
Wednesday Tv Movies: బుధవారం, Sep 16.. టీవీ తెలుగు సినిమాలు
september 16 wednesday tv movies list telugu channels బుధవారం టీవీ ముందు కూర్చొని మంచి సినిమా చూడాలనుకునే ప్రేక్షకుల కోసం తెలుగు ఛానళ్లు మరోసారి వినోదాల విందు సిద్ధం చేశాయి.

september 16 wednesday tv movies list telugu channels బుధవారం టీవీ ముందు కూర్చొని మంచి సినిమా చూడాలనుకునే ప్రేక్షకుల కోసం తెలుగు ఛానళ్లు మరోసారి వినోదాల విందు సిద్ధం చేశాయి.
4 గోల్డ్ మెడల్స్ సాధించిన అథ్లెట్.. కూరగాయలు అమ్ముతూ.. ట్రాజెడీ స్టోరీ.. దేశం గర్వపడేలా అంతర్జాతీయ వేదికలపై 4 సార్లు స్వర్ణ పతకాలు (గోల్డ్ మెడల్స్) సాధించిన భారత స్టార్ త్రోబాల్ ప్లేయర్ అమర్దీప్ కుమార్ నేడు తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నాడు. జార్ఖండ్ రాజధాని రాంచీ వీధుల్లో కుటుంబ పోషణ కోసం కూరగాయలు అమ్ముతూ, పార్ట్‌టైమ్ క్యాబ్ నడుపుకుంటున్నాడు. స్పోర్ట్స్ కోటా కింద ఉద్యోగం కోసం ప్రభుత్వ ఆఫీసుల చుట్టూ తిరిగినా ఫలితం లేకుండా పోయింది. మెడల్స్ వెనుక వేలాడుతుంటే కూరగాయలు అమ్ముతున్న అమర్దీప్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ వార్తకు సంబంధించిన

బిగ్ బాస్ తెలుగు 10వ సీజన్ మరో నాలుగు రోజుల్లో ప్రారంభం కాబోతుంది. వచ్చే ఆదివారం సాయంత్రం స్టార్ట్ కానుంది. దీనికి సంబంధించిన గ్రాండ్‌గా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇప్పటికే షూటింగ్ కూడా స్టార్ట్ చేసినట్టు తెలుస్తోంది. గత సీజన్ల కంటే ఈ సీజన్‌ని చాలా ప్రత్యేకంగా మార్చబోతున్నారట. హౌజ్ నుంచి, కంటెస్టెంట్ల ఎంపిక, వచ్చే కంటెస్టెంట్లు, గేమ్స్, టాస్క్ లు ఇలా అన్ని కొత్తగా ఉండబోతున్నాయని, ఎంటర్టైన్మెంట్ 10 టైమ్స్ అనేలా ప్లాన్ చేస్తున్నట్టు నాగార్జున ప్రోమోల్లో చెబుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో షో పై అందరిలోనూ ఆసక్తి నెలకొంది. ఈ సారి చాలా వరకు తెలిసిన కంటెస్టెంట్లని ఎంపిక చేశారట. సెలబ్రిటీ విభాగంలో చాలా వరకు తెలిసిన వాళ్లే వస్తున్నారని సమాచారం. గతంలో సగం తెలియని వారు ఉండేది. ఇన్ఫ్లూయెన్సర్లు, సినిమా, టీవీకి సంబంధం లేని వారు, ఇతర రంగాలకు చెందిన వాళ్లు ఉండేవారు. కానీ ఈ సారి చాలా వరకు ఎంటర్టైన్మెంట్ రంగానికి పరిచయం ఉన్నవాళ్లే వస్తున్నారట. అందులో ప్రముఖంగా కొన్ని పేర్లు వినిపిస్తున్నాయి. వీళ్లు ఆల్మోస్ట్ కన్ఫమ్ అంటున్నారు. ఈ సారి బిగ్ బాస్ హౌజ్‌లోకి సెలబ్రిటీలు, కామనర్స్ కలిపి దాదాపు 16 మంది కంటెస్టెంట్లు రాబోతున్నారట. వీరిలో పది మంది సెలబ్రిటీలు, 6 కామనర్స్ ఉంటారని సమాచారం. వీరిలో సెలబ్రిటీ విభాగంలో టెంపర్ వంశీ, రామ్ ప్రసాద్, జబర్దస్త్ నరేష్, అదిత్(త్రిగుణ్), యాంకర్ వర్షిణి సౌందరాజన్, ముఖేష్ గౌడ, కృష్ణుడు, నటి చైత్ర రాయ్, సుధీర్ రెడ్డి, దేబ్జానీ వంటి సెలబ్రిటీ కంటెస్టెంట్లు బిగ్ బాస్ హౌజ్‌కి ఎంపిక చేశారట. ప్రస్తుతం వీరి పేర్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇదే నిజమే అయితే హౌజ్ ఈ సారి యమ రంజుగా ఉండబోతుందని చెప్పొచ్చు. గ్లామర్‌కి గ్లామర్, కామెడీకి కామెడీ, ఫైట్లకి ఫైట్లు గట్టిగానే ఉంటాయని చెప్పొచ్చు. ఇక కామనర్స్ విభాగంలో సింగర్ ఝాన్సీ, రోహిత్, షాలిని
Deepa Jewellers IPO: జ్యువెలరీ రంగానికి చెందిన ప్రముఖ సంస్థ దీపా జ్యువెలర్స్ (Deepa Jewellers) పబ్లిక్ ఇష్యూకు ఇన్వెస్టర్ల నుంచి భారీ స్పందన వస్తోంది. సబ్స్క్రిప్షన్ మొదలైన రోజునే ఈ ఐపీఓ కోసం ఎగబడ్డారు. ప్రైమరీ మార్కెట్లో పసిడి వ్యాపార సంస్థలకు ఉన్న డిమాండ్ దృష్ట్యా ఈ ఐపీఓపై ప్రాఫిట్ మేకర్స్, రిటైల్ ఇన్వెస్టర్లు ఆసక్తి చూపిస్తున్నారు. గ్రే మార్కెట్లో కూడా ఈ ఐపీఓ షేర్లు మంచి ప్రీమియంతో ట్రేడ్ అవుతూ కనీసం 25 శాతం నుంచి 31 శాతం వరకు లిస్టింగ్ లాభాలను అందించవచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.ఐపీఓ కీలక వివరాలుదీపా జ్యువెలర్స్ పబ్లిక్ ఇష్యూ సబ్స్క్రిప్షన్ మొదటి రోజునే మంచి స్పందన లభించింది. 3 రెట్లకు పైగా సబ్‌స్క్రైబ్ అయింది. రిటైల్ ఇన్వెస్టర్ల విభాగంలో 3.04 రెట్లు, నాన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్ల విభాగం 2.21 రెట్ల మేర బిడ్లను పొందింది. ప్రస్తుతం గ్రే మార్కెట్లో ఒక్కో షేరుపై రూ.44 నుంచి రూ.55 వరకు ప్రీమియం పలుకుతోంది. దీనికి ఆధారంగా లిస్టింగ్ ధర సుమారు రూ.221 నుంచి రూ.232 మధ్య నమోదయ్యే అవకాశం ఉంది.ఈ ఐపీఓ ద్వారా కంపెనీ మొత్తం రూ.459.72 కోట్లు సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో రూ.250 కోట్ల విలువైన తాజా షేర్లను జారీ చేస్తుండగా మిగిలిన రూ.209.72 కోట్లు ఆఫర్ ఫర్ సేల్ రూపంలో విక్రయిస్తున్నారు. పరిశ్రమ సగటుతో పోలిస్తే పీఈ రేషియో 13.85 అధిక రిటర్న్ ఆన్ నెట్ వర్త్ 56.45 శాతం, కేవలం 18 రోజుల తక్కువ ఇన్వెంటరీ హోల్డింగ్ పీరియడ్ కంపెనీకి సానుకూల అంశాలుగా మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు. స్వల్పకాలిక లిస్టింగ్ లాభాల కోసం ఈ ఐపీఓకు దరఖాస్తు చేసుకోవచ్చని ప్రముఖ బ్రోకరేజీ సంస్థలు సూచిస్తున్నారు. ప్రైస్ బాండ్: రూ.168- రూ.177 లాట్ సైజ్: 84 షేర్లు (కనీస పెట్టుబడి రూ.14,868) సబ్స్క్రిప్షన్ తేదీలు: సెప్టెంబర్ 1 నుంచి సెప్టెంబర్ 3 అలాట్మెంట్
టీవీలో వినోదం అనేది ఎప్పుడూ దొరుకుతూనే ఉంటుంది. ఏ టైంలో అయినా సరే ఏ ఛానెల్ పెట్టినా బుల్లితెరపై ఛానెల్స్‌లో ఏదో ఒక సినిమా వస్తూనే ఉంటుంది. అలా బుల్లితెరపై 24 గంటలు వినోదానికి అయితే కొరత ఉండదు. ఇంట్లో ఉండే వారికి, మహిళలకు బుల్లితెర అనేది రిలాక్స్, ఎంటర్టైన్మెంట్ మోడ్‌ను ఇస్తుంది. ఇక రేపు అంటే గురువారం అన్ని ఛానెల్స్‌లో ప్రసారం అయ్యే సినిమాల లిస్ట్ ఓ సారి చూద్దాం.డీడీ యాదగిరి చానెల్లో మధ్యాహ్నం రెండు గంటలకు ఉడతా ఉడతా ఊచ్ రానుంది. ఈటీవీ ప్లస్‌లో రాత్రి తొమ్మిదిన్నరకి మీ శ్రేయోభిలాషి రానుంది. ఈటీవీలో మధ్యాహ్నం 12 గంటలకు, రాత్రి పదిన్నరకి సందడే సందడి రానుంది. ఈటీవీ సినిమాలో ఏడు గంటలకు ఓ చినదాన, ఉదయం 10 గంటలకు జగదేకవీరుని కథ, ఒంటి గంటకు మహానగరంలో మాయగాడు, సాయంత్రం నాలుగు గంటలకు మా ఆవిడ కలెక్టర్, ఏడు గంటలకు బలరామకృష్ణులు, రాత్రి పది గంటలకు గుండా, మిడ్ నైట్ ఒంటి గంటకు మళ్లీ ఓ చినదాన మూవీని రిపీట్ మోడ్‌లోనే ప్రసారం చేయనున్నారు.జెమినీ లైఫ్‌లో ఉదయం 11 గంటలకు 1940లో ఒక గ్రామం, సాయంత్రం నాలుగున్నరకి జగపతి చిత్రాలు రానున్నాయి. జెమిని టీవీలో ఉదయం 9 గంటలకు సాంబ, మూడు గంటలకు రచ్చ రానున్నాయి. జెమినీ మూవీస్‌లో మిడ్ నైట్ ఒకటిన్నరకి స్వప్నలోకం, ఉదయం నాలుగున్నరకి అందరూ దొంగలే, ఉదయం ఏడు గంటలకు రావుగారిల్లు, పది గంటలకు బిల్లా, ఒంటి గంటకు లోఫర్, నాలుగు గంటలకు పూలరంగడు, ఏడు గంటలకు సీమసింహం, రాత్రి పది గంటలకు వేటగాడు ప్రసారం కానున్నాయి.జీ తెలుగులో ఉదయం 9 గంటలకు నువ్వులేక నేనులేను, సాయంత్రం ఐదు గంటలకు పిండం రానున్నాయి. జీ సినిమాలు ఛానెల్లో ఉదయం 7 గంటలకు స్టూడెంట్ నెంబర్ 1, 9 గంటలకు మిస్టర్ మజ్ను, 12 గంటలకు హనుమాన్, 3 గంటలకు రంగ్

దార్ల హరీశ్.. జీ తెలుగు న్యూస్‌లో సీనియర్ కంటెంట్ ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. నా 8 ఏళ్ల అనుభవంలో ఈనాడు వంటి ప్రముఖ దినపత్రికతో పాటు ఈటీవీ భారత్‌లో పనిచేశాను. 2025 నుంచి ఎంటర్టైన్మెంట్, బిజినెస్, టెక్నాలజీ, హెల్త్, క్రీడలు, రాజకీయాలు వంటి వాటికి సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పనిచేసిన అనుభవం కలదు. Thalliki Vandanam 2026 Funds: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పేద విద్యార్థుల విద్యాభ్యాసానికి ఆర్థిక అడ్డంకులు లేకుండా చేయడమే లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం 'తల్లికి వందనం' పథకాన్ని అత్యంత ప్రాధాన్యతతో ముందుకు తీసుకెళ్తోంది. ఇప్పటికే ఈ విద్యాసంవత్సరానికి సంబంధించిన ప్రధాన విడత నిధులను అర్హుల ఖాతాల్లో విజయవంతంగా జమ చేసిన సంగతి తెలిసిందే. అయితే, నూతనంగా పాఠశాలలు, జూనియర్ కాలేజీలలో అడ్మిషన్లు పొందిన విద్యార్థులతో పాటు, అర్హత కలిగి ఉండి కూడా వివిధ సాంకేతిక సమస్యల వల్ల నిధులు అందుకోలేకపోయిన విద్యార్థులకు ప్రభుత్వం మరో సువర్ణావకాశాన్ని కల్పించింది. ముఖ్యంగా, ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో కొత్తగా ప్రవేశాలు పొందిన విద్యార్థులకు కూడా ఈ దఫాలోనే పథకం లబ్ధి చేకూరుతుంది. వాయిదా వెనుక కారణాలు నిజానికి, ఈ పెండింగ్ నిధులను ఆగస్టు 30వ తేదీనే లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేయాలని అధికారులు తొలుత ప్రణాళికలు సిద్ధం చేశారు. కానీ బ్యాంకులకు వరుసగా మూడు రోజుల పాటు సెలవులు రావడంతో ఆర్థిక లావాదేవీల ప్రక్రియకు సాంకేతిక అడ్డంకులు ఏర్పడ్డాయి. ఈ సెలవుల కారణంగా నిధుల జమ ఆలస్యం కాగా, అధికారులు తాజా షెడ్యూల్‌ను నిర్ధారించారు. దీని ప్రకారం, వచ్చే వారం అంటే సెప్టెంబర్ 7 లేదా 8వ తేదీల్లో అర్హులైన లబ్ధిదారుల తల్లుల బ్యాంక్ ఖాతాలకు నేరుగా నగదు బదిలీ చేయడానికి రాష్ట్ర ఆర్థిక శాఖ అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది. అర్హుల గుర్తింపు..పరిశీలన ప్రక్రియ.. గతంలో నిధులు అందని తల్లుల నుండి ప్రభుత్వం గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా
Ayodhya Ram Temple First CEO 2026 : దేశంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన అయోధ్య రామాలయ పరిపాలన పరిధిలో ఒక చారిత్రాత్మక ఘట్టం చోటుచేసుకోనుంది. ఆలయ నిర్వహణను మరింత సమర్థవంతంగా, పారదర్శకంగా మార్చే దిశగా రామాలయ తొలి చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సీఈఓ) ఎవరనే విషయాన్ని శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టు బుధవారం అధికారికంగా వెల్లడించనుంది. ట్రస్టు అధ్యక్షుడు నృత్య గోపాల్‌దాస్ నివాసంలో మధ్యాహ్నం నుంచి నిర్వహించే ముఖ్యమైన సమావేశంలో సీఈవో ఎంపిక కమిటీ తమ తుది నివేదికను సమర్పించనుంది.5,500కి పైగా దరఖాస్తులు.. ముగ్గురి పేర్లతో తుది జాబితా!ఆలయ తొలి సీఈవో స్థానం కోసం ఏకంగా 5,585 దరఖాస్తులు అందినట్లు నిపుణుల కమిటీ తెలిపింది. ఈ భారీ సంఖ్యలోని అభ్యర్థుల అర్హతలను నిశితంగా పరిశీలించిన ఎంపిక కమిటీ.. చివరి దశకు చేరుకున్న 16 మంది అభ్యర్థులకు వ్యక్తిగత ఇంటర్వ్యూలు నిర్వహించింది. రిటైర్డ్ జస్టిస్ ప్రమోద్ కొహ్లీ, రిటైర్డ్ ఎల్జీ విష్ణుకాంత్ చతుర్వేది, నిపుణులైన సురేష్ హావ్డేలతో కూడిన ఈ ప్రత్యేక కమిటీ సభ్యులు ఇప్పటికే అయోధ్యకు చేరుకుని సమావేశానికి సిద్ధమయ్యారు. వీరు ప్రతిపాదించిన ముగ్గురి పేర్లతో కూడిన షార్ట్‌లిస్ట్ నుంచి ఒకరి పేరును ట్రస్టు తుది నిర్ణయంగా ఖరారు చేయనుంది.రాజీనామాలు, ఖాళీల నేపథ్యంలో పునర్వ్యవస్థీకరణ..!ఇటీవల కాలంలో అయోధ్య రామాలయంలో భక్తులు అందించే కానుకలు, విరాళాల చోరీకి సంబంధించి తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తి వివాదాస్పదంగా మారిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ట్రస్టు ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్, అలాగే ట్రస్టీ అనిల్ మిశ్రాలు తమ పదవులకు రాజీనామాలు సమర్పించారు. మరోవైపు ట్రస్టు సభ్యుడిగా సుదీర్ఘ సేవలు అందించిన విమలేంద్ర మోహన్ ప్రతాప్ మిశ్ర అకాల మరణం చెందారు. ఇలా ఒకేసారి ఏర్పడిన మూడు కీలక పదవుల ఖాళీలను భర్తీ చేయడంతో పాటు ట్రస్టు ప్రధాన కార్యదర్శి, ఇద్దరు నూతన సభ్యుల పేర్లను కూడా ఈ సమావేశంలో స్పష్టం చేయనున్నారు.ముందువరుసలో జగదీశ్ ఆఫ్లే పేరుట్రస్టు తొలి

మంగళవారం రాత్రి అమెరికా దాడులు చేయడంతో ఇరాన్ కూడా ప్రతీకార దాడులకు దిగింది. ఇందుకు సంబంధించి ఇరాన్ మీడియాలో పలు కథనాలు వెలువడ్డాయి. ఇంటర్నెట్ డెస్క్: మంగళవారం రాత్రి అమెరికా దాడులు చేయడంతో ఇరాన్ కూడా ప్రతీకార దాడులకు దిగింది. ఇందుకు సంబంధించి ఇరాన్ మీడియాలో పలు కథనాలు వెలువడ్డాయి. ఇరాక్, జోర్డాన్‌పై ఇరాన్ ప్రత్యేక సైనిక దళం ఐఆర్జీసీ దాడి చేసింది. కువైత్, బహ్రెయిన్‌లో కూడా పేలుళ్లు సంభవించాయి. సిరిక్ ప్రాంతంలో అమెరికా దాడి వల్ల ఓ పెళ్లింట విషాదం సంభవించిందని ఇరాన్ మీడియా పేర్కొంది. ఓ చిన్నారి సహా నలుగురు మృతి చెందారని, 50 మంది గాయపడ్డారని తెలిపింది. తమపై దాడులకు తెగబడుతున్న అమెరికా చివరకు పశ్చాత్తాపం చెందక తప్పదని ఇరాన్ సైనిక దళం ఐఆర్జీసీ హెచ్చరించింది. హోర్ముజ్‌లో కమర్షియల్ నౌకలపై ఇరాన్ దాడి చేసే ప్రయత్నం చేయడంతోనే తాము దాడులు చేయాల్సి వచ్చిందని యూఎస్ సెంట్రల్ కమాండ్ తెలిపింది. మంగళవారం అర్ధరాత్రి నుంచి బుధవారం తెల్లవారుజాము వరకూ దాడులు కొనసాగాయని పేర్కొంది. ఇక తమ భూభాగం వైపు వస్తున్న 13 బాలిస్టిక్ మిసైల్స్‌ను మార్గమధ్యంలోనే ధ్వంసం చేశామని జోర్డాన్ మిలిటరీ పేర్కొంది. మరో మూడు మిసైల్స్ నిర్మానుష్య ప్రాంతంలో కూలిపోయాయని తెలిపింది. ఇరాన్ దాడుల వల్ల ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని చెప్పింది. బుధవారం ఉదయం ఇరాన్ ప్రయోగించిన పలు మిసైల్స్‌ను అడ్డుకున్నామని మరో ప్రకటనలో కువైట్ తెలిపింది. బహ్రెయిన్‌లో కూడా పేలుళ్లు సంభవించినట్టు తెలిసింది. అమెరికా దాడుల్లో చిన్నారి మరణించినట్టు ఇరాన్ మీడియాలో వార్తలు రావడంపై యూఎస్ సెంట్కామ్ ప్రతినిధి స్పందించారు. ఇరాన్ దళాల లాగా తాము సామాన్య పౌరులను ఏనాడు టార్గెట్ చేయలేదని స్పష్టం చేశారు. ఉక్రెయిన్‌పై రష్యా దాడిలో జగిత్యాల వాసి మృతి వియన్నా మ్యూజియంలో భారీ దోపిడీ.. రూ.38 కోట్ల విలువైన వజ్రాల హారం చోరీ

విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌లో ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ (SIR-స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్) గడువును రాష్ట్ర ఎన్నికల కమిషన్ పెంచింది. ఈ నెల 10 వరకు సర్ గడువు ఉంటుందని తెలిపింది. క్లెయిమ్స్, అభ్యంతరాల పరిష్కారానికి అక్టోబర్ 5 వరకు అవకాశం ఇస్తున్నట్లు పేర్కొంది. అక్టోబర్ 9న తుది ఓటర్ల జాబితా వెలువడనుంది. ట్రేడిషనల్ శారీలో బిగ్‌బాస్ బ్యూటీ ఆర్జే కాజల్.. ఫోటోలు మెరుపుతీగలా మారిపోయిన హెబ్బా పటేల్ (ఫొటోలు) తమిళ బ్యూటీ ఆండ్రియా పారిస్ ట్రిప్ (ఫొటోలు) హీరోగా రవితేజ తమ్ముడి కొడుకు.. 'మారెమ్మ' ట్రైలర్ లాంచ్ (ఫొటోలు) అనిరుధ్ కన్సర్ట్ కోసం జోనితా గాంధీ రెడీ అయిందిలా (ఫొటోలు) భువనగిరిలో ఉద్రిక్తత ఎమ్మెల్యే, సీఎం రేవంత్ ఫ్లెక్సీపై నల్ల రంగు పుష్ప శ్రీవాణి పై అంత నీచంగా ప్రవర్తిస్తారా? పోలీసుల ఓవర్ యాక్షన్... వరుదు కళ్యాణి అరెస్ట్ సుప్రీం కోర్టు కీలక నిర్ణయం..CJP నిరసనకారుల FIRలు రద్దు పవన్ కళ్యాణ్ బర్త్ డే ఫ్లెక్సీ..జనసేన,టీడీపీ మధ్య కొట్లా అడ్డంగా పడుకుని నీ పబ్లిసిటీ స్టంట్లు.. చంద్రబాబును ఏకిపారేసిన జడ శ్రవణ్

ఆంధ్రప్రదేశ్‌లో గ్రామపంచాయతీ ఎన్నికల నిర్వహణ దిశగా రాష్ట్ర ఎన్నికల సంఘం అతిపెద్ద కీలక అడుగు ముందుకు వేసింది. రాష్ట్రంలోని 13,278 గ్రామపంచాయతీల పరిధిలోని 1,33,128 వార్డులకు గాను మొత్తం 1,36,326 పోలింగ్ స్టేషన్లతో తుది జాబితాను అధికారికంగా విడుదల చేసింది. జిల్లా కలెక్టర్లు మరియు జిల్లా ఎన్నికల అధికారుల ఆమోదంతో ఈ ప్రక్రియను పూర్తయినట్లు స్పష్టం చేశారు. స్థానిక పోరుకు సంబంధించి అత్యంత ముఖ్యమైన పోలింగ్ కేంద్రాల ప్రక్రియ పూర్తి కావడంతో త్వరలోనే నోటిఫికేషన్ వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఈ తుది జాబితా రూపకల్పన వెనుక ఒక స్పష్టమైన టైమ్‌లైన్ మరియు నిబంధనావళిని ఎన్నికల సంఘం పక్కాగా అమలు చేసింది. ఆగస్టు 12న సర్క్యులర్ జారీతో ప్రారంభమైన ఈ ప్రక్రియలో ఆగస్టు 23న డ్రాఫ్ట్ జాబితా వెలువడింది. ఆగస్టు 26 వరకు అందిన అభ్యంతరాలు మరియు సూచనలను పరిశీలించిన తర్వాతే ఈ సెప్టెంబర్ 1న తుది జాబితా ఖరారైంది. ప్రతి వార్డుకు కనీసం ఒక కేంద్రం ఉండేలా ఓటర్ల సంఖ్యకు అనుగుణంగా అదనపు స్టేషన్లను సైతం అధికారులు సిద్ధం చేశారు. 2021లో ఎన్నికైన సర్పంచులు, వార్డు సభ్యుల పదవీకాలం 2026 ఏప్రిల్‌తో ముగియడంతో రాజ్యాంగం ప్రకారం ఎన్నికలు నిర్వహించడం అనివార్యంగా మారింది. దీంతో కొన్ని చోట్ల ఉన్న కోర్టు కేసులు, సరిహద్దుల మార్పులు, పట్టణ పరిధుల విస్తరణ లాంటి అడ్డంకులను దాటుకుంటూ ఈసీ వేగంగా చర్యలు చేపట్టింది. ఇదిలా ఉండగా రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేతా కలెక్టర్లు మరియు అధికారులతో వరుస సమీక్షలు నిర్వహిస్తూ ఏర్పాట్లను పరుగులు తీస్తున్నారు. పోలింగ్ కేంద్రాల ప్రకటనతో ఇక నోటిఫికేషన్, నామినేషన్ల ప్రక్రియకు మార్గం సుగమమైంది. రాజకీయంగా కూడా స్థానిక పోరు వేడి తీవ్రస్థాయికి చేరింది. ఫలితంగా అధికార టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి ప్రభుత్వం ఎన్నికలను త్వరితగతిన పూర్తి చేయాలని భావిస్తుండగా, వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి అన్ని స్థానాల్లో పోటీకి కేడర్‌ను సిద్ధం చేస్తున్నారు. ఈ

ఇలాంటి నక్లెస్ డిజైన్లు తక్కువ బడ్జెట్ లో, తక్కువ గ్రాముల్లోనే ఈజీగా లభిస్తాయి. కేవలం చీరల మీదకు మాత్రమే కాదు.. డ్రెస్సుల మీదకు కూడా ఇవి చాలా బాగుంటాయి. ఇది చాలా లైట్ వెయిట్ డిజైన్. చూడటానికి చాలా క్లాసీగా ఉంటుంది. పది గ్రాముల్లోపే మీకు ఈ నక్లెస్ ఈజీగా లభిస్తుంది. ఏడీ స్టోన్స్ తో చాలా అందంగా ఉంటుంది. ఇది కంటె డిజైన్ లో ఉంటుంది. ట్రెండీ దుస్తుల నుంచి.. ట్రెడిషనల్ దుస్తుల వరకు అన్నింటికీ ఇది బాగా సూట్ అవుతుంది. ఇది మంచి క్లాసీ లుక్ ఇచ్చే డిజైన్. మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ తో పెయిర్ చేస్తే… చాలా అందంగా ఉంటుంది. ఏ వయసు వారు అయినా దీనిని ట్రై చేయచ్చు. Gold Necklace: లైట్ వెయిట్ గోల్డ్ నెక్లెస్ లు.. ఎంత బాగున్నాయో! Rice Water: రైస్ వాటర్‌ని ఇలా వాడితే.. జుట్టు వద్దన్నా పెరుగుతుంది! Silver Anklets: పాదాల అందాన్ని పెంచే వెండి పట్టీలు.. చూస్తే కొనేస్తారు Gold Locket: 2 గ్రాముల్లో చైన్ కి అదిరిపోయే లాకెట్ డిజైన్లు
పవన్ కళ్యాణ్ బర్త్ డే సందర్భంగా రేపు (సెప్టెంబర్ 2) బుల్లితెరపై పవర్ స్టార్ సినిమాలు సందడి చేయబోతోన్నాయి. మామూలుగానే ఏ టైంలో అయినా సరే ఏ ఛానెల్ పెట్టినా బుల్లితెరపై ఛానెల్స్‌లో ఏదో ఒక సినిమా వస్తూనే ఉంటుంది. అలా బుల్లితెరపై 24 గంటలు వినోదానికి అయితే కొరత ఉండదు. ఇంట్లో ఉండే వారికి, మహిళలకు బుల్లితెర అనేది రిలాక్స్, ఎంటర్టైన్మెంట్ మోడ్‌ను ఇస్తుంది. ఇక రేపు అంటే బుధవారం అన్ని ఛానెల్స్‌లో ప్రసారం అయ్యే సినిమాల లిస్ట్ ఓ సారి చూద్దాం.డీడీ యాదగిరి చానెల్లో ఉదయం 9 గంటలకు హాలీవుడ్ తెలుగు డబ్డ్ మూవీ ద బాయూ, రెండు గంటలకు నువ్వెక్కడుంటే నేనక్కడుంటా రానున్నాయి. ఈటీవీ ప్లస్‌లో రాత్రి తొమ్మిదిన్నరకి బీరువా రానుంది. ఈటీవీలో మధ్యాహ్నం 12 గంటలకు, రాత్రి పదిన్నరకి సుస్వాగతం రానుంది. ఈటీవీ సినిమాలో ఏడు గంటలకు అల్లుడి కోసం, ఉదయం 10 గంటలకు మంచి మనుషులు, ఒంటి గంటకు పిల్ల నచ్చింది, సాయంత్రం నాలుగు గంటలకు అల్లరి ప్రేమికుడు, ఏడు గంటలకు సుస్వాగతం, రాత్రి పది గంటలకు కృష్ణ నటించిన శక్తి, మిడ్ నైట్ ఒంటి గంటకు మళ్లీ అల్లుడి కోసం మూవీని రిపీట్ మోడ్‌లోనే ప్రసారం చేయనున్నారు

బ్యాంకులు 14 రోజులు సెలవులు.. రాష్ట్రాల వారీగా పూర్తి హాలిడే లిస్ట్ ఏపీ, తెలంగాణ సహా ఈ రాష్ట్రాల్లో బ్యాంకులకు వరుస సెలవులు సెప్టెంబర్ హాలిడే లిస్ట్ ప్రకటించిన రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా September 2026 Bank Holidays : సెప్టెంబర్‌లో బ్యాంకు పనులు పెట్టుకున్నారా? అయితే, ఇది మీకోసమే.. ఈ నెలలో బ్యాంకింగ్ పనులు ఉన్నవారు ముందుగానే ఏ రోజు బ్యాంకులకు సెలవు ఉందో తెలుసుకోవడం బెటర్. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో పలు పండుగలు, ప్రత్యేక సందర్భాల్లో బ్యాంకు శాఖలకు సెలవులు ఉండనున్నాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ప్రకటించిన సెలవుల క్యాలెండర్ ప్రకారం.. అన్ని రాష్ట్రాల్లో ఒకే రోజున బ్యాంకులు మూతపడవు. స్థానిక పండుగలు, ప్రాంతీయ (September Bank Holidays) కార్యక్రమాలను బట్టి ఆయా రోజుల్లో సెలవుల్లో మార్పులు ఉంటాయి. సెప్టెంబర్‌లో వచ్చే వినాయక చవితితో పాటు ఇతర పండుగ సెలవులు, సాధారణ వారాంతపు సెలవులతో కలిపి కొన్ని రాష్ట్రాల్లో బ్యాంకులకు మొత్తం 14 రోజుల వరకు సెలవులు ఉండనున్నాయి. అయితే, ఈ బ్యాంకు సెలవులన్నీ దేశవ్యాప్తంగా ఒకేలా ఉండవు. మీరు ఉండే ప్రాంతంలో మీ హోం బ్యాంకు బ్రాంచ్ కు వెళ్లే ముందు బ్యాంకు సెలవు జాబితాను చెక్ చేసుకోవడం ఎంతైనా మంచిది. సెప్టెంబర్‌లో వీకెండ్ హాలిడేస్ ఇవే : సెప్టెంబర్ 2026లో 4 ఆదివారాలు, రెండో, నాల్గవ శనివారాలు కలిపి మొత్తం 6 జనరల్ హాలిడేస్ ఉన్నాయి. సెప్టెంబర్ 6 : ఫస్ట్ ఆదివారం సెప్టెంబర్ 12: రెండో శనివారం సెప్టెంబర్ 13: రెండో ఆదివారం సెప్టెంబర్ 20: మూడో ఆదివారం సెప్టెంబర్ 26: నాల్గవ శనివారం సెప్టెంబర్ 27: నాల్గవ ఆదివారం పండుగలు, ప్రత్యేక సెలవులివే : సెప్టెంబర్ 4 – జన్మాష్టమి : జన్మాష్టమి సందర్భంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కేరళ, కర్ణాటక, గుజరాత్, ఒడిశా, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్, బీహార్

రేణుక గొడుగు జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా 2024 నుంచి పనిచేస్తున్నారు. హెల్త్, లైఫ్‌స్టైల్, ఆస్ట్రోలజీ, బ్రేకింగ్, వైరల్ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన 6 ఏళ్ల అనుభవం ఉంది. New ATM Rules 2026: ఏటీఎం కార్డు వినియోగదారుల విషయానికి వస్తే, ఆర్బీఐ ఆమోదంతో వినియోగదారులపై అదనపు చార్జీల భారం పడనుంది. గతంతో పోలిస్తే ఇప్పుడు ఏటీఎం ఇంటర్‌ఛేంజ్ ఛార్జీలు పెరిగే అవకాశం ఉన్నందున, వినియోగదారుల ఇబ్బందులు మరింత పెరగవచ్చు. ఉదాహరణకు, మీరు మీ సొంత బ్యాంకు ఏటీఎం కాకుండా ఇతర బ్యాంకులకు చెందిన ఏటీఎం యంత్రాల వద్ద బ్యాలెన్స్ చెక్ చేయాలన్నా లేదా నగదు విత్ డ్రా చేయాలన్నా, వారు అధిక చార్జీలను వసూలు చేస్తారు. వైట్ లేబుల్ ఏటీఎం ఆపరేటర్లు కూడా ఆర్బీఐ ఆమోదంతో ఈ అదనపు భారాన్ని వినియోగదారులపై విధించనున్నారు. మీరు ఏటీఎం కార్డును తరచూ ఎక్కువగా ఉపయోగిస్తుంటే, కచ్చితంగా అదనపు ఖర్చులు ఎదుర్కోవాల్సి వస్తుంది. గతంలో ఈ ఛార్జీలను రూ.17 నుండి రూ.19 వరకు పెంచారు. కేవలం బ్యాలెన్స్ ఎంక్వైరీ చేసినా కూడా రూ.7 వరకు వసూలు చేసే అవకాశం ఉంది. గతంలో నెలకు ఒకసారిగా లావాదేవీల ఆధారంగా ఈ చార్జీలను వసూలు చేసేవారు. సాధారణంగా మెట్రో నగరాల్లో నివసించే కస్టమర్లకు ఐదు ఉచిత లావాదేవీలు లభిస్తే, నాన్-మెట్రో లేదా గ్రామీణ ప్రాంతాల్లో నివసించే వారికి మూడు ఉచిత లావాదేవీలు మాత్రమే చేసుకునే అవకాశం ఉంది. ఎంపీసీఐ (MPCI) ఆమోదం, ప్రస్తుత పరిస్థితి.. ప్రస్తుతం ఈ అదనపు చార్జీల విషయంలో ఆర్బీఐ ఆమోదం తెలిపింది. ఈ అంశం ప్రస్తుతం ఎంపీసీ ముందుకు వెళ్ళింది. ఏటీఎం ఆపరేటర్లు తమ నిర్వహణ ఖర్చులు పెరగడం వల్ల, పాత ధరల పద్ధతిని కాకుండా కొత్తగా ధరలను పెంచాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే, ఇప్పటివరకు ఆర్బీఐ మాత్రం ఎలాంటి అధికారిక

వ్యాపారవేత్తల్లో ఓ సంచలనం సృష్టించిన విజయ్ మాల్యా ప్రయాణం ఆధారంగా ఓ వెబ్ సిరీస్ తెరకెక్కుతోంది. ‘బిలియనీర్’ పేరుతో రూపొందుతున్న ఈ సిరీస్‌లో అర్జున్ రాంపాల్ కీలక పాత్ర పోషిస్తున్నారు. వ్యాపారవేత్తల్లో ఓ సంచలనం సృష్టించిన విజయ్ మాల్యా (Vijay Malya) ప్రయాణం ఆధారంగా ఓ వెబ్ సిరీస్ తెరకెక్కుతోంది. ‘బిలియనీర్’(Billionaire)పేరుతో రూపొందుతున్న ఈ సిరీస్‌లో అర్జున్ రాంపాల్ కీలక పాత్ర పోషిస్తున్నారు. నవంబర్‌లో ఈ ప్రాజెక్ట్ షూటింగ్ ప్రారంభం కానుంది. అయితే ఈ సిరీస్ ను విజయ్ మాల్యాకు సంబందించిన బయోపిక్‌గా భావించాల్సిన అవసరం లేదని మేకర్స్ చెబుతున్నారు. మాల్యా వ్యాపార ప్రయాణం, ఆయన ఎదుగుదల, ఆ తర్వాత చోటుచేసుకున్న పరిణామాల నుంచి స్ఫూర్తి తీసుకుని కథను కల్పిత రూపంలో రూపొందిస్తున్నట్లు మేకర్స్ వెల్లడించారు. సంపదతో పాటు పలుకుబడిని పెంచుకుంటూ తనదైన ప్రపంచాన్ని నిర్మించుకునే ఆ వ్యక్తి.. ఆశయం, అధికారం, విజయాల వెంట పరుగెత్తే క్రమంలో ఎదుర్కొనే సవాళ్లను కథలో ప్రధానంగా చూపించనున్నట్లు సమాచారం. ముఖ్యంగా అతని నిర్ణయాలు వ్యాపారంతో పాటు వ్యక్తిగత జీవితంపై ఎలాంటి ప్రభావం చూపించాయనే అంశం సిరీస్‌లో కీలకంగా ఉండనుంది. సంపద పెరిగేకొద్దీ పెరిగే ఆశలు, పలుకుబడితో మారే వ్యక్తిత్వం, వ్యాపార నిర్ణయాల ప్రభావం, కుటుంబ సంబంధాల్లో వచ్చే మార్పులు.. చివరకు తీసుకున్న కొన్ని నిర్ణయాలు అతడి సామ్రాజ్యాన్నే ఎలా కుదిపేశాయనే అంశాలను డ్రామాటిక్‌గా చూపించనున్నారట. అందువల్ల ఇది కేవలం ఓ వ్యాపారవేత్త కథగా కాకుండా అధికారం, ఆశ, విజయంతో పాటు పతనం చుట్టూ తిరిగే కథగా ఉండబోతుందని సమాచారం. ‘బిలియనీర్’కు హన్సల్ మెహతా, రాబీ గ్రెవాల్ దర్శకత్వం వహించనున్నారు. వాస్తవ ఘటనల నుంచి స్ఫూర్తి పొందిన కథలను సహజమైన పాత్రలతో, బలమైన డ్రామాతో చెప్పడంలో హన్సల్ మెహతాకు ప్రత్యేక గుర్తింపు ఉంది. దీంతో ఈ ప్రాజెక్ట్‌పై అంచనాలు పెరుగుతున్నాయి. ప్రస్తుతం సిరీస్ ప్రీ-ప్రొడక్షన్ దశలో ఉన్నట్లు తెలుస్తోంది. నవంబర్ 2026లో షూటింగ్ ప్రారంభించే అవకాశాలు ఉన్నట్లు సమాచారం

YS Jagan: స్థానిక సంస్థల ఎన్నికలకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇప్పటి నుంచే సన్నద్ధమవుతోంది. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సమర్థవంతంగా ఎదుర్కొనేలా పార్టీ శ్రేణులను సిద్ధం చేయడంపై అధిష్టానం దృష్టి సారించింది. ఇందులో భాగంగా ఈ నెల 25న వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి 175 నియోజకవర్గాల ఇంచార్జ్‌లతో కీలక సమావేశం నిర్వహించనున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల సన్నద్ధతపై నియోజకవర్గ ఇంచార్జ్‌లకు జగన్ దిశానిర్దేశం చేయనున్నారు. ఇదిలా ఉండగా, తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ ముఖ్య నేతలతో స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. రాబోయే నాలుగైదు రోజులు అత్యంత కీలకమని, అర్హులైన ఓట్లు తొలగిపోకుండా పార్టీ శ్రేణులు అప్రమత్తంగా వ్యవహరించాలని ఆయన సూచించారు. 17.29 లక్షల అనుమానాస్పద డూప్లికేట్ ఓట్లపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సజ్జల సూచించారు. బూత్ స్థాయిలో ప్రతి ఓటును పరిశీలించాలని, డూప్లికేట్ లేదా బోగస్ ఓట్లు ఉన్నట్లు గుర్తిస్తే వాటిపై అభ్యంతరాలు దాఖలు చేయాలని ఆదేశించారు. అదే సమయంలో అర్హులైన ఓటర్ల ఓట్లు తొలగిపోకుండా అవసరమైన ఫారాలను సమర్పించి వారి ఓట్లను కొనసాగించేలా చూడాలని స్పష్టం చేశారు. 44 లక్షల నోటీసుల అంశంపైనా క్షేత్రస్థాయిలో పూర్తిస్థాయి పరిశీలన చేపట్టాలని సజ్జల పార్టీ నేతలకు సూచించారు. అర్హులైన ఓటర్లకు సంబంధించిన అంశాల్లో అవసరమైన దరఖాస్తులు సమర్పించాలని, చిరునామా మార్పులు, ఇతర ఓటరు వివరాల సవరణలకు అవసరమైన ఫారాలను కూడా దాఖలు చేయాలని చెప్పారు.. అభ్యంతరాలు లేదా దరఖాస్తులు సమర్పించిన ప్రతిసారీ సంబంధిత అధికారుల నుంచి తప్పనిసరిగా రసీదు తీసుకోవాలని సజ్జల సూచించారు. భవిష్యత్ అవసరాల కోసం రసీదులు, సంబంధిత పత్రాలను భద్రపరచుకోవాలని పార్టీ శ్రేణులకు స్పష్టం చేశారు. ఓటర్ల జాబితాలకు సంబంధించిన ప్రధాన ప్రక్రియను ఆగస్టు 27, 28 తేదీల నాటికి పూర్తి చేయాలని సజ్జల ఆదేశించారు. రాష్ట్రానికి, ప్రాంతానికి బయట ఉన్న ఓటర్ల వివరాలపైనా ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. ఈ వ్యవహారంలో

School Holidays : ఇప్పటికే ఆగస్ట్ లో వరుస సెలవులు వచ్చాయి... ఇకపై కూడా ఈ హాలిడేస్ కొనసాగనున్నాయి. బోనాలు, స్వాతంత్య్ర దినోత్సవం, వరలక్ష్మి వ్రతం వంటి పర్వదినాలు ఆదివారంతో కలిసివచ్చాయి... దీంతో తెలుగు విద్యార్థులు, ఉద్యోగులకు ప్రతి వారం ఓ లాంగ్ వీకెండ్ వచ్చింది. ఇక ఈ నెలలో (ఆగస్ట్) కేవలం వారంరోజులే మిగిలివున్నాయి... ఇందులోనూ నాల్రోజుల సెలవులున్నాయి. కేవలం స్కూళ్లు, కాలేజీలకే కాదు ఆఫీసులకు కూడా సెలవులు రాబోతున్నాయి.. అంటే ఉద్యోగులకు కూడా పండగే అన్నమాట. మరి వచ్చేవారం ఏరోజు, ఎందుకు సెలవులు వస్తున్నాయో ఇక్కడ తెలుసుకుందాం. సాధారణంగా ప్రతి ఆదివారం దేశవ్యాప్తంగా అన్ని విద్యాసంస్థలు, కార్యాలయాలకు సాధారణ సెలవు ఉంటుంది. ఇలా రేపు (ఆగస్ట్ 23) ఆదివారమే కాబట్టి తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల్లో విద్యార్థులు, ఉద్యోగులకు సెలవు ఉంటుంది. ఐటీ, కార్పోరేట్ కంపెనీల ఉద్యోగులకు ప్రతి వీకెండ్ రెండ్రోజులు సెలవులుంటాయి... అంటే వారికి ఇవాళ (ఆగస్ట్ 22, శనివారం) కూడా సెలవే అన్నమాట. తెలుగు రాష్ట్రాల్లో చాలా విద్యాసంస్థలకు నేడు ప్రత్యేక సెలవు ఉంది. ఇలా విద్యార్థులు, ఉద్యోగులకు వరుసగా రెండ్రోజుల (ఆగస్ట్ 22, 23) సెలవులు వచ్చాయి. వచ్చేవారం మధ్యలో మరో సెలవు వస్తోంది. ముస్లింలు ఎంతో పవిత్రంగా భావించే మిలాద్-ఉన్-నబి ఆగస్ట్ 26న అంటే బుధవారం ఉంది. ఈరోజు తెలంగాణ ప్రభుత్వం అధికారిక సెలవుగా ప్రకటించింది... అంటే మధ్యలో కేవలం సోమ, మంగళవారం (ఆగస్ట్ 24,25) మాత్రమే వర్సింగ్ డేస్… తర్వాత మళ్ళీ హాలిడే. మిలాద్-ఉన్-నబి పండక్కి తెలంగాణలోని విద్యాసంస్థలతో పాటు ఉద్యోగులకు హాలిడేనే. సోదర సోదరీమణుల ప్రేమానురాగాల పండగ రాఖీ. అన్నాచెల్లి, అక్కాతమ్ముడు... ఇలా తోబుట్టువులు ఈ పండగను ఘనంగా జరుపుకుంటారు. శ్రావణ మాసంలో వచ్చే పౌర్ణమికి ఈ పండగ ఉంటుంది... ఈసారి ఆగస్ట్ 28 (గురువారం) రాఖీ పౌర్ణమి వస్తోంది. ఈ పండక్కి విద్యాసంస్థలకు అధికారిక సెలవు ఉంటుంది. అయితే ఉద్యోగులకు మాత్రం

క్యూర్ పరిధిలో ప్రభుత్వం నిర్మిస్తున్న ఇందిరమ్మ ఇళ్ల టవర్స్ అర్హుల జాబితా ఆగస్టు 25న ప్రకటించనున్నారు. హైదరాబాద్ సిటీ: క్యూర్ పరిధిలో ప్రభుత్వం నిర్మిస్తున్న ఇందిరమ్మ ఇళ్ల టవర్స్ అర్హుల జాబితా ఆగస్టు 25న ప్రకటించనున్నారు. 16 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 7,340 ఇళ్లకోసం హౌసింగ్ బోర్డుకు 60,720 దరఖాస్తులందాయి. వాటిలో సుమారు 40వేలకు పైగా దరఖాస్తులు అర్హత సాధించినట్లు తెలుస్తోంది. అర్హుల జాబితా వెబ్సైట్ క్యూర్ స్టేట్సలో అప్లికేషన్ /ఫోన్ నంబర్ ఆధారంగా స్టేటస్ తెలుసుకోవచ్చని అధికారులు పేర్కొన్నారు. అభ్యంతరాలుంటే ఆగస్టు 23 ఆదివారం సాయంత్రం లోగా వెబ్సైట్లో రిపోర్డు చేయవచ్చన్నారు. లాటరీకి అర్హత సాధించిన వారి తుది జాబితాను ఈ నెల 25న ప్రకటించి, ఆగస్టు 27 నుంచి 30 వరకు నియోజకవర్గాల వారీగా లాటరీ తీసి ఇళ్లు కేటాయించనున్నారు. మరింత పెరిగిన బంగారం ధరలు.. ఈ రోజు మీ నగరంలో పసిడి ధరలు ఎలా ఉన్నాయంటే

ఓర్మాక్స్ మీడియా ప్రతి నెల సినిమాలకు సంబంధించిన ఇండియా టాప్ 10 లిస్ట్ విడుదల చేస్తుంటుంది. ఇందులో హీరోలు, హీరోయిన్లు, సినిమాలు, పాటలు, ఓటీటీలో ట్రెండ్ అయ్యే చిత్రాలుంటాయి. అందులో భాగంగా హీరోయిన్లకి సంబంధించిన జులై లిస్ట్ ని తాజాగా విడుదల చేసింది. ఇందులో ఇద్దరు హీరోయిన్ల ప్లేసులు తారుమారు అయ్యాయి. ముఖ్యంగా నేషనల్ క్రష్ రష్మిక మందన్నా దారుణంగా పడిపోయింది. శ్రీలీల అసలులిస్ట్ లోనే లేదు. కానీ నయనతార, త్రిష మాత్రం దుమ్ములేపారు. టాప్‌లోకి దూసుకొచ్చారు. మరి సమంత, కాజల్, సాయిపల్లవి, దీపికా, అలియా భట్ వంటి వారి స్థానాలు ఏంటనేది చూద్దాం. ఇండియా వైడ్‌గా టాప్ 10లో మొదటి స్థానంలో సమంత నిలిచారు. ఆమెకి మొదటి స్థానంలో తిరుగులేదని చెప్పొచ్చు. హీరోల్లో ప్రభాస్ మాదిరిగానే సమంత స్థానంలో మార్పు ఉండటం లేదు. మధ్యలో ఒకటి రెండు నెలలు డౌన్ అయ్యారు. కానీ ఇప్పుడు మళ్లీ పుంజుకొని తన ప్లేస్‌ని పదిలంగా ఉంచుకుంటున్నారు. ఇటీవల సమంత `మా ఇంటి బంగారం` చిత్రంతో విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆమె ప్రెగ్నెంట్‌గా ఉన్నారు. బేబీ బంప్స్ తో సోషల్ మీడియాలో సందడి చేస్తున్నారు. వెకేషన్స్ ని ఎంజాయ్ చేస్తున్నారు. రెండో స్థానంలో అలియాభట్ ఉన్నారు. ఈమె స్థానంలో కూడా పెద్దగా మార్పు ఉండటం లేదు. ఆ తర్వాత మూడో స్థానంలో దీపికా పదుకొనె ఉన్నారు. ఊహించని విధంగా నాల్గో స్థానంలోకి నయనతార రావడం విశేషం. గతంలో ఆమె టాప్ 5లో కూడా ఉండేది కాదు, కానీ ఇప్పుడు ఏకంగా టాప్ 4కి రావడం విశేషం. అయితే టాప్ 4లో ఉండాల్సిన రష్మిక మందన్నా మాత్రం డౌన్ అయ్యారు. ఆమె ఏడో స్థానానికి పడిపోవడం గమనార్హం. ఇది ఆమెకి పెద్ద షాక్ అనే చెప్పాలి. ఇక ఐదో స్థానంలో కాజల్ అగర్వాల్ ఉన్నారు. ఈమె సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుంది. సినిమాలు లేకపోయినా.. నెట్టింట

ఓర్మాక్స్ మీడియా జులై నెలకు సంబంధించి ఇండియా మోస్ట్ పాపులర్ టాప్ 10 హీరోల జాబితాని విడుదల చేసింది. ఇందులో సరికొత్త మార్పులు చోటు చేసుకున్నాయి. అల్లు అర్జున్ దుమ్ములేపారు. ఎన్టీఆర్ మళ్లీ లిస్ట్ లోకి రాగా, రామ్ చరణ్‌కి పెద్ద షాక్ ఇచ్చారు మహేష్ బాబు. అదే సమయంలో సూర్య తన సత్తాని చాటుకున్నారు. మరి ఇండియాలో టాప్ హీరో ఎవరనేది, టాప్ 10 లిస్ట్ లో ఎవరున్నారనేది చూస్తే. మొదటిస్థానం గురించి అందరు మర్చిపోవాల్సిందే. ఎందుకంటే ఆ స్థానంలో ఒక్కరే ఉన్నారు. ఒక్కరే శాసిస్తున్నారు. ఆయనే ప్రభాస్. చాలా కాలంగా ఆయన మొదటి స్థానంలో ఉన్నారు. ఇప్పుడు కూడా నెంబర్ 1గా నిలిచారు. తనదైన ఇమేజ్, పాపులారిటీ, భారీ సినిమాలతో నిత్యం చర్చల్లో ఉంటారు ప్రభాస్. దీంతో నెంబర్ 1గా రాణిస్తున్నారు. మిగిలిన హీరోల స్థానాలు నిత్యం మారుతూనే ఉన్నాయి. కానీ తన స్థానంలో మార్పు లేదని చెప్పొచ్చు. ప్రస్తుతం ఆయన `ఫౌజీ`, `స్పిరిట్` చిత్రాల్లో నటిస్తున్నారు. రెండో స్థానంలో కోలీవుడ్ స్టార్, తమిళనాడు సీఎం విజయ్ ఉన్నారు. ఆయన జూన్‌లో మూడో స్థానంలో ఉండగా, ఇప్పుడు రెండో స్థానంలోకి వచ్చారు. అదే సమయంలో నాల్గో స్థానంలో ఉన్న అల్లు అర్జున్ మూడో స్థానంలోకి దూసుకొచ్చారు. బాలీవుడ్ స్టార్ షారూఖ్ ఖాన్‌కి పెద్ద షాక్ ఇచ్చారు. ఈ ఇద్దరు రెండు మూడు స్థానాల్లోకి రావడంతో షారూఖ్ నాల్గో స్థానంలోకి పడిపోయారు. బన్నీ ప్రస్తుతం `రాకా`లో నటిస్తున్నారు. ఐదో స్థానంలోకి సూపర్ స్టార్ మహేష్ బాబు వచ్చారు. ఆయన జూన్‌లో ఆరో స్థానంలో ఉన్నారు. కానీ జులైలో రామ్ చరణ్‌కి ఝలక్ ఇస్తూ 5వ స్థానంలోకి రావడం విశేషం. రామ్ చరణ్ గురించి గత నెలలో పెద్దికి సంబంధించిన చర్చ జరిగినా కూడా ఆయన పడిపోవడం గమనార్హం. అదే సమయంలో ఎలాంటి చర్చ లేకుండా మహేష్ బాబు ఒక్క స్థానం మెరుగుపడ్డారు. ఐదో

భారత స్టార్ బ్యాడ్మింటన్ డబుల్స్ జోడీ సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి–చిరాగ్ శెట్టి ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో మరో పతకం సాధించాలన్న ఆశలు క్వార్టర్ ఫైనల్లోనే ముగిశాయి. చైనాకు చెందిన ప్రపంచ నంబర్-3 జోడీ లియాంగ్ వీ కెంగ్–వాంగ్ చాంగ్ చేతిలో భారత జంట వరుస గేముల్లో ఓటమి పాలైంది. ఇంటర్నెట్ డెస్క్: భారత స్టార్ బ్యాడ్మింటన్ డబుల్స్ జోడీ సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి–చిరాగ్ శెట్టి ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో మరో పతకం సాధించాలన్న ఆశలు క్వార్టర్ ఫైనల్లోనే ముగిశాయి. శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో చైనాకు చెందిన ప్రపంచ నంబర్-3 జోడీ లియాంగ్ వీ కెంగ్–వాంగ్ చాంగ్ చేతిలో భారత జంట వరుస గేముల్లో ఓటమి పాలైంది. ప్రపంచ నంబర్-5గా ఉన్న సాత్విక్–చిరాగ్ 36 నిమిషాల్లో 18–21, 9–21 తేడాతో పరాజయం చవి చూశారు. మ్యాచ్ ఆరంభం నుంచే ఆశించిన స్థాయిలో పదును చూపలేకపోయిన భారత జోడీ.. రెండో గేమ్‌లో పూర్తిగా వెనుకబడింది. 2022, 2025 ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లలో కాంస్య పతకాలు సాధించిన సాత్విక్–చిరాగ్.. ఈసారి మూడో పతకంపై ఆశలు పెట్టుకున్నారు. అయితే పారిస్ ఒలింపిక్స్ రజత పతక విజేతలైన లియాంగ్–వాంగ్ జోడీ ముందు భారత జంటకు ఎదురుదెబ్బ తగిలింది. కుల్దీప్ యాదవ్‌పై వారికి నమ్మకం లేదు.. అశ్విన్ ఘాటు వ్యాఖ్యలు ఒక్క మ్యాచ్‌తో కుల్దీప్ సామర్థ్యాన్ని అంచనా వేయొద్దు: స్పిన్ కోచ్ బహుతులే
బుల్లితెరపై 24 గంటలు వినోదానికి కొరత ఉండదు. ఎప్పుడు ఏ ఛానెల్ పెట్టినా ఏదో ఒక సినిమా ఛానెల్లో వస్తూనే ఉంటుంది. ఇంట్లో ఉండే వారికి, మహిళలకు టీవీ అనేది రిలాక్స్, ఎంటర్టైన్మెంట్ మోడ్‌ను ఇస్తుంది. ఇక సపరేట్గా సినిమాల కోసమే కొన్ని ఛానెల్స్ ఉంటాయి. మరి రేపు అంటే శనివారం (ఆగస్ట్ 22) ప్రసారం అయ్యే సినిమాల లిస్ట్ ఓ సారి చూద్దాం.డీడీ యాదగిరి చానెల్లో ఉదయం 9 గంటలకు హాలీవుడ్ తెలుగు డబ్డ్ మూవీ పారాడాక్స్ ఎఫెక్ట్, రెండు గంటలకు కొండవీటి దొంగ రానుంది. ఈటీవీలో 9 గంటలకు, 12 గంటలకు కూడా శ్రీ మంజునాథ రిపీట్ మోడ్‌లో రానున్నాయి. ఈటీవీ ప్లస్‌లో మధ్యాహ్నం 3 గంటలకు మహానగరంలో మాయగాడు, రాత్రి తొమ్మిదిన్నరకి మా ఆవిడ కలెక్టర్ రానుంది. ఈటీవీ సినిమాలో ఉదయం 7 గంటలకు చంటబ్బాయ్, 10 గంటలకు రిక్షావోడు, ఒంటి గంటకు దొంగ మొగుడు, 4 గంటలకు కొదమ సింహం, 7 గంటలకు శ్రీ మంజునాథ, 10 గంటలకు రుస్తుం, మిడ్ నైట్ ఒంటి గంటకు చంటబ్బాయ్ రానుంది.జెమినీ టీవీలో ఉదయం 9 గంటలకు శంకర్ దాదా ఎంబీబీఎస్, మూడున్నరకి గ్యాంగ్ లీడర్.. జెమినీ లైఫ్‌లో ఉదయం 11 గంటలకు గూఢాచారి నంబర్ 1, నాలుగున్నరకి ప్రేమగోల, జెమినీ మూవీస్‌లో మిడ్ నైట్ ఒకటిన్నరకి మూగ నోము, ఉదయం నాలుగున్నరకి చాణక్య శపథం, 7 గంటలకు స్వయం కృషి, 10 గంటలకు బిందాస్, ఒంటి గంటకు మనసంతా నువ్వే, నాలుగు గంటలకు లంకేశ్వరుడు, 7 గంటలకు బావగారు బాగున్నారా, 10 గంటలకు గాయం ప్రసారం కానున్నాయి.జీ తెలుగులో ఉదయం మూడు గంటలకు సుప్రీమ్, 9 గంటలకు సిరై రానుంది. జీ సినిమాలు ఛానెల్లో ఉదయం 3 గంటలకు రెడీ, 7 గంటలకు సుడిగాడు, 9 గంటలకు అఆ, 12 గంటలకు హత్య, 3 గంటలకు తంత్ర, ఆరుగంటలకు ఇంద్ర

హైదరాబాద్ నగరంలో అత్యధిక ఓటర్లు ఉన్న జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఇప్పుడు తన స్థానాన్ని చేజార్చుకునేలా కనిపిస్తోంది. జూబ్లీహిల్స్‌లో 1,816 మంది అధికంగా మహిళలు హైదరాబాద్: హైదరాబాద్ నగరంలో అత్యధిక ఓటర్లు ఉన్న జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఇప్పుడు తన స్థానాన్ని చేజార్చుకునేలా కనిపిస్తోంది. సుమారు నాలుగు లక్షలకు పై చిలుకు ఉన్న ఓటర్ల సంఖ్య గణనీయంగా తగ్గింది. సుమారు 44.19 శాతం ఓట్లు జాబితా నుంచి కనుమరుగు కావడంతో వాటిలో కొన్ని ఓట్లైనా తిరిగి రాబట్టుకునేలా కార్యచరణ చేసుకునేందుకు రాజకీయ శిబిరాలు ప్రయత్నాలు ఆరంభించాయి. కేంద్ర ఎన్నికల సంఘం ఎస్ఐఆర్ జాబితాను ఇటీవల ప్రచురించింది. దీని ప్రకారం జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో 1.79 లక్షల ఓట్లు గల్లంతయ్యాయి. అత్యధిక ఓట్లు తొలగించబడిన నియోజకవర్గాల్లో జూబ్లీహిల్స్ మూడోస్థానంలో నిలిచింది. పేరుకు జూబ్లీహిల్స్ అయినప్పటికీ నియోజకవర్గంలో బస్తీలు అత్యధికంగా ఉన్నాయి. మాస్ ఓటర్ల సంఖ్యే ఎక్కువ. ప్రతీ యేట ఇక్కడ ఓటర్ల సంఖ్య పెరుగుతూ వచ్చింది. కేవలం ఐదు సంవత్సరాల వ్యవధిలో సుమారు 79 వేల ఓటర్లు పెరిగారు. ఇక్కడ ఉన్న వారిలో చాలామంది ఇతర రాష్ట్రాలు, జిల్లాల నుంచి వలస వచ్చిన వారే అధికంగా ఉన్నారు. ఎస్ఐఆర్ ప్రకారం ఒకరికి ఒకే ఓటు అని అధికారులు తేల్చి చెప్పారు. దీంతో మెజారిటీ ఓటర్లు పుట్టిన ఊర్లో ఓటు ఉంచుకునేందుకు మొగ్గు చూపించారు. దీంతో ఓటు శాతం గణనీయంగా తగ్గింది. ఏకంగా 1.48 లక్షల మంది తమ ఓటును నియోజకవర్గం నుంచి వేరే చోటకు పెట్టుకున్నట్టు షిఫ్టింగ్ జాబితా ప్రకారం తెలుస్తోంది. అంతేగాకుండా ఇక్కడ హాస్టళ్లు కూడా ఎక్కువ ఉండడంతో చాలామంది స్థానిక చిరునామా కోసం ఓటరు కార్డులు చేయించుకున్నారు. ఇవి కూడా ఇప్పుడు తరలి పోయాయని లెక్కలు చెబుతున్నాయి. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో మొత్తం ఓటర్ల సంఖ్య 2,27,219. ఇక్కడ పురుషుల కంటే మహిళలే 1,816 మంది ఎక్కువగా ఉన్నారు. పురుషులు 1,12,697 మంది ఉండగా, మహిళలు 1,14,513 మంది

తాజాగా మాజీ మంత్రి హరీష్ రావు చేసిన సంచలన వ్యాఖ్యలు, రాహుల్ గాంధీకి రాసిన లేఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని బర్తరఫ్ చేయాలని పేర్కొనడం ఇప్పుడు తెలంగాణ రాజకీయాలలో హాట్ టాపిక్ గా మారింది. అయితే మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి దీనికి ఘాటుగా బదులిచ్చారు. హరీష్ రావు ని టార్గెట్ చేశారు.హరీష్ రావుకు పొంగులేటి ఘాటు కౌంటర్తెలంగాణలో సెక్షన్ 22ఏ నిషేధిత భూముల వివాదం పైన బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు చేసిన వ్యాఖ్యలకు, రాహుల్ గాంధీకి రాసిన లేఖకు స్పందిస్తూ మంత్రి పొంగులేటి ఎక్స్ వేదికగా ఘాటు కౌంటర్ ఇచ్చారు. ప్రతిపక్ష పార్టీగా బీఆర్ఎస్ పూర్తిగా విఫలమైందని ఆయన ఆరోపించారు. అబద్ధాలు చెబుతూ ప్రజల్లో భయాందోళనలు సృష్టించడం తప్ప ప్రజలకు ఎలాంటి ప్రయోజనం చేకూర్చడం లేదని మండిపడ్డారు.ఆ మంత్రిని తప్పించండి, ఇదిగో ఆధారాలు - రాహుల్ గాంధీకి హరీష్ లేఖ..!!అవినీతి, కమీషన్ల గురించి మీరే మాట్లాడాలిఅవినీతి, కమీషన్ల గురించి హరీశ్ రావు మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందని, హంతకుడే సంతాపం తెలిపినట్లు ఉందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వ్యాఖ్యానించారు. గత పదేళ్లలో బీఆర్ఎస్ పాలనలో జరిగిన అవినీతిని కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవిత స్వయంగా వెల్లడించిన విషయాలను గుర్తు చేశారు. హరీష్ రావు చేసిన అవినీతి పైన కవితే స్వయంగా అనేక విషయాలు మాట్లాడారని గుర్తు చేశారు.కాళేశ్వరం, ధరణి నుంచి మెడికల్ కాలేజీల వరకు మీ దోపిడీ తెలియదాబీఆర్ఎస్ పార్టీలో అధికారంలో ఉన్న సమయంలో హరీష్ రావు ఎలా సంపాదించారో, ఏం వ్యాపారం చేశారో, తక్కువ సమయంలో బాగా ఆర్థికంగా ఎదగడానికి కారణం ఏమిటో ప్రజలకు వివరించాలని మంత్రి పొంగులేటి ప్రశ్నించారు. అగ్గిపెట్టె రావు అని సెటైర్లు వేస్తూ, అధికారంలో ఉన్నప్పుడు కాళేశ్వరం, ధరణి నుంచి మెడికల్ కాలేజీల వరకు అన్నింటిలోనూ దోచుకున్న వారు ఇప్పుడు కమీషన్ల ప్రభుత్వమని మాట్లాడటం సిగ్గుచేటని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

నిషేధిత జాబితాలో చేరినవి ఎన్ని? లెక్కలు తేల్చండి.. వివరాలు ఇవ్వండి! 22ఏ సెక్షన్ నేపథ్యంలో తహసీల్దార్లకు కలెక్టర్ ఆదేశాలు సబ్ రిజిస్ర్టార్లతో సంప్రదింపులు జరపాలని సూచన జిల్లాలో రోజువారీ రిజిస్ర్టేషన్ల ప్రక్రియపై ఆరా హైదరాబాద్ సిటీ: 22ఏ కింద నిషేధిత జాబితాలో చూపుతున్న లక్షలాది మంది నిరుపేదల నివాసాలు, ఖాళీ స్థలాలతో పాటు పెద్ద పెద్ద భవనాలను ఆ జాబితా నుంచి బయటపడేసేందుకు జిల్లా రెవెన్యూ శాఖ చర్యలు తీసుకుంటోంది. ప్రభుత్వ ఆదేశాలతో హైదరాబాద్ జిల్లా కలెక్టర్ ప్రియాంక దీనిపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. తహసీల్దార్లు, రెవెన్యూ ఇన్స్పెక్టర్లతో చర్చిస్తూ, రికార్డులను సరిచూస్తున్నారు. ప్రధానంగా రిజిస్ర్టేషన్ ఆఫీసుల్లో సబ్ రిజిస్ర్టార్లు తిరస్కరిస్తున్న సర్వే నంబర్లలో ఉన్న మొత్తం భూమి ఎంత.. అందులో ఎంతవరకు ప్రైవేట్ పట్టా స్థలాలు ఉన్నాయి.. వాటి పక్కన ఉన్న ప్రభుత్వ భూమిలో ఎన్ని కోర్టు కేసులు నడుస్తున్నాయి.. అనే వివరాలను ఆరా తీస్తున్నారు. అధికారుల తప్పిదంతో నిషేధిత జాబితాలోకి.. రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని నెలలుగా 22ఏ సెక్షన్ తీవ్ర చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే. ప్రభుత్వ భూముల పరిరక్షణ పేరుతో తీసుకొచ్చిన ఈ చట్టంతో 50 ఏళ్లకు పైబడిన ప్రైవేట్ పట్టా భూములు, ఇళ్లు సైతం అనుకోకుండా ప్రోహిబిటెడ్ లిస్టులోకి వెళ్లాయి. అయితే కొంతమంది రెవెన్యూ అధికారుల తప్పిదంతోనే ఈ పొరపాట్లు చోటుచేసుకున్నాయని గ్రహించిన రాష్ట్ర ప్రభుత్వం రెండు రోజులుగా దిద్దుబాటు చర్యలకు దిగింది. రాష్ట్రంలో ఇతర జిల్లాల్లో ఈ సమస్య తక్కువగా ఉన్నప్పటికీ, గ్రేటర్‌లోని హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్‌లో ఎక్కువగా ఉండడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. నివేదిక ఇచ్చేందుకు హడావుడి వాస్తవంగా జిల్లాలో 12 లక్షలకు పైగా భూములు వివిధ కోర్టు కేసుల్లో ఉన్నాయి. ఏళ్ల తరబడి ఇవి కోర్టుల్లో నడుస్తూనే ఉన్నాయి. కౌంటర్లు దాఖలు చేయడంలో కొంతమంది తహసీల్దార్లు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండడంతో మగ్గుతున్నాయి. దీంతో కొంత మంది వాటిని ఆక్రమించుకుని పట్టాలు సైతం పొందుతున్నారనే ఆరోపణలున్నాయి. ఈ

సర్ ప్రక్రియలో భాగంగా ఎన్నికల సంఘం అధికారులు ఈనెల 17న ఓటర్ల ముసాయిదా జాబితాలను విడుదల చేశారు. భద్రాద్రి జిల్లా ఓటర్ల ముసాయిదా జాబితాలో దొర్లిన తప్పులు కొత్తగూడెం కలెక్టరేట్, ఆగస్టు 20 (ఆంధ్రజ్యోతి) : సర్ ప్రక్రియలో భాగంగా ఎన్నికల సంఘం అధికారులు ఈనెల 17న ఓటర్ల ముసాయిదా జాబితాలను విడుదల చేశారు. ఈ సందర్భంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని పాల్వంచ డివిజన్లో ఓ ఆసక్తికర అంశం వెలుగులోకి వచ్చింది. సోనియానగర్కు చెందిన మాలోత్ అరుణ 1992లో జన్మించగా.. ఆమె ప్రస్తుత వయసు 34 సంవత్సరాలు. కానీ ముసాయిదాలో మాత్రం 100 ఏళ్లుగా నమోదు చేశారు. ఇదే కాలనీకి చెందిన మాలోత్ రమేష్ 1991లో జన్మించగా ఆయన వయసు 35 ఏళ్లు. కానీ 99గా నమోదు చేశారు. వీరిద్దరూ పోలింగ్ స్టేషన్ నం. 45 శేఖరం బంజర యూపీఎస్సీ పాఠశాలలో ఓటు హక్కు వినియోగించుకుంటారు. ఈ విషయం గురువారం వెలుగులోకి రావడంతో ఓటర్లు ముసాయిదా జాబితాపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే ఆ జాబితాలో పేరు, చిరునామా, వయస్సు లాంటి వివరాలను సవరించుకోవడానికి ఫారం-8ను ఉపయోగించుకోవాలని ఎన్నికల అధికారులు సూచిస్తున్నారు

మాలీ కులస్తులను ఎస్టీ జాబితాలో చేర్చాలని సంఘం రాష్ట్ర అధ్యక్షుడు లెండుగురే శ్యాంరావు డిమాండ్ చేశారు. మండల కేంద్రంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మాలీ సమాజం ఐక్యతతో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేసి ఎస్టీ జాబితాలో చేర్చేవరకు పోరాటాన్ని కొనసాగిస్తామని చెప్పారు. గత ఎన్నికల సమయంలో బీజేపీ నాయకులు మాలీ కులస్తులను ఎస్టీ హోదా కల్పిస్తామని హామీ ఇచ్చారని గుర్తు చేశారు వాంకిడి, ఆగస్టు 20 (ఆంధ్రజ్యోతి): మాలీ కులస్తులను ఎస్టీ జాబితాలో చేర్చాలని సంఘం రాష్ట్ర అధ్యక్షుడు లెండుగురే శ్యాంరావు డిమాండ్ చేశారు. మండల కేంద్రంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మాలీ సమాజం ఐక్యతతో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేసి ఎస్టీ జాబితాలో చేర్చేవరకు పోరాటాన్ని కొనసాగిస్తామని చెప్పారు. గత ఎన్నికల సమయంలో బీజేపీ నాయకులు మాలీ కులస్తులను ఎస్టీ హోదా కల్పిస్తామని హామీ ఇచ్చారని గుర్తు చేశారు. ఎన్నికల అనంతరం ఈ అంశంపై పార్లమెంటులో, అసెంబ్లీలో ప్రస్తవించడంలేదని ఆయన విమర్శించారు. ఎంపీ గోడాం నగేష్, ఎమ్మెల్యే హరీష్‌బాబు సహా బీజేపీ ప్రజాప్రతినిధులు రాబోయే పార్లమెంట్ సమావేశాల్లో మాలీల ఎస్టీ హోదా అంశాన్ని ప్రస్తావించి కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని ఆయన కోరారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో మాలీలకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. మాలీల సమాజిక, ఆర్థిక, విద్యా పరిస్థితులను పరిగణలోకి తీసుకుని సీఎం రెవంత్ రెడ్డీ, మంత్రులు ఎస్టీ హోదా కోసం కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేయాలని ఆయన కోరారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే మాలీలకు ఎస్టీ హోదా కల్పించాలని లేని పక్షంలో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని ఆయన హెచ్చరించారు. సమావేశంలో రాష్ట్ర ప్రధానకార్యదర్శి వసంత్‌రావు, రాష్ట్ర ఉపాధ్యక్షుడు గుర్నులే నారాయణ, జిల్లా అధ్యక్షుడు వాసు, మండల నాయకులు గౌరయ్య, గోపాల్, బాబురావు, జ్యోతిబా, దివాకర్, బాబురావు పాల్గొన్నారు

మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. School Holidays Tomorrow August 21 TO 28: విద్యార్థులకు గుడ్ న్యూస్. ఆగస్టు చివరి వారంలో విద్యార్థులకు పండగల కారణంగా వరుసగా సెలవులు రానున్నాయి. ఆగస్టు 21, ఆగస్టు 25, ఆగస్టు 26, ఆగస్టు 28వ తేదీల్లో తెలుగు రాష్ట్రాలతోపాటు పలు రాష్ట్రాల్లో పాఠశాలలకు సెలవులు ఉండనున్నాయి. అయితే ప్రతి రాష్ట్రంలో సెలవులు ఒకే తేదీల్లో ఉండవు. ముఖ్యంగా మిలాద్ ఉన్న నబీ, ఓనం, రక్షాబంధన్, వరలక్ష్మీ వ్రతం వంటి పండగల కారణంగా కొన్ని ప్రాంతాల్లో పాఠశాలలకు సెలవు ఉంటుంది. కాబట్టి విద్యార్థులు తమ రాష్ట్రం, పాఠశాల అధికారిక సెలవు క్యాలెండర్ పరిశీలించడం చాలా ముఖ్యం. ఆగస్టు 21వ తేదీ: ఆగస్టు 21వ తేదీ ఏపీ, తెలంగాణ రాష్ట్రాలతోపాటు కర్నాటక, తమిళనాడు రాష్ట్రాల వ్యాప్తంగా పాఠశాలలు, కాలేజీలకు ప్రభుత్వ కార్యాలయాలకు అధికారిక సెలవు ప్రకటించింది. వరలక్ష్మీ వ్రతం సందర్భంగా ఈ సెలవులు ప్రకటిస్తూ ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు ఉత్తర్వులను జారీ చేశాయి. శ్రావణ మాసంలో నిర్వహించే ముఖ్యమైన పండగల్లో వరలక్ష్మీ వ్రతానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంటుందని తెలిసిన సంగతే. ముఖ్యంగా మహిళలు ఈ రోజు వరలక్ష్మీ దేవిని భక్తిశ్రద్ధలతో పూజిస్తుంటారు. పండగ ప్రాధాన్యాన్ని ద్రుష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ఈ సెలవును ప్రకటించింది. ఆగస్టు25వ తేదీన సెలవు: ఆగస్టు 25వ తేదీన మిలాద్ ఉన్ నబీ సందర్భంగా తెలంగాణ రాష్ట్రంతోపాటు పలు రాష్ట్రాల్లో పాఠశాలలకు సెలవు ఉంది. అదే సమయంలో కేరళలో జరుపుకునే మొదటి పండగ ఓనం సందర్భంగా కూడా సెలవు ఉంది. అయితే అయితే ఈ సెలవు అన్ని రాష్ట్రాలకు ఒకే విధంగా వర్తించదు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించిన అధికారిక సెలవుల

రేణుక గొడుగు జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా 2024 నుంచి పనిచేస్తున్నారు. హెల్త్, లైఫ్‌స్టైల్, ఆస్ట్రోలజీ, బ్రేకింగ్, వైరల్ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన 6 ఏళ్ల అనుభవం ఉంది. PM Kisan Money Update: దేశవ్యాప్తంగా కోట్లాది మంది రైతులు ఈ పథకం ద్వారా ప్రయోజనం పొందుతున్నారు. 23వ విడత నిధులు జూన్ నెలలో విడుదలైన నేపథ్యంలో, రైతులు ఇప్పుడు 24వ విడత కోసం వేచి చూస్తున్నారు. ఈ క్రమంలో రైతులు ముందుగా కొన్ని పనులు పూర్తి చేసుకోవాలి. ఈ పథకానికి సంబంధించిన బెనిఫిషియరీ స్టేటస్‌ను సులభంగా చెక్ చేసుకోవచ్చు. అయితే ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకుండా ఉండాలంటే, ముందుగా e-KYC పూర్తి చేయాలి. అధికారిక పీఎం కిసాన్ పోర్టల్‌లో గ్రామ స్థాయి వారీగా జాబితా అందుబాటులో ఉంటుంది. మీరు అధికారిక వెబ్సైట్ pmkisan.gov.in ని ఓపెన్ చేసి, హోమ్ పేజీలో ఉన్న 'ఫార్మర్స్ కార్నర్' సెక్షన్‌ను క్లిక్ చేయాలి. అక్కడ 'బెనిఫిషియరీ స్టేటస్' లేదా 'బెనిఫిషియరీ లిస్ట్' ఆప్షన్‌ను ఎంచుకుని, మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ లేదా ఆధార్ నంబర్‌ను నమోదు చేసి 'గెట్ డేటా' పై క్లిక్ చేయాలి. అప్పుడు మీ బ్యాంక్ ట్రాన్స్ఫర్ స్టేటస్ స్క్రీన్ పైన కనిపిస్తుంది. e-KYC పూర్తి చేయని వారు తదుపరి విడత నిధులను పొందలేరు. కాబట్టి అధికారిక వెబ్సైట్లో pmkisan.gov.in బయోమెట్రిక్ ఆధారంగా e-KYC అప్డేట్ చేసుకోవాలి. వెబ్సైట్లో ఉన్న e-KYC ఆప్షన్‌ను ఎంచుకుని, ఆధార్ వివరాలను నమోదు చేస్తే వచ్చే OTP ద్వారా ఆధార్‌ను సబ్మిట్ చేయాలి. ఒకవేళ ఈ KYC ప్రక్రియలో మీకు ఏవైనా ఇబ్బందులు ఉంటే, సమీపంలోని కామన్ సర్వీస్ సెంటర్ (CSC) కు వెళ్లి బయోమెట్రిక్ అథెంటికేషన్ ద్వారా పూర్తి చేయించుకోవచ్చు. e-KYC పూర్తి చేయకపోవడం వల్ల కొంతమంది రైతులకు నిధులు ఆగిపోయే ప్రమాదం ఉంది

Mahesh Babu’s Varanasi Music Album Update: ‘సూపర్‌స్టార్’ మహేష్ బాబు హీరోగా, దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కిస్తున్న ప్రతిష్టాత్మక పాన్ వరల్డ్ చిత్రం ‘వారణాసి’. ఈ మూవీ కోసం సినీ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ సినిమాపై ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి. మహేష్, రాజమౌళి కాంబినేషన్లో వస్తున్న తొలి చిత్రం కావడంతో.. ఈ ప్రాజెక్ట్‌పై ప్రేక్షకుల్లో మరింత ఆసక్తి నెలకొంది. వారణాసి సినిమాకు లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన కాన్సెప్ట్ గ్లింప్స్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌తో పాటు పాటలు కూడా సినిమాపై అంచనాలను మరింత పెంచాయి. తాజాగా వారణాసి మ్యూజికల్ ఆల్బమ్ గురించి కీరవాణి చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. వారణాసి ఆల్బమ్ చాలా గ్రాండ్‌గా ఉండబోతుందని, సినిమాలో మొత్తం ఆరు పాటలు ఉండనున్నట్లు చెప్పారు. ఇప్పటికే విడుదలైన ‘రణ కుంభ’, ‘సంచారి’ పాటలు ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో పాటు చార్ట్‌బస్టర్స్‌గా నిలిచాయి. అయితే ఎంఎం కీరవాణి చెప్పిన ఆరు పాటల సంఖ్యపై ప్రస్తుతం అభిమానుల్లో ఓ సందేహం నెలకొంది. ఇప్పటికే విడుదలైన రణ కుంభ, సంచారి పాటలను కలుపుకుని మొత్తం ఆరు పాటలు ఉంటాయా?.. లేదా ఆ రెండు పాటలకు అదనంగా మరో ఆరు పాటలు ఉండనున్నాయా? అనే విషయంలో ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. దీనిపై చిత్ర బృందం అధికారికంగా క్లారిటీ ఇవ్వాల్సి ఉంది. రాజమౌళి సినిమాల్లో సంగీతానికి ఉండే ప్రత్యేకత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన విజన్‌కు కీరవాణి సంగీతం తోడైతే.. తెరపై ఎలాంటి అద్భుతం జరుగుతుందో అభిమానులు ఇప్పటికే చూశారు. ఇక వారణాసిలో ఆ అద్భుతం మరింత ఎక్కువగా ఉంటుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇప్పటికే విడుదలైన పాటలు, గ్లింప్స్‌కు వస్తున్న స్పందన చూస్తుంటే వారణాసి మ్యూజిక్ ఆల్బమ్ కూడా భారీ విజయాన్ని అందుకోవడం పక్కా

రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి రాజీనామా చేయాలని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ డిమాండ్ చేశారు. ఎవరు చెప్తే భూములను నిషేధిత జాబితాలో పెట్టారో మంత్రి పొంగులేటి చెప్పాలన్నారు. న్యూఢిల్లీ, ఆగస్టు 20: రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి రాజీనామా చేయాలని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ డిమాండ్ చేశారు. ఈరోజు(గురువారం) మీడియాతో మాట్లాడుతూ.. ఎవరు చెప్తే భూములను నిషేధిత జాబితాలో పెట్టారో మంత్రి పొంగులేటి చెప్పాలన్నారు. తెలంగాణలో ప్రజాపాలన లేదని.. దోపిడి పాలన ఉందని విమర్శించారు. భూదందాలు చేస్తూ ప్రజల భూములను లూటీ చేస్తున్నారని ఆరోపించారు. సీఎం రేవంత్ రెడ్డి ఇల్లు నిషేధిత జాబితాలో చేరిందన్నారు. ప్రజలు కష్టపడి సంపాదించిన భూములు నిషేధిత జాబితాలో పెట్టారని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రియల్ ఎస్టేట్ వ్యాపారంగా నడిపిస్తున్నారని వ్యాఖ్యానించారు. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి క్షమాపణలు చెప్పడం సిగ్గు చేటని ఎంపీ అన్నారు. అధికారులను బాధ్యులుగా చేయడం కాదని.. దీనికి ఆదేశించిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. 22 ఏ జాబితాను బహిర్గతం చేయాలన్నారు. ప్రజల పక్షాన బీజేపీ పోరాటం చేస్తుందని స్పష్టం చేశారు. 22 A భూములపై సీబీఐ విచారణకు ఆదేశించాలని.. రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే జోక్యం చేసుకొని చర్యలు తీసుకోవాలన్నారు. భూములు నిషేధిత జాబితాలో పెట్టారని స్వయంగా మంత్రి కోమటిరెడ్డి బహిరంగ వ్యాఖ్యలు చేశారని అన్నారు. తెలంగాణలో భూముల పేరుమీద కుంభకోణాలు, సెటిల్మెంట్, దందాలు బయట పడుతున్నాయని తెలిపారు. బీఆర్ఎస్ హయాంలో భూములు కాజేయాలని చూస్తే రేవంత్ రెడ్డి పీసీసీగా ఉండి పోరాటం చేశారని.. భూములు కాపాడుతామని చెప్పారని గుర్తుచేశారు. అధికారంలోకి రాగానే ధరణిని బంగాళాఖాతంలో వేస్తామని రేవంత్ అన్నారని తెలిపారు. గత బీఆర్ఎస్ హయాంలో 22 లక్షల ఎకరాలు నిషేధిత జాబితాలో అంటే... ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కోటి ఎకరాలను నిషేధిత జాబితాలోకి నెట్టిందని అన్నారు. వచ్చి అవకాశాన్ని వినియోగించుకొని మంత్రులు దోపిడీ చేస్తున్నారని ఆరోపణలు గుప్పించారు

సాక్షి, హైదరాబాద్: ఓటరు ముసాయిదా జాబితా విడుదలైంది. అందులో చాలామంది తమ పేర్లు కనిపించడం లేవంటున్నారు. ముసాయిదాలో పేర్లున్నా, చాలామందికి నోటీసులు వస్తాయని, వాటికి వివరణ ఇస్తేనే తుది జాబితాలో పేరుంటుందని, లేని పక్షంలో ఉండదని చెబుతున్నారు. ముసాయిదాలో పేర్లున్న వారు తమ పేరు, ఎపిక్నెంబరు, వయసు, చిరునామా, పోలింగ్ కేంద్రం తదితర వివరాలు సరిగ్గా ఉన్నాయో లేదో పరిశీలించుకుంటే మంచిది. పొరపాట్లు దొర్లితే సవరణకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఏఎస్డీ/అన్ కలెక్టబుల్ అంటే.. ఏఎస్డీ, అన్ కలెక్టబుల్గా, డూప్లికేట్లుగా పేర్కొంటూ హైదరాబాద్ జిల్లాలోని 15 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 19,41,444 మంది పేర్లు తొలగించారు. ఇళ్లలో లేనివారు, చిరునామా మారిన వారు, మరణించిన వారిని సంక్షిప్తంగా ఏఎస్డీగా చెబుతున్నారు. ఒక చోటు కంటే ఎక్కువ చోట్ల ఓట్లున్నవారిని డూప్లికేట్లుగా పేర్కొంటున్నారు. అలాంటి వారికి ఒక్కచోట మాత్రం ఉంచి మిగతా చోట్ల తొలగించినట్లు పేర్కొన్నారు. ఇందులో ఎవరి పేరైనా పొరపాటున తొలగించి ఉంటే, వారు మళ్లీ తాజాగా ఓటరు నమోదు కోసం దరఖాస్తు చేసుకోవాలి. నో మ్యాపింగ్, అనామలీస్ అంటే.. ఏమిటో తెలియక చాలామంది గందరగోళానికి గురవుతున్నారు. జిల్లాలో నో మ్యాపింగ్ కేటగిరీలో 5.80 లక్షలకు పైగా ఓటర్లు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. ఎన్యూమరేషన్ ఫారంలో అడిగిన 2002 ఓటర్ల జాబితా(గత ‘సర్’)లోని స్వీయ లేదా రక్తసంబం«దీకుల వివరాలు భర్తీ చేయని వారిని నో మ్యాపింగ్ కేటగిరీలో చేర్చారు. ఈ వివరాలను భర్తీ చేసినప్పటికీ, అవి వాస్తవ విరుద్ధంగా, అసంగతంగా ఉన్న వాటిని అనామలీస్‌గా అధికారులు తెలిపారు. అంటే తోబుట్టువుల మధ్య వయసు తేడా 9 నెలల కంటే తక్కువగా ఉండటం, తల్లిదండ్రులు– సంతానం మధ్య వయసు తేడా 50 ఏళ్లకన్నా ఎక్కువ ఉండటం, పాత సర్ జాబితాలో తల్లిదండ్రుల పేర్లకు, ఇప్పుడు పేర్కొన్న పేర్లకు మధ్య తేడాలుండటం, తల్లిదండ్రులు– సంతానం మధ్య వ్యత్యాసం 15 ఏళ్లకన్నా తక్కువ ఉండటం, గతంలో భర్త పేరు పేర్కొన్న

Nirmal: ఎస్ఐఆర్ ప్రక్రియను పకడ్బందీగా పూర్తి చేయాలి: కలెక్టర్! నిర్మల్: నిర్మల్ జిల్లాలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ (ఎస్ఐఆర్) ప్రక్రియను ప్రణాళికాబద్ధంగా, పకడ్బందీగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా అధికారులను ఆదేశించారు. ఎస్ఐఆర్ ప్రక్రియలో భాగంగా చేపడుతున్న ఓటర్ల మ్యాపింగ్, మ్యాపింగ్ కాని ఓటర్ల గుర్తింపు, ఓటర్ల వివరాల్లోని వ్యత్యాసాలు, అనామలీస్ పరిశీలనను నిర్దేశిత నిబంధనల మేరకు పూర్తి చేయాలని సూచించారు. బుధవారం హైదరాబాద్ నుంచి రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి సంబంధిత ఉన్నతాధికారులతో కలిసి అన్ని జిల్లాల కలెక్టర్లతో ఎస్ఐఆర్ ప్రక్రియపై నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి జిల్లాల వారీగా ఎస్ఐఆర్ ప్రక్రియ పురోగతిని సమీక్షించి, అధికారులకు పలు సూచనలు చేశారు. వీడియో కాన్ఫరెన్స్ అనంతరం జిల్లా కలెక్టర్ సంబంధిత అధికారులతో సమీక్షిస్తూ, రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సూచనల మేరకు జిల్లాలో ఎస్ఐఆర్ ప్రక్రియను నిర్ణీత కార్యాచరణ ప్రణాళిక ప్రకారం పూర్తి చేయాలని ఆదేశించారు. ఓటర్ల వివరాల పరిశీలనలో ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తూ, ఎలాంటి తప్పిదాలకు తావులేకుండా చర్యలు చేపట్టాలని సూచించారు. ఎస్ఐఆర్లో భాగంగా ఓటర్ల మ్యాపింగ్ ప్రక్రియను వేగవంతం చేయడంతో పాటు మ్యాపింగ్ కాని ఓటర్ల వివరాలను సమగ్రంగా పరిశీలించాలని కలెక్టర్ తెలిపారు. ఓటర్ల వివరాల్లో ఏవైనా వ్యత్యాసాలు, అనామలీస్ గుర్తించినట్లయితే వాటిని నిబంధనల ప్రకారం పరిశీలించి తదుపరి చర్యలు చేపట్టాలన్నారు. ఫారాల పంపిణీ, సేకరణ ప్రక్రియ పూర్తయిన అనంతరం మ్యాపింగ్ కాని ఓటర్లు, అనామలీస్ జాబితాలో ఉన్న ఓటర్లకు నోటీసులు జారీ చేయాలని సూచించారు. నోటీసులు అందుకున్న ఓటర్లు నిర్ణీత తేదీ, సమయంలో హాజరై తమ పౌరసత్వాన్ని నిర్ధారించే సంబంధిత ధ్రువపత్రాలను సమర్పించేలా వారికి అవసరమైన సమాచారం అందించాలని తెలిపారు. ఫారం-6, ఫారం-7, ఫారం-8 ద్వారా అందే దరఖాస్తులను నిబంధనల మేరకు క్షుణ్ణంగా పరిశీలించి

అర్హులైన ఓటరు మిగలకూడదు.. అనర్హుడు ఓటరు జాబితాలో చేరకూడదని ఉన్నతాధికారులకు తెలంగాణ ఎన్నికల సంఘం సీఈవో సుదర్శన్ రెడ్డి స్పష్టం చేశారు. బుధవారం ఎన్నిక సంఘం కార్యాలయంలో ఎస్ఐఆర్(SIR)-2026పై ఆయన కీలక సమీక్ష నిర్వహించారు. హైదరాబాద్, ఆగస్టు 19: అర్హులైన ఓటరు మిగలకూడదు.. అనర్హుడు ఓటరు జాబితాలో చేరకూడదని ఉన్నతాధికారులకు తెలంగాణ ఎన్నికల సంఘం సీఈవో సుదర్శన్ రెడ్డి స్పష్టం చేశారు. బుధవారం ఎన్నిక సంఘం కార్యాలయంలో ఎస్ఐఆర్(SIR)-2026పై ఆయన కీలక సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా డీఈఓలు, ఈఆర్ఓలతో సీఈవో సుదర్శన్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జిల్లాల వారీగా యాక్షన్ ప్లాన్ అమలు చేయాలని వారిని ఆదేశించారు. అనామలీస్, నో- మ్యాపింగ్ కేసులపై ప్రత్యేక దృష్టి సారించాలని స్పష్టం చేశారు. క్లెయిమ్స్, అభ్యంతరాలను సకాలంలో పరిష్కరించాలని సూచించారు. ఓటర్లకు నోటీసులు జారీ చేసి విచారణలు చేపట్టాలని తెలిపారు. ASDD జాబితాలోని కేసులను క్షుణ్ణంగా పరిశీలించాలని వారికి వివరించారు ఫారం 6, 6A, 7, 8పై క్లెయిమ్స్, అభ్యంతరాల పరిష్కారం చేయ్యాలన్నారు. ఓటర్లకు నోటీసుల వివరాలు బీఎల్వోలు స్పష్టంగా చెప్పాల్సి ఉంటుందని పేర్కొన్నారు. నో- మ్యాపింగ్ కేసుల పరిష్కారానికి ప్రత్యేక కార్యాచరణ చేపట్టాలని వారికి సీఈవో సుదర్శన్ రెడ్డి వివరించారు. కొండా సుస్మిత వ్యవహారంపై టీపీసీసీ సీరియస్ తివాచీని ఇలా కూడా ఉతుకుతారా? వీడియో వైరల్

CM Revanth Reddy: తెలంగాణలో 22-ఏ నిషేధిత భూముల రిజిస్ట్రేషన్ల సమస్యలపై ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి కీలక సమీక్ష నిర్వహించారు. రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఉన్నతాధికారులతో మంగళవారం సమావేశమైన సీఎం.. ప్రజల ఆస్తి హక్కుల పరిరక్షణకు తమ ప్రభుత్వం పూర్తి కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. ప్రైవేట్ భూ యజమానులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చారు. రిజిస్ట్రేషన్ కోసం ఆన్లైన్లో స్లాట్ బుక్ చేసుకున్న వారి భూమి 22-ఏ జాబితాలో ఉన్నట్లయితే, రెవెన్యూ అధికారులు రెండు రోజుల్లోగా ఆ భూమిని పరిశీలించాలని సీఎం ఆదేశించారు. పరిశీలనలో అది ప్రైవేట్ భూమిగా తేలితే వెంటనే రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేయాలని సూచించారు. అదేవిధంగా 22-ఏ జాబితాలో ఉన్న భూములను జిల్లా కలెక్టర్లు క్షుణ్నంగా పరిశీలించి, సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేలా సరైన జాబితాను రూపొందించాలని సీఎం ఆదేశించారు. నిషేధిత భూముల కొత్త జాబితాలో ఎలాంటి తప్పులు, పొరపాట్లకు తావులేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని స్పష్టం చేశారు. భూముల వడపోత, తప్పుల సవరణ ప్రక్రియను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని సూచించారు. ప్రజలు తమ భూ హక్కుల విషయంలో ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ప్రైవేట్ ఆస్తుల్లో ఒక్క అంగుళం భూమికి కూడా సమస్య రానివ్వబోమని స్పష్టం చేశారు. భూ యజమానుల హక్కులను పరిరక్షించేందుకు ప్రభుత్వం అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటుందని చెప్పారు. 22-ఏ భూముల విషయంలో ప్రజలు దళారులు, మధ్యవర్తులను ఆశ్రయించవద్దని సీఎం సూచించారు. ఎలాంటి పుకార్లు, కట్టుకథలను నమ్మవద్దని విజ్ఞప్తి చేశారు. అధికారిక ప్రక్రియ ద్వారానే భూ సమస్యలను పరిష్కరించుకోవాలని సూచించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

వరల్డ్ ఫొటోగ్రఫీ డే సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఫొటో జర్నలిస్ట్‌గా మారారు. ఫొటో జర్నలిస్ట్‌లు అందరిని కలిపి సీఎం గ్రూప్ ఫొటో తీశారు. కెమెరా తీసుకుని తానే ఫొటో తీస్తానని చెప్పారు. అమరావతి, ఆగస్టు 19 (ఆంధ్రజ్యోతి): వరల్డ్ ఫొటోగ్రఫీ డే సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (AP CM Chandrababu Naidu) ఫొటో జర్నలిస్ట్‌గా మారారు. ఫొటో జర్నలిస్ట్‌లు అందరిని కలిపి సీఎం గ్రూప్ ఫొటో తీశారు. కెమెరా తీసుకుని తానే ఫొటో తీస్తానని చెప్పారు. వరల్డ్ ఫోటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా అసెంబ్లీ ప్రాంగణంలో ముఖ్యమంత్రి చంద్రబాబును ఫొటో జర్నలిస్ట్‌లు ఈరోజు (బుధవారం) కలిశారు. ఈ సందర్భంగా ఫొటో జర్నలిస్టులకు శుభాకాంక్షలు తెలిపారు. ఫొటోగ్రాఫర్లను కలవడం ఎంతో గౌరవంగా భావిస్తున్నా: సీఎం చరిత్రను నమోదు చేస్తూ.. జ్ఞాపకాలను పదిలపరుస్తున్న ఫొటోగ్రాఫర్లకు సీఎం అభినందనలు తెలిపారు. మానవ అనుభవాలను, అద్భుతమైన చిత్రాలుగా ఆవిష్కరిస్తున్న ఫొటోగ్రాఫర్లకు శుభాకాంక్షలు చెప్పారు. మీడియా, ప్రొఫెషనల్ ఫొటోగ్రాఫర్లను కలవడం ఎంతో గౌరవంగా భావిస్తున్నానని పేర్కొన్నారు. ఫొటోగ్రాఫర్ల అంకితభావం, కళాత్మకత, నిరంతర కృషి అభినందనీయమని ప్రశంసించారు. ప్రతి ఫొటో ఓ మధురమైన ఘట్టాన్ని పదిలపరుస్తుంది.. ఎన్నో చెప్పని కథలకు ఫొటోగ్రాఫర్లు తమ చిత్రాల ద్వారా గొంతుకనిస్తున్నారని సీఎం వ్యాఖ్యానించారు. ప్రతి ఫొటో భవిష్యత్తు తరాల కోసం కాలంలోని ఓ మధురమైన ఘట్టాన్ని పదిలపరుస్తుందని వివరించారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఫొటోగ్రాఫర్లకు సీఎం చంద్రబాబు శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలకు సమాచారం, స్ఫూర్తి అందించేలా చిరస్థాయిగా నిలిచే క్షణాలను మరింతగా బంధించాలని ఆకాంక్షించారు. ఈ మేరకు ఎక్స్‌లో సీఎం చంద్రబాబు పోస్టు పెట్టారు. 55కు పైగా అజెండా అంశాలతో ఏపీ క్యాబినెట్ భేటీ నిర్మలా సీతారామన్ నాయకత్వంలో భారత్ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగింది: పవన్

ప్రస్తుతం ఇండియన్ సినిమా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న అవైటెడ్ చిత్రాల్లో పాన్ వరల్డ్ లెవెల్ చిత్రం ‘వారణాసి’ కూడా ఒకటి. సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా గ్లోబల్ దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి కలయికలో వస్తున్న ఈ తొలి సినిమా కోసం ప్రపంచమే ఆసక్తిగా ఎదురు చూస్తుంది. అయితే ఈ సినిమాకి లెజెండరీ సంగీత దర్శకుడు ఎం ఎం కీరవాణి సంగీతం అందిస్తున్న సంగతి తెలిసిందే. కాన్సెప్ట్ గ్లింప్స్ కి ఇచ్చిన స్కోరే ఇప్పటికీ ఓ రేంజ్ లో హై ఇస్తూ వస్తుంది. ఇక మొత్తం సినిమాకి తన వర్క్ ఎలా ఉంటుందా అని అంతా మరింత ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో వారణాసి ఆల్బమ్ పై తాను బిగ్ క్లారిటీ అందించారు. ఇటీవల ఓ ఇంటరాక్షన్ లో కీరవాణి కామెంట్స్ వైరల్ గా మారాయి. వారణాసి ఆల్బమ్ ఎంతో గ్రాండియర్ గా ఉంటుంది అని ప్రామిస్ చేశారు. అంతే కాకుండా వారణాసి ఆల్బమ్ లో మొత్తం 6 పాటలు ఉన్నాయని ఖరారు చేశారు. వారణాసి ఆల్బమ్ నుంచి ఆల్రెడీ రెండు పాటలు వచ్చేసిన సంగతి తెలిసిందే. రణ కుంభ అలాగే సంచారి పాటలు చార్ట్ బస్టర్స్ అయ్యాయి. సో ఇంకా నాలుగు పాటలు మాత్రమే బాకీ ఉన్నాయని చెప్పొచ్చు. ఇవన్నీ ఎప్పుడు వస్తాయో చూడాలి మరి

భారత రిజిస్ట్రేషన్ చట్టం–1908లోని సెక్షన్ 22A కింద ప్రజా ప్రయోజనాలు, ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణకు సంబంధించిన కొన్ని రకాల ఆస్తుల రిజిస్ట్రేషన్‌ను ప్రభుత్వం నిలిపివేయవచ్చు. ఈ నిబంధన ఆధారంగా రిజిస్ట్రేషన్ శాఖ ప్రొబిటెడ్ ప్రాపర్టీస్ లిస్ట్ (PPL)ను నిర్వహిస్తుంది. సాధారణంగా దీనినే 22A నిషేధిత జాబితాగా వ్యవహరిస్తారు. ఈ జాబితాలో ఉన్న ఆస్తికి సంబంధించిన రిజిస్ట్రేషన్‌ను సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంలో సాధారణంగా పూర్తి చేయలేరు. సిస్టమ్‌లో సంబంధిత సర్వే నంబర్ లేదా ఆస్తి వివరాలు నిషేధితంగా నమోదై ఉంటే విక్రయం, బదలాయింపు వంటి లావాదేవీలకు అడ్డంకి ఏర్పడుతుంది. 22A పరిధిలో ప్రధానంగా వివిధ రకాల ప్రభుత్వ లేదా పరిరక్షణ అవసరమున్న భూములు ఉంటాయి. వీటిలో ప్రభుత్వ భూములు, అసైన్డ్ భూములు, దేవాదాయ ఆస్తులు, వక్ఫ్ ఆస్తులు, భూ పరిమితి చట్టాల కింద మిగులు భూములు, కొన్ని ప్రభుత్వ ప్రయోజనాలకు సంబంధించిన భూములు, కోర్టు ఆదేశాల పరిధిలో ఉన్న ఆస్తులు వంటి కేటగిరీలు ఉన్నాయి. అంటే ప్రతి 22A భూమి తప్పనిసరిగా వివాదాస్పదమైనదని అర్థం కాదు. చట్టపరంగా నిషేధించాల్సిన కేటగిరీలో ఉన్న ఆస్తులను అక్రమంగా చేతులు మారకుండా అడ్డుకోవడమే ఈ వ్యవస్థ ప్రధాన ఉద్దేశం. అయితే అసలు సమస్య ఇక్కడే మొదలైంది. ఒక భూమికి సంబంధించిన పాత రికార్డులో ఉన్న వివరాలు, ప్రస్తుత యాజమాన్య హక్కులు, భూమి వర్గీకరణ మధ్య తేడాలు ఏర్పడితే.. చట్టబద్ధమైన ప్రైవేట్ ఆస్తి కూడా నిషేధిత జాబితాలో కనిపించే పరిస్థితి ఏర్పడవచ్చు. ఒక ఆస్తి 22A నిషేధిత జాబితాలో నమోదైతే దాని యజమానికి మొదటి సమస్య రిజిస్ట్రేషన్ వద్ద ఎదురవుతుంది. భూమిని విక్రయించేందుకు కొనుగోలుదారుడితో ఒప్పందం చేసుకున్నా, రిజిస్ట్రేషన్ ప్రక్రియలో ఆస్తి నిషేధిత జాబితాలో ఉందని తేలితే డాక్యుమెంట్ తిరస్కరణకు గురయ్యే అవకాశం ఉంటుంది. దీంతో ఇప్పటికే అడ్వాన్స్ తీసుకున్నవారు, అమ్మకానికి ఒప్పందం చేసుకున్నవారు ఇబ్బందుల్లో పడుతున్నారు. ఆస్తిని విక్రయించలేకపోవడంతో అత్యవసర ఆర్థిక అవసరాలకు దాన్ని వినియోగించుకోవడం కష్టమవుతోంది. ఇదే సమయంలో బ్యాంకు

తెలంగాణ రాష్ట్ర ప్రతిష్ఠ దెబ్బతీసిన నిషేధిత భూముల జాబితా 22A వ్యవహారంపై ఏం జరిగిందో తెలుసుకోవడానికి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కార్యాలయం రంగంలోకి దిగింది. ఇంటర్నెట్ డెస్క్, ఆగస్టు 19 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ రాష్ట్ర ప్రతిష్ఠ దెబ్బతీసిన నిషేధిత భూముల జాబితా 22A వ్యవహారంపై ఏం జరిగిందో తెలుసుకోవడానికి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కార్యాలయం రంగంలోకి దిగింది. గత ఏడాది డిసెంబర్లో ఈ జాబితాను రూపొందిస్తే తర్వాత ఏడు నెలలకు ఇంత వివాదం నెలకొనడానికి కారణం ఏంటని సీఎంవో అధికారులు ఆరా తీస్తున్నారు. కొంతమంది రెవెన్యూ అధికారులను వివిధ వర్గాలకు చెందిన వారిని పిలిపించుకుని ప్రజల్లో ఇంత వ్యతిరేకత రావడానికి, సమస్యపై ఇంత చర్చ జరగాడానికి, ఇంతకాలం తర్వాత తెరమీదకు రావడానికి గల కారణాలు ఎంటని అధికారులు తెలుసుకుంటున్నారు. నిషేధిత జాబితాలో పెట్టేందుకు పాత రెవెన్యూ రికార్డులను పరిగణనలోకి తీసుకోవాలని అధికారులకు ఎవరెవరు చెప్పారు, ఏ ఉద్దేశంతో చెప్పారనే కోణంలో సీఎంవో అధికారులు ఆరా తీస్తున్నట్లు తెలిసింది. హరీశ్‌రావు కాదు.. అబద్దాల రావు.. మంత్రి పొంగులేటి సెటైర్లు ఆ భూములను లాక్కుంటే.. చూస్తూ ఊరుకోం.. రేవంత్ సర్కార్‌కు కవిత వార్నింగ్ కేబీఆర్ చుట్టూ వన్ వే.. వాహనదారులకు సీపీ సజ్జనార్ కీలక సూచనలు
Behari Lal Engineering IPO Listing : ఇటీవల స్టాక్ మార్కెట్లలో వచ్చే ఏ ఐపీఓకు అయినా డిమాండ్ విపరీతంగా వస్తుంది. గత కొంత కాలంగా సక్సెస్‌ఫుల్‌గా ఐపీఓలు వచ్చిన ఇన్వెస్టర్లు పండగ చేసుకుంటున్నారు. అద్విత్ జువెల్స్, కుసుమ్‌గార్ లిమిటెడ్, టెక్నోక్రాఫ్ట్ వెంచర్స్, అర్డీ ఇండస్ట్రీస్, ఎంవీ ఎలక్ట్రోసిస్టమ్స్, ఇండో ఎంఐఎం, ఈ వారంలో వచ్చిన ధూత్ ట్రాన్స్మిషన్, మోల్బయో డయాగ్నోస్టిక్స్, మిల్కీ మిస్ట్ ఇలా అన్నీ విపరీతంగా సబ్‌స్క్రైబ్ అయి అదే రీతిలో కాసుల పంట పండించాయి. చాలా వరకు కనీసం 20 శాతంపైనే ప్రీమియంతో లిస్టింగ్ అయి ఇంకా దూసుకెళ్లాయి. ఇప్పుడు బుధవారం సెషన్లో కూడా బెహరీ లాల్ ఇంజినీరింగ్ లిమిటెడ్ ఐపీఓ అదరగొట్టింది. ఇది పైవాటన్నింటి కంటే కూడా అద్భుత రాబడి అందించింది.ఇష్యూ ప్రైస్ రూ. 285 గా ఉండగా NSE లో ఏకంగా 63.16 శాతం ప్రీమియంతో రూ. 465 వద్ద లిస్టింగ్ అయింది. ఈ ఐపీఓ సబ్స్క్రిప్షన్ ఆగస్ట్ 12- 14 మధ్య జరగ్గా ఏకంగా 118.27 రెట్లు సబ్‌స్క్రైబ్ అయింది. ఆగస్ట్ 17న షేర్ల అలాట్మెంట్ జరగ్గా ఆగస్ట్ 19 న ఎక్స్చేంజీల్లో లిస్టింగ్ అయింది. ఈ ఐపీఓ షేర్ ప్రైస్ బ్యాండ్ రూ. 271- 285 గా ఉండగా చివరకు రూ. 285 ఖరారు చేసింది. ఒక్కో లాట్ కింద 52 షేర్లుగా నిర్ణయించగా, ఈ ప్రైస్ దగ్గర ఒక్కో లాట్ కోసం కనీస పెట్టుబడి రూ. 14,820 గా ఉంది. ఇక లిస్టింగ్‌తోనే రాబడి రూ. 465x 52= రూ. 24180 వచ్చింది. ఇక్కడ నేరుగా లాభం రూ. 9360 రావడం విశేషం. దీంతో షేర్లు అలాట్ అయిన వారు పండగ చేసుకున్నారని చెప్పొచ్చు.అయితే లాభం ఇక్కడితోనే ఆగిపోలేదు. ఓవైపు స్టాక్ మార్కెట్లు పడిపోతున్నా దుమ్మురేపింది. కాసేపట్లోనే రూ. 529 వద్ద గరిష్ఠ స్థాయిని నమోదు చేసింది. ఇది ఐపీఓ ఇష్యూ ధర

Dubbak: కుంభాల రవి కుటుంబాన్ని పరామర్శించిన మాల మహానాడు నేతలు! Dubbak: సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం పెద్దచీకోడు గ్రామానికి చెందిన జర్నలిస్టు కుంభాల రవి తల్లి స్వర్గీయ కుంభాల రాజవ్వ ఇటీవల మృతి చెందిన విషయం తెలుసుకున్న జాతీయ మాల మహానాడు రాష్ట్ర పొలిట్ చైర్మన్ ర్యాకం శ్రీరాములు, దుబ్బాక నియోజకవర్గ ఇన్చార్జి కాల్వ నరేష్, అక్బర్పేట-భూంపల్లి మాల మహానాడు మండల అధ్యక్షులు మండల యాదగిరి, మిడిదొడ్డి మాల మహానాడు మండల అధ్యక్షుడు దారస్వామి, దుబ్బాక అంబేద్కర్ సంఘం అధ్యక్షులు కాల్వ లింగయ్య, బక్కులు బావాజీ, రమేష్ తదితరులు మంగళవారం కుంభాల రవి కుటుంబాన్ని పరామర్శించారు. ఈ సందర్భంగా కుంభాల రాజవ్వ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను ఓదార్చి, తమ ప్రగాఢ సానుభూతిని తెలిపారు. రాజవ్వ మృతి పట్ల వారు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. రాజవ్వ మృతి కుంభాల రవి కుటుంబానికి తీరని లోటని అన్నారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. ఈ విషాద సమయంలో కుటుంబ సభ్యులకు భగవంతుడు మనోధైర్యాన్ని ప్రసాదించాలని ఆకాంక్షించారు

Mumbai Indians Retention List: 2020లో చివరిసారిగా ఐపీఎల్ టైటిల్ గెలిచిన ముంబయి ఇండియన్స్ ఆ తర్వాతి ఆరు సీజన్లలో ఆశించిన స్థాయిలో రాణించలేకపోయింది. అందుబాటులో ఉన్న వివరాల ప్రకారం, 2026 సీజన్లో ముంబై తొమ్మిదో స్థానంలో నిలిచింది. దీంతో వచ్చే సీజన్‌కు ముందు జట్టును పునర్నిర్మించే ఆలోచనలో ఫ్రాంచైజీ ఉండొచ్చనే అంచనాలు పెరిగాయి. ఐపీఎల్ 2027 రిటెన్షన్ జాబితా ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. అయినా కోర్ ఆటగాళ్లలో కొందరిని కొనసాగించే అవకాశం ఉంది. రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, తిలక్ వర్మతో పాటు రియాన్ రికెల్టన్, విల్ జాక్స్, నామన్ ధీర్, కార్బిన్ బోష్, మిచెల్ సాంట్నర్, అల్లా గజన్ఫర్ పేర్లు రిటెన్షన్ రేసులో ఉన్నట్లు సమాచారం. హార్దిక్ పాండ్యా భవిష్యత్తుపైనే ఇప్పుడు పెద్ద చర్చ జరుగుతోంది. 2024 నుంచి ముంబై కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న హార్దిక్ వచ్చే సీజన్లో మరో ఫ్రాంచైజీకి వెళ్లే అవకాశం ఉందనే అంచనాలు ఉన్నాయి. ఆయనను ట్రేడ్ చేయడం లేదా నేరుగా విడుదల చేయడం జరిగే అవకాశాలను ప్రస్తావిస్తున్నారు. ఎక్కువమంది చదివినది: 59 ఫోర్లు, 1 సిక్స్.. ఒకే ఇన్నింగ్స్‌లో 451 పరుగులతో బీభత్సం.. ప్రపంచ రికార్డ్‌నే షేక్ చేసిన దిగ్గజాలు..! హార్దిక్ కోసం కోల్‌కతా నైట్ రైడర్స్ ముందంజలో ఉండొచ్చని సమాచారం. చెన్నై సూపర్ కింగ్స్, లక్నో సూపర్ జెయింట్స్ కూడా ఆసక్తి చూపే జట్లుగా పేర్కొంటున్నారు. అయితే తుది నిర్ణయం ఫ్రాంచైజీల అధికారిక ప్రకటనల తర్వాతే స్పష్టమవుతుంది. హార్దిక్‌తో పాటు క్వింటన్ డి కాక్, ట్రెంట్ బౌల్ట్, షెర్ఫేన్ రూథర్‌ఫోర్డ్, దీపక్ చాహర్, శార్దూల్ ఠాకూర్, రాబిన్ మింజ్, దానిష్ మాలేవార్ పేర్లు కూడా విడుదలయ్యే ఆటగాళ్ల జాబితాలో వినిపిస్తున్నాయి. ఎక్కువమంది చదివినది: SL vs IND: రిషబ్ పంత్ @ 100.. ప్రపంచ క్రికెట్లో ఎవరికీ సాధ్యంకాని రికార్డులో మనోడు..! ఈ మార్పులతో వేలానికి ముందు ముంబై పర్స్ విలువ పెంచుకోవాలని

అశోక్ క్రిందింటి జీ తెలుగు డిజిటల్ మీడియాలో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2022 నుంచి స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, రాజకీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో ఏడేళ్లకుపైగా అనుభవం ఉంది. National Sports Awards 2025 Winners List: జాతీయ క్రీడా పురస్కారాలు 2025ను క్రీడల మంత్రిత్వ శాఖ ప్రకటించింది. మొత్తం 17 మంది క్రీడాకారులను అర్జున పురస్కారానికి ఎంపిక చేసింది. చెస్ క్రీడాకారులు విదిత్ గుజరాతీ, దివ్య దేశ్‌ముఖ్, షట్లర్లు ట్రీసా జాలీ, గాయత్రి గోపీచంద్, అథ్లెట్లు తేజస్విన్ శంకర్, ప్రియాంక గోస్వామి ఈ పురస్కార గ్రహీతలలో ఉన్నారు. మాజీ ఫుట్‌బాల్ క్రీడాకారుడు ఐ.అరుమాయినాయగం అర్జున పురస్కారం (జీవితకాల) అందుకోనున్నారు. అయితే దేశ అత్యున్నత క్రీడా పురస్కారమైన మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డుకు మాత్రం ఎవరినీ ఎంపిక చేయలేదు. ఈ విషయంపై ప్రస్తుతం క్రీడా వర్గాల్లో ప్రధాన చర్చ మొదలైంది. క్రీడా పురస్కారాల ఎంపిక కోసం మాజీ సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ (రిటైర్డ్) అరుణ్ కుమార్ మిశ్రా అధ్యక్షతన కమిటీని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. కమిటీ సిఫార్సుల ఆధారంగా 17 మంది క్రీడాకారులను అర్జున అవార్డులకు ఎంపిక చేసినట్లు క్రీడా మంత్రిత్వ శాఖ వెల్లడించింది. మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న దేశంలో అత్యున్నత క్రీడా పురస్కారం. అయితే 2025 సంవత్సరానికి ఈ అవార్డుకు ఒక్క క్రీడాకారుడి పేరును కూడా ప్రకటించలేదు. అవార్డు ప్రారంభమైన తర్వాత ఇలా జరగడం చాలా అరుదు. గతంలో 2008, 2014 సంవత్సరాల్లో మాత్రమే ఖేల్ రత్నకు ఎవరినీ ఎంపిక చేయలేదు. ఇదిలా ఉంటే.. అర్జున అవార్డుల ద్వారా వివిధ క్రీడా విభాగాల్లో దేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్న క్రీడాకారులను ప్రభుత్వం గుర్తించింది. ఈ అవార్డు క్రీడల్లో అత్యుత్తమ ప్రతిభ, స్థిరమైన ప్రదర్శనకు ఇచ్చే ప్రతిష్ఠాత్మక గౌరవంగా

ప్రైవేటు వ్యక్తుల ఆస్తికి ఆటంకం కలిగించాలనే ఉద్దేశం ప్రభుత్వానికి లేదని తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి (Ponguleti Srinivasa Reddy) అన్నారు. హైదరాబాద్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రైవేటు భూమిని 22ఏలో పెట్టారంటూ మేడ్చల్ (Medchal), హైదరాబాద్ (Hyderabad), రంగారెడ్డి (Ranga Reddy), సంగారెడ్డి (Sangareddy) జిల్లాల నుంచి 750 అప్లికేషన్లు వచ్చాయని తెలిపారు. 22ఏ భూములపై నాలుగు జిల్లాల్లోని అధికారులతో కలిసి చర్చించాం. గతంలో ఆ భూములు యుఎల్‌సీ జాబితాలో ఉన్నాయి. నిషేధిత జాబితాను అప్డేట్ చేయడంలో పొరపాటు జరిగింది. అధికారుల తరపున క్షమాపణలు కోరుతున్నాం. ప్రైవేట్ ఆస్తుల్ని 22ఏ జాబితా నుంచి త్వరలోనే తొలగిస్తాం. దీనికి సంబంధించి ఫిర్యాదులు ఉంటే టోల్‌ఫ్రీ నంబర్ 18005994788కు సప్రందించాలి. భూములకు సంబంధించి అన్నీ సక్రమంగా ఉన్నవారు ఆందోళన చెందవద్దు అని అన్నారు

హైదరాబాద్: తనపై ఆరోపణల కారణంగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత చిన్నారెడ్డిపై టీపీసీసీ ఫిర్యాదు చేశారు ఎమ్మెల్యే మేఘారెడ్డి. చిన్నారెడ్డిపై చర్యలు తీసుకోవాలని టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్‌ను కోరారు మేఘారెడ్డి. తాను టికెట్ అమ్ముకున్నానన్న వ్యాఖ్యలపై పీసీసీకి ఫిర్యాదు చేశారు మేఘారెడ్డి. దీనిపై మహేష్ గౌడ్ మాట్లాడుతూ.. చిన్నారెడ్డి మాటల రికార్డింగ్స్ ఉన్నాయి. పార్టీ పరిశీలించి చర్యలు తీసుకుంటుంది. క్రమశిక్షణ కమిటీ అన్నీ పరిశీలిస్తోంది’ అని తెలిపారు. ఇక తెలంగాణలో ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ(సర్)పై మహేష్ గౌడ్ స్పందిస్తూ.. ‘ మేము ప్రతి ఓటును కాపాడాలని చూస్తున్నాం. EC గైడ్ లైన్స్ తో చాలా నష్టం జరుగుతుంది. తెలంగాణ 3.38 కోట్ల ఓట్లు ఉన్నాయి. ASBD లపేరుతో 22% ఓట్లను తొలగించారు. ఓట్ తొలగింపునకు ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రి అమిత్ షా బాద్యత వహించాలి. బీద ప్రజల ఓట్లు తొలగి పోతున్నాయి. కాంగ్రెస్ BLA లను 35వేలు మందిని ఇచ్చాం. కానీ EC 13వేల 100 మంది అని చూపిస్తున్నారు. 2002లో ఓటు వేసి ఉండాలని కండిషన్ తో చాలా మంది ఎన్యుమరేషన్ ఫామ్ ఇవ్వలేకపోయారు. ఎన్యుమరేషన్ పామ్ ఇవ్వలేదని డిలీట్ చేస్తున్నారు. అన్ మ్యాప్డ్ ఓట్లు 32 లక్షల 37వేలు. డౌట్ ఫుల్ గా ఉన్నాయి 60 లక్షల 50 వేలు ఓట్లు చూపిస్తున్నారు. 92లక్షల ఓట్లు ప్రశ్నార్థకంగా మారాయి. 1.60 కోట్ల ఓట్లకు ఎందుకు క్వచ్చన్ మార్క్ పెట్టారో చెప్పాలి. కాంగ్రెస్ ప్రతి పౌరుడి ఓటు కాపాడాలని ప్రయత్నం చేస్తోంది. తెలంగాణలో ఇంకా టైం ఇవ్వాలి’ అని పేర్కొన్నారు. భార్య బర్త్‌డే.. సెలబ్రేషన్స్ ఫొటోలు షేర్చేసిన హీరో (ఫొటోలు) జెన్‌జీ స్టైల్లో జూడాలు.. కూటమి తీరుపై వినూత్న నిరసన (చిత్రాలు) తిరుమల శ్రీవారిని దర్శించుకున్న క్రికెటర్ తిలక్ వర్మ (ఫొటోలు) 18 ఏళ్లు పూర్తి చేసుకున్న కోహ్లి (ఫొటోలు) న్యూయార్క్ : 'ఇండియా డే పరేడ్

2014లో కొలువుదీరిన నాటి నుంచి రాజ్యాంగ సంస్థలను నిర్వీర్యం చేస్తుందంటూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై తెలంగాణ పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మండిపడ్డారు. ఎన్నికల కమిషన్ కూడా బీజేపీకి అనుబంధ సంస్థగా మారిందని విమర్శించారు. హైదరాబాద్, ఆగస్టు18: 2014లో కొలువుదీరిన నాటి నుంచి రాజ్యాంగ సంస్థలను నిర్వీర్యం చేస్తుందంటూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై తెలంగాణ పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మండిపడ్డారు. ఎన్నికల కమిషన్ కూడా బీజేపీకి అనుబంధ సంస్థగా మారిందని విమర్శించారు. మంగళవారం హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో ఆయన మాట్లాడుతూ.. తాము ప్రతి ఓటు హక్కు కాపాడాలని చూస్తున్నామని అన్నారు. ఎన్నికల సంఘం గైడ్‌లైన్స్‌తో చాలా నష్టం జరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈసీ ఉదాసీనంగా చూడటం కరెక్ట్ కాదని అభిప్రాయపడ్డారు. తెలంగాణ 3.38 కోట్ల ఓట్లు ఉన్నాయని గుర్తు చేశారు. ఎఎస్బీడీల పేరుతో 22 శాతం ఓట్లు తొలగించారని చెప్పారు. ఓట్ల తొలగింపునకు ప్రధాని మోదీతోపాటు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా బాధ్యత వహించాలని అన్నారు. పేద ప్రజల ఓట్లు తొలగిపోతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ బీఎల్ఏలను 35 వేల మందిని నియమించిందని తెలిపారు. కానీ ఈసీ మాత్రం13,100 మందిని ఇచ్చినట్లు చూపిస్తుందని చెప్పారు. సామాన్యుడి ఓటు తొలగించే ప్రయత్నం చేస్తున్నారంటూ ఈ సందర్భంగా ఈసీపై నిప్పులు చెరిగారు. 2002లో ఓటు వేసి ఉండాలని కండిషన్‌తో చాలా మంది ఎనుమరేషన్ పామ్స్ ఇవ్వలేక పోయారని చెప్పుకొచ్చారు. దీంతో వారిని కూడా ఓటర్ల జాబితా నుంచి తొలగిస్తున్నారని వివరించారు. అన్ మ్యాపుడ్ ఓట్లు 32,37000 ఉన్నాయని అన్నారు. అలాగే 60,50,000 ఓట్లు సందేహంగా ఉన్నాయని చూపిస్తున్నారని పేర్కొన్నారు. దాంతో 92 లక్షల ఓట్లు ప్రశ్నార్ధకంగా మారాయని ఆవేదనతో అన్నారు. 1.60 కోట్ల ఓట్లు ఎందుకు క్వచ్చన్ మార్క్ పెట్టారో చెప్పాలంటూ ఈసీని తెలంగాణ పీసీసీ చీఫ్ డిమాండ్ చేశారు. దేశంలో ఓటు హక్కును తొలగించే

తెలంగాణలో ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (సర్) ప్రక్రియలో భాగంగా ఎన్నికల సంఘం (ఈసీ) విచక్షణారహితంగా లక్షలాది ఓట్లను తొలగించిందని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ తీవ్ర ఆరోపణలు చేశారు. హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో ముసాయిదా ఓటరు జాబితా విడుదలైన అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.నగరంలోని బూత్ స్థాయి అధికారులు (బీఎల్ఓలు) క్షేత్రస్థాయిలో ఇంటింటికీ వెళ్లి సర్వే నిర్వహించలేదని, ఈ ఓట్ల తొలగింపు ప్రక్రియ వల్ల పేదలు, వలస కార్మికులే ఎక్కువగా నష్టపోయారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. 2002 నాటి ఓటర్ల జాబితాను ప్రామాణికంగా తీసుకోవడం ఆచరణ సాధ్యం కాదని, పాత రికార్డులను సాకుగా చూపుతూ పౌరుల ఓటు హక్కును నిరాకరించడం సరైన పద్ధతి కాదని ఆయన అభిప్రాయపడ్డారు.ఎలాంటి పక్కా కారణాలు లేకుండా సుమారు 73 లక్షల ఓట్లను తొలగించారని, మరో 92 లక్షల ఓట్లను అనుమానిత జాబితాలో చేర్చారని మహేశ్ కుమార్ గౌడ్ ఆరోపించారు. నియోజకవర్గాల పునర్విభజన, పోలింగ్ కేంద్రాల మార్పుల వల్ల తలెత్తిన సాంకేతిక సమస్యలు ఈ గందరగోళానికి కారణమయ్యాయని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం సీబీఐ, ఈడీల తరహాలోనే ఎన్నికల సంఘాన్ని కూడా తన 'పాకెట్ సంస్థ'గా మార్చుకుందని ఆయన తీవ్రంగా విమర్శించారు

ఇంటర్నెట్ డెస్క్: ప్రతిష్ఠాత్మక జాతీయ క్రీడా పురస్కారం అర్జున అవార్డులను కేంద్ర ప్రభుత్వం మంగళవారం ప్రకటించింది. 2025 సంవత్సరానికి సంబంధించి 17 మంది క్రీడాకారులను ఈ అవార్డుకు ఎంపిక చేసింది. అయితే అత్యున్నత క్రీడా పురస్కారం మేజర్ ధ్యాన్‌చంద్ ఖేల్‌రత్నకు ఈసారి ఎవరినీ ఎంపిక చేయకపోవడం గమనార్హం. అర్జున అవార్డుల జాబితాలో అథ్లెట్ తేజస్విన్ శంకర్, చెస్ ప్లేయర్ దివ్యా దేశ్‌ముఖ్, బ్యాడ్మింటన్ స్టార్ పుల్లెల గాయత్రి గోపిచంద్ తదితరులు చోటు దక్కించుకున్నారు. అర్జున అవార్డు గ్రహీతలు వీరే.. అథ్లెటిక్స్: తేజస్విన్ శంకర్, మహమ్మద్ అజ్మల్ వి, ప్రియాంక గోస్వామి. బ్యాడ్మింటన్: ట్రీసా జాలీ, పుల్లెల గాయత్రి గోపీచంద్ బాక్సింగ్: నరేందర్ బెర్వాల్ చెస్: విదిత్ సంతోష్ గుజరాతి, దివ్యా దేశ్‌ముఖ్ పారా షూటింగ్: ధనుష్ శ్రీకాంత్ హాకీ: లాల్రెమ్సియామి, రాజ్‌కుమార్ పాల్ కబడ్డీ: సుర్జీత్, పూజ పారా-షూటింగ్: రుద్రాంశ్ ఖండేల్వాల్ పారా-అథ్లెటిక్స్: ఏక్తా భ్యాన్ రోయింగ్: అరవింద్ సింగ్ షూటింగ్: అఖిల్ షియోరాన్ లైఫ్‌టైమ్ అర్జున అవార్డు 1962 ఆసియా క్రీడల్లో స్వర్ణ పతకం సాధించిన భారత ఫుట్‌బాల్ జట్టులో సభ్యుడైన మాజీ ఆటగాడు ఐ. అరుమైనాయగానికి అర్జున అవార్డు (లైఫ్‌టైమ్) దక్కింది. ద్రోణాచార్య అవార్డులు ద్రోణాచార్య అవార్డులు రెగ్యులర్ కేటగిరీలో పార్వీర్ సింగ్ (అథ్లెటిక్స్), ఛోటేలాల్ యాదవ్ (బాక్సింగ్), నేహా నంద్‌కుమార్ చవాన్ (షూటింగ్) ఎంపికయ్యారు. లైఫ్‌టైమ్ కేటగిరీలో ధర్మేంద్ర సింగ్ యాదవ్ (బాక్సింగ్), వీరేందర్ కుమార్ (రెజ్లింగ్) పురస్కారాలకు ఎంపికయ్యారు. రాష్ట్రీయ క్రీడా ప్రోత్సాహన్ పురస్కారాన్ని పుణెలోని ఆర్మీ పారా ఒలింపిక్ నోడ్‌కు ప్రకటించారు. ఆగస్టు 29 సంప్రదాయానికి బ్రేక్ సాధారణంగా జాతీయ క్రీడా పురస్కారాల ప్రదానోత్సవం ఆగస్టు 29న జరుగుతుంది. హాకీ దిగ్గజం మేజర్ ధ్యాన్‌చంద్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఆ రోజును జాతీయ క్రీడా దినోత్సవంగా నిర్వహిస్తారు. అయితే కరోనా తర్వాత ఈ సంప్రదాయంలో మార్పులు వచ్చాయి. క్రీడా క్యాలెండర్‌కు అనుగుణంగా అవార్డుల కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. 2025లోనూ పురస్కారాల

వర్షాకాలం వచ్చిందంటే చాలు... చినుకులు, తేమ వాతావరణం తెచ్చే తిప్పలు అన్నీ ఇన్నీ కావు. బురద, ఆరని దుస్తుల గోల ఒకెత్తయితే, ఈ సీజన్ లో పెరిగే పాముల బెడద మరో పెద్ద తలనొప్పి. ఊళ్లలోనే కాదు, నగరాల్లోని అపార్ట్మెంట్లు, విల్లాల్లోకి కూడా పాములు వచ్చేస్తున్న వార్తలు చూస్తూనే ఉన్నాం. ఇంట్లో చిన్న పిల్లలు ఉంటే, వారు బయట ఆడుకునేటప్పుడు ఎంత భయంగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అయితే, రసాయనాలు వాడకుండా మన పెరట్లో నాటే కొన్ని సహజసిద్ధమైన మొక్కల ద్వారా పాములను దూరంగా ఉంచవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఆ మొక్కలేంటో, అవి ఎలా పనిచేస్తాయో ఇక్కడ తెలుసుకుందాం. పాములకు వాసనను పసిగట్టే శక్తి చాలా ఎక్కువ. అందుకే తీవ్రమైన లేదా ఘాటైన సువాసనలు వచ్చే మొక్కల పరిసరాల్లోకి రావడానికి ఇవి ఇష్టపడవు. • సర్పగంధ: దీనికే పాతాళ గరుడ, పాతాళ గంధి అనే పేర్లు ఉన్నాయి. ఆయుర్వేదంలో ఎక్కువగా వాడే ఈ మొక్క వేర్లు, ఆకుల నుంచి వచ్చే ఘాటైన వాసన పాములకు తీవ్ర అసౌకర్యాన్ని కలిగిస్తుంది. • వెల్లుల్లి, ఉల్లి: మన వంటగదిలో వాడే వెల్లుల్లి, ఉల్లి మొక్కల్లో ఉండే సల్ఫర్, అల్లిసిన్ రసాయనాలు సహజ సిద్ధమైన స్నేక్ రిపల్లెంట్ లా పనిచేస్తాయి. వెల్లుల్లి రెబ్బలను నీటిలో కలిపి ఇంటి చుట్టూ చల్లడం వల్ల కూడా మంచి ఫలితం ఉంటుంది. • దవనం, నిమ్మగడ్డి: పూలల్లో కలిపే దవనం తెచ్చే తాజా సువాసన మనుషులకు నచ్చినా పాములకు శత్రువే. అలాగే నిమ్మగడ్డిలో ఉండే సిట్రోనెల్లా వాసన పాములతో పాటు దోమలను కూడా తరిమికొడుతుంది. మన ఇంట్లో ఎంతో అందంగా పూసే ముద్ద బంతి, కారబ్బంతి పూల మొక్కలు కేవలం తోటకు అందాన్ని ఇవ్వడమే కాదు, పాముల నివారణలోనూ కీలక పాత్ర పోషిస్తాయి. బంతి పూల వేర్లు, ఆకుల నుంచి వచ్చే ప్రత్యేకమైన వాసన, రసాయనాలు పాములను, ఇతర చిన్న కీటకాలను దూరంగా

మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. 22A Dispute : తెలుగు రాష్ట్రాల్లో 22 ఏ ( నిషేధిత భూముల జాబితా) వివాదం రచ్చలేపుతోంది. లక్షలాది మంది రైతులు, ఆస్తి యజమానుల పాలిట శాపంగా మారింది సెక్షన్ 22ఏ. తమ కష్టార్జితంతో కొనుగోలు చేసి.. పక్కగా సేల్ డీడ్ ద్వారా చట్టబద్ధంగా రిజిస్ట్రేషన్ చేయించుకున్న ప్రైవేట్ భూములు కూడా ఆకస్మాత్తుగా ఈ 22 ఏ జాబితాలో చేరడంతో ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఈ గందరగోళానికి ప్రధాన కారణం ప్రభుత్వ రికార్డుల ప్రక్షాళన విధానంలోని లోపమే అనే విషయం స్పష్టంగా అర్థమవుతోంది. రెవెన్యూ రికార్డులను డిజిటలైజ్ చేసే ప్రక్రియలో భాగంగా ప్రభుత్వం కేవలం బ్రిటిష్ కాలం పాత పత్రాలను మాత్రమే ప్రాతిపదికగా తీసుకుంది. ఆ తర్వాత దశాబ్దాల పాటు జరిగిన చట్టబద్ధమైన క్రయవిక్రయాలను, యాజమాన్య బదిలీలను పూర్తిగా విస్మరించింది. ఫలితంగా ఏళ్ల తరబడి రైతుల చేతుల్లో ఉన్న లక్షల ఎకరాల వ్యవసాయ పట్టాభూములు రికార్డుల్లో రాత్రికి రాత్రే ప్రభుత్వ ఖాతాల్లోకి చేరిపోయాయి. ప్రభుత్వ సాంకేతిక తప్పిదం వల్ల ఎన్నో ఏళ్లుగా అనుభవిస్తున్న భూములపై క్రయవిక్రయాల హక్కులు కోల్పోయి యజమానులు దిక్కుతోచని స్థితిలో పడ్డారు. దీనిపై సెంటర్ ఫర్ లిబర్టీ అనలిస్ట్ నల్లమోతు చక్రవర్తి విశ్లేషించారు. రికార్డుల అప్ డేట్ లో భాగంగా జరిగిన ఈ చారిత్రక తప్పిదం వల్లే ఈ ప్రస్తుత గందరగోళానికి మూలకారణమని స్పష్టం చేశారు. కింది స్థాయిలోని లావాదేవీల చరిత్రను పరిగణలోనికి తీసుకోకుండా.. ఏకపక్షంగా సామాన్య భూములను 22ఏ జాబితాలో చేర్చడం వారి ప్రాథమిక హక్కులను కాలరాయడమేనని నల్లమోతుల వివరించారు. ఈ అన్యాయంపై ముఖ్యంగా ఏపీలో బాధితుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. భూముల క్రయవిక్రయాలు, రిజిస్ట్రేషన్లు