
Vastu Tips: ఇంట్లో చక్కెరను ఇలా పెడుతున్నారా..? ఈ తప్పులు చేస్తే ఆర్థిక సమస్యలు వస్తాయట!
Vastu Tips: ఇంట్లో చక్కెరను ఇలా పెడుతున్నారా..? ఈ తప్పులు చేస్తే ఆర్థిక సమస్యలు వస్తాయట!
© 2026 nimisham.in

Vastu Tips: ఇంట్లో చక్కెరను ఇలా పెడుతున్నారా..? ఈ తప్పులు చేస్తే ఆర్థిక సమస్యలు వస్తాయట!

ఏ కాలమైనా జిడ్డు చర్మంతో బాధపడే అమ్మాయిలు చాలామందే ఉంటారు. అయితే ఈ చర్మతత్వం మొటిమలు, మచ్చలకు కారణమవుతుంది. అందుకే కొన్ని ఇంటి చిట్కాలతో ఈ సమస్య నుంచి ఉపశమనం చేసుకోవచ్చంటున్నారు నిపుణులు. ⚛ పాలను ముఖానికి అప్లై చేసుకొని పావుగంటయ్యాక కడిగేసుకోవాలి. తద్వారా చర్మంపై జిడ్డుదనం తొలగుతుందట. ⚛ తేనెతోనూ ముఖంపై జిడ్డుదనాన్ని తొలగించచ్చు. ఇందుకోసం తేనెను ముఖానికి పూతలా వేసుకోవాలి. 15 నిమిషాల తర్వాత కడిగేసుకోవాలి. ఇలా చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుందంటున్నారు నిపుణులు. ⚛ గుడ్డులోని తెల్లసొన, ద్రాక్షరసం, నిమ్మరసం.. ఈ మూడింటినీ కొద్ది మొత్తాల్లో తీసుకొని మిశ్రమంగా చేసుకోవాలి. దీన్ని ముఖానికి పూసుకొని పావుగంట తర్వాత కడిగేసుకోవాలి. నిమ్మరసం సహజసిద్ధమైన క్లెన్సర్‌గా పనిచేస్తుంది, గుడ్డులోని తెల్లసొన చర్మం బిగుతుగా మారడానికి, ద్రాక్షరసం చర్మం మృదువుగా మారడానికి ఉపకరిస్తాయట. ⚛ సాధారణంగా ఆయిలీ స్కిన్ ఉన్న వారు ఎక్కువసార్లు ముఖం కడుక్కుంటూ ఉంటారు. ఇది మంచిది కాదు. ఎందుకంటే ఈ క్రమంలో పదే పదే సోప్ లేదా ఫేస్‌వాష్ వాడితే.. వాటిలో ఉండే రసాయనాలు చర్మాన్ని పొడిబారేలా చేస్తాయి. కాబట్టి సాధారణ నీటితో రోజుకు రెండు లేదా మూడుసార్లు ముఖం శుభ్రం చేసుకోవడం మంచిదంటున్నారు నిపుణులు. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు

ఎంతసేపూ చదువులు, మార్కులు అంటూ పిల్లలపై ఒత్తిడి తెస్తారే కానీ.. వాళ్ల భావోద్వేగాల్ని చాలామంది పేరెంట్స్ అర్థం చేసుకోరు. ఇది వారిలో ఒక రకమైన భయాన్ని, అభద్రతా భావాన్ని రేకెత్తిస్తుంది. దీనివల్ల తల్లిదండ్రులు-పిల్లలకు మధ్య కమ్యూనికేషన్ లోపించి.. తమకున్న సమస్యల్ని, ఇబ్బందుల్నీ పేరెంట్స్‌తో పంచుకోలేకపోతారు. ఎంతసేపూ చదువులు, మార్కులు అంటూ పిల్లలపై ఒత్తిడి తెస్తారే కానీ.. వాళ్ల భావోద్వేగాల్ని చాలామంది పేరెంట్స్ అర్థం చేసుకోరు. ఇది వారిలో ఒక రకమైన భయాన్ని, అభద్రతా భావాన్ని రేకెత్తిస్తుంది. దీనివల్ల తల్లిదండ్రులు-పిల్లలకు మధ్య కమ్యూనికేషన్ లోపించి.. తమకున్న సమస్యల్ని, ఇబ్బందుల్నీ పేరెంట్స్‌తో పంచుకోలేకపోతారు. ఇది పిల్లల ఎదుగుదలపై ప్రతికూల ప్రభావం చూపుతుందంటున్నారు నిపుణులు. కాబట్టి పిల్లల మార్కులు, ఆటల్లో పెర్ఫార్మెన్స్ ఎలా ఉన్నా.. వారికి తామున్నామన్న భరోసా కల్పించడం, ఎమోషనల్‌గా దగ్గరవడం ముఖ్యమంటున్నారు. దీన్నే ‘ఎలిఫెంట్ పేరెంటింగ్’ అంటారు. మరి, దీనివల్ల పిల్లలకు కలిగే ప్రయోజనాలేంటో తెలుసుకుందాం రండి.. ⚛ ఏనుగుల్ని పరిశీలిస్తే.. అవి వాటి పిల్లల్ని ఎంతో ముద్దు చేస్తాయి. ఎప్పుడూ వాటికి దగ్గరగా ఉంటూనే వాటిని సంరక్షిస్తుంటాయి. ఇలా పిల్లల్ని మన రక్షణ వలయంలో ఉంచుకోవడం వల్ల వారిలో ఒక రకమైన ధైర్యం అలవడుతుంది. దీనివల్ల జీవితంలో ఎలాంటి ఆపద వచ్చినా వారు ధైర్యంగా ఎదుర్కోగలుగుతారంటున్నారు నిపుణులు. ⚛ గున్న ఏనుగు తన తల్లితోనే కాదు.. ఇతర ఏనుగులతోనూ ప్రేమగా ఉంటుంది. ఇందుకు ఆ పిల్ల ఏనుగు తల్లే కారణం. ఎందుకంటే తల్లి ఏనుగు చిన్న వయసు నుంచే తన పిల్లల్ని ఇతర ఏనుగులతో కలిసిపోయేలా ప్రోత్సహిస్తుందట! ఇలా మనమూ మన పిల్లలకు.. మన బంధువులు, స్నేహితులతో కలుపుగోలుగా ఉండడం నేర్పితే.. వారిలో సామాజిక నైపుణ్యాలు అలవడతాయంటున్నారు నిపుణులు. దీనివల్ల అనుబంధాల విలువ తెలుసుకోవడంతో పాటు నలుగురిలోనూ దూసుకుపోయే శక్తి లభిస్తుందంటున్నారు. ⚛ ఏనుగులు తమ తోటి జంతువులు చేసే పనుల్ని సునిశితంగా పరిశీలిస్తాయట. ఈ క్రమంలోనే పిల్ల ఏనుగులు చాలా విషయాలు నేర్చుకుంటాయట!

6.67-అంగుళాల HD LCD డిస్ప్లే అదుర్స్ 64MP ప్రైమరీ కెమెరా, 5,700mAh బ్యాటరీ అమెజాన్ ఇండియాలో ఈ ఫోన్ కొనేసుకోవచ్చు Philips S7221 5G Launch : కొత్త స్మార్ట్ ఫోన్ కొనేందుకు చూస్తున్నారా? ఫిలిప్స్ నుంచి భారత మార్కెట్లోకి కొత్త ఖతర్నాక్ ఫోన్ వచ్చేసింది. అదే.. ఫిలిప్స్ S7221 5జీ.. ఇందులో 25W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5,700mAh బ్యాటరీ ఉంది. 64MP రియర్ కెమెరా, 16MP ఫ్రంట్ కెమెరా ఉన్నాయి. డస్ట్, వాటర్ రెసిస్టెన్స్ కోసం IP64 రేటింగ్ (Philips S7221 5G Launch) అందిస్తుంది. సేఫ్టీ కోసం సైడ్-మౌంటెడ్ ఫింగర్‌ప్రింట్ సెన్సార్ కూడా ఉంది. ఫిలిప్స్ S7221 5జీ ఫీచర్లు, స్పెసిఫికేషన్లు, ధర వివరాలేంటో ఇప్పుడు పరిశీలిద్దాం.. ధర ఎంతంటే? : ఫిలిప్స్ S7221 5జీ స్మార్ట్‌ఫోన్ 6GB+128GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 20,499 కాగా, 8GB+128GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 22,499గా ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ అమెజాన్ ఇండియాలో అందుబాటులో ఉంది. ఈ ఫోన్ బ్లాక్, బ్లూ, యాష్ కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. ఫీచర్లు, స్పెసిఫికేషన్లు : ఫిలిప్స్ S7221 5జీలో 720x1,600 పిక్సెల్స్ రిజల్యూషన్, 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.67-అంగుళాల HD LCD డిస్ప్లే ఉంది. ఆక్టా-కోర్ స్ప్రెడ్ట్రమ్ T765 చిప్సెట్తో రన్ అవుతుంది. 8GB LPDDR4 ర్యామ్, 128GB ఇంటర్నల్ స్టోరేజ్ అందిస్తుంది. Read Also : Lava Virat V1 5G : వారెవ్వా.. లావా కొత్త 5G ఫోన్ వచ్చేసిందోచ్.. 128GB వేరియంట్ మీ బడ్జెట్ ధరలోనే..! ఆండ్రాయిడ్ 16తో రన్ అవుతుంది. 25W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టు ఇచ్చే 5,700mAh బ్యాటరీతో వస్తుంది. ఈ ఫోన్ కొలతలు 166mm పొడవు, 77mm వెడల్పు, 8.95mm మందం, బరువు 200 గ్రాములు ఉంటుంది. కెమెరా సెటప్ పరంగా.. ఫిలిప్స్ S7221 5జీ ఫోన్ బ్యాక్ సైడ్ 64MP ప్రైమరీ కెమెరా

వేడి నీళ్లు, డిష్ వాష్ సోప్ లిక్విడ్ తో మొండి మరకలను ఈజీగా వదిలించొచ్చు. దీని కోసం, పాన్ కొద్దిగా చల్లారిన తర్వాత, చెక్క గరిటెతో పైన ఉన్న మాడిన ఆహారాన్ని తీసేయండి. ఆ తర్వాత మాడిన భాగానికి సరిపడా నీళ్లు పోసి, కొద్దిగా డిష్‌వాష్ లిక్విడ్ వేసి స్టవ్ మీద 10-15 నిమిషాలు మరిగించండి. వేడి నీరు, సబ్బు కలిసి మాడిన పొరను మెత్తగా చేస్తాయి. స్టవ్ ఆపి చల్లారాక మెత్తటి స్పాంజితో తుడిస్తే మరకలు సులభంగా ఊడిపోతాయి. మొండిగా మారిన నల్లటి పొరను తొలగించడానికి బేకింగ్ సోడా అద్భుతంగా సహాయం చేస్తుంది. దీని కోసం, మాడిన ప్రాంతంలో బేకింగ్ సోడాను ఎక్కువగా చల్లి, కొద్దిగా నీళ్లు కలిపి చిక్కటి పేస్ట్‌లా చేయండి. దీనిని 15 నుండి 30 నిమిషాల పాటు అలాగే ఉంచాలి. బేకింగ్ సోడా పాత్రకు గీతలు పడకుండానే మాడిన పదార్థాన్ని వదిలిస్తుంది. ఆ తర్వాత నైలాన్ బ్రష్ లేదా స్పాంజితో రుద్దితే సరిపోతుంది. స్టెయిన్లెస్ స్టీల్ పాత్రలపై ఉన్న మొండి మాడు మరకలకు ఈ చిట్కా బాగా పనిచేస్తుంది. పాన్ నిండేలా సగం నీరు, సగం వైట్ వెనిగర్ పోసి స్టవ్‌పై మరిగించి దించేయండి. ఇప్పుడు ఆ నీటిని వంపేసి, పాన్‌లో బేకింగ్ సోడా చల్లండి. వెనిగర్, బేకింగ్ సోడా కలిస్తే నురుగు వస్తుంది. దీంతో.. తర్వాత ఈజీగా ఆ మొండి మరకలు వదులుతాయి. గిన్నె మాడిన వెంటనే శుభ్రం చేయడానికి సమయం లేకపోతే. మీరు రాత్రంతా నానపెట్టి.. మరుసటి రోజు శుభ్రం చేయచ్చు.. దీనికోసం, మాడిన పాత్రలో వేడి నీళ్లు, కొద్దగా డిష్ సోప్ వేసి.. రాత్రంతా నానపెట్టాలి. రాత్రంతా నానపెట్టి.. ఉదయాన్నే శుభ్రం చేస్తే.. సులభంగా మాడు పోతుంది. మీ పాత్రలు మళ్లీ కొత్త వాటిలా కనిపిస్తాయి. నాన్-స్టిక్ లేదా కోటింగ్ ఉన్న పాత్రలు మాడిపోయినప్పుడు మరింత జాగ్రత్తగా ఉండాలి. వీటిని శుభ్రం చేయడానికి స్టీల్

హెల్మెట్ లోపల వేడి, తేమ, చెమట ఎక్కువగా ఉంటాయి. దీనివల్ల ఫంగస్ పెరిగేందుకు అవకాశం ఎక్కువ. ఇది తలపై తామర వంటి చర్మ వ్యాధులకు దారితీస్తుంది. మీ ఫ్రెండ్ తలలో పేలు ఉంటే, అవి హెల్మెట్ లోపలికి చేరతాయి. తర్వాత మీరు ఆ హెల్మెట్ పెట్టుకున్నప్పుడు, ఆ పేలు మీ తలలోకి సులభంగా వచ్చేస్తాయి. హెల్మెట్‌లో పేరుకుపోయిన చెమట, మురికి చర్మానికి తగిలినప్పుడు దద్దుర్లు, దురద వంటి అలెర్జీలు వస్తాయి. హెల్మెట్‌లో చెమట ఎక్కువగా చేరడం వల్ల దుర్వాసన వస్తుంది. ఆ హెల్మెట్‌ను మీరు వాడినప్పుడు, ఆ వాసన మీ జుట్టుకు కూడా పడుతుంది. హెల్మెట్‌లో ఉండే బ్యాక్టీరియా వల్ల నుదుటిపై మొటిమలు, చిన్న చిన్న కురుపులు వంటి సమస్యలు వస్తాయి. మీకు సరిపోని సైజ్ హెల్మెట్ ధరించడం వల్ల తలనొప్పి, మెడనొప్పి వంటి సమస్యలు వస్తాయి. భద్రత కూడా తక్కువే. వీలైనంత వరకు ఇతరులతో హెల్మెట్ షేర్ చేసుకోవద్దు. ఒకవేళ తప్పనిసరి అయితే, లోపల యాంటీసెప్టిక్ స్ప్రే చేసి వాడండి. అలాగే, హెయిర్ కవర్ లేకుండా హెల్మెట్ పెట్టుకోవద్దు. ఇండియాలో అత్యంత చవకైన ఎలక్ట్రిక్ కారు ఇదే.. ధర, ఫీచర్లు అదుర్స్! Budget EV Cars : అత్యంత చౌక టాటా ఎలక్ట్రిక్ కారు ఏదో తెలుసా? Petrol Saving : గురూ.. నీ పెట్రోల్ ఖర్చు తగ్గాలంటే ఈ ట్రిక్స్ ఫాలోకా

ఎమర్జెన్సీ సమయాల్లో డబ్బు అవసరమైనప్పుడు మొబైల్ లోన్ యాప్స్ ఎంతో సులభంగా లోన్స్ అందిస్తుననట్లు కనిపిస్తాయి. కొన్ని క్లిక్స్, ప్రాథమిక వ్యక్తిగత వివరాలు అందించగానే నిమిషాల్లో నగదు జమ చేస్తామనే ఆకర్షణీయమైన ఆఫర్లు చాలా మందిని ప్రశ్నలు అడగకుండా అప్పు తీసుకునేలా చేశాయి. అయితే అసలు సమస్య ఇక్కడే మొదలవుతుంది. ప్రస్తుతం అనేక లోన్ యాప్స్ తక్షణ ఆమోదం, తక్కువ వడ్డీ రేట్లు, ఎలాంటి కాగిత పత్రాలు అవసరం లేదనే ప్రచారాలతో వినియోగదారులను వలలో వేసుకుంటున్నాయి. దీని వల్ల ఆర్థికంగా నష్టపోవడమే కాకుండా పర్సనల్ ఇన్ఫర్మేషన్ సైబర్ నేరగాళ్ల చేతుల్లోకి వెళ్లే ప్రమాదం ఉంది.కడప రైతు కిరాక్ ప్లాన్! యూట్యూబ్ చూసి లక్షల లాభాలు.. ప్రధాని ప్రశంసలుఅప్పు కాదు.. ముందు అప్పు ఇచ్చే సంస్థ గురించి తెలుసుకోండి.. రుణం ఎంత త్వరగా వస్తుందనే దానికంటే అసలు మీకు రుణం ఇస్తున్నది ఎవరు అనే విషయాన్ని తెలుసుకోవడం చాలా ముఖ్యం. స్పష్టత లేని రుణదాత వివరాలు, వడ్డీ రేట్లు, చార్జీలపై సమాచారం లేకపోవడం, ఫోన్ లోని అనవసరమైన సమాచారానికి అనుమతులు అడగడం, ఎటువంటి క్రెడిట్ పరిశీలన లేకుండా తక్షణ ఆమోదం తెలపడం వంటివి నకిలీ యాప్స్ ప్రధాన లక్షణాలు. అద్భుతమైన డిజైన్ లేదా తక్షణ రుణం అని చెప్పినంత మాత్రాన ఆ సంస్థ నిజమైనదని నమ్మకూడదు.యాప్ స్టోర్ వివరాలను సరిచూసుకోండి.. ఏదైనా యాప్ గూగుల్ ప్లే స్టోర్ లేదా ఆపిల్ యాప్ స్టోర్ లో లభ్యమైనంత మాత్రాన దానిని వెంటనే నమ్మలేం. యాప్‌ను డౌన్లోడ్ చేసే ముందు దాని డెవలపర్ పేరు, వివరణ, ప్రైవసీ పాలసీ, కస్టమర్ కేర్ వివరాలు, వినియోగదారుల రివ్యూలను క్షుణ్ణంగా పరిశీలించాలి. ముఖ్యంగా ఈ వివరాలన్నీ ఆ రుణదాత అధికారిక వెబ్‌సైట్‌లోని వివరాలతో సరిపోలుతున్నాయో లేదా చూసుకోవాలి. యాప్ డెవలపర్ వివరాలకు, అధికారిక వెబ్సైట్ కు తేడా ఉంటే ఈ యాప్‌కు దూరంగా ఉండటమే మంచిది.నియంత్రణ సంస్థల అనుమతులు ఉన్నాయా?మీకు రుణం
అన్ని రకాల విటమిన్లు, మినరల్స్ ఉన్న ఆహారాన్ని తినండి. బయోటిన్, విటమిన్ ఎ, ఇ, ప్రోటీన్ ఫుడ్ తింటే జుట్టు, గోళ్లు, చర్మం అందంగా, ఆరోగ్యంగా మారుతాయని హెల్త్‌లైన్ తెలిపింది. ఆరోగ్యకరమైన కొవ్వులు ఎక్కువగా ఉన్న ఆహారాలు తినండి. అవకాడో, సాల్మన్, ఆలివ్ ఆయిల్ తీసుకుంటే చర్మం అందంగా మారుతుంది. జుట్టు ఒత్తుగా పెరుగుతుంది. విటమిన్ సి ఎక్కువగా ఉన్న ఆహారాలు తినడం వల్ల కొల్లాజెన్ ఉత్పత్తి పెరుగుతుంది. దీంతో చర్మం ఆరోగ్యంగా మారుతుంది. గోళ్లు కూడా బలంగా మారుతాయి. రోజుకి 8 నుంచి 10 గ్లాసుల నీటిని తాగండి. నీరు తాగడం వల్ల బాడీ హైడ్రేట్ అవుతుంది. స్కిన్ ఎలాస్టిసిటీ పెరుగుతుంది. చర్మం, జుట్టుకి సహజ మెరుపు వస్తుంది. రోజుకి 8 గంటల పాటు ప్రశాంతంగా నిద్రపోండి. నిద్రలో కణాల పునరుద్ధరణ వేగంగా జరుగుతుంది. దీంతో చర్మ సమస్యలు తగ్గుతాయి. ఒత్తిడి పెరగడం వల్ల జుట్టు రాలడం తీవ్రం అవుతుంది. ఒత్తిడి తగ్గేందుకు ప్రతిరోజూ ధ్యానం చేయండి. దీంతో మనసు ప్రశాంతంగా ఉంటుంది. చర్మానికి ప్రతిరోజూ సన్‌స్క్రీన్ లోషన్ రాసుకోండి. ముఖ్యంగా ఎండలోకి వెళ్లే ముందు సన్‌స్క్రీన్ లోషన్ రాయండి. దీంతో యూవీ కిరణాల నుంచి చర్మానికి రక్షణ లభిస్తుంది. కొబ్బరి నూనె, జొజొబా ఆయిల్‌తో తలను సున్నితంగా మసాజ్ చేసుకోండి. దీని వల్ల జుట్టు కుదుళ్లు బలంగా మారుతాయి. జుట్టు రాలడం తగ్గుతుంది. ప్రాసెస్ చేసిన ఆహారం ఎక్కువగా తినడం వల్ల కొల్లాజెన్ విచ్ఛిన్నం అవుతుంది. దీని వల్ల చర్మంపై ముడతలు వస్తాయి. కాబట్టి ప్రాసెస్ చేసిన ఆహారానికి దూరంగా ఉండండి

ఛాతీలో నొప్పి లేదా మంట వస్తే చాలామంది గ్యాస్ సమస్యగా భావిస్తుంటారు. కానీ కొన్ని సందర్భాల్లో ఇదే తరహా లక్షణాలు గుండె సమస్యలకు కూడా సంకేతం కావచ్చు. గ్యాస్ నొప్పి, గుండెపోటు లక్షణాల మధ్య తేడాను తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఇంటర్నెట్ డెస్క్: ఛాతీలో మంట, నొప్పి లేదా అసౌకర్యం కనిపించినప్పుడు చాలామంది దాన్ని గ్యాస్ సమస్యగా భావిస్తుంటారు. ముఖ్యంగా అజీర్తి, కడుపు ఉబ్బరం, వికారం వంటి లక్షణాలు ఉంటే గ్యాస్ట్రిక్ సమస్యేనని అనుకుంటారు. అయితే ఇలాంటి లక్షణాలు కొన్ని సందర్భాల్లో గుండెకు సంబంధించిన సమస్యల్లోనూ కనిపించవచ్చని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. అందుకే ఛాతీలో అసౌకర్యం కలిగినప్పుడు కారణాన్ని నిర్ధారించకుండా నిర్లక్ష్యం చేయడం ప్రమాదకరమని సూచిస్తున్నారు. గ్యాస్ట్రిక్ సమస్య ఉన్నప్పుడు సాధారణంగా పొట్ట పైభాగంలో అసౌకర్యం, ఛాతీ కింది భాగంలో నొప్పి లేదా మంట కనిపించవచ్చు. కడుపు ఉబ్బినట్లు అనిపించడం, తేన్పులు రావడం, అజీర్తి వంటి సమస్యలు కూడా ఉండొచ్చు. అయితే కేవలం లక్షణాలను బట్టి ఇది గ్యాస్ సమస్యేనని ఖచ్చితంగా చెప్పడం సాధ్యం కాదు. గుండెకు రక్తప్రసరణ తగ్గినప్పుడు ఛాతీలో బిగుతుగా, భారంగా లేదా ఒత్తిడిగా అనిపించవచ్చు. కొందరిలో ఛాతీ నొప్పితో పాటు వికారం, తల తిరగడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, చెమటలు పట్టడం వంటి లక్షణాలు కనిపించవచ్చు. కొన్ని సందర్భాల్లో గుండె సమస్య లక్షణాలు అజీర్తి లేదా గ్యాస్ సమస్యను పోలి ఉండే అవకాశం ఉంది. అందుకే ఛాతీ నొప్పిని కేవలం గ్యాస్ అని భావించి ఇంట్లోనే ఉండిపోవడం సరికాదని నిపుణులు చెబుతున్నారు. వయసు పెరిగేకొద్దీ గుండె సంబంధిత సమస్యలపై జాగ్రత్త అవసరం. ముఖ్యంగా మధుమేహం, అధిక రక్తపోటు, అధిక కొలెస్ట్రాల్, ధూమపానం, కుటుంబంలో గుండె జబ్బుల చరిత్ర వంటి అంశాలు ఉన్నవారు ఛాతీ సంబంధిత లక్షణాలను తేలిగ్గా తీసుకోకూడదు. ఛాతీలో కొత్తగా లేదా తీవ్రమైన నొప్పి రావడం, నొప్పి తగ్గకుండా కొనసాగడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, చల్లటి చెమటలు, మూర్ఛ

విష్ణు ప్రియ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. సినిమాల మీద ఆసక్తితో ఎక్కువగా వినోదం కేటగిరిలో వార్తలు రాస్తున్నారు. అదేవిధంగా హెల్త్, లైఫ్ స్టైల్, క్రైమ్ కేటగిరీలకు సంబంధించిన వార్తలు కూడా రాస్తూ ఉంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆమెకు జర్నలిజంలో పదేళ్లకు పైగా అనుభవం ఉంది. Daycare Child Safety: డేకేర్ అంటే చిన్న పిల్లలను తల్లిదండ్రులు లేని సమయంలో సురక్షితంగా చూసుకోవడంతో పాటు వారికి మంచి అలవాట్లు, ప్రాథమిక విద్య, ఆటలు వంటి కార్యక్రమాలు నిర్వహించే కేంద్రం. పూర్తి రోజు, అర్ధ రోజు లేదా కొన్ని గంటల సేవల ప్రకారం ఫీజులు వసూలు చేస్తారు. ప్రస్తుతం అనేక ప్రైవేట్ సంస్థలు, పెద్ద కంపెనీలు కూడా తమ ఉద్యోగుల కోసం కార్యాలయాల్లోనే డేకేర్ సౌకర్యం కల్పిస్తున్నాయి. అయితే ఇటీవల బెంగళూరులోని ఓ డేకేర్ కేంద్రంలో చిన్నారిపై జరిగిన దారుణ వేధింపులకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో తల్లిదండ్రుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. చిన్నారిని భయపెట్టడం, ఏడుస్తున్నా పట్టించుకోకపోవడం, అనుచితంగా ప్రవర్తించడం వంటి ఘటనలు తీవ్ర విమర్శలకు దారితీశాయి. ఇలాంటి సంఘటనలు పిల్లల శారీరక ఆరోగ్యంతో పాటు వారి మానసిక ఆరోగ్యంపై కూడా తీవ్ర ప్రభావం చూపుతాయని బాలల నిపుణులు హెచ్చరిస్తున్నారు. అందుకే డేకేర్ ఎంపిక చేసే ముందు తల్లిదండ్రులు కొన్ని విషయాలు తప్పనిసరిగా పరిశీలించాలి. అక్కడ సీసీటీవీ కెమెరాలు ఉన్నాయా, సిబ్బందికి సరైన శిక్షణ ఉందా, పిల్లల భద్రత కోసం ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు, అత్యవసర పరిస్థితుల్లో ఎలా స్పందిస్తారు వంటి అంశాలను తెలుసుకోవాలి. అలాగే పిల్లల ప్రవర్తనలో అకస్మాత్తుగా మార్పులు కనిపిస్తే వాటిని నిర్లక్ష్యం చేయకుండా కారణాన్ని తెలుసుకునే ప్రయత్నం చేయాలి. ఒకవేళ డేకేర్‌లో పిల్లలపై నిర్లక్ష్యం, శారీరక లేదా మానసిక వేధింపులు జరిగినట్లు అనుమానం వచ్చినా లేదా ఆధారాలు లభించినా వెంటనే సంబంధిత

ఏపీలో రెండున్నరేళ్ల క్రితం అధికారంలోకి వచ్చిన కూటమి సర్కార్ తనదైన శైలిలో పాలన సాగిస్తోంది. సీఎం చంద్రబాబు కూడా గతానికి భిన్నంగా దూకుడుగా నిర్ణయాలు తీసుకుంటూ ముందుకెళ్తున్నారు. కేబినెట్లో మంత్రులు కూడా తనతో పోటీ పడాలని ఆయన పదే పదే చెప్తుంటారు. అయితే ఆయన కేబినెట్లో తనతో పాటు కుమారుడు లోకేష్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాత్రమే ఎక్కువగా ఫోకస్ అవుతుంటారు. మిగతా మంత్రుల పాత్ర నామమాత్రమే అన్న విమర్శలు వినిపిస్తుంటాయి. ఇదే విషయం తాజాగా మరోసారి రుజువైంది.పోలవరం లోపాల పుట్ట- హైకోర్టు ముందు స్వయంగా వాదించబోతున్న మాజీ ఐపీఎస్ ..!పోలవరం కుడి కాలువ ద్వారా ఉత్తరాంధ్రకు నీళ్లు విడుదల చేసే కార్యక్రమాన్ని ఇవాళ సీఎం చంద్రబాబు లాంఛనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమం సందర్భంగా ప్రధాన పత్రికల్లో ప్రభుత్వం విడుదల చేసిన ప్రకటనలో సీఎం చంద్రబాబుతో పాటు ప్రధాని మోడీ, మంత్రి నారా లోకేష్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఫొటోలు మాత్రమే ఉన్నాయి. సాగునీటిపారుదల ప్రాజెక్టు ప్రారంభోత్సవం అయినా ఆ శాఖను చూస్తున్న జలవనరుల మంత్రి నిమ్మల రామానాయుడు ఫొటో మాత్రం లేదు. దీనిపై చంద్రబాబు మాజీ ఇంటెలిజెన్స్ ఛీఫ్, మాజీ ఐపీఎస్ ఏబీ వెంకటేశ్వరరావు (AB Venkateswara Rao) వ్యంగాస్త్రాలు సంధించారు. Bhogapuram Airport: భోగాపురం క్రెడిట్ వారిదే ? ఆధారాలతో తేల్చేసిన మాజీ ఇంటెల్ ఛీఫ్ ..!ముఖ్యమంత్రి గారూ,.. మీరు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు తప్పించి కాబినెట్ లోని మంత్రులందరూ నామమాత్రులే అనేది లోక విదితం అంటూ ఏబీ వెంకటేశ్వరావు ఇవాళ ట్వీట్ చేశారు. అయినా ఏదో సంప్రదాయాలంటూ ఉంటాయి కదా!

ఆరోగ్యంగా ఉండాలని, బరువు తగ్గాలి అనుకునేవారు ఈ రోజుల్లో తాము చేసే వంటలో నూనె తగ్గించడం మొదలుపెడుతున్నారు. కానీ, నూనె తగ్గించి, వంట చేయడం వల్ల కూర రుచిగా ఉండదు అనే భావన చాలా మందికి ఉంటుంది. కానీ, ప్రముఖ సెలబ్రెటీ షెఫ్ రణ్ వీర్ బ్రార్ రీసెంట్ గా ఓ సీక్రెట్ బయట పెట్టారు. వంటలో రుచి కొంచెం కూడా తగ్గకుండా, అతి తక్కువ నూనెతో కూడా రుచిగా, ఆరోగ్యకరంగా ఎలా చేయాలో ఆయన చెప్పారు. ఆ ట్రిక్స్ ఇప్పుడు మనం తెలుసుకుందాం.. దాదాపు అందరి ఇంట్లోనూ... పెద్ద పెద్ద ఆయిల్ క్యాన్లు, బాటిల్స్ వాడుతూ ఉంటారు. వాటితోనే నేరుగా.. కూరలోని నూనె పోసేస్తూ ఉంటారు. లేదంటే.. ఆ నూనె డబ్బాల్లో పెద్ద గరిటెలు పెడుతూ ఉంటారు. దీని వల్ల మనకు తెలీకుండానూ కూరలో నూనె ఎక్కువ వాడేస్తూ ఉంటాం. దీని వల్ల, మనం తెలీకుండానే నూనె ఎక్కువగా తీసుకుంటూ ఉంటాం. అందుకే, ముందు.. ఆ నూనె డబ్బాను మార్చేయాలి. పెద్ద మూత ఉన్న నూనె డబ్బాను తీసేసి.. దాని ప్లేస్ లో చిన్న లేదా సన్న మూతి ఉన్న నూనె బాటిల్ పెట్టాలి. దీని వల్ల.. కాస్త తక్కువ నూనె గా వాడతాం. అనుకోకుండా, నూనె ఎక్కువగా పడే అవకాశమే ఉండదు. మనం కూరకు పోపు లేదా తాలింపు వేసేటప్పుడు పోపు గింజలు మాడిపోకుండా ఉండటానికి మనం ఎక్కువ నూనెలు వాడుతూ ఉంటాం. కానీ, అలా జరగకుండా ఉండేందుకు సింపుల్ చిట్కా వాడొచ్చు. తాలింపు వేసేటప్పుడు నూనె చాలా తక్కువగా వేసి, గింజలు చిటపటలాడాక కొద్దిగా నీటిని చిలకరించండి. ఇలా చేయడం వల్ల మసాలాలు మాడిపోవు, పైగా నూనె తక్కువైనా మసాలా సువాసన, రుచి వంటకానికి బాగా పడతాయి. కర్రీలు, కూరలు లేదా పులుసులు వండిన తర్వాత పైభాగంలో నూనె తేలుతూ కనిపిస్తుంది. వంట పూర్తయి సర్వ్ చేసే ముందు, పైన

నాన్ వెజ్ ప్రియులు మటన్ (మేక మాంసం) కూరను ఇష్టంగా తింటారు.. కర్రీ, ఫ్రైతో పాటు పలు రకాలుగా వండుకుని.. ఇష్టంగా ఆరగిస్తారు.. అయితే.. మటన్ కర్రీ చాలా మందికి ఇష్టమైన వంటకం అయినప్పటికీ, దానిని తయారు చేయడం కష్టమనీ, నీచు వాసన వస్తుందనీ కొందరు భయపడతారు. అయితే, ప్రెజర్ కుక్కర్లో సులభమైన పద్ధతిని అనుసరించి, ఎటువంటి నీచు వాసన లేకుండా, ముక్కలు మెత్తగా, జ్యూసీగా ఉండే రుచికరమైన మటన్ కర్రీని తయారు చేసుకోవచ్చు. ఈ రెసిపీ బిగినర్స్‌కు కూడా చాలా సులువైనది.. కొన్ని టిప్స్ పాటిస్తే.. అద్భుతమైన మటన్ కర్రీని వండుకోని ఇష్టంగా తినవచ్చు.. ప్రెజర్ కుక్కర్లో రుచికరమైన మటన్ కర్రీ తయారీ మటన్ కర్రీ తయారీకి ముందు, ఒక గ్లాసు నీటిలో కొద్దిగా పసుపు, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడిని కలిపి పక్కన పెట్టుకోండి. ఈ మసాలా మిశ్రమం కర్రీకి మంచి రుచిని అందిస్తుంది. మంచిగా మటన్‌ను తీసుకోండి. మటన్ కర్రీలో ముఖ్యమైన చిట్కా ఏమిటంటే, మటన్‌ను వండే ముందు ఒక గంట పాటు ఉప్పు నీటిలో నానబెట్టడం. ఇది మటన్‌ను చాలా మెత్తగా, జ్యూసీగా మారుస్తుంది. ఉప్పు ముక్కల మధ్యలోకి వెళ్లి నీచు వాసన రాకుండా చేస్తుంది. ఈ పద్ధతి చికెన్‌కు కూడా వర్తిస్తుంది. మ్యారినేషన్ పూర్తయిన తర్వాత మటన్ ముక్కలను తీసి పక్కన పెట్టుకోవాలి. సుగంధ ద్రవ్యాలు వేయించడం: ప్రెజర్ కుక్కర్‌ను స్టవ్ మీద పెట్టి, తగినంత నూనె పోసి వేడి చేయాలి. నూనె వేడెక్కిన తర్వాత కొన్ని బిర్యానీ దినుసులు – లవంగాలు, యాలుకలు, దాల్చినచెక్క, బిర్యానీ ఆకు, నల్ల యాలుకలు – వేసి కొద్దిసేపు వేయించాలి. ఉల్లిపాయలు వేయడం: బిర్యానీ దినుసులు వేగిన తర్వాత, సన్నగా, పొడవుగా తరిగిన రెండు పెద్ద ఉల్లిపాయలను వేసి బంగారు రంగు వచ్చేవరకు వేయించాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కలపడం: ఉల్లిపాయలు వేగిన తర్వాత, అల్లం వెల్లుల్లి పేస్ట్‌ను

దురిశెట్టి ధర్మరాజు జీ తెలుగు న్యూస్ (zee telugu news)లో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు దాదాపు జర్నలిజంలో ఐదు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ సోషల్, ఆస్ట్రాలజీ, టెక్నాలజీ, ఆటోమొబైల్స్, బిజినెస్, జాతీయం అంశాలకు సంబంధించిన తాజా వార్తలతో పాటు విశ్లేషణ పూరితమైన కథనాలను అందిస్తారు. అలాగే ఆయనకు వెబ్‌సైట్‌కు సంబంధించిన వీడియో కంటెంట్‌పై కూడా అవగాహన ఉంది.. Chanakya Niti Rules: మన జీవితంలో కొన్నిసార్లు బయట వ్యక్తుల కంటే.. మనకు అత్యంత సన్నిహితంగా ఉండే సొంత మనుషులే ఎక్కువ బాధ పెడుతూ ఉంటారు.. మన ఎదుగుదలను చూసి ఓర్వలేక అసూయతో రగిలిపోయే బంధువులతో పాటు మిత్రులు మన చుట్టూనే ఉండిపోతూ ఉంటారు.. వాళ్లు మనపై కుట్రలు పన్నుతున్నారని తెలిసినప్పుడు చాలామంది ఆవేశంతో తప్పులు చేస్తూ ఉంటారు. అయితే ఇలాంటి విపత్కర పరిస్థితులను ఎలా ఎదుర్కోవాలో వేల ఏల క్రితమే ఆచార్య చానక్యుడు తన చాణక్య నీతి శాస్త్రంలో స్పష్టంగా వివరించారు. సన్నిహితులు ద్రోహానికి పాల్పడినప్పుడు ఆవేశంతో నిర్ణయాలు తీసుకోకుండా.. చాణక్యుడు సూచించిన ఐదు పద్ధతులను పాటిస్తే మిమ్మల్ని మీరు సులభంగా కాపాడుకోవచ్చు.. ప్రశాంతంగా ఉండాల్సి ఉంటుంది.. మీరు అత్యంత సన్నిహితంగా ఉండే వ్యక్తులు మీకు ద్రోహం చేస్తున్నారని.. లేదా మీపై కుట్రలు చేస్తున్నారని తెలిసినప్పుడు వెంటనే ఆవేశపడకుండా ఉండడం చాలా మంచిది.. కోపంతో రగిలిపోతూ అప్పటికప్పుడు స్పందించడం వల్ల పరిస్థితి మరింత దిగజారిపోయే అవకాశాలు ఉంటాయని చాణక్యనీతి శాస్త్రం చెబుతోంది.. మీరు తీసుకునే తొందరపాటు నిర్ణయాల వల్ల మీకే నష్టం కలగవచ్చు.. కాబట్టి ఆ సమయంలో ఎంత ప్రశాంతంగా ఉంటే అంత మంచిదని.. ముఖ్యంగా మౌనంగా ఉండి పరిస్థితులను అంచనా వేయడం చాలా మంచిదని చాణక్యనీతి శాస్త్రం క్లియర్ గా చెబుతోంది.. మీ సీక్రెట్స్ ఎవరితో పంచుకోకూడదు.. కుటుంబంలో నమ్మకం చాలా ముఖ్యమైనదిగా భావించవచ్చు.. కానీ అందరితో అన్నీ పంచుకోవడం తెలివైన పని కాదని చాణక్యనీతి శాస్త్రం చెబుతోంది
ఇంట్లో పని చేయడానికి వీలైనంత వరకు ఒకే స్థలాన్ని ఎంచుకోవడం మంచిది. ప్రత్యేకంగా ఒక గది లేకపోయినా బెడ్రూమ్లో ఒక మూల, హాల్లో ఖాళీగా ఉన్న ప్రదేశం లేదా కిటికీ దగ్గర చిన్న టేబుల్ పెట్టుకోవచ్చు. ప్రతిరోజూ ఒకే చోట కూర్చొని పని చేయడం వల్ల పని చేస్తున్నామనే భావన ఏర్పడి ఫోకస్ పెరగడానికి సహాయపడుతుంది. హోమ్ ఆఫీస్ కోసం ఇంట్లో ఎక్కువ రద్దీ లేని ప్రదేశాన్ని ఎంచుకోవడం మంచిది. టీవీ శబ్దం, వంటగది హడావుడి ఎక్కువగా ఉండే చోట కాకుండా ప్రశాంతమైన మూలను చూసుకోవాలి. కిటికీ దగ్గర సహజమైన వెలుతురు వచ్చే ప్రదేశం అయితే మరింత మంచిది. బయట మంచి వ్యూ ఉంటే పని మధ్యలో కాసేపు బయట చూడటం కూడా కళ్లకు విశ్రాంతినిస్తుంది. వర్క్ ఫ్రం హోమ్‌లో ఎక్కువ సమయం కూర్చొని పనిచేయాల్సి ఉంటుంది కాబట్టి కుర్చీ సౌకర్యంగా ఉండాలి. వెన్నుకు సపోర్ట్ ఇచ్చే కుర్చీ అయితే మరింత మంచిది. టేబుల్ ఎత్తు కూడా సరిగ్గా ఉండాలి. ఎప్పుడూ బెడ్‌పై ల్యాప్‌టాప్ పెట్టుకుని వంగి పనిచేయడం వల్ల మెడ, వెన్నుపై ఒత్తిడి పడే అవకాశం ఉంటుంది. టేబుల్‌పై ల్యాప్‌టాప్, పుస్తకాలు పెట్టుకునేందుకు సరిపడా స్థలం ఉండాలి. సోఫా లేదా బెడ్‌పై కూర్చొని ఎక్కువసేపు పని చేయడం కంటే సరైన టేబుల్, కుర్చీ ఉపయోగించడం మంచిది. చీకటిగా ఉండే చోట పని చేయడం వల్ల కళ్లపై ఒత్తిడి పడుతుంది. వీలైతే సహజమైన వెలుతురు వచ్చే ప్రదేశంలో వర్క్‌స్పేస్‌ను ఏర్పాటు చేసుకోవచ్చు. కిటికీ పక్కన టేబుల్ పెట్టుకుంటే బయట కనిపించే వాతావరణం కూడా కొంత రిలాక్స్‌గా అనిపించవచ్చు. అయితే నేరుగా ఎండ లేదా ఎక్కువ వెలుతురు కంప్యూటర్ స్క్రీన్‌పై పడకుండా చూసుకోవాలి. స్టడీ రూమ్ అంటే చాలా సీరియస్‌గా, బోర్‌గా కనిపించాల్సిన అవసరం లేదు. మీకు ఇష్టమైన ఫోటోలు, చిన్న మొక్కలు, పెయింటింగ్స్, ప్రయాణాల్లో తీసుకున్న జ్ఞాపకాలను అక్కడ పెట్టుకోవచ్చు. చదువుకు లేదా పనికి
రెండు స్పూన్ల శనగపిండిలో అర టీ స్పూన్ పసుపు, కొంచెం పాలు కలిపి పేస్ట్ తయారు చేయండి. దీన్ని ముఖానికి రాయడం వల్ల ఫేసియల్ హెయిర్ తొలగుతుంది. రెండు స్పూన్ల అరటిపండు గుజ్జులో ఓట్మీల్ కలిపి ముఖానికి రాసుకోండి. తర్వాత సున్నితంగా స్క్రబ్ చేయడం వల్ల మృతకణాలు తొలగుతాయి. ఫేసియల్ హెయిర్ తగ్గుతుంది. బొప్పాయి గుజ్జులో పసుపు కలిపి ముఖానికి రాయండి. ఇందులోని పోషకాలు అందాన్ని పెంచుతాయి. అవాంచిత రోమాలను అదుపు చేస్తాయి. పంచదారలో నిమ్మరసం, తేనె కలిపి ముఖానికి అప్లై చేయండి. తర్వాత మాస్క్ తొలగిస్తే ఫేసియల్ హెయిర్ తగ్గుతుంది. ఒక గుడ్డు తెల్లసొనలో మొక్కజొన్న పిండి కలిపి ముఖానికి రాయండి. బాగా ఆరిన తర్వాత సున్నితంగా తొలగించండి. దీంతో అవాంచిత రోమాలు తొలగుతాయి. బియ్యం పిండిలో పాలు కలిపి ప్యాక్ తయారు చేయండి. దీన్ని ముఖానికి అప్లై చేసి 10 నిమిషాల తర్వాత కడిగితే అవాంచిత రోమాలు తొలగుతాయి. ఒక టేబుల్ స్పూన్ తేనెని, మరో టీ స్పూన్ నిమ్మరసంతో కలిపి ముఖానికి రాయండి. ఇది చర్మాన్ని అందంగా మార్చుతుంది. అవాంచిత రోమాలు తొలగుతాయి. బంగాళదుంప రసంలో పెసరపప్పు పేస్ట్ కలిపి ముఖానికి రాయండి. ఇది ఫేసియల్ హెయిర్‌ను తొలగిస్తుంది. అందాన్ని రెట్టింపు చేస్తుంది. చందనం పొడిలో రోజ్‌వాటర్ కలిపి ముఖానికి రాయండి. కాసేపు అయ్యాక క్లీన్ చేస్తే అవాంచిత రోమాలు తొలగుతాయి
పడుకునే ముందే తర్వాతి రోజు కోసం ప్లాన్ రెడీ చేసుకోండి. ఉదయాన్నే ఏ టిఫిన్ వండాలి, ఏ పని చేయాలో నిర్ణయించుకోండి. దీంతో సమయం ఆదా అవుతుంది. పనులు త్వరగా పూర్తి అవుతాయి. ఇంటి పనులు, ఆఫీస్ పనులను ముందుగానే విభజించుకోండి. ప్రతి పనికి ఒక నిర్ధిష్ట సమయం కేటాయించుకోండి. ఆ షెడ్యూల్ ప్రకారం పని చేయండి. మీరు చేయలేని పనులను మీకు అప్పగిస్తే నో చెప్పండి. దీని వల్ల మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఒత్తిడి తగ్గుతుంది. మీరు చేయాల్సిన పనులు త్వరగా పూర్తి అవుతాయి. ఇంటి పనుల చేసేటప్పుడు కుటుంబ సభ్యుల సాయం తీసుకోండి. అన్ని పనులు నేనే చేయాలని అనుకోవద్దు. ఇతరుల సాయం తీసుకుంటే సమయం కలిసి వస్తుంది. ఆఫీస్‌లో లేదా ఇంట్లో చేయాల్సిన పనుల్లో ఒకే రకంగా ఉన్న పనులను ఒక సమూహంగా మార్చండి. వాటిని ఒకసారి పూర్తి చేయండి. దీంతో టైం కలిసి వస్తుంది. ఫోన్ ఎక్కువగా ఉపయోగించడం వల్ల సమయం వృథా అవుతుంది. పనులు చేసేటప్పుడు ఫోన్ నోటిఫికేషన్లు ఆఫ్ చేయండి. దీంతో ఏకాగ్రత పెరుగుతుంది. ఏదైనా ఒక పనిని పూర్తి చేయడానికి రెండు నిమిషాల కంటే తక్కువ సమయం పడితే ఆ పనిని వెంటనే పూర్తి చేయండి. ఆ పనిని వాయిదా వేయవద్దు. ఆఫీస్ పని, ఇంటి పని కోసం మాత్రమే కాకుండా మీ కోసం మీరు కొంత సమయాన్ని కేటాయించుకోండి. దీని వల్ల మీలో ఒత్తిడి తగ్గుతుంది. అన్ని పనులు పర్ఫెక్ట్గా పూర్తి కావాలని అనుకోవద్దు. ఇలా పర్ఫెక్షన్ కోసం ప్రయత్నిస్తే సమయానికి పనులు పూర్తి కావు. పర్ఫెక్షన్కు బదులుగా పురోగతిపై దృష్టి పెట్టండి

ఈ రోజుల్లో స్మార్ట్‌ఫోన్ లేని లైఫ్‌ను ఊహించుకోవడం కూడా కష్టమే. కాల్స్ మాట్లాడటం దగ్గర్నుంచి ఇంటర్నెట్, బ్యాంకింగ్, ఎంటర్టైన్మెంట్ వరకు అన్నింటికీ ఫోనే ఆధారం. కూడు, గూడు మాదిరిగా ఫోన్ కూడా మనిషి నిత్యావసర వస్తువుల్లో భాగమయ్యింది. ఇలా నిత్యజీవితంలో ఎంతో కీలకంగా మారిన స్మార్ట్ ఫోన్ ను చాలా జాగ్రత్తగా వాడాలి... ముఖ్యంగా బ్యాటరీ, ఛార్జింగ్ విషయంలో చేసే చిన్నచిన్న పొరపాట్లు పెద్ద సమస్యలకు దారితీయొచ్చు. మరీముఖ్యంగా ఛార్జింగ్ తీసేటప్పుడు చాలామంది కామన్ గా ఓ తప్పు చేస్తుంటారు, కానీ దాన్ని పెద్దగా పట్టించుకోరు... అదే ఫోన్, ఛార్జర్ రెండింటిని డ్యామేజ్ చేయవచ్చు. చాలామంది ఫోన్ లో ఛార్జింగ్ ఫుల్ అయ్యాక ఛార్జర్ కేబుల్‌ను పట్టుకుని గబుక్కున లాగేస్తుంటారు. ఇది పూర్తిగా తప్పుడు పద్ధతి. ఇలా ఛార్జర్ కేబుల్‌ను లాగినప్పుడు దాని లోపల ఉండే సన్నని వైర్లు, కనెక్టర్పై అనవసరంగా ఒత్తిడి పడుతుంది. పదేపదే ఇలాగే చేస్తే ఛార్జింగ్ కేబుల్ తొందరగా పాడైపోతుంది. అంతేకాదు మీ ఫోన్లో కూడా ఛార్జింగ్ సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది… కొన్నిసార్లు ఫోన్ బ్యాటరీపై ఒత్తిడి పెరిగి పేలిపోయే ప్రమాదం కూడా ఉంటుంది. కాబట్టి ఫోన్ నుండి ఛార్జర్ ను వేరుచేసేటప్పుడు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. ఫోన్ నుండి ఛార్జర్ తీసేసే సరైన పద్ధతి ఏంటి? ఫోన్ నుండి ఛార్జింగ్ కేబుల్ తీసేటప్పుడు వైర్‌ను పట్టుకుని లాగకూడదు... ఫోన్‌కు కనెక్ట్ అయి ఉన్న ప్లాస్టిక్ లేదా మెటల్ భాగాన్ని (కనెక్టర్ హెడ్) వేళ్లతో పట్టుకుని నెమ్మదిగా బయటకు తీయాలి. దీనివల్ల కేబుల్‌పై ఎలాంటి ఒత్తిడి పడదు, అది ఎక్కువ కాలం మన్నుతుంది. ఇలా జాగ్రత్తగా చార్జర్ ను తొలగించడం వల్ల ఫోన్ బ్యాటరీ కూడా సేఫ్ గా ఉంటుంది. ఒకవేళ మీ ఫోన్ ఛార్జింగ్ కేబుల్ పాడైపోయినా లేదా వైర్లు బయటకు కనిపిస్తున్నా దాన్ని వాడటం అస్సలు మంచిది కాదు. అలాంటి డ్యామేజ్ అయిన కేబుల్స్.. ఛార్జింగ్

అన్నం వండటం చాలా సులభమే అనిపిస్తుంది. కానీ చిన్న పొరపాటు జరిగినా అన్నం మెతుకులు ఒకదానికొకటి అంటుకుని జిగురుగా మారుతాయి. కొన్నిసార్లు అడుగున కూడా అంటుకుంటాయి. ముఖ్యంగా అన్నం గింజలు విడివిడిగా, పొడిపొడిగా ఉండాలని చాలామంది కోరుకుంటారు. ఇందుకోసం ముందుగా బియ్యాన్ని చల్లటి నీటితో బాగా కడగాలి. బియ్యాన్ని ఒక గిన్నెలో వేసి నీళ్లు పోసి చేతితో మెల్లగా కలపాలి. ఇలా రెండు, మూడు సార్లు కడిగితే బియ్యం మీద ఉన్న అదనపు పిండి కొంత వరకు తొలగిపోతుంది. దీంతో అన్నం ఉడికిన తర్వాత గింజలు ఒకదానికొకటి అంటుకునే అవకాశం తగ్గుతుంది. అయితే బియ్యం రకాన్ని బట్టి ఫలితం మారొచ్చు. బియ్యం కడిగిన తర్వాత నీళ్ల మోతాదుపై కూడా శ్రద్ధ పెట్టాలి. పొడవాటి గింజల బియ్యానికి చిన్న గింజల బియ్యం కంటే కొంచెం ఎక్కువ నీళ్లు అవసరం కావచ్చు. సాధారణంగా ఒక కప్పు బియ్యానికి సుమారు ఒకటిన్నర నుంచి రెండు కప్పుల నీళ్లు వాడొచ్చు. అయితే బియ్యం రకం, వండే విధానం బట్టి ఈ మోతాదు మారుతుంది. కొత్త రకం బియ్యం వండుతున్నప్పుడు ప్యాకెట్ మీద ఇచ్చిన సూచనలు చూడటం మంచిది. ముందుగా నీటిని మరిగించి అందులో బియ్యం వేయాలి. తర్వాత మూత పెట్టి తక్కువ మంటపై ఉడికించాలి. బియ్యం మరింత పొడిపొడిగా రావాలంటే నీటిలో ఒక టేబుల్ స్పూన్ నూనె లేదా కొద్దిగా వెన్న వేయొచ్చు. ఇది గింజలు ఎక్కువగా అంటుకోకుండా కొంత సాయం చేస్తుంది. బియ్యం ఉడుకుతున్నప్పుడు పదే పదే మూత తీసి చూడకూడదు. అలా చేస్తే లోపల ఉన్న ఆవిరి బయటకు వెళ్లి అన్నం ఉడికే విధానంపై ప్రభావం పడుతుంది. మంటను కూడా చాలా ఎక్కువగా పెట్టకూడదు. తక్కువ లేదా మధ్యస్థ మంటపై నెమ్మదిగా ఉడికిస్తే మంచి ఫలితం వస్తుంది. నీళ్లు పూర్తిగా ఇంకిపోయి అన్నం ఉడికిన తర్వాత వెంటనే వడ్డించకుండా గ్యాస్ ఆపి ఐదు నిమిషాలు మూత పెట్టి

ప్రస్తుత కాలంలో పెద్ద పెద్ద నగరాల్లో సొంత ఇల్లు కొనుగోలు చేయడం అందరికీ సాధ్యమయ్యే విషయం కాదు. అందుకే మెజారిటీ ప్రజలు అద్దె ఇళ్లు లేదా ఫ్లాట్లలోనే నివసిస్తుంటారు. అయితే, కొత్తగా అద్దె ఇంట్లోకి మారేటప్పుడు కేవలం బడ్జెట్, లొకేషన్ మాత్రమే చూసుకుంటే సరిపోదు.. కచ్చితంగా వాస్తు నియమాలను కూడా పరిశీలించాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా పాత ఇళ్లు లేదా ప్లాట్లలో ప్రతికూల శక్తులు, వాస్తు దోషాలు ఉండే అవకాశం ఎక్కువ. అందుకే అద్దె ఇల్లు తీసుకునే ముందు మీ జీవితంలో సుఖసంతోషాలు, ఆర్థిక వృద్ధి నిలవాలంటే ఈ 5 ముఖ్యమైన వాస్తు సూత్రాలను తప్పక తనిఖీ చేసుకోవాలి.vastu tips: డబ్బు నిలవాలంటే ఈ చిన్న మార్పులు చేస్తే చాలు!ఏ అంతస్తు ఎంచుకుంటే మంచిది?వాస్తు శాస్త్రం ప్రకారం.. భూమికి ఆనుకుని ఉండే గ్రౌండ్ ఫ్లోర్ కంటే పై అంతస్తుల్లో నివసించడం మానసికంగా, శారీరకంగా మరింత శ్రేయస్కరంగా భావిస్తారు.సాధ్యమైనంత వరకు మొదటి అంతస్తు, రెండో అంతస్తు లేదా అంతకంటే పై అంతస్తుల్లో ఉన్న ఫ్లాట్లను ఎంచుకోవడానికి ప్రాధాన్యత ఇవ్వండి. వృద్ధులు, మోకాళ్ల నొప్పులు ఉన్నవారు లేదా ప్రత్యేక అవసరాలు ఉన్నప్పుడు మాత్రమే గ్రౌండ్ ఫ్లోర్‌ను పరిశీలించడం ఉత్తమం.సూర్యరశ్మి, వెలుతురు ఎలా ఉంది?చీకటిగా, కాంతి లేని ఇళ్లలోకి వెళ్తే ఆరోగ్యంతో పాటు మానసిక ప్రశాంతత దెబ్బతింటుంది. మీరు ఎంచుకునే అద్దె ఇంట్లోకి సహజమైన సూర్యరశ్మి, గాలి సమృద్ధిగా వచ్చేలా ఉండాలి. పెద్ద కిటికీలు, విశాలమైన బాల్కనీలు ఉన్న ఇళ్లను ఎంచుకోండి. సూర్యకాంతి సమృద్ధిగా పడటం వల్ల ఇంట్లోని తేమ, క్రిములు నశించడమే కాకుండా.. సానుకూల శక్తి పెరుగుతుంది.చుట్టుపక్కల పరిసరాలు ఎలా ఉన్నాయి?ఇంటి వాస్తు ఎంత బాగున్నా.. ఆ ఇల్లు ఉన్న పరిసరాలు కూడా అంతే ముఖ్యం. నిర్మానుష్యంగా ఉండే బీడు భూములు, శ్మశానాలు, లేదా పాడుబడిన పాత శిథిల భవనాల సమీపంలో ఉన్న ఇళ్లను అద్దెకు తీసుకోకూడదు. ఇలాంటి ప్రాంతాల్లో ప్రతికూల శక్తుల ప్రభావం ఎక్కువగా ఉంటుంది

Green Chillies Storage Tips: పచ్చిమిరపకాయలు దాదాపు ప్రతి భారతీయ వంటింట్లో రోజూ ఉపయోగించే ముఖ్యమైన పదార్థం. అయితే మార్కెట్ నుంచి తాజాగా కొనుగోలు చేసిన మిరపకాయలు ఫ్రిజ్‌లో పెట్టిన రెండు మూడు రోజుల్లోనే వాడిపోవడం లేదా కుళ్లిపోవడం చాలా మందికి ఎదురయ్యే సమస్య. దీనికి ప్రధాన కారణం వాతావరణం మాత్రమే కాదు, వాటిని సరైన పద్ధతిలో నిల్వ చేయకపోవడం కూడా.. అసలు, పచ్చిమిరపకాయలు త్వరగా పాడవడానికి ప్రధాన కారణం తేమ. మిరపకాయలపై నీరు ఉండటం లేదా తడిగా ఫ్రిజ్‌లో నిల్వ చేయడం వల్ల బూజు, బ్యాక్టీరియా వేగంగా పెరుగుతాయి. ఫలితంగా అవి మెత్తబడటం, రంగు మారడం, కుళ్లిపోవడం జరుగుతుంది. అందుకే నిల్వ చేసే ముందు అవి పూర్తిగా పొడిగా ఉండేలా చూసుకోవడం చాలా ముఖ్యం. మిరపకాయలను ఎక్కువకాలం తాజాగా ఉంచాలంటే ముందుగా వాటిలో మెత్తబడినవి, మచ్చలు ఉన్నవి లేదా పాడైపోయినవిని వేరు చేయాలి. అనంతరం అన్ని మిరపకాయల కాడలను తొలగించాలి. తర్వాత శుభ్రమైన, పొడి, గాలి చొరబడని డబ్బా తీసుకుని అడుగున టిష్యూ పేపర్ లేదా పేపర్ టవల్ పరచాలి. దానిపై మిరపకాయలను వేసి, మళ్లీ మరో టిష్యూ పేపర్‌తో కప్పి మూత పెట్టాలి. టిష్యూ పేపర్ అదనపు తేమను పీల్చుకోవడంతో మిరపకాయలు ఎక్కువకాలం తాజాగా ఉంటాయి. టిష్యూ పేపర్ తడిగా మారితే వెంటనే మార్చడం మంచిది. చాలామంది చేసే సాధారణ పొరపాటు ఏమిటంటే, మిరపకాయలను కడిగిన వెంటనే ఫ్రిజ్‌లో పెట్టడం. ఇలా చేయడం వల్ల అవి త్వరగా పాడవుతాయి. ఒకవేళ కడగాల్సి వస్తే, పూర్తిగా ఆరిన తర్వాత మాత్రమే నిల్వ చేయాలి. అలాగే ఫ్రిజ్‌లో తేమ తక్కువగా ఉండే ప్రదేశంలో ఉంచడం మంచిది. మొత్తంగా సరైన పద్ధతిలో నిల్వ చేస్తే పచ్చిమిరపకాయలు చాలా వారాల పాటు తాజాగా ఉండే అవకాశం ఉంది. వాటి నాణ్యత, ఫ్రిజ్ ఉష్ణోగ్రత, నిల్వ చేసే విధానాన్ని బట్టి ఈ కాలం మారవచ్చు. చిన్న జాగ్రత్తలు తీసుకుంటే

Jeans Cleaning Tips: జీన్స్ అనేది దాదాపు ప్రతి ఒక్కరి వార్డ్‌రోబ్‌లో ఉండే అత్యంత ప్రజాదరణ పొందిన దుస్తుల్లో ఒకటి. అయితే చాలామంది ప్రతి సారి వేసుకున్న తర్వాత జీన్స్‌ను వాషింగ్ మెషీన్లో ఉతకడం అలవాటుగా మార్చుకుంటారు. ఫ్యాషన్ నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఇదే జీన్స్ త్వరగా పాడవడానికి, రంగు వెలిసిపోవడానికి ప్రధాన కారణం. సరైన పద్ధతిలో ఉతికితే డెనిమ్ జీన్స్‌ను చాలా సంవత్సరాల పాటు కొత్తదానిలా ఉపయోగించుకోవచ్చు. జీన్స్‌ను ప్రతి సారి ఉతకాల్సిన అవసరం లేదా..? నిపుణులు సూచిస్తున్న '10-వేర్ రూల్' ప్రకారం, జీన్స్‌ను ప్రతి సారి ఉతకాల్సిన అవసరం లేదు. అవి ఎక్కువగా మురికిగా మారినా లేదా దుర్వాసన వచ్చినప్పుడే ఉతకడం మంచిది. సాధారణంగా 10 సార్లు ధరించిన తర్వాత ఉతకడం వల్ల జీన్స్ రంగు, ఆకారం, నాణ్యత ఎక్కువకాలం అలాగే ఉంటాయి. వాషింగ్ మెషీన్లో ఉతికితే ఇది తప్పనిసరి.. మెషీన్లో ఉతికేటప్పుడు కూడా కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలి. జీన్స్‌ను ఎప్పుడూ లోపలి వైపుకు తిప్పి ఉతకాలి. దీంతో బయటి భాగం రాపిడి నుంచి రక్షణ పొందుతుంది. అలాగే చల్లటి నీటితో, 'జెంటిల్' లేదా 'డెలికేట్' వాష్ మోడ్‌లో ఉతకడం వల్ల బట్ట కుంచించుకుపోకుండా, రంగు వెలిసిపోకుండా ఉంటుంది. చాలామంది చేసే మరో పెద్ద పొరపాటు డ్రైయర్‌లో జీన్స్‌ను ఆరబెట్టడం. అధిక వేడి వల్ల డెనిమ్ ఫ్యాబ్రిక్ బలహీనపడి త్వరగా చిరిగే అవకాశం ఉంటుంది. అందుకే జీన్స్‌ను గాలి బాగా ప్రసరించే నీడ ప్రాంతంలో సహజంగా ఆరబెట్టడం ఉత్తమం. మొత్తంగా జీన్స్‌కు స్వల్పంగా దుర్వాసన వస్తే వెంటనే ఉతకాల్సిన అవసరం లేదు. కొంతసేపు ఆరుబయట గాలిలో ఉంచితే చాలావరకు వాసన తగ్గుతుంది. ఒకవేళ చిన్న మరక ఉంటే మొత్తం జీన్స్‌ను ఉతకకుండా, ఆ భాగాన్ని మాత్రమే శుభ్రం చేయడం మంచిది. ఈ చిన్న జాగ్రత్తలు పాటిస్తే మీ జీన్స్ ఎక్కువకాలం కొత్తదానిలా కనిపిస్తుంది

బెంగళూరులో ఓ 33 ఏళ్ల ప్రైవేట్ ఉద్యోగి డేటింగ్ యాప్ మోసానికి గురయ్యాడు. యాప్ ద్వారా పరిచయమైన మహిళ కలుద్దామని చెప్పి, నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లింది. అక్కడ నలుగురు వ్యక్తులు బెదిరించి, అతని వద్ద నుంచి క్రెడిట్, డెబిట్ కార్డులు, నగదు కలిపి దాదాపు ₹3.5 లక్షలు దోచుకున్నారు. బాధితుడు పోలీసులను ఆశ్రయించగా, దర్యాప్తు కొనసాగుతోంది
గర్భధారణ సమయంలో మహిళలు ఎన్నో సమస్యలు ఎదుర్కొంటారు. శారీరక, మానసిక సమస్యలతో బాధపడుతుంటారు. అందుకే గర్భం దాల్చిన తర్వాత (Conception) ఒక స్త్రీకి తగినంత విశ్రాంతి దొరకడం చాలా ముఖ్యం. ఎందుకంటే, కడుపులో పెరిగే బిడ్డకు రక్షణగా, ఆరోగ్యంగా ఉంచడానికి తల్లి శరీరంలో అనేక మార్పులు మొదలవుతాయి. ప్రెగ్నెన్సీ సమయంలో నిద్రలేమి సమస్య రావచ్చు. గర్భాశయంలో పిండం పెరగడం వల్ల పొత్తికడుపు ఉబ్బుతుంది. దీనివల్ల సౌకర్యవంతమైన భంగిమలో నిద్రపోవడం కష్టమవుతుంది.అంతేకాకుండా నడుము నొప్పి, కాళ్ళ వాపు, రాత్రిపూట మూత్రవిసర్జన చేయాలనే కోరిక వంటివి కూడా నిద్రలేమికి కారణమవుతాయి. ప్రెగ్నెన్సీ సమయంలో విశ్రాంతి ఎందుకు ముఖ్యం, రెస్ట్ లేకపోతే కలిగే నష్టాలు, పాటించాల్సిన చిట్కాలు గురించి డాక్టర్ గాయత్రి కార్తీక్ నాగేశ్(ప్రోగ్రామ్ డైరెక్టర్ - ప్రసూతి మరియు స్త్రీ వైద్య విభాగం, ఆస్టర్ సిఎంఐ హాస్పిటల్, బెంగళూరు) పూర్తి వివరాలు అందించారు.శరీరంపై పడే అదనపు భారంగర్భధారణ ప్రారంభ దశల్లో, లోపల పెరుగుతున్న శిశువు కోసం శరీరం రక్తాన్ని సరఫరా చేసే 'ప్లాసెంటా' (మాయ) ను తయారు చేయడానికి చాలా కష్టపడుతుంది. అలాగే రక్త సరఫరాను పెంచి, బిడ్డకు అవసరమైన పోషకాల్ని అందిస్తుంది. ఈ ప్రక్రియల వల్ల సాధారణం కంటే ఎక్కువగా అలసట అనిపిస్తుంది.హార్మోన్ల మార్పులుగర్భధారణ సమయంలో 'ప్రొజెస్టెరాన్' (Progesterone) అనే హార్మోన్ స్థాయిలు వేగంగా పెరుగుతాయి. దీనివల్ల విపరీతమైన అలసట, నీరసం, నిద్రమత్తుగా అనిపిస్తుంది. తగినంత విశ్రాంతి తీసుకోవడం వల్ల శరీరం ఈ హార్మోన్ మార్పులకు త్వరగా అలవాటుపడుతుంది. మానసిక, శారీరక ఒత్తిడి కూడా తగ్గుతుంది.విశ్రాంతి వల్ల కలిగే ప్రయోజనాలు మెరుగైన రక్తప్రసరణ: బాగా విశ్రాంతి తీసుకోవడం వల్ల శరీరంలో రక్తప్రసరణ బాగుంటుంది. దీనివల్ల కడుపులోని బిడ్డకు ఆక్సిజన్, పోషకాలు సమృద్ధిగా అందుతాయి. రోగనిరోధక శక్తి పెరుగుతుంది: ప్రెగ్నెన్సీ సమయంలో ఇన్ఫెక్షన్ల బారిన పడకుండా ఉండటానికి విశ్రాంతి శరీరానికి శక్తిని ఇస్తుంది. మానసిక ప్రశాంతత: మంచి నిద్ర వల్ల మెదడు పనితీరు మెరుగవుతుంది. మూడ్ స్వింగ్స్

చేతులు పరిశుభ్రంగా ఉంచుకోవాల్సిన ప్రాధాన్యం గురించి మనకు తెలిసిందే. అయినా సరే- కొంతమంది ఈ విషయంలో అశ్రద్ధ చేస్తుంటారు. బయటి నుంచి వచ్చాక, ఆహారం తీసుకునే ముందు.. ఏదో అలా పైపైన చేతులు కడుక్కుంటారు. చేతులు పరిశుభ్రంగా ఉంచుకోవాల్సిన ప్రాధాన్యం గురించి మనకు తెలిసిందే. అయినా సరే- కొంతమంది ఈ విషయంలో అశ్రద్ధ చేస్తుంటారు. బయటి నుంచి వచ్చాక, ఆహారం తీసుకునే ముందు.. ఏదో అలా పైపైన చేతులు కడుక్కుంటారు. ఫలితంగా చేతులకు అంటుకున్న క్రిములు, బ్యాక్టీరియా తీసుకునే ఆహారం ద్వారా శరీరంలోకి చేరతాయి. సమస్త ఆరోగ్య సమస్యలకు ఇక్కడే బీజం పడుతుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ క్రమంలో చేతుల శుభ్రత విషయంలో ఏమాత్రం అజాగ్రత్త పనికి రాదని సూచిస్తున్నారు. ⚛ చేతులు శుభ్రం చేసుకోకపోతే చేతిపై ఉన్న వ్యాధికారక క్రిములన్నీ మనం తీసుకునే ఆహారం ద్వారా శరీరంలోకి వెడతాయి. ఇక అపరిశుభ్ర చేతులతో ఇతరులను తాకితే వారి చేతులకు కూడా ఆ క్రిములన్నీ అంటుకుంటాయి. ⚛ చేతులు పరిశుభ్రంగా లేకపోవడం వల్ల డయేరియా, హెపటైటిస్, జలుబు.. వంటి వివిధ రకాల అనారోగ్యాలు తలెత్తే అవకాశాలు ఎక్కువ. ఒక టాయిలెడ్ కమోడ్ పైనే లక్షల సంఖ్యలో క్రిములు దాగి ఉంటాయని పరిశోధనలు చెబుతున్నాయి. కాబట్టి తరచూ చేతులు శుభ్రం చేసుకోవడాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్లక్ష్యం చేయకూడదు అంటున్నారు నిపుణులు. ⚛ చేతులు అపరిశుభ్రంగా ఉండడం వల్ల కంటి సంబంధిత సమస్యలు కూడా తలెత్తే అవకాశం ఉందంటున్నారు నిపుణులు. కాబట్టి సబ్బు, హ్యాండ్‌వాష్, శానిటైజర్‌తో కనీసం 20 సెకన్ల పాటు చేతులు శుభ్రం చేసుకుంటే వివిధ అనారోగ్యాలకు దూరంగా ఉండచ్చని సూచిస్తున్నారు. ఈ క్రమంలో ప్రత్యేకించి పిల్లలకు కూడా చేతులు చక్కగా శుభ్రం చేసుకునేలా చిన్నప్పటి నుంచే శిక్షణ ఇవ్వాలి అని చెబుతున్నారు. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి

సౌందర్య పోషణలో భాగంగా హెయిర్ డైలు వేసుకోవడం సహజం. అయితే కొన్ని సందర్భాల్లో కొన్ని రకాల రంగులు చర్మానికి అంటుకుని అక్కడ మచ్చలు పడతాయి. వీటిని తొలగించడంలో కొన్ని ఇంటి చిట్కాలు సమర్థంగా పనిచేస్తాయంటున్నారు సౌందర్య నిపుణులు. ⚛ వినెగర్‌లో ముంచిన కాటన్ బాల్‌తో మచ్చలు పడిన చోట రుద్దడం వల్ల అవి పోయే అవకాశం ఉంటుంది అంటున్నారు నిపుణులు. ⚛ బేబీ ఆయిల్‌తో పాటు కొన్ని ఎసెన్షియల్ నూనెలు కూడా డై మచ్చలను తొలగించడంలో సహాయపడతాయి అంటున్నారు నిపుణులు. కొన్ని చుక్కల నూనెను తీసుకొని దాన్ని మచ్చపై అప్లై చేసి చేతి మునివేళ్లతో రుద్దాలి. కాసేపటి తర్వాత గోరువెచ్చటి నీటితో కడిగేస్తే ఫలితం ఉంటుంది. అయితే రసాయనాలు కలవని, చర్మానికి అంటినా మచ్చలు పడని హెయిర్ డైలు కూడా ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులో ఉంటున్నాయి. సాధ్యమైనంతవరకు ఇలాంటి వాటిని నిపుణుల సలహాతో ఎంచుకోవడం మంచిది. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు

వెడల్పాటి గోల్డెన్ మెరూన్ బోర్డర్ తో ఉన్న ఆఫ్-వైట్ సిల్క్ కాంజీవరం చీర మీకు క్లాసీ లుక్ ఇస్తుంది. మీరు కూడా హాఫ్ స్లీవ్ బ్లౌజ్, సింపుల్ మేకప్‌తో ఇలా రెడీ అయిపోవచ్చు. ఈ చీర స్ట్రైప్స్ డిజైన్‌తో చాలా బాగుంటుంది. దీనికి పింక్-పీచ్, గ్రీన్ బోర్డర్స్ ఉన్నాయి. స్లీవ్‌లెస్ బ్లౌజ్‌తో ఈ చీర మరింత అందంగా కనిపిస్తుంది. పసుపు, ఎరుపు రంగుల కాంబినేషన్లో ఉన్న ఈ గుజరాతీ పటోలా చీర కట్టుకుంటే అద్భుతంగా ఉంటుంది. ప్లెయిన్ రెడ్ బ్లౌజ్, ఆక్సిడైజ్డ్ జుంకాలు, సింపుల్ మేకప్‌తో మీ లుక్ అదిరిపోతుంది. వైట్ సిల్క్ చీరకు పర్పుల్, గోల్డెన్ జరీ బోర్డర్ క్లాసీ లుక్ ఇస్తుంది. కంగనా మ్యాచింగ్ బ్లౌజ్, స్టోన్ జ్యువెలరీతో ఈ లుక్‌ను పూర్తి చేసింది. మీరు కూడా ఇలా ట్రై చేయవచ్చు. వైట్ బేస్‌పై ఫ్లోరల్, బ్లాక్ పోల్కా డాట్స్ ఉన్న ఈ చీర కిట్టీ పార్టీలకు బెస్ట్ ఆప్షన్. ఇది మీకు మోడ్రన్, ఫ్రెష్ లుక్‌ను ఇస్తుంది. దీన్ని స్లీవ్‌లెస్ బ్లౌజ్‌తో ట్రై చేయవచ్చు. మెరూన్ బోర్డర్‌తో ఉన్న ఈ మల్టీకలర్ పటోలా హ్యాండ్లూమ్ చీర క్లాసీగా కనిపిస్తుంది. మీకు హ్యాండ్లూమ్ చీరలు ఇష్టమైతే, హెవీ నెక్ పీస్తో దీన్ని స్టైల్ చేయవచ్చు. డార్క్ పర్పుల్ కలర్లో ఉన్న ఈ చీర మీకు గ్రేస్‌ఫుల్ లుక్‌ను ఇస్తుంది. దీన్ని స్టేట్మెంట్ నెక్లెస్, మ్యాచింగ్ ఇయర్ రింగ్స్, మినిమల్ మేకప్‌తో స్టైల్ చేయవచ్చు. Gold Necklace: 5 గ్రాముల్లోనే గోల్డ్ నక్లెస్ డిజైన్లు...ఒక లుక్కేయండి Blouse Designs: బ్లౌజ్లకు సన్నని మోడ్రన్ స్ట్రాప్స్.. లుక్ అదుర్స్ Bangles: పాతకాలం ప్లెయిన్ గాజులు కాదు.. చేతులు నిండుగా ఇవి ట్రై చేయండి Coin necklace: చీరల మీదకు అదిరిపోయే కాసులపేరు డిజైన్లు... ఓ లుక్కేయండి
ప్రీ డయాబెటిస్ ఉన్నవారిపై జరిగిన పరిశోధనలో మనం బ్రేక్‌ఫాస్ట్ చేసే టైమ్‌లో ఇన్సులిన్ సెన్సిటివిటీ ఎఫెక్ట్ అవుతుందని తేలింది. ప్రీ డయాబెటిస్ ఉన్న 297 మంది పెద్దవారిపై జరిగిన పరిశోధనలో శక్తి వినియోగం, శరీర కొవ్వు వంటి అంశాలను కూడా పరిగణనలోకి తీసుకున్న తర్వాత కూడా ఆలస్యంగా భోజనం ప్రారంభించడం, హై ఫాస్టింగ్ ఇన్సులిన్, హై ఇన్సులిన్ రెసిస్టెన్స్, లో ఇన్సులిన్ సెన్సిటివిటీతో సంబంధం కలిగి ఉందని తేలింది. కొన్నిసార్లు సెకండ్ మీల్ ఎఫెక్ట్ కూడా అవుతుంది. అదేంటంటే ప్రీ డయాబెటిస్ ఉన్న ఆసియాలోని మగవారిపై జరిగిన ఓ నియంత్రిత అధ్యయనంలో బ్రేక్‌ఫాస్ట్ మానేసిన వారి కంటే బ్రేక్‌ఫాస్ట్ తీసుకున్నవారిలో మధ్యాహ్నా లంచ్ టైమ్‌కి గ్లూకోజ్, ఇన్సులిన్ ప్రతిస్పందన తగ్గింది. దీనిని బట్టి, మార్నింగ్ సరైన ఫుడ్ తింటే ఆ రోజు తర్వాత శరీర జీవక్రియ ప్రతిస్పందనకి సహాయపడుతుందని తెలుస్తోంది. అయితే, బ్రేక్‌ఫాస్ట్ చేస్తే చాలు. అందులో ఏమైనా తినొచ్చు అంటే పొరపాటే. ప్రాసెస్డ్ కార్బోహైడ్రేట్స్, షుగర్ కలిపిన తృణధాన్యాలు, స్వీట్ డ్రింక్స్, హై గ్లైసెమిక్ ఫుడ్‌తో నిండిన హెవీ బ్రేక్‌ఫాస్ట్ అనేది గ్లూకోజ్, ఇన్సులిన్‌లో పెరుగుదలకి దారితీస్తుంది. వాస్తవానికి, ప్రీ డయాబెటిస్ ఉన్నవారిపై జరిగిన పరిశోధనలో హై ఎనర్జీ ఫుడ్ ఏదైనా ఉందంటే అది బ్రేక్‌ఫాస్ట్ మాత్రమే. బ్రేక్‌ఫాస్ట్ తర్వాత గ్లూకోజ్, ఇన్సులిన్ ప్రతిస్పందనలని ఎక్కువగా ఉత్పత్తి చేయగలదని తేలింది. అయినప్పటికీ మొత్తం 24 గంటల గ్లూకోజ్‌పై ఆ ఎఫెక్ట్ తక్కువగానే ఉంటుంది. ప్రీ డయాబెటిస్ ఉన్నవారు కేవలం బ్రేక్‌ఫాస్ట్ చేస్తే చాలు అనుకోకుండా ఎప్పుడు ఏం తింటున్నారు, ఎంత తింటున్నారో గమనించుకోవాలి. మార్నింగ్ కేలరీలని తీసుకోవడం కంటే ప్రోటీన్ ఫుడ్, ఫైబర్ ఎక్కువగా ఉండే ఫుడ్స్, లో ప్రాసెస్డ్ కార్బోహైడ్రేట్స్ ఉన్న భోజనాన్ని తీసుకోవడం చాలా మంచిది. బ్రేక్‌ఫాస్ట్ అనేది ఓ భాగం మాత్రమే. అదే ప్రీ డయాబెటిస్‌కి ట్రీట్మెంట్ కాదు. మంచి ఫిజికల్ వర్కౌట్, హెల్దీ వెయిట్ మెంటెయిన్ చేస్తూ

Suryapet: సూర్యాపేటలో 'సైబర్ వారియర్స్' కు ప్రత్యేక శిక్షణ & సమీక్ష! ఈ వార్తకు సంబంధించిన

చర్మ కణాల్లో సెబమ్ అనే పదార్థం ఎక్కువగా ఉత్పత్తి కావడం వల్ల బ్లాక్‌హెడ్స్ వస్తాయి. వీటిని తొలగించుకోవడానికి కొన్ని టిప్స్ మీకోసం. ఒక టేబుల్ స్పూన్ బేకింగ్ సోడాలో అర టేబుల్ స్పూన్ నిమ్మరసం కలిపి పేస్ట్‌లా చేసుకోవాలి. దీన్ని బ్లాక్ హెడ్స్ ఉన్న చోట రాయాలి. ఒక టేబుల్ స్పూన్ నిమ్మరసంలో గుడ్డు తెల్లసొన వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని ముక్కు చుట్టూ అప్లై చేయాలి. 15 నిమిషాల తర్వాత కడిగేయాలి. ముల్తానీ మట్టి, ఆరెంజ్ తొక్కల పొడిని బాగా కలిపి ముక్కుపై సున్నితంగా స్క్రబ్ చేయాలి. ఆ తర్వాత నీటితో ముఖం కడుక్కోవాలి. రోజ్ వాటర్‌లో శనగపిండి కలిపి ప్యాక్‌లా వేసుకోవాలి. ఇది బ్లాక్ హెడ్స్‌ను తొలగించడానికి బాగా పనిచేస్తుంది. రెండు స్పూన్ల కలబంద జెల్‌ను తీసుకొని బ్లాక్ హెడ్స్ ఉన్న చోట రాయాలి. అది పూర్తిగా ఆరిన తర్వాత కడిగేయాలి. Gold Necklace: 10 గ్రాముల్లో అదిరిపోయే లైట్ వెయిట్ నక్లెస్ డిజైన్లు Gold Necklace: లైట్ వెయిట్ గోల్డ్ నెక్లెస్ లు.. ఎంత బాగున్నాయో! Rice Water: రైస్ వాటర్‌ని ఇలా వాడితే.. జుట్టు వద్దన్నా పెరుగుతుంది! Silver Anklets: పాదాల అందాన్ని పెంచే వెండి పట్టీలు.. చూస్తే కొనేస్తారు

తెలుగువారి వంటింట్లో ఎక్కువగా ఉపయోగించే కూరగాయ ఏదంటే చాాలామంది గృహిణుల నుండి వచ్చే సమాధానం… ఉల్లిపాయ. కూర, పప్పు, సాంబార్… ఇలా ప్రతి వంటకంలో ఉల్లిపాయ ఉండాల్సిందే… చివరికి బిర్యానీ తింటున్నా పక్కన ఉల్లిపాయ నంజుకోవాల్సిందే. అయితే వంటలో ఎంత పెద్ద ఎక్స్పర్ట్ అయినా సరే ఉల్లిపాయ కోసేటప్పుడు కళ్లలో మంట, నీళ్లు రావడం ఖాయం. ఇది కేవలం ఉల్లి ఘాటు వల్ల మాత్రమే కాదు. దీని వెనుక ఓ ఆసక్తికరమైన కెమిస్ట్రీ ఉందని తెలుస్తోంది. ఉల్లిపాయల వెనకున్న ఆ సైన్స్ రహస్యం ఏంటో ఇక్కడ తెలుసుకుందాం. మనం ఉల్లిపాయను కోసినప్పుడు దాని కణాలు దెబ్బతిని 'అల్లినేస్', 'లాక్రిమేటరీ ఫాక్టర్ సింథేస్ (Lachrymatory Factor Synthase - LFS)' అనే ఎంజైమ్‌లు విడుదలవుతాయి. ఇవి ఉల్లిపాయలోని అమైనో ఆమ్లాలతో చర్య జరిపి సల్పెనిక్ ఆమ్లాన్ని, 'సిన్-ప్రోపనెథియల్-ఎస్-ఆక్సైడ్' అనే ఘాటైన గ్యాస్‌ను విడుదల చేస్తాయి. ఈ వాయువు గాలితొ చర్య జరిపి కళ్లలో మంట పుట్టిస్తుంది. ఈ సిన్-ప్రోపనెథియల్-ఎస్-ఆక్సైడ్ అనే వాయువు గాలిలో కలిసి మన కళ్లను చేరుతుంది… అక్కడ కంటిలోని నరాలను ప్రేరేపించి మంట పుట్టిస్తుంది. అప్పుడు కళ్లను రక్షించుకోవడానికి, మన కన్నీటి గ్రంథులు ఎక్కువగా కన్నీళ్లను ఉత్పత్తి చేస్తాయి. అందుకే ఉల్లిపాయ కోసేటప్పుడు మనకు ఏడుపు వస్తుంది. దీన్నే సైంటిస్టులు 'లాక్రిమేటరీ ఫ్యాక్టర్' (lachrymatory factor) అని పిలుస్తారు. 2017లో 'ACS కెమికల్ బయాలజీ' జర్నల్‌లో ప్రచురించిన ఒక అధ్యయనం ప్రకారం… ఉల్లిపాయలో మనిషి కన్నీళ్లకు కారణమయ్యే రసాయనం ఏర్పడటంలో లాక్రిమేటరీ ఫ్యాక్టర్ సింథేస్ (LFS) ఎంజైమ్ కీలక పాత్ర పోషిస్తుందని తేలింది. అంటే ఉల్లిపాయ మనల్ని ఎమోషనల్‌గా ఏడిపించదు. దాని కణాలు దెబ్బతిన్నప్పుడు విడుదలయ్యే ఒక రసాయన వాయువే మన కళ్లలో మంట పుట్టించి కన్నీళ్లు తెప్పిస్తుంది. ఇదంతా పక్కా సైన్స్! 1. మొద్దుబారిన కత్తితో కోస్తే ఉల్లి కణాలు ఎక్కువగా దెబ్బతింటాయి. దీనివల్ల రసాయనాలు ఎక్కువ రిలీజ్ అవుతాయి. అందుకే
రోజులో కాసేపు ప్రకృతిలో సమయం గడపండి. ఎండలో నిల్చోండి. దీని వల్ల మనసు ప్రశాంతంగా మారుతుంది. ఒత్తిడి తగ్గుతుంది. రోజంతా యాక్టివ్‌గా ఉండొచ్చు. నీరు ఎక్కువగా తాగడం వల్ల బాడీ హైడ్రేట్ అవుతుంది. బద్దకం వదులుతుంది. డీహైడ్రేషన్ వల్ల నీరసం వస్తుంది. కాబట్టి యాక్టివ్‌గా ఉండేందుకు నీరు పుష్కలంగా తాగండి. ఆఫీస్‌లో పని చేస్తున్నప్పుడు రెగ్యులర్‌గా బ్రేక్‌లు తీసుకోండి. ప్రతి అరగంటకు ఒకసారి బ్రేక్ తీసుకోండి. దీంతో ఒత్తిడి, అలసట తగ్గుతాయి. డీప్ బ్రీతింగ్ తీసుకోవడం వల్ల మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఒత్తిడి తగ్గుతుంది. ఉత్సాహంగా ఉండొచ్చు. బాదం, వాల్నట్స్ వంటి హెల్తీ స్నాక్స్ తినండి. పండ్లు, చిక్కీలు తినండి. ఇవి మిమ్మల్ని ఎనర్జిటిక్‌గా ఉంచుతాయి. మీకు బద్దకంగా, నిద్ర వచ్చినట్లు అనిపిస్తే వెంటనే చల్లని నీటితో ముఖాన్ని కడగండి. దీని వల్ల నిద్ర మత్తు వదులుతుంది. యాక్టివ్‌గా ఉండొచ్చు. ఫోన్ ఎక్కువ సేపు ఉపయోగించడం వల్ల మానసిక ఆరోగ్యం దెబ్బతింటుంది. కళ్లు అలసిపోతాయి. ఫోన్‌కు దూరంగా ఉంటే యాక్టివ్‌గా ఉండొచ్చు. రోజులో కాసేపు నచ్చిన వారితో సమయం గడపండి. మీకు నచ్చిన వారికి ఫోన్ చేయండి. దీని వల్ల మనసు ప్రశాంతంగా మారుతుంది. ఉత్సాహం వస్తుంది. ఉదయం నిద్రలేచిన తర్వాత కాసేపు వ్యాయామం చేయండి. దీని వల్ల రోజంతా యాక్టివ్‌గా ఉండొచ్చు. వ్యాయామం చేస్తే మానసిక, శారీరక ఆరోగ్యం మెరుగుపడుతుంది

అరటి పండు రుచిగా ఉండటంతో పాటు తక్కువ ధరకు వస్తుంది. ఈజీగా దొరుకుతుంది కాబట్టి చాలామంది అరటిపండ్లను ఎక్కువగా కొనుగోలు చేస్తుంటారు. అయితే అరటిపండ్లు కొనేటప్పుడు కనిపించిన వెంటనే పసుపురంగు గుత్తిని తీసుకోవడం కంటే కొన్ని విషయాలను గమనించడం మంచిది. చాలామంది తెలియక చేసే కొన్ని చిన్న తప్పుల వల్ల ఇంటికి తెచ్చిన అరటిపండ్లు త్వరగా పండిపోవడం, మెత్తబడటం లేదా ఎక్కువ రోజులు నిల్వ ఉండకపోవడం జరుగుతుంది. అందుకే అరటిపండ్లు కొనేటప్పుడు చేయకూడని తప్పులేంటో చూద్దాం. చాలామంది అరటి పండ్లు కొద్దిగా పచ్చగా ఉన్నా.. అవి పండలేదని భావించి పక్కన పెట్టేస్తారు. కానీ మీరు వెంటనే తినడానికి కాకుండా కొన్ని రోజులు ఇంట్లో ఉంచుకోవడానికి అరటిపండ్లు కొనుగోలు చేస్తుంటే, కొద్దిగా పచ్చగా ఉన్నవి ఎంచుకోవడం మంచిది. పూర్తిగా పసుపు రంగులోకి మారిన అరటిపండ్లు ఇప్పటికే బాగా పండిన దశలో ఉంటాయి. కాబట్టి త్వరగా మెత్తబడే అవకాశం ఉంటుంది. పండిన అరటిపండ్ల తొక్కపై చిన్న చిన్న నల్ల మచ్చలు కనిపించడం సాధారణమే. అయితే మచ్చలు విస్తృతంగా ఉండటం, తొక్క పగిలిపోవడం, అరటిపండు నుంచి అసహజమైన వాసన రావడం లేదా లోపల భాగం అసాధారణంగా మారినట్లు కనిపించడం వంటి లక్షణాలు ఉంటే దాన్ని కొనకపోవడం మంచిది. కానీ కేవలం ఒకటి రెండు చిన్న మచ్చలు ఉన్నాయని చాలామంది మంచి అరటిపండును పక్కనపెట్టేస్తుంటారు. పెద్దగా, ఆకర్షణీయంగా కనిపించే అరటిపండే మంచిదని చాలామంది అనుకుంటారు. కానీ పరిమాణం ఒక్కటే నాణ్యతకు ప్రమాణం కాదు. అరటిపండు తాజాగా ఉందా, తొక్క బలంగా ఉందా, ఎక్కడైనా పగుళ్లు ఉన్నాయా, పండు ఎలా ఉంది అనే విషయాలను కూడా గమనించాలి. చిన్న పరిమాణంలో ఉన్న అరటిపండ్లు కూడా మంచి నాణ్యతతో ఉండవచ్చు. వెంటనే తినాలనుకునేవారు పూర్తిగా మెత్తగా ఉన్న పండ్లను ఎంచుకోవచ్చు. కానీ వాటిని ఇంట్లో కొన్ని రోజులు ఉంచుకోవాలనుకుంటే మాత్రం ఇది సరైన ఎంపికకాదు. అరటిపండు ఇప్పటికే ఎక్కువగా మెత్తబడి ఉంటే త్వరగా

చెక్‌పై మొత్తాన్ని పదాల్లో రాసిన తర్వాత ఖాళీ స్థలం ఉంటే.. దానిని ఉపయోగించి ఎవరైనా అదనపు పదాలను చేర్చే అవకాశం ఉంటుంది. ఉదాహరణకు మీరు “Ten Thousand” అని మాత్రమే రాసి.. ఆ తర్వాత ఎక్కువ ఖాళీ స్థలం వదిలితే, అందులో అదనపు పదాలు చేర్చేందుకు ప్రయత్నించవచ్చు. దీంతో అమౌంట్ మొత్తం పెరిగే అవకాశం ఉంటుంది. అందుకే మొత్తాన్ని పదాల్లో రాసిన వెంటనే ‘Only’ అని రాస్తారు. దీనివల్ల ఆ మొత్తానికి సంబంధించిన వాక్యం అక్కడితో పూర్తయిందని స్పష్టమవుతుంది. అదనపు పదాలు చేర్చే అవకాశం ఉండదు. చెక్‌పై ‘Only’ రాయకపోతే చెక్ చెల్లదు అని కాదు. ప్రతి చెక్‌పై ‘Only’ రాయాలని RBI ప్రత్యేకంగా తప్పనిసరి చేసిన నిబంధన అంటూ ఏం లేదు. అయితే చెక్‌లో మొత్తాన్ని స్పష్టంగా రాయడం, ఎలాంటి ఖాళీలు వదలకుండా జాగ్రత్త పడటం వంటి భద్రతా సూచనలు చాలా ముఖ్యమైనవి. అందుకే బ్యాంకులు కూడా చెక్ రాసేటప్పుడు మొత్తాన్ని పదాల్లో రాసిన తర్వాత ‘Only’ చేర్చాలని సాధారణంగా సూచిస్తుంటాయి. చెక్‌లో మొత్తాన్ని సాధారణంగా రెండు విధాలుగా రాస్తారు. ఒకటి అంకెల్లో, మరొకటి పదాల్లో. ఈ రెండు చోట్ల ఉన్న మొత్తం తప్పనిసరిగా ఒకేలా ఉండాలి. ఉదాహరణకు రూ.5,000 చెల్లించాలంటే అంకెల్లో రూ. 5,000 అని రాసి.. పదాల్లో “ఐదు వేల రూపాయాలు మాత్రమే” అని రాయాలి. అంకెల్లో ఒక మొత్తం, పదాల్లో మరో మొత్తం ఉంటే చెక్ ప్రాసెసింగ్ సమయంలో సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. అందుకే చెక్ ఇచ్చే ముందు రెండు చోట్ల రాసిన మొత్తాన్ని ఒకసారి కచ్చితంగా పరిశీలించాలి. చెక్ నింపేటప్పుడు కొన్ని చిన్న జాగ్రత్తలు పాటిస్తే మోసాల అవకాశాన్ని తగ్గించుకోవచ్చు. మొత్తాన్ని పదాల్లో రాసిన తర్వాత చివర ‘Only’ రాయడం మంచిది. మొత్తాన్ని రాసే సమయంలో అవసరం లేని ఖాళీ స్థలం వదలకండి. అంకెల్లో, పదాల్లో ఉన్న మొత్తం ఒకేలా ఉందో చూడండి. చెక్‌పై ఉన్న

కరీబియన్ ప్రీమియర్ లీగ్(సీపీఎల్)2026లో బౌండరీ లైన్ వద్ద అతడు పట్టిన సింగిల్ హ్యాండెడ్ క్రేజీ క్యాచ్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ క్యాచ్ పట్టి ఫిలిప్స్ కూడా కాసేపు ఆశ్చర్యపోయాడు. ఇంటర్నెట్ డెస్క్: క్రికెట్లో అద్భుతమైన ఫీల్డింగ్‌కు మారుపేరుగా నిలిచిన న్యూజిలాండ్ స్టార్ ఆల్‌రౌండర్ గ్లెన్ ఫిలిప్స్ మరోసారి సత్తా చాటాడు. కరీబియన్ ప్రీమియర్ లీగ్(సీపీఎల్)2026లో బౌండరీ లైన్ వద్ద అతడు పట్టిన సింగిల్ హ్యాండెడ్ క్రేజీ క్యాచ్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ క్యాచ్ పట్టి ఫిలిప్స్ కూడా కాసేపు ఆశ్చర్యపోయాడు. గయానా అమెజాన్ వారియర్స్, ట్రిన్‌బాగో నైట్ రైడర్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో ఈ అద్భుతం చోటుచేసుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన గయానా 186 పరుగులు చేసింది. 187 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ట్రిన్‌బాగో ఇన్నింగ్స్‌లో రెండో ఓవర్ ముగిసేసరికి స్కోరు 17/0. ఈ సమయంలో డ్వైన్ ప్రిటోరియస్ వేసిన బంతిని సునీల్ నరైన్ భారీ షాట్ ఆడాడు. బంతి డీప్ మిడ్ వికెట్ దిశగా దూసుకెళ్లింది. అక్కడ ఫీల్డింగ్ చేస్తున్న ఫిలిప్స్.. బౌండరీ లైన్ వైపు పరుగెత్తుకుంటూ వెళ్లి, గాల్లోకి ఎగిరి కేవలం ఒంటి చేత్తో బంతిని అందుకున్నాడు. అది అంత సులభమైన క్యాచ్ కాదు. బౌండరీ లైన్‌ను తాకకుండా అద్భుతమైన టైమింగ్‌తో బంతిని ఒంటి చేత్తో అందుకున్న ఫిలిప్స్.. వెంటనే తన చేతిని, క్యాచ్‌ను చూసుకుని తానే నమ్మలేనట్లుగా స్పందించాడు. ఫిలిప్స్‌కు ఇలాంటి అద్భుత క్యాచ్‌లు కొత్తేమీ కాదు. ఒంటి చేత్తో, డైవ్ చేస్తూ, గాల్లోకి ఎగిరి అసాధ్యంగా కనిపించే క్యాచ్‌లను కూడా అతడు సునాయాసంగా అందుకుంటుంటాడు. అందుకే అభిమానులు, కామెంటేటర్లు అతడిని ముద్దుగా ‘సూపర్‌మ్యాన్’ అని పిలుస్తుంటారు. CPLలో ఫిలిప్స్ పట్టిన ఈ క్యాచ్‌కు సంబంధించిన వీడియో వైరల్‌గా మారడంతో క్రికెట్ అభిమానులు అతడి ఫీల్డింగ్ నైపుణ్యాన్ని ప్రశంసిస్తున్నారు. అంతర్జాతీయ క్రికెట్లో ఇప్పటివరకు 112 క్యాచ్‌లు అందుకున్న ఫిలిప్స్.. రనౌట్లు

Glenn Phillips : కరేబియన్ ప్రిమియర్ లీగ్ 2026లో గ్లెన్ ఫిలిప్స్ స్టన్నింగ్ క్యాచ్ అందుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సీపీఎల్ 2026లో భాగంగా సోమవారం ట్రినిడాడ్ వేదికగా ట్రిన్‌బాగో నైట్‌రైడర్స్, గయానా అమెజాన్ వారియర్స్ జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్ స్టార్ ఆల్‌రౌండర్ గ్లెన్ ఫిలిప్స్ బ్యాటింగ్‌లో ఆశించిన స్థాయిలో రాణించలేకపోయినప్పటికి కూడా ఫీల్డింగ్‌లో మాత్రం అదరగొట్టాడు. వర్షం అంతరాయం కలిగించడంతో మ్యాచ్‌ను 16 ఓవర్లకు కుదించారు. తొలుత బ్యాటింగ్ చేసిన అమెజాన్ వారియర్స్ నిర్ణీత 16 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 185 పరుగులు చేసింది. షిమ్రాన్ హెట్మయర్ (111 నాటౌట్ ; 43 బంతుల్లో 8 ఫోర్లు, 9 సిక్సర్లు) మెరుపు సెంచరీ చేశాడు. ఓపెనర్ గ్లెన్ ఫిలిప్స్ నాలుగు బంతులు ఆడి డకౌట్ అయ్యాడు. Hardik Pandya : ఇదేం కర్మరా సామీ.. మళ్లీ గాయపడిన హార్దిక్ పాండ్యా! అఫ్గాన్‌తో టీ20 సిరీస్‌కు దూరం ఆ తరువాత ట్రిన్‌బాగో నైట్‌రైడర్స్ 186 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడానికి బరిలోకి దిగింది. రెండు ఓవర్లు ముగిసే సరికి వికెట్ నష్టపోకుండా 17 పరుగులు చేసింది. ఇన్నింగ్స్ మూడో ఓవర్‌ను డ్వేన్ ప్రిటోరియస్ వేశాడు. ఈ ఓవర్లోని తొలి బంతిని లెగ్ సైడ్ దిశగా సునీల్ నరైట్ భారీ షాట్ ఆడాడు. బంతి వేగంగా బౌండరీ వైపు వెలుతున్నట్లుగా కనిపించింది. అయితే.. డీప్ స్క్వేర్ లెగ్‌లో ఫీల్డింగ్ చేస్తున్న గ్లెన్ ఫిలిప్స్ మాత్రం పరిగెత్తుకుంటూ వచ్చాడు. బౌండరీ ఆవల పడే బంతిని కుడి చేత్తో చక్కగా ఒడిసిపట్టుకున్నాడు. Glenn Phillips! Stop That! 🤯🤯🤯 A crazy one-handed catch from Phillips! 🇹🇹 x 🇬🇾#CPL26 #TKRvGAW #CricketPlayedLouder #BiggestPartyInSport #OmegaXL — CPL T20 (@CPL) September 1, 2026 అతడు క్యాచ్ అందుకున్న విషయాన్ని తొలుత అతడు కూడా నమ్మలేకపోయాడు

Glenn Phillips One Handed Catch Video: క్రికెట్లో క్యాచ్‌లు ఎంతో కీలకమైనవి. మ్యాచ్ లను మలుపు తిప్పడంలో కీలక పాత్ర పోషిస్తుంటాయి. అలాంటి క్యాచ్ లు పట్టేందుకు ఫీల్డర్లు తమ ప్రాణాలను కూడా పణ్ణంగా పెడుతుంటారు. ఈక్రమంలో కొన్ని క్యాచ్‌లు నెటిజన్లను ఆశ్చర్యానికి గురిచేస్తుంటాయి. పట్టిన ఆటగాడే ఆశ్చర్యానికి గురిచేసేలా ఉంటాయి. తాజాగా కరీబియన్ ప్రీమియర్ లీగ్ (CPL) 2026లో న్యూజిలాండ్ స్టార్ గ్లెన్ ఫిలిప్స్ అలాంటి అద్భుతమే చేశాడు. బౌండరీ లైన్ వద్ద ఒంటి చేత్తో కళ్లు చెదిరే క్యాచ్ అందుకుని అందరినీ అవాక్కయ్యేలా చేశాడు. క్యాచ్ పూర్తయిన తర్వాత ఫిలిప్స్ కూడా కొద్దిసేపు నమ్మలేకపోవడం గమనార్హం. గయానా అమెజాన్ వారియర్స్, ట్రిన్‌బాగో నైట్ రైడర్స్ మధ్య జరిగిన ఈ మ్యాచ్‌లో ఓ వింత చోటు చేసుకుంది. గయానా తొలుత 186 పరుగులు చేసింది. టార్గెట్ ఛేజింగ్ లో ట్రిన్‌బాగో 17/0తో ఉన్న సమయంలో డ్వేన్ ప్రిటోరియస్ వేసిన బంతిని సునీల్ నరైన్ భారీ షాట్‌గా ఆడాడు. ఎక్కువమంది చదివినది: వన్డే ప్రపంచకప్ 2027 కోసం దూసుకొస్తోన్న తెలుగోడు.. డేంజర్ జోన్లో సర్పంచ్ సాబ్ ప్లేస్..! బంతి డీప్ మిడ్ వికెట్ వైపు వేగంగా దూసుకెళ్లింది. అక్కడ ఫీల్డింగ్ చేస్తున్న ఫిలిప్స్‌కు అది సిక్సర్‌గా వెళ్లేలా కనిపించింది. అయితే లాస్ట్ మినిట్ లో అతడు కుడివైపు కదులుతూ ఒక్కసారిగా తన కుడి చేతిని గాల్లోకి చాపాడు. అంతే.. గాల్లో దూసుకెళ్తున్న బంతి అతడి చేతిలో పడిపోయింది..! క్యాచ్ అందుకున్న వెంటనే ఫిలిప్స్ ముఖంలో కనిపించిన ఆశ్చర్యమే ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. తాను పట్టిన క్యాచ్‌ను తానే నమ్మలేకపోయినట్లు అతడు కొద్దిసేపు ఆశ్చర్యంగా నిల్చుని చూస్తుండిపోయాడు. క్యాచ్ వీడియోను సీపీఎల్ అధికారిక సోషల్ మీడియా ఖాతాలో పంచుకుంది. అభిమానులు ఈ ఫీట్‌ను చూసి ఫిలిప్స్‌ను మరోసారి ‘సూపర్‌మ్యాన్’ అంటూ ప్రశంసిస్తున్నారు. ప్రపంచంలోనే అత్యుత్తమ ఫీల్డర్లలో ఒకడిగా పేరు.. A
నిమ్మరసంలోని విటమిన్ సి, బ్లీచింగ్ గుణాలు మోకాళ్ల నలుపు తొలగించడంలో సహాయపడుతుంది. అందుకే కొద్దిగా నిమ్మరసం తీసుకుని మోకాళ్లపై బాగా రుద్దండి. 10 నిమిషాలు ఉంచి క్లీన్ చేసుకోండి. బంగాళాదుంపలోని ఎంజైమ్స్ మోకాళ్లను తెల్లగా మార్చడంలో సహాయపడతాయి. దీనికోసం బంగాళాదుంప ముక్కతో మోకాళ్లకు మర్దన చేయండి. తర్వాత శుభ్రం చేసుకుంటే సరిపోతుంది. మోకాళ్ల దగ్గర ఏర్పడిన నల్లటి ట్యాన్ తొలగించడంలో పసుపు, పాలు సహాయపడతాయి. దీనికోసం పసుపులో కొద్దిగా పాలు కలిపి మోకాళ్లకు రాసుకోండి. 20 నిమిషాలు ఉంచి క్లీన్ చేసుకుంటే చాలు. బేకింగ్ సోడా కూడా మోకాళ్ల నలుపు ఈజీగా తొలగిస్తుంది. దీనికోసం బేకింగ్ సోడాలో కొద్దిగా నిమ్మరసం కలిపి పేస్ట్ చేసి మోకాళ్లకు రాసుకోండి. 10 నిమిషాల తర్వాత శుభ్రం చేసుకుంటే చాలు. అలోవెరా మోకాళ్ల నలుపు తొలగించడంలో సహాయపడుతుంది. దీనికోసం తాజా అలోవెరాను మోకాళ్లకు రాసుకుని పావుగంట తర్వాత క్లీన్ చేసుకుంటే చాలు. కొబ్బరి నూనెలో కొద్దిగా చక్కెర కలిపి మోకాళ్లకు రాసుకోండి. ఇది నేచురల్ స్క్రబ్ లాగా పనిచేసి మోకాళ్ల నలుపు పోగొడుతుంది. కీరదోస గుజ్జులో కొద్దిగా రోజ్ వాటర్ కలిపి మోకాళ్లకు రాసుకోండి. కాసేపయ్యాక శుభ్రం చేసుకుంటే మోకాళ్లు తెల్లగా మారుతాయి. బేకింగ్ సోడాలో పాలు కలిపి మోకాళ్లకు రాసుకోండి. పావుగంట ఉంచి తర్వాత క్లీన్ చేసుకుంటే మోకాళ్ల నలుపు ఈజీగా పోతుంది. గ్రీన్ టీని తయారుచేసి చల్లారిన తర్వాత మోకాళ్లకు రాసుకోండి. 10 నిమిషాలు ఉంచి క్లీన్ చేసుకోండి. ఇలా చేయడం వల్ల మోకాళ్ల నలుపు ఈజీగా పోతుంది
పిల్లలు 10 నుంచి 12 ఏళ్లు దాటి టీనేజ్‌లోకి అడుగుపెట్టే సమయంలో తల్లిదండ్రులకు సవాల్‌తో కూడుకున్న పరిస్థితులు ఎదురవుతాయి. ఈ సమయంలో పిల్లలు పూర్తిగా చిన్నవారుగానూ ఉండరు, అలాగే పూర్తిగా పెద్దవారుగానూ ఉండరు. ఒకవైపు కెరీర్, బోర్డు పరీక్షల ఒత్తిడి ఉంటే.. మరోవైపు శారీరక మార్పులు, స్నేహితుల నుంచి ఒత్తిడి ఉంటాయి. చాలా మంది తల్లిదండ్రులు తమ పిల్లలు పెద్దవారయ్యారని.. వారికి తమ అవసరం తక్కువగా ఉందని భావిస్తారు. కానీ వాస్తవం దానికి పూర్తిగా విరుద్ధం. నిపుణుల అభిప్రాయం ప్రకారం కౌమారదశలో ఉన్నవారికి తల్లిదండ్రుల మార్గదర్శకత్వం, భావోద్వేగ మద్దతు అత్యంత అవసరం.ఇక, టీనేజ్ పిల్లలకు ఎంతవరకు వ్యక్తిగత స్వేచ్ఛ (Privacy) ఇవ్వాలి? పిల్లల మానసిక, శారీరక ఎదుగుదలకు ప్రైవసీ ఇవ్వడం ఎంత ముఖ్యమో, కొన్ని విషయాల్లో వారిని పర్యవేక్షించడం కూడా అంతే అవసరం. ఆ సున్నితమైన సరిహద్దుల్ని అర్థం చేసుకోవడం తల్లిదండ్రులకు చాలా ముఖ్యం. సైకాలజీ టుడే ప్రకారం టీనేజ్ పిల్లలకు ఏ వయసులో ప్రైవసీ ఇవ్వాలి, ఏ విషయాల్లో ఇవ్వకూడదో తెలుసుకుందాం.పిల్లలకు తప్పనిసరిగా ప్రైవసీ ఇవ్వాల్సిన విషయాలు గదిలోని వ్యక్తిగత వస్తువులు: పిల్లల గదిలో ఉండే పర్సనల్ డైరీలు, డ్రాయింగ్ పుస్తకాలు, ఫ్రెండ్స్ ఇచ్చిన గిఫ్ట్‌లు లేదా నోట్స్ విషయంలో తల్లిదండ్రులు అతిగా జోక్యం చేసుకోకూడదు. వారి అల్మారాలో ఒక భాగాన్ని లేదా వారి వస్తువుల్ని పూర్తిగా వారి వ్యక్తిగత విషయంగానే ఉంచాలి. దుస్తుల ఎంపిక (డ్రెస్సింగ్ స్టైల్): వయసు పెరిగే కొద్దీ పిల్లలు తమకు నచ్చిన విధంగా దుస్తులు ధరించాలని అనుకుంటారు. వారి స్టైల్, ఫ్యాషన్ ప్రయోగాలకు కొంత స్వేచ్ఛ ఇవ్వాలి. దీనివల్ల భవిష్యత్తులో వారు సొంతంగా సరైన నిర్ణయాలు తీసుకునే ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. శారీరక గోప్యత: పిల్లలు ఎంత ఎదిగినా తల్లిదండ్రులకు చిన్నపిల్లల్లాగే కనిపిస్తారు. కానీ స్నానం చేయడం, బట్టలు మార్చుకోవడం వంటి విషయాల్లో వారికి చిన్నప్పటి నుంచే పూర్తి గోప్యతను అలవాటు చేయాలి. ఇది వారిలో వ్యక్తిగత భద్రత

వంట చేస్తున్నప్పుడో లేదా భోజనం చేస్తున్నప్పుడో బట్టలపై కూర లేదా నూనె, నెయ్యి చుక్కలు పడటం జరుగుతూ ఉంటుంది. చాలామంది నూనె మరక పడగానే వెంటనే కంగారుపడి నీటితో కడగడం లేదా గట్టిగా రుద్దడం చేస్తుంటారు. నిజానికి నూనె, నీరు ఎప్పుడూ ఒకదానితో ఒకటి కలవవు. దీనివల్ల నీరు తగలగానే నూనె మరక పోదు.. పైగా చుట్టుపక్కల భాగానికి మరింతగా వ్యాపిస్తుంది. అదే విధంగా మరకను గట్టిగా రుద్దితే ఆ నూనె వస్త్రం పోగులలోకి మరింత లోతుగా ఇంకిపోయి శాశ్వతంగా ఉండిపోతుంది. నూనె మరకలు ఉన్న వస్త్రాలపై వేడి నీటిని పోయడం లేదా మరక పూర్తిగా పోకముందే డ్రైయర్‌లో వేసి వేడి గాలికి ఆరబెట్టడం కానీ అస్సలు చేయకూడదు. వేడి తగిలితే నూనె వస్త్రం ఫైబర్‌కు గట్టిగా అంటుకుపోతుంది. అందుకే నూనె పడగానే ముందుగా ఒక శుభ్రమైన టిష్యూ పేపర్ లేదా తెల్లటి కాగితం తీసుకుని, మరక ఉన్న చోట సున్నితంగా అద్ది పైనున్న అదనపు నూనెను తొలగించాలి. దుస్తులపై పడిన నూనె జిడ్డును వదిలించుకోవడానికి ఇంట్లో దొరికే సాధారణ వస్తువులే పనిచేస్తాయి. అదనపు నూనెను టిష్యూతో తీసేసిన తర్వాత, ఆ మరక ఉన్న ప్రదేశంపై బేకింగ్ సోడా లేదా కార్న్‌స్టార్చ్ (మొక్కజొన్న పిండి)ను చల్లాలి. ఈ పౌడర్ వస్త్రాలపై ఉన్న నూనెను సహజంగా పీల్చుకుంటుంది. పౌడర్ వేసిన తర్వాత 15 నుంచి 30 నిమిషాల పాటు వస్త్రాన్ని అలానే వదిలేయాలి. ఆ తర్వాత ఒక పాత సాఫ్ట్ బ్రష్ లేదా చెంచా వెనుక భాగంతో ఆ పౌడర్‌ను సున్నితంగా రుద్ది దులిపివేయాలి. ఇప్పుడు మరక ఉన్న చోట కొద్దిగా డిష్ వాష్ లిక్విడ్ వేయాలి. ఇందులో ఎలాంటి నీళ్లు కలపకుండా నేరుగా వేలితో కానీ లేదా మెత్తటి టూత్ బ్రష్‌తో కానీ గుండ్రంగా 60 నుంచి 90 సెకన్ల పాటు సున్నితంగా రుద్దాలి. ఆ తర్వాత ఆ భాగాన్ని కేవలం చల్లటి నీటితో
క్రమం తప్పకుండా వ్యాయామం చేయండి. ప్రతిరోజూ వ్యాయామం చేయడం వల్ల నిద్ర హార్మోన్లు రిలీజ్ అవుతాయి. ఉదయం పూట వ్యాయామం చేస్తే రాత్రి పూట ప్రశాంతంగా నిద్రపడుతుందని హార్వర్డ్ హెల్త్ రిపోర్ట్ తెలిపింది. మీ బెడ్‌ను కేవలం నిద్ర కోసం మాత్రమే ఉపయోగించండి. బెడ్ మీద వర్క్ చేయడం, ఫోన్ చూడటం వంటివి చేయవద్దు. బెడ్రూమ్లో టీవీలు, ల్యాప్‌టాప్‌లు ఉంచవద్దు. ఇవి నిద్రకు ఆటంకం కలిగించే అవకాశం ఉంది. బెడ్రూమ్ను నిద్ర కోసం కంపర్ట్బుల్గా ఉంచండి. ప్రతిరోజూ ఒకే సమయానికి నిద్రపోండి. ఒకే సమయానికి నిద్రలేవండి. దీని వల్ల సిర్కాడియన్ రిథమ్ బాగుంటుంది. నిద్ర బాగా వస్తుంది. రాత్రి పూట పడుకునే ముందు తక్కువ తినండి. భారీ మోతాదులో తినడం వల్ల నిద్రలో సమస్యలు వస్తాయి. కాబట్టి మితంగా తినండి. రాత్రిపూట ఆల్కాహాల్‌కు దూరంగా ఉండండి. మందు తాగడం వల్ల నిద్రలేమి సమస్యలు వస్తాయి. ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది. నిద్రపోవడానికి 4-5 గంటల ముందు నుంచే కాఫీకి దూరంగా ఉండండి. కాఫీ తాగడం వల్ల నరాలు యాక్టివ్ అవుతాయి. నిద్ర సరిగా రాదు. ఒత్తిడి పలు సమస్యలకు కారణం అవుతుంది. ఒత్తిడి పెరగడం వల్ల నిద్రకూడా సరిగా పట్టదు. కాబట్టి ఒత్తిడి తగ్గించుకోండి. ఇందుకోసం ధ్యానం చేయండి. పడుకునే గదిలో ఉష్ణోగ్రత చల్లగా ఉండేలా చూసుకోండి. గదిని డార్క్‌గా ఉంచుకోండి
రచయిత గురించిబండ తిరుపతిబండ తిరుపతి సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు జర్నలిజంలో 10 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. 2023లో సమయంలో చేరిన తిరుపతి.. బిజినెస్ రంగానికి సంబంధించి తాజా వార్తలతో పాటు పర్సనల్ ఫైనాన్స్, పెట్టుబడులు, మ్యూచువల్ ఫండ్స్, స్టాక్ మార్కెట్ న్యూస్, బంగారం వెండి ధరలపై ఎప్పటికప్పుడు అప్డేట్లు అందిస్తున్నారు. ఫ్యాక్ట్ చెక్ ఆర్టికల్స్‌తో పాటు ప్రభుత్వ పథకాలకు సంబంధించిన సమాచారం సైతం ఇస్తున్నారు. బండ తిరుపతి 2025 ఫిబ్రవరిలో టైమ్స్ ఇంటర్నెట్ నుంచి ఓవర్ అచీవర్ ఆఫ్ ది మంత్ అవార్డును అందుకున్నారు. తిరుపతి మండలస్థాయి న్యూస్ కంట్రిబ్యూటర్‌గా తన జర్నలిజం కెరీర్‌ను ప్రారంభించారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో మల్టీమీడియా జర్నలిజం కోర్స్ పూర్తి చేశారు. అనంతరం ఈటీవీ భారత్, సాక్షి మీడియా సంస్థల్లో పని చేశారు. అక్కడ బిజినెస్, స్పోర్ట్స్, నేషనల్, ఇంటర్నేషనల్ న్యూస్ రాశారు. 2019 సాధారణ ఎన్నికల సమయంలో ప్రత్యేక కథనాలు అందించిన అనుభవం ఉంది. సినిమాలు, క్రికెట్ చూడటం, బిజినెస్ రంగానికి సంబంధించిన కొత్త విషయాలు నేర్చుకోవడం పట్ల ఆయన ఆసక్తి చూపుతారు.... ఇంకా చదవండి

వంట చేసేటప్పుడు కాస్త అటూ ఇటూ దృష్టి మారినా లేదా మంట ఎక్కువగా ఉన్నా అన్నం, పప్పు లేదా గ్రేవీ కూరలు అడుగున మాడిపోవడం సహజం. అలాంటప్పుడు ఆ మాడిన వాసన వంటకం మొత్తానికి పట్టుకుని, దాని రుచిని పూర్తిగా పాడుచేస్తుంది. అయితే, మాడిపోయిన ఆహారాన్ని పారేయాల్సిన అవసరం లేకుండా, ఆ వాసనను పూర్తిగా మాయం చేసే కొన్ని సింపుల్ టెక్నిక్స్ ఇప్పుడు చూద్దాం.. అన్నం లేదా పప్పు మాడిపోయిందని గ్రహించిన వెంటనే స్టవ్ ఆఫ్ చేయండి. పాత్ర అడుగున ఉన్న మాడిన భాగాన్ని అస్సలు కలపకుండా లేదా గీకకుండా, పైన ఉన్న మంచి ఆహారాన్ని మాత్రమే వేరొక శుభ్రమైన పాత్రలోకి మార్చుకోండి.ఆ వేడి వంటకం పైన 1-2 వైట్ లేదా బ్రౌన్ బ్రెడ్ ముక్కలను పరిచినట్లు ఉంచి, పాత్రపై మూత పెట్టి 5 నుండి 10 నిమిషాలు అలాగే వదిలేయండి. ఇది ఎలా పనిచేస్తుంది?: బ్రెడ్‌లో స్పాంజ్ వంటి చిన్న చిన్న రంధ్రాలు ఉంటాయి. వేడి ఆహారం నుండి వెలువడే ఆవిరిలో ఉండే మాడిన పొగ కణాలను బ్రెడ్ పూర్తిగా పీల్చేసుకుంటుంది. 10 నిమిషాల తర్వాత బ్రెడ్ ముక్కను తీసి పారేస్తే, మాడిన వాసన మాయమవుతుంది. మాడిపోయిన పప్పు లేదా అన్నాన్ని వేరే పాత్రలోకి మార్చిన తర్వాత, ఒక పెద్ద ఉల్లిపాయను రెండు సగాలుగా కోసి, ఆ ముక్కలను వేడి ఆహారంలో మునిగేలా ఉంచండి. మూతపెట్టి 10 నిమిషాలు ఉంచిన తర్వాత ఆ ఉల్లిపాయ ముక్కలను తీసేయండి. ఇది ఎలా పనిచేస్తుంది?: ఉల్లిపాయలో ఉండే సహజమైన సల్ఫర్ సమ్మేళనాలు, తీవ్రమైన సువాసన ఆహారంలోకి ఇంకిన మాడిన వాసనను తగ్గించేస్తుంది. ఒక చిన్న బొగ్గు ముక్కను స్టవ్‌పై ఎర్రగా కాలే వరకు కాల్చండి. వేరే పాత్రలోకి మార్చిన పప్పు లేదా కూర మధ్యలో ఒక చిన్న స్టీల్ గిన్నె ఉంచి, దానిలో ఈ కాలిన బొగ్గును పెట్టండి. బొగ్గుపై అర స్పూన్ నెయ్యి లేదా
పనీర్, బంగాళాదుంప, పచ్చిమిర్చి, కార్న్ ఫ్లోర్, టొమాటో, ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, జీడిపప్పు, గరం మసాలా, ధనియాల పొడి, క్రీమ్, ఉప్పు తగినంత, నూనె కావాల్సినంత ముందుగా ఒక గిన్నెలో తరిగిన పనీర్, ఉడికించిన బంగాళాదుంప ముక్కలు, కార్న్ ఫ్లోర్, పచ్చిమిర్చి తరుగు, ఉప్పు వేసి బాగా కలుపుకోండి. ఈ పిండిని చిన్న ఉండల్లా (కోఫ్తా) చుట్టుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టి సరిపడా నూనె వేసి వేడి చేయండి. నూనె వేడి అయ్యాక అందులో కోఫ్తాలు వేసి రంగు మారే వరకు బాగా వేయించుకోండి. ఇప్పుడు మరో కడాయిలో నూనె వేసి వేడి అయ్యాక ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించండి. అవి వేగాక అందులో టొమాటో పేస్ట్ కూడా వేసి నూనె పైకి తేలే వరకు ఉంచండి. తర్వాత కారం, ఉప్పు వేసి కలపండి. ఇందులో ధనియాల పొడి, జీడిపప్పు పేస్ట్, సరిపడా నీళ్లు వేసి కలపండి. గ్రేవీ బాగా ఉడికాక ఇందులో గరం మసాలా, కోఫ్తాలు వేసి నిమిషం ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోండి. అంతే.. రుచికరమైన పనీర్ కోఫ్తా కూర రెడీ అయినట్లే. వేడి వేడిగా అన్నంలో తింటే రుచి బాగుంటుంది
ఆహారాన్ని తినేటప్పుడు బాగా నమలండి. నెమ్మదిగా తినండి. దీని వల్ల లాలాజలంలో ఆహారంతో బాగా కలుస్తుంది. ఫలితంగా కడుపుపై పనిభారం తగ్గుతుంది. ఆహారం సులభంగా జీర్ణం అవుతుందని హెల్త్‌లైన్ తెలిపింది. ఫైబర్ ఎక్కువగా ఉన్న పండ్లు, కూరగాయలు, పప్పులు తినడం వల్ల జీర్ణ వ్యవస్థ పనితీరు మెరుగుపడుతుంది. అజీర్తి, మలబద్దకం తగ్గుతుంది. తిన్న ఆహారం బాగా జీర్ణం అయ్యేందుకు ఎక్కువగా నీరు తాగాలి. నీరు బాగా తాగడం వల్ల కొవ్వులు, ఫైబర్ ఫుడ్ బాగా కరుగుతాయి. వ్యర్థాలు సులభంగా బయటకుపోతాయి. పెరుగు, కిమ్చీ, మజ్జిగ వంటి ఆహారాలు తీసుకోవడం వల్ల జీర్ణాశయంలో ఆరోగ్యకరమైన బ్యాక్టీరియా వృద్ధి చెందుతుంది. దీంతో జీర్ణ సంబంధిత సమస్యలు రావు. ప్రతిరోజూ వ్యాయామం చేయండి. రన్నింగ్, వాకింగ్, యోగా చేయడం వల్ల జీర్ణాశయంలో కండరాల కదలిక బాగుంటుంది. దీంతో ఆహారం బాగా జీర్ణం అవుతుంది. ఓవర్‌గా తినడం వల్ల కూడా జీర్ణ సమస్యలు వస్తాయి. మీ కడుపు 70 నుంచి 90 శాతం నిండిందని మీకు అనిపిస్తే తినడం ఆపేయండి. ఇలా చేస్తే జీర్ణాశయంపై అదనపు బారం పడదు. రాత్రి భోజనానికి నిద్రకి మధ్యలో రెండు గంటల గ్యాప్ ఉండేలా చూడండి. దీంతో యాసిడ్ రిఫ్లెక్స్ రాదు. పడుకునే ముందు మితంగా ఆహారాన్ని తినండి. రోజులో 8 గంటల పాటు ప్రశాంతంగా నిద్రపోండి. దీని వల్ల కండరాలు అన్నీ రిలాక్స్ అవుతాయి. రిపేర్ అవుతాయి. గట్ మైక్రోబయోమ్ కూడా సమతుల్యంగా ఉంటుంది. ప్రతిరోజూ ఒకే సమయానికి ఆహారం తినండి. దీని వల్ల జీర్ణక్రియ సాఫీగా జరుగుతుంది. ప్రతిసారి తక్కువ మోతాదులోనే తినండి

మీరు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారా? లేదంటే ట్రావెల్ వ్లాగ్స్, డైలీ రొటీన్ వీడియోలతో కంటెంట్ క్రియేటర్ కావాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే మీకు ఒక పర్ఫెక్ట్ వ్లాగింగ్ కెమెరా చాలా ముఖ్యం. వీడియో రికార్డ్ బటన్ ప్రెస్ చేసి, చిన్న స్క్రీన్‌పై విజువల్స్ చూస్తూ కొత్త క్రియేటివ్ జర్నీ స్టార్ట్ చేయడంలో ఉండే మజానే వేరు. ఒక నాసిరకం కెమెరా, షేకీ వీడియోలు, సరిగ్గా లేని ఆడియో మీ ఉత్సాహాన్ని దెబ్బతీస్తాయి. అందుకే నడిచేటప్పుడు కూడా వీడియో స్టెబిలిటీ ఉండేలా, బ్యాక్‌గ్రౌండ్ నాయిస్ లేకుండా క్లియర్ ఆడియో ఇచ్చేలా, ఫ్రేమింగ్ చెక్ చేసుకోవడానికి ఫ్లిప్ స్క్రీన్ ఉండే మంచి కెమెరాను ఎంచుకోవడం చాలా ముఖ్యం. కంటెంట్ క్రియేటర్ల కోసం అమెజాన్ అదిరిపోయే గుడ్ న్యూస్ మోసుకొచ్చింది. అమెజాన్ ప్రైమ్ డే సేల్ జూలై 4 నుంచి జూలై 6 వరకు జరగనుంది. అయితే, మెయిన్ సేల్ స్టార్ట్ అవ్వడానికి ముందే ఎర్లీ ప్రైమ్ డే డీల్స్ లైవ్ అయిపోయాయి. ఈ సేల్‌లో బెస్ట్ వ్లాగింగ్ కెమెరాలపై భారీ డిస్కౌంట్లు అందుబాటులో ఉన్నాయి. బడ్జెట్ రేంజ్ నుంచి అడ్వాన్స్డ్ గింబాల్ కెమెరాల వరకు ప్రస్తుతం ఆఫర్లలో ఉన్న టాప్ 5 కెమెరాల వివరాలు మీకోసం. యాక్షన్, ట్రావెలింగ్, హైకింగ్ లేదా అండర్ వాటర్ అడ్వెంచర్స్ షూట్ చేయాలనుకునే వారికి ఈ రగ్గడ్ కెమెరా (TECHDASH® 5K Action Camera) సూపర్ చాయిస్. ఇది చాలా కాంపాక్ట్‌గా ఉంటుంది. జేబులో లేదా బ్యాగ్‌లో ఈజీగా పెట్టేసుకోవచ్చు. బరువు అస్సలు తెలియదు. • ధర: ₹9,470 (అసలు ధర: ₹14,999 - 36% డిస్కౌంట్) • కీలక ఫీచర్లు: 5K హై-రిజల్యూషన్ వీడియో క్యాప్చర్, యాంటీ-షేక్ EIS స్టెబిలైజేషన్, 48MP ఫొటో రిజల్యూషన్, 4X డిజిటల్ జూమ్, రిమోట్ కంట్రోల్, వైఫై కనెక్టివిటీ, డ్యూయల్ టచ్ స్క్రీన్. నీటి లోపల, అవుట్డోర్ షూటింగ్స్‌కు ఇది బెస్ట్. పాకెట్

బంగాళాదుంపలో స్టార్చ్ (పిండి పదార్థం) ఎక్కువగా ఉంటుంది. ఒక పచ్చి బంగాళాదుంపను రెండు ముక్కలుగా కోసి, లోపలి భాగాన్ని కారు విండ్‌షీల్డ్ లేదా అద్దంపై బాగా రుద్దితే, స్టార్చ్ అద్దంపై చాలా పలుచని పొరలా ఏర్పడుతుంది. ఈ పొర అద్దంపై నీరు ఎక్కువసేపు నిలవకుండా సహాయపడుతుంది. దీని వల్ల వర్షపు నీటి చుక్కలు అద్దంపై పేరుకుపోకుండా జారిపడే అవకాశం ఉంటుంది. దీంతో డ్రైవింగ్ సమయంలో ముందున్న దారి స్పష్టంగా కనిపించేందుకు కొంత సహాయపడుతుంది. ఈ చిట్కా ఉపరితల ఉద్రిక్తత (Surface Tension) అనే సూత్రంపై ఆధారపడి పనిచేస్తుంది. సాధారణంగా వర్షపు చినుకులు అద్దంపై పడితే అవి ఒకచోట చేరి నీటి పొరను ఏర్పరుస్తాయి. దీంతో దృశ్యం స్పష్టంగా కనిపించదు. కానీ అద్దంపై స్టార్చ్ పొర ఉన్నప్పుడు నీటి చుక్కలు పెద్దగా వ్యాపించకుండా చిన్న చిన్న బిందువులుగా ఏర్పడతాయి. గాలి ఒత్తిడి లేదా వాహనం కదలిక వల్ల అవి సులభంగా కిందికి జారిపోతాయి. దీంతో అద్దంపై నీరు తక్కువసేపే ఉంటుంది. ముందుగా కారు అద్దాలను శుభ్రమైన గుడ్డతో తుడవాలి. తర్వాత ఒక పచ్చి బంగాళాదుంపను రెండు భాగాలుగా కోసి, లోపలి భాగాన్ని విండ్‌షీల్డ్, సైడ్ మిర్రర్లు, వెనుక అద్దంపై నెమ్మదిగా రుద్దాలి. కొన్ని నిమిషాలు ఆరనిచ్చిన తర్వాత మైక్రోఫైబర్ గుడ్డతో నెమ్మదిగా తుడవాలి. ఇలా చేస్తే స్టార్చ్ మరకలు కనిపించకుండా అద్దం శుభ్రంగా ఉంటుంది. ఈ విధానం చాలా తక్కువ ఖర్చుతో ఇంట్లోనే చేయగలిగే సులభమైన చిట్కా. ఖరీదైన యాంటీ-ఫాగ్ స్ప్రేలు లేదా ప్రత్యేక కెమికల్ కోటింగ్‌లు కొనాల్సిన అవసరం ఉండదు. వర్షాకాలంలో అద్దంపై నీరు నిలిచే సమస్యను కొంతవరకు తగ్గించడంలో ఇది ఉపయోగపడే అవకాశం ఉంది. అయితే ఇది శాశ్వత పరిష్కారం కాదు. దీని ప్రభావం కొంతకాలం మాత్రమే ఉంటుంది. అలాగే భారీ వర్షాలు లేదా క్లిష్టమైన వాతావరణ పరిస్థితుల్లో కారు వైపర్లు, విండ్‌షీల్డ్ వాషర్ వ్యవస్థను సక్రమంగా ఉపయోగించడం తప్పనిసరి. భద్రత కోసం

ఒకప్పుడు కోటీశ్వరుడు అవ్వడం అంటే కేవలం భారీగా సంపాదించే వాళ్లకు మాత్రమే సాధ్యమయ్యే ఒక పెద్ద కల. కానీ ఇప్పుడు రోజులు మారాయి. మిడిల్ క్లాస్ వేతన జీవులు కూడా పక్కా ప్లానింగ్‌తో ఇన్వెస్ట్ చేస్తే ఈజీగా కోటీశ్వరులు అయిపోవచ్చు. దీనికి పెద్దగా రిస్క్ కూడా అవసరం లేదు. మ్యూచువల్ ఫండ్స్‌లో క్రమం తప్పకుండా చేసే సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ (SIP), కాంపౌండింగ్ పవర్ తోడుంటే చాలు, అనుకున్న టార్గెట్‌ను సులువుగా రీచ్ అవ్వొచ్చు. ఫైనాన్షియల్ ప్లానర్లు ఎక్కువగా రికమండ్ చేసే ‘8-4-3 కాంపౌండింగ్ రూల్’ దీనికి పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. ఈ 8-4-3 రూల్ అనేది చాలా సింపుల్ కాన్సెప్ట్. మనం ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌లో 15 ఏళ్ల పాటు క్రమం తప్పకుండా డిసిప్లిన్‌తో ఇన్వెస్ట్ చేస్తే వచ్చే లాభాలను ఇది చూపిస్తుంది. దీర్ఘకాలంలో డైవర్సిఫైడ్ ఈక్విటీ ఫండ్స్ సగటున 12 శాతం వార్షిక రిటర్న్స్ ఇస్తాయనే అంచనాతో ఈ రూల్ పనిచేస్తుంది. మార్కెట్ ఒడిదొడుకుల వల్ల రిటర్న్స్ మారే ఛాన్స్ ఉన్నప్పటికీ, లాంగ్ టర్మ్‌లో 12 శాతం రిటర్న్స్ అనేది రీజనబుల్ అంచనా. మీ ఇన్వెస్ట్మెంట్ కార్పస్ పెరిగే కొద్దీ, అది ఎంత వేగంగా డబుల్ అవుతుందో ఈ రూల్ చాలా క్లియర్ గా వివరిస్తుంది. రూ. 1 కోటి టార్గెట్‌ను రీచ్ అవ్వడానికి మీరు నెలకు రూ. 21,250 ఎస్ఐపీ స్టార్ట్ చేయాలి. 12 శాతం వార్షిక రిటర్న్స్ వస్తాయని అనుకుంటే, మొదటి 8 ఏళ్లలో మీ ఇన్వెస్ట్మెంట్ విలువ దాదాపు రూ. 34 లక్షలకు చేరుకుంటుంది. ఈ 8 ఏళ్లలో (96 నెలలు) మీరు సొంతంగా ఇన్వెస్ట్ చేసిన అసలు మొత్తం రూ. 20.4 లక్షలు మాత్రమే. మిగిలిన అమౌంట్ అంతా మీకు కాంపౌండింగ్ ద్వారా వచ్చిన లాభం. అంటే మీ డబ్బు మెల్లమెల్లగా పెరగడం ఇక్కడే స్టార్ట్ అవుతుంది. ఇక అసలైన మ్యాజిక్ ఇక్కడే మొదలవుతుంది. ఈ
బియ్యం కడిగిన నీటిలో విటమిన్ బి, అమైనో యాసిడ్స్, విటమిన్ ఇ, ఇనోసిటాల్, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఈ పోషకాలు దెబ్బతిన్న జుట్టు లోపలికి లోతుగా వెళ్తాయి. తలస్నానం చేసిన తర్వాత కూడా వెంట్రుకల లోపలే ఉంటాయి. ఇది రాపిడిని తగ్గించి, స్థితిస్థాపకతను మెరుగుపరిచి, జుట్టు చిట్లడాన్ని తగ్గిస్తుంది. దీంతో జుట్టు పట్టులా మెరుస్తుంది. అంతేకాదు, జుట్టు కుదుళ్లను దృఢంగా ఉంచుతుందని NLM అధ్యయనం పేర్కొంది. మెంతులలో ఐరన్, నికోటినిక్ యాసిడ్, ప్రొటీన్లు, సాపోనిన్లు, ఫ్లేవనాయిడ్లు పుష్కలంగా ఉంటాయి. ఈ పోషకాలు జుట్టు రాలడాన్ని కంట్రోల్లో ఉంచుతాయని రీసెర్చ్‌గేట్ అధ్యయనం పేర్కొంది. మెంతులలోని ప్రొటీన్ జుట్టు కుదుళ్లను బలంగా ఉంచి, హెయిర్ ఫాల్‌ను కంట్రోల్లో ఉంచుతుంది. మెంతుల్లో ఉండే యాంటీఫంగల్ గుణాలు చుండ్రు సమస్యను తగ్గిస్తుంది. అంతేకాదు మెంతుల్లో ఉండే నికోటినిక్ యాసిడ్ తలకు రక్త ప్రసరణను పెంచి, జుట్టు పెరగడానికి సహాయపడుతుంది. మెంతుల్లో ఉండే యాంటీఆక్సిడెంట్లు జుట్టు త్వరగా నెరిసిపోకుండా కాపాడతాయి. బియ్యం కడిగిన నీళ్లు, మెంతుల కాంబినేషన్ జుట్టు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని నిపుణులు చెబుతున్నారు. నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్ పరిశోధన ప్రకారం బియ్యం నీరు మీ జుట్టును బలపరిచి జుట్టు చిట్లిపోకుండా కాపాడుతుంది. అంతేకాదు పట్టులాంటి మెరిసే జుట్టును ఇస్తుంది. ఇది తయారు చేసుకోవడానికి అర కప్పు బియ్యం, 2 టేబుల్ స్పూన్ల మెంతులు, 2 కప్పుల నీరు తీసుకోండి. బియ్యాన్ని కడిగి నానబెట్టండి, అదే గిన్నెలో మెంతులు కూడా వేయండి. మరుసటి రోజు ఆ నీటిని వడకట్టండి. కావాలంటే మరొకరోజు పులియబెట్టవచ్చు. దీన్ని ఫ్రిజ్‌లో స్టోర్ చేసుకుని. షాంపూ చేసుకునే ముందు జుట్టుకు అప్లయ్ చేయండి. ఈ నీటిని రోజూ అప్లయ్ చేసుకోవద్దు. ఇది మీ జుట్టు పొడిబారేలా చేస్తుంది. ఒకవేళ దీన్ని అప్లయ్ చేసిన తర్వాత మీకు హెయిర్ ఫాల్ ఎక్కువ అయితే, డెర్మటాలటిస్ట్ను సంప్రదించండి. మెంతులు, బియ్యం కడిగిన నీరు మీ జుట్టుకు

హరియాణాలో రెండు వేర్వేరు కేసుల్లో ఐపీఎస్, ఐఏఎస్ అధికారులిద్దరిని సీబీఐ అరెస్ట్ చేసింది. నకిలీ ఔషధాల తయారీ సంస్థ నుంచి రూ.3కోట్లు లంచం తీసుకున్న కేసులో హరియాణా.. న్యూఢిల్లీ, జూలై 1: హరియాణాలో రెండు వేర్వేరు కేసుల్లో ఐపీఎస్, ఐఏఎస్ అధికారులిద్దరిని సీబీఐ అరెస్ట్ చేసింది. నకిలీ ఔషధాల తయారీ సంస్థ నుంచి రూ.3కోట్లు లంచం తీసుకున్న కేసులో హరియాణా కేడర్ ఐపీఎస్ అధికారి దీపక్ గెహ్లావత్‌ను కేంద్ర దర్యాప్తు సంస్థ అరెస్ట్ చేసింది. బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ రీజనల్ డైరక్టర్ హోదాలో ఉన్న గెహ్లావత్ పుదుచ్చేరికి చెందిన ఓ వ్యాపారిని సీబీఐ దర్యాప్తు చేస్తున్న కేసు నుంచి తప్పిస్తానంటూ రూ.3కోట్లు లంచం డిమాండ్ చేశారు. దర్యాప్తును ప్రభావితం చేసి కేసును అనుకూలంగా మారుస్తానంటూ హామీ ఇవ్వడంతో నిందితులు మధ్యవర్తులతో పాటు హవాలా మార్గంలో డబ్బు ముట్టజెప్పారు. అయితే దర్యాప్తులో భాగంగా లంచం విషయం బయటపడటంతో సీబీఐ గెహ్లావత్ ఆట కట్టించింది. మరో కేసులో ప్రభుత్వ నిధులను దుర్వినియోగం చేసిన హరియాణా కేడర్ ఐఏఎస్ అధికారి ప్రదీప్ కుమార్‌ను సీబీఐ అరెస్ట్ చేసింది. హరియాణా కాలుష్య నియంత్రణ సంస్థ కార్యదర్శిగా ఉన్న ప్రదీప్ కుమార్ వివిధ శాఖలకు చెందిన ప్రభుత్వ నిధులను ఐడీఎ్‌ఫసీ ఫస్ట్ బ్యాంకు ఖాతాల ద్వారా అక్రమంగా మళ్లించారు. ప్రభుత్వ ఆర్ధిక నిబంధనలు ఉల్లంఘించి, ఉద్దేశపూర్వకంగా ప్రైవేట్ బ్యాంకుకు అనుచిత ఆర్ధిక ప్రయోజనం కలిగేలా చేశారు. దీంతో ప్రభుత్వానికి రూ.169 కోట్లు నష్టం వాటిల్లిందని సీబీఐ గుర్తించింది. సరిగ్గా పదవీ విరమణ చేసిన రోజే ప్రదీప్ కుమార్‌ను అరెస్ట్ చేసింది. దేశంలోనే అత్యధిక పెన్షన్ల పంపిణీలో ఏపీ రికార్డ్: ఎంపీ కేశినేని శివనాథ్ కృష్ణా తూర్పు డెల్టా కాలువలకు 3200 క్యూసెక్కుల నీరు విడుదల