© 2026 nimisham.in

దురిశెట్టి ధర్మరాజు జీ తెలుగు న్యూస్ (zee telugu news)లో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు దాదాపు జర్నలిజంలో ఐదు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ సోషల్, ఆస్ట్రాలజీ, టెక్నాలజీ, ఆటోమొబైల్స్, బిజినెస్, జాతీయం అంశాలకు సంబంధించిన తాజా వార్తలతో పాటు విశ్లేషణ పూరితమైన కథనాలను అందిస్తారు. అలాగే ఆయనకు వెబ్‌సైట్‌కు సంబంధించిన వీడియో కంటెంట్‌పై కూడా అవగాహన ఉంది.. Chanakya Niti Rules: మన జీవితంలో కొన్నిసార్లు బయట వ్యక్తుల కంటే.. మనకు అత్యంత సన్నిహితంగా ఉండే సొంత మనుషులే ఎక్కువ బాధ పెడుతూ ఉంటారు.. మన ఎదుగుదలను చూసి ఓర్వలేక అసూయతో రగిలిపోయే బంధువులతో పాటు మిత్రులు మన చుట్టూనే ఉండిపోతూ ఉంటారు.. వాళ్లు మనపై కుట్రలు పన్నుతున్నారని తెలిసినప్పుడు చాలామంది ఆవేశంతో తప్పులు చేస్తూ ఉంటారు. అయితే ఇలాంటి విపత్కర పరిస్థితులను ఎలా ఎదుర్కోవాలో వేల ఏల క్రితమే ఆచార్య చానక్యుడు తన చాణక్య నీతి శాస్త్రంలో స్పష్టంగా వివరించారు. సన్నిహితులు ద్రోహానికి పాల్పడినప్పుడు ఆవేశంతో నిర్ణయాలు తీసుకోకుండా.. చాణక్యుడు సూచించిన ఐదు పద్ధతులను పాటిస్తే మిమ్మల్ని మీరు సులభంగా కాపాడుకోవచ్చు.. ప్రశాంతంగా ఉండాల్సి ఉంటుంది.. మీరు అత్యంత సన్నిహితంగా ఉండే వ్యక్తులు మీకు ద్రోహం చేస్తున్నారని.. లేదా మీపై కుట్రలు చేస్తున్నారని తెలిసినప్పుడు వెంటనే ఆవేశపడకుండా ఉండడం చాలా మంచిది.. కోపంతో రగిలిపోతూ అప్పటికప్పుడు స్పందించడం వల్ల పరిస్థితి మరింత దిగజారిపోయే అవకాశాలు ఉంటాయని చాణక్యనీతి శాస్త్రం చెబుతోంది.. మీరు తీసుకునే తొందరపాటు నిర్ణయాల వల్ల మీకే నష్టం కలగవచ్చు.. కాబట్టి ఆ సమయంలో ఎంత ప్రశాంతంగా ఉంటే అంత మంచిదని.. ముఖ్యంగా మౌనంగా ఉండి పరిస్థితులను అంచనా వేయడం చాలా మంచిదని చాణక్యనీతి శాస్త్రం క్లియర్ గా చెబుతోంది.. మీ సీక్రెట్స్ ఎవరితో పంచుకోకూడదు.. కుటుంబంలో నమ్మకం చాలా ముఖ్యమైనదిగా భావించవచ్చు.. కానీ అందరితో అన్నీ పంచుకోవడం తెలివైన పని కాదని చాణక్యనీతి శాస్త్రం చెబుతోంది
.. మీ ఆర్థిక పరిస్థితులతో పాటు భవిష్యత్తు ప్రణాళికలు.. మీలోని బలహీనతలు ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరికి చెప్పకండి. మీ మాటలను వక్రీకరించి.. మీ రహస్యాలను మీకే ఆయుధంగా మలిచే ప్రమాదం కూడా ఉందని చాణక్యనీతి శాస్త్రం చెబుతోంది. కాబట్టి మీ వ్యక్తిగత విషయాల పట్ల ఎప్పుడు సీక్రెట్ మైంటైన్ చేయడం చాలా మంచిది..
ఎలాంటి ఆధారాలు లేకుండా ఇతరులను అస్సలు నిందించకూడదు.. అనుమానం వేరు.. వాస్తవం వేరు.. మీపై ఎవరో కుట్రలు చేస్తున్నారని అనుమానం వచ్చిన వెంటనే వారిపై నిందలు వేయడం అస్సలు మంచిది కాదు.. ముందుగా అసలు నిజం ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేయండి.. పక్క ఆధారాలు సేకరించిన తర్వాతే నిలదీయడం మంచిదని చాణక్యనీతి శాస్త్రం చెబుతోంది. సరైన ఆధారాలు లేకుండా బంధువులను, స్నేహితులను వేలెత్తి చూపుతే ఎన్నో రకాల గొడవలకు దారి తీసే అవకాశాలు ఉన్నాయని చాణక్యనీతి శాస్త్రం క్లియర్‌గా చెబుతోంది..
అనవసరంగా గొడవలకు దిగొద్దు.. ప్రతి సమస్యకు గొడవ పడడమే పరిష్కారం కాదు.. కుటుంబ సభ్యులతో ఎప్పుడు ఘర్షణ పడటం వల్ల ఇంట్లో ప్రశాంతత ఊహించని స్థాయిలో దెబ్బతిని అవకాశాలున్నాయి. కొన్నిసార్లు దీని ప్రభావం ఇంట్లో పిల్లలతో పాటు వృద్ధులపై తీవ్రంగా పడుతుందని చాణక్యనీతి శాస్త్రం చెబుతోంది.. కాబట్టి అసలైన సమయం కోసం వేచి చూడాల్సి ఉంటుంది.. సరైన సమయం వచ్చినప్పుడు మీ వాదనలను సున్నితంగా.. కానీ గట్టిగా కానీ వినిపించడం చాలా మంచిది. వివాదాలను ఎప్పటికప్పుడు శాంతి మార్గంలో పరిష్కరించుకోవడం చాలా మంచిదని చాణక్యనీతి శాస్త్రం క్లియర్ గా చెబుతోంది.
ఇది కూడ చదవండి: ఎంత సంపాదించినా డబ్బు మిగలడం లేదా? చాణక్య నీతిలోని ఈ 5 రహస్యాలు తెలుసుకోండి..
అవసరమైతే దూరంగా ఉండండి.. ఒక వ్యక్తి పదే పదే మీ నమ్మకాన్ని వమ్ము చేస్తే.. ఉద్దేశపూర్వకంగా మీకు హాని తల పెడితే.. వారిని భరించాల్సిన అవసరం లేదు.. వారితో శాశ్వత బంధం పెంచుకోవాల్సిన అవసరం ఎంతగానో ఉందని చాణక్యనీతి శాస్త్రం చెబుతోంది.. వారితో కేవలం అవసరమైతే మాట్లాడండి.. అన్నింటికంటే మీ మానసిక ప్రశాంతత తో పాటు సెక్యూరిటీ చాలా ముఖ్యం.. కాబట్టి ఎప్పుడు ప్రశాంతంగా ఉండేందుకు ప్రయత్నించడం చాలా మంచిది..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.