Behari Lal Engineering IPO Listing : ఇటీవల స్టాక్ మార్కెట్లలో వచ్చే ఏ ఐపీఓకు అయినా డిమాండ్ విపరీతంగా వస్తుంది. గత కొంత కాలంగా సక్సెస్‌ఫుల్‌గా ఐపీఓలు వచ్చిన ఇన్వెస్టర్లు పండగ చేసుకుంటున్నారు. అద్విత్ జువెల్స్, కుసుమ్‌గార్ లిమిటెడ్, టెక్నోక్రాఫ్ట్ వెంచర్స్, అర్డీ ఇండస్ట్రీస్, ఎంవీ ఎలక్ట్రోసిస్టమ్స్, ఇండో ఎంఐఎం, ఈ వారంలో వచ్చిన ధూత్ ట్రాన్స్మిషన్, మోల్బయో డయాగ్నోస్టిక్స్, మిల్కీ మిస్ట్ ఇలా అన్నీ విపరీతంగా సబ్‌స్క్రైబ్ అయి అదే రీతిలో కాసుల పంట పండించాయి. చాలా వరకు కనీసం 20 శాతంపైనే ప్రీమియంతో లిస్టింగ్ అయి ఇంకా దూసుకెళ్లాయి. ఇప్పుడు బుధవారం సెషన్లో కూడా బెహరీ లాల్ ఇంజినీరింగ్ లిమిటెడ్ ఐపీఓ అదరగొట్టింది. ఇది పైవాటన్నింటి కంటే కూడా అద్భుత రాబడి అందించింది.ఇష్యూ ప్రైస్ రూ. 285 గా ఉండగా NSE లో ఏకంగా 63.16 శాతం ప్రీమియంతో రూ. 465 వద్ద లిస్టింగ్ అయింది. ఈ ఐపీఓ సబ్స్క్రిప్షన్ ఆగస్ట్ 12- 14 మధ్య జరగ్గా ఏకంగా 118.27 రెట్లు సబ్‌స్క్రైబ్ అయింది. ఆగస్ట్ 17న షేర్ల అలాట్మెంట్ జరగ్గా ఆగస్ట్ 19 న ఎక్స్చేంజీల్లో లిస్టింగ్ అయింది. ఈ ఐపీఓ షేర్ ప్రైస్ బ్యాండ్ రూ. 271- 285 గా ఉండగా చివరకు రూ. 285 ఖరారు చేసింది. ఒక్కో లాట్ కింద 52 షేర్లుగా నిర్ణయించగా, ఈ ప్రైస్ దగ్గర ఒక్కో లాట్ కోసం కనీస పెట్టుబడి రూ. 14,820 గా ఉంది. ఇక లిస్టింగ్‌తోనే రాబడి రూ. 465x 52= రూ. 24180 వచ్చింది. ఇక్కడ నేరుగా లాభం రూ. 9360 రావడం విశేషం. దీంతో షేర్లు అలాట్ అయిన వారు పండగ చేసుకున్నారని చెప్పొచ్చు.అయితే లాభం ఇక్కడితోనే ఆగిపోలేదు. ఓవైపు స్టాక్ మార్కెట్లు పడిపోతున్నా దుమ్మురేపింది. కాసేపట్లోనే రూ. 529 వద్ద గరిష్ఠ స్థాయిని నమోదు చేసింది. ఇది ఐపీఓ ఇష్యూ ధర రూ. 285 తో చూస్తే ఏకంగా 85 శాతానికిపైగా పెరిగింది. ఇక్కడ చూస్తే రాబడి రూ. 27,508 గా అయింది. ఇక్కడ ఒక్కో లాట్ కింద లాభం రూ. 12,688 రావడం విశేషం.Read Also: నష్టాల్లో స్టాక్ మార్కెట్లు.. అయినా మిల్కీ మిస్ట్ ఐపీఓ అదుర్స్.. ఒక్కో లాట్‌పై ఎంత లాభం వచ్చిందంటే?కేవలం రూ. 302 కోట్ల మేర నిధులు సమీకరించాలన్న లక్ష్యంతో వచ్చిన ఈ ఐపీఓ ఈ స్థాయిలో దూసుకెళ్లడం మార్కెట్ వర్గాల్ని ఆశ్చర్యపరుస్తోంది. ఫ్రెష్ ఇష్యూ కింద 32,63,157 షేర్లను జారీ చేయగా, ఆఫర్ ఫర్ సేల్ కింద 73,20,001 షేర్లను అందుబాటులో ఉంచారు. దీంతో నెక్ట్స్ లిస్టింగ్ కానున్న లలితా జువెల్లరీ ఐపీఓపై అందరి దృష్టి నెలకొంది.