విడతలో 2,557 కుటుంబాలకు రూ.318 కోట్లు, రెండో విడతలో 1,622 కుటుంబాలకు రూ.200 కోట్లు అందించగా, శుక్రవారం మూడో విడతగా 2,027 కుటుంబాలకు రూ.250 కోట్లు సీఎం చేతుల మీదుగా అందజేశారు. నిర్వాసితులకు ఇంకా రూ.132 కోట్లు మాత్రమే చెల్లించాల్సి ఉందని అధికారులు తెలిపారు. ఈ ప్రాజెక్టు తొలిదశ పూర్తయితే 1.19 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు, సుమారు 4 లక్షల మందికి తాగునీరు అందుబాటులోకి వస్తుంది.గత ప్రభుత్వ డ్రామాలతోనే ఆలస్యం: సీఎంఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ.. "1996లో నేనే ఈ ప్రాజెక్టుకు రూపకల్పన చేసి శంకుస్థాపన చేశాను. ఇప్పుడు 2026లో నా చేతుల మీదుగానే ప్రారంభించడం నా అదృష్టం. గత రెండేళ్లలో రూ.2,250

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం వెలిగొండ ప్రాజెక్టును ఈ నెలాఖరులోగా ప్రారంభించుకోవాలని సంకల్పించింది. ఈ క్రమంలోనే పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్ట్ భూ నిర్వాసితులకు సంబంధించి ప్రభుత్వం శరవేగంగా కీలక నిర్ణయం తీసుకుంటుంది. వెలిగొండ ప్రాజెక్టు కారణంగా తమ భూములు ఇల్లు కోల్పోయిన నిర్వాసితులైన కుటుంబాలకు ఇప్పటికే రెండు విడతలుగా పరిహారం చెల్లింపులు చేసిన ప్రభుత్వం నేడు మూడో విడత పునరావాస పరిహారం పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టింది.మూడవ విడత కింద 2027 కుటుంబాలకు 250 కోట్ల రూపాయల పరిహారం ప్రకాశం జిల్లాలోని ముంపు ప్రాంతాలతో పాటు సమీప ప్రాంతాలలో ఉన్న ముంపు గ్రామాల బాధితులకు ఈ పరిహారం ద్వారా ఊరట కల్పించనుంది ఏపీ సర్కార్. ప్రభుత్వం ఇప్పటివరకు రెండు విడతల్లో 518 కోట్ల రూపాయలను చెల్లించినట్లు ప్రకటించింది. ఇప్పుడు మూడవ విడత కింద 2027 కుటుంబాలకు 250 కోట్ల రూపాయల విలువైన చెక్కులు అందించడానికి ఏర్పాట్లను పూర్తి చేసింది.నేరుగా చెక్కులు అందజేయనున్న సీఎం చంద్రబాబు ఈ క్రమంలో ఉండవల్లి లోని తన నివాసంలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు నిర్వాసిత కుటుంబాల ప్రతినిధులతో నేరుగా మాట్లాడి వారికి ఈ చెక్కులను అందజేయనున్నారు. ఈ కార్యక్రమం ద్వారా బాధితులకు ప్రభుత్వం న్యాయం చేస్తున్నట్లు అధికారిక వర్గాలు చెబుతున్నాయి.అయితే క్షేత్రస్థాయిలో కొంతమంది నిర్వాసితులు తమకు ఇంకా పూర్తి పరిహారం అందలేదని ఆందోళనలో ఉన్నారు. అధికారిక జాబితాలో తమ పేర్లు లేవని ఆందోళన వ్యక్తం చేస్తున్న వారు కూడా లేకపోలేదు.పూర్తిస్థాయి పరిహారంతో పాటు సరైన పునరావాసం కల్పించాలని డిమాండ్ పరిహారం అరకొరగా అందుతుందని అసంతృప్తి వ్యక్తం చేస్తున్న వారు కూడా ఉన్నారు. అర్హులైన ప్రతి కుటుంబానికి పూర్తిస్థాయి పరిహారంతో పాటు సరైన పునరావాసం కల్పించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం త్వరితగతిన పునరావాస ప్యాకేజీకి సంబంధించి బాధితులకు ఇవ్వాల్సిన పరిహారాన్ని పూర్తిచేసి వెలిగొండ ప్రాజెక్టును ప్రారంభించాలని నిర్ణయించింది.ఆదిలాబాద్ జిల్లా యువతకు శుభవార్త చెప్పిన తెలంగాణా సర్కార్.. ఐటీ ఉద్యోగాలు

ప్రముఖ నటుడు, మెగాస్టార్ చిరంజీవి తన పుట్టినరోజు జరుపుకుంటున్న సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆయనకు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ 'ఎక్స్' వేదికగా ఒక పోస్ట్ చేశారు. చిరంజీవి సినీ రంగంలో సాధించిన విజయాలను, ఆయన సామాజిక సేవను చంద్రబాబు ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు."ప్రముఖ చలనచిత్ర నటుడు, కేంద్ర మాజీ మంత్రి, పద్మభూషణ్ మెగాస్టార్ చిరంజీవి గారికి జన్మదిన శుభాకాంక్షలు. 1978లో తెలుగు చిత్రసీమలో అడుగు పెట్టి అంచెలంచెలుగా ఎదిగి ఎనలేని కీర్తి ప్రతిష్టలను, ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకుని మెగాస్టార్‌గా నిలిచారు" అని చంద్రబాబు తన పోస్ట్‌లో పేర్కొన్నారు.అంతేకాకుండా, చిరంజీవి సామాజిక స్పృహను కూడా చంద్రబాబు ప్రశంసించారు. "రక్తనిధి, నేత్ర నిధి ఏర్పాటు చేసి మానవత్వాన్ని చాటుకుని సమాజం పట్ల తన బాధ్యతను నెరవేరుస్తున్నారు. ఆయన ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని, సినీ ప్రేక్షకులను మరింతగా అలరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను" అని చంద్రబాబు ఆకాంక్షించారు. ప్రస్తుతం సినీ, రాజకీయ రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు చిరంజీవికి సోషల్ మీడియా ద్వారా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు

దశాబ్దాల నాటి వెలిగొండ ప్రాజెక్టు నిర్వాసితులకు అండగా నిలుస్తూ కూటమి ప్రభుత్వం మరో కీలక ముందడుగు వేసింది. సీఎం చంద్రబాబు నాయుడు మూడో విడత పునరావాస, పునర్నిర్మాణ (ఆర్ అండ్ ఆర్) ప్యాకేజీ కింద రూ.250 కోట్ల చెక్కును నిర్వాసిత కుటుంబాలకు అందించారు. ఈ నెల 31న వెలిగొండ ప్రాజెక్టు తొలి దశను ప్రారంభించనున్నట్లు ఈ సందర్భంగా ఆయన చారిత్రక ప్రకటన చేశారు. దీంతో ప్రకాశం జిల్లా పశ్చిమ ప్రాంత ప్రజల 30 ఏళ్ల కల సాకారం కానుంది.ఇప్పటికే రెండు విడతల్లో పరిహారం అందించిన ప్రభుత్వం, తాజాగా మూడో విడతలో 2,027 కుటుంబాలకు రూ.250 కోట్లు పంపిణీ చేసింది. దీంతో ఇప్పటివరకు మొత్తం 6,206 నిర్వాసిత కుటుంబాలకు రూ.768 కోట్ల మేర పరిహారం అందినట్లయింది. ప్రాజెక్టుకు సంబంధించి ఆర్ అండ్ ఆర్ పనులు 85 శాతం పూర్తయ్యాయని అధికారులు తెలిపారు. ప్రాజెక్టును త్వరగా పూర్తి చేసి నిర్వాసితులకు న్యాయం చేయడంలో ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని ఈ చర్యలు స్పష్టం చేస్తున్నాయి.ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ.. అసాధ్యమనుకున్న ప్రాజెక్టును సుసాధ్యం చేసి చూపిస్తున్నామన్నారు. "1996లో నేను శిలాఫలకం వేసిన ఈ ప్రాజెక్టును 2026లో ప్రారంభించుకోవడం నా అదృష్టం. గత రెండేళ్లలో రూ.2,250 కోట్లు ఖర్చు చేసి పనులను వేగవంతం చేశాం. ఎన్టీఆర్ ప్రారంభించిన అనేక ప్రాజెక్టులను పూర్తి చేసే అవకాశం నాకు దక్కింది" అని ఆయన గుర్తు చేసుకున్నారు.ఈ ఏడాది ఎల్ నినో ప్రభావంతో 50 శాతం లోటు వర్షపాతం ఉందని, శ్రీశైలం

మెగాస్టార్ చిరంజీవి ఇవాళ(ఆగస్టు 22) పుట్టిన రోజు జరుపుకొంటున్నారు. ఈ సందర్భంగా పలువురు సినీ, రాజకీయ క్రీడా ప్రముఖులు ఆయనకు బర్త్ డే విషెస్ చెబుతున్నారు. ఈ క్రమంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సోషల్ మీడియా వేదికగా చిరంజీవికి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. 'ప్రముఖ చలనచిత్ర నటుడు, కేంద్ర మాజీ మంత్రి, పద్మభూషణ్ మెగాస్టార్ చిరంజీవి గారికి జన్మదిన శుభాకాంక్షలు. 1978లో తెలుగు చిత్రసీమలో అడుగు పెట్టి అంచెలంచెలుగా ఎదిగి ఎనలేని కీర్తి ప్రతిష్టలను, ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకుని మెగాస్టార్ గా నిలిచారు. రక్తనిధి, నేత్ర నిధి ఏర్పాటు చేసి మానవత్వాన్ని చాటుకుని సమాజం పట్ల తన బాధ్యతను నెరవేరుస్తున్నారు. ఆయన ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని, సినీ ప్రేక్షకులను మరింతగా అలరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను' అని ఎక్స్ (ట్విట్టర్)లో రాసుకొచ్చారు చంద్రబాబు నాయుడు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరల్ గా మారింది. ఇక చిరంజీవి పుట్టిన రోజు సందర్భంగా సోషల్ మీడియాలో మెగాభిమానులు హంగామా చేస్తున్నారు. మెగాస్టార్ కు సంబంధించిన పాత సినిమాలు, ఫొటోలు, వీడియోలు షేర్ చేస్తూ బర్త్ డే విషెస్ చెబుతున్నారు. ప్రముఖ చలనచిత్ర నటుడు, కేంద్ర మాజీ మంత్రి, పద్మభూషణ్ మెగాస్టార్ చిరంజీవి గారికి జన్మదిన శుభాకాంక్షలు. 1978లో తెలుగు చిత్రసీమలో అడుగు పెట్టి అంచెలంచెలుగా ఎదిగి ఎనలేని కీర్తి ప్రతిష్టలను, ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకుని మెగాస్టార్ గా నిలిచారు. రక్తనిధి, నేత్ర నిధి ఏర్పాటు చేసి… — N Chandrababu Naidu (@ncbn) August 22, 2026 చిరంజీవి పుట్టిన రోజు.. ఆహా స్పెషల్ వీడియో

కేంద్ర రాజకీయాల్లో త్వరలో కీలక మార్పులు చోటుచేసుకునే అవకాశాలపై ఢిల్లీలో (Delhi) చర్చ జరుగుతోంది. కేంద్ర మంత్రివర్గంలో మార్పులు, విస్తరణకు సంబంధించిన ఊహాగానాల మధ్య కొన్ని రాష్ట్రాలకు కొత్త గవర్నర్లను నియమించే అంశం కూడా తెరపైకి వచ్చింది. ఈ క్రమంలో తెలుగుదేశం పార్టీ (TDP) నుంచి సీనియర్ నాయకుడికి రాజ్యాంగ పదవి దక్కవచ్చనే ప్రచారం రాజకీయ వర్గాల్లో ఆసక్తిని పెంచుతోంది. ఎన్డీఏ (NDA)లో టీడీపీ కీలక భాగస్వామిగా కొనసాగుతున్న నేపథ్యంలో ఆ పార్టీకి ప్రాధాన్యత ఇవ్వాలని కేంద్ర నాయకత్వం భావిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇందులో భాగంగా సీనియర్ నేత యనమల రామకృష్ణుడు (Yanamala Ramakrishnudu) పేరును ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) పరిశీలనకు ప్రతిపాదించినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే దీనిపై ఇప్పటివరకు అధికారికంగా స్పష్టత రాలేదు. గవర్నర్ పదవి ఖరారైందన్న వార్తలు కూడా ప్రస్తుతం రాజకీయ చర్చల స్థాయిలోనే ఉన్నాయి. యనమల రామకృష్ణుడు టీడీపీలో సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న నాయకుడు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్‌గా పనిచేసిన ఆయన, ఆ తర్వాత రాష్ట్ర మంత్రిగా కూడా బాధ్యతలు నిర్వహించారు. ముఖ్యంగా ఆర్థిక శాఖను నిర్వహించిన సమయంలో కీలక నిర్ణయాల్లో భాగస్వామిగా ఉన్నారు. శాసనసభ వ్యవహారాలు, రాజ్యాంగపరమైన అంశాలపై ఆయనకు ఉన్న అవగాహనను పార్టీ వర్గాలు ప్రస్తావిస్తున్నాయి. కొన్ని రాష్ట్రాల్లో గవర్నర్ల పదవీకాలం పూర్తవడం, మరికొన్ని చోట్ల రాజకీయంగా కీలకమైన పరిణామాలు చోటుచేసుకోవడం నేపథ్యంలో కేంద్రం కొత్త నియామకాలపై దృష్టి పెట్టినట్లు సమాచారం. ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh), కర్ణాటక (Karnataka), తమిళనాడు (Tamil Nadu), కేరళ (Kerala), బీహార్ (Bihar) వంటి రాష్ట్రాలకు సంబంధించి గవర్నర్ల మార్పుపై చర్చ సాగుతున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో యనమలకు ఏదైనా రాష్ట్ర గవర్నర్ బాధ్యతలు అప్పగిస్తే ఆయన అనుభవాన్ని ఉపయోగించుకోవచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా ఉత్తరప్రదేశ్ లేదా బీహార్ వంటి పెద్ద రాష్ట్రాలకు రాజ్యాంగ వ్యవహారాలపై అవగాహన ఉన్న వ్యక్తి అవసరమనే వాదన వినిపిస్తోంది

ఈనాడు, దిల్లీ: మార్గదర్శి ఫైనాన్షియర్స్ వ్యవహారంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు నిజాయతీకి దక్కిన మహోన్నత విజయమని పూర్వ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. ‘‘రామోజీరావు హిమాలయమంత ధైర్యం, ఆత్మవిశ్వాసంతో నిందారోపణలను ఎదుర్కొని సుదీర్ఘ న్యాయపోరాటం చేశారు. అంతిమంగా ధర్మమే గెలిచింది. సర్వోన్నత న్యాయస్థానం వెలువరించిన చరిత్రాత్మక తీర్పు నిజాయతీకి దక్కిన మహోన్నత విజయం’’ అని ఆయన శుక్రవారం ఎక్స్‌లో వెల్లడించారు. మార్గదర్శి మేనేజరుకు చిట్ వాయిదా చెక్కును అందజేస్తున్న ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, నిఖిలనాయుడు శ్రీకాకుళం పాతబస్టాండ్, న్యూస్‌టుడే: ఖాతాదారుల మనోభావాలను ప్రతిబింబించేలా మార్గదర్శి కేసులో సుప్రీంకోర్టు ధర్మాసనం తీర్పు ఇచ్చిందని ఏపీ ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు పేర్కొన్నారు. శ్రీకాకుళంలోని మార్గదర్శి కార్యాలయానికి శుక్రవారం కుటుంబసమేతంగా వచ్చిన ఆయన కేకు కోసి సిబ్బందికి స్వీట్లు పంచారు. మార్గదర్శి సంస్థలో పొదుపు చేసిన తన తొలి ఆదాయంతోనే వివాహానంతరం సొంతింటి కలను నెరవేర్చుకున్నానని గుర్తుచేసుకున్నారు. తమ కుటుంబ ఆర్థిక ఎదుగుదలలో మార్గదర్శి సోపానంగా నిలిచిందని పేర్కొన్నారు. ధర్మం, నిబద్ధత, నిజాయతీలే కొలమానంగా రామోజీ గ్రూపు సంస్థలు ఉన్నత విలువలతో నడుస్తాయనేది జగమెరిగిన సత్యమన్నారు. ప్రస్తుతం ఉద్యోగం చేస్తున్న తమ కుమార్తె నిఖిలనాయుడు రూ.25 లక్షల చిట్ గ్రూపులో చేరి బంధాన్ని మరింతగా బలపర్చిందన్నారు. ఏపీ సాంఘిక సంక్షేమ బోర్డు ఛైర్మన్ పోతుల బాలకోటయ్య ఈనాడు, అమరావతి: మార్గదర్శిపై ఉండవల్లి అరుణ్‌కుమార్ వేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టేయడాన్ని ఏపీ సాంఘిక సంక్షేమ బోర్డు ఛైర్మన్ పోతుల బాలకోటయ్య స్వాగతించారు. ‘ఈ తీర్పుతో ధీశాలి ఆత్మ స్వర్గాన సంతోషించి ఉంటుంది. 18 ఏళ్లుగా ఈకేసును అటూ ఇటూ తిప్పారు. పూటకో అబద్ధం వండి వార్చారు. కానీ చివరకు నమ్మకం, నిజాయతీ గెలిచాయి. అబద్ధం ఓడింది’ అని ఎక్స్‌లో పోస్టు చేశారు. సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి ఈనాడు, అమరావతి: లక్షల మంది డిపాజిటర్ల నమ్మకం పొందిన మార్గదర్శి ఫైనాన్సియర్స్‌ను భ్రష్టుపట్టించాలని కొందరు చేసిన కుట్రలు రెండు దశాబ్దాల న్యాయపోరాటంతో పటాపంచలయ్యాయని

విజయనగరం ఎంపీ, టీడీపీ నాయకుడు కలిశెట్టి అప్పలనాయుడు మార్గదర్శి సంస్థపై తనకున్న అచంచల విశ్వాసాన్ని, మద్దతును చాటుకున్నారు. శుక్రవారం ఆయన మార్గదర్శి కార్యాలయాన్ని సందర్శించి, తన కుమార్తె నిఖిల తొలి నెల వేతనంతో ఆమె పేరిట రూ. 25 లక్షల విలువైన చిట్ వేయించారు. ఈ సందర్భంగా ఆయన సిబ్బందికి మిఠాయిలు పంపిణీ చేసి తన సంతోషాన్ని పంచుకున్నారు.ఇటీవల మార్గదర్శి కేసులో సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పు పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే మార్గదర్శి కార్యాలయానికి విచ్చేసిన ఎంపీ కలిశెట్టి మాట్లాడుతూ, "సత్యం నిప్పు లాంటిది, ధర్మం ఎప్పుడూ గెలుస్తుంది" అని వ్యాఖ్యానించారు. నిజాయతీ, నిబద్ధత, పారదర్శకత, విశ్వసనీయత వంటి విలువల కారణంగానే ప్రజలు మార్గదర్శిపై అపారమైన నమ్మకం ఉంచుతున్నారని ఆయన కొనియాడారు.తాను సుమారు 20 ఏళ్ల క్రితమే మార్గదర్శి సంస్థకు మద్దతుగా ర్యాలీ నిర్వహించిన విషయాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేసుకున్నారు. సుప్రీంకోర్టు తీర్పుతో అంతిమంగా న్యాయమే గెలిచిందని, ఈ పరిణామంతో మార్గదర్శిపై ప్రజల్లో ఉన్న నమ్మకం మరింత బలపడిందని ఆయన పేర్కొన్నారు

ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, టెక్నాలజీ రంగంలో తీసుకొస్తున్న మార్పులు, అమరావతి అభివృద్ధి ప్రణాళికలను అమెరికాలోని ఐటీ పారిశ్రామికవేత్తలకు ఏపీ టెక్నాలజీ సర్వీసెస్ ఛైర్మన్ మన్నవ మోహన కృష్ణ వివరించారు. కూటమి ప్రభుత్వం విధానాలతో టెక్నాలజీ, పెట్టుబడులకు అనుకూల వాతావరణం క్వాంటం వ్యాలీతో అమరావతిని భవిష్యత్ టెక్నాలజీ కేంద్రంగా అభివృద్ధి చేసే ప్రణాళిక గ్లోబల్ టెక్నాలజీ సంస్థలు ఏపీలో తమ కార్యకలాపాలు విస్తరించేందుకు విస్తృత అవకాశాలు ప్రవాసాంధ్ర పారిశ్రామికవేత్తలు రాష్ట్ర ప్రగతిలో భాగస్వాములు కావాలి కొత్త పెట్టుబడులతో రాష్ట్ర యువతకు మరిన్ని ఉపాధి అవకాశాలు అమెరికా (న్యూజెర్సీ): ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, టెక్నాలజీ రంగంలో తీసుకొస్తున్న మార్పులు, అమరావతి అభివృద్ధి ప్రణాళికలను అమెరికాలోని ఐటీ పారిశ్రామికవేత్తలకు ఏపీ టెక్నాలజీ సర్వీసెస్ ఛైర్మన్ మన్నవ మోహన కృష్ణ వివరించారు. న్యూజెర్సీలో ప్రవాసాంధ్ర ఐటీ పారిశ్రామికవేత్తలతో జరిగిన సమావేశంలో రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలపై చర్చించారు. క్వాంటం వ్యాలీతో అమరావతికి కొత్త గుర్తింపు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దార్శనికత, ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ చొరవతో ఆంధ్రప్రదేశ్‌ను ఆధునిక టెక్నాలజీ రంగాల్లో ముందుకు తీసుకెళ్లేందుకు ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా పనిచేస్తోందని మన్నవ మోహన కృష్ణ తెలిపారు. అమరావతిలో ప్రతిష్ఠాత్మకంగా అభివృద్ధి చేయనున్న ‘క్వాంటం వ్యాలీ’ రాష్ట్ర టెక్నాలజీ ప్రస్థానంలో కీలక అడుగుగా నిలుస్తుందని ఆయన పేర్కొన్నారు. క్వాంటం కంప్యూటింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డీప్‌టెక్, పరిశోధన, ఆవిష్కరణల వంటి రంగాల్లో కొత్త అవకాశాలకు ఇది వేదికగా మారనుందని తెలిపారు. 'చంద్రబాబు నాయకత్వంలో గతంలో హైదరాబాద్ ఐటీ రంగంలో ప్రత్యేక గుర్తింపు సాధించింది. ఇప్పుడు అదే దార్శనికతతో అమరావతిని భవిష్యత్తు టెక్నాలజీకి కేంద్రంగా అభివృద్ధి చేసే అవకాశం మన ముందుంది. క్వాంటం వ్యాలీ ఈ ప్రయాణంలో కీలక భాగం' అని మన్నవ మోహన కృష్ణ అన్నారు. అంతర్జాతీయ సంస్థలతో భాగస్వామ్యాలు, అమరావతి అభివృద్ధి, క్వాంటం టెక్నాలజీ వంటి రంగాల్లో ప్రభుత్వం తీసుకుంటున్న

సముద్రంలో గల్లంతైన మత్స్యకారుల ఆచూకీ కోసం గాలింపు చర్యలు నిరంతరం కొనసాగుతున్నాయని రాష్ట్ర మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. మత్స్యకారుల ఆచూకీ తెలిసే వరకు అన్ని మార్గాల్లోనూ సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతుందని ఆయన తేల్చిచెప్పారు. స్పోర్ట్స్ డెస్క్: డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా ఓడలరేవు నుంచి 'ముత్యాలమ్మ' (IND-AP-E8-MO-135) బోటులో ఆగస్టు 3న చేపల వేటకు వెళ్లిన ఏడుగురు మత్స్యకారులు సముద్రంలో గల్లంతైన సంగతి తెలిసిందే. ఒడిశాలోని పారాదీప్ తీరం వద్ద ఒక పసుపు రంగు బోటును అధికారులు గుర్తించారు. ఈ ఘటనపై తాజాగా రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. సముద్రంలో గల్లంతైన మత్స్యకారుల ఆచూకీ కోసం గాలింపు చర్యలు నిరంతరం కొనసాగుతున్నాయని ఆయన స్పష్టం చేశారు. మత్స్యకారులను సురక్షితంగా వెనక్కి తీసుకొచ్చే వరకు అన్ని మార్గాల్లోనూ సెర్చ్ ఆపరేషన్ ఆపే ప్రసక్తే లేదని ఆయన తేల్చిచెప్పారు. ఈ గాలింపు చర్యల కోసం ఏకంగా 5 నౌకలు, 2 డోర్నియర్ విమానాలు, ఒక ప్రత్యేక హెలికాప్టర్‌ను రంగంలోకి దించినట్లు మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. గల్లంతైన బోటు వివరాలను మయన్మార్, పోర్ట్‌బ్లెయిర్, బంగ్లాదేశ్ కోస్ట్‌గార్డ్ అధికారులకు కూడా పంపించామని, సరిహద్దు తీరప్రాంతాల్లోనూ అప్రమత్తంగా ఉండాలని అధికారులను ఆదేశించినట్లు చెప్పారు. కేంద్ర కోస్ట్‌గార్డ్, నేవీ అధికారులతో ప్రభుత్వం నిరంతరం సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్తోందని తెలిపారు. ఈ నెల 24 తర్వాత కొత్త అధికారి బాధ్యతలు చేపట్టినప్పటికీ గాలింపు చర్యలు ఎలాంటి అంతరాయం లేకుండా కొనసాగుతాయని మంత్రి అచ్చెన్నాయుడు వెల్లడించారు. మత్స్యకారుల కుటుంబ సభ్యులు ధైర్యంగా ఉండాలని, ప్రభుత్వం వారి రక్షణకు అన్ని విధాలుగా కట్టుబడి ఉందని మంత్రి అచ్చెన్నాయుడు భరోసా కల్పించారు. అన్నవరం బస్టాండ్‌లో మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ఆకస్మిక తనిఖీలు.. అమరావతిలో SBI సిబ్బంది నివాస గృహ సముదాయానికి కీలక ముందడుగు

రైతులకు ప్రభుత్వం నుంచి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ వచ్చింది. ఈ ఏడాది వాతావరణంలో వస్తున్న విపరీతమైన మార్పులు, ఎల్ నినో భయాల నేపథ్యంలో పంటలకు బీమా చేయించుకోవడం చాలా అవసరమని ప్రభుత్వం చెబుతోంది. వాస్తవానికి ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన (PMFBY) కింద ప్రీమియం చెల్లించేందుకు ఆగస్టు 15వ తేదీతోనే గడువు ముగిసింది. కానీ, గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికీ చాలామంది రైతులు రిజిస్ట్రేషన్ చేసుకోలేకపోయారు. అందుకే అన్నదాతల క్షేమం కోసం ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. బీమా నమోదు గడువును ఈ నెలాఖరు వరకు, అంటే ఆగస్టు 31వ తేదీ వరకు పొడిగించింది. ఈ సంవత్సరం ఎల్ నినో ప్రభావం వల్ల వర్షాభావ పరిస్థితులు ఎదురయ్యే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఏ క్షణంలో వాతావరణం మారిపోతుందో, అకాల వర్షాలు ముంచెత్తుతాయో లేదా కరవు తాండవిస్తుందో చెప్పడం కష్టం. అసెంబ్లీలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు మాట్లాడుతూ.. రైతులెవరూ రిస్క్ తీసుకోవద్దని, వెంటనే బీమా ప్రక్రియ పూర్తి చేసుకోవాలని కోరారు. పంట చేతికి వచ్చే వరకు ఏ గ్యారెంటీ లేని ఈ రోజుల్లో పంటల బీమా అనేది రైతుకు ఒక సురక్షితమైన కవచంలా పనిచేస్తుందని స్పష్టం చేశారు. చాలామంది రైతులు ఇన్సూరెన్స్ అంటే వేలల్లో ఖర్చవుతుందని భయపడుతుంటారు. కానీ ఫసల్ బీమా యోజనలో రైతు చెల్లించాల్సిన ప్రీమియం చాలా చాలా తక్కువ. ఖరీఫ్ పంటలకు కేవలం 2 శాతం, రబీ పంటలకు 1.5 శాతం, వాణిజ్య పంటలకు 5 శాతం ప్రీమియం మాత్రమే చెల్లిస్తే సరిపోతుంది. ఉదాహరణకు రైతు వాటా అత్యంత స్వల్పంగా ఉంటే, మిగిలిన ప్రధానమైన ప్రీమియం మొత్తాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలే భరిస్తాయి. రూపాయి ఖర్చు పెద్దగా లేకుండా వేల రూపాయల నష్టపరిహారం పొందే అవకాశాన్ని అస్సలు వదులుకోవద్దని అధికారులు చెబుతున్నారు. రైతులు తమ సమీపంలోని సీఎస్ఈ (CSC) సెంటర్లు లేదా మీ సేవా

అన్నవరం ఆర్టీసీ బస్టాండ్‌ను మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా బస్టాండ్‌లో ప్రయాణికులతో మాట్లాడారు. స్త్రీ శక్తి ఉచిత బస్సు ప్రయాణ పథకంపై మహిళా ప్రయాణికుల అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. కాకినాడ, ఆగస్టు 21: అన్నవరం ఆర్టీసీ బస్టాండ్‌ను మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా బస్టాండ్‌లో ప్రయాణికులతో మాట్లాడారు. స్త్రీ శక్తి ఉచిత బస్సు ప్రయాణ పథకంపై మహిళా ప్రయాణికుల అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. స్త్రీ శక్తి పథకం అమలుపై మహిళా ప్రయాణికులు హర్షం వ్యక్తం చేశారు. సీఎం చంద్రబాబు నాయుడు సారథ్యంలో స్త్రీ శక్తి పథకం విజయవంతంగా అమలవుతోందని మహిళలు ప్రశంసలు కురిపించారు. అన్నవరం బస్టాండ్‌లో ప్రయాణికులకు అందుతున్న మౌలిక సదుపాయాలపైనా మంత్రి ఆరా తీశారు. ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా మెరుగైన సదుపాయాలు కల్పించాలని అధికారులకు మంత్రి సూచించారు. అనంతరం అన్నవరం ఆర్టీసీ క్యాంటీన్‌ను సందర్శించారు. ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లు, సిబ్బందితో కలిసి అల్పాహారం చేశారు. ఆర్టీసీ కార్మికులతో ఆత్మీయంగా మాట్లాడిన మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి.. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సుబ్రహ్మణ్యన్ చంద్రశేఖర్, ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ వర్ధంతి.. పవన్ కల్యాణ్ ఘన నివాళులు.. ఎంపీ అవినాశ్ రెడ్డికి షాక్.. ఇళ్లు, కార్యాలయాల్లో ఈడీ సోదాలు

ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వరలక్ష్మీ వ్రతం శుభాకాంక్షలు తెలిపారు. వరలక్ష్మీ దేవి ఆశీస్సులు ఏపీ ప్రజలందరిపై ఉండాలని ఆయన ఆకాంక్షించారు. పాడిపంటలు, సుఖసంతోషాలతో రాష్ట్రమంతా సంతోషంగా ఉండాలని దేవిని కోరుకున్నారు. అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వరలక్ష్మీ వ్రతం శుభాకాంక్షలు తెలిపారు. వరలక్ష్మీ దేవి ఆశీస్సులు ఏపీ ప్రజలందరిపై ఉండాలని ఆయన ఆకాంక్షించారు. పాడిపంటలు, సుఖసంతోషాలతో రాష్ట్రమంతా సంతోషంగా ఉండాలని దేవిని కోరుకున్నారు. ఈ పండుగ మహిళలందరికీ శుభాలు, శాంతిని చేకూర్చాలని ముఖ్యమంత్రి అభిలషించారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా సీఎం చంద్రబాబు పోస్టు చేశారు. 'వరలక్ష్మీ వ్రతం సందర్భంగా మీకు, మీ కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు. సిరిసంపదలకు, సౌభాగ్యానికి, సకల శుభాలకు అధిదేవతైన ఆ వరలక్ష్మీ దేవి దివ్య ఆశీస్సులు మన రాష్ట్ర ప్రజలందరిపై ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటున్నాను. పాడిపంటలతో, సుఖసంతోషాలతో రాష్ట్రం సుభిక్షంగా, సమృద్ధిగా ముందుకు సాగాలని ఆకాంక్షిస్తున్నాను. కుటుంబ సౌభాగ్యం కోసం శ్రమించే మహిళామూర్తులందరికీ ఈ పవిత్ర పండుగ విశేషమైన శుభాలను, శాంతిని ప్రసాదించాలని కోరుకుంటున్నాను. అందరికీ మరొక్క మారు వరలక్ష్మీ వ్రతం సందర్భంగా శుభాకాంక్షలు' అంటూ సీఎం చంద్రబాబు పోస్టు చేశారు. ఎంపీ అవినాశ్ రెడ్డికి షాక్.. ఇళ్లు, కార్యాలయాల్లో ఈడీ సోదాలు