టీవీలో వినోదం అనేది ఎప్పుడూ దొరుకుతూనే ఉంటుంది. ఏ టైంలో అయినా సరే ఏ ఛానెల్ పెట్టినా బుల్లితెరపై ఛానెల్స్‌లో ఏదో ఒక సినిమా వస్తూనే ఉంటుంది. అలా బుల్లితెరపై 24 గంటలు వినోదానికి అయితే కొరత ఉండదు. ఇంట్లో ఉండే వారికి, మహిళలకు బుల్లితెర అనేది రిలాక్స్, ఎంటర్టైన్మెంట్ మోడ్‌ను ఇస్తుంది. ఇక రేపు అంటే గురువారం అన్ని ఛానెల్స్‌లో ప్రసారం అయ్యే సినిమాల లిస్ట్ ఓ సారి చూద్దాం.డీడీ యాదగిరి చానెల్లో మధ్యాహ్నం రెండు గంటలకు ఉడతా ఉడతా ఊచ్ రానుంది. ఈటీవీ ప్లస్‌లో రాత్రి తొమ్మిదిన్నరకి మీ శ్రేయోభిలాషి రానుంది. ఈటీవీలో మధ్యాహ్నం 12 గంటలకు, రాత్రి పదిన్నరకి సందడే సందడి రానుంది. ఈటీవీ సినిమాలో ఏడు గంటలకు ఓ చినదాన, ఉదయం 10 గంటలకు జగదేకవీరుని కథ, ఒంటి గంటకు మహానగరంలో మాయగాడు, సాయంత్రం నాలుగు గంటలకు మా ఆవిడ కలెక్టర్, ఏడు గంటలకు బలరామకృష్ణులు, రాత్రి పది గంటలకు గుండా, మిడ్ నైట్ ఒంటి గంటకు మళ్లీ ఓ చినదాన మూవీని రిపీట్ మోడ్‌లోనే ప్రసారం చేయనున్నారు.జెమినీ లైఫ్‌లో ఉదయం 11 గంటలకు 1940లో ఒక గ్రామం, సాయంత్రం నాలుగున్నరకి జగపతి చిత్రాలు రానున్నాయి. జెమిని టీవీలో ఉదయం 9 గంటలకు సాంబ, మూడు గంటలకు రచ్చ రానున్నాయి. జెమినీ మూవీస్‌లో మిడ్ నైట్ ఒకటిన్నరకి స్వప్నలోకం, ఉదయం నాలుగున్నరకి అందరూ దొంగలే, ఉదయం ఏడు గంటలకు రావుగారిల్లు, పది గంటలకు బిల్లా, ఒంటి గంటకు లోఫర్, నాలుగు గంటలకు పూలరంగడు, ఏడు గంటలకు సీమసింహం, రాత్రి పది గంటలకు వేటగాడు ప్రసారం కానున్నాయి.జీ తెలుగులో ఉదయం 9 గంటలకు నువ్వులేక నేనులేను, సాయంత్రం ఐదు గంటలకు పిండం రానున్నాయి. జీ సినిమాలు ఛానెల్లో ఉదయం 7 గంటలకు స్టూడెంట్ నెంబర్ 1, 9 గంటలకు మిస్టర్ మజ్ను, 12 గంటలకు హనుమాన్, 3 గంటలకు రంగ్ దే, ఆరుగంటలకు శివలింగ, 9 గంటలకు టిక్ టిక్ రానున్నాయి.స్టార్ మాలో ఉదయం ఒకటిన్నరకి సాహసం, నాలుగు గంటలకు కల్పన, 9 గంటలకు రఘువరన్ బీటెక్, రాత్రి 11 గంటలకు రఘువరన్ బీటెక్ రానున్నాయి. స్టార్ మా మూవీస్‌లో ఉదయం మూడు గంటలకు అల్లరి బుల్లోడు, ఏడు గంటలకు నా పేరు శేషు, 9 గంటలకు ఏఆర్ఎం, మధ్యాహ్నం 12 గంటలకు అఖండ, సాయంత్రం మూడు గంటలకు జనక అయితే గనక, సాయంత్రం ఆరు గంటలకు నువ్వు నాకు నచ్చావ్, రాత్రి తొమ్మిదిన్నరకి హిడింబ రానున్నాయి. స్టార్ మా గోల్డ్‌లో ఉదయం రెండున్నరకి బెట్, 5 గంటలకు మనసు పిలిచింది, 8 గంటలకు చక్రవర్తి, ఉదయం 11 గంటలకు నిన్ను కోరి, మధ్యాహ్నం రెండున్నరకి రజినీ ఫ్రమ్ రాజమండ్రి, సాయంత్రం ఐదు గంటలకు అనేకుడు, రాత్రి 8 గంటలకు ఆవారా, రాత్రి పదకొండు గంటలకు మళ్లీ చక్రవర్తి మూవీని రిపీట్ మోడ్‌లో వేయనున్నారు.





